CONCEPT

భావన

తెలుగు - సౌందర్యం - సాహిత్య కళారూపాలు ( వ్యాసాలు )

భాష్యతే ఇతి భాషా 

http://manatelugunela.com/

భాషించబడేది భాష. కోట్లాది జీవరాసులున్నయీ ప్రపంచములో మాట్లాడగలిగిన శక్తివున్న ఏకైక ప్రాణి "మానవుడు". తన మనస్సులోని ఆలోచనలను, అభిప్రాయాలను బహిర్గతం చేయటానికి మానవుడు తన నోటిద్వారా చేసే ధ్వనుల సముదాయమే "భాష". మానువులందరికీ ఉమ్మడి సొత్తు భాష. అలాగే తెలుగు భాష తెలుగు ప్రజల ఉమ్మడిసంపద!




తల్లిపాలతో పాటు వంటబట్టించుకునే భాష మాతృ భాష. భాషకూ మనిషికీ వున్న సంబంధం విడదీయరానిది. తల్లి జీవశక్తి నిచ్చి మనిషిని పెంచి పెద్ద చేస్తున్నట్లే సమాజానికి చెందిన భాష బుద్ధి నిచ్చి వికసింపజేస్తుంది. వ్యక్తి వికాసంతోపాటు సామాజిక వికాసం కూడా మాతృభాష పై ఆధారపడి వుంటుంది . ప్రతి జాతి తన మాతృ భాష ద్వారా మాత్రమే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించ గలుగుతుందనేది చారిత్రకసత్యం! మాతృభాష పట్ల అభిమానం లేని జాతి బానిసజాతి క్రింద లెక్క!!


ప్రపంచములోని 620 కోట్ల జనాభాకు వ్యవహారంలో షుమారు 5000 భాషలున్నాయి. భారతదేశంలో 1652 భాషలున్నాయి. భారత రాజ్యాంగం 22 భాషలను మాత్రమే అధికార భాషలుగా గుర్తించింది. భారతీయ భాషల్లో "తెలుగు" ద్వితీయ స్ధానంలో వుంది. దాదాపు రెండువేల సంవత్సరాలకు పూర్వమే తెలుగు భాష వాడుకలోకి వచ్చింది.


తెల్లదొరలను తరిమికొట్టి స్వాతంత్ర్యాన్ని సాధించుకున్నాం. ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పుకున్నాం. భాషా ప్రయుక్తరాష్ట్రాల కోసం పోరాడి ఆంధ్రప్రదేశ్ ను సాధించుకున్నాము. 55 సంవత్సరాల కాలం గడిచింది. తెలుగు భాష అభివృద్ధికి తగిన కృషి జరుగలేదు. 1974 మార్చిలో వాలిలాల గోపాల క్రిష్ణయ్య అధ్యక్షతన "అధికారభాషా సంఘం" ఏర్పడింది. ఇప్పటికి 37 సంవత్సరాలు గతించాయి అయినా అధికార భాషగా తెలుగు నత్తనడకగానే సాగుతున్నది. ఇందుకు మొదటి ముద్దాయిలు రాజకీయనాయకులు!!


ప్రజాస్వామ్యంలో ప్రజలే పాలకులు. వారి భాషే పరిపాలన భాష! మాతృభాషలో పరిపాలన సాగిస్తే అది ప్రజాస్వామ్య పాలన అనిపించుకుంటుంది. తెలుగు పాలనాభాషగా అమలు జరగాలంటే , అధికారభాషా సంఘం, తెలుగు అకాడమి, వివిధ విశ్వవిధ్యాలయాలు, కళాశాలలు, విధ్యాశాఖ, వివిధి సంస్ధలు నిరంతర నిర్విరామ కృషిచేయాలి. ముఖ్యంగా ప్రజలు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి.( manatelugunela.com  వారి సౌజన్యం తో)

CONCEPT ( development of human relations and human resources )

No comments: