రాహుల్ సాంకృత్యాయన్
రాహుల్ సాంకృత్యాయన్ సత్యాగ్రహ ఉద్యమంలో, రైతు పోరాటాలలో పాల్గొని,
1940 - 42 సంవత్సరాలలో జైల్లో ఉన్న కాలంలో తన సహచరులకు దర్శనాన్ని బోధించడంలో భాగంగా
తయారుచేసుకున్న నోట్స్ ఆధారంగా “దర్శన్ – దిగ్దర్శన్” అనే పుస్తకం రచించబడింది.
ఈ పుస్తకం హిందీ మూలం సుమారు 1000 పేజీలు ఉంటుంది.
తెలుగులో ఇది రెండు భాగాలుగా వచ్చింది:
- భారతీయ దర్శనం
- ప్రాచ్య–పాశ్చాత్య దర్శనం
ఈ పుస్తకంలో రాహుల్ సాంకృత్యాయన్ సుమారు 2400 సంవత్సరాల తాత్విక చరిత్రను పరిచయం చేశారు.
గ్రీకు తత్వవేత్తలనుండి 20వ శతాబ్దపు తత్వవేత్తల వరకు వారి కాల సామాజిక పరిస్థితులు,
ఆర్థిక పరిస్థితులు మరియు తాత్విక ధోరణులను విశదీకరించారు.
ఈ పుస్తకం చదివితే తత్వశాస్త్రానికి ఒక ప్రాథమిక అవగాహన లభిస్తుంది.
మన ఆలోచనలను విస్తరించి, లోతైన తాత్విక అధ్యయనానికి ప్రేరణ ఇస్తుంది.
తాత్విక ధారను తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరికీ ఇది తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకం.
ప్రస్తుత కాలంలో హేతువాద తాత్వికతను అర్థం చేసుకోవడానికి ఇది ఎంతో ఉపయోగకరం.