1.అన్నమయ
ప|| తందనాన ఆహి తందనాన పురె |తందనాన భళా తందనాన ||
బ్రహ్మ మొకటే పరబ్రహ్మ మొకటే |పరబ్రహ్మ మొకటే పరబ్రహ్మ మొకటే ||
ఇందులో జంతుకులమింతా నొకటే |అందరికి శ్రీహరే అంతరాత్మ ||
చ|| నిండార రాజు నిద్రించు నిద్రయు నొకటే |అండనే బంటునిద్ర అదియు నొకటే |
మెండైన బ్రాహ్మణుడు మెట్టుభూమి యొకటే |చండాలు డుండేటి సరిభూమి యొకటే ||
చ|| అనుగుదేవతలకును అలకామ సుఖమొకటే |ఘనకీట పశువులకు కామ సుఖమొకటే |
దినమహో రాత్రములు తెగి ధనాఢ్యునకొకటే |వొనర నిరుపేదకును వొక్కటే అవియు ||
చ|| కొరలి శిష్టాన్నములు గొను నాకలొకటే | తిరుగు దుష్టాన్నములు తిను నాకలొకటే |
పరగ దుర్గంధములపై వాయువొకటే | వరుస బరిమళముపై వాయువొకటే ||
చ|| కడగి యేనుగు మీద గాయు యెండొకటే |పుడమి శునకము మీద బొలయు నెండొకటే |
కడు బుణ్యులను బాప కర్ములను సరిగావ |జడియు శ్రీ వేంకటేశ్వర నామమొకటే ||
తిరుమలయ్య విందు మంచిదే వుండంటే వుంటినమ్మ