13.సాహిత్యం - చర్చ


సాహిత్యం - చర్చ
మహాభారతంలో లేనిదేదీ లేదని అంటారు.
ధర్మేచా ర్ధేచ కామేచ మోక్షేచ భరతర్షభ
యదితిహాస్తి తదన్యత్ర యాన్నేహాస్తి నతత్క్వచిత్.
తిక్కన గారుఈ శ్లోకాన్న్ని తెలుగులో చక్కని తేటగీతంగా చెప్పారు.
“అమల ధర్మార్థ కామ మోక్షముల గురిచి,
యొలయు తెరువెద్దియును నిందు గలుగునదియు,
యొండెడల గల్గు దీనలేకుండ చొప్పు,
దక్కొకంటను లేదు వేదజ్ఞులార,”ప్రాణంబులు విడిచియును కృ
పాణాదులు విడువకున్న భటులారయ స
ప్రాణులపోలెం బ్రథన
క్షోణికి దొడవగుచు నుంకి చూడుము కృష్ణా.
ఇదంతా నువ్వు దగ్గిర వుండి చేయించావని దెప్పుతూ,
అవయవములు రూపరగ గ్రవ్యాదభక్షి
తంబులై యుంకి కొన్ని శవంబు లువిద
లెంత సూచియు నవి కొందరెరుగజాల
రయ్యెదరు సూడు తమ బంధులగుట కృష్ణ,”
అని చెపుతుంది. ఆ తరువాత దుర్యోధనుని కళేబరము చూసిమూర్ఛిల్లుతుందిగాంధారి.
సేద తేరుకొనిదుర్యోధనుడుయుద్ధానికి పోబోయే ముందు తనదగ్గరికి వచ్చి జయసిద్ధికి దీవించమని అడిగితే, “…. ధర్మంబేతల ననూనమగు నిద్ధ మాతలకు నెట్లయిన సిద్ధమగు,” అన్నది గాంధారి. అంటేధర్మము ఎటు వుంటే అటే జయం అని చెప్పింది. గాంధారి మాటకు తిరుగు లేదు. నీకే జయమగు గాక అని వుంటే ఏమయ్యేదో తెలియదు. విపరీతమైన శోక బాధతోఆనాడు తను దుర్యోధనునితో చెప్పిన మాటలు తిరిగి కృష్ణుడికి చెప్పింది. కొడుకు చావుకన్న కోడలు పడే శోకబాధ ఎంత తీవ్రమైనదో చెప్పుతున్నదిఈ క్రింది పద్యంలో.
కొడుకు చావు కంటె కోడలి యడలున
పెరిగి శోకవహ్ని దరికొనంగ
అంతరంగ మిప్పుడగ్గల మెరియంగ
దొడగె దీనికేది తుది యుపేంద్ర.
అట్లాగే దుశ్శాసనుడి శవంఅభిమన్యుడి శవంకర్ణుడి కళేబరం చూసి విలపిస్తుంది.
” కాకులును గ్రద్దలును తిన్న గడుసు ద్రెస్సి
అపరపక్ష చతుర్దశి అమృతకరుని
కరణి నొప్పెడు కర్ణుని మొగంబుమీద
వనిత యందంద మోపెడు తన మొగంబు,”
అని కర్ణుని భార్య విలాపం కృష్ణుడికి చెపుతున్నది.ప్రారంభంలో అన్నానుస్త్రీపర్వంలో ఒకే శ్లోకాన్ని ఉదహరిస్తారని. ఇప్పుడు ఆ శ్లోకంఅదే భావం తిక్కన గారి తెలుగులోనూ చూద్దాం.
భూరిశ్రవుడనే రాజు చెయ్యి అర్జునుడు నరికివేశాడు. చెయ్యి తెగిపడివున్న వాడి తల విరుగగొట్టాడు సాత్యకి. ఆ భూరిశ్రవుడి భార్య యుద్ధానంతరం శ్మశానంలోభూరిశ్రవుడి శవందగ్గిర విలపిస్తూ అన్న మాటలు గాంధారి చెపుతున్నది.
ఈ శ్లోకాన్నిముమ్మటుడు తన కావ్య ప్రకాశ లోనుఆనందవర్ధనుడు ధ్వన్యాలోకంలోనుఒక రసం మరొక రసానికి అంగంగా ఎట్లా ఉపకరిస్తుందో చూపించడానికి ఉదాహరణగా చెప్తారు. ఇది చాలా ప్రసిద్ధికెక్కిన శ్లోకం.
అయం స రశనోత్కర్షీ పీనస్తన విమర్దనః
నాభ్యూరుజఘనస్పర్శీ నీవీవిస్రంసనః కరః.
భూరిశ్రవుడి భార్య అతని తెగిన చేతిని పట్టుకొని విలపిస్తూ అన్న మాటలు ఇవి.ఈ చెయ్యి నా వడ్డాణము లాగినదిఈ చెయ్యి నా చనుగవబొడ్డుమొలతొడలు మొదలైన దేహభాగాలని ముట్టుకున్నదిఅని భావం. స్త్రీ తన భర్తని గుర్తుకుతెచ్చుకొని విలపిస్తున్న సమయం.దీనిలో శృంగార రసం కరుణ రసం ఉన్నాయి.
ఈ శ్లోకాన్ని తిక్కన గారు చాలా వివరంగా అనువదించారుచూడండి.
మెలుపారగా బట్టి మొలనూలి మణులు గదల్చుచు దిగుచుచు దగులొనర్చు
చనుగవమీది కల్లన వచ్చి లలిత విమర్దనంబున లజ్జ మరల ద్రోచు
నాభి యూరులు జఘనము మెత్త మెత్తన యొత్తి ముదంబున నుల్ల మూంచు
ననయంబు తిన్నని యనువున గనయంబు ప్రిదులంగ మెలగి చొక్కదవ చేయునిక్కరంబు నెయ్యమెక్కింనేరంగ
దగిలి సంతతంబు తలచునట్టి
భంగిమెరయ కీడువరుపంగ గొనియాడ
వలతి నీరు సేయవలసె దీని.
ఇటువంటి చరిత్రగల గొప్ప చేతిని బూడిదపాలు చెయ్యవలసివచ్చిందే అని శోకంవిషాదం వెలిబుచ్చుతున్నది.ఈ విషాదం గాంధారికి దుర్భరమయ్యింది. ఆఖరుగా కృష్ణుడితో అంటున్న మాటలు చూడండి.
ధృతరాష్ట్ర పాండు భూపతుల కుమారులు తమలోన నీసున సమరమునకు
దొడగిన నీ వడ్డపడవైతి తగు చాలు మానుషుల్ కలిగియు మాననీయ
వాక్యుండవయ్యును శక్య సమస్త కార్యుండన పేర్కొనియును ఉపేక్ష
చేసితి కురు రాజు చెరుపన తిరిగితి నిఖిల రాజుల తదనీకములనునామ మడచి తెల్ల భూములు పాడయ్యె
నంతవట్టు ఫలము ననుభవింపు
మే పడంగ నిన్ను శాపానలజ్వాల
దగ్ధమూర్తి చేయుదాన వినుము.
నువ్వు ఈ యుద్ధాన్ని ఆపగల సమర్థుడివి. అయినా నీవు ఆ పని చెయ్యలేదు. అందుగ్గాను నేను నిన్ను శపిస్తున్నాను. కృష్ణుడినిఅతని యాదవ కులాన్నీదిక్కులేని చావు చస్తారని శపిస్తుందిగాంధారి.యుద్ధభూమియుద్ధానంతరం ఎలా ఉన్నదోవివరంగా చేసిన వర్ణనలుఅటు వ్యాసుడుఇటు తిక్కన గారుస్త్రీ నోటినుండి చెప్పించడం గుర్తించాలి. యుద్ధం తెచ్చే భీభత్సంతదుపరి వచ్చే శోకంబాధస్త్రీ హృదయానికి పట్టినట్లుపురుషులకు పట్టదు. అంటే పురుషులకు ఆ బాధ తెలియదని కాదు. ఆ భావాలు స్త్రీ వ్యక్త పరిచినట్లుగా పురుషుడు చెప్పలేడు. అర్థమయ్యే కొద్ది భాగాలూఆ భీభత్స వర్ణనలూకళ్ళకు కట్టినట్టు కనిపిస్తాయి. అచ్చంగా టీ.వీ చూసినట్టే నన్న మాట.
ఈనాడు ప్రతిఒక్కరూ స్త్రీపర్వం క్షుణ్ణంగా చదవడం అవసరమనిపిస్తోంది.
--------------------------------------
భర్తృహరి సుభాషితము-

 కేయూరాణి న భూషయంతి పురుషం హారా న చంద్రోజ్వ్జలా
 నస్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజాః
 వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే 
క్షీయంతే-ఖిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణమ్‌ 

 తాత్పర్యము: మగవానికి భుజకీర్తులు, సూర్య చంద్రహారాధి ఆభరణాలు గాని, స్నానము చందన ధార్మము, శిరోజాలంకారము వంటివేవీ అలంకారములు కాజాలవు. శాస్త్ర జ్ఞాన సంస్కారము కలిగినవాక్కు మాత్రమే అలంకారముగా శోభించును. సర్వ మణిమయ ఆభరణభూషణములన్ని నశించిపోతాయి. వాగ్భూషణ ఒక్కటి మాత్రమే నశించని అలంకార భూషణము. అనగా పురుషునికి సద్వాక్కు మాత్రమే అలంకారమని భావన.

 పద్మాకరం దినకరో వికచం కరోతి చంద్రో వికాసయతి కైరవచక్రవాలమ్
 నాభ్యర్ధితో జలధరోపి జలం దదాతి సంతస్స్వయం పరహితే విహితాభియోగాః

 తామరలచే సూర్యుడు యాచింపబడకయే వానిని వికసింపజేయుచున్నాడు. కలువలచే చంద్రుడు యాచింపబడకయే వానిని వికసింపజేయుచున్నాడు. జనులచే మేఘుడు యాచింపబడకయే జలము గురిపించుచున్నాడు. గావున సుజనులు పరులు యాచింపకయే వారలకు సహాయము చేయుదురు.

 వయ మిహ సరితుష్టా వల్కలై స్త్వం దుకూలై స్సమ ఇవ పరితోషో నిర్విశేషో విశేషః
 సతు భవతు దరిద్రో యస్య తృష్ణా విశాలా మనసి చ పరితుష్టే కోర్ధవాన్ కో దరిద్రః

 ద్రవ్యాశ గలవానికి దారిద్ర్యము గాని మన స్సం తు ష్టి గలవానికి ద్రవ్య మక్కరలేదు.

చీమలమర్రి బృందావనరావు 

  చం.  అడరు నవాంబు ధారలు జటాటవిలోబడి విభ్రమించె వె
        ల్వడి చనుదెంచి రాలుగొని పక్ష్మములన్ వెడనిల్చి మోవిపై
        బడి కుచఘట్టనం జెదరి పాఱి రయంబున ముత్తరంగలన్
        మడుఁగులు వారి నాభి కెడమానక చొచ్చె ననుక్రమంబుగన్
ఈ పద్యం నన్నెచోడ మహారాజు రచించిన కుమార సంభవము అనే కావ్యం లోది. కాళిదాసు కుమారసంభవం ద్వారా కథ బాగా ప్రసిద్ధమైనదే. కానీ కావ్యం మాత్రం కాళిదాసు కావ్యానికి అనువాదం కాదు. వ్యాసభారతానికి కవిత్రయం చేసిన అనువాదం లాంటిది కాదు. అసలు అనువాదమే కాదు. స్వతంత్రంగా రాసిన చక్కని ప్రబంధం ఈ నన్నెచోడుని కుమార సంభవం. ఈ పద్యాన్ని గురించి మాట్లాడుకొనే ముందు కవిని గూర్చి కొంచెం ప్రస్తావన అవసరం.
ఎందుకంటే, నన్నెచోడునికి తెలుగు సాహిత్యంలో ఒక ప్రత్యేక స్థానమున్నది. అసలు 1909 వరకూ తెలుగు సాహిత్యంలో నన్నెచోడుడనే కవి ఒకడున్నాడనే సంగతే ఎవరికీ తెలియదు. ఇతర కవులెవ్వరూ నన్నెచోడుని గురించి గానీ, అతని కుమార సంభవ కావ్యం గురించి గానీ, పూర్వ కవి ప్రశంసల్లో గానీ మరెక్కడా గానీ ఒక్క ముక్క కూడా రాయలేదు. 1909లో మానవల్లి రామకృష్ణ కవి తాను సంపాదించిన కుమార సంభవాన్ని ప్రకటించేసరికి ఆంధ్ర సాహిత్యలోకం ఒక్కసారిగా ఉలిక్కిపడింది, సంతోషించింది గూడా. ఉలికిపాటు ఎందుకంటే నన్నెచోడుని కాలం క్రీ.శ. 940 అని మానవల్లి కవి చెప్పడం వల్ల. అంటే, మనం ఆదికవి అనుకుంటున్న నన్నయ భట్టు కన్నా రెండు వందలేండ్లు ముందువాడు అవుతాడన్నమాట. ఈ వాదం వల్ల నన్నయగారి ఆదికవి పీఠం కొంచెం కదిలింది. దీని మీద చర్చలూ, ఉపచర్చలూ, వాదోపవాదాలూ బాగానే జరిగాయి.
అయితే, నన్నెచోడుడు కూడా తనకు పూర్వపు తెలుగు కవుల నెవర్నీ పేర్కొనలేదు. చాలా వాదాల తర్వాత, శాసనాలు కొన్నింటి ఆధారంగా నన్నెచోడుడు నన్నయకు వంద సంవత్సరాల తర్వాతి వాడని నిశ్చయం చేశారు. ఇది ఎక్కువ మంది పండితుల ఆమోదం పొందింది గానీ వివాదం మటుకు పూర్తిగా సమసిపోలేదు. వచ్చిన చిక్కల్లా ఎక్కడంటే పరిశోధకులు గానీ, విమర్శకులు గానీ, వారి వారి ప్రొత్సాహకులూ అనుమోదకులూ వ్యతిరేకులతో సహా, కులాభిమాన దురభిమానాలకు అతీతులేమీ కాకపోవడం. ఇందువల్ల సాహిత్యేతర కారణాలు చర్చల్లోనూ, నిర్ణయాల్లోనూ ముఖ్యపాత్ర వహించడం జరుగుతున్నది. పోనిండి, కవి గారి కాలచర్చ చరిత్ర పరిశోధకులకే వదిలిపెడదాం. నా ఉద్దేశం ఈ వివాదాన్ని మీకు పరిచయం చేయడమే. మనం ఇక కేవలం పద్యం సంగతి చూసుకుందాం. నన్నెచోడుడు ఆదికవి అయినా కాకపోయినా తెలుగు కవిత్వాన్ని మార్గ కవిత, దేశి కవిత అని వింగడించిందీ, కవిత్వ స్వభావంలో వస్తు కవిత అనేదాన్ని మొదట పేర్కొన్నదీ ఆయనే. నన్నెచోడుడు చాలా గొప్ప కవి.
కుమార సంభవం కథ మనకు పరిచితమే. గిరిరాజ తనయ శివుణ్ణి ప్రేమించడమూ, ఆయన కోసం తపస్సు చేయడమూ, ఆ క్రమంలో మన్మథ దహనమూ, తరువాత శివ పార్వతులకు కళ్యాణం జరగడమూ, కుమారుడు (కుమార స్వామి) సంభవించడమూ,, కుమార సంభవానంతరం తారకాసుర సంహారమూ, ఇలా సాగిపోయే కథ ఇది.
శివుణ్ణి భర్తగా పొందగోరి పార్వతి హిమాచల శృంగాల మీద తపస్సు చేస్తున్నది. గౌరి పరమ సుకుమారి. గొప్ప సౌందర్యవతి. వయస్సులో వున్న కన్యక. మిక్కిలి నిష్ఠతో, శివారాధన తాత్పర్యంతో, నితాంత తపోవృత్తిలో నున్నది. ఆమె అవయవాల అందాలన్నీ వేరే వేరే చోట్ల ఇల్లడ పెట్టి వచ్చిందట. ‘అలకల పొల్పు తేటిగములందు, మదాలస యాన లీల హంసల కడ, వక్త్రభాతి జలజంబులపై…’ - ఇలా అన్నమాట. తపోచర్య వల్ల రోజుక్కొంచెం రోజుక్కొంచెం శుష్కిస్తున్న ఆమె శరీరం ఎలా ఉన్నదంటే ‘అర్ధనారిగా తన దేహము అభవుమేన నల్పమల్పము నంటించునట్ల వోలె వుందట. ఎంత చక్కటి ఊహ. ఇలా తపస్సు చేస్తూ వుండగా వర్షాకాలం వచ్చి తొలకరి వానలు కురవడం మొదలైన సందర్భం లోనిది పై పద్యం.
చక్కనమ్మ చిక్కినా అందమే గదా. ఆమె నిటారుగా కూర్చుని తపశ్చర్యలో వున్నది. వాన చినుకులు ముందు ఆమె తలపై పడ్డాయి. అక్కణ్ణుంచి జారి ఆమె కనురెప్పల పైకి వచ్చాయి. కనురెప్పల వెండ్రుకల మీద కొంచెం ఆగి, ఆమె మెత్తటి ఎర్రటి మోవి మీద పడి అక్కడ కాసేపు మజిలీ చేశాయి. అక్కణ్ణించి ఆమె ఉరోజాల మీద పడి ధారలై ప్రవాహ వేగం సంతరించుకున్నాయి. మూడు కాల్వలుగా పాయలు కట్టి ఆమె నాభీ దేశం వద్ద మడుగులు కట్టినై. ఇదీ, ఆ వానజడి అంచెలంచెలుగా చేసిన ప్రయాణపు అనుక్రమం.
అవి నవాంబు ధారలు, అంటే తొలకరి వానలు. మొదట ఆమె తల మీది కచపంక్తిపై పడ్డాయి. జటాటవిలో, అంటే తల వెండ్రుకల నుంచి ‘విభ్రమించి వెల్వడి చనుదెంచి పక్ష్మములన్ వెడనిల్చి’నాయి. పక్ష్మములు అంటే కనురెప్పల మీది వెంట్రుకలు. ఆ వాన చినుకులు కనురెప్పల మీద కొంతసేపు నిలిచి, ఆపైన ఆమె పెదాల మీదకి జారి పడ్డాయి. ఆమె అధరాల మీద నుంచి ‘కుచఘట్టనన్ చెదరి పాఱి’నవి. కనురెప్పలూ,మోవీ సున్నితాలు. వక్షాలు అలా కాదు కాబట్టి ‘ఘట్టనం జెదరి’ అంటే తాకిడికి ఆ చినుకులు చెదరి, చెదరిన రయంబున పారినవి. అక్కడ ఆ ప్రవాహం ‘ముత్తరంగలై’, మూడు ధారలైనవి. ఒక్కో కుచం మీద నుంచి ఒక్కో ధార కారితే రెండు ప్రవాహాలు కావాలి. లేదూ, రయఘట్టనం వలన అటూ ఇటూ చెదరితే నాలుగు ధారలు కావాలి. కానీ, మధ్యలోని రెండు ధారలు కలిసి ఒకే ధారగా మారి ముత్తరంగలైనాయి. ఈ మూడు ప్రవాహాలూ మడుగులు వారి, ఎడము ఆనక, అనుక్రమంబుగా నాభికి చొచ్చినవట. అందుకు నాభి వద్ద పెద్ద మడుగు అయింది. మన కవుల కవిసమయాల్లో నాభి లోతుగా ఉండటం అనేది స్త్రీ సౌందర్య సూచన. పెద్దన గారి వరూధిని ‘నతనాభి’.
ఇక్కడ ఒక చిన్న విషయం. స్త్రీ అంగాంగాలూ కొలతలూ వర్ణించడమనే చాపల్యం నుంచి ఏ కవీ తప్పించుకోలేక పోయినాడు. దౌర్భాగ్యం. అయితే అలాంటి వర్ణన స్త్రీ కైనా పురుషుడికైనా ప్రతీసారి తప్పే అనలేం కూడానూ. శృంగారాత్మక సన్నివేశంలో అటువంటి వర్ణన సమంజసమే కావచ్చును, కాని చోట అశ్లీలాత్మకంగా స్ఫురించవచ్చు. ఒక కావ్యాన్ని చదివేటప్పుడు వర్ణనౌచిత్యాన్ని గమనించుకోవాలి కవి, పాఠకులు కూడా. సరే, ఈ వర్ణనల ఉచితానుచితాల చర్చను కాసేపు అలా పక్కన ఉంచితే -
తొలకరి చినుకుల ప్రయాణాన్ని ఎంత సౌందర్యాత్మకంగా రూపు కట్టించాడో చూడండి, కవి ఈ పద్యంలో. తల మీద నుంచి కనురెప్పల పైకి, మోవి పైకి జారి ఆపై ఉరోజముల మీదకు దూకి ధారలై నాభి దాకా పారి - ఇలా జలధారలతో విన్యాసం చేయించాడు. ఒక సామాన్య దృశ్యానికి కళాకృతి కల్పించాడు. వాన చినుకుల్లానే పద్యం లోని పదాలు కూడా విభ్రమించి వెల్వడి వెడనిల్చి పడి చెదరి పారుతున్నట్టు పద్యధార కూడా ఆ చినుకుల ధార లాగా ఆగుతూ విరుగుతూ నడిచింది. మిక్కిలి ప్రౌఢకావ్యం నన్నెచోడుని కుమార సంభవం. కేవలం పద్యాలు రాయడం కాకుండా, పదాలు ఏవి ఎప్పుడు ఎందుకో వాడాలో తెలిసిన కవి రచించిన కావ్యం. ఈ కావ్యంలో ఇలాగే మరిచిపోలేని పద్యాలు చాలా ఉన్నాయి.

అన్నమయ 

తిరుమలయ్య విందు మంచిదే వుండంటే వుంటినమ్మ  
సరవిలేని చెంచువారి సంతయేలె తనకును
పరికిదండ పొగడదండ బండిగురిగింజ దండ
బెరకులేని పికిలిదండ బలిదండలన్నియు
మెరసి కానుకియ్యబోతె మేనిదండలడిగెనమ్మ
మరల చెంచువారితోడి మాటలేలె తనకును
ముసురుతేనె జుంటితేనె ముదిరినట్టి పెరలతేనె
పొసగ మించు పూవుతేనె పుట్టతేనె లన్నియు
వొసగి కానుకియ్యబోతె మోవితేనె లడిగె నమ్మ
యెసగ చెంచువారి యెంగి లేటికమ్మ తనకును
వెలగపండు జీడిపండు వెలలేని మోవిపండు
పలుకుదొండపండు పాలపండు కానుకిచ్చితే
చెలగి పక్కపండు మంట శ్రీవేంకటనాయకుడు
యెలమి కూడెనమ్మ చెంచు లేటికమ్మ తనకును

ముద్దు గారీ జూడరమ్మ మోహన మురారి వీడె
మద్దులు విరిచిన మా మాధవుడు

చల్ల లమ్మ నేరిచినజాణ గొల్లెతల కెల్ల
వల్లెతాడు మా చిన్న వాసుదేవుడు
మొల్లపు గోపికల మోవిపండులకు నెల్ల
కొల్లకాడు గదమ్మ మా గోల గోవిందుడు


మందడిసానుల కమ్మని మోముదమ్ములకు
చెందినతుమ్మిదవో మా శ్రీకృష్ణుడు 
చంద మైన దొడ్డీవారి సతులవయసులకు
విందువంటివా డమ్మ మా విఠ్ఠలుడు


హత్తిన రేపల్లెలోని అంగనామణుల కెల్ల
పొత్తుల సూత్రము మా బుద్ధుల హరి
మత్తిలి వ్రేతెల నిండుమనసుల కెల్లాను
చిత్తజునివంటి వాడు శ్రీ వేంకటేశుడు

కవి చౌడప్ప శతకము (1580-1640)

కం. నా నీతి వినని వానిని - భానుని కిరణములు మీద పారని వానిన్
వానను తడియని వానిని - కానను రా కుందవరపు కవి చౌడప్పా !
కం. ముందుగ చను దినములలో - కందమునకు సోమయాజి ఘను డందురు; నే
డందరు నను ఘనుడందురు - కందమునకు కుందవరపు కవి చౌడప్పా !
కం. విను భారవి భట్టును నా - చన సోముని మాఘ కవిని చతురత శ్రీ నా
ధు నుతింతును కవితకు తి - క్కన తలతున్ కుందవరపు కవి చౌడప్పా !
కం. పెద్దన వలె క్రుతి చెప్పిన - పె ద్దనవలె, అల్ప కవిని పె ద్దనవలెనా ?
ఎ ద్దనవలె, మొ ద్దనవలె - గ్ర ద్దనవలె కుందవరపు కవి చౌడప్పా !

వేమన పద్యాలు (1650)

 • ఉప్పుగప్పురంబు న్రొక్కపోలికనుండు,చూడచూడ రుచుల జాడవేరు,పురుషులందు పుణ్య పురుషులువేరయ,
 • కరకు కాయల దిని కాషాయ వస్త్రముల్,బోడినెత్తి గలిగి బొరయుచుండ్రు,తలలు బోడులైన తలపులు బోడులా
 • కుండ కుంభమన్న కొండ పర్వతమన్న నుప్పు లవణమన్న నొకటి కాదె భాష లిట్టె వేరు పరతత్వమొకటె
 • చంపదగిన యట్టి శత్రువు తనచేత చిక్కెనేని కీడు సేయరాదు పొసగ మేలు చేసి పొమ్మనుటే చావు
 • చిత్తశుద్ధి గలిగి చేసిన పుణ్యంబు- కొంచమైన నదియు కొదువ గాదు- విత్తనంబు మర్రి వృక్షంబునకు నెంత?
 • పట్ట నేర్చు పాము పడగ యోరగజేయు చెరుప జూచు వాడు చెలిమి జేసు చంపదలచు రాజు చనువిచ్చుచుండురా విశ్వధాభిరామ వినుర వేమ !

శతకములు ,శతక కర్తలు


Preview
పద్యం:
ఆత్మశుద్ది లేని యాచారమదియేల?
భాండశుద్ది లేని పాకమేల?
చిత్తశుద్ది లేని శివపూజలేలరా?
విశ్వదాభిరామ వినురవేమ.

తాత్పర్యం:
మనసు నిర్మలతో లేనపుడు ఏపని చేసిన అది వ్యర్ధమే అగును.అపరిశుభ్రముగా వున్న పాత్రలో వంట చేసినచో అది శరీరమునకు మంచిదికాదుగదా.అదేవిధముగా నిశ్చలమైన మనస్సుతో చేయని భగవంతుని పూజలు కూడా ఎలాంటి ఫలితాలనివ్వవు.

కుండ కుంభ మన్న కొండ పర్వతమన్న
నుప్పు లవణ మన్న నొకటికాదె
భాష లిట్టె వేరు పరతత్వమొక్కటే
విశ్వదాభిరామ వినురవేమ
------------------------------------------
Preview
నడువకుమీ తెరువొక్కటఁ
గుడువకుమీ శతృనింటఁ గూరిమితోడన్‌
ముడువకుమీ పరధనముల
నుడువకుమీ యెరులమనసు నొవ్వగ సుమతీ!

తాత్పర్యం:తోడులేకుండా వంటరిగా పోవద్దు. విరోధి ఇంట్లో భుజింపవద్దు. ఇతరుల ధనం దగ్గర ఉంచుకోవద్దు. ఇతరుల మనస్సు బాధపడేట్లు మాట్లాడవద్దు.

మీకు తెలుసా

14 వ శతాబ్దిలోనే శ్రీనాథుడు 20 -30 పార్శీ పదాలు వాడాడు.ఖుసి -ఖుషీ,దుకాణం,బజార్ ,తలవారి ,
పోర్చుగీసు - ఇస్త్రీ
ఉర్దూ ,అరబ్బీ - అల్మారీ ,బొత్త్తాం
రాసినట్లే ఉచ్చరించడం ఉచ్చరించినట్లే రాయడం తెలుగుకు ఉన్న ప్రధాన లక్షణం ఏ భాషకు ఈ సౌలభ్యం లేదు .

కొంగర జగ్గయ్య


తెలుగులోకి డబ్బింగు చేసిన జురాసిక్ పార్క్ అనే ఆంగ్ల చిత్రంలో రిచర్డ్ అట్టెంబరో పాత్రకు తన గాత్రాన్ని అరువు ఇచ్చాడు.

అల్లూరి సీతారామరాజు లో పోషించిన రూథర్ ఫర్డ్ పాత్ర: ఇది ఆయన జీవితంలో మరపురాని పాత్ర. ఆ సినిమా తీసే నాటికి రూథర్ ఫర్డ్ చరిత్ర మరచిపోయిన వ్యక్తి కాదు. ఆయన ఎలా ఉంటాడో, ఎలా ప్రవర్తించేవాడో తెలిసిన వాళ్ళు అప్పటికి ఉన్నారు. ఆయన 1940 వరకు ప్రభుత్వ సర్వీసులో ఉన్నాడు. కృష్ణా జిల్లా, గుంటూరు, కడప తదితర ప్రాంతాల్లో పనిచేశాడు. అప్పటి ఐ.సి.ఎస్. అధికార్లలో చాలా మందికి ఆయన బాగా తెలుసు. వాళ్ళను వాకబు చేసి జగ్గయ్య రూథర్ ఫర్డ్ ప్రవర్తన గురించి, మనస్తత్వం గురించి తెలుసుకున్నాడు. అప్పుడు ఆయనకు రూథర్ ఫర్డ్ చాలా మంచి వ్యక్తి అని, ఆయనకు సీతారామరాజు అంటే గౌరవం ఉండేదని తెలిసింది. అయితే రూథర్ ఫర్డ్ బ్రిటిష్ ప్రభుత్వానికి విధేయుడు. ఆయన వైపు నుంచి చూస్తే బ్రిటిష్ ప్రభుత్వ సేవకుడిగా ఆయన సీతారామరాజును పట్టుకుని తీరాలి. ఇది తెలిశాక జగ్గయ్య చిత్ర రచయిత మహారథినికలిసి ఆ పాత్రను రొటీన్ విలన్ లా కాకుండా విధి నిర్వహణకు బద్ధుడై ఉండే హుందా అయిన వ్యక్తిలా మార్చి వ్రాయాలని కోరాడు. అలా ఆ పాత్ర చిత్రణ మార్చడంతో ఆ పాత్ర నిలబడడంతో బాటు సీతారామరాజు పాత్ర మరింతగా ఎలివేట్ అయింది. ఆ సినిమా చూశాక పి.వి.నరసింహారావు జగ్గయ్యకు ఫోన్ చేసి "మీ పాత్ర పోషణ అద్భుతం." అని ప్రశంసించారట.

Tips in basic English grammar

 • kinds of verbs-week verbs,strong verbs,finite verb ,infinitive,transitive,intransitive,special verbs(auxiliary verbs ,helping verbs,anomalous verbs) ,
 • form of vrbs=ist,iind,iiird= (1.adding ing to the present verb) ,(2.past verb) ,(3.past participle)
 • past participle is used at 1.present perfect 2.past perfect 3.future perfect 4.present perfect cont 5.past perfect cont 6.future perfect cont and passive voice
 • be forms be,was,are,were,been
 • tens are basically two 1.present tense,2 past tense
 • does (do) is used when subject is in singular third person
 • am is used when subject is in singular ist person

5.SONGS

MOVIE LIST (UPTO 1960)

ALPHABETIC ORDER List 1-9 | A |B | C | D | E | F | G | H | I | J | K | L |M | N | O | P | Q | R | S | T | U | V | W | X | Y | Z
YEAR - WISE List 1932 | 1933 |1934 | 1935 | 1936 | 1937 | 1938 |1939 | 1940 | 1941 | 1942 | 1943 |1944 | 1945 | 1946 | 1947 | 1948 |1949 | 1950 | 1951 | 1952 | 1953 |1954 | 1955 | 1956 | 1957 | 1958 |1959 | 1960 | 1961 | 1962 | 1963 | 1964 | 1965 | 1966 | 1967 | 1968 | 1969 | 1970 | 1971 | 1972 | 1973 | 1974 | 1975 | 1976 | 1977 | 1978 | 1979 | 1980 | 1981 | 1982 | 1983| 1984| 1985| 1986| 1987| 1988| 1989| 1990| 1991| 1992| 1993| 1994| 1995| 1996| 1997| 1998| 1999| 2000| 2001| 2002| 2003| 2004| 2005| 2006 | 2007 | 2008 | 2009 | 2010 | 2011

6.సామెతలు (proverbs)

6.సామెతలు (proverbs)


 • A bird in the hand is worth two in the bush
 • A friend in need is a friend indeed.
 • A stitch in time saves nine.
 • Absence makes the heart grow fonder.
 • As you sow, so you shall reap.
 • Beauty is only skin deep.
 • Better late than never.
 • better safe than sorry
 • Don't count your chickens before they're hatched.
 • Don't cry over spilt milk.
 • Don't judge a book by its cover.
 • Don't throw the baby out with the bath water.
 • Early to bed and early to rise makes a man healthy,
 • wealthy and wise.
 • Every cloud has a silver lining.
 • God helps those who help themselves.
 • Half a loaf is better than no bread.
 • He who laughs last laughs longest.
 • Make hay while the sun shines
 • Necessity is the mother of invention.
 • Never put off till tomorrow what you can do today.
 • One man's meat is another man's poison.
 • Out of sight, out of mind.
 • Rome wasn't built in a day.
 • The best way to a man's heart is through his stomach.
 • The end justifies the means.
 • The grass is always greener on the other side of the fence.
 • Too many cooks spoil the broth.
 • Two heads are better than one.
 • Waste not, want not.
 • When in Rome, do as the Romans do.
 • You can lead a horse to water, but you cannot make
 • him drink.
 • You can't make a silk purse out of a sow's ear.
 • Let sleeping dogs lie.
 • Hunger is the best sauce.
 • Measure twice cut once:Cocider your options carefully in order to make a good decision
 • Give him an inch and he'll want a yard:
 • The darkest hour is that before dawn
 • some people always take advantage of favor that is shown them
 • Even when things seem at their very worst, they may shortly improve
 • There only only twenty-four hours in a day :Time is a limited resource, so use it wisely
 • Any time means no time : When an event is not decided on or planned earlier it will never take place
 • Better late than never - To do something that is right, profitable, or good a little late is still better than not doing it at all
 • You can lead a horse to water but you can't make him drink
 • We can help, show or encourage someone to do something but we can't make him do what he is unwilling or unable to do "A bird in hand is worth two in the bush "
 • Something that one already has is better than going after something seemingly more worthwhile that one may not be able to get

CONCEPT
( development of human relations and human resources )

7..Gas

11.quataions

నేర్చుకోవడం ఆపితే ఆ రోజుతో మనిషి ఎదుగుదల ఆగిపోతుంది .నేర్చుకోవడం ఆపేసినరోజున మనిషి చనిపోయినట్టే.- అక్కినేని నాగేశ్వర రావు గారు 1.KARL MARX 2.SIGMAUND FRAUD 3.SOCRATES