22.10.24

13.పద్యాలు తెలుగు - సౌందర్యం - సాహిత్య కళారూపాలు ( పద్యాలు )

తెలుగు సాహిత్యంలో మొదటి పద్య రచన గురించి స్పష్టమైన ఆధారాలు లేవు, కానీ అనేక సాహిత్య చరిత్రకారులు తెలుగు పద్య సాహిత్యానికి శ్రీకారం చుట్టిన మహాకవి నన్నయ భట్టారకుడు (11వ శతాబ్దం) అని భావిస్తున్నారు. నన్నయ, మహాభారతం యొక్క ఆదిపర్వాన్ని తెలుగు భాషలో పద్యరూపంలో రచించినవాడు.

నన్నయ చేసిన ఈ తెలుగు మహాభారతం రచనను "ఆంధ్ర మహాభారతం" అని కూడా పిలుస్తారు. నన్నయ యొక్క రచన ప్రాకృత మరియు సంస్కృతం కలయికతో ఆంధ్ర ప్రజలకు బాగా అర్థమయ్యేలా తెలుగులో రూపొందించబడింది. ఆయన రచన సుసంపన్నమైన పద్యం, శ్రావ్యం, మరియు శైలిలో తెలుగుకు ఆణిముత్యం లాంటి ఒక శాశ్వత కీర్తిని అందించింది.

ఈ విధంగా, నన్నయ తెలుగు పద్య కవిత్వంలో తొలి మహా కవి అని భావించబడతాడు, మరియు తెలుగు పద్య సాహిత్యానికి తన కృషితో బలమైన పునాది వేసినవాడు.

హాలుడు
భాష
హాలుడు ప్రాచీన ఆంధ్రదేశాన్ని పరిపాలించిన శాతవాహన వంశానికి చెందిన రాజు. మత్స్యపురాణం అతనిని శాతవాహనుల వంశంలో 17వ రాజుగా పేర్కొంది.[1]

హాలుడు
శాతవాహనులు
పరిపాలన
క్రీ.పూ.200 - క్రీ.త.200
శాతవాహనులు
హాలుడు అశ్మక రాజ్యంలోని ప్రతిష్ఠానమును పరిపాలిస్తూ ఉన్నాడని ప్రాకృతంలో రచింపబడిన లీలావతి కావ్యం చెబుతుంది. పరిపాలించినది ఆరేళ్ళే అయినప్పటికీ, శాతవాహన వంశపు రాజులందరిలోకీ హాలుడు జగత్ప్రసిధ్ధుడు కావడానికి కారణం ఆ మహారాజు సంకలనం చేసి ప్రపంచానికి అందించిన గాథా సప్తశతి అనే గ్రంథం.
గాథాసప్తశతి (సنس్కృతం: गाथासप्तशती) అనేది ప్రాచీన సంస్కృత సాహిత్యంలో ఒక ముఖ్యమైన కృతిగా ప్రాచుర్యం పొందిన సంపుటం. ఇది సాతవాహన చక్రవర్తి హాలుడు (1వ శతాబ్దం CE) రచించిన గొప్ప కవితా గ్రంథం. దీనిలో మొత్తం 700 గాథలు (ప్రాసयुक्त పద్యాలు) ఉన్నాయి. ఈ కృతి ప్రజల సాధారణ జీవన విధానాన్ని, ప్రేమ కథలను, ప్రకృతి వర్ణనలను, సామాజిక సంబంధాలను అద్భుతంగా ప్రతిబింబిస్తుంది.

ముఖ్యాంశాలు:

1. భాష:
గాథాసప్తశతి ప్రాచీన ప్రాకృత భాషలో రచించబడింది, ఇది ఆ సమయంలో సామాన్య ప్రజలు మాట్లాడే భాష. ఇది సంస్కృతం కంటే సులభమైన భాష.

2. విషయాలు:
ఇందులో ప్రధానంగా ప్రేమ, ప్రకృతి, మరియు జీవన అనుభవాల గురించి పద్యాలు ఉన్నాయి.

గాథలలో స్త్రీల భావజాలం ప్రాముఖ్యత పొందింది.

ప్రకృతి వర్ణనలు, సామాజిక సంబంధాలు, మరియు రోజువారీ జీవితానికి సంబంధించిన వివరణలు ఇందులో ఉన్నాయి.

3. రచనా శైలి:

పద్య రూపం: కవితా శైలిలో రచించబడింది.

ప్రాకృత ఛందస్సు: అర్థపూర్ణమైన మాటలతో, సుందరమైన శ్రావ్యత కలిగిన శైలిలో రచన జరిగింది.

4. ప్రాముఖ్యత:

ప్రేమ కవితా సంపుటి: దీనిని భారతదేశం యొక్క తొలికాలపు ప్రేమ కవితా సంకలనంగా పరిగణిస్తారు.

సాంస్కృతిక దర్పణం: సాతవాహన కాలం యొక్క సామాజిక, సాంస్కృతిక, మరియు ఆర్థిక పరిస్థితులకు ఇది అద్దం పడుతుంది.

5. సాతవాహన చక్రవర్తి హాలుడు:
హాలుడు ఆంధ్ర దేశానికి చెందిన సాతవాహన చక్రవర్తులలో ఒకరు. గాథాసప్తశతిను రచించి, పాండిత్యానికి, సాహిత్యానికి తగిన గుర్తింపు పొందారు.

అవతరణ:
గాథాసప్తశతి సాహిత్యంలో ఒక విశిష్టమైన స్థానం కలిగి ఉంది. ఇది ప్రాచీన భారతీయ సాంస్కృతిక ధోరణులను మరియు శృంగారభావనను అర్థం చేసుకోవడానికి ముఖ్యమైన గ్రంథంగా నిలుస్తుంది.
హాలుడు సా.శ.69 నుండి 74 వరకు 5 ఏళ్ళు పాలన చేసెను. ఇతడు సింహళరాజు కుమార్తెను పరిణయమాడాడు. ఇతడు విద్యాభిమాని, విద్యారసికుడు. ఇతడు విద్వాంసులను, కవులను ఆదరించి తాను కూడా కవియై ఉన్నాడు. హాలుని కాలమున రాజపోషణము లభించుట వలన దేశభాషలు బాగుగా అభివృద్ధి చెందాయి.

ప్రాచీన మహారాష్ట్ర ప్రాకృతములో హాలుడు సప్తశతి అను నీతిశృంగారకావ్యమును రచించాడు. అందు మనోహరమైన అలంకారములు ఉన్నాయి. ఉదా:చంద్రుడను కలహంస ఈరాత్రి భాగమున ఆకాశమున నిర్మల కాసారమునందు విడివిడియున్న నక్షత్రపద్మముల నడుమ సుఖప్రయాణము కావించుచున్నది.....

హాలుని సప్తశతిని బాణుడు తన హర్షచరిత్రములో పొగిడాడు. "కావ్య ప్రకాశిక" లో, "సరస్వతీ కంఠాభరణము" లో, "దశరూపకవ్యాఖ్యానము" లో సప్తశతి పద్యములుదహరింపబడి ఉన్నాయి.

హాలుని మంత్రి గుణాఢ్యపండితుడు. పైశాచీ భాషలో "బృహత్కథ"ను, "కాతంత్ర వ్యాకరణము"ను ఇతడు రచించాడు. హాలుని ఆస్థానములో సకల విద్యలు నెలకొని ఉండేవని తెలుస్తున్నది. గుణాఢ్యుడు హాలుని మంత్రి కాడని మరికొందరు ఆంధ్రచరిత్రకారుల అభిప్రాయము. హాలుడు, సాలనుడు, కుంతలుడు, శాలివాహనుడు- ఈ నాలుగు పేర్లు ఒక్కనివే అని హేమచంద్రుడు తన దేశకోశములో చెప్పాడు. సా.శ. 78 వసంవత్సరమునుండి లెక్కింపబడుచున్న శాలివాహన శకమునకు ఈ హాలశాతవాహనుడే కర్తయని కొందరి అభిప్రాయం.

హాలుని తరువాత మండలకుడు (సా.శ.74-79), పురీంద్రసేనుడు (సా.శ.79-84), సుందరస్వాతికర్ణుడు (సా.శ.84-85), చకోరస్వాతికర్ణుడు 6 మాసాలు క్రమముగా ఒకరి తరువాత ఒకరు రాజ్యమేలారు. వీరిలో చకోరస్వాతికర్ణి వాసిష్ఠీపుత్రుడు; అనగా ఇతనితల్లి వసిష్ఠగోత్రమువారి ఇంటి ఆడబడుచు. ఈ రాజు వద్ద నుండి తరువాతి రాజులందరును తమ తల్లి పేరును తమ పేరు ముందు వాడటం మొదలుపెట్టారు.
-----------------------------
నడెవు దొందె భూమి కుడివు దొందె నీరు
నుడువగ్ని మొందె తిరలు
కులగోత్ర నడువె యత్తణదు సర్వజ్ఞ.
(మనుష్యులందరూ ఒకే భూమి మీద నడుస్తూ,ఒకే నీరు తాగుతూ చివరకు 
ఒకే నిప్పు లో కాలి నశిస్తుంటే ఇక కుల గోత్రాల గోప్ప ఎక్కడిది ?)
-కన్నడ కవి సర్వజ్ఞుడు
-------------------------------
నిద్రేసి ఆసన్ ఉత్తమ్ పాషాణ
వరీ ఆవరణా అకాశాచే
తే థే కాయకరణే కవణాచీ ఆస్
వాయా హోయ నాశ ఆయుష్యాచా
(నిద్రకు రాతిపానుపు మేలు,ఆకాశమే మంచి కప్పు,
కోరిక జీవితాన్ని వ్యయపరుస్తుంది)- తుకారాం

భర్తృహరి సుభాషితము

కేయూరాణి న భూషయంతి పురుషం హారా న చంద్రోజ్వ్జలా
నస్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజాః
వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే
క్షీయంతే-ఖిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణమ్‌ ॥

వయ మిహ సరితుష్టా వల్కలై స్త్వం దుకూలై:
స్సమఇవ పరితోషో నిర్విశేషో విశేషః
సతు భవతు దరిద్రోయస్య తృష్ణా విశాలా
మనసి చ పరితుష్టే కోర్ధవాన్ కో దరిద్రః
ద్రవ్యాశ గలవానికి దారిద్ర్యము గాని
మన స్సం తు ష్టి గలవానికి ద్రవ్య మక్కరలేదు.
భర్తృహరి

కవిత్రయం

ఆదికవి నన్నయ (1023-1063)
Preview
దళిత నవీన కందళ కదంబ కదంబక కేతకీ రజో-
మిళిత సుగంధ బంధుర సమీరణుఁడన్ సఖుఁ డూచుచుండఁగా
నులియుచుఁ బువ్వు గుత్తు లను నుయ్యెల లొప్పుగ నెక్కి యూఁగె ను-
ల్లలదళినీకులంబు మృదులధ్వని గీతము విస్తరించుచున్

తిక్కన్న (1205–1288)


సీ. ఈ వెండ్రుకలు వట్టి యీడ్చిన యా చేయి
దొలుతగాఁ బోరిలో, దుస్ససేను
తను వింత లింతలు తునియలై చెదరి రూ
పఱి యున్నఁ గని ఉడుకాఱుఁ గాక
యలుపాలఁ బొనుపడునట్టి చిచ్చే యిది
పెనుగద వట్టిన భీమసేను
బాహుబలంబునుఁ బాటించి గాండీవ
మను నొక విల్లెప్పుడును వహించు

ఆ.వె. కఱ్ఱి విక్రమంబుఁ గాల్పనే యిట్లు
బన్నములు వడిన ధర్మనందనుడును
నేను రాజరాజు పీనుంగుఁ గన్నారఁ
గానఁ బడయమైతి మేనిఁ గృష్ణ!

ఎఱ్ఱన్న(1325–1353)

Preview
అద్దంకి రాజధానిగా ఉన్న ప్రోలయ వేమారెడ్డి 1325-1353 మధ్యకాలంలో రాజ్యం చేశాడు. అతని ఆస్థాన కవియే ఎఱ్ఱాప్రగడ.హరివంశం ఉపోద్ఘాతంలో ఎర్రన చెప్పిన పద్యం
యుగకర్తయైన ఎఱ్ఱాప్రగడ హరివంశమును, భారత అరణ్య పర్వ శేషమును, నృసింహ పురాణమును వ్రాసాడు. రామాయణం కూడా వ్రాశాడు కాని అది లభించడంలేదు. భాస్కరుడు భాస్కర రామాయణమును, నాచన సోన ఉత్తర హరివంశమును వ్రాసారు. రావిపాటి త్రిపురాంతకుడు వ్రాసిన రచనలలో "త్రిపురాంతకోదాహరణము" మాత్రం లభిస్తున్నది. చిమ్మపూడి అమరేశ్వరుడనే మహాకవి "విక్రమసేనము" అనే మహాగ్రంధాన్ని వ్రాశాడట గాని అది లభించడంలేదు.
నన్నయభట్ట తిక్క కవినాథులు చూపిన త్రోవ పావనం
బెన్నఁ బరాశరాత్మజ మునీంద్రుని వాఙ్మయ మాదిదేవుఁడౌ
వెన్నుని వృత్త మీవు కడు వేడుకతో విను నాయకుండ వి
ట్లెన్నియొ సంఘటించె మదభీప్సిత సిద్ధికి రాజపుంగవా!

శ్రీ కృష్ణుని శైశవోత్సవ వర్ణన (హరివంశంలో)

పాలుపారగా బోరగిలి పాన్పు నాల్గుమూలలకును వచ్చుచు మెలగి మెలగి
లలి గపోలమ్ములు గిలిగింతలువుచ్చి నవ్వింప గలకల నవ్వినవ్వి
ముద్దులు దొలుకాడ మోకాల గేలను దడుపుచు నెందును దారితారి
నిలుచుండబెట్టి యంగుళు లూతసూపగా బ్రీతితప్పడుగులు వెట్టిపెట్టి
అన్నగంటి దండ్రినిగట్టి నయ్యగంటి
నిందురావయ్య విందుల విందవంచు
నర్ధిదను బిలువంగ నడయాడియాడి
యుల్లసిల్లె గృష్ణుడు శైశవోత్సవముల

వెన్నెవెట్టెద మాడుమాయన్న యన్న
మువ్వలును మొలగంటలు మొరయు నాడు
నచ్యుతుండు, గోపికలు దమయాత్మ బ్రమసి
పెరువు దరువను మరచి సంప్రీతిజూప

కృష్ణదేవరాయలు 1509-1530 (ఈ సామ్రాజ్యం 1336 నుండి 1660 వరకు వర్ధిల్లింది. )
Preview
 స్వస్వయంగా  కవిపండితుడు కూడా కావడంతో 
ఇతనికి సాహితీ సమరాంగణ సార్వభౌముడుఅని బిరుదు. 
ఈయన స్వయంగా సంస్కృతంలో జాంబవతీ కళ్యాణము
మదాలసాచరితము,సత్యవధూపరిణయము,
సకలకథాసారసంగ్రహముజ్ఞానచింతామణిరసమంజరితదితర గ్రంథములు,
 తెలుగులో ఆముక్తమాల్యద లేకగోదాదేవి కథ అనే గ్రంథాన్ని రచించాడు.[3] 
తెలుగదేల యన్న దేశంబు తెలుగేను 
తెలుగు రేడ నేను తెలుగొకొండ 
ఎల్ల జనులు వినగ ఎరుగవే బాసాడి
 దేశభాష లందు తెలుగు లెస్స
అన్న పలుకులు రాయలు వ్రాసినవే


రాయల ఆస్థానానికి భువన విజయము అని పేరు. భువనవిజయంలోఅల్లసాని పెద్దననంది తిమ్మనధూర్జటి,మాదయ్యగారి మల్లన (కందుకూరి రుద్రకవి), అయ్యలరాజు రామభద్రుడుపింగళి సూరనరామరాజభూషణుడు(భట్టుమూర్తి), తెనాలి రామకృష్ణుడు అనే ఎనిమిది మంది కవులు ఉండేవారని ప్రతీతి. వీరు అష్టదిగ్గజములు గా ప్రఖ్యాతి పొందారు.

అల్లసాని పెద్దన
కేదారేశు భజించితిన్‌ శిరమునన్‌ కీలించితిన్‌ హింగుళా 
పాదాంభోరుహముల్‌ ప్రయాగనిలయుం పద్మాక్షు సేవించితిన్‌ 
యాదోనాథసుతాకళత్రు బదరీనారాయణుం కంటి నీ 
యా దేశంబననేల చూచితి సమస్తాశావకాశంబులన
*తొలితెలుగు ప్రబంధం , ప్రథమాశ్వాసము మనుచరిత్ర-
---------------------------------------------------
కలలంచు న్శకునంబులంచు గ్రహయోగంబంచు సాముద్రికం
బు లటంచుం దెవులంచు ,దిష్టియనుచు న్భూతంబులంచు న్విషా
దు లటంచు న్నిమిషార్ధ జీవనములందుం బ్రీతి పుట్టించి నా
సిలుగుల్ ప్రాణుల కెన్ని చేసితివయా ! శ్రీ కాళహస్తీశ్వరా !        

                   ఈశ్వరా !  రెప్పపాటు లో మరణించే  ఈ జీవుల యొక్క  జీవితాల లో మమకారాన్ని పుట్టించి ,  కలలనీ , శకునాలనీ ,  గ్రహా యోగ సాముద్రికాలనీ , రోగాలు ,  దిష్టులు భూతాలనీ , విషప్రయోగాలనీ  ఎన్ని ఆపదలను సృష్టించావు  స్వామీ  !
*ధూర్జటి   శ్రీ కాళహస్తీశ్వర శతకము
బమ్మెర పోతన - 1450–1510
Preview
మందార మకరంద మాధుర్యమునఁ దేలు మధుపంబు వోవునే మదనములకు
నిర్మల మందాకినీ వీచికలఁ దూఁగు రాయంచ సనునె తరంగిణులకు
లలిత రసాలపల్లవ ఖాది యై చొక్కు కోయిల సేరునే కుటజములకు
బూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరక మరుగునే సాంద్ర నీహారములకు
అంబుజోదర దివ్య పాదారవింద
చింతనామృత పానవిశేష మత్త
చిత్త మేరీతి నితరంబు జేరనేర్చు
వినుతగుణశీల! మాటలు వేయునేల?
శతకములు ,శతక కర్తలు
వేమన ( 1650 - 1750 ) శతకము
Preview
పద్యం:
ఆత్మశుద్ది లేని యాచారమదియేల?
భాండశుద్ది లేని పాకమేల?
చిత్తశుద్ది లేని శివపూజలేలరా?
విశ్వదాభిరామ వినురవేమ.
తాత్పర్యం:
మనసు నిర్మలతో లేనపుడు ఏపని చేసిన అది వ్యర్ధమే అగును.అపరిశుభ్రముగా వున్న పాత్రలో వంట చేసినచో అది శరీరమునకు మంచిదికాదుగదా.అదేవిధముగా నిశ్చలమైన మనస్సుతో చేయని భగవంతుని పూజలు కూడా ఎలాంటి ఫలితాలనివ్వవు.
కుండ కుంభ మన్న కొండ పర్వతమన్న
నుప్పు లవణ మన్న నొకటికాదె
భాష లిట్టె వేరు పరతత్వమొక్కటే
విశ్వదాభిరామ వినురవేమ
కుండ కుంభమన్న కొండ పర్వతమన్న
నుప్పు లవణమన్న నొకటి కాదె
భాష లిట్టె వేరు పరతత్వమొకటె
విశ్వధాభిరామ వినుర వేమ ! 
పద్యాలు
Vemana 
ఉప్పుగప్పురంబు న్రొక్కపోలికనుండు,
చూడచూడ రుచుల జాడవేరు,
పురుషులందు పుణ్య పురుషులువేరయ,

కరకు కాయల దిని కాషాయ వస్త్రముల్
బోడినెత్తి గలిగి బొరయుచుండ్రు,
తలలు బోడులైన తలపులు బోడులా

కుండ కుంభమన్న కొండ పర్వతమన్న
నుప్పు లవణమన్న నొకటి కాదె 
భాష లిట్టె వేరు పరతత్వమొకటె
చంపదగిన యట్టి శత్రువు తన చేత
చిక్కెనేని కీడు సేయరాదు
పొసగ మేలు చేసి పొమ్మనుటే చావు 

చిత్తశుద్ధి గలిగి చేసిన పుణ్యంబు
కొంచమైన నదియు కొదువ గాదు
విత్తనంబు మర్రి వృక్షంబునకు నెంత? 

పట్ట నేర్చు పాము పడగ యోరగజేయు
చెరుప జూచు వాడు చెలిమి జేసు
చంపదలచు రాజు చనువిచ్చుచుండురా 
విశ్వధాభిరామ వినుర వేమ ! 
Potana👍
వచన సాహిత్యము ఉపన్యాసములు బమ్మెర పోతన - డా. సి. నారాయనా రెడ్డి
భక్తి కవితా చతురానన బమ్మెర పోతన
- డాక్టర్‌ సి. నారాయణరెడ్డి గారు (సమీకరణ )

యువభారతి వారి వికాసలహరి - ఉపన్యాస మంజరి
ఉపన్యాసకులు: డాక్టర్‌ సి. నారాయణరెడ్డి గారు
ద్వితీయ సమావేశం (21-10-1973)
బమ్మెర పోతన అనగానే భాగవతం గుర్తొస్తుంది. భాగవతం అనగానే భక్తిలో తడిసిన గాథలు అలలుగా పొంగివస్తాయి - గజేంద్రమోక్షం, ప్రహ్లాదచరిత్ర, వామన చరిత్ర, రుక్మిణీకల్యాణం, అంబరీషోపాఖ్యానం, అజామిళోపాఖ్యానం - ఇంచుమించుగా భాగవతంలోని ఉపాఖ్యానాలన్నీ. ఈ భక్తమణుల చరిత్రలను ఏకత్రితం చేసిన మూలసూత్రం వాసుదేవతత్త్వం. వ్యాసునంతటివాడే వేదాలను వింగడించి, అష్టాదశ పురాణాలు విరచించి, బ్రహ్మసూత్రాలను ప్రవచించి, భారతాన్ని ప్రబంధీకరించి అప్పటికీ మనస్సు నిండక 'హరికీ, యోగివరులకూ అభిలాషమైన భాగవత గాథ పలుకనైతినే' అని ఖిన్నుడైనాడు. నారదబోధితుడై విష్ణుకథాశిరోమణియైన భాగవతాన్ని ఎన్నుకున్నాడు. ఆ రకంగా తన మదిలో కలిగిన అరకొరలను తీర్చు కొన్నాడు.
వ్యాసభారతం తెలుగుసేత ఆంధ్రకావ్యలక్ష్మికి అసలైన కైసేత. ఆ యమ్మను అంతకుముందు చిటిపొటి నగలతో సింగారించిన తెలుగు కవులు లేకపోలేదు. వారి వెన్నెలపదాలూ, తుమ్మెదపదాలూ, ఉయ్యాలపాటలూ, నివాళిపాటలూ, ఏలలూ, జోలలూ పుడమితల్లి కడుపున కరిగిపోయి ఉంటాయి. దేశీయుల నాల్కలలో మాటుమణిగి ఉంటాయి; లేక ఏ తాటాకులలోనో, రాగిరేకులలోనో, రాతిపలకపైనో ముక్తకప్రాయంగా పడి ఉంటాయి. అయితే తెలుగు కవిత్వానికి తొలిసారిగా గ్రంథస్థితి కలిగించింది కవిత్రయమే. అంటే నేటి గ్రాంథిక భాషకు పాదులువేసినవారు నన్నయ్య - తిక్కన్న - ఎర్రన్నలే! భాషకేకాదు, తెలుగులో కావ్యరచనాశైలిని తీర్చిదిద్దింది కూడా ఈ మూర్తిత్రయమే! చతుర్వేదసారమైన వ్యాసభారతం వారిచేతిలోపడి కావ్యచిక్కణత్వాన్ని సంతరించుకొంది. పద్యవిద్యకు ఆద్యుడైన వాల్మీకి రచించిన రామాయణం భాస్కరాదుల ద్వారా తెలుగు పొలంలో పదంమోపింది. ఆ విధంగా భారతీయ సంస్కృతికి మూల కందాలయిన మూడు గ్రంథాలలో భారతరామాయణాలు ఆంధ్రావళి చేతికందినవి. ఇక మిగిలింది వ్యాస భాగవతం. అప్పటికి దానిపై ఎవరిచూపూ పడనట్టుంది. చూపు పడినా చేయిసాచే చొరవ ఏ కవికీ కలుగనట్టుంది. ఆ మహాభాగవతం ఒక తెలుగు చిలుక కొరకు వేచి ఉంది. ఆ చిలుక తెలంగాణా నడిబొడ్డులో ఓరుగల్లుగడ్డలో బమ్మెర కొమ్మపై అప్పటికే వీరభద్ర విజయాన్ని వినిపించింది. భోగినీదండకాన్ని ఒక రాచవలరాచవాని చెవులకు రసికవాణిగా అందించింది. ఆ శుక రాజే మన పోతరాజు. ఆ "శుకముఖసుధాద్రవమున మొనసియున్న" భాగవతఫలరసాస్వాదనం తెలుగు రసిక భావవిదుల మహిత భాగధేయం.
వీరభద్రవిజయం రచించేనాటికి పోతన్న పిన్నవాడు. పెక్కు సత్కృతులు వ్రాయనివాడు. తన గురువైన ఇవటూరి సోమనారాధ్యుని ప్రసాదమహిమచే ఆ కృతిని రచింపగలిగినాడు. వీరభద్రవిజయం పోతన్న చేయనున్న సేద్యానికి తొలిచాలు. సర్వజ్ఞ సింగభూపాలునికి కానుకవెట్టిన భోగినీదండకం మలిచాలు. ఇకచాలు. ఆ తరువాత పోతన్న మనసు మలుపు తిరిగింది. అటు వీరశైవమతం మీదా ఇటు రసికరాజానుమతం మీదా దృష్టి తొలగింది. వ్యాసునికి విష్ణుకథ విరచించని కొరత తోచినట్లే మన పోతన్నకు "శ్రీమన్నారాయణ కథాప్రపంచ విరచనా కుతూహలం" కుట్మలించింది. అది రాకానిశాకాలం. సోమోపరాగసమయం. గంగాస్నానం, మహేశ్వర ధ్యానం - అదీ పోతన్న స్థితి. "కించిదున్మీలత లోచనుడై" ఉండగా రామభద్రుని సాక్షాత్కారం. మహాభాగవతం తెనుగు సేయమని ఆనతి. వెరగుపడిన చిత్తంతో పోతన్న అంగీకృతి. చిత్రం! పోతన్నకు కలిగిందేమో విష్ణుకథా రచనా కుతూహలం, చేసిందేమో మహేశ్వరధ్యానం. కట్టెదుట నిలిచినవాడో - రామచంద్రుడు. ఆమహానుభావుడు సూచించిన వస్తువో గోవిందకథాకదంబమైన భాగవతగ్రంథం. అంకితం తనపేరనే అన్నాడు ఆ రామరాజు. ఔ నన్నాడు మన పోతరాజు. "శ్రీరామచంద్రుని సన్నిధానంబు కల్పించుకొని", "హారికి, నందగోకులవిహారికి" అంటూ షష్ఠంతాలెత్తుకొని ఆంధ్రభాగవతాన్ని చిన్నికృష్ణునికి సమర్పించుకున్నాడు. రామన్నను శ్రోతగా నిలుపు కొని భాగవతపుగాథను విన్నవించుకున్నాడు. ఇదిచిత్రమా? కాదు. పోతన్న పెంపొందించుకున్న సమచిత్తం. శివుడు, కేశవుడు, రాముడు, కృష్ణుడు - ఈ నాలుగు మూర్తులకు ఏకత భజించటం పోతన్న అభేదభక్తికి తులలేని తార్కాణం. ఇంతటి సమన్వయ దృక్పథం అప్పటి మతవాతావరణంలో అపూర్వం.
ఏ కథను ఏరుకోవాలి? ఏరుకున్న కథను ఎక్కడ ఎత్తుకోవాలి? ఆ వస్తువును ఏ దృష్టితో విస్తరిస్తున్నదీ ఎలా వివరించాలి? తన కవితాలక్ష్యాలను ఏ రకంగా సిద్ధాంతీకరించాలి? ఏ కవికైనా ఈ అవస్థ తప్పదు. కృత్యాద్యవస్థ అంటే ఇదే. ఆదికవి నన్నయభట్టారకునికీ ఇది తప్పలేదు. అవతారికలో రాజరాజును గూర్చీ తనను గూర్చీ చెప్పుకున్న తర్వాత అసలు విషయం అందుకున్నాడు. తాను వ్రాయనున్న భారతం తన ఎన్నిక కాదు. అది ప్రధానంగా రాజరాజు మన్నిక. హిమకరుడు మొదలుకొని పాండవోత్తములవరకు తీగసాగిన తన వంశీయుల చరిత్రను తెలుగులో వినాలనే అభీష్టం రాజరాజుకు కలిగింది. అది కాస్తా తన కులబ్రాహ్మణుడైన నన్నయ చెవిలో వేసినాడు. భారత శ్రవణం అనేక పుణ్యఫల ప్రదమని దానికి ప్రాతిపదికకూడా వేసినాడు. ఆ రాజపోషకుని అనుమతంతో, విద్వజ్జనుల అనుగ్రహంతో తాను నేర్చిన విధంబున వ్యాసభారతాన్ని తెనిగించినాడు నన్నయ భట్టారకుడు. తెలుగులో ఆదికవి నన్నయ, సంస్కృతంలో ఆదికవి వాల్మీకి. మరి నన్నయ్య ఆ రామాయణాన్ని వదిలి భారతాన్ని చేపట్టడానికి ప్రధానకారణం రాజరాజుకు భారతంపట్ల గల అభిమానం అని తేలిపోయింది. అంటే వస్తువరణంలో కూడా ఆ కృతికర్తకు స్వేచ్ఛ లేదేమో అని అనుకోవలసి వస్తుంది. అవతారికారచనలోనూ తదనంతరకవులకు నన్నయ్యే మార్గదర్శి. తిక్కన్న స్థూలంగా ఆ సంవిధానాన్నే అనుసరించినా, కొంచెం కొత్త దారి తొక్కినాడు. నన్నయ్య తెనిగించగా మిగిలిన భారతాన్ని తాను రచించాలని సంకల్పించుకున్నాడు. ఇది ఎవరో సూచించిన వస్తువు కాదు. తిక్కన్న తానే చేసుకున్న ఎన్నిక. సరిగ్గా పోతన్న తిక్కన్న తెన్నునే అనుసరించినాడు. భాగవతావతారికను విరాటపర్వావతారికకు తోబుట్టువుగా తీర్చిదిద్దినాడు. తిక్కన్నలాగే తన వస్తువును తానే ఏరుకున్నాడు పోతన్న. తిక్కన్న భారత రచనా కౌతుకం కనబరిస్తే, పోతన్న శ్రీమన్నారాయణ కథా ప్రపంచ విరచనా కుతూహలం కనబరచినాడు. అతడు నిద్రించే సమయంలో "కలలో కన్నట్లు"గా హరిహరనాథుడు కనిపిస్తాడు. ఇతడు గంగాతీరంలో మహేశ్వరధ్యానం చేస్తూ కన్ను లరమూసుకొని ఉండగా రామభద్రు డగుపిస్తాడు. "కరుణారసము పొంగి తొరగెడు చాడ్పున" అన్న సీసపద్యంలో హరిహరనాధుణ్ని రూపుకట్టించినాడు తిక్కన్న. "మెఱుగు చెంగట నున్న మేఘంబు కైవడి" అన్న సీసపద్యంలో సీతానాధుణ్ని చిత్రించినాడు పోతన్న. అతడు సర్వేశ్వరుడు. ఇతడు రాజముఖ్యుడు. అక్కడ హరిహరనాధుడు సెలవిస్తాడు - భారత రచనా ప్రయత్నం భవ్య పురుషార్థ తరుపక్వఫలమని. దానిని తనకు కృతి ఇమ్మని; ఇక్కడ రామభద్రుడు ఆనతిస్తాడు - మహాభాగవతం 'తెనుగుసేయు'మని తనపేర అంకితమిమ్మని. తామే ఇతివృత్తాన్ని స్వీకరించడం, నరేశ్వరుణ్ని కాక సర్వేశ్వరుణ్ని కృతిపతిగా నిర్ణయించడం తిక్కన పోతన్నల కున్న సమధర్మం. ఈ కృతులు రచించేనాటికి ఇద్దరి మనః ప్రవృత్తులు ఎల్లలు లేని భక్తిసరిత్తులు. భారతరచనం తిక్కన్న దృష్టిలో ఆరాధన విశేషం. భాగవతరచనం పోతన్న దృష్టిలో భవబంధవిమోచనం. ఇక్కడే ఉంది పోతన్న అదృష్టం. చిత్తస్థితికి తగిన ఇతివృత్తం దొరికింది. పరవశించి పాడుకున్నాడు.
"పలికెడిది భాగవతమఁట
పలికించు విభుండు రామభద్రుండఁట; నేఁ
పలికిన భవహర మగునట;
పలికెద వేఱొండుగాథఁ బలుకఁగ నేలా?"
నాలుగు పలుకులను ప్రాసస్థానంలో చిలికి తన పులకలు వెలార్చుకొన్నాడు. అయితే భాగవతరచన అంతంత మాత్రాన జరిగేదికాదు. ఈ "సహజ పాండిత్యు"నికి అది తెలియదా? అదీ విన్నవించుకొన్నాడు.

"భాగవతము దెలిసి పలుకుట చిత్రంబు
శూలికైనఁ దమ్మి చూలికైన
విబుధజనుల వలన విన్నంత కన్నంత
తెలియ వచ్చినంత తేటపఱుతు."
భాగవతం తెలుసుకోవడం, తెలిసింది తెలుపుకోవడం చిత్రమట! నిజమే, రామాయణం అలలా సాగిపోయే మనిషి కథ. భారతం భిన్న లౌకిక ప్రవృత్తుల సంఘర్షణ వ్యథ. భాగవతం స్థూలదృష్టికి కృష్ణలీలాపేటిక, విష్ణుభక్తుల కథావాటిక. సూక్ష్మంగా పరిశీలిస్తే అది మధ్యమధ్య ఎన్నెన్నో విప్పలేని వేదాంతగ్రంథులున్న మహాగ్రంథం. ఆ ముడులు విప్పడం హరునికీ, విరించికీ దుష్కరమే! మరి ఆ భాగవత రహస్యం ఆ భగవంతునికే తెలియాలి. భారం అతనిపై వేసి వ్యాసభాగవతవ్యాఖ్యాత అయిన శ్రీధరుణ్ణి ఆలంబనం చేసుకుని తెలియవచ్చినంత తేటపరచినాడు ఈ వినయశీలుడు. ఈ తేటపరచటం ఏ తెలుగులో? నన్నయ ప్రారంభించిన తత్సమపద బహుళమైన తెలుగులోనా? లేక పాల్కురికి సోమన్న ప్రఘోషించిన జానుతెనుగులోనా? పోతన్న సాత్వికత అహంతలకూ వింతవింత పుంతలకూ అతీతమైనది.

"కొందఱికిఁ దెనుఁగు గుణమగుఁ;
గొందఱికిని సంస్కృతంబు గుణమగు; రెండున్‌
గొందఱికి గుణములగు; నే
నందఱి మెప్పింతుఁ గృతుల నయ్యైయెడలన్‌."
కొందరికి తెనుగు గుణమట. ఇందులో పరోక్షంగా పాలకురికి, ప్రత్యక్షంగా తిక్కన్న కనిపిస్తున్నారు. కొందరికి సంస్కృతం గుణమట. ఇందులో సుదూరంగా నన్నయ, సమీపంగా శ్రీనాథుడు వినిపిస్తున్నారు. ఆయాకవులే కాదు, వారి అనుయాయులు కూడా స్ఫురిస్తున్నారు. 'ప్రౌఢంగా పలికితే సంస్కృతభాష అంటారు. నుడికారం చిలికితే తెలుగుబాస అంటారు. ఎవరేమనుకున్నా నాకు తరిగిందేముంది? నా కవిత్వం నిజంగా కర్ణాటభాష' అని ఎదుటివాళ్లను ఈసడించి తోసుకుపోయే రాజసంగాని, తామసంగాని పోతన్నకు అలవడలేదు. అది శ్రీనాధుని సొత్తు. ఈ పద్యమే పోతన్న సత్త్వమూర్తికి అద్దం పట్టింది. 'ఆయా సందర్భాలనుబట్టి అందరినీ మెప్పిస్తాను' అన్న మాటలో వినయం ఎంత మెత్తగా ఉందో, విశ్వాసం అంత వొత్తుగా ఉంది. భాగవతం చదివితే తెలుస్తుంది అతని సంస్కృతగుణం; అచ్చతెనుగుతనం.

నన్నయాదులు భారతాన్ని ఆంధ్రీకరించినారు. భాస్కరరంగనాథాదులు రామాయణాన్ని అందించినారు. నాచన సోమన మారన వంటివారు పురాణాలను అనువదించినారు. వీ రెవ్వరూ తన పురాకృత శుభాధిక్యంవల్ల భాగవతాన్ని తెనిగించలేదు. దీనిని తెనిగించి పునర్జన్మ లేకుండా తన జన్మను సఫలం చేసుకుంటానని ఆకాంక్షించినాడు పోతన్న. వేయి నిగమాలు చదివినా సుగమం కాని ముక్తి భాగవతనిగమం పఠిస్తే అత్యంత సుగమం అని విశ్వసించినాడు. ఆ ముక్తివాంఛే భాగవత రచనకు మూలం. మొట్టమొదటి పద్యమే ఆ ఆశయానికి దిద్దిన ముఖతిలకం.

"శ్రీకైవల్యపదంబుఁ జేరుటకునై చింతించెదన్‌ లోకర
క్షైకారంభకు భక్తపాలనకళా సంరంభకున్‌ దానవో
ద్రేక స్తంభకుఁ గేళిలోలవిలసద్దృగ్జాలసంభూతనా
నాకంజాతభవాండకుంభకు మహానందాంగనాడింభకున్‌."
ఇది నాందీశ్లోకం వంటి పద్యం. ఆశీర్నమస్క్రియా వస్తునిర్దేశాలలోని ఒక లక్షణం నిక్షేపించడం దీని లక్ష్యం. "శ్రీవాణీగిరిజా శ్చిరాయ" అని నన్నయ అన్నాడు. "శ్రీయన గౌరి నాఁబరగు" అని తిక్కన అన్నాడు. "శ్రీకైవల్యపదంబు"ను పోతన్న ప్రస్తావించినాడు. ఈపద్యంలో నమస్క్రియతో పాటు వస్తునిర్దేశం కూడా ఉండటం విశేషం. భాగవత కథానాయకుడు నందనందనుడు. అత డవతార పురుషుడు. లోక రక్షణం ఆ అవతారానికి ప్రేరణం. అతడు గజేంద్రాది భక్తులను పాలించినవాడు. హిరణ్యకశిపు ప్రభృతి దానవుల ఉద్రేకాలను స్తంభింప జేసినవాడు. ఈ రెండు అంశాలు శ్రీమన్నారాయణుని శిష్టరక్షణకూ దుష్టశిక్షణకూ మూలకందాలు. భాగవత కథాచక్రం ఈ రెండు అంశాలచుట్టే చంక్రమించింది. ఈ రకంగా పోతన్న పై పద్యంలోని పాదచతుష్కంలో భాగవతంలోని పన్నెండు స్కంధాల పరమార్థాన్ని నిర్దేశించినాడు. మరొకవిశేషం ఈ పద్యంలోని నందాంగనా డింభకుడు కేవల స్థితికారుడే కాడు, సృష్టికారుడు కూడా. "కేళిలోల విలసద్దృగ్జాల సంభూత నానాకంజాత భవాండకుంభకు" అనే ప్రయోగంలో అది ధ్వనించింది. "దానవోద్రేకస్తంభకు" అనే మాటలో అతని లయ కారత్వం స్ఫురించింది. అంటే ఈ పద్యంలో నందింప బడిన పరమాత్ముడు త్రిగుణాత్ముడు. అయితే విశ్లేషించుకుంటే బోధపడే అర్థమిది. ఒక మహోర్మికలా ఉప్పొంగి వచ్చే మూర్తి మాత్రం సత్త్వానిది. కాష్ఠంకంటే ధూమం, ధూమంకంటే త్రయీమయమైన వహ్ని విశేషమైనది. అలాగే తమోగుణం కంటే రజోగుణం, రజోగుణంకంటే బ్రహ్మప్రకాశకమైన సత్త్వం విశిష్టమైనది. (ప్రథమ స్కంధం 59) అందుకే తొల్లిటి మునులు సత్త్వమయుడని భగవంతుడైన హరినే కొలిచినారు. ఆ భగవంతుని సత్త్వనిర్భర స్వరూపమే పైపద్యంలో ఉల్లేఖింపబడింది.

అవతారికలోని రచనాలక్ష్యాన్ని పరికించినా, నాందీపద్యాన్ని పరిశీలించినా పోతన్న ధ్యేయం కైవల్యమేనని బోధపడుతుంది. భవబంధరాహిత్యం, జన్మసాఫల్యం కైవల్యం వల్లనే సాధ్యం. ఆ కైవల్యం పోతన్న వాంఛించిన పరమపదం; పురాజన్మ తపఃఫలం. ఈ కైవల్యకాంక్ష ప్రవృత్తిలా భాసించే నివృత్తి; భాగవతంలోని ప్రధాన రసమైన భక్తికి ఆదిలోనే ఎత్తిన వైజయంతిక.

ఇంచుమించుగా సమకాలీనులైన శ్రీనాథ పోతనామాత్యుల వ్యక్తిత్వాల వాసి ఇక్కడే ఉంది. శ్రీనాథుడు శృంగారిగా ఎంత వ్యాపృతుడైనా 'ఈశ్వరార్చన కళాశీలుండ'ననే చెప్పుకున్నాడు. భోగినీదండకం వంటి పరమశృంగార కృతి రచించినా పోతన్న మహాభక్తుడుగానే పేరొందినాడు. కాశీఖండం, భీమఖండం, హరవిలాసం, శివరాత్రి మాహాత్మ్యం వంటి భక్తిప్రబంధాలు వ్రాసినా, నైషధంలోని రక్తివల్లనూ, చాటుపద్యాలలోని శృంగార ప్రసక్తివల్లనూ శ్రీనాథుడు శృంగారసనాథుడుగా స్థిరపడినాడు. రుక్మిణీకల్యాణం, రాసక్రీడాభివర్ణనం వంటి ఘట్టాలలో ఎంతటి శృంగారదంతురితాలైన వర్ణనలు చేసినా పోతన్న తెలుగుల పుణ్యపేటిగానే కీర్తింప బడుతున్నాడు. ఇందుకు ఒకకారణం - కాలం గడిచినకొద్దీ వీరిచుట్టూ అల్లుకున్న కట్టుకథలు. మరొకకారణం - కావ్యావతారికల్లో వీరి వ్యక్తిత్వాలు వేసుకున్న ముద్రలు. శ్రీనాథుని కృతులన్నీ నరాంకితాలు. అతని జీవితంలోని ఉజ్జ్వల ఘట్టాలన్నీ రాచకొలువులకే సమర్పితాలు. పట్టెడు వరిమెతుకులు, గుక్కెడు మంచినీళ్ళు పుట్టని దుర్దశలో కూడా ఆ రాజస మూర్తి అటు కృష్ణుణ్ణో, ఇటు శివుణ్ణో దుయ్యబట్టినాడు. 1 ఇరవై సంవత్సరాలు కొండవీటిలో విద్యాధికారిగా ఒక వెలుగు వెలిగి అంతటితో యశోభిలాష సన్నగిల్లక, ఎక్కడో కర్ణాటరాయల కొలువులో, నిక్కిపడే గౌడ డిండిమభట్టును ఉద్భట వివాదప్రౌఢితో ఓడించి, అతని కంచుఢక్కను పగులగొట్టించి, రాయల సభాగారంలో స్వర్ణస్నానం చేయించుకునే దాకా తృప్తిపడని మత్యహంకృతి అతనిది. దిక్కూమొక్కూ లేని అవసానదశలో దివిజకవివరుని గుండియలు దిగ్గురనేటట్టు కడ ఊపిర్లో గూడా కవిత లల్లగల్గిన ప్రౌఢవ్యక్తిత్వం అతనిది. మరి పోతన్న వ్యక్తిత్వం ఇందుకు భిన్నం. అతడు నరాధిపులను కొలువలేదు; సిరులకై ఉరుకులాడలేదు; అధికారాన్ని ఆశించలేదు; అహంకారాన్ని ప్రకటించలేదు. పూర్వకవులతోపాటు, వర్తమాన కవులతో పాటు భావికవులను గూడా బహూకరించిన వినయభూషణు డతడు. సమకాలీనకవులను సంభావించడమే ఒక విశేషం. పుట్టని కవులకు జేకొట్టడం పోతన్న సహనశీలానికి నిదర్శనం. సహనగుణం సత్త్వం పాదులో పుట్టేదే కదా! ఈ సత్త్వగుణాన్ని ఆధారంగా చేసుకునే పోతన్న నిరాడంబర వ్యక్తిత్వాన్ని గూర్చీ, నరాధిప పరాఙ్ముఖత్వాన్ని గూర్చీ కొన్ని చాటు కథలు ఆ నోటికానోటి కెక్కి నేటికీ తెలుగునాట వాడుకలో ఉన్నాయి. భాగవతాన్ని తన కంకిత మివ్వవలసిందని సర్వజ్ఞసింగ భూపాలుడు కోరడం, పోతన్న కాదనడం, భూపాలునికి కోపం వచ్చి దానిని నేలపాలు చేయడం - ఇదోకథ. శ్రీనాథుడూ పోతన్నా స్వయానా బావమరదులు. పోతన్న పొలం దున్నుతుంటే ఆ'నాథన్న' పల్లకిలో రావడం, అటు బోయీలు లేకుండా పల్లకి తేలిపోవడం, ఇటు ఎడ్లు లేకుండా నాగలి సాగిపోవడం - ఇది మరోకథ. ఇవే కాక 'కర్ణాటకిరాటకీచకు' లెవరో అతని కృతిని కాజేయాలని వస్తే ఆ తల్లి సరస్వతి 'కాటుక కంటి నీరు చనుకట్టు' మీద పడేటట్టు బావురు మనడం, "అమ్మా! ఏడువకమ్మా! నిన్ను ఎవరికీ అమ్మనమ్మా!" అని ఈ పరమభక్తుడు ఓదార్చడం - ఇదో పిట్టకథ. కృతిని ఇక్కడ 'ఇమ్మనుజేశ్వరాధముల కిచ్చి', అక్కడ 'కాలుచే సమ్మెటవ్రేటులం బడక' బమ్మెర పోతరాజు భాగవతాన్ని 'సమ్మతి శ్రీహరి కిచ్చి చెప్పె'నని అవతారిక లోని మరోపద్యం ఇచ్చే సాక్ష్యం. 2 పోతన్న పేరు చెప్పితేనే సగటు సాహితీ బంధువులకు ఈ పద్యమే గుర్తు కొస్తుంది. ఈ పద్యం పోతన్నది కాదంటే చాలా మందికి గుండెల్లో కలుక్కుమంటుంది. నిజానికి ఈ పద్య రచనలో ఏ కోశానా పోతన్న శైలీవాసన లేదు. 'సొమ్ములు కొన్ని పుచ్చుకొని', 'సొక్కి', 'శరీరము వాసి', 'కాలుచే సమ్మెటవ్రేటులు' 3 'సమ్మతి', 'ఇచ్చిచెప్పె' ఈ 'బమ్మెరపోతరా జొకఁడు' - ఇదీ ధోరణి. ఇవి పోతన్న పలుకులేనా? భావికవులను బహూకరించిన, భవబంధవిమోచనం ఆశించిన భక్తశిరోమణి మాటలేనా? కాదన వలసిన అవసరం లేకుండానే మరొక అంతస్సాక్ష్యం ఉంది. ఈ పద్యానికి ముందుమాట 'ఉభయ కావ్యకరణ దక్షుండనై' అన్నది. ఇది ఉత్తమపురుషంలో ఉంది. వెంటనే 'ఇమ్మనుజేశ్వరాధముల' పద్యంలో 'బమ్మెరపోతరాజొకఁడు' అంటూ ప్రథమ పురుషం దూకుడుంది. ఆ పద్యం తరువాత మరొక పద్యం. తరువాత 'అని మదీయ' అంటూ మళ్లీ ఉత్తమపురుషం దర్శనం ఇచ్చింది. పద్యశిల్పాన్నిబట్టే కాక అన్వయ దోషాన్ని బట్టి చూసినా ఇది పోతన్న పద్యం కాదనే అనిపిస్తుంది. అతని భక్తులో, అనురక్తులో తదనంతర కాలంలో ఈ పద్యాన్ని జొప్పించి ఉంటారు. ఎవరో ఎందుకు? అతని శిష్యుడు సింగయ్యే వ్రాసి ఉంటాడేమో? సింగయ్య భాగవతంలోని షష్ఠ స్కంధాన్ని రచించినాడు. పోతన్న పోతలోనే ఇతనూ ఒక అవతారిక సంతరించుకున్నాడు. పూర్వకవిస్తుతిలో శ్రీనాథునితోపాటు బమ్మెరపోతరాజును స్మరించినాడు. పోతరాజును స్తుతిస్తూ చెప్పిన పద్య మిది:

"ఎమ్మెలు సెప్పనేల? జగమెన్నఁగఁ బన్నగరాజశాయికిన్‌
సొమ్ముగ వాక్యసంపదలు నూఱలు చేసినవాని భక్తిలో
నమ్మినవాని భాగవతనైష్ఠికుఁడై తగువానిఁ బేర్మితో
బమ్మెర పోతరాజు కవి పట్టపురాజుఁ దలంచి మ్రొక్కెదన్‌."
ఈ పద్యంలో ఒకటి రెండు అంశాలు గమనింపదగినవి ఉన్నాయి. 'ఇమ్మనురాజేశ్వరాధముల' పద్యంలో 'సమ్మతి శ్రీహరి కిచ్చి చెప్పె' 'ఈబమ్మెర పోతరా జొకఁడు భాగవతంబు' అని ఉంది. 'ఎమ్మెలు సెప్పనేల' పద్యంలో 'పన్నగరాజశాయికిన్‌', 'సొమ్ముగ ... భాగవత నైష్ఠికుఁడై ... తగువాని ... బమ్మెర పోతరాజు.' అని ఉంది. ఆ పద్యంలో ప్రాసస్థానంలో 'సొమ్ములు' 'బమ్మెర' ఉన్నాయి. ఈ పద్యంలోనూ ఆ మాటలే ఉన్నాయి. అక్కడ 'జగద్ధితంబుగన్‌' అని ఉంటే ఇక్కడ 'జగమెన్నఁగ' అని ఉంది. 'సమ్మతి శ్రీహరి కిచ్చి' చెప్పడం అని అందులో ఉంటే ఆ స్వామికి 'సొమ్ముగ వాక్యసంపదలు నూఱలు' చేయడం ఇందులో ఉంది. ఈ రెండు పద్యాల్లోనూ పోతన్న భక్తి తత్పరతే ఉగ్గడింపబడింది. పైగా రెండుపద్యాల గతికూడా ఒకేస్థితిలో ఉంది. కనుకనే ఈ సింగయ్యే ఆ పద్యం రచించి పోతన్న అవతారికలో చేర్చి ఉంటాడేమో అనే సందేహం కలుగుతుంది. అలాకాదు. పోతన్న పద్యానికే సింగన్న పద్యం అనుకరణమేమో అని ఎవరైనా వాదించవచ్చు. అందుకు నా సమాధానం మొదట చెప్పిందే. పద్యశిల్పంలో గానీ, పదప్రయోగంలో గానీ, భావశుద్ధిలోగానీ ఈ పద్యంలో పోతన్నముద్ర ఏమాత్రం లేకపోవడమే. ఇంకా 'హాలికులైననేమి, గహనాంతర సీమల కందమూల కౌద్దాలికులైననేమి' అంటూ ప్రాసస్థానంలో గుప్పించిన అనుప్రాస సౌరభం ఇందుకు సాక్ష్యం.

అవతారిక దృష్ట్యానే కాక భాగవత కథల్లో ఉపాఖ్యానాల్లో పోతన్న మూలాతిరిక్తంగా పెంచిన పట్టులను బట్టీ, పేర్చిన పద్యాలను బట్టీ, అతని సత్త్వరమణీయమూర్తి సాక్షాత్కరిస్తుంది. గజేంద్రుని సంశయంలో, ప్రహ్లాదుని నిశ్చయంలో, గోపికల ఉద్వేగంలో, వామనుని ఉత్తేజంలో - ఇవేకాక నవవిధ భక్తిలతల బహుముఖ వికాసంలో, భక్తిరసతరంగితమైన పోతన్న చిత్తవృత్తి పలువిధాలా ప్రస్ఫుట మవుతుంది. వ్యాసభగవానుని భాగవత కోశాన్ని సైతం క్షణకాలం మరచిపోయి, ఆయా భాగవతుల శ్రవణకీర్తనలకు లోనై ఆ పాత్రలన్నీ తానై పరవశించి, పద్య సంఖ్యను పెంచి, ప్రతిభా శిఖరాలపై భాసించిన సన్నివేశాలు ఆంధ్ర భాగవతంలో కోకొల్లలు. అందుకే అంటున్నాను - అవతారికలోనేకాక ఆంధ్ర భాగవతంలో గూడా అడుగడుగున పోతన్న సాత్త్విక చిత్తవృత్తి, భక్తిభావనా ప్రవృత్తి వేయిరేకులతో విప్పారినవని.

నవవిధ భక్తులను కథాత్మకంగా ప్రపంచించిన ప్రథమ గ్రంథం వ్యాసభాగవతం. ఆ భక్తిరస ఘట్టాలను ఇంతకు రెండింతలుగా విస్తరించి తొలిసారిగా మధుర భక్తికి పచ్చల తురాయిని కూర్చిన తెలుగు కావ్యం పోతన్న భాగవతం. ప్రహ్లాదుని నోట వ్యాసుఁడు పలికించిన భక్తిశాఖ లివి -

"శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం
అర్చనం వందనం దాస్యం సఖ్య మాత్మనివేదనమ్‌"
దీనికి పోతన్న చేసిన తెలుగు సేత ఇది -

"తనుహృద్భాషల సఖ్యమున్‌ శ్రవణమున్‌ దాసత్వమున్‌ వందనా
ర్చనముల్‌ సేవయు నాత్మలో నెఱుకయున్‌ సంకీర్తనల్‌ చింతనం
బను నీ తొమ్మిది భక్తి మార్గముల సర్వాత్మున్‌ హరిన్‌ నమ్మి స
జ్జనుఁడై యుండుట భద్రమంచుఁ దలతున్‌ సత్యంబు దైత్యోత్తమా!"
ప్రహ్లాదుడు, గజేంద్రుడు, అంబరీషుడు, కుచేలుడు, ధ్రువుడు, అక్రూరుడు, రుక్మిణి, గోపికలు - ఆయా భక్తిశాఖల విరబూసిన ప్రసూనాలు. ప్రహ్లాదుడూ, రుక్మిణీ, గోపికల వంటి పాత్రలలో పోతన్న పరమ భాగవత సత్త్వం, అరీణ భక్తితత్త్వం శబలసుందరంగా భాసిస్తాయి. ఇది చెప్పాలని ప్రహ్లాదుని ముఖతః ఎన్నెన్ని భంగులలో ఎన్నెన్ని ఫణుతులలో చెప్పించినాడు పోతన్న!

"మందార మకరంద మాధుర్యమునఁ దేలు మధుపంబు వోవునే మదనములకు"

అంటాడు. మరోసారి -

"కంజాక్షునకు గాని కాయంబు కాయమే"

అంటాడు. ఇంకోసారి -

"కమలాక్షు నర్చించు కరములు కరములు"

అంటూ లాటానుప్రాసల్లో ఉద్ఘాటిస్తాడు. ఆ 'అంబుజోదర దివ్యపాదారవిందాలు', ఆ 'చింతనామృతం', ఆ 'మత్తచిత్తం' ఎన్ని సార్లంటాడు! ఎన్ని తీర్లంటాడు! విసుగులే దా భక్తవరుని నోటికి. అది పునరుక్తిదోష మని అనిపించనే అనిపించదు పరవశించిన ఆలేఖినికి. ఇంతకూ పోతన్న రచించిన భక్తి పద్యాల్లో కోటికెక్కిన 'మందార మకరంద' పద్యం అటు వ్యాసునిదీ కాదు, ఇటు పోతన్నదీ కాదు. పాలకురికి సోమన్నది. సోమన్న పోతన్నకు పూర్వీకుడు. బమ్మెరకు సమీపంలో ఉన్న పాలకురికి వాస్తవ్యుడు. అతని చతుర్వేదసారంలోనూ, బసవ పురాణంలోనూ ఈ పద్యం పోలికలే ఉన్నాయి -

'రాకామలజ్యోత్స్న ద్రావు చకోర - మాకాంక్ష సేయునే చీకటి ద్రావ' (బసవ పురాణం)

అని సోమన్న అంటే

'పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకం - బరుగునే సాంద్ర నీహారములకు'

అని పోతన్న అంటాడు.

'విరిదమ్మి వాసన విహరించు తేటి - పరిగొని నుడియునే ప్రబ్బలి విరుల' (బసవ పురాణం)

అని సోమన్న అంటే

'మందార మకరంద మాధుర్యమునఁ దేలు - మధుపంబు వోవునే మదనములకు'

అని పోతన్న అంటాడు. అయితే సోమన్నకు రాని కీర్తి ఈ పద్యంవల్ల పోతన్న కెందుకు వచ్చింది? అక్కడే ఉంది పోతన్న పోత. 'మందార' 'మకరంద' 'మాధుర్య' 'మధుప' 'మదనములు' - ఎన్నిమకారాల ప్రాకారాలు కట్టినాడు! పద్యాన్ని ఎంత ప్రాసాదరమ్యంగా నిలబెట్టినాడు! అక్షర రమ్యతలో నన్నయ్యను దాటి, ఆపై అంచులు ముట్టినాడు. తరువాతివా ళ్ళెవరైనా ఈ శైలిని అనుకరిస్తే జారిపడిపోవడమో, నీరుగారిపోవడమో జరిగే అంత సొంతపుంత చేపట్టినాడు. మరి 'కమలాక్షు నర్చించు కరములు కరములు' కూడా పోతన్న కొత్తగా చెప్పింది కాదు. భీమఖండంలో

శ్రీభీమనాయక శివనామధేయంబుఁ జింతింపనేర్చిన జిహ్వజిహ్వ
దక్షవాటీపురాధ్యక్ష మోహనమూర్తిఁ జూడంగనేర్చిన చూపుచూపు
దక్షిణాంబుధితట స్థాయిపావనకీర్తి చే నింపనేర్చిన చెవులుచెవులు
తారకబ్రహ్మవిద్యాదాతయౌదల విరులు పూన్పఁగ నేర్చు కరముకరము
ధవళకరశేఖరునకుఁ బ్రదక్షిణంబు నర్థిఁ దిరుగంగ నేర్చిన యడుగు లడుగు
లంబికానాయకధ్యాన హర్షజలధి మధ్యమునఁ దేలియాడెడు మనసు మనసు
అని శ్రీనాథు డెన్నడో అన్నదే. కాని లోకానికి తెలిసింది 'కమలాక్షు నర్చించు కరములు కరము'లే. ఈ ప్రాచుర్యానికి కారణం కూడా పోతన్న కూర్చిన పదబంధ తోరణమే.

నవవిధ భక్తుల్లో "శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, ఆత్మనివేదనం" - ఇవన్నీ ఒక పాదులో పుట్టిన మొలకలే. సఖ్యం మాత్రం వీటికంటే భిన్నతత్త్వం కలది. రుక్మిణికి శ్రీకృష్ణునిపట్ల గల రక్తికీ, భక్తికీ నేపథ్యం ఆత్మనివేదనం. అర్చన వందన స్మరణాదులు ఆ ఆత్మార్పణంలో నుంచి ఉదయించిన రేఖలు. కుచేలు డున్నాడు, అర్జును డున్నాడు. వీళ్ళది ప్రధానంగా సఖ్యభక్తి. అనుషంగికంగా ఆ సఖ్యం చుట్టూ స్మరణవందన పాదసేవనాదులు పరివేషించక పోలేదు. మరి మధుర భక్తికి మూలమేది? జీవాత్మ పరమాత్మల వియోగం. అఖండ పరమాత్మనుండి ఖండశః అంశతః విడివడిన జీవాత్మలు ఆ మూలాత్మను కలుసుకోవాలనే తపనమే భగవద్రతిభావనకు ప్రాతిపదిక. త్రేతాయుగంలో మునులు, ద్వాపర యుగంలో గోపికలు భగవద్విరహంలో సంతప్తలైన జీవాత్మలు. గోపిక లున్నారు. వాళ్ళకు ఇళ్ళూ, వాకిళ్ళూ ఉన్నాయి. కొందరికి పతులూ, సుతులూ ఉన్నారు. అయినా శారదయామినిలో యమునా తీరంలో బృందావనిలో గోపాలుని మురళీగానం ఆలకించగానే అన్నీ మరచి పరుగులు తీస్తారు. బృందావని చేరుకొని నందకిశోరుణ్ణి కానక రసోన్మాదంలో ఎలుగెత్తి పిలుస్తారు. ఆ మోహనమూర్తిని పదేపదే స్మరించుకొని ఇలా ఆక్రందిస్తారు -

"నల్లనివాఁడు పద్మనయనంబులవాఁడు కృపారసంబు పైఁ
జల్లెడువాఁడు మౌళిపరిసర్పిత పింఛమువాఁడు నవ్వు రా
జిల్లెడుమోమువాఁ డొకఁడు చెల్వలమానధనంబు దోచె నో
మల్లియలార! మీ పొదల మాటున లేఁడుగదమ్మ! చెప్పరే!"
మధ్యమధ్య ఆ మాధవుడు, ఆ గోపికా మనోభవుడు తళుక్కున మెరుస్తాడు. అంతలోనే అంతర్హితుడౌతాడు. అప్పుడు గోపికల వియోగవిధురహృదయాలు ఇలా సంభ్రమిస్తాయి -

"అదె నందనందనుం డంతర్హితుండయ్యెఁ - బాటలీతరులార! పట్టరమ్మ!
హేలావతులఁ గృష్ణ! యేల పాసితివని - యైలేయలతలార! యడుగరమ్మ!
వనజాక్షుఁ డిచటికి వచ్చి డాఁగఁడు గదా - చూతమంజరులార! చూడరమ్మ!
మానినీమదనుతో మారాక యెఱిఁగించి - మాధవీలతలార! మనుపరమ్మ!
జాతిసతులఁ బాయ నీతియె హరి కని
జాతులార! దిశలఁ జాటరమ్మ!
కదళులార! పోయి కదలించి శిఖిపింఛ
జూటుఁ దెచ్చి కరుణఁ జూపరమ్మ!"
సమస్త చరాచర జీవకోటికి అధినాధుడు మాధవుడు. ఆ మాధవుడే తమధవుడని భ్రమించినారు గోపికలు. ఆ భ్రమావరణమే వారి మనస్సుల మీద మోహయవనికలను కప్పింది. ఆ ముగ్ధప్రవృత్తే మధురభక్తికి మూలం. ఈ మధురభక్తిని రాసక్రీడాది వర్ణనంలో హృదయంగమంగా చిత్రించినాడు పోతన్న.

లోకంలో భక్తకవులు పలువు రున్నారు. వారందరు ప్రజాకవులు కాలేరు. ఒక తుకారాం, ఒక సూరదాసు, ఒక కబీరు, ఒక పోతన్న ప్రజాకవులుగా ప్రాచుర్యం పొందిన భక్తకవులు. మరి ప్రజాకవి ఎవడు? సామాన్యప్రజల జీవితసమస్యలను చిత్రించేవాడు. ఇది బాగా వాడుకలో ఉన్న అభిప్రాయం. ఈ దృష్టితో చూస్తే పోతన్న ప్రజాకవి కాలేడు. అతడు ప్రజల దైనందిన జీవితసమస్యలకు బొమ్మకట్టి చూపలేదు. భాగవతుల భక్తిభావ పరంపరలకు శ్రుతులు కూర్చి కృతులు అల్లుకున్నాడు. ఆ భాగవతుల్లో ప్రహ్లాదునివంటి ఆజన్మజ్ఞానులు ఉన్నారు. గజేంద్రుని వంటి అర్ధజ్ఞాను లున్నారు. కుచేలునివంటి ఆర్థికదుర్దశాపీడితులున్నారు. ఈభక్తుల స్థితిగతులు వేరైనా, వారి వారి సంస్కారమతులు వేరైనా, అందరినీ కలిపికుట్టే మూలసూత్రం ఒకటుంది. అదే ఆర్తి. అది జీవాత్మలు పరమాత్మకు నివేదించుకునే అలౌకికమైన ఆర్తి. భక్తపరమైన ఈ ఆర్తిని సార్వకాలీన సామాన్య ప్రజల ఆర్తిగా చిత్రించడంవల్లనే భక్తకవియైన పోతన్న ప్రజాకవియైనాడు. "కలడు కలం డనెడువాడు కలడో లేడో" అంటూ ఆందోళించినవాడు కరిరాజే కానక్కరలేదు, ఏ మూగజీవికైనా ఇది చెల్లుతుంది. "ఇందుఁ గలడందులేడని సందేహము వలదు" ఇది ఏ ప్రహ్లాద భాషితమో కానక్కరలేదు, ఏ దృఢసంకల్పునికైనా ఇది సరిపోతుంది. "ఊరక రారు మహాత్ములు" దీన్ని ఏ గర్గమునికో ముడివెట్ట నక్కరలేదు. ఇప్పటికీ ఏ మహానుభావుని రాకకైనా ఇది వర్తిస్తుంది. "ఎందరో మహానుభావులు" అన్నంత వ్యాప్తి పొందిన సూక్తి ఇది. అయితే ఈ సూక్తి సహజ గంభీర్యాన్ని కాస్తా వదలుకొని కాలంగడిచిన కొద్దీ ఛలోక్తిగా మారడం కూడా జరిగింది. అంటే సామెతలకోవలో చేరిందన్నమాట. ఒక కవి రచించిన పద్యపాదాలు సామెతలుగా, లోకోక్తులుగా చెలామణి కావడం కంటె ఆ కవికి అంతకు మించిన ప్రాచుర్యం ఏముంది? ఇలా లెక్కించుకుంటూ పోతే, పోతన్న వందలాది పద్యాల్లోంచి వేలకొద్దీ పాదాలను ఉదాహరించవలసివస్తుంది. ప్రాచీనాంధ్ర కవులలో బహుళంగా ఉదాహరింపబడుతున్న వాళ్ళల్లో ఇద్దరే ఇద్దరిని చెప్పుకోవాలి. ఒకడు పోతన్న. మరొకడు వేమన్న. వేమన్న అక్షరాలా ప్రజాకవి. అధిక్షేపం అతని ఆయుధం. సంఘసంస్కరణం అతని లక్ష్యం. అతని ప్రతిపద్యం ప్రజలజీవితాలకు సంబంధించిందే. అతని ప్రతి విసురు పచ్చని ప్రజాజీవనాన్ని తొలిచే చీడపురుగులకు సంబంధించిందే. ప్రజలభాషలో ప్రజల సమస్యలను చిత్రికపట్టి వేమన్న ప్రజాకవి యైనాడు. భాగవతుల భక్తిభావనలను సామాన్య ప్రజల ఆర్తికి పర్యాయంగా సమన్వయించి పోతన్న ప్రజాకవి యైనాడు. బమ్మెరకు వెళ్ళి అక్కడి పొలాల నడిగితే చెబుతాయి - "ఇదిగో! ఇది పోతన్నగుడి! అదిగో! అది మల్లన్నమడి" అని. పోతన్న గుడి నిజంగా గుడి కాదు, పాతుకొని ఉన్న ఒక రాతిపలక. ఆరాతిపలకను పోతన్నకు ప్రతిరూపంగా నేటికీ అక్కడి పల్లీయులు భావించు కుంటున్నారంటే ఇప్పటికీ పోతన్న ఎంత సజీవంగా ఉన్నాడో ఊహించుకోవచ్చు. మరి మల్లన్నమడి మాటేమిటి? ఈ పోతన్న కొడుకైన రైతన్న దున్నిన పొల మది.

కవితాకేదారాన్ని పండించిన హాలికుడుగా అన్నివేళలా తలచుకోవడానికి అనువైన పద్యఖండాలను అందించిన ఆదర్శమానవుడుగా పోతన్న చిరంజీవి. భావికవులను బహూకరించిన ఆ పరమ భాగవతునికి తప్ప అంతంత మాత్రంవానికి ఉంటుందా ఇంతటి సముజ్జ్వల భావి. ఎప్పుడో పొట్టివడుగైన వామనమూర్తి ఇంతై అంతై అంతంతై మూడు లోకాలను ఆక్రమించినట్లు - ఎక్కడో బమ్మెరవంటి చిట్టూరిలో పుట్టిన పోతన్న మూడు కాలాలను ఆకట్టుకునే అమృత కృతులను నిర్మించగలిగినాడు. అవతారికలో అతడు నివేదించుకొన్న

ఈ పద్యం చూడండి -

"ఒనరన్‌ నన్నయ తిక్కనాది కవు లీయుర్విం బురాణావళుల్‌
తెనుఁగుం జేయుచు మత్పురాకృతశుభాధిక్యంబు తా నెట్టిదో
తెనుఁగుం జేయరు మున్ను భాగవతమున్‌ దీనిం దెనింగించి నా
జననంబున్‌ సఫలంబుఁ జేసెదఁ బునర్జన్మంబు లేకుండఁగన్‌"
భాగవతాన్ని తెనిగించి పోతన్న తనజన్మను సఫలం చేసుకున్నాడు. ఆ భాగవత పద్యాలను పఠించి తెలుగు ప్రజలు తమ జీవితాలనే పండించుకున్నారు.

సూచికలు :
1
ఫుల్ల సరోజ నేత్రయల పూతన చన్ను విషంబు ద్రావితం
చల్ల దవాగ్ని మ్రింగితి నటంచును నిక్కెదవేల తింత్రిణీ
పల్లవయుక్తమౌ నుడుకుఁ బచ్చలిశాకము జొన్నకూటితో
మెల్లన నొక్కముద్ద దిగమ్రింగుము నీవన గాననయ్యెడిన్‌.

సిరిగలవానికిఁ జెల్లును
తరుణుల పదియాఱువేలఁ దగఁ బెండ్లాడన్‌
తిరిపెమున కిద్ద ఱాండ్రా
పరమేశా! గంగ విడుము! పార్వతి చాలున్‌.
వెనక్కి
2
ఇమ్మనుజేశ్వరాధముల కిచ్చి పురంబులు వాహనంబులున్‌
సొమ్ములుఁ గొన్ని పుచ్చుకొని సొక్కి శరీరముఁ బాసి కాలుచే
సమ్మెటవాటులం బడక సమ్మతి శ్రీహరి కిచ్చి చెప్పె నీ
బమ్మెరపోతరా జొకఁడు భాగవతంబు జగద్ధితంబుగన్‌.
వెనక్కి
3
ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ ప్రతినిబట్టి 'సమ్మెటవాటు'లే అనుకోండి.
వెనక్కి