Mar 26, 2020

తెలుగు పద్యం (శతకములు)


*Satakalu Introduction in Telugu

Sri Kalahastiswara Satakam
Dasrathi Satakam
Narasimha Satakam
Bhaskara Satakam
Kumara Satakam
Kumari Satakam
Sadhana Satakam
Andhra Nayaka Satakam
Sri Kishna Satakam
Vemana Satakam
Sumati Satakam
Bharthruhari Neethi Satakam
Bharthruhari Vyragya Satakam **
-----------------------------------------

పాపము లొందువేళ రణ పన్నగ భూత భయ జ్వరాదులం
దాపద నొందువేళ భరతాగ్రజ మిమ్ము భజించువారికిన్
బ్రాపుగ నీవు దమ్ము డిరుపక్కియలన్ జని తద్విపత్తి సం
తాపము మాన్పి కాతురట దాశరథీ కరుణాపయోనిధీ

పదవిభాగంపాపములుఒందువేళరణపన్నగభూతభయజ్వరఆదులందుఆపదనుఒందువేళభరతఅగ్రజమిమ్ముభజించువారికిన్ప్రాపుగనీవుతమ్ముడుఇరుపక్కియలన్చనితత్విపత్తిసంతాపముమాన్పికాతురటదాశరథీకరుణాపయోనిధీ

కుమార శతకం
వగవకు గడిచిన దానికి
బొగడకు దుర్మాతులనెపుడు పొసగని పనికై
యెగి దీనత నొందకుమీ
తగ దైవగతిం బొసంగు ధరను కుమారా!

తాత్పర్యం: ఓ కుమార! అయిపోయిన పనిని గురించి చింతించవద్దు. దుష్టులను మెచ్చుకొనవద్దు. నీకు సాధ్యము కాని దానిని పొందలేకపోతినని చింతించుట పనికిరాదు. భగవంతుడు ఇచ్చిన దానితో తృప్తి చెందుము.

సరివారిలోన నేర్పున
దిరిగెడు వారలకుగాక తెరవాటులలో
నరయుచు మెలగెడి వారికి
బరువేటికి గీడె యనుభవంబు కుమారా!

తాత్పర్యం: ఓ కుమారా! తనతో సమానమైన వారితో నేర్పున నడుచుకొనిన గౌరవము, కీర్తి లభించును. అంతేకాక దుష్టుల తోనూ, దొంగలతోనూ స్నేహం చేసినయెడల గౌరవము చెడి కీడు జరుగును.
తనుజులనుం గురువృద్ధుల
జననీజనకులను సాధుజనుల నెవడు దా
ఘనుడయ్యుబ్రోవడో యా
జనుడే జీవన్మృతుండు జగతి కుమారా!

తాత్పర్యం: ఓ కుమారా! తన కుమారులను, గురువులను, పెద్దవారిని, తల్లిదండ్రులను, సజ్జనులైనవారిని, ఎవడు తనకు చేతనైనను తగిన సమయమున రక్షింపడో అతడు బతికి యున్ననూ చచ్చినవాడితో సమానం అగును.
సద్గోష్ఠి సరియు నొసగును
సద్గోష్ఠియె కీర్తిఁ బెంచు సంతుష్టిని నా
సద్గోష్ఠియె యొనగూర్చును
సద్గోష్ఠియె పాపములను జంపు కుమారా!

తాత్పర్యం: ఓ కుమారా! సజ్జనులతో సహవాసము, మాట్లాడుట సంపదలను కలిగించును. కీర్తిని వృద్ధికి తెచ్చును, తృప్తిని కలిగించును, పాపములను పోగొట్టును. కాబట్టి సజ్జనులతో స్నేహము అవశ్యము చేయతగినది.
అవయవహీనుని సౌంద
ర్యవిహీను దరిద్రుని విద్య రానియతని సం
స్తవనీయు, దేవశృతులన్
భువి నిందింప దగదండ్రు బుధులు కుమారా!

తాత్పర్యం: ఓ కుమారా! వికలాంగుని, కురూపిగా ఉండువానిని, దానము లేని దరిద్రుడిని, విద్యరాని వానిని, గొప్పగుణములు గల సన్మార్గుని, భగవంతుని, పవిత్ర గ్రంథములను నిందింపరాదు అని పెద్దలు చెప్పుచున్నారు.
శ్రీ భామినీ మనోహరు
సౌభాగ్యదయాస్వభావు సారసనాభున్
లో భావించెద; నీకున్
వైభవము లోసంగుచుండ వసుధ కుమారా!

తాత్పర్యం: ఓ కుమారా! శ్రీ లక్ష్మీనాథుడును, సంపదయు, ప్రేమయు రూపంగా కల వాడును అగు శ్రీ మహావిష్ణువును నీకెల్లప్పుడును సకల ఐశ్వర్యములను ఇచ్చునట్లుగా నా మనస్సునందు తలంచుచున్నాను.
ఆజ్ఞ యొనర్చెడి వృత్తుల
లో జ్ఞానము గలిగి మెలఁగు లోకులు మెచ్చన్,
బ్రాజ్ఞతను గలిగి యున్నన్,
బ్రాజ్ఞులలోఁబ్రాజ్ఞుడవుగ ప్రబలు కుమారా!

తాత్పర్యం: ఓ కుమారా! ఇతరులకు ఉత్తర్వు చేయునట్టి పనులలో వివేకము కలిగి నడుచుకొనుము. లోకమునందలి వారెల్లరునూ మెచ్చుకొనునట్లుగా వివేకము కలిగి యుండిన యెడల నిన్ను బుద్ధిమంతులగు వారిలో బుద్ధిమంతుడువుగ ఎంచుతారు.
అతి బాల్యములోనైనను,
బ్రతికూలపు మార్గములఁబ్రవర్తింపక స
ద్గతిమీఱ మెలఁగ నేర్చిన
నతనికి లోకమున సౌఖ్యమగును కుమారా!

తాత్పర్యం: ఓ కుమారా! ఎవడు లోకమునందు చిన్నవాడుగా నుండి ఉన్నప్పటిని, విరుద్ధముగా నడవక మంచిమార్గమున నడుచుచుండునో వాడు లోకమున సుఖముగా జీవింపగలడు.
వృద్ధజన సేవ చేసిన,
బుద్ధి వివేషజ్ఞుఁడనుచుఁబూతచరితుఁడున్
సద్ధర్మశాలి యని బుధు
లిద్ధరఁ బొగడెదరు ప్రేమ యెసఁగ కుమారా!

తాత్పర్యం: ఓ కుమారా! పెద్దలను భక్తితో కొలుచుచున్న యెడల వానిని లోకమునందు పరిశుద్ధముగల మనస్సు కలవాడనియు, తెలివి తేటలు బాగుగా నుండు వాడనియు, ధర్మములనెరిగిన వాడనియు పెద్దలగువారందురు.
ఆచార్యున కెదిరింపకు
బ్రోచిన దొర నిందసేయఁ బోకుము కార్యా
లోచనము లొంటిఁజేయకు
మాచారము విడువఁబోకుమయ్య కుమారా!

తాత్పర్యం: ఓ కుమారా! ఉపాధ్యాయుని ఎదురింపవలదు. నిన్నుగాపాడిన వారిని తిట్టవద్దు. ఏదయినా ఆలోచనము చేయుటలో ఒంటరిగా జేయవద్దు. మంచి నడవడిని వదిలి పెట్టవద్దు.
పెద్దలు వద్దని చెప్పిన
పద్దులఁబోవంగరాదు పరకాంతల నే
ప్రొద్దే నెదఁబరికించుట
కుద్దేశింపంగఁగూడ దుర్వి కుమారా!

తాత్పర్యం: ఓ కుమారా! పెద్దలు చేయవద్దన్న పనులు చేయరాదు. ఇతర స్త్రీలను ఎపుడైనా చూచుటకు కోరవలదు.
ధరణీనాయకు రాణియు
గురురాణియు నన్నరాణి కులకాంతను గ
న్నరమణి దను గన్నదియును
ధర నేవురు తల్లులనుచుఁదలఁపుఁ కుమారా!

తాత్పర్యం: ఓ కుమారా! రాజు భార్యయును, గురు భార్యయును, అన్న భార్యయును, అత్తయును, ఈ ఐదుగురు తల్లులని భావింపవలెను.
పోషకుల మతముఁగనుఁగొని
భూషింపక కాని ముదముఁ బొందరు మఱియున్,
దోషముల నెంచుచుందురు,
దోషివయిన మిగులఁగీడు దోఁచుఁ కుమారా!

తాత్పర్యం: ఓ కుమారా! నిన్ను పోషించు వారి మనస్సును గుర్తెరిగి వారిని గొప్పచేయు చుండుము. అప్పుడే వారు సంతోషింతురు. లేకున్న దోషములను లెక్కింతురు. నీ యందు తప్పు కల్గిన యెడల నీకు హాని కలుగును.
నరవరుఁడు నమ్మి తను నౌ
కరిలో నుంచునెడ వాని కార్యములందున్
సరిగా మెలంగ నేర్చిన
పురుషుడు లోకమునఁగీర్తి బొందు కుమారా!

తాత్పర్యం: ఓ కుమారా! రాజు ఎవనినమ్మి తనకు సేవకునిగా నియమించుకొనునో అట్టివాడు అతని పనులను శ్రద్ధతో చేయుచుండిన కీర్తి పొందును.
చేయకుము కాని కార్యము;
పాయకుము మఱిన్ శుభం; బవని భోజనమున్
జేయకుము రిపు గృహంబునఁ ;
గూయకు మొరుమనసు నొచ్చుఁ గూఁత కుమారా!

తాత్పర్యం: ఓ కుమారా! సాధ్యము కాని పనిని చేయుటకు ప్రయత్నించవద్దు, మంచిదానిని వదలవద్దు. పగవాని యింట భుజించవద్దు. ఇతరులకు నొప్పికలుగునట్లు మాట్లాడవద్దు.
పిన్నల పెద్దలయెడఁ గడు
మన్ననచే మెలఁగు సుజన మార్గంబులు నీ
వెన్నుకొని తిరుగుచుండిన
నన్నియెడల నెన్నఁబడుదువన్న కుమారా!

తాత్పర్యం: ఓ కుమారా! నీవు చిన్నవారిని, పెద్దవారిని చూచినయెడల మర్యాదతో ప్రవర్తింపుము. మంచివారు నడచు మార్గములందు నడువు, అట్లు నీవు ప్రవర్తించుచుండిన యెడల లోకమునందంతటనూ ప్రఖ్యాతికెక్కగలవు.
పెద్దలు విచ్చేసినచో
బద్దకముననైన దుష్ట పద్ధతి నైనన్,
హద్దెఱిఁగి లేవకున్నన్
మొద్దువలెం జూతు రతని ముద్దు కుమారా!

తాత్పర్యం: ఓ కుమారా! పెద్దలు నీ దగ్గరకు వచ్చినపుడు సోమరితనము చేతగానీ, దుర్మార్గవృత్తితో గానీ, మర్యాదతో లెవకున్న యెడల నిన్ను వారు మొద్దురీతిగా జూతురే గాని నీవొక ప్రాణము గల మనిషివని తలంపరు.
ఉన్నను లేకున్నను పై
కెన్నఁడు మర్మంబుఁదెలుప నేగకుమీ నీ
కన్న తలిదండ్రుల యశం
బెన్నఁబడెడు మాడ్కిఁ దిరుగు మెలమిఁగుమారా!

తాత్పర్యం: ఓ కుమారా! నీకు రహస్యము తెలసి ఉన్నప్పటికీ, లేకపోయినప్పటికీ బయట చెప్పుటకై పోవద్దు. అనగా రహస్యము తెలిసినదైననూ నీవు మాత్రం తెలియజేయవద్దు. నిన్నుగన్న తల్లిదండ్రుల పేరు ప్రతిష్టలను మెచ్చుకొనునట్లుగా నీవు నడచుకొనుము.
తనపై దయ నూల్కొనఁగను
గొన నేతెంచినను శీల గురుమతులను వం
దనముగఁ బూజింపం దగు
మన మలరగ నిదియ విబుధ మతము కుమారా!

తాత్పర్యం: ఓ కుమారా! తన మీద దయతో ప్రవర్తించే మంచి ప్రవర్తన కల వారికి నమస్కారము చేసి గౌరవించుట అవతలి వారి మనస్సు సంతోషపడునట్లుగా నడుచుకొనుటయే బుద్ధిమంతులు చేయుపని.
పుడమిని దుష్టత గలయా
తఁడు లంచంబులను బట్టఁ దలఁచును మిడియౌ
నడవడి మిడి యందఱి వెం
బడి ద్రిప్పికొనుచును గీడు పఱుపకుఁబుత్రా!

తాత్పర్యం: ఓ కుమారా! చెడ్డనడవడి కలవాడు దుడుకుతనముచే లంచములను తీసికొనుటకు ఉద్దేశించును. కాబట్టి దుష్టబుద్ధిగల వాడవై లోకులందరనూ మర్యాదనతిక్రమించి వెంటతిప్పుకొనుచూ హాని చేయవద్దు.
పనులెన్ని కలిగియున్నను
దిన దినముల విద్యపెంపు ధీయుక్తుఁడవై
వినఁగోరుము సత్కథలను
కని విబుధులు సంతసించు గతినిఁ గుమారా!

తాత్పర్యం: ఓ కుమారా! నీకు ప్రతిదినము పనులెన్ని యుండినప్పటికీ విద్య యందలి గౌరవముతో,పెద్దలయందున్న మెచ్చుకొనునట్లుగా మంచి మంచి కథలను పరిశీలించి వినుచుండును.
తనయుడు చెడుగై యుండిన
జనకుని తప్పన్నమాట సత్యమెఱుఁగుఁ నా
వున నీ జననీ జనకుల
కు నపఖ్యాతి యగురీతి గొనకు కుమారా!

తాత్పర్యం: ఓ కుమారా! కుమారుడు దుర్మార్గుడైన తండ్రిదే తప్పు అని యందురు. కాబట్టి నీ తల్లిదండ్రులకు అపకీర్తి వచ్చునట్టి మార్గమును పూనవలదు.
ఆధారము: తెలుగు పెన్నిధి.కం


శతక పద్యాలు
వేమన శతకం
కుమార శతకం
ధాశరథీ శతకం
భాస్కర శతకం
కృష్ణశతకం
బలమెవ్వఁడు కరి బ్రోవను
బలమెవ్వఁడు పాండుసుతుల భార్యను గావన్
బలమెవ్వఁడు సుగ్రీవుకు
బలమెవ్వఁడు నాకు నీవె బలమౌ కృష్ణా!

భావం:

గజేంద్రుని కాపాడిన బలమేదో, పాండవుల పత్ని ద్రౌపదిని కాపాడిన బలమేదో, సుగ్రీవునకు బలం ఎవడో, అట్టి బలవంతుడవైన ఓ కృష్ణా! నీవే నాకు అండ. అనగా వీరందరికీ నీవే కదా సహాయకుడవు అని భావం.
ధాశరధి శతకము:

వనకరిచిక్కు మైనసకు పాచవికిం జెడిపోయె మీనుతా
వినికికిఁజిక్కెఁజిల్వగను వేఁదుఱుఁ జెందెను లేళ్ళు తావిలో
మనికినశించె దేటితర మాయిరుమూఁటిని గెల్వనై దుసా
ధనములనీ వె కావనగు దాశరథీ! కరుణాపయోనిధీ!

భావం:

తన శరీరచాపల్యంతో అడవి యేనుగు చిక్కును. నోటి రుచికై చేప వలలో పడును. రాగం వినటానికి పోయి పాము చిక్కును. కనులలోని ఉన్మత్తతతో జింకలు చిక్కుకొనును. వాసనలో ఉండటంతో తుమ్మెద నసించిపోవును. కావునా, పంచేంద్రియాలను గెల్చుటకు పంచసాధనాలను ఇచ్చి నన్ను రక్షించు.

భాస్కర శతకము:
బంధుర సద్గుణాఢ్యుఁ డొకపట్టున లంపట నొందియైన, దు
స్సంధిఁ దలంపఁ; డన్యులకుఁ, జాలహితం బొనరించుఁగాక; శ్రీ
గంధపుఁజెక్క రాగిలుచుఁ గాదె, శరీరుల కుత్సవార్థమై
గంధము లాత్మఁబుట్టుఁదఱు, గంబడి యుండుటలెల్ల భాస్కరా!

భావం:
మంచిగుణములతో నిండినవాడగు పరోపకారి, తనకు శ్రమ కలిగినా, ఇతరులకు మేలు చేస్తాడుగానీ కీడు చేయడు. గంధపు చెక్క తనను నరికి అరగదీసినా, ఇతరులకు ఆనందం కలిగించే మంచి సువాసన ఇస్తుంది గానీ చేటు చేయదు కదా!

కుమార శతకము:
పనులెన్ని కలిగి యున్నను
దినదినమున విద్య పెంపు ధీయుక్తుడవై
వినగోరుము సత్కథలను;
కని విబుధులు సంతసించు గతినిఁ గుమారా!

భావం:

ఓ కుమారా! ఎన్ని పనులు ఉన్నప్పటికీ, ప్రతి దినం జ్ఞానం పెంచుకొనేందుకు, మంచి కథలు విని, తెలుసుకొనే ఆసక్తి చూపితే, బుద్దిమంతులు వారిని చూసి ఆనంది

వేమన ( 1650 - 1750 ) శతకము:

ఆత్మశుద్ది లేని యాచారమదియేల?
భాండశుద్ది లేని పాకమేల?
చిత్తశుద్ది లేని శివపూజలేలరా?
విశ్వదాభిరామ వినురవేమ.

తాత్పర్యం:
మనసు నిర్మలతో లేనపుడు ఏపని చేసిన అది వ్యర్ధమే అగును.అపరిశుభ్రముగా వున్న పాత్రలో వంట చేసినచో అది శరీరమునకు మంచిదికాదుగదా.అదేవిధముగా నిశ్చలమైన మనస్సుతో చేయని భగవంతుని పూజలు కూడా ఎలాంటి ఫలితాలనివ్వవు.

కుండ కుంభ మన్న కొండ పర్వతమన్న
నుప్పు లవణ మన్న నొకటికాదె
భాష లిట్టె వేరు పరతత్వమొక్కటే
విశ్వదాభిరామ వినురవేమ
------------------------------------------
సుమతీ శతకము:

నడువకుమీ తెరువొక్కటఁ
గుడువకుమీ శతృనింటఁ గూరిమితోడన్‌
ముడువకుమీ పరధనముల
నుడువకుమీ యెరులమనసు నొవ్వగ సుమతీ!

తాత్పర్యం:తోడులేకుండా వంటరిగా పోవద్దు. విరోధి ఇంట్లో భుజింపవద్దు. ఇతరుల ధనం దగ్గర ఉంచుకోవద్దు. ఇతరుల మనస్సు బాధపడేట్లు మాట్లాడవద్దు.

ఆఁకొన్న కూడె యమృతము
తాఁకొందక నిచ్చువాఁడె దాత ధరిత్రిన్‌
సోఁకోర్చువాఁడె మనుజుఁడు
తేఁకువగలవాఁడె వంశ తిలకుఁడు సుమతీ!

తాత్పర్యం:
లోకంలో ఆకలి వేసినప్పుడు అన్నమే అమృతము, బాధ పొందకుండా ఇచ్చువాడే దాత, ఆవేశాన్ని ఓర్చుకొనేవాడే మానవుడు, ధైర్యం కలవాడే వంశశ్రేష్ఠుడు.

CONCEPT ( development of human relations and human resources )

Feb 28, 2020

21.చారిత్రక గతిని నిర్దేశించిన తాత్వికులు : వేమన పద్యాలు


చారిత్రక గతిని నిర్దేశించిన తాత్వికులు
రచయిత:చింతా.రామమోహన్ BA.,SDE (Rtd )BSNL

సమాజం వసుదైకకుటుంబం యెక్క నమూన. తాత్వికులు సమాజం తో మమేకమై వారి కాలచక్రపరిధిని దాటి ఆలోచించారు .  సమాజానికి నూతనమార్గాన్ని నిర్దేశించారు .

"There are no facts, only interpretations."- Friedrich Nietzsche (1844-1900)


- - -
అజ్ఞానపు టంధయుగంలొ ఆకలిలొ,ఆవేశంలో తెలియని ఏ తీవ్రశక్తులో నడిపిస్తే నడిచి మనుష్యులు అంతా తమప్రయోజకత్వం తామేభువికధినాధులమని స్థాపించిన సామ్రాజ్యాలునిర్మించిన క్రుత్రిమ చట్టాలు ఇతరేతర శక్తులు లేస్తే పడిపోయెను పెకమేడలై పరస్పరం సంఘర్షించినశక్తులతో చరిత్ర పుట్టెను.
   - - -
నేను సైతం ప్రపంచానికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను
నేను సైతం విశ్వసృష్టికి అశృఉవొక్కటి ధారవోసాను
నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మొసానూ - శ్రీశ్రీ

1.బుద్డుడు - (563 - 483 BC) భౌతికవాదం * (meterilisiom)


2.సోక్రటీస్ - నిన్నునీవు తెలుసుకో (469-399) BC* (method of arriving at truth )3.స్పొర్టకస్ - (71 BC) తిరుగుబాటు  * ( the first revolutionist in the history )4.జీసస్ - మానవసంబంధాలు * (human relations )5.వేమన - (1650  రాయలసీమ ) భావవిప్లవం * ( socialist )


6.కారల్ మార్క్స్ - (1818 - 1883) కమ్యూనిజం (చారిత్రిక గతి తార్కిక భౌతిక వాదం)
* (historicl dilectical meterialisom}

7.ఫ్రౌయిడ్ - (1856 - 1939) మనోవిశ్లేషణ (psychoanalysis)

8.లెనిన్ - కమ్యూనిజం (1872 - 1924) * పెట్టుబడిదారి విధానం యొక్క అంత్యదశ సామ్రాజ్యవాదం
* (the last refuge of capitalisum is imperialisom )

9.స్టాలిన్ - కమ్యూనిజం (1879 - 1953) *రాజ్యరహిత సమాజం( stateless country concept )

10.మావొ - (1893 - 1976) *కమ్యూనిజం( సాంస్కృతిక విప్లవం ) (cultural revolution)

5.వేమన : ( 1650 రాయలసీమ ) - భావ విప్లవం


తనకాలపు పరిధిలోనైనా సామాజిక చైతన్య దృష్టితో కవిత్వం చెప్పిన తొలి తెలుగు కవి వేమన్న. అదే దృష్టితో రచన చేస్తున్న ఈనాటి కవులు తమకన్నా పూర్వుల సంప్రదాయాన్ని తెలుసుకోటం ఆరోగ్యకరమే గాక అవసరమని కూడా భావిస్తున్నాం. వెనకటి మంచిని జీర్ణించుకొని కొత్త పరిస్థితులను గుర్తించి ముందు చూపుతో రచనలు చేయటం ఈనాటి రచయితల కర్తవ్యం.
తన కాలాన్ని మించి కొన్ని విషయాల్లో ముందుకు చూడగలిగిన కవిగా వేమన్నను మనం గౌరవించాలి. విగ్రహారాధనను వ్యతిరేకించాడు. శైవ వైష్ణవ మతాలవారి ఆర్భాటాలను, వారి దురాచారాలను, మోసాలను బట్టబయలు చేశాడు. చిలుక పలుకుల చదువులను విమర్శించాడు. కాకులకు పిండాలు పెట్టటం వంటి మూర్ఖాచారాలను తీవ్రంగా ఖండించాడు. శ్రమశక్తిలోనే సర్వమూ ఉన్నది అనేంత నిశిత పరిశీలన చెయ్యగలిగిన వేమన్న మామూలు కవికాడు, తనకాలపు చట్రంలో ఇమడని గొప్ప కవి.
వేమన్న రచనా మార్గంలో మూడు అంశాలు గుర్తించవచ్చు. 1.ప్రజలభాషలో ప్రచారంగా ఉన్న పదాలను, మాండలికాలను ప్రయోగించి ప్రజలకు సన్నిహితమైన రచన చెయ్యటం. 2.చెప్పదలచుకున్న భావాన్ని తగిన విస్తీర్ణంలోనే క్లుప్తంగా చెప్పటం. 3.ఊహలోనుంచికాక జీవితం నుంచి ఉపమానాలను ఏరుకోవటం. కవితా దృక్పథం విషయంలో మాత్రమే కాక రచనా విధానంలో కూడా వేమన్న ఆదర్శం నుంచి ఈనాటి కవులు నేర్చుకోవలసింది చాలా ఉందని దృఢంగా భావిస్తున్నాం.
:- చేకూరి రామారావు


వేమన నిక్కమైన ప్రజాకవి
ఆయన పండితుల కోసం రాయలేదు.
పల్లెసీమల్లోని నిరక్షరాస్యులెైన అకృత్రిమ పామర జనం కోసం రాసాడు.ఆయన పొందిన లోకప్రియత ఆయన కవితాశక్తివల్ల,ఉపదేశ విశిష్టతవల్ల కలిగిందే!
:-హోవర్డ్ క్యాంబెల్ క్రెైస్తవ మిషనరి (క్రీశ 1859-1910)

చారిత్రక గతిని నిర్దేశించిన తాత్వికుల్లో వేమన ఒక్కడు.
సమాజం వసుదైక కుటుంబం యొక్క నమూన. సమాజంతో మమేకమై, కాలచక్రపరిధిని దాటి ఆలోచించాడు,సమాజానికి ఒక నూతన మార్గాన్శి  చూపించాడు (భావ విప్లవం ) . 
:- చింతా రామమోహన్ BA.,( SDE Rtd BSNL)


గమనిక : పద్యవివరణ తదుపరి చేర్చబడును
 (నాల్గవ పాదం "విశ్వదాభిరామ వినురవేమ"అని భావించ వలెను)

21.మంట,లోహమందు,మాకుల, శిలలందు
పటము గోడలందు ప్రతిమలందు
తన్నుదెలుసు కొరకు తగలదా పరమాత్మ?

20.జీవ,లింగ పూజ సేసిన వారికి
శిలల రూపమందు చింతయేల?
చెలగి మధువు గ్రోల చేదు రుచించునా

19.పాప పుణ్యములను పసికాపెరుంగునా
ధరను పరమయోగి యెరుగుగాక
లోని పొందికె గని లోహముల్ గూర్పరో

18.పచ్చవిల్తు చేత గ్రచ్చర జనులెల్ల
తచ్చనాడ బడిరి ధరణిలోన
కులజుడెవ్వడిందు కులహీనుడెవ్వడు ?


17.అధికమైన యజ్ఞమల్పుండు తాజేసి
మొనసి శాస్త్రము విడి మురుపు దక్కు
దొబ్బ నేర్చు కుక్క దుత్తలు మోసునా
నిపుణుడు చెయ్వాల్సిన పనిని నికృష్టుడు చెయ్యరాదని వేమన సందేశం


16.ప్రభువు కోతియైన ప్రగడలు పందులు
సైనికుండు పక్కి,సేన పసులు
ఏన్గులశ్వచయము లెలుకలు,పిల్లులు

15.పెట్టినంత ఫలము పెక్కండ్ర కుపహతి
చేయకున్న తాను చెరపకున్న
పెండ్లి చెయునట్టి  పెద్దఫలంబురా

14.గతము చేసినట్టి కర్మ బంధములన్ని 
పరిసిపోవు సత్యగురుని వలన
కుమ్శరికొక యేడు గుదియకు నొకనాడు

13.పుట్టు దుఃఖమునను,పొరలు దుఃఖమునను
గిట్టు దుఃఖమునను ,క్రింద జనును
మనుజ దుఃఖము వలె మరి లేదు దుఃఖంబు

12.మెలత నడవి నుంచి మృగము వెంటనెపోయె
రామచంద్రుకన్న రసికుడేడి?
చేటుకాలమునకు చెడుబుద్ధి పుట్టును

11.సతికి పతికినైన సంపద సంపదె
పుత్ర సంపదలును భువిని మేలు
సరగ ముదిసి బ్రతుకు సంపద సంపద

10.తనకు లేనినాడు దెైవము దూరును
తనకు కలిగెనేని దెైవమేల
తనకు దైవమునకు తగులాటమే శాంతి

9.కడుపు చిచ్చు చేత కామానలము చేత
క్రోధ వహ్ని చేత కుటిల పడక
ఒక్క మనసు తోడ నుండినపుడె ముక్తి

8.భూమిలోన పుణ్యపురుషులు లేకున్న
జగములేల నిలుచు పొగులుగాక
అంత తరచు దొరక రాడనాడను గాని

7.తిర్రివాని మిగుల దీవించగా రాదు
వెర్రివాని మాట వినగరాదు
వెర్రికుక్క బట్టి వేటాడవచ్చునా

Jan 30, 2017

05.Voyage of my life (My memories) నా జీవనయానం

  Voyage of my life (My memories)
                    నా జీవనయానం (స్వీయ జీవిత చరిత్ర)

Sep 5, 2016

1.Photo of this weekJan 8, 2015

2.Amaravati Stupa CONCEPT( development of human relations and human resources )

Jan 7, 2015

3.తెలుగు సాహిత్యం యుగ విభజన

నాగరిక జాతి మాతృభాషలోనే మాట్లాడుతుంది

తెలుగు సాహిత్యం కాలరేఖ
------------------------
నన్నయ యుగము-1000 - 1100
శివకవి యుగము-1100 - 1225
తిక్కన యుగము-1225 - 1320
ఎఱ్ఱన యుగము-1320 – 1400
శ్రీనాధ యుగము-1400 - 1500
రాయల యుగము-1500 - 1600
దక్షిణాంధ్ర యుగము-1600 - 1775
క్షీణ యుగము-1775 - 1875
ఆధునిక యుగము-1875 – 2000
21వ శతాబ్దితెలుగు సాహిత్యం కాలరేఖ

CONCEPT ( development of human relations and human resources )

Jan 6, 2015

4.A)తెలుగు - సౌందర్యం - సాహిత్య కళారూపాలు ( కీర్తనలు )


1.అన్నమయ
|| తందనాన ఆహి తందనాన పురె |తందనాన భళా తందనాన ||
బ్రహ్మ మొకటే పరబ్రహ్మ మొకటే |పరబ్రహ్మ మొకటే పరబ్రహ్మ మొకటే ||

|| కందువగు హీనాధికము లిందు లేవుఅందరికి శ్రీహరే అంతరాత్మ |
ఇందులో జంతుకులమింతా నొకటే |అందరికి శ్రీహరే అంతరాత్మ ||


|| నిండార రాజు నిద్రించు నిద్రయు నొకటే |అండనే బంటునిద్ర అదియు నొకటే |
మెండైన బ్రాహ్మణుడు మెట్టుభూమి యొకటే |చండాలు డుండేటి సరిభూమి యొకటే ||


|| అనుగుదేవతలకును అలకామ సుఖమొకటే |ఘనకీట పశువులకు కామ సుఖమొకటే |
దినమహో రాత్రములు తెగి ధనాఢ్యునకొకటే |వొనర నిరుపేదకును వొక్కటే అవియు ||


|| కొరలి శిష్టాన్నములు గొను నాకలొకటే తిరుగు దుష్టాన్నములు తిను నాకలొకటే |
పరగ దుర్గంధములపై వాయువొకటే వరుస బరిమళముపై వాయువొకటే ||


|| కడగి యేనుగు మీద గాయు యెండొకటే |పుడమి శునకము మీద బొలయు నెండొకటే |
కడు బుణ్యులను బాప కర్ములను సరిగావ |జడియు శ్రీ వేంకటేశ్వర నామమొకటే ||

4.B)తెలుగు - సౌందర్యం - సాహిత్య కళారూపాలు ( వ్యాసాలు )

భాష్యతే ఇతి భాషా 

http://manatelugunela.com/

భాషించబడేది భాష. కోట్లాది జీవరాసులున్నయీ ప్రపంచములో మాట్లాడగలిగిన శక్తివున్న ఏకైక ప్రాణి "మానవుడు". తన మనస్సులోని ఆలోచనలను, అభిప్రాయాలను బహిర్గతం చేయటానికి మానవుడు తన నోటిద్వారా చేసే ధ్వనుల సముదాయమే "భాష". మానువులందరికీ ఉమ్మడి సొత్తు భాష. అలాగే తెలుగు భాష తెలుగు ప్రజల ఉమ్మడిసంపద!

4.C)తెలుగు - సౌందర్యం - సాహిత్య కళారూపాలు ( పద్యాలు )


పద్యాలు
  • ఉప్పుగప్పురంబు న్రొక్కపోలికనుండు,
  • చూడచూడ రుచుల జాడవేరు,
  • పురుషులందు పుణ్య పురుషులువేరయ,

Nov 12, 2014

6.WORLD HERITAGE( Amaravati Stupa GUNTUR)

పురావస్తు భారత దేశం
అమరావతి   ( గుంటూరు జిల్లా )
 AMARAVATHI STUPA
 CONCEPT
( development of human relations and human resources )

Aug 6, 2014

7.PHOTOSWONDER ROSE       CONCEPT
 ( development of human relations and human resources )

Jul 13, 2014

8.వ్యాసావళి

Sep 15, 2012

10.స్వీయ చరిత్ర
నా జీవన యానం 
స్వీయ చరిత్ర
 చింతా . రామమోహన్

Sep 12, 2012

11.ఇంగ్లీష్ పద్య మరియు గద్య రచన (ENGLISH POEMS AND PROSE)

1.Leo Tolstoy 


Preview
2.Leo Tolstoy, Tolstoy also spelled Tolstoi, Russian in full Lev Nikolayevich, Count (Graf) Tolstoy (born Aug. 28 [Sept. 9, New Style], 1828, Yasnaya Polyana, Tula province, Russian Empire—died Nov. 7 [Nov. 20], 1910, Astapovo, Ryazan province), Russian author, a master of realistic fiction and one of the world’s greatest novelists.

Sep 8, 2012

12.స్త్రీ - భావన

చలం
 
స్త్రీ - చలం  చేసినంత ఆలోచన ఇంకా ఎవరు చేయలేదు.( స్త్రీ - స్వేచ్చా - బాధ్యత, చలం దృష్టి లో  విడదీయరాని అంశాలు )   

Aug 21, 2012

13.సాహిత్యం - చర్చ


సాహిత్యం - చర్చ
మహాభారతంలో లేనిదేదీ లేదని అంటారు.
ధర్మేచా ర్ధేచ కామేచ మోక్షేచ భరతర్షభ
యదితిహాస్తి తదన్యత్ర యాన్నేహాస్తి నతత్క్వచిత్.
తిక్కన గారుఈ శ్లోకాన్న్ని తెలుగులో చక్కని తేటగీతంగా చెప్పారు.
“అమల ధర్మార్థ కామ మోక్షముల గురిచి,
యొలయు తెరువెద్దియును నిందు గలుగునదియు,
యొండెడల గల్గు దీనలేకుండ చొప్పు,
దక్కొకంటను లేదు వేదజ్ఞులార,”

Mar 16, 2012

16.ది బైబిల్ (THE BIBLE)


The Bible

బైబిల్ క్రైస్తవ మతం యొక్క పవిత్ర గ్రంథం. క్రైస్తవులు ఇందులో దేవుని పలుకులు ఉన్నాయని భావిస్తారు. బైబిలుకు అనేక పేర్లు ఉన్నాయి. కొందరు పవిత్ర గ్రంథమని, పవిత్ర నిబంధనమని లేదా పరిశుద్ధ గ్రంథమని పిలుస్తారు. బైబిలు మొదట హీబ్రూ, ఆరామిక్ మరియు గ్రీకు భాషలలో రాయబడింది. ఆ తరువాత లాటిన్ ఇంకా తదితర భాషలలోకి అనువదించబడింది. ఇప్పుడు బైబిల్ 2000 కు పైగా భాషలలోకి అనువదించబడింది.
బైబిలు అనే పదం గ్రీకు భాషలోని బిబ్లియోన్ అనే పదానికి బహువచన రూపమైన "బిబ్లియ" నుండి వచ్చింది. బబిల్లో రెండు భాగాలున్నాయి. పాత నిబంధన లో 39,కొత్త నిబంధన లో 27 కలిపి మొత్తం బైబిల్లో 66 పుస్తకాలున్నాయి. బై బిలు వ్రాయడానికి 1400 సంవత్సరాలు పట్టినది. సుమారు క్రీస్తు పూర్వం 1800 సంవత్సరం లో, అనగ వేద కాలం ఆరంభంలో బైబిలు రచించుట మొదలైనది. నలబై మంది ప్రవక్తలు, వివిధ కాలాల్లో ఈ మహా గ్రంధాన్ని రచించారు.
1 పాత నిబంధన
2 కొత్త నిబంధన
3 కేథలిక్కు బైబిల్
4 తెలుగులో బైబిలు

Oct 30, 2011

17.గుర్రం జాషువా (1895-1971) కవి

గుర్రం జాషువా (1895-1971) కవి

కుల మత విద్వేషంబుల్ తలసూపని తావులే కళారాజ్యంబుల్ 
కళ లాయుష్మంతములై యలరారెడు నెలవు స్వర్గమగు చెలికాడా!
చక్కని కవితకు కులమే యెక్కువ తక్కువలు నిర్ణయించినచో నిం
కెక్కడి ధర్మము తల్లీ? దిక్కుం జరవేదికా ప్రతిష్టిత గాత్రీ -
నా కవితావధూటి వదనంబు నెగాదిగ జూచి రూ
రే ఖా కమనీ వైఖరులు గాంచి 'భళిభళి'! యన్నవాడె మీ
దే కులమన్న ప్రశ్న వెలయించి చివాలున లేచిపోవుచో
బాకున గ్రుమ్మినట్లగును పార్థివచంద్ర! వచింప సిగ్గగున్


Sep 21, 2011

18.మంచి మాట - Quotes by Famous Author

First learn the meaning of what you say, and then speak.Epictetus

 Always do what you are afraid to do. Ralph Waldo Emerson

Sep 7, 2011

19.సూక్తులుAug 31, 2011

20.చారిత్రిక గతిని నిర్దేశించిన తాత్వికులు (philosophers who dictates the historical dialectical world )

          సమాజం వసుదైకకుటుంబం యెక్క నమూన. తాత్వికులు సమాజం తో మమేకమై వారి కాలచక్రపరిధిని దాటి ఆలోచించారు .  సమాజానికి నూతనమార్గాన్ని నిర్దేశించారు .
"There are no facts, only interpretations."- Friedrich Nietzsche (1844-1900)
SLIDE SHOWఅజ్ఞానపు టంధయుగంలొ ఆకలిలొ,ఆవేశంలో తెలియని ఏ తీవ్రశక్తులో నడిపిస్తే నడిచి మనుష్యులు అంతా తమప్రయోజకత్వం తామేభువికధినాధులమని స్థాపించిన సామ్రాజ్యాలునిర్మించిన క్రుత్రిమ చట్టాలు ఇతరేతర శక్తులు లేస్తే పడిపోయెను పెకమేడలై పరస్పరం సంఘర్షించినశక్తులతో చరిత్ర పుట్టెను.
***
నేను సైతం ప్రపంచానికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను
నేను సైతం విశ్వ వ్రుష్టికి అశృఉవొక్కటి ధారవోసాను
నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక పిచ్చి మొసానూ

Aug 27, 2011

22.నాకవితలు

నాకవితలు by Ch.RamaMohan,BA.,
శ్రీ శ్రీ

మహాకవి మరణించలేదు - నాహృదిలో ఉదయించినాడు

కూలివాని గుండెలొ ఆవేదన ఉందని

కార్మికుని కడుపులో ఆకలి రగిలందని

కలంపట్టి వ్రాసిన మాకవి మహాకవి శ్రీ శ్రీ

మహాకవి మరణించలేదు - నాహృదిలో ఉదయించినాడు

దోపిడిదారుల దురంతాలు సాగవని

పీడకుల పాలన మాకిక వద్దని

గళం ఎత్తిపాడిన మాకవి మహాకవి శ్రీ శ్రీ

మహాకవి మరణించలేదు - నాహృదిలో ఉదయించినాడు

దగాపడ్డ తమ్ములార ఏకంకండని

మోసపోక యికనైనా మేలుకొండని

మాకు పిలుపునిచ్చిన మాకవి మహాకవి శ్రీ శ్రీ

మహాకవి మరణించలేదు - నాహృదిలో ఉదయించినాడు
***

Jul 28, 2011

23.తాత్విక చింతనSocrates Louvre.jpg

ఇట నస్ప్ర్సశ్యత సంచరించుటకు తావే లేదు;విశ్వంభరా 

నటనంబున్ గబళించి గర్భమున విన్యస్తంబు గావించి యు

త్కటపుం బెబ్బులి తోడ మేకనోకప్రక్కన్ జేర్చి జోకొట్టి యూ
ఱట గల్పించు నభేదభావమును ధర్మంబిందు గారాడెడిన్

- జాషువ

Jun 22, 2011

24.GENERAL KNOWLEDGE50 REASONS TO READ BOOKS

1. Books help to feel more confident.
2. Books help to travel around the world in the cheapest way.
3. Books develop your personality.
4. Books provide food for thought.
5. Books make you laugh and think.
6. Books draw you towards perfection.
7. Books stimulate creativity.
8. Books bring out writing talent.
9. Books help in communicating.
10. Books clear your vision.
11. Books satisfy your curiosity.
12. Books help you make more choices.
13. Books help you build literary talent.
14. Books do not require any special device to teach.
15. Books increase your attention span.
16. Books are fruitful pastime.
17. Books can be used anytime, anywhere.
18. Books provide entertainment, when others fail.
19. Books make you powerful.
20. Books help you know the 'Whys' and 'Hows' of everything.
21. Books help you to create and spread fun.
22. Books help you travel across time intelligently.
23. Books keep you updated with facts and figures.
24. Books spread love, affection and knowledge.
25. Books make the best of friends.
26. Books take you to intellectual environment.
27. Books help you feel the world around you.
28. Books entertain your mind.
29. Books broaden your horizon.
30. Books bring Nature to your doorstep.
31. Books bring about a 'personality change'.
32. Books increase comprehension.
33. Books do not require company.
34. Books are stress-busters.
35. Books develop a sense of belonging to people around you.
36. Books provide mental and physical relaxation.
37. Books act as a communication tool.
38. Books are intellectually satisfying activity.
39. Books provide spiritual experience.
40. Books provide emotional strength.
41. Books build your self-esteem.
42. Books help and encourage your imagination to soar.
43. Books make you smarter and wiser.
44. Books help you grow.
45. Books take you to a 'world of dreams'.
46. Books can change your life and vision.
47. Books help in achieving 'life goals'.
48. Books develop wonderful experience.
49. Books transform lives.


50. Books inspire, books motivate, books build nations

GENERAL KNOWLEDGE-ANDHRA PRADESH

Pingali VenkayyaAlluri Sita Rama Raju – revolutionary, led the Rampa Rebellion
Komaram Bheem – revolutionary, fought for liberation of Hyderabad
Potti Sreeramulu – revolutionary, fasted to death in protest
N. G. Ranga – freedom fighter
Tanguturi Prakasam – known as Andhra Kesari
Kaloji Narayana Rao – freedom fighter
Swami Ramanand Tirtha – educator and social activist
Puchalapalli Sundaraiah – founding member of Communist Party in India
Makhdoom Mohiuddin – revolutionary poet
Makineni Basavapunnaiah – Indian Communist leader
Madapati Hanumantha Rao – first mayor of Hyderabad
Koratala Satyanarayana – Communist politician
Vuyalavada Narasimha Reddy – freedom fighter, early opponent of British rule
Vavilala Gopalakrishnaya – freedom fighter
Kaneganti Hanumanthu – freedom fighter
Kalluri Chandramouli – freedom fighter
Veerapandiya Kattabomman – Palaiyakkarar, early opponent of British rule
Gottipati Brahmaiah – freedom fighter
Sarojini Naidu – freedom fighter and poet
Kasinadhuni Nageswara Rao – politician
Raavi Narayana Reddy – freedom fighter
Raja Sri V R G K M Prasad – Member of Legislative Assembly, infrastructure creation in India.
Yeduguri Sandinti Rajasekhara Reddy - Former chief minister of Andhra Pradesh
Nara Chandrababu Naidu - President of Telugudesam Party and Ex-Chief Minister of AndhraPradesh

Presidents and Prime-Ministers and Speakers

Malik Maqbul – Wazir of Delhi Sultan Feroz Shah Tughlaq
Sarvepalli Radhakrishnan, President of India May 13, 1962 to May 13, 1967
Zakir Hussain, President of India May 13, 1967 to May 3, 1969
V. V. Giri, President of India May 3, 1969 to August 24, 1974
Neelam Sanjiva Reddy, President of India July 25, 1977 to July 25, 1982
P. V. Narasimha Rao, Prime Minister of India June 21, 1991 to May 16, 1996
G. M. C. Balayogi, Speaker of 10th Lok Sabha 1998 to 2002
Madabhushi Ananthasayanam Ayyangar – Speaker in Parliament

Apr 6, 2010

25.ఆరోగ్య సూత్రాలు Health Tips


HEALTH TIPS - Collected By Ramamohan .Ch

1.ప్రకృతిని మించిన గురువు - అనుభవాన్ని మించిన పాఠం లేవు
2.వేకువ జామునే లేవడం
3.పరగడుపున ఎక్కువ మంచినీరు మంచిది
4.సుఖవిరొచనం పై మనస్సు మంచిది
5.నడక ఆసన ప్రాణాయామాలు మంచిది
6.చమటపడితేనే తినడం మంచిది
7.ఉదయం చన్నీళ్ళు తలకు మంచిది
8.సబ్బులు షాంపూలు మాను
9.పూరీలు దోశలు మాను మొలకెత్తిన విత్తనాలు మంచిదను
10.పచ్చికొబ్బరి సంపూర్ణాహారం
11.తినేటప్పుడు అరగంటముందు లీటరు నీరు మంచిది
12.రాత్రి మాని ఉదయం తినడం మంచిది
13.ముడిబియ్యం మంచిది
14.కూరలు తొక్కలు తీయడం మాను
15.కూరలు ఉడకనివ్వడం మంచిది
16.పచ్చికూరలు మంచిది
17.భోజనం మనస్సు పెట్టితినడం మంచిది
18.అన్నం తక్కువ కూరలు ఎక్కువ తినాలి
19.ఆహారాన్ని పదేపదే నమలడం మంచిది
20.నీరు భోజనం అరిగాక త్రాగడం మంచిది
21.రాత్రి గాఢ నిద్ర మంచిది
22.నాటు పళ్ళు తినడం మంచిది
23.పళ్ళు రోగ నిరోధానికి మంచిది
24.రసాలు త్రాగడం మాను తినడం మంచిది
25.ఫాను ఎ సి లు మాను చెమటపడితె ఆరోగ్యానికి మంచిది
26.విరేచనం 3 4 సార్లు అవడం మంచిది
27.రెండుపూటల స్నానం మంచిది
28.పొద్డు ఉండగానే భోజనం మంచిది
29.ఎండ తగలడం రోగ నిరోధానికి మంచిది
30.శ్రమకు తగిన తిండి మంచిదను
31.అరిగాక పదుకోవడం మంచిది
32.పళ్ళు కూరలకు గాలి వెలుతురు మంచిది
33.రోజు 6 లీటర్ల నీరు మంచిది
34.ఉప్పు మాను ఆహారం లో ఉన్న ఉప్పే ఆరోగ్యానికి మంచిది
35.తేనె మంచిది
36.చింతపండు మాను పచ్ఛి చింతకాయ మంచిది
37.పచ్ఛి మిర్చి మంచిది
38.నూనె నేయి మాను
39.మషాళాలు మాను
40.సాత్విక భోజనం మంచిది
41.మనిషి అడుపులో రుచి మంచిది
42.ఉపవాసం మంచిది
43.అసంతృప్తి మాని తృప్తి ఆరోగ్యనికి మంచిది
44.కోపం ఈర్ష్య చిరాకూలు మాని శాంతం ఆరోగ్యానికి మంచిదను
45.మనపని మనమే చేసుకోవడం మంచిది
46.ప్రకృతి విధానాన్ని జీవన విధానం అనడం మంచిది