01.11.తాత్వికులు - భావనలు శేషప్ప కవి

01.11. తాత్వికులు - భావనలు 🌐

శేషప్ప కవి

సీ|| పాంచభౌతికము దుర్భరమైన కాయం బిందెప్పడో విడుచుట యెఱుకలేదు,
శతవర్షములదాఁక మితముఁ జెప్పిరి కాని,

నమ్మరాదా మాట నెమ్మనమున బాల్యమందో;
మంచి ప్రాయమందో, లేక

ముదిమియందో, లేక ముసలియందొ,

యూరనో, యడవినో, యుదకమధ్యముననో,
యెప్పుడో యేవేళ నే క్షణంబొ?

తే|| మరణమే, నిశ్చయము, బుద్ధిమంతుఁడైన
దేహ మున్నంతలో మిమ్ముఁ దెలియవలయు,
భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!

భావం

ఈ పంచభూతాలతో నిర్మితమైన శరీరం ఎప్పుడు విడిచి పోతుందో ఎవరికీ తెలియదు. మనిషి వంద సంవత్సరాలు బ్రతుకుతాడని అంటారు గాని, అది నమ్మదగిన మాట కాదు.

బాల్యంలోనా, యౌవనంలోనా, వృద్ధాప్యంలోనా, ఇంటిలోనా, అడవిలోనా, నీటిలోనా – మరణం ఎప్పుడు, ఏ క్షణంలో వస్తుందో తెలియదు.

అందువల్ల బుద్ధిమంతుడు దేహం ఉన్నంతలోనే జీవన సత్యాన్ని తెలుసుకోవాలి.

నరసింహ శతకము

శ్రీ నరసింహ శతకము తెలుగు శతక సాహిత్యంలో ప్రముఖమైనది. ఈ శతకమును రచించినది కరీంనగర్ జిల్లా ధర్మపురికి చెందిన శేషప్ప కవి.

ఈ పద్యాలన్నీ క్రింది మకుటంతో అంతమవుతాయి:

భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!
దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

CONCEPT ( development of human relations and human resources )