8.వ్యాసావళిరంగనాయకమ్మ
సౌజన్యంతో
CONCEPT ( development of human relations and human resources )
సమస్య వెంటే పరిష్కారం! - రంగనాయకమ్మ
రంగనాయకమ్మ
సమాజంలో ఉన్న ప్రతీ మనిషీ శ్రమ చెయ్యాలని గ్రహించడమూ; ప్రతి మనిషీ శారీరక - మేధా శ్రమలు రెండూ చెయ్యాలని గ్రహించడమూ, మొదటి సంగతి. ఆ మార్పుల కోసం, శ్రామిక వర్గ పోరాటం అత్యవసరమని గ్రహించడం, మరో సంగతి. ఏ గ్రహింపూ లేకుండా, ‘కుల విధానాన్ని  తక్షణం నిర్మూలించాలి’ అంటూ అరిచే నినాదాలు ఆ నిర్మూలనకు ఏ మాత్రమూ పనికి రావు. పైగా ఆ శబ్దాలు, సిద్ధాంత శబ్ద కాలుష్యాన్ని మాత్రమే దట్టంగా సృష్టిస్తాయి.
‘కులాల విధానం’ అనే సమస్యకి పరిష్కారం, కులాంతర వివాహాలే. కుల విధానాన్ని అంగీకరించని వారందరూ గ్రహించవలసింది ఇదే. సమస్య ఉంటే, దాని వెంటే పరిష్కారం ఉంటుంది. సమస్య వల్ల బాధపడే వాళ్ళకి పరిష్కారం తెలియలేదంటే సమస్యే తెలియలేదని అర్థం.
కుల విధానం పుట్టుక గురించి మాట్లాడే వారు కొందరు, ‘చాతుర్వర్ణాలు’ అనే పేరుతో ‘బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర’ అంటూ మొదలు పెడతారు. అలా మొదలు పెట్టి, ఆ నాలుగు వర్ణాలూ, ఏ శ్రమల తోటీ, ఏ వృత్తుల తోటీ సంబంధాలు లేకుండా పుట్టుకొచ్చినట్టు చెప్పుకొస్తారు. ప్రతీ వర్ణమూ అనేక విభాగాలుగా వేరు వేరు వృత్తుల్లో నిమగ్నమై ఉండడమూ; ‘శూద్రులు’ అనే వర్ణం, అనేకానేక శారీరక శ్రమలు చేసే వృత్తులు గానూ, ప్రతీ వృత్తీ ఒక కులం గానూ ఏర్పరడమూ; ఇవన్నీ సమాజంలో స్పష్టంగా కనపడుతూ ఉన్నవే.
బట్టలు ఉతికే వృత్తి ఒక కులం. క్షవరాలు చేసే వృత్తి ఇంకో కులం. చేపలు పట్టే వృత్తి మరో కులం. నేతా, కుట్టూ, వేరు వేరు కులాలే. వృత్తులు మారినా, కలిసినా, కులాలు నిలబడే ఉండడం సంప్రదాయంగా సాగుతోంది. ఒక వృత్తినీ, దాని కులం పేరునీ చూస్తే, వృత్తి మొదటిదో, కులం మొదటిదో, తేలికగానే గ్రహించవచ్చు. శ్రమలే లేని కాలంలో వృత్తులు ఉండవు. వృత్తులే లేని కాలంలో, దానికి కులం పేరు ఏర్పడదు. ఒక కులం గల కుటుంబంలో ఒక పెళ్ళి జరగాలంటే, అదే కులం గల, అంటే అదే వృత్తి గల వ్యక్తే, ఆ కుటుంబంలోకి రావడం జరుగుతోంది. వివాహ సంబంధాలు ఏ కులానికి ఆ కులంలోనే ఏర్పడాలి - అనే సంప్రదాయానికి మూల కారణం, ‘ఒకే రకం వృత్తి’ అనేదే. అంటే, వృత్తిని బట్టే కులం. కులాన్ని బట్టే వివాహ సంప్రదాయం. అంటే, కులాలు పోవాలంటే, వృత్తుల విధానంలో పెద్ద మార్పు జరగాలని అర్థం.
‘కులాలు’ అన్నప్పుడు, అవి కేవలం వేరు వేరు భిన్న వృత్తులు మాత్రమే కాదు; ఆ వృత్తులకూ, వాటిని బట్టి ఆ కులాలకూ, చిన్నా - పెద్దా గుర్తింపులు కూడా ఏర్పడ్డాయి. అయితే, ‘వృత్తులు అన్ని దేశాల్లోనూ ఉన్నాయి. ఈ కుల విధానం ఈ దేశంలోనే ఎందుకు ఉంది?’ అనే ప్రశ్న తలెత్తుతుంది. ప్రశ్నలు ఎప్పుడూ మంచివి. కారణాల్ని గ్రహించాలనే ప్రయత్నాలు అవి. ఇతర దేశాల్లో ఉన్న వేరు వేరు చెత్త సంప్రదాయాలు ఈ దేశంలో లేవు. ఒక దేశంలో ఉన ్న మంచిగానీ చెడ్డగానీ, అదే రకంగా ప్రతీ చోటా ఉండడం లేదు. ఇక్కడి చెడ్డని మించిన చెడ్డ, అక్కడ ఉండవచ్చు. అక్కడి మంచిని మించిన మంచి, ఇక్కడ ఉండవచ్చు. ‘ఇక్కడ ఉన్నది అక్కడ లే దేం?’ ప్రశ్నకి జవాబు, ‘‘అక్కడ ఉన్నది ఇక్కడ లేదేం?’’ అనేదే.    మన దగ్గిర ఉన్నది చెడ్డే అని తెలిస్తే, దాన్ని మనం మార్చుకోవాలి ‘కుల విధానం’ పోవలిసిందే. కానీ ఎలాగ? పరిష్కారం కావాలంటే, సమస్యని సరిగా అర్థం చేసుకోవాలి.
ఇద్దరు వేరు వేరు కులాల వాళ్ళు స్నేహంగా ఉన్నా, ఆ కులాలు పోయినట్టు కాదు. ఆ ఇద్దరూ రోజూ కలిసి భోజనాలు చేస్తూ ఉన్నా, ఆ కులాలు పోయినట్టు కాదు. కాలేజీల్లో, స్నేహాలూ, హోటళ్ళలో పక్కపక్కనే కూర్చుని భోజనాలూ, ఇవన్నీ సాగుతూనే ఉన్నాయి. అయినా కులాలు కులాల్లాగే ఉంటున్నాయి.
ఇద్దరు చిన్నా పెద్దా కులాల స్ర్తీ పురుషులు, రహస్య సంబంధాలతో ఉంటే, కులాలు పోయినట్లు కాదు. ఆ సీ్త్ర పురుషులు బహిరంగంగా, పెళ్ళి తంతు ఉన్నా లేకపోయినా, భార్యాభర్తలుగా, కుటుంబ సంబంధాలతోనే, పిల్లలకు తల్లిదండ్రులు గానే, కలిసి జీవిస్తూ ఉంటే, అటువంటి సంబంధంలో బైల్దేరే పిల్లలకు ఏ కులాలూ లెక్కలోకి రావు. కానీ, రిజర్వేషన్‌ పద్ధతి సాగుతూనే ఉంటే, తండ్రి కులమో, తల్లి కులమో, ఏది చిన్న కులమైతే అది, ఆ పిల్లలకు కూడా చుట్టుకుంటుంది. తల్లి దండ్రులు కులాంతర వివాహం చేసుకున్నా, రిజర్వేషన్ల ద్వారా, పిల్లల తరానికి కూడా చిన్న కులాలు నిలిచిపోతాయి!
కులాంతర వివాహాలు, నూటికొకటో కోటి కొకటో జరగడం గాక, నిరభ్యంతరంగా జరిగే మార్గం ఏది? ఆ మార్గం ఏమిటో తెలుసుకోవాలంటే, కనీసం 100 కులాంతర వివాహాల్ని పరిశీలించి చూడాలి. ఈ పరిశీలనలో, రెడ్డి యువతికి మాల యువకుడితో పెళ్ళీ; బ్రాహ్మణ యువతికి, మాదిగ యువకుడితో పెళ్ళీ; వైశ్య యువకుడికి, మంగలి యువతితో పెళ్ళీ; ఇలా ఆ 100 పెళ్ళిళ్ళూ చిన్నా పెద్దా కులాల మధ్య జరగడం కనపడతాయి. అందులో కారణాల కోసం వెతికితే, చిన్న కులాల వ్యక్తులకు, వారి కుల వృత్తులు మారిపోవడమే కనపడుతుంది. ఒక బ్రాహ్మణ యువతికీ, ఒక టీచరుగా ఉన ్న మంగలి యువకుడికీ పెళ్ళి జరిగిందంటే, ఆ చిన్న కులం యువకుడికి విద్యా స్థాయి పెరిగి, తన కుల వృత్తి వదిలి, పై స్థాయి ఉద్యోగిగా మారడమే, పెద్ద కులం యువతితో పరిచయం, చివరికి పెళ్ళికి అంగీకారం!
చిన్న కులాల వ్యక్తులు, తమ కుల వృత్తుల్ని వదిలి వేస్తే, అప్పుడు సమాజానికి ఆ వృత్తులతో అవసరం ఎలా తీరుతుంది? ఈ నాడైతే, చిన్న కులాల్లో ఇంకా కుల వృత్తుల్ని వదలని వాళ్ళ ద్వారానే, సమాజ అవసరాలు తీరుతున్నాయి. కానీ, ఒక క్షవరాల కులంలో అందరూ కుల వృత్తిని వదిలేస్తే, అప్పుడేమవుతుంది? - సమాజానికి అవసరమైన ప్రతీ శ్రమనీ నిలబెట్టుకునే కొత్త విధానాన్ని మార్క్సిజం చెపుతుంది. చిన్నా - పెద్దా వృత్తులుగా సాగుతూ ఉన్న శ్రమ విభజనని, ‘సమానత్వ శ్రమ విభజన’గా మార్చాలనేదే ఆ కొత్త విధానం. కొత్త విధానమే లేకపోతే, అట్టడుగు శ్రమలు చేసే కులాలకు విముక్తి ఎలాగ?
ఈనాడు, చిన్న కులాల కుటుంబాల్లో మార్పులు, రిజర్వేషన్ల ద్వారా జరగడం నిజమే. కానీ ఆ మార్పు, ఆ కులాల జనాభాలో అత్యల్ప సంఖ్యకి మాత్రమే దొరుకుతుంది. రిజర్వేషన్లలోనే క్రీమీ లేయర్‌ పద్ధతిని ప్రవేశపెడితే, ఆ రకమైన మేలు కూడా ఎక్కువ జనాభాకి అందదు. భారత దేశంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ పేర్లతో ఉన్న మొత్తం జనాభాని చూస్తే, ఆ సంఖ్యలో మెజారిటీకి రిజర్వేషన్ల ద్వారా జరిగే మేలేమీ ఉండదు. పెద్ద కులాల పేదల్లో జరిగినట్టే చిన్న కులాల్లో కూడా, పరిశ్రమల్లో ఉద్యోగాలూ జీతాలూ సంపాదిస్తూ ఎదగడం అంటే, భూస్వాముల కిందా పెట్టుబడిదారుల కిందా వేతన బానిసలుగా బతకడమే. అదే ఆ ఎదుగుదలకి అర్థం! ఈనాడు కూడా, అనేక పరిశ్రమల్లో పని పనిచేసే ఇంజనీర్ల వంటి ఉద్యోగులకు కూడా, రోజుకి 16 గంటల పని, తప్పనిసరి నియమం!
ఒక చిన్న కులస్తుడు, పెట్టుబడిదారుడిగా ఎదిగి, లేదా రిజర్వేషన్ల మార్గం ద్వారా ప్రభుత్వంలో మంత్రిగా మారి, స్వంత భవనాలతో, స్వంత పెట్టుబడులతో ఎదిగిపోయినప్పుడు, తన పిల్లల వివాహాల కోసం, తన కులంలోనే పేదల వేపు చూడడు. పెద్ద కులాల్లో పేదల వేపు కూడా చూడడు. తనతో సమాన ఆర్థిక స్థాయి గల సంబంధాల కోసమే చూస్తాడు. పెద్ద కులాల వాళ్ళయినా చేసేది అక్షరాలా అదే. అంటే, యజమాని వర్గంగా ఎదిగిన ఆ చిన్నా - పెద్దా కులాల వాళ్ళకి, కులాల దృష్టి పోయి, యజమానుల వర్గ దృష్టే ప్రధాన దృష్టి అవుతుంది.
రాబోయే కాలం అంతా ప్రైవేటు పరిశ్రమల కాలమే. శ్రామికులు ఏ కులాల వారైనా, వారి డిగ్రీల గురించీ, జీతాల గురించీ, నిర్ణయాలన్నీ పారిశ్రామికవేత్తల ఇష్టాయిష్టాలే. అప్పుడు చిన్న కులాల్లో అల్పసంఖ్యని కూడా రిజర్వేషన్లు రక్షించలేవు. నిత్యం బానిస బతుకులూ, నిరుద్యోగాలూ, అడుగు స్థాయి వృత్తులూ, కులాల స్తిరత్వాలూ, అన్నీ వెనకడుగులే.
పెద్ద కులాల్లో అయినా, చిన్న కులాల్లో అయినా, అత్యధిక జనం శ్రామికులే. అందరూ తమ కులాల్ని గురించే తలపోస్తూ, కుల సంఘాలు పెట్టుకుంటూ, ‘కుల విధానాన్నే’ మరింత స్థిరంగా నిలబెట్టుకుంటున్నారు. చిన్న కులాల వారు రిజర్వేషన్ల భ్రమలతో, తమ కులాలే తమకు శాశ్విత రక్షణ అనుకుంటున్నారు. తాము ఏ వర్గ సంబంధాల్లో, ఏ స్తితిలో ఉన్నారో, గ్ర హించడం లేదు. రిజర్వేషన్లని ఉపయోగించుకుంటూ కూడా వర్గ స్పృహతో ఉండాలని గ్రహించడం లేదు. .
చిన్న కులాల జనాభాకి తాము ఘోరమైన ‘శ్రమ దోపిడీ’కి గురి అవుతున్నామని తెలీదు. దాని వల్ల దోపిడీ శ్రమ - విభజనలో చిక్కి ఉన్నామనీ తెలీదు. పిల్లి నోటిలో చిక్కిన ఎలక కూడా ఆత్మరక్షణ కోసం పెనుగులాడుతుంది. ఆ మాత్రపు రక్షణ స్పృహ కూడా శ్రామిక జనాభాకి లేదు.
కుల విధానమే కాదు. ఇంకా ఉన్న ఏ చెడ్డ విధానం అయినా గతించేది ఎవరి ద్వారా? సమస్య ఎవరిదో వారి ద్వారా.
మేధావులు బైల్దేరి, ‘కుల విధానం తక్షణం నశించాలి. దాన్ని వెంటనే తీసివెయ్యాలి’ అని ఘోషిస్తారు. దారి మధ్యలో ఉన్న ముళ్ళపొదని తక్షణం తవ్వి పైకి లాగి దాన్ని దారికి దూరంగా విసిరెయ్యడం ఎంత సాధ్యమో, కుల విధానాన్ని తీసివెయ్యడం అంత సాధ్యం అనుకుంటారు.
‘‘ఏ పెద్ద కులం వ్యక్తి అయినా, చిన్న కులం వ్యక్తినే పెళ్ళి చేసుకోవాలి’ అని చట్టం చెయ్యడం సాధ్యం కాదు. అలాంటి చట్టమే ఉంటే, పెద్ద కులాల వాళ్ళు పెళ్ళిళ్ళే మానుకుంటారు. పెళ్ళిళ్ళు లేని విధానాన్ని పెద్ద కులాల మధ్యనే పాటిస్తారు.
కులాంతరాల భార్యాభర్తలు, తమ పిల్లలకి తామే ఏదో ఒక కులాన్ని అంటగట్టడం తప్పకపోతే, కుల నిర్మూలన మాట ఎత్తడం దండగ.
సమాజంలో ఉన్న ప్రతీ మనిషీ శ్రమ చెయ్యాలని గ్రహించడమూ; ప్రతీ మనిషీ శారీరక - మేధా శ్రమలు రెండూ చెయ్యాలని గ్రహించడమూ, మొదటి సంగతి. ఆ మార్పుల కోసం, శ్రామిక వర్గ పోరాటం అత్యవసరమని గ్రహించడం, మరో సంగతి.
ఏ గ్రహింపూ లేకుండా, ‘కుల విధానాన్ని తక్షణం నిర్మూలించాలి’ అంటూ అరిచే నినాదాలు ఆ నిర్మూలనకు ఏ మాత్రమూ పనికి రావు. పైగా ఆ శబ్దాలు, సిద్ధాంత శబ్ద కాలుష్యాన్ని మాత్రమే దట్టంగా సృష్టిస్తాయి.
రంగనాయకమ్మ

తనకాలపు పరిధిలోనైనా సామాజిక చైతన్య దృష్టితో కవిత్వం చెప్పిన తొలి తెలుగు కవి వేమన్న. అదే దృష్టితో రచన చేస్తున్న ఈనాటి కవులు తమకన్నా పూర్వుల సంప్రదాయాన్ని తెలుసుకోటం ఆరోగ్యకరమే గాక అవసరమని కూడా భావిస్తున్నాం. వెనకటి మంచిని జీర్ణించుకొని కొత్త పరిస్థితులను గుర్తించి ముందు చూపుతో రచనలు చేయటం ఈనాటి రచయితల కర్తవ్యం.
తన కాలాన్ని మించి కొన్ని విషయాల్లో ముందుకు చూడగలిగిన కవిగా వేమన్నను మనం గౌరవించాలి. విగ్రహారాధనను వ్యతిరేకించాడు. శైవ వైష్ణవ మతాలవారి ఆర్భాటాలను, వారి దురాచారాలను, మోసాలను బట్టబయలు చేశాడు. చిలుక పలుకుల చదువులను విమర్శించాడు. కాకులకు పిండాలు పెట్టటం వంటి మూర్ఖాచారాలను తీవ్రంగా ఖండించాడు. శ్రమశక్తిలోనే సర్వమూ ఉన్నది అనేంత నిశిత పరిశీలన చెయ్యగలిగిన వేమన్న మామూలు కవికాడు, తనకాలపు చట్రంలో ఇమడని గొప్ప కవి.
వేమన్న రచనా మార్గంలో మూడు అంశాలు గుర్తించవచ్చు. 1.ప్రజలభాషలో ప్రచారంగా ఉన్న పదాలను, మాండలికాలను ప్రయోగించి ప్రజలకు సన్నిహితమైన రచన చెయ్యటం. 2.చెప్పదలచుకున్న భావాన్ని తగిన విస్తీర్ణంలోనే క్లుప్తంగా చెప్పటం. 3.ఊహలోనుంచికాక జీవితం నుంచి ఉపమానాలను ఏరుకోవటం. కవితా దృక్పథం విషయంలో మాత్రమే కాక రచనా విధానంలో కూడా వేమన్న ఆదర్శం నుంచి ఈనాటి కవులు నేర్చుకోవలసింది చాలా ఉందని దృఢంగా భావిస్తున్నాం.
చేకూరి రామారావు

కవి చౌడప్ప శతకము (1580-1640)

కం. నా నీతి వినని వానిని - భానుని కిరణములు మీద పారని వానిన్
వానను తడియని వానిని - కానను రా కుందవరపు కవి చౌడప్పా !
కం. ముందుగ చను దినములలో - కందమునకు సోమయాజి ఘను డందురు; నే
డందరు నను ఘనుడందురు - కందమునకు కుందవరపు కవి చౌడప్పా !
కం. విను భారవి భట్టును నా - చన సోముని మాఘ కవిని చతురత శ్రీ నా
ధు నుతింతును కవితకు తి - క్కన తలతున్ కుందవరపు కవి చౌడప్పా !
కం. పెద్దన వలె క్రుతి చెప్పిన - పె ద్దనవలె, అల్ప కవిని పె ద్దనవలెనా ?
ఎ ద్దనవలె, మొ ద్దనవలె - గ్ర ద్దనవలె కుందవరపు కవి చౌడప్పా !

వేమన పద్యాలు (1650)

 • ఉప్పుగప్పురంబు న్రొక్కపోలికనుండు,చూడచూడ రుచుల జాడవేరు,పురుషులందు పుణ్య పురుషులువేరయ,
 • కరకు కాయల దిని కాషాయ వస్త్రముల్,బోడినెత్తి గలిగి బొరయుచుండ్రు,తలలు బోడులైన తలపులు బోడులా
 • కుండ కుంభమన్న కొండ పర్వతమన్న నుప్పు లవణమన్న నొకటి కాదె భాష లిట్టె వేరు పరతత్వమొకటె
 • చంపదగిన యట్టి శత్రువు తనచేత చిక్కెనేని కీడు సేయరాదు పొసగ మేలు చేసి పొమ్మనుటే చావు
 • చిత్తశుద్ధి గలిగి చేసిన పుణ్యంబు- కొంచమైన నదియు కొదువ గాదు- విత్తనంబు మర్రి వృక్షంబునకు నెంత?
 • పట్ట నేర్చు పాము పడగ యోరగజేయు చెరుప జూచు వాడు చెలిమి జేసు చంపదలచు రాజు చనువిచ్చుచుండురా విశ్వధాభిరామ వినుర వేమ !

శతకములు ,శతక కర్తలు


Preview
పద్యం:
ఆత్మశుద్ది లేని యాచారమదియేల?
భాండశుద్ది లేని పాకమేల?
చిత్తశుద్ది లేని శివపూజలేలరా?
విశ్వదాభిరామ వినురవేమ.

తాత్పర్యం:
మనసు నిర్మలతో లేనపుడు ఏపని చేసిన అది వ్యర్ధమే అగును.అపరిశుభ్రముగా వున్న పాత్రలో వంట చేసినచో అది శరీరమునకు మంచిదికాదుగదా.అదేవిధముగా నిశ్చలమైన మనస్సుతో చేయని భగవంతుని పూజలు కూడా ఎలాంటి ఫలితాలనివ్వవు.

కుండ కుంభ మన్న కొండ పర్వతమన్న
నుప్పు లవణ మన్న నొకటికాదె
భాష లిట్టె వేరు పరతత్వమొక్కటే
విశ్వదాభిరామ వినురవేమ
------------------------------------------
Preview
నడువకుమీ తెరువొక్కటఁ
గుడువకుమీ శతృనింటఁ గూరిమితోడన్‌
ముడువకుమీ పరధనముల
నుడువకుమీ యెరులమనసు నొవ్వగ సుమతీ!

తాత్పర్యం:తోడులేకుండా వంటరిగా పోవద్దు. విరోధి ఇంట్లో భుజింపవద్దు. ఇతరుల ధనం దగ్గర ఉంచుకోవద్దు. ఇతరుల మనస్సు బాధపడేట్లు మాట్లాడవద్దు.

మీకు తెలుసా

14 వ శతాబ్దిలోనే శ్రీనాథుడు 20 -30 పార్శీ పదాలు వాడాడు.ఖుసి -ఖుషీ,దుకాణం,బజార్ ,తలవారి ,
పోర్చుగీసు - ఇస్త్రీ
ఉర్దూ ,అరబ్బీ - అల్మారీ ,బొత్త్తాం
రాసినట్లే ఉచ్చరించడం ఉచ్చరించినట్లే రాయడం తెలుగుకు ఉన్న ప్రధాన లక్షణం ఏ భాషకు ఈ సౌలభ్యం లేదు .

కొంగర జగ్గయ్య


తెలుగులోకి డబ్బింగు చేసిన జురాసిక్ పార్క్ అనే ఆంగ్ల చిత్రంలో రిచర్డ్ అట్టెంబరో పాత్రకు తన గాత్రాన్ని అరువు ఇచ్చాడు.

అల్లూరి సీతారామరాజు లో పోషించిన రూథర్ ఫర్డ్ పాత్ర: ఇది ఆయన జీవితంలో మరపురాని పాత్ర. ఆ సినిమా తీసే నాటికి రూథర్ ఫర్డ్ చరిత్ర మరచిపోయిన వ్యక్తి కాదు. ఆయన ఎలా ఉంటాడో, ఎలా ప్రవర్తించేవాడో తెలిసిన వాళ్ళు అప్పటికి ఉన్నారు. ఆయన 1940 వరకు ప్రభుత్వ సర్వీసులో ఉన్నాడు. కృష్ణా జిల్లా, గుంటూరు, కడప తదితర ప్రాంతాల్లో పనిచేశాడు. అప్పటి ఐ.సి.ఎస్. అధికార్లలో చాలా మందికి ఆయన బాగా తెలుసు. వాళ్ళను వాకబు చేసి జగ్గయ్య రూథర్ ఫర్డ్ ప్రవర్తన గురించి, మనస్తత్వం గురించి తెలుసుకున్నాడు. అప్పుడు ఆయనకు రూథర్ ఫర్డ్ చాలా మంచి వ్యక్తి అని, ఆయనకు సీతారామరాజు అంటే గౌరవం ఉండేదని తెలిసింది. అయితే రూథర్ ఫర్డ్ బ్రిటిష్ ప్రభుత్వానికి విధేయుడు. ఆయన వైపు నుంచి చూస్తే బ్రిటిష్ ప్రభుత్వ సేవకుడిగా ఆయన సీతారామరాజును పట్టుకుని తీరాలి. ఇది తెలిశాక జగ్గయ్య చిత్ర రచయిత మహారథినికలిసి ఆ పాత్రను రొటీన్ విలన్ లా కాకుండా విధి నిర్వహణకు బద్ధుడై ఉండే హుందా అయిన వ్యక్తిలా మార్చి వ్రాయాలని కోరాడు. అలా ఆ పాత్ర చిత్రణ మార్చడంతో ఆ పాత్ర నిలబడడంతో బాటు సీతారామరాజు పాత్ర మరింతగా ఎలివేట్ అయింది. ఆ సినిమా చూశాక పి.వి.నరసింహారావు జగ్గయ్యకు ఫోన్ చేసి "మీ పాత్ర పోషణ అద్భుతం." అని ప్రశంసించారట.

Tips in basic English grammar

 • kinds of verbs-week verbs,strong verbs,finite verb ,infinitive,transitive,intransitive,special verbs(auxiliary verbs ,helping verbs,anomalous verbs) ,
 • form of vrbs=ist,iind,iiird= (1.adding ing to the present verb) ,(2.past verb) ,(3.past participle)
 • past participle is used at 1.present perfect 2.past perfect 3.future perfect 4.present perfect cont 5.past perfect cont 6.future perfect cont and passive voice
 • be forms be,was,are,were,been
 • tens are basically two 1.present tense,2 past tense
 • does (do) is used when subject is in singular third person
 • am is used when subject is in singular ist person

5.SONGS

MOVIE LIST (UPTO 1960)

ALPHABETIC ORDER List 1-9 | A |B | C | D | E | F | G | H | I | J | K | L |M | N | O | P | Q | R | S | T | U | V | W | X | Y | Z
YEAR - WISE List 1932 | 1933 |1934 | 1935 | 1936 | 1937 | 1938 |1939 | 1940 | 1941 | 1942 | 1943 |1944 | 1945 | 1946 | 1947 | 1948 |1949 | 1950 | 1951 | 1952 | 1953 |1954 | 1955 | 1956 | 1957 | 1958 |1959 | 1960 | 1961 | 1962 | 1963 | 1964 | 1965 | 1966 | 1967 | 1968 | 1969 | 1970 | 1971 | 1972 | 1973 | 1974 | 1975 | 1976 | 1977 | 1978 | 1979 | 1980 | 1981 | 1982 | 1983| 1984| 1985| 1986| 1987| 1988| 1989| 1990| 1991| 1992| 1993| 1994| 1995| 1996| 1997| 1998| 1999| 2000| 2001| 2002| 2003| 2004| 2005| 2006 | 2007 | 2008 | 2009 | 2010 | 2011

6.సామెతలు (proverbs)

6.సామెతలు (proverbs)


 • A bird in the hand is worth two in the bush
 • A friend in need is a friend indeed.
 • A stitch in time saves nine.
 • Absence makes the heart grow fonder.
 • As you sow, so you shall reap.
 • Beauty is only skin deep.
 • Better late than never.
 • better safe than sorry
 • Don't count your chickens before they're hatched.
 • Don't cry over spilt milk.
 • Don't judge a book by its cover.
 • Don't throw the baby out with the bath water.
 • Early to bed and early to rise makes a man healthy,
 • wealthy and wise.
 • Every cloud has a silver lining.
 • God helps those who help themselves.
 • Half a loaf is better than no bread.
 • He who laughs last laughs longest.
 • Make hay while the sun shines
 • Necessity is the mother of invention.
 • Never put off till tomorrow what you can do today.
 • One man's meat is another man's poison.
 • Out of sight, out of mind.
 • Rome wasn't built in a day.
 • The best way to a man's heart is through his stomach.
 • The end justifies the means.
 • The grass is always greener on the other side of the fence.
 • Too many cooks spoil the broth.
 • Two heads are better than one.
 • Waste not, want not.
 • When in Rome, do as the Romans do.
 • You can lead a horse to water, but you cannot make
 • him drink.
 • You can't make a silk purse out of a sow's ear.
 • Let sleeping dogs lie.
 • Hunger is the best sauce.
 • Measure twice cut once:Cocider your options carefully in order to make a good decision
 • Give him an inch and he'll want a yard:
 • The darkest hour is that before dawn
 • some people always take advantage of favor that is shown them
 • Even when things seem at their very worst, they may shortly improve
 • There only only twenty-four hours in a day :Time is a limited resource, so use it wisely
 • Any time means no time : When an event is not decided on or planned earlier it will never take place
 • Better late than never - To do something that is right, profitable, or good a little late is still better than not doing it at all
 • You can lead a horse to water but you can't make him drink
 • We can help, show or encourage someone to do something but we can't make him do what he is unwilling or unable to do "A bird in hand is worth two in the bush "
 • Something that one already has is better than going after something seemingly more worthwhile that one may not be able to get

CONCEPT
( development of human relations and human resources )

7..Gas

11.quataions

నేర్చుకోవడం ఆపితే ఆ రోజుతో మనిషి ఎదుగుదల ఆగిపోతుంది .నేర్చుకోవడం ఆపేసినరోజున మనిషి చనిపోయినట్టే.- అక్కినేని నాగేశ్వర రావు గారు 1.KARL MARX 2.SIGMAUND FRAUD 3.SOCRATES