31.1.25

గుణాఢ్యుడు


గుణాఢ్యుడు ప్రాచీన భారతీయ రచయిత. అతను "బృహత్కథ" అనే గ్రంథాన్ని పైశాచీ ప్రాకృత భాషలో రచించాడు.


బృహత్కథ

ఇది ఒక పెద్ద కథాసంపుటి, ఇందులో ఎన్నో అద్భుతమైన కథలు ఉన్నాయి.

శతవాహన రాజు హాళ కాలంలో రచించబడినదని చెబుతారు.

ఈ గ్రంథం నేరుగా దొరకకపోయినప్పటికీ, దీని ఆధారంగా "కథాసరిత్సాగరము" (సోమదేవుడు), "బృహత్కథామంజరి" (బోధాయనుడు) అనే సంస్కృత అనువాదాలు వెలువడ్డాయి.


గుణాఢ్యుడి కథ

గుణాఢ్యుడు సంస్కృతంలో రాయలేక ప్రాకృతంలో రాశాడు. రాజు హాళ ఈ రచనను అంగీకరించకపోవడంతో, గుణాఢ్యుడు తన గ్రంథాన్ని అడవిలో కూర్చొని చదువుతూ తగలబెట్టాడని ఒక గాథ ఉంది.

గుణాఢ్యుడు ప్రాముఖ్యత

భారతీయ కథా సాహిత్యానికి పునాది వేసిన రచయిత.

అతని కథలు తరువాతి కాలంలో జాతక కథలు, పురాణాలు వంటి అనేక గ్రంథాలకు ప్రేరణగా నిలిచాయి.

గుణాఢ్యుడు "బృహత్కథ" ద్వారా కథా సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచాడు.

చరిత్ర

గుణాఢ్యుడు తెలంగాణ మొదటి లిఖిత కవి. గుణాఢ్యుడు 1వ శతాబ్దానికి చెందిన కవి. ఇతడు బృహత్కథ అనే ప్రాకృత కథాకావ్యాన్ని రచించాడు. ఈ కథలను దండి, సుబంధు, బానభట్టుడు లాంటి ఎందరో తర్వాతి కాలం కవులు పొగిడారు. ఇతడిని వ్యాస-వాల్మీకి కవులకు సమానంగా కొందరు కవులు పరిగణిస్తారు, అయితే ఇతడి రచన సంస్కృతంలో లేదు. ప్రస్తుతం బృహత్కథ అసలు రూపంలో అలభ్యం. ఆ కథలకు కశ్మీర సంస్కృత అనువాదాలైన క్షేమేంద్రుని బృహత్కథామంజరి, సోమదేవుని కథాసరిత్సాగరం లభ్యమవుతున్నాయి.

శాతవాహన రాజు తన రాణి జలక్రీడలాడుతున్నప్పుడు ఆమె తనపై నీటిని చల్లవద్దని చెప్పటానికి సంస్కృతంలో 'మా ఉదకైః తాడయ' అంటే నీటితో ఆడవద్దు అనే వాక్యాన్ని మోదకైః అన్న పద ప్రయోగంతో చేసింది. అది విన్న రాజు రాణికి మోదకాలు(మిఠాయిలు) తెప్పించగా, ఆమె అది చూసి నవ్వి ఆతనికి సంస్కృత వాక్యార్ధాన్ని వివరిస్తుంది. అది తెలుసుకొన్న రాజు సిగ్గుపడి తన ఆస్థాన పండితులకు తాను సంస్కృతం చదవాలనే ఆసక్తిని వ్యక్తం చేస్తాడు. సద్గుణ సంపన్నుడైన ఆయనకు ఆరేళ్ళాలో సంస్కృతం నేర్పడం సాధ్యమవుతుందని తన ఆస్థాన పండితులు తెలుపగా అక్కడే ఉన్న కాతంత్ర వ్యాకరణానికి ఆద్యుడైన శర్వవర్మ కేవలం ఆరు నెలల్లో రాజుని సంస్కృతంలో పండితుడిగా చేస్తానని వాగ్దానం చేస్తాడు. అది తెలుసుకొన్న గుణాఢ్యుడు అది అసంభవం అని, అలా చేసినట్లయితే అప్పటి నుండి నేను సంస్కృతం, ప్రాకృతం వంటి ప్రసిద్ధ భాషలను ఉపయోగించను అని ప్రతిజ్ఞ చేస్తాడు. శర్వవర్మ రాజుకోసం కొత్త వ్యాకరణ గ్రంథాలను రచించి రాజుని పండితుడిగా ఆరు నెలల్లో తీర్చిదిద్దుతాడు. ఇది తెలుసుకున్న గుణాఢ్యుడు తన పరాభవానికి గాను పైశాచీ భాషలో ఏడు లక్షల శ్లోకాలతో కూడిన పెద్ద కథల సంకలనాన్ని రచించాడు. శిష్యులు రాజు వద్దకు ఈ గొప్ప పుస్తకాన్ని తీసుకువస్తారు, కాని రాజు దానిని అంగీకరించడానికి నిరాకరిస్తాడు. అది తెలుసుకున్న గుణాఢ్యుడు రాజు తనకు చేసిన అగౌవరానికి గాను అసహనంతో, తన పుస్తకాన్ని అరణ్యవాసులకు ఒక్కొక్కటిగా చదివి వినిపించి మంటల్లోకి విసిరేయడం ప్రారంభిస్తాడు. అటుపై దాని విశేషాలను విన్న రాజు లక్ష శ్లోకాలతో కూడిన పుస్తకంలో ఏడవ భాగాన్ని ఎంతో శ్రమించి భద్రపరచగలిగాడు. అదే గొప్ప కథల పుస్తకం. ఇదే గుణాఢ్యుడు రచించిన బృహత్కథ లో మిగిలిన భాగం.

నేపాల్‌కు చెందిన బుద్ధస్వామి అనే కవి, బౌద్ధ సన్యాసి, గుణాఢ్యుడు మథురలో నివసించి, అవంతి రాజు, మదన రాజు వద్ద ఆశ్రయం పొందిన సద్గురువుగా వర్ణించాడు. ఈ రెండు అభిప్రాయాల పట్ల కాశ్మీరీ అభిప్రాయం సరైనదే. బుద్ధస్వామి నేపాల్ యొక్క ధర్మబద్ధమైన పొరుగుప్రాంతాన్ని సాధించాలనే తన పట్టుదలను వ్యక్తం చేశాడు.

గుణాఢ్యుడు పైశాచీ భాషలో లక్షల శ్లోకాలతో కూడిన బృహత్కథ అనే గ్రంథాన్ని రచించాడు అని, ఇది స్థాపకుడైన శాతవాహనుడి సభలో జరిగింది అని ఈ శాతవాహనుడు క్రీ.శ మొదటి శతాబ్దానికి చెందినవాడని సోమదేవుడు రాసిన కథాసరిత్సాగర పీఠికలో కూడా ప్రస్తావించబడింది.

అలానే ఆయన రచించిన 'బృహత్కథ' గ్రంథానికి సంస్కృత అనువాదం క్షేమేంద్రుడు 'బృహత్కథామంజరి' పేరుతో చేశారు.

రచనlu
తెలుగు భాష మొదట ‘దేశి’ అని పిలువబడేది. శాతవాహనులు ‘దేశి’ ఒక భాష కాదని దీనిని చాలా చులకనగా చూసినారు.[citation needed] గుణాఢ్యుడు ‘దేశి’ భాషలో భృహత్కథ అను గొప్ప గ్రంథరాజమును వ్రాసినాడు. ఇందులో ఏడు వేల శ్లోకాలతో ఏడు కథలను వివరించాడు. శాతవాహనులు దీనిని పైశాచీ భాష పుస్తకం అని అవమానించారు. (క్రిష్టియన్ మిషనరీస్ వాళ్లకి మొదటినుచి వున్న అలవాటు ప్రకారం ఏ దేశం అయినా అక్కడి వారితోనే వాళ్ళ సంస్కృతి మీద విషం చిమ్మించడం వారి విధానం . దానిలో భాగంగానే కొత్తగా తెలుగు భాషని పూర్వపు రాజులు అవమానించారు అని కొత్త విషం నింపడానికి ప్రయత్నాలు జరిగాయి, జరుగుతున్నాయి. ఇది పూర్తిగా నిరాధారం) శాతవాహనుల రాజభాష ప్రాకృతం అయినందున పైశాచీ భాషలో ఉన్న ఈ గ్రంథం రాజు ఆదరణకు నోచుకోలేదు. అది భరించలేక గుణాఢ్యుడు బృహత్కథను కాల్చి వేసినాడు. పక్కన ఉన్నవారు ఆయనను ఊరటపరచి కొంత భాగాన్ని కాపాడిరి. ఆ మిగిలిన పత్రాలే బృహత్కథ గ్రంథం. అందలి పదకొండవ అధ్యాయానికి 'పంచవిశంతి' అని పేరు. ఇందులో త్రివిక్రమసేనునికి భేతాలుడు చెప్పిన 25 అద్భుత కథలున్నాయి.

No comments:

Post a Comment

CONCEPT
( DEVELOPMENT OF HUMAN RELATIONS AND HUMAN RESOURCES )