CONCEPT

భావన

నాకవితలు


నాకవితలు by Ch.RamaMohan,BA.,

సమత పంచలేని వాడు

మమత పంచలేడు

మమత పంచలేనివాడు

మనిషేకాడు

***

ఓటు

వేస్తారు ఇస్తే నోటు

చేస్తుంది దేశానికి ఎంతో చేటు

ప్రజాస్వామ్యానికి ఇది కాటు

***
గ్రామాలు
 గిట్టుబాటు ధరల్లేని సేద్యాలు
 ప్రకృతి వైపరీత్యాలు
 పండని పంటలు
 నిండని కడుపులు
 పట్టని ప్రభుత్వాలు
 మేలుకొనేదెప్పుడో గ్రామాలు
***
నిన్నటి జీవితం మరపు,
రేపటి జీవితం తలపు,
నేటి జీవితం మలుపు 
బుద్ధం శరణం గచ్చామి
-చింతా 

**నా కవిత**

బుద్దుడు
 సకలం
 పరిత్యజించిన

సోక్రటిస్
సత్య శోధన కై
హలం గ్రహించిన

స్పోర్టకస్ తిరుగుబాటుతో 
చరిత్రకు
పాఠాలు నేర్పిన

జీసస్
వీరు ఎమి చేయుచున్నారో
వీరు ఎరుగరని
సిలువను
రక్తసిక్తం చేసిన

వేమన
భావ విప్లవానికే 
భాష్యం చెప్పిన

ఫ్రాయిడ్ 
మానసిక ఋగ్మతలను
 పటాపంచలు చేసిన

మార్క్స్ చరిత్ర గతిని
నిర్దేశించిన

లెనిన్
పెట్టుబడిదారుల
గుట్టు విప్పిన (సామ్రాజ్యవాదం)

స్టాలిన్
Stateless country
అని ఉటంకించిన

మావో
సాంస్కృతిక
విప్లవావసరాన్ని తెలిపిన

అంబేద్కర్ భరత దేశ
జాతిని నీతిని నిలిపిన

వారు తాత్వికులు
చరిత్రగతిని నిర్దేశించారు
సమాజం వసుదైక
కుటుంబం యొక్క నమూనా
వారు సమాజంతో మమేకమై
కాలాచక్ర పరిధిని దాటి
ఆలోచించారు
సమాజానికి
నూతనమార్గాన్ని నిర్దేశించారు

శ్రీ శ్రీ

మహాకవి మరణించలేదు - నాహృదిలో ఉదయించినాడు

కూలివాని గుండెలొ ఆవేదన ఉందని

కార్మికుని కడుపులో ఆకలి రగిలందని

కలంపట్టి వ్రాసిన మాకవి మహాకవి శ్రీ శ్రీ

మహాకవి మరణించలేదు - నాహృదిలో ఉదయించినాడు

దోపిడిదారుల దురంతాలు సాగవని

పీడకుల పాలన మాకిక వద్దని

గళం ఎత్తిపాడిన మాకవి మహాకవి శ్రీ శ్రీ

మహాకవి మరణించలేదు - నాహృదిలో ఉదయించినాడు

దగాపడ్డ తమ్ములార ఏకంకండని

మోసపోక యికనైనా మేలుకొండని

మాకు పిలుపునిచ్చిన మాకవి మహాకవి శ్రీ శ్రీ

మహాకవి మరణించలేదు - నాహృదిలో ఉదయించినాడు
***

తెలుగు వెలుగు 
సౌరభ సుమమాల
కోమల విరిబాల
సోభిల్లు తెలుగు
 సుమధుర రసాల
చల్లని వెన్నెల 
నా భావనమ్మ

సంస్కృతము లేక తెలుగు లేదు
పారసికము పట్టు వదల లేదు
ఆంగ్లము వల్ల తెనుగు మనలేదు
నా భావనమ్మ

తెలుగేది
వెలుగేది
తెలుగుజాతికి దారేది

చేతిలో కప్పు cup
ఇంటిపైకప్పు
తెలుగేదొ చెప్పు

తెలుగు జల్లెడ జర 
చందమామ చర 
రంపము బండి ర 
లేదు నా భావనమ్మ