CONCEPT

భావన

బాలుర నైతిక శారీరక శిక్షణా శిబిరం

CONCEPT

 బాలుర నైతిక శారీరక శిక్షణా శిబిరం

 ( development of human relations and human resources )



బాలుర నైతిక శారీరక శిక్షణా శిబిరం
D no 13-3-106 ward no 3,1వ లైను కృష్ణనగర్ guntur 522006

10 to 18 సం బాలురు అర్హులు
బాలురును ఉత్తమ పౌరులుగా తీర్చి దిద్దుటకై నైతిక, ధార్మిక శిక్షణ ఇవ్వబడును
అనుభవజ్ఞలైన వ్యాయమ శిక్షకులు చే శిక్షణ ఇవ్వబడును

ప్రాణాయామం 
ఆరోగ్య సూత్రాలు
విలువలతో కూడిన జీవన విధానం
క్రమశిక్షణాయితమైన దినచర్య
దేశభక్తి 
నైతిక విలువలు
జనరల్ నాలెడ్జి
ఇంగ్లీష్ గ్రామర్
మహాపురుషుల జీవిత చరిత్రలు
కర్ణాటక సంగీతం (basics)

పిల్లల మంచి భవిష్యత్తు కోసం శిబిరం లో చేర్పించండి 



సంపాదకీయం 19-4-24

శరీరానికి కావలిసినవి సప్లిమెంట్స్ 
ప్రోటీన్
ప్రోబయోటిక్
ఫైబర్
మల్టీ విటమిన్స్ and మల్టీ మినరల్స్
Omega3

అజ్ఞానమే అనారోగ్యానికి మూలం 

90% జబ్బులు
ఆహార నియమాలతో,
ప్రకృతి వైద్యం తో నయమవుతాయి

మోకాళ్ళ నొప్పులు నివారణకు
బరువు (obesity), తగ్గుటకు
మరియు కొన్ని దీర్ఘకాలిక వ్యాధుల నివారణకు 

100 days programme పెట్టుకోండి 

 (Required BMI 18.5 to 25)

Resons
Stress
Fat
Water (bad water ) in body 
  • టీ,కాఫీ, నాన్వెజ్ నిషిద్ధం
  • 2 నుండి 5 km నడక
  • Exersises
  • వదులుగా వస్త్రాధారణ
  • Boots వాడకం
  • ఉదయం 0600am వేడి నీరు త్రాగాలి క్రింది వాటితో రోజుకొక్కటి (పసుపు/జీర/వాము /సోంపు /అల్లం /చెక్క /నిమ్మ/బార్లీ )
  • ఆహారం 5 సార్లు గా కొద్దిగా కొద్దిగా 
  • 1.టిఫిన్ 0800 am
  • 2.స్నాక్స్ 1100 am
  • 3.భోజనం 250 గ్రామలు 0100 pm  (depend on req Calories-    ) {పులిహోర /వెజిపలావ్ /పెరుగన్నం /రాగిముద్ద /రైస్ }
  • 4.స్నాక్స్ 0400 pm
  • 5.టిఫిన్ 0700 to 0900 pm(1. చపాతీ 2. పెసరదోశ 3. రాగిదోశ 4. ఇడ్లీ 5. జొన్నరొట్టె మొదలైనవి రోజుకొకటి 7 రోజులు
  • ధ్యానము 0900 pm
  • Sleep 10 Pm to 04.00Am

  • పెరుగు బదులు మజ్జిగ వాడవలెను 
  • పాలు వాడరాదు
  • షుగర్, షుగరితో చేసినవి తినకండి
  •  జలుబు కఫమ్ మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి 
  • ఆరోగ్యమే మహాభాగ్యం
  • మొండివ్యాధులు నయంకావాలంటే 
  • ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే
  •  క్రమశిక్షణ అవసరం
  • రక్తశుద్ధికై ఆహారం పట్ల శ్రద్ధ 
  • జీర్ణవ్యవస్థ శుభ్రంగా ఉంచుకోవాలి
  • శరీరానికి వ్యాయామం 
  • ఆకలైతేనే తినాలి
  • ఆహారం తీసుకోకపోతే బరువు పెరుగుతారు 
  • పై నియమాలు పాటించాలి 

What is obesity?

Obesity is a chronic, but treatable, disease associated with excess weight. For people living with obesity, there is more to weight management than just the pounds we can see.

People with a body mass index (BMI) greater than or equal to 30 are usually considered to have obesity. Obesity can have a negative impact on your health. But there’s good news: weight loss may improve some weight-related conditions.

Knowing your BMI is a great first step when starting the conversation about weight management with a health care provider

CONCEPT ( development of human relations and human resources )

భారత రాజ్యాంగం


భారత రాజ్యాంగం - భారత దేశానికి సర్వోత్కృష్ఠ చట్టం. భారత రాజ్యాంగం ద్వారా భారత దేశానికి గణతంత్ర ప్రతిపత్తి వచ్చింది. 1950 జనవరి 26న భారత రాజ్యాంగాన్ని అమలుపరిచిన తరువాత స్వతంత్ర భారతదేశం సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించింది. ప్రతి సంవత్సరం ఆ రోజును గణతంత్ర దినంగా జరుపుకుంటారు. భారత ప్రభుత్వ నిర్మాణం ఎలా ఉండాలి, పరిపాలన ఎలా జరగాలి అనే విషయాలను రాజ్యాంగం నిర్దేశించింది. శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థల ఏర్పాటు, ఆయా వ్యవస్థల అధికారాలు, బాధ్యతలు, వాటి మధ్య సమన్వయం ఎలా ఉండాలో కూడా నిర్దేశిస్తోంది.

రాజ్యాంగం

(సంగ్రహం)
CONCEPT ( development of human relations and human resources )

తెలుగు సాహిత్యం నుడికారం

నుడికారం

పలుకుబడి అంటే ఒకప్రాంతo లోని యాసలో ఉపయోగించే పదం,నుడికారం అంటేఒకప్రాంత ప్రజల అనుభవం నుండి పుట్టిన మాట చమత్కారం,విసేష పదం.జాతియం అంటే ఒకమాట ప్రత్యేక అర్త్దంలో ఉపయోగించడం అన్నమాట. 

    చెప్పదలుచుకున్న భావాన్ని మనసుకు హత్తుకొనే విధంగా చెప్పడానికి మనం "నుడికారాలు ప్రయోగిస్తాం. "జాతీయం అంటే విశిష్ట పద బంధం.భాష కేవలం భావ వ్యక్తీకరణ కే కాక మనోరంజన సాధనంగా మార్చినపుడు అది కళగా మారుతుంది.ఆవిధంగా భాష కళగా మారాలంటే అది సాధారణంగా కాక చమత్కారంగా,నిగుడార్ధం వచ్చేటట్లు ఉండాలి.అలా ఉండడానికి దోహదం చేసే అంశాలే పలుకుబళ్ళు,నుడికారాలు,జాతీయాలు.ఇవన్ని భాషకు మాత్రమే సాధ్యం.అందుకే అవి భాషకు అలంకారాల వలె ,ఏంతో  సొగసును యిస్తాయి.

హృదయంగమంగా


CONCEPT ( development of human relations and human resources )

చరిత్ర -స్త్రీల పాత్ర 15-2-24

గార్గి వాచక్నవి (సంస్: गार्गी वाचक्नवी ( దేవనాగరి ); గార్గి వాచక్నవి, ఒక ప్రాచీన భారతీయ ఋషి మరియు తత్వవేత్త . వేద సాహిత్యంలో , ఆమె గొప్ప సహజ తత్వవేత్తగా గౌరవించబడింది ,ప్రసిద్ధ వేదాలను వివరించేది, మరియు బ్రహ్మవాదిని అని పిలుస్తారు , బ్రహ్మ విద్య యొక్క జ్ఞానం ఉన్న వ్యక్తి. బృహదారణ్యక ఉపనిషత్‌లోని ఆరవ మరియు ఎనిమిదవ బ్రాహ్మణంలో , విదేహ రాజు జనకుడు నిర్వహించిన బ్రహ్మయజ్ఞం అనే తాత్విక చర్చలో ఆమె పాల్గొంటున్నందున ఆమె పేరు ప్రముఖమైనది మరియు ఆమె ఆత్మ (ఆత్మ) సమస్యపై గందరగోళ ప్రశ్నలతో యాజ్ఞవల్క్య మహర్షిని సవాలు చేసింది. ) ఆమె ఋగ్వేదంలో అనేక శ్లోకాలు వ్రాసినట్లు కూడా చెబుతారు . ఆమె తన జీవితమంతా బ్రహ్మచారిగా కొనసాగింది మరియు సాంప్రదాయ హిందువులచే పూజించబడింది . (సశేషం) CONCEPT ( development of human relations and human resources )

మనిషి - తత్త్వం

మనిషి - తత్త్వం

ఎక్కడి మానుష జన్మం

ప|| ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమే మున్నది | నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను ||

చ|| మరవను ఆహారంబును మరవను సంసార సుఖము | 
మరవను యింద్రియ భోగము మాధవ నీ మాయ ||
మరచెద సుఙ్ణానంబును మరచెద తత్త్వ రహశ్యము | మరచెద గురువును దైవము మాధవ నీ మాయ ||

చ|| విడువను పాపము పుణ్యము విడువను నా దుర్గుణములు | 
విడువను మిక్కిలి యాసలు విష్ణుడ నీమాయ |
విడిచెద షట్కర్మంబులు విడిచెద వైరాగ్యంబును | విడిచెద నాచారంబును విష్ణుడ నీమాయ ||

చ|| తగిలెద బహు లంపటముల తగిలెద బహు బంధముల | 
తగులను మోక్షపు మార్గము తలపున యెంతైనా |
అగపడి శ్రీ వేంకటేశ్వర అంతర్యామివై | నగి నగి నను నీవేలితి నాకా యీమాయ ||

భారత దేశంలో చార్వకుల నుండి బౌద్ధుడు, సామ్రాట్ అశోక చక్రవర్తి , సంత్ కబీర్, సావు మహారాజ్ నుండి పూలే --అంబేడ్కర్ --పెరియార్   మహనీయుల చరిత్ర,సందేశాలు భారత దేశం గతితార్కిక చారిత్రక భౌతికవాదం.


Happy living is best living
Rich or poor
Alone or together

**నా కవిత**

బుద్దుడు
 సకలం
 పరిత్యజించిన

సోక్రటిస్
సత్య శోధన కై
హలం గ్రహించిన

స్పోర్టకస్ తిరుగుబాటుతో 
చరిత్రకు
పాఠాలు నేర్పిన

జీసస్
వీరు ఎమి చేయుచున్నారో
వీరు ఎరుగరని
సిలువను
రక్తసిక్తం చేసిన

వేమన
భావ విప్లవానికే 
భాష్యం చెప్పిన

ఫ్రాయిడ్ 
మానసిక ఋగ్మతలను
 పటాపంచలు చేసిన

మార్క్స్ చరిత్ర గతిని
నిర్దేశించిన

లెనిన్
పెట్టుబడిదారుల
గుట్టు విప్పిన (సామ్రాజ్యవాదం)

స్టాలిన్
Stateless country
అని ఉటంకించిన

మావో
సాంస్కృతిక
విప్లవావసరాన్ని తెలిపిన

అంబేద్కర్ భరత దేశ
జాతిని నీతిని నిలిపిన

వారు తాత్వికులు
చరిత్రగతిని నిర్దేశించారు
సమాజం వసుదైక
కుటుంబం యొక్క నమూనా
వారు సమాజంతో మమేకమై
కాలాచక్ర పరిధిని దాటి
ఆలోచించారు
సమాజానికి
నూతనమార్గాన్ని నిర్దేశించారు 
-చింతా రామమోహన్ 9492979239

Concept


బుద్ధం శరణం గచ్చామి
దమ్మం శరణం గచ్చామి
సంఘం శరణం గచ్చామి

భావజాలం మనల్ని నడిపిస్తుంది
సత్యం నీలోనే వుంది ఆవిష్కరించుకో
You are only the judge to judge yourself non other 


“One thing only I know, and that is that I know nothing.” – socrates 

సీ|| పాంచభౌతికము దుర్భరమైన కాయం బి0

దెప్పడో విడుచుట యెఱుకలేదు,

శతవర్షములదాఁక మితముఁ జెప్పిరి కాని,

నమ్మరాదామాట నెమ్మనమున(మనస్సున)

బాల్యమందో; మంచి ప్రాయమందో, లేక

ముదిమియందో, లేక ముసలియందొ,

యూరనో, యడవినో, యుదకమధ్యముననో,(నీటి )

యెప్పుడో యేవేళ నే క్షణంబొ?

తే|| మరణమే, నిశ్చయము, బుద్ధిమంతుఁడైన

దేహ మున్నంతలో మిమ్ముఁ దెలియవలయు,

భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!

నరసింహ శతకము
తెలుగు పద్యంశ్రీ నరసింహ శతకము తెలుగు శతక సాహిత్యంలో ప్రముఖమైనది . ఈ శతకమును రచించినది కరీంనగర్ జిల్లా ధర్మపురికి చెందిన శేషప్ప కవి. ఈ పద్యాలన్నీ

భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!

దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

అనే మకుటంతో అంతమవుతాయి.*

***

బౌద్ధధర్మ మూలసూత్రాలలో సర్వమూ క్షణికమనేది ఒక మూల సూత్రం.ఇది ప్రపంచం దుఃఖమయమనే దాన్ని స్పష్టం చేస్తుంది. పుట్టిన ప్రతివారికీ మరణం తప్పదు. అయినా ఆశలు పెంచుకుంటారు. ప్రపంచంలో దుఃఖం లేకపోవటంగాని, పుట్టిన జీవి మరణించకపోవటమనేది కనిపిస్తే ఎంతో సంతోషం కదా! అని బుద్ధుడు చెబుతాడు. మానవుని శరీరం వయః పరిణామాన్ని అనుసరించి క్షణక్షణం మారుతూ మట్టిలో కలిసిపోతుందనే విషయాన్ని కవి ‘నాల్గు దశల మధ్య నవయుచు నున్నటి’ అని వర్ణించాదృశ్యమాన ప్రపంచంలోని సర్వమూ అనిత్యం 

Business

Net work marketing మంచి business
Group గా బిజినెస్ best
Innovetive గా ఉండాలి

మానవాళిని పునరుద్ధరించే అంశాలు ." “మన ఆలోచనల ద్వారా మనం రూపుదిద్దుకున్నాం; మనం అనుకున్నట్లు అవుతాము. మనస్సు స్వచ్ఛంగా ఉన్నప్పుడు, ఆనందం ఎప్పటికీ వదలని నీడలా అనుసరిస్తుంది. "గతం ఇప్పటికే పోయింది, భవిష్యత్తు ఇంకా ఇక్కడ లేదు.-గౌతమ్ బుద్ధ 

భావజాలం మనిషిని నడిపిస్తుంది మనం మన భావజాలాకానికి లోబడి  నడుస్తుంటాం (భావజాలం గతి తార్కికం). భావజాలాన్ని నవీకరించుకోవాలి ( update చేసుకోవాలి ) మనం విజేతలం కావాలంటే మన భావజాలాన్ని తదనుగుణంగా మార్పు చేసుకోవాలి.

మన ప్రగతి మన విజయం మన భావజాలం మీద ఆధారపడి ఉంటుంది

సరైన దృక్కోణం,మానసికపరివర్తన, భావజాల మార్పు ద్వారా మనం అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చు.

నేర్చి నడతునన్న నేరమి తావచ్చు
ఓర్చి నడతు నన్న ఓర్పు రాదు
కూర్చి నడతు నన్న కూడంగ నియ్యదు
విశ్వదాభిరామ వినురవేమ
నాకంతా తెలుసు అని పని మొదలు పెట్టేవాడు క్రమంగా తన తెలియని తనాన్ని తెలుసుకుంటాడు
సహనశీలి చిరాకు పడవచ్చు
పెద్దనిర్వాహకుడ్ని అనుకొన్న వాడికి కూడ అపజయం ఎదురవుతుంది
క్రియాశీలి కార్యక్రమ విధానంలో ప్రతి అనుభవం నుంచి నేర్చుకోవాలి-వేమన 

.ఆర్థిక సమస్య : Money does'nt matter. ప్రయత్నం చేస్తే వయస్సుతో పనిలేకుండా సంపాదించవచ్చు. Time is money. ఇప్పుడు Information is money. మనం సమాచారం యుగంలో ఉన్నాము. (ఆనందానికి డబ్బుకు సంబంధం లేదు. ఆర్థికంగా బాగా ఉన్నా ఆనందంగా లేనివాళ్లు ఉన్నారు. మనం ప్రకృతిని ప్రేమించాలి. సమాజాన్ని ప్రేమించాలి అక్కడే మనం ఆనందం వుంది. ముందు మనం మానసికంగా మార్పు పొందితేనే ఆనందాన్ని పొందుతాం ) (ఆర్థికంగా ఎదగాలంటే ముందు మానసిక శిక్షణ చాలా అవసరం ) మనం ఆనందంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటాము ఆరోగ్యంగా ఉంటేనే ఆర్థికంగా ఎదుగుతాం.ఆర్థికంగా ఎదగాలి . అనేక మార్గాలలో ఆర్థిక అభివృద్ధి కై వెతకాలి ఉదాహరణ 1. ఉద్యోగం a) ప్రభత్వ b ) ప్రైవేటు  2. వ్యాపారం మనం ఏ ఒక్కరంగానికి పరిమితం కాకూడదు.మనం కొన్ని రంగాలకు పరిమితమనే భావన సరియైనది కాదు.

(యద్భావం తత్భవతి : గీత )

 మనము మనస్సులో ఏదైతే భావిస్తామో అదే జరుగుతుంది 

( విశ్వాసం ఉంటే కొండను కూడా కదిలించవచ్చు. నీవు విశ్వసించగలిగితే విశ్వాసమున్నవానికి ఏదైనా సాధ్యమౌతుంది.(బైబిల్ మార్కు 11: 23)

నీ సక్సెస్ కు అవకాశాలు నువ్వే క్రియేట్ చేసుకో 

పతనానికి పదిహేడు మార్గాలు

 1. బాధ్యతా రాహిత్య స్వేచ్ఛ

2. అనాలోచిత క్రియలు

3. పర నింద

4. ఆత్మనింద

 5. మూఢ ప్రేమ

 6. ఆరోగ్యం పై శ్రద్ధ లేకపోవడం

 7. శారీరక శ్రమ లేకపోవడం

 8.పొదుపు నేర్వకపోవడం

 9. ఇతరులను గ్రుడ్డి గా నమ్మడం

 10. ఇతరులమీద ఆధార పడటం

11. స్వంతభావాలు లేకపోవడం

 12. ఇతరుల (సలహాల) పై ఆధారపడటం

13. మన జీవితానికి మనమే బాధ్యత వహించకపోవడం

14. అనాలోచిత వ్యయాలు

 15. అయాచిత ఆదాయాలకై పాకులాడటం

 16. ప్రయత్న లోపం

 17.అవకాశాలు లేవనే భావన

ప్రపంచంలో నిత్య సంతోషి గాని నిరంతర దుఃఖజీవి గాని ఉండజాలడు కరుణారస ప్రధానమైన ధర్మం జీవనాన్ని కోరుకోవడం అందరకు అవసరం -బుద్ధుడు 
ధ్యానం
మనసు
కేంద్రీకరించడం
ఆలోచనలని నియంత్రించడం
ప్రపంచం. నుండి మనలను వేరుచేసుకోవడం
అంతః సాక్షత్కారం.
శారీరక మానసిక ఆరోగ్యాన్నపొందవచ్చు
Atomic habbits

స్వీయ నీయంత్రణ
Habbits ప్రేరణ
అలవాట్లు మారడం ప్రదేశం మారితే మారతాయి 
లక్ష్యాలకు ఫలితాలకు పొంతన ఉండదు
పద్దతుల వలన లక్ష్యాలు,సాధించగలం 
అలవాట్లు అణువు వంటివి
పదే పదే చేయడం వలన
ఉనికి ధ్రువ పడుతుంది
ఏరకమైన  వ్యక్తిగా మారాలి చిన్న చిన్న విజయాలతో ఋజువు చేసుకోండి
అలవాట్లు ఉనికికి రూపం ఇస్తాయి
అలవాట్లు good and bad score board తయారు చేయండి
( ఇంకా వుంది )
CONCEPT ( development of human relations and human resources )

knowledge



14-3-23

చైత్ర మాసం -- ఉత్తరాయణం -- వసంత ఋతువు
వైశాఖ మాసం -- ఉత్తరాయణం -- వసంత ఋతువు
జ్యేష్ట మాసం -- ఉత్తరాయణం -- గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసం -- ఉత్తరాయణం + దక్షిణాయనం గ్రీష్మ ఋతువు

శ్రావణ మాసం --దక్షిణాయనం -- వర్ష ఋతువు
భాద్రపద మాసం --దక్షిణాయనం -- వర్ష ఋతువు
ఆశ్వయుజ మాసం --దక్షిణాయనం -- శరత్ ఋతువు
కార్తీక మాసం --దక్షిణాయనం -- శరత్ ఋతువు
మార్గశిర మాసం --దక్షిణాయనం -- హేమంత ఋతువు

పుష్య మాసం -- దక్షిణాయనం + ఉత్తరాయణం -- హేమంత ఋతువు
మాఘ మాసం -- ఉత్తరాయణం -- శిశిర ఋతువు
ఫాల్గుణ మాసం -- ఉత్తరాయణం -- శిశిర ఋతువు

మంచి మాట
save soil
sadguru
collection 

ఈ అధిక ప్రోటీన్ కంటెంట్ పోషకాహార లోపాన్ని నివారించడంలో ఫింగర్ మిల్లెట్‌ను చాలా ముఖ్యమైన అంశంగా చేస్తుంది. తృణధాన్యాలు శాకాహారులకు ప్రోటీన్ యొక్క మంచి మూలం, ఎందుకంటే ఇందులో మెథియోనిన్ కంటెంట్ 5% ప్రోటీన్ ఉంటుంది.

రాగి ఖనిజాలకు కూడా చాలా గొప్ప మూలం. ఇది ఇతర తృణధాన్యాలలో కనిపించే కాల్షియం కంటెంట్ కంటే 5-30 రెట్లు మధ్య ఉన్నట్లు కనుగొనబడింది. ఇందులో ఫాస్పరస్, పొటాషియం మరియు ఐరన్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఎముక సాంద్రత మరియు ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కాల్షియం ఒక ముఖ్యమైన భాగం. అందువల్ల, ఫింగర్ మిల్లెట్ ఓవర్-ది-కౌంటర్ సప్లిమెంట్లకు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా ఉంటుంది, ముఖ్యంగా బోలు ఎముకల వ్యాధి లేదా తక్కువ హిమోగ్లోబిన్ స్థాయిల ప్రమాదం ఉన్న వ్యక్తులకు.

యునైటెడ్ స్టేట్స్ నేషనల్ అకాడెమీస్ ప్రచురించిన “ది లాస్ట్ క్రాప్స్ ఆఫ్ ఆఫ్రికా” అనే అధ్యయనం ఫింగర్ మిల్లెట్‌ను సంభావ్య “సూపర్ సెరియల్”గా చూస్తుంది మరియు “ ఫింగర్ మిల్లెట్ పట్ల ప్రపంచం యొక్క వైఖరిని తిప్పికొట్టాలి అన్ని ప్రధాన తృణధాన్యాలలో, ఈ పంట అత్యంత పోషకమైనది." ఉగాండా మరియు దక్షిణ సూడాన్‌లోని ప్రజలు రోజుకు ఒక పూట మాత్రమే భోజనం చేసినప్పటికీ ఆరోగ్యకరమైన, స్ట్రాపింగ్ ఫిజిక్‌లను కలిగి ఉంటారని అధ్యయనం పేర్కొంది మధుమేహం, క్యాన్సర్, బోలు ఎముకల వ్యాధి మరియు మరెన్నో నియంత్రించడంలో సహాయపడే అద్భుతమైన “సూపర్ సెరియల్” గురించి చూద్దాం.

Aచారిత్రక గతిని నిర్దేశించిన తాత్వికులు : బుద్ధుడు

Bచారిత్రక గతిని నిర్దేశించిన తాత్వికులు జీసస్






















చారిత్రక గతిని నిర్దేశించిన తాత్వికులలో జీసస్ ఒకరు మాజం వసుదైక కుటుంబం యొక్క నమూనా తత్త్వవేత్తలు సమాజంతో మమేకమై కాలాచక్ర పరిధిని దాటి ఆలోచించారు సమాజానికి ఒక నూతన మార్గాన్ని చూపించారు.( మానవ సంబంధాలను ఆవిష్కరించిన తాత్వికుడు )
జీసస్ చరిత్ర 
1.జీసస్ కాలము 
2.జీసస్.  కాలంనాటికి ప్రపంచం చరిత్ర 
3.విదేశీ యాత్రికులు
4.పురావస్తు ఆధారాలు
5.శాసనాలు
6.నాణెములు 
7.సాహిత్యఆధారాలు
8.మత
లౌకిక
9.స్వదేశీ
10.విదేశీ

మాటలకు, ప్రభోదాలకు,నీతి సూక్తులకు చరిత్ర గతినే మార్చేంత బలం ఉంటుందా? తప్పక ఉంటుంది. అన్నది యేసుప్రభువు జీవితాన్నిబట్టి తెలుస్తుంది. ఒకరోజున శిష్యులంతా తగవులాడుకొంటున్నారు.తమలోఎవరు గొప్ప? అన్నది తేల్చుకోవాలన్న వాళ్ళ ప్రయాస .వాళ్ళని ప్రభువు తనవద్దకు పిలిచి మీలోగొప్పవాడుగా,నాయకుడుగా ఉండగోరువారు ముందు మంచి పరిచారకుడుగా ఉండాలి.నేనుకూడా ఈ లోకానికి పరిచారంచెయుంచుకోడానికి రాలేదు,పరిచర్య చేయడానికే వచ్చానని ప్రభోదిచాడు.


యేసు క్రీస్తు సిలువ లో పలికిన ఏడు మాటలు  - సప్తపలుకులు - Jesus 7 Words on Cross in Telugu

  1. యేసు “తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని” చెప్పెను. లూకా 23:34
  2. “నేడు నీవు నాతోకూడ పర దైసులో ఉందువు” . లూకా 23:43
  3.  “అమ్మా,యిదిగో నీ కుమారుడు యిదిగో నీ తల్లి”. యోహాను 19:26
  4. “నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చెయ్యివిడిచితివి”. మార్కు 15:34
  5.  “నేను దప్పిగొనుచున్నాను”. యోహాను 19:28
  6.  “సమాప్తమైనది”. యోహాను 19:30
  7.  “తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను”. లూకా 23:46

యేసుప్రభువు సిలువలో పలికిన 7 మాటల ధ్యానం

 *యేసు ప్రభువు వారు సిలువలో పలికిన మొదటి మాట*

✅ *క్షమాపణ*

*తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను."* లూకా 23:34

ఆయన జన్మలో పరిశుద్ధత వుంది. ఆయన జీవితంలో పరిశుద్ధ వుంది. కాని, సర్వమానవాళి పాపం నిమిత్తము ఆయన పాపముగా మార్చబడడానికి, ఆయన రక్తాన్ని విమోచనా క్రయదనముగా చెల్లించి, మన పాపములకు ప్రాయశ్చిత్తం జరిగించడానికి కొనిపోబడుతున్నాడు.
•సిలువతో సాగిన ఆయాత్ర  యెరూషలేము వీధుల గుండా సాగుతూ,గొల్గొతాలో ముగియనుంది.
•39 కొరడా దెబ్బలతో ప్రారంభమైన ఆ యాత్రలో ఊహకు అందని ఎన్నో భయంకరమైన అనుభవాలు.
• వీపు మీద భారమైన సిలువ, భరించరాని అవమానం
• ముఖమంతా ఉమ్ములు, పిడిగుద్దులు
•గేళి చేయబడుతూ,హేళన చేయబడుతూ,ఆయన క్రింద పడుతూ, ఆయన మీద ఆ భారమైన సిలువ పడుతూ గొల్గొతాకు చేరింది ఆయాత్ర.
•కాళ్ళు, చేతులలో సీల మేకులు, తలపైన ముండ్ల కిరీటం.
• ఆరు అంగుళాలు కలిగిన మూడు మేకులతో ఆ పరిశుద్ధ గొర్రెపిల్ల కల్వరిగిరిలో భూమికి ఆకాశానికి మధ్యలో వ్రేలాడుతుంది.
• ఆయన దేహమంతా రక్తసిక్తమై ఏరులై పారుతుంది.

అటువంటి భయానకమైన పరిస్థితులలో ప్రియ రక్షకుడైన యేసు ప్రభువు వారి నోటనుండి వెలువడుతున్న మొదటిమాట.
"తండ్రీ! వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు".  

యేసు ప్రభువు వారు ఏమి భోధించారో? దానిని తప్పకుండా చేసి చూపించారు. తాను చెయ్యడానికి ఇష్టం లేనిది ఏది ఆయన బోధించలేదు. నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించు వారికొరకు ప్రార్థన చేయుడి. మత్తయి 5:44

ఆయన భోధించినట్లుగానే,
•శత్రువులను ప్రేమించాడు.
•ఆయనను హింసించే వారికొరకు ప్రార్ధించాడు.      "తండ్రీ! వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు".  
ఈ మాట వింటుంటే? శరీరం జలదరిస్తుంది. కాని ఆ దినాన్న బండలుగా మారిన ఆ రాతి హృదయాలు చలించలేదు. స్పందించలేదు. నేటి మన జీవితాలు కూడా వారికేమాత్రమూ తీసిపోలేదు. అనుక్షణమూ ఆయనను సిలువ వేస్తూనే ఉన్నాము. అయినప్పటీ, నేటికినీ నీ గురించి, నాగురించి తండ్రి దగ్గర ఆయన  విజ్ఞాపన చేస్తూనే వున్నాడు. ''వీరిని క్షమించమని" అట్లా అని, మార్పు లేకుండా ఇట్లానే జీవిద్దామా? క్షమాపణను నిర్లక్ష్యం చేసి దేవుని ఉగ్రతకు పాత్రులవుదామా? ఆయన దేవుడు కాబట్టి అట్లా చెయ్యగలిగాడు. నా వల్ల కాదులేనని నీకు నీవే సర్దిచెప్పుకొనే ప్రయత్నం చెయ్యొద్దు. యేసు ప్రభువు అడుగు జాడల్లో నడచిన స్తెఫెను కూడా మరణ సమయాన్న కూడా ఆయనను అనుసరించ గలిగాడు. ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనుమని స్తెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి.
అతడు మోకాళ్లూని ప్రభువా, వారిమీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను; ఈ మాట పలికి నిద్రించెను. అపో.. 7:59,60

గ్లాడిస్  తనభర్త  గ్రాహం స్టెయిన్స్ ను, తన ఇద్దరి కుమారులను సజీవ దహనం చేసిన వారిని క్షమించి వారిని దేవుని దగ్గరకు నడిపించ గలిగింది.
క్షమించడం క్రైస్తవ జీవితంలో ఒక భాగం కావాలి. ఆయన పిల్లలముగా అట్టి జీవితాన్ని జీవించగలగాలి.

ఆయన పరిశుద్ధ రక్తంలో పవిత్ర పరచబడదాం! ఆయన సమరూపంలోనికి మార్చబడదాం!
ఆయన వలే, మన శత్రువులను సహితం క్షమిద్దాం! వారి కొరకు ప్రార్ధిద్దాం!

*యేసు ప్రభువు వారు సిలువలో పలికిన రెండవ మాట*

   ✅ *అభయం*

*నీవు నాతోకూడ పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. లూకా  23:43*

ప్రపంచ చరిత్రలో ఒక చిన్న అవకాశాన్ని నిత్యరాజ్యాన్ని స్వతంత్రించు కోవడానికి ఉపయోగించుకున్న వ్యక్తి ఎవరైనా వున్నారంటే? అతడు. "ఆ సిలువ వేయబడిన దొంగ మాత్రమే".

యేసుప్రభువును క్రూరముగా హింసిస్తున్న వారి కొరకు "తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు" అని తండ్రికి విజ్ఞాపన చేస్తూ  ఆయన సిలువలో పలికిన మొదటి మాట అతనిలో గొప్ప పశ్చాత్తాపాన్ని తీసుకువచ్చింది. ఆ పశ్చాత్తాపము ప్రభువుని వేడుకోవడానికి తొందరచేసింది. ఇక ఎంత మాత్రమూ ఆలస్యం చెయ్యక "యేసూ, నీవు నీ రాజ్యము లోనికి వచ్చునప్పుడు నన్ను జ్ఞాపకము చేసికొనుము". అంటూ అర్ధిస్తున్నాడు. అది అతని పెదవుల నుండి వచ్చిన మాటకాదు. అతని హృదయాంతరంగంలో నుండి పొంగి పొరలివస్తున్న ఆవేధన. కారణం? అతనికి రెండు విషయాలు అర్ధమయ్యాయి.
1. ఆయన రాజు
2. ఆయనకొక రాజ్యముంది.
అది శాశ్వత రాజ్యం. ఆ రాజ్యంలో నేను కూడా వుండాలని.

యేసు ప్రభువువారు ఆదొంగ యొక్క గతచరిత్రను ఎత్తి చూపలేదు. తర్వాత నీగురించి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటా అని చెప్పలేదు.
అతని హృదయంలో నుండి పెల్లుబుకుతున్న పశ్చాత్తాపాన్ని గ్రహించిన ప్రభువువారు  "నీవు నాతోకూడ పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను."
అని అభయమిచ్చారు. నీవు నాతో వుండే అవకాశం వుంది అనడం లేదు. "నిశ్చయం". ఇది ఎవ్వరూ మార్చలేని తిరుగులేని సత్యం. ఒక్క చిన్నమాటకు ఆ దొంగ అంతగా ప్రతిస్పంధించాడు. ఆ ప్రతిస్పందన అతనిని పరదైసుకు చేర్చింది. సంవత్సరాల తరబడి, గంటలకొద్దీ వాక్యం వింటున్నామే? మన రాతి హృదయాలు మాత్రం స్పందించుట లేదు. ఆయన ఒక రాజు, ఆయనది శాశ్వత రాజ్యం అనే గ్రహింపులేదు. సరికదా, ఆ దొంగ బాప్తిస్మం తీసుకోలేదు కదా? ప్రభు రాత్రి భోజనం లో పాలుపొందలేదు కదా? నేనెందుకు బాప్తిస్మం తీసుకోవాలి? ఎందుకు ప్రభు రాత్రి భోజనం ఆచరించాలి? ఆ దొంగ ప్రార్ధించినప్పుడు అతడు పరదైసుకు చేరాడు కదా?  ప్రార్ధిస్తే నేనెందుకు చేరను? అంటూ లెక్కలేనన్ని ప్రశ్నలు.
అతడయితే, జీవిత చివరి క్షణాల్లో వున్నాడు. అతనికి ఎట్లాంటి అవకాశాలూ లేవు. నీకేమయ్యింది? నీవేమి సిలువలో వ్రేలాడడం లేదు కదా? రక్షించ బడడానికి, బాప్తిస్మం తీసుకోవడానికి, పరిశుద్ధ జీవితం జీవించడానికి నీకు చాలినన్ని అవకాశాలు దేవుడిచ్చాడు. దేవునికి లోబడకుండా, నీకు నచ్చినట్లు జీవించి, ఆయన దయామయుడు కదా! జీవితం చివరిక్షణంలో  క్షమించమని ఒక్కమాట అడిగితే క్షమించేస్తాడు అనే భ్రమలో మాత్రం ఎట్టి పరిస్థితులలోనూ వుండవద్దు. నీ జీవితంలో అనేక సంవత్సరాలు వ్యర్ధముగా దొర్లిపోయాయేమో?

ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము.
                2 కొరింది 6:2

కనీసం నేడైనా, పశ్చాత్తాపముతో ఆయన పాదాల చెంతచేర గలిగితే? నీ గత జీవితం ఎట్లాంటిదైనా, ఆయన ప్రశ్నించడు. ఆ నిత్య రాజ్యానికి వారసుని చేస్తాడు.
ఆరీతిగా మన జీవితాలను
సిద్ద పరచుకుందాం!
నిత్య రాజ్యానికి వారసులవుదాం! ఆమెన్

*యేసు ప్రభువు వారు సిలువలో పలికిన మూడవ మాట*

✅ *ఆదరణ*

*"అమ్మా,యిదిగో నీ కుమారుడు ......యిదిగో నీ తల్లి" యోహాను 19:26*

ఒక తల్లి పదిమంది పిల్లలను పెంచి పోషిస్తుంది. ఆ పదిమంది పిల్లలు కలసి ఆఒక్క తల్లిని పెంచలేక అనాధనుచేసి విడచి పెట్టేసిన పిల్లలెందరో? అనాధ ఆశ్రమాలలో, వృద్ధ ఆశ్రమాలలో తలదాచుకొంటున్న తల్లులెందరో? అట్లాఅని, వారి ఆర్ధికస్థితి తల్లిని పోషించ గలిగేదిగా లేదా అంటే? కానేకాదు. అన్నీ సమృద్ధిగా కలిగినవారే. లేదంటే, వారు
తమ భాద్యతను, దేవుని ఆజ్ఞను మరచినవారు. వారి జాబితాలో మనమూ వున్నామా? అయితే ఒక్క మాట!
యేసుప్రభువు వారు కల్వరి గిరిలో ఆ సిలువలో భూమికి ఆకాశానికి మధ్యలో మూడు మేకులతో వ్రేలాడుతున్న అత్యంత క్లిష్టమైన పరిస్థితులలో కూడా ఒక కుమారునిగా తన భాద్యతను నెరవేర్చుతూ ఆయన తల్లిని 'యేసు ప్రభువు రొమ్మును ఆనుకొనియున్న శిష్యుడు'గా పేరొందిన యోహానుకు  అప్పగిస్తూ పలికిన ఈ మాట మన జీవితాలకు గొప్ప మేల్కొలుపు. పరిశుద్ధ గ్రంధం తలిదండ్రులకు చెప్పలేనంత ప్రాధాన్యత ఇచ్చింది.
దేవుడు ఇశ్రాయేలు ప్రజలకిచ్చిన 10 ఆజ్ఞలలో ఒకటి తలిదండ్రుల కోసమే.
నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నిర్గమ  20:12

సన్మానించడం అంటే?  శాలువాలు కప్పి, పూల బొకేలు ఇవ్వాలని కాదుగాని, వారి అవసానదశలో వారి అవసరాలు గుర్తెరిగి వాటిని తీర్చగలగడం.

•తలిదండ్రులకు విధేయత చూపాలి. వారిని సన్మానించాలి. ఇది వాగ్దానములతో కూడిన ఆజ్ఞలలొ మొదటిది.

పిల్లలారా, ప్రభువునందు మీ తలిదండ్రులకు విధేయులై యుండుడి; ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీతండ్రిని తల్లిని సన్మానింపుము,
అప్పుడు నీవు భూమిమీద దీర్ఘాయుష్మంతుడ వగువుదు, ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. ఎఫెస్సి 6:1-3

నీ తలిదండ్రులను నీవు సంతోషపెట్టవలెను నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను."
       సామెతలు 23:25

అట్లా కాకుండా వారిని నిర్లక్ష్యం చేసి, వారిని దూషించినట్లయితే?
"తన తండ్రినైనను తల్లినైనను దూషించువాని దీపము కారుచీకటిలో ఆరిపోవును."
         సామెతలు 20:20

కారు చీకట్లో నీ దీపం ఆరిపోతే? నీ గమ్యం ఎట్లా చేరుకోగలవు? నీవు ఆశించేది ఎట్లా పొందుకోగలవు?
ఆలోచించు?

ఒక్కటి మాత్రము గుర్తుంచుకోవాలి! నేడు మన తలిదండ్రులను ఎట్లా చూస్తున్నామో? రేపు మన పిల్లల చేత అట్లానే చూడబడతాము. "నీవు చేసినట్టే నీకును చేయబడును, నీవు చేసినదే నీ నెత్తిమీదికి వచ్చును."ఒబెద్యా 1:15

మోస పోకుడి, దేవుడు వెక్కిరింపబడడు; మనుష్యుడు ఏమివిత్తునో ఆ పంటనే కోయును. గలతీ 6:7

కొబ్బరి చెట్టు నుండి, ఖర్జూరాలు ఆశించలేము. అట్లానే, మనము నేడు మన తలిదండ్రులను నిర్లక్ష్యము చేసి రాబోయే దినాలలో మనము సంతోషాన్ని పొందగలము అనుకోవడం మన జీవితాలకు శ్రేయష్కరము కాదు. ఒకవేళ ఇంత వరకూ వారిని నిర్లక్ష్యం చేసామేమో? యేసు ప్రభువు వారు సిలువలో పలికిన మాట ద్వారా మన బాధ్యతను గుర్తుచేస్తున్నారు. సరిచేసుకుందాం! వారి అవసరాలు గుర్తెరిగి మన బాధ్యతను నెరవేర్చుదాం! ఆయన మాటకు లోబడదాము. ఆమెన్


 *యేసు ప్రభువు వారు సిలువలో పలికిన నాల్గవ మాట.*

✅ *"తండ్రితో ఎడబాటు"*

*నా దేవా, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. మత్తయి  27:46*

యేసుప్రభువు వారు  భరిస్తున్న సిలువ భారము కంటే, ఆ ఘోర అవమానము కంటే, ఆయనను మరింత ఎక్కువగా బాధించిన విషయం ఏమిటంటే? "తండ్రితో ఎడబాటు".

ఆయన మరి కొద్ది క్షణాల్లో తన ప్రాణమును తండ్రికి అప్పగించ బోతున్నాడు. తండ్రితో సహవాసాన్ని కోల్పోబోతున్నాడు. ఆ ఎడబాటును తట్టుకోలేక బిగ్గరగా కేక వేస్తున్నాడు. అది ఒక గొప్ప 'ఆర్తనాధం'.అది తండ్రితో శాశ్వతమైన ఎడబాటు కాదు. అత్యంత స్వల్పమైన ఎడబాటు మాత్రమే. అయినా, దానిని కూడా ఆయన భరించ లేకపోతున్నాడు. తండ్రి తన సన్నిధిని కుమారుని నుండి తీసెయ్యడానికి ఇష్టపడ్డాడు.  కావాలనే అట్లా చేస్తున్నాడు.

"అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను" యెషయా 53:10

ఒకవేళ అతనిని నలుగగొట్టడానికి తండ్రికి ఇష్టం లేకపోతే? ఈరోజు ఈ రక్షణ మనకు లేదు. ఆ తండ్రి ప్రేమలో గొప్పత్యాగం వుంది.

"మనమాయనయందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మనకోసము పాపముగాచేసెను." 1 కొరింది 5:21

ఏదేను వనములో మనము తండ్రితో కోల్పోయిన సహవాసాన్ని తిరిగి పునఃరుద్దరించడానికి మన ప్రియ రక్షకుడు తన తండ్రి సహవాసాన్ని కోల్పోబోతున్నాడు.
ఎందుకంటే? ఆ సిలువ యాగమే తండ్రితో మనము కోల్పోయిన సహవాసాన్ని తిరిగి పునఃరుద్దరిస్తుంది. తండ్రి త్యాగం, కుమారుని విధేయత, రెండూ కలసి ఆదినాన్న తండ్రితో కోల్పోయిన సహవాసాన్ని తిరిగి నెలకొల్పాయి. ఇంతకీ, నెలకొల్పబడిన ఆ సహవాసం కొనసాగుతుందా? ఆగిపోయి ఎంత కాలమయ్యింది? ఎంత కాలమయ్యిందో కూడా గుర్తులేనంత కాలమయ్యిందా?
దేవునితో సంబంధాన్ని కొనసాగిస్తున్నాం! మంచిదే. మరి సహవాసం మాటేంటి..?సంబంధానికి, సహవాసానికి వున్న వ్యత్యాసమేమిటి?
ఆదాము ఏదేనులో నుండి గెంటి వేయబడినప్పటికీ అతడు దేవుని కుమారుని గానే పిలువబడ్డాడు. అది తండ్రి కుమారుల 'సంబంధం'.
కాని, గెంటి వేయబడడం ద్వారా అతడు దేవునితో 'సహవాసాన్ని' కోల్పోయాడు.
మనము కూడా ఆయన పరిశుద్ధ రక్తములో కడుగబడి దేవుని బిడ్డలుగా, దేవునితో 'సంబంధాన్ని' కలిగియున్నాము. కాని, తిరిగి పాపం చెయ్యడం ద్వారా ఆయనతో 'సహవాసం' కోల్పోతున్నాము.
సంబంధం మాత్రమే కలిగియుండి, సహవాసం లేకపోతే? ఆ నిత్య రాజ్యాన్ని చేరలేము. సహవాసము కోల్పోవడానికి గల ఏకైక కారణం? మన పాపమే. అట్లా అయితే?
పాపం లేని యేసు ప్రభువు వారు ఎందుకు తండ్రితో సహవాసాన్ని కోల్పోయారు?
మన పాపముల నిమిత్తం ఆయన పాపముగా  చెయ్యబడ్డాడు గనుక. అందుకే ఆయన ఆక్రందన. ఆ సిలువ ప్రేమను అర్ధం చేసుకుందాం! మన జీవితాలను సరి చేసుకుందాం! కోల్పోయిన సహవాసాన్ని ప్రారంభిద్దాం!

ఆరీతిగా మన జీవితాలను
సిద్ద పరచుకుందాం!
నిత్య రాజ్యానికి వారసులవుదాం! ఆమెన్

 *యేసు ప్రభువు వారు సిలువలో పలికిన ఐదవ మాట*

            
✅ *"దప్పిగొనుచున్నాను."*
        యోహాను 19:28

యేసుప్రభువు ఆయన రాజ్య సువార్తను ప్రకటిస్తున్న సమయంలో ఆయన ప్రబోధించిన విషయాలు.

*నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పిగొనడు;* యోహాను 4:14

"దప్పిగొనిన యెడల నాయొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను."
               యోహాను 7:37

ఆయనిచ్చే నీళ్ళు త్రాగితే ఎన్నడునూ దప్పిగొనమట. దాహం వేస్తే నాదగ్గరకు వచ్చి మీ దప్పిక తీర్చుకొనండని చెప్పిన ప్రభువు వారే దప్పిక గొనడమేమిటి? ఆయన దప్పికను  ఆయన తీర్చుకోలేనప్పుడు, ఇక, మన దప్పికను ఎట్లా తీర్చగలడు?

*యేసయ్య సిలువలో దప్పిగొనడానికి గల కారణాలు?

🔹• యేసు ప్రభువు వారు జన్మించడానికి వందలాది సంవత్సరాల ముందే, అనేకమైన ప్రవచనాలు ప్రవచింపబడ్డాయి. వాటిలో ఒక్కటైననూ తప్పిపోవడానికి వీల్లేదు. ఆ ప్రవచన నేరవేర్పులో భాగముగా ఆయన దప్పిగొన్నారు.

"వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి నాకు దప్పియైనప్పుడు చిరకను త్రాగనిచ్చిరి."
              కీర్తనలు 69:21

🔹•అప్పటికే, యేసుప్రభువువారు
ఆ మండుటెండలో యెరూషలేము వీధులలో భారమైన సిలువను మోసారు. ఒకవైపు శరీరంనుండి రక్తం కారుతూనే వుంది. అట్లాంటి పరిస్థితులలో దప్పిగొనడం అత్యంత సహజము.

ఎందుకంటే?

CONCEPT ( development of human relations and human resources )