భావన

భావన -వస్తు భావ పరంపర భావన ఈ భావన, ప్రగతికి మూలం. అజ్ఞానమే శత్రువు. జ్ఞానమనే చిరు జ్యోతిని వెలిగించి అజ్ఞాన తిమిరాన్ని పారద్రోలుదాం. ఈ చిరు ప్రయత్నాన్ని మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేయడం ద్వారా ప్రోత్సహిస్తారని ఆశిస్తూ... - మీ రామమోహన్ చింతా
Showing posts with label 84.R బైబిల్ తత్వ విచారణ. Show all posts
Showing posts with label 84.R బైబిల్ తత్వ విచారణ. Show all posts

84.R బైబిల్ తత్వ విచారణ

యోబు 1:21 నేను నా తల్లిగర్భములోనుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్లెదను; యెహోవా ఇచ్చెను యెహోవా తీసికొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలు గునుగాక.

మత్తయి 5:3
ఆత్మవిషయమై దీనులైనవారు(data)¹@ ధన్యులు; పరలోకరాజ్యము వారిది.
మత్తయి 5:4
దుఃఖపడువారు ధన్యులు; వారు ఓదార్చబడుదురు.
మత్తయి 5:5
సాత్వికులు ధన్యులు ; వారు భూలోకమును స్వతంత్రించుకొందురు.
మత్తయి 5:6
నీతికొరకు ఆకలిదప్పులు గలవారు ధన్యులు; వారు తృప్తిపరచబడుదురు.
మత్తయి 5:7
కనికరముగలవారు ధన్యులు; వారు కనికరము పొందుదురు.
మత్తయి 5:8
హృదయశుద్ధిగలవారు ధన్యులు; వారు దేవుని చూచెదరు.
మత్తయి 5:9
సమాధానపరచువారు ధన్యులు ; వారు దేవుని కుమారులనబడుదురు.
మత్తయి 5:10
నీతినిమిత్తము హింసింపబడువారు ధన్యులు; పరలోక రాజ్యము వారిది.
మత్తయి 6:8
మీరు వారివలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడుగక మునుపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలియును
మత్తయి 6:9
కాబట్టి మీరీలాగు ప్రార్థనచేయుడి, పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడుగాక,
మత్తయి 6:10
నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక,
మత్తయి 6:11
మా అనుదినాహారము నేడు మాకు దయచేయుము.
మత్తయి 6:12
మా ఋణస్థులను మేము క్షమించియున్న ప్రకారము మా ఋణములు క్షమించుము.
మత్తయి 6:13
మమ్మును శోధనలోకి తేక దుష్టునినుండి(లేక-కీడునుండి) మమ్మును తప్పించుము.(కొన్ని ప్రాచీన ప్రతులలో-రాజ్యము, బలము, మహిమయు నీవైయున్నవి, ఆమేన్, అని కూర్చబడియున్నది)

యిర్మియా 17:9
హృదయము అన్నిటికంటె మోసకరమైనది, అది ఘోర మైన వ్యాధికలది, దాని గ్రహింపగలవాడెవడు?