Showing posts with label 18.వేమన చారిత్రక గతిని నిర్దేశించిన తాత్వికులు. Show all posts
Showing posts with label 18.వేమన చారిత్రక గతిని నిర్దేశించిన తాత్వికులు. Show all posts

30.8.24

18.వేమన: చారిత్రక గతిని నిర్దేశించిన తాత్వికులు

చారిత్రక గతిని నిర్దేశించిన తాత్వికులు
వేమన ( 1650 రాయలసీమ )
భావ విప్లవం
చారిత్రక గతిని నిర్దేశించిన తాత్వికులలో వేమన ఒకరు.
సాహిత్య భావ శకలాలతో వ్యక్తులను , చరిత్రని దర్శించగలం, (వేమన,జీసస్ ) 

సమాజం వసుదైకకుటుంబం యెక్క నమూన. తాత్వికులు సమాజంతో మమేకమై వారి కాలచక్రపరిధిని దాటి ఆలోచించారు సమాజానికి నూతనమార్గాన్ని నిర్దేశించారు .  

అజ్ఞానపు టంధయుగంలొ ఆకలిలొ,ఆవేశంలో తెలియని ఏ తీవ్రశక్తులో నడిపిస్తే నడిచి మనుష్యులు అంతా తమప్రయోజకత్వం తామేభువికధినాధులమని స్థాపించిన సామ్రాజ్యాలునిర్మించిన క్రుత్రిమ చట్టాలు ఇతరేతర శక్తులు లేస్తేనే పెకమేడలై పరస్పరం సంఘర్షించిన శక్తులతో చరిత్ర పుట్టింది.- శ్రీశ్రీ 
నేను సైతం ప్రపంచానికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను 
నేను సైతం విశ్వవృష్ఠికి అశృవొక్కటి ధారవోసాను 
నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మొసానూ - శ్రీశ్రీ

వేమన సమాజంలో భావవిప్లవ ఆద్యుడు తన కాలం తర్వాత వచ్చిన మార్క్స్ కు ధీటుగా భావన చేయగలిగినవాడు 

వేమన చరిత్ర 
1.వేమన కాలము 1650 
2.వేమన కాలంనాటికి చరిత్ర
1646 నుండి 1675 రాయలసీమ రాజకీయ సంక్షోభం స్థానిక ప్రభువుల అంతః కలహాలు
3.విదేశీ యాత్రికులు
4.పురావస్తు ఆధారాలు
5.శాసనాలు
6.నానెములు 
7.సాహిత్యఆధారాలు
సాహిత్య ఆధారాలు -వేమన పద్యాలు
 (మౌఖిక)
8.మత లౌకిక,9.స్వదేశీ,10.విదేశీ 
వేమన 
ప్రపంచ భాషా కవుల్లో గొప్పవారిని ఎంపిక చేసే సందర్భంలో వేమనను ఎన్నుకొని ఆ రచనలను పలు భాషలలోకి అనువదించారు.
యోగివేమన జయంతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వేడుకగా ప్రతి సంవత్సరం జనవరి 19న అధికారికంగా నిర్వహిస్తారు.

కేంద్ర సాహిత్య అకాడమీ ప్రముఖ పాత్రికేయుడు నార్ల వెంకటేశ్వరరావు చేత వేమన జీవిత చరిత్రను వ్రాసి 14 భాషల్లోకి అనువదించారు. ఆంగ్ల, ఐరోపా భాషలన్నింటిలోకి, అన్ని ద్రావిడ భాషలలోకి వేమన పద్యాలు అనువదించబడ్డాయి. వేమనకు లభించిన ఈ గౌరవం మరే తెలుగు కవికి లభించలేదు.

ప్రముఖులు- భావాలు
బహుశా అప్పటి సాహితీ ప్రక్రియలలో ఒక్క శతకసాహిత్యమే సంఘంలోని ఆచారాలను నిశితంగా విమర్శించడానికి ఉపయోగపడింది. వీటిల్లో వేమన శతకము ఎప్పటికీ అగ్రగామి. మూడు పంక్తులలో ముప్ఫై పేజీలకు సరిపోయే భావాన్ని ఇమిడ్చిన మేధావి, తత్వ వేత్త. అందరూ అనుకొన్నదానికి కూడా నిక్కచ్చిగా ఎదురు నిలచిన మహానుభావుడు వేమన.

తనకాలపు పరిధిలో సామాజికనైనా చైతన్య దృష్టితో కవిత్వం చెప్పిన తొలి తెలుగు కవి వేమన్న. అదే దృష్టితో రచన చేస్తున్న ఈనాటి కవులు తమకన్నా పూర్వుల సంప్రదాయాన్ని తెలుసుకోవడం ఆరోగ్యకరమే గాక అవసరమని కూడా కోరుకుంటున్నాం. వెనకటి మంచిని జీర్ణించుకొని కొత్త పరిస్థితులను గుర్తించి ముందు చూపుతో రచనలు చేయటం ఈనాటి రచయితల కర్తవ్యం.
తన కాలాన్ని మించి కొన్ని విషయాల్లో ముందుకు చూడగలిగిన కవిగా వేమన్నను మనం గౌరవించాలి. విగ్రహారాధనను వ్యతిరేకించాడు. శైవ వైష్ణవ మతాలవారి ఆర్భాటాలను, వారి దురాచారాలను, మోసాలను బట్టబయలు చేశాడు. చిలుక పలుకుల చదువులను విమర్శించాడు. కాకులకు పిండాలు పెట్టటం వంటి మూర్ఖాచారాలను తీవ్రంగా ఖండించాడు. శ్రమశక్తిలోనే సర్వమూ ఉన్నది అనేంత నిశిత పరిశీలన చెయ్యగలిగిన వేమన్న మామూలు కవి, తనకాలపు ఛత్రంలో ఇమడని గొప్ప కవి.
వేమన్నా రచన మార్గంలో మూడు అంశాలు గుర్తించవచ్చు. 
1.ప్రజలభాషలో ప్రచారంగా ఉన్న పదాలను, మాండలికాలను ప్రయోగించి ప్రజలకు సన్నిహితమైన రచన చెయ్యటం. 2.చెప్పదలచుకున్న భావాన్ని తగిన విస్తీర్ణంలోనే క్లుప్తంగా చెప్పటం. 3.ఊహలోనుంచికాక జీవితం నుంచి ఉపమానాలను ఏరుకోవటం. కవితా దృక్పథం విషయంలో మాత్రమే కాక రచనా విధానంలో కూడా వేమన్న ఆదర్శం నుంచి ఈనాటి కవులు నేర్చుకోవలసింది చాలా ఉందని దృఢంగా భావిస్తున్నాం. 
- చేకూరి రామారావు 

ఆయన పండితుల కోసం రాయలేదు.
పల్లెసీమల్లోని నిరక్షరాస్యులెైన అకృత్రిమ పామర జనం కోసం రాసాడు.ఆయన పొందిన లోకప్రియత ఆయన కవితాశక్తివల్ల,ఉపదేశ విశిష్టతవల్ల కలిగిందే! 

వేమన చర్చ_ప్రముఖులు 
గ్రంథస్తం కాకుండా కేవలం సామాన్యుల నోటనే విలచి ఉన్నాయి. 1731లో ఫాదర్ లెగాక్ తొలిసారిగా వేమన పద్యాలు సేకరించాడని పరిశోధకులు భావిస్తారు. 1816లో ఒక ఫ్రెంచి మిషనరీ, తరువాత ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్ ఎన్నో వేమన పద్యాలను సేకరించారు. తాను వేమనను కనుగొన్నానని బ్రౌన్ దొర సాధికారికంగా ప్రకటించుకొన్నాడు. అతను వందల పద్యాలను సేకరించి వాటిని లాటిన్, ఆంగ్ల భాషలలోకి అనువదించాడు. అలాగే హెన్రీ బ్లూచాంస్ (1897), విలియమ్ హోవర్డ్ కాంబెల్ (1910), జి.యు.పోప్, సి.ఇ.గోవర్ వంటి ఆంగ్ల సాహితీవేత్తలు వేమనను లోకకవిగా కీర్తించారు.

తెలుగు సాహిత్య చరిత్రకారులలో ప్రథములైన కందుకూరి వీరేశలింగం, గురజాడ శ్రీరామమూర్తి, కావలి రామస్వామి తన ఆంగ్ల గ్రంథంలోను వేమన చరిత్రను చేర్చలేదు. దీనిగూర్చి నార్ల వేంకటేశ్వరరావు "ఇట్టి మూగకుట్ర, ఒక మహావ్యక్తి పేరైనను ఉచ్ఛరించక మరుగుపరచిన మౌనకుతంత్రము ప్రపంచ భాషా చరిత్రలందెచ్చటనుకానము, ఇది ఒక పెద్ద విస్మయము "అని అన్నాడు.
అయితే వేమన పద్యాలను కందుకూరి వీరేశలింగం తన సాహిత్యంలో కొన్ని పద్యాలనుదహరించాడు. గురజాడ అప్పారావు కన్యాశుల్కంలో వేమనను విరివిగా ప్రశంసించాడు.బ్రౌన్ తరువాత కట్టమంచి రామలింగారెడ్డి తన కవిత్వతత్వవిచారం గ్రంథంలో మహాకవిగా గుర్తించాడు. తరువాత 1928 లో రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ విశేష పరిశోధన చేసి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఉపన్యాసాలిచ్చాడు. ఆ తరువాత ఏభై ఎళ్లకు శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆరుద్రచే వేమన్న గురించిన ఉపన్యాసాలు నిర్వహించింది. పైన పేర్కొన్న సాహితీ వేత్తల కృషి తరువాత వేమన రచనలకు పండితులనుండి అనన్యమైన గౌరవం లభించసాగింది. కొమర్రాజు వేంకటలక్ష్మణరావు, సురవరం ప్రతాపరెడ్డి, మల్లంపల్లి సోమశేఖరశర్మ, వేటూరి ప్రభాకరశాస్త్రి వంటివారు వేమనను సంస్కర్తగా ప్రస్తుతించారు తరువాత ఎందరో యువ కవులు, రచయితలు వేమన గురించి, వేమన రచనల గురించి పరిశోధనలు చేశారు. ఎన్. గోపి, బంగోరె వంటివారు వీరిలో ప్రముఖులు. 

వేమన భావ విప్లవం :తన కాల పరిస్తుతల నుంచి,జీవిత అనుభవాలనుంచి, స్వీయ సాక్షాత్కారం పొందిన వేమన కాలాచక్ర పరిధిని దాటి ఆలోచించాడు పద్యాల్లో (భావ) విప్లవాత్మక బోధనలు చేసాడు.

తనకాలం నాటి పరిస్థితులను 
ఆటవెలది చందస్సుని విస్త్రుతంగా వాడుకుని సామాజిక దోషాలను కడిగి పారేసిన వాడు  వేమన.
వేమన ఛందస్సు కంటే భావానికి ప్రాధాన్యత నిచ్చాడు

తత్వ చింతన 
తరువఁ దరువఁ బుట్టు దరువున(చెట్టు) ననలంబు
తరువఁ దరువఁ బుట్టు దధిని
(పెరుగు )ఘృతము (నెయ్యి )
తలఁప దలపఁ బుట్టు తనువునఁ దత్వంబు
విశ్వదాభిరామ వినర వేమ

భాష పై విప్లవాత్మక ధోరణి 
కుండఁగుంభ మండ్రు కొండఁ బర్వతమండ్రు
ఉప్పు లవణ మండ్రు నొకటి గాదె
భాషలింతెవేఱు పరతత్వ మొక్కటి
విశ్వదాభిరామ వినర వేమ.

తాత్పర్యం: సంస్కృతంలో కుండను కుంభం అంటారు. ఉప్పును లవణం అంటారు. కొండను పర్వతం అంటారు. ఇక్కడ భాష మాత్రమే వేరు కాని అసలు పదార్ధం భావం ఒక్కటే
భావ ప్రాధాన్యత లేని పాండిత్య ప్రకర్ష
అక్కరలేదు.

మార్క్స్ పంపిణి, మిగులువిలువ
ఉప్పు చింతపండు ఊరిలో నుండగా
కరువదేల  వచ్చె కాపులర

సంపదకు మూలం
భూమిలోనబుట్టు భూసార మెల్లను
తనువులోన బుట్టు తత్త్వమెల్ల
శ్రమము లోన బుట్టు సర్వంబు తానౌను

శ్రమించేవాడికే ఫలం,
భూమి నాది యన్న భూమి పక్కున నవ్వు
ధనము నాది యన్న ధనము నవ్వు
కదనభీతు జూసి కాలుండు నవ్వురా

తాత్పర్యం: ఈ సృష్టిలో ఏదీ శాశ్వతం కాదు అన్న సంగతి తెలుసుకోలేక ఈ భూమి నాది అని అంటే భూమి ఫక్కున నవ్వుతుంది. పోయేటప్పుడు తన వెంట చిల్లి కాసు కూడా వెంట రాదనీ తెలిసి కూడా దాన గుణం లేని లోభివానిని చూసి ధనం నవ్వుతుంది. ఎప్పటికైనా ఏదో ఒక రూపంలో చావు తప్పదని తెలిసి కూడా యుద్ధం అంటే భయపడి పారిపోయే వానిని చూచి మృత్యువు నవ్వుతుంది
పోరాడితే పోయేదేమి లేదు బానిస సంకెళ్లు తప్ప అని తెలియజేస్తున్నాడు


వేమన కాలం ,చరిత్ర పూర్వ పరాలు 

శతక సాహిత్యం  భాష  సమాలోచన 

ఆంధ్ర వాఙ్మయమున శాఖోపశాఖలుగా వికాసమునందిన కావ్య ప్రక్రియలలో శతకమొకటి. ప్రాకృత, సంస్కృత ప్రక్రియలననుసరించియే తెలుగు శతక రచనమారంభమై, కాలక్రమమున విశిష్ట సాహితీ ప్రక్రియగా రూపొందినది. తెలుగులో పన్నెండో శతాబ్దంలో శతకమావిర్భవించినది. ఈ ఎనిమిది వందల యేండ్లలో తెలుగు శతకం శాఖోపశాఖలుగా విస్తరిల్లిస్వరూపంలోనూ స్వభావంలో ఎంతో మార్పు నొందినది. భారతీయ భాషలలో ఎందులోనూ శతక ప్రక్రియ తెలుగులో వలె బహుముఖ వికాసము పొంది వైశిష్ట్యమునొందలేదు. నేటికీ ఏ మూలనో ఒకచోట శతకం వెలువడుతూనే ఉన్నది. సజీవ స్రవంతివలె అవిచ్చిన్నంగా సాగుతూ వస్తున్నది శతకమే" అని శతక సాహిత్యంపై పరిశోధన చేసిన ఆచార్య కె. గోపాలకృష్ణరావు అభిప్రాయం.
శతకములు పురాణముల వలె కథా ప్రధాన మైనవి కావు. ప్రబంధముల వలే వర్ణనా ప్రాధాన్యములు గావు, గేయ కృతులవలె సంగీత ప్రాధాన్యములు గావు, కాని తెలుగు నాట పండిత పామరులనే తారతమ్యము లేక, పిల్లలు- పెద్దలు అనే తేడాలేక, చదువురాని వారితో సహా.... అందరి లోనూ బహుళ ప్రచారము నొందినది శతక సాహిత్యము.
ఇంతటి బహుళ ప్రాచుర్యమును పొందిన తెలుగు సాహిత్య ప్రక్రియ మరొకటి లేదు అనడంలో సందేహం లేదు. ఇంతవరకు ఉపలబ్ధమైన పాత తెలుగు గ్రంథాలలో సంఖ్యా పరంగా చూస్తే శతకాలదే ప్రథమ స్థానమని చెప్పడంలో అతిశయోక్తి లేదు. శతక రచనా ప్రక్రియ నాటి నుండి నేటి వరకు అవచ్చిన్నంగా కొన సాసుతూనే ఉంది. ఇక తెలుగుకు సజాతీయములైన కన్నడ, తమిళము, మలయాళము భాషలలో వెలువడిన శతకముల సంఖ్య అతి తక్కువ. కన్నడ భాషలో శతక రచన తెలుగు భాష కంటే ముందు ప్రారంభ మైనను ఆ భాషలో శతక సాహిత్యానికి ప్రాధాన్యత ఎంత మాత్రము లేదు.
తెలుగుకు మాతృక యైన సంస్కృతమున కూడా ఇన్ని శతకములు లేవు.
తెలుగులో మాత్రమే శతక సాహిత్యము ప్రత్యేకతను చాటుకున్నది.తెలుగు సాహిత్యం ప్రసిద్ధి చెందింది
శతకములు
సుమతీ శతకం . ఇది బద్దెన అనే కవి రచించాడని అంటారు.
సుమతీ శతకం వ్రాసినదెవరో కచ్చితమైన సమాచారం లభించడంలేదు. పలు రచనల్లో "సుమతీ శతక కర్త" అని ఈ రచయితను ప్రస్తావించడం జరుగుతుంది. సా.శ. 1220-1280 మధ్య కాలంలో బద్దెన లేదా భద్ర భూపాలుడు అనే కవి సుమతీ శతకం రచించాడని సాహితీ చరిత్రకారుల అభిప్రాయం. ఇతడు కాకతీయ రాణి రుద్రమదేవి (1262-1296) రాజ్యంలో ఒక చోళ సామంత రాజు. ఈ రచయితే రాజనీతికి సంబంధించిన సూక్తులతో నీతిశాస్త్ర ముక్తావళి అనే గ్రంథాన్ని వ్రాశాడు. ఇతడు మహాకవి తిక్కనకు శిష్యుడు.

సుమతీ శతకాన్ని బద్దెనయే రచించినట్లయితే తెలుగు భాషలో వచ్చిన మొదటి శతకాలలో అది ఒకటి అవుతుంది. (పాలకురికి సోమనాధుని వృషాధిప శతకము, యాతావక్కుల అన్నమయ్య సర్వేశ్వర శతకము వచ్చిన కాలంలోనిదే అవుతుంది.)
సుమతీ శతకమందు కొన్ని పద్యములు సంస్కృత శ్లోకముల కాంధ్రీకరణములు. ఉదాహరణ:

శ్లో:కార్యేషుదాసీ కరణేషు మంత్రీ
రూపేచలక్ష్మీ క్షమయా ధరిత్రీ
భోజ్యేషు మాతా శయనేషు రంభా
షడ్ధర్మయుక్తా కులధర్మపత్నీ

తే.గీ:పని సేయునెడల దాసియు
ననుభవమున రంభ మంత్రి యాలోచనలన్
దనభుక్తియెడల దల్లియు
నన దనకుల కాంత యుండ నగురా సుమతీ.

మొదటి పద్యంలోనే కవి "ధారాళమైన నీతులు నోరూరగ జవులుపుట్ట, ఔరా యనగా, నుడివెద"నని చెప్పుకున్నాడు. ఇందుకు పూర్తి న్యాయం చేయగలిగాడు.

విశ్వనాథ సత్యనారాయణ (సెప్టెంబరు 10, 1895 - అక్టోబరు 18, 1976 20వ శతాబ్దపు తెలుగు రచయిత."కవి సమ్రాట్" బిరుదాంకితుడు. అతని రచనలలో కవిత్వం, నవలలు, నాటకీయ నాటకం, చిన్న కథలు, ప్రసంగాలు ఉన్నాయి. చరిత్ర, తత్వశాస్త్రం, మతం, సామాజిక శాస్త్రం, రాజకీయ శాస్త్రం, భాషాశాస్త్రం, మనస్తత్వశాస్త్రం, స్పృహ అధ్యయనాలు, జ్ఞాన శాస్త్రం, సౌందర్యం, ఆధ్యాత్మికత వంటి అనేక రకాల విషయాలను కవర్ చేస్తుంది. ఈయన తిరుపతి వెంకట కవులు ద్వయానికి చెందిన ప్రముఖ తెలుగు రచయిత చెళ్లపిళ్ల వెంకట శాస్త్రి విద్యార్థి. విశ్వనాథ ఆధునిక, శాస్త్రీయ శైలిలో, సంక్లిష్ట రీతుల్లో రాశారు. ఆయన ప్రసిద్ధ రచనలలో శ్రీమద్రామాయణ కల్పవృక్షం

1. శ్రీగిరి శతకము (మధ్యాక్కరలు) - మకుటం: శ్రీ శైల మల్లికార్జున మహా లింగ! - విశ్వనాథ సత్యనారాయణ
2. శ్రీకాళహస్తి శతకము (మధ్యాక్కరలు) - మకుటం: శ్రీ కాళ హస్తీస్వరా! మహా దేవ! - విశ్వనాథ సత్యనారాయణ
3. భద్రగిరి శతకము (మధ్యాక్కరలు) - మకుటం: భద్ర గిరి పుణ్య నిలయ శ్రీ రామ! - విశ్వనాథ సత్యనారాయణ
4. కులస్వామి శతకము (మధ్యాక్కరలు) - మకుటం: నందమూర్నిలయ! విశ్వేశ్వరా! కులస్వామి! - విశ్వనాథ సత్యనారాయణ
5. శేషాద్రి శతకము (మధ్యాక్కరలు) - మకుటం: వేంకటేశ్వరా! శేషాద్రి నిలయ! - విశ్వనాథ సత్యనారాయణ
6. ద్రాక్షారామ శతకము (మధ్యాక్కరలు) - మకుటం: భీమేశలింగ! ద్రాక్షారామ సంగ! - విశ్వనాథ సత్యనారాయణ
7. నందమూరు శతకము (మధ్యాక్కరలు) - మకుటం: నందమూర్నిలయ! సంతాన వేణు గోపాల! - విశ్వనాథ సత్యనారాయణ
8. నెకరు కల్లు శతకము (మధ్యాక్కరలు) - మకుటం: నెకరుకల్ ప్రాంత సిద్ధాబ్జ హేళి! - విశ్వనాథ సత్యనారాయణ
9. మున్నంగి శతకము (మధ్యాక్కరలు) - మకుటం: నిర్ముల! మున్నంగి వేణు గోపాల! - విశ్వనాథ సత్యనారాయణ
10. వేములవాడ శతకము (మధ్యాక్కరలు) - మకుటం: వేములవాడ రాజరాజేశ్వర! స్వామి! - విశ్వనాథ సత్యనారాయణ

పోతన -సాహిత్యం -చర్చ 
పోతన(1450–1510CE)

నెఱి నసత్య మనెడి నీడతో వెలుఁగుచు
నుండు నెక్కటికి మహోత్తరునకు
నిఖిలకారణునకు నిష్కారణునకు న
మస్కరింతు నన్ను మనుచు కొఱకు
భిల్లీ భల్ల లులాయక భల్లుక ఫణి ఖడ్గ గవయ బలిముఖ చమరీ
ఝిల్లి హరి శరభ కరి కిటిమల్లాద్భుత కాక ఘూక మయమగు నడవిన్
భావం : మగ, ఆడ భిల్లులు, అడవి దున్నలు, ఎలుగుబంట్లు, పాములు, గురుపోతులు, కొండముచ్చులు, చమరీ మృగాలు, ఈల పురుగులు, సింహాలు, శరభమృగాలు, ఏనుగులు శ్రేష్ఠమైన పందులతోను, ఆశ్చర్యాన్ని కలిగించే కాకులు, గుడ్లగూబలతో ఆ అడవి నిండిఉంది. అటువంటి అడవిలో... 

ఈ పద్యం పోతన రచించిన శ్రీమద్భాగవతంలోని గజేంద్రమోక్షం ఘట్టంలోనిది. దట్టమైన అడవిని వర్ణిస్తూ అందులో ఉండే రకరకాల జంతువులను వివరించాడు పోతన. భిల్లీభల్ల అంటే భిల్లుజాతికి చెందిన స్త్రీ పురుషులు. లులాయకం అంటే అడవిదున్నపోతు. భ ల్లుకం అంటేఎలుగుబంటి. ఫణి అంటే పాము. ఖడ్గ అంటే ఖడ్గమృగం. బలిముఖం అంటే కొండముచ్చు. చమరీ అంటే కస్తూరీ మృగం. ఝిల్లి అంటే ఈల కోడి. హరి అంటే సింహం. శరభం అంటే శరభమృగం. కరి అంటే ఏనుగు. కిటిమల్ల అంటే మేలుజాతి పంది. కాక అంటే కాకి. ఘూక అంటేగుడ్లగూబ. ఈ పద్యంలో ఇందులో ఇన్ని కొత్తపదాలకు అర్థాలు నేర్చుకోవచ్చు. అంతేకాక ఈ పద్యం తెలుగుభాషలో ఉన్న మంచి టంగ్ట్విస్టర్.
తలగవు కొండలకైనను
మలగవు సింగములకైన మార్కొను కడిమిం 

గలగవు పిడుగులకైనను
నిల బలసంపన్నవృత్తి నేనుగు గున్నల్ 

భావం : గున్న ఏనుగులు బాగా బలం కలిగినవి. అందువల్ల అవి పెద్దపెద్ద కొండలను, సింహాలను సైతం లెక్కచేయవు. వాటిని ఎదుర్కొనే శక్తి ఉన్న కారణంగా అవి ఏ జంతువు ఎదురువచ్చినా పక్కకు తప్పుకోవు. అడవంతా నిర్భయంగా, స్వేచ్ఛగా సంచరిస్తాయి. 

పోతన రచించిన భాగవతంలోని గజేంద్రమోక్షం ఘట్టంలో... గున్న ఏనుగులను గురించి పోతన ఈ పద్యంలో వర్ణించాడు. ఏనుగు గున్నలు అంటే పడుచు ఏనుగులు. ఇలన్ అంటే భూమి మీద. బలసంపన్నవృత్తిన్ అంటే ఎక్కువ బలం కలిగి ఉండటం వలన. కొండలకైనన్అంటే పెద్దపెద్ద కొండలు ఎదురైనప్పుడు. తలగవు అంటే పక్కకు తప్పుకోవు. మార్కొను కడిమిన్ అంటే ఎదిరించే శౌర్యం ఉండటం వలన. సింహములకైనన్ అంటే సింహాల వంటి క్రూరజంతువులు ఎదురైనప్పుడు. మలగవు అంటే పక్కకు తప్పుకుపోయేవి కావు. పిడుగులకైనను అంటే పిడుగులు పడినప్పటికీ. కలగవు అంటే కలత చెందవు. అడవికి రాజైన సింహం వంటి జంతువు సైతం ఏనుగును ముందు వైపు నుంచి ఎదిరించలేవు. అలా ముందుకు వస్తే తొండంతో ఎత్తి కిందపడేస్తాయి. వాటికి అంత బలం ఉంది. అందుకే సింహాలుకేవలం వెనుక నుంచి మాత్రమే ఏనుగులను ఎదిరించగలవు. భూమి మీద నివసించే ప్రాణులన్నిటిలోకీ ఏనుగే బలమైన జంతువు. పోతన రచించిన ఈ పద్యం చదివితే ఆ విషయం పూర్తిగా అర్థమవుతుంది.
తొండంబుల మదజలవృత గండంబుల గుంభములను ఘట్టన సేయం 

గొండలు దలక్రిందై పడు బెండుపడున్ దిశలు, సూచి బెగడున్ జగముల్ 

భావం: గున్న ఏనుగులు తమ తొండాలతో కొట్టగా, చెక్కిళ్లతో రాయగా, కుంభస్థలాలతో పొడవగా పెద్దపెద్ద కొండలు సైతం తల్లకిందులవుతున్నాయి. దిక్కులు నిస్సారమైపోతున్నాయి. లోకాలన్నీ భయభ్రాంతులతో నిండిపోతున్నాయి. 

పోతన రచించిన శ్రీమద్భాగవతంలోని గజేంద్రమోక్షం ఘట్టంలోని పద్యం ఇది. 

తొండంబుల అంటే ఏనుగు తొండాల నిండా. మదజలవృత అంటే మదజలముతో కూడిన గండంబులన్ అంటే చెక్కిళ్లను, కుంభములన్ అంటే కుంభస్థలాలను ఘట్టన సేయన్ అంటే పొడవడం. కొండలు తలక్రిందై పడున్ అంటే తలకిందులవుతున్నాయి. దిక్కులు అంటేనాలుగు దిక్కులు. బెండుపడున్ అంటే బలహీనపడుతున్నాయి. జగముల్ అంటే ముల్లోకాలు. బెగడున్ అంటే భయపడుతున్నాయి. పడుచు ఏనుగులు ఒకదానితో ఒకటి ఆడుకుంటున్న విధానాన్ని పోతన ఈ పద్యంలో వివరించాడు. 

ఏనుగులు తమ తొండాలతో ఒకదానిని ఒకటి కొడుతుంటే, ఒకదాని చెక్కిలిని మరొకటి రాస్తుంటే, వాటి కుంభస్థలాలతో అవతలి ఏనుగును పొడుస్తుంటే ఆ శబ్దానికి పెద్దపెద్ద కొండలు భయపడిపోయి, తలకిందులయ్యాయట. నాలుగు దిక్కులూ దిక్కుతోచకఉండిపోయాయట. మూడు లోకాలలో ఉండే వారంతా భయంతో గజగజ వ ణికిపోయారట. అంత పెద్దపెద్ద ఘీంకారాలతో, శబ్దాలతో ఒకదానితో ఒకటి ఉత్సాహంగా ఆడుకుంటూ అందర్నీ భయపెట్టాయి.
తుండంబుల బూరించుచు
గండంబుల జల్లుకొనుచు గళగళరవముల్
మెండుకొని వలుద కడుపులు
నిండన్ వేదండకోటి నీరుంద్రావెన్
భావం: ఏనుగులు తొండాల నిండుగా నీటిని తీసుకొని పైన చల్లుకొంటూ, చెంపల మీద చల్లుకొంటూ గడగడ ధ్వనులు చేస్తూ తమ పెద్ద కడుపులు నిండేలాగ నీళ్లు తాగాయి.
ఏనుగులు మంచినీరు తాగే విధానాన్ని పోతన తన భాగవతంలోని గజేంద్రమోక్షం ఘట్టంలో ఈ విధంగా వివరించాడు.
వేదండకోటి అంటే ఏనుగుల సమూహం. తుండంబులన్ అంటే తొండములతో. పూరించుచు అంటే నీటిని నిండించుకొనుచు. గండంబులన్ అంటే చెక్కిళ్లపైన. చల్లుకొనుచున్ అంటే ఒకరి మీద ఒకరు పోసుకుంటూ. గళగళరవముల్ అంటే తాగుతున్నప్పుడు వచ్చే గడగడచప్పుడు. మెండుకొనన్ అంటే అధికం కాగా. వలుద కడుపులు అంటే విశాలమైన (పెద్ద) పొట్టలు. నిండన్ అంటే నింపే విధంగా. నీరున్ అంటే మంచినీటిని. త్రావెన్ అంటే తాగెను. ఏనుగు అన్నిటి కంటె పెద్ద జంతువు. వాటి కడుపులు కూడా సహజంగానే పెద్దవిగా ఉంటాయి. అంత పెద్ద పొట్టలను నింపాలంటే చిన్ననోరు చాలదు. అలాగే కొద్దిపాటి నీరు కూడా చాలదు.
అందుకే వాటి కడుపులు నిండడానికి అనువుగా పెద్దపెద్ద తొండాలు ఉన్నాయి వాటికి. ఆ తొండాల నిండా నీరు తీసుకుని పెద్ద నోటి ద్వారా కడుపు నిండేలా లోపలికి పంపి దాహం తీర్చుకుంటున్నాయి.
కరిదిగుచు మకరి సరసికి
గరి దరికిని మకరి దిగుచు గరకరి బెరయన్
గరికి మకరి మకరికి గరి
భరమనుచును నతల కుతల భటులదిరిపడన్
భావం: ఏనుగు మీద కోపంతో ఉన్న మొసలి ఏనుగును సరసులోకి లాగుతోంది. ఏనుగు మొసలిని ఒడ్డుకు లాగుతోంది. రానురాను ఏనుగుకి మొసలి భారమైంది. మొసలికి ఏనుగు భారమైంది. అతల కుతల లోకాలలో అంటే భూలోకానికి కింద ఉన్న రెండు నివసిస్తున్నవీరులు ఈ రెండిటినీ చూసి ఇవి రెండూ ఒకదానిని మించినవి మరొకటి అని భయపడసాగారు.
కరిన్ అంటే ఏనుగును. సరసికి అంటే సరస్సులోకి. మకరి అంటే మొసలి. తిగుచున్ అంటే లాగుతోంది. కరి అంటే ఏనుగు. మకరిన్ అంటే మొసలిని. దరికి అంటే ఒడ్డునకు. తిగుచున్ అంటే లాగుతోంది. కరకరి బెరయన్ అంటే క్రూరత్వం ఎక్కువ కావడంతో. కరికి మకరి అంటేఏనుగునకు మొసలి. మకరికి కరి అంటే మొసలికి ఏనుగు. భరమనుచున్ అంటే ఒకదానికొకటి భారంగా మారి. అతల కుతల భటులు అంటే రెండు లోకాల (భూలోకానికి కింద ఉన్న రెండు లోకాలు) లో ఉండే వీరులు. అదిరిపడన్ అంటే భయపడుతున్నట్టుగా.

ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపలనుండు లీనమై
యెవ్వనియందు డిందు పరమేశ్వరుడెవ్వడు మూలకారణం
బెవ్వడనాది మధ్యలయుడెవ్వడు సర్వము దాన యైన వా
డెవ్వడు వాని నాత్మభవు నీశ్వరునే శరణంబు వేడెదన్
భావం : ఈ ప్రపంచమంతా ఎవని కారణంగా పుట్టి, పెరిగి, లీనమవుతోందో! ఎవడు ఈ మొత్తం ప్రపంచానికి మూలకారణమైన ప్రభువు అయి ఉన్నాడో! ఎవడు ఆదిమధ్యాంతాలు మూడూ తానై ఉన్నాడో! ఎవడు తనకు తాను పుట్టినవాడో! ఈ ప్రపంచానికంతటికీ అటువంటిప్రభువైనవానిని శరణు కోరుతున్నాను.
జగము అంటే ఈ ప్రపంచమంతా. ఎవ్వనిచే జనించున్ అంటే ఎవని వలన పుట్టినదో. లీనమై అంటే కలిసిపోయినదో. ఎవ్వని లోపల అంటే ఎవనియందు. ఉండున్ అంటే ఉండునో. ఎవ్వనియందు డిందు అంటే ఎవ్వనియందు నశించునో. ఎవ్వడు పరమేశ్వరుడు అంటే ఎవడుమహాప్రభువో. ఎవ్వడు మూలకారణంబు అంటే ప్రధాన కారణం ఎవరో. అనాది మధ్య లయుడు అంటే ఆది మధ్య అంతాలు తానై ఉన్నాడో. వానిన్ అంటే అటువంటివానిని. ఆత్మభవున్ అంటే తనకు తానుగా పుట్టినవానిని. ఈశ్వరున్ అంటే సర్వలోక ప్రభువును. నేనుశరణంబు వేడెదను అంటే నేను శరణు వేడుకొంటాను. 

కలడందురు దీనులయెడ
కలడందురు పరమయోగి గణములపాలం
కలడందురన్ని దిశలను
కలడు కలండనెడువాడు కలడో లేడో! 

భావం: భగవంతుడు దీనులలో ఉన్నాడంటారు. ఇంకా మహాయోగుల సమూహాలలో ఉన్నాడంటారు. అన్నిదిక్కులలోనూ ఆయనే ఉన్నాడంటారు. ఉన్నాడు ఉన్నాడు అని రూఢిగా చెబుతున్న భగవంతుడు నిజంగా ఉన్నాడా? లేడా? 

దీనులయెడన్ అంటే దీనుల పట్ల. కలడందురు అంటే భగవంతుడు ఉన్నాడంటారు. పరమయోగి గణములపాలన్ అంటే మహాయోగుల సమూహాలందు. కలడందురు అంటే ఉన్నాడంటారు. అన్ని దిశలను అంటే అన్ని దిక్కులలోనూ కలడందురు అంటే ఉన్నాడంటారు. కలడుకలడంనెడువాడు అంటే రూఢిగా ఉన్నాడు చెప్పబడుతున్న భగవంతుడు. కలడో లేడో అంటే అసలు ఉన్నాడో! లేడో!
ఈ పద్యంలో పోతన కలడు అనే పదాన్ని ప్రతిపాదంలోనూ ఉపయోగించాడు. గజేంద్రుడు విష్ణుమూర్తిని ఎంత ప్రార్థించినా రాకపోయేసరికి అసలు దేవుడు ఉన్నాడా లేడా అనే సందేహాన్ని వెలిబుచ్చుతాడు. శక్తికోల్పోయి, నిస్సహాయస్థితిలో ఉన్న గజరాజుకి దేవుని మీదకోపం కలిగి, ఆ కోపంలో అసలు దేవుడనేవాడు ఉన్నాడా? ఒకవేళ ఉండి ఉంటే నా ప్రార్థనను మన్నించి నన్ను రక్షించేవాడు కదా! అనుకుంటాడు. ఆ సందర్భంలోని పద్యం ఇది.
ఒకపరి జగముల వెలినిడి
యొకపరి లోపలికి గొనుచు నుభయము దానై
సకలార్థసాక్షియగు న
య్యకలంకుని నాత్మమయుని నర్థి దలంతున్
భావం : ఒకసారి లోకాలను బయట ఉంచుతూ, మరొకసారి తన లోపల ఉంచుకుంటూ అంటే ప్రపంచాన్ని చూపటం, అంతలోనే దానిని మాయం చే యటం ఈ రెండూ తానే అయ్యి, ప్రపంచంలో జరిగే వాటన్నింటికీ తానే సాక్షి అవుతూ ఉన్న దోషరహితుడు, ఆత్మమయుడుఅయినవానిని ఆర్తితో కొలుస్తాను.
ఒకపరి అంటే ఒకసారి. జగములన్ అంటే లోకాలను. వెలినిడి అంటే బయటకు కనిపించేలా చేసి. ఒకపరి అంటే మరొకసారి. లోపలికి గొనుచు అంటే తనలోపల ఇముడ్చుకుంటూ అంటే మాయం చేస్తూ. ఉభయమున్ అంటే ఆ రెండుపనులను. తానై అంటే తానే అయి. సకలార్థ సాక్షియగు అంటే ప్రాపంచిక విషయాలకు తాను సాక్షి మాత్రమే అయి ఉండు. ఆ అకలంకునిన్ అంటే దోషం లేనివానిని. ఆత్మమయుని అంటే సర్వాంతరాత్ముని. అర్థిన్ అంటే ఆసక్తితో. తలంతున్ అంటే ధ్యానిస్తాను. 

గజేంద్రమోక్షంలోని ఈ పద్యం పూర్తిగా వేదాంతాన్ని బోధిస్తుంది. దేవుడు అంటే ఎవరు, ఎలా ఉంటాడనే విషయాన్ని పోతన తన సహజధోరణిలో వివరించాడు. 

లోకంబులు లోకేశులు
లోకస్థులు దెగిన తుది నలోకంబగు పెం 
జీకటి కవ్వల నెవ్వం
డేకాకృతి వెలుగు నతని నే సేవింతున్ 

భావం: లోకాలు, లోకాధిపతులు, లోకులు నశించిన తరవాత, లోకమనేది లేనప్పుడు ఏర్పడే దట్టమైన చీకటికి అవతల ఏ పరమపురుషుడు ఒకే ఆకారంతో ప్రకాశిస్తాడో అతనిని మాత్రమే నేను సేవిస్తాను. లోకంబులు అంటే పద్నాలుగు లోకాలు. లోకేశులు అంటే వాటినిపరిపాలించేరాజులు. లోకస్థులు అంటే ఆ లోకంలో ఉండే చరాచరజీవులు. తెగిన అంటే నశించిన. తుదిన్ అంటే కడపట లేదా యుగాంతంలో వచ్చే ప్రళయకాలంలో. అలోకంబగు అంటే లోకములు లేనిదైన. పెంజీకటికి అంటే గాఢాంధకారానికి అవ్వలన్ అంటే అవతల. ఎవ్వండు ఏకాకృతిన్ అంటే ఒకే ఆకారంతో ఎవరైతే వెలుగున్ అంటే ప్రకాశిస్తాడో అతనిని. నే సేవింతున్ అంటే నేను కొలుస్తాను.
తెలుగుసాహిత్యంలో ఈ పద్యానికి పెద్దపీట వేశారు. ఇంతకుమించిన పద్యం మరొకటి లేదనేంత పేరున్న పద్యం ఇది. భగవంతుడు ఎక్కడ ఉంటాడనే విషయాన్ని పోతన తన మనోనేత్రంతో చూసి వివరించాడు

 శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి (వీరప్పయాచార్యులు) ( సా.శ.1608- సా.శ.1693) సాంధ్రసింధు వేదమనుపేర ప్రఖ్యాతి గాంచిన కాలజ్ఞానాన్ని బోధించిన మహా యోగి, ఆత్మజ్ఞాన ప్రబోధకులు, కాళికాంబ సప్తశతి, వీరకాళికాంబ శతకాలద్వారా ప్రపంచానికి తత్త్వబోధ చేసిన జగద్గురువు వైఎస్ఆర్ జిల్లా లోని కందిమల్లయ్యపల్లెలో చాలాకాలం నివసించి కాలజ్ఞానం రచించి సా.శ. 1693లో సజీవ సమాధి నిష్ఠనొందినారు. శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామివారి వలన ప్రసిధ్ది పొందుట చేత కందిమల్లయ్యపల్లె తర్వాతి కాలములో బ్రహ్మంగారిమఠంగా ప్రసిద్ధి చెందింది. ప్రపంచంలో ఏ వింత జరిగిన ఇది వీరబ్రహ్మేంద్రస్వామివారు తన కాలజ్ఞానంలో ఆనాడే చెప్పారు అంటూ ప్రజలు గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటారు. కాలజ్ఞానంలో చెప్పినవన్నీ జరిగాయి, జరుగుతున్నాయి.

ప్రాఙ్నన్నయ యుగము : సా.శ. 1000 వరకు నన్నయ యుగము :
1000 - 1100 శివకవి యుగము :
1100 - 1225 తిక్కన యుగము :
1225 - 1320 ఎఱ్ఱన యుగము : 
1320 - 1400 శ్రీనాధ యుగము : 
1400 తెలుగు సాహిత్యం - ఎఱ్ఱన యుగం (ఎఱ్ఱాప్రగడ యుగము నుండి దారిమార్పు)
తెలుగు సాహిత్యంలో
1320 నుండి 1400 వరకు ఎఱ్ఱన యుగము అంటారు. ఈ యుగoలో ప్రబంధ రచనా విధానానికి పునాదులు పడ్డాయి. మహాభారతంలో అరణ్యపర్వశేషం తెలుగుచేయబడింది...
తెలుగు సాహిత్యం - శివకవి యుగము
తెలుగు సాహిత్యంలో 1100 నుండి 1225 వరకు శివకవి యుగము అంటారు. ఈ యుగం నన్నయకు, తిక్కనకు సంధికాలం. దక్షిణ భారతదేశంలో శైవం ప్రబలిన కాలం ఇది. ఆంధ్రాపధంలో కాకతీయుల.
తెలుగు సాహితీకారుల జాబితాలు
( తిక్కన యుగము : 1225 - 1320)
వ్యాసాలకు చేర్చవలసిన వర్గాలు వర్గం:తిక్కన యుగం కవులు]] లేదా [[వర్గం:తిక్కన యుగం రచనలు]] ఈ యుగానికి సంబంధించిన మూస {{తిక్కన యుగం}} తిక్కన్న - కవి బ్రహ్మ, ఉభయ.
తెలుగు సాహిత్యం - రాయల యుగము
తెలుగు సాహిత్యంలో 1500 నుండి 1600 వరకు రాయల యుగము అంటారు. రాయల యుగంలో ముఖ్య కవులు 
శ్రీ మదాంధ్ర మహాభారతం (వర్గం తిక్కన యుగం)
మహాభారతం అని అంటారు. దీనిని తెలుగులో వ్రాసిన ముగ్గురు కవులు - నన్నయ, ఎర్రన, తిక్కన - వీరిని కవిత్రయం అంటారు. తెలుగు సాహిత్యంలో నన్నయ వ్రాసిన శ్రీ మదాంధ్ర మహాభారతము.

అన్నమయ్య లేదా తాళ్ళపాక అన్నమాచార్యులు 
(1408, మే 9 - 1503, ఫిబ్రవరి 23 ) 

తెలుగు  సాహితీ చరిత్రలో లభించిన ఆధారాల ప్రకారం మొదటి వాగ్గేయకారుడు (సాధారణ భాషలో గేయాలను కూర్చేవారు). అన్నమయ్యకు  పదకవితా పితామహుడు  అని బిరుదు ఉంది. దక్షిణాపథంలో భజన సంప్రదాయానికి, పదకవితాశైలికి ఆద్యుడు, గొప్ప వైష్ణవ భక్తుడు.  తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి  ని,  అహోబిలము  లోని  
నరసింహస్వామి  ని, ఇతర వైష్ణవ సంప్రదాయ దేవతలను కీర్తిస్తూ 32వేలకు పైగా  కీర్తనలు  రచించాడు . అన్నమయ్య పాటలు, పదాలు, పద్యాలలో భక్తి, సాహిత్యం, సంగీతం, శృంగారం, భావలాలిత్యం పెనవేసుకొని ఉంటాయి.

అదివో అల్లదివో శ్రీహరి వాసము
పదివేల శేషుల పడగల మయము."

"అలర చంచలమైన ఆత్మలందుండ నీ యలవాటు చేసే నీవుయ్యాల
పలుమారు నుచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు దెలిపె నీ వుయ్యాల "

"కులుకక నడవరో కొమ్మలాలా
జలజల రాలిని జాజులు మాయమ్మకు"

"క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని
నీరజాలయమునకు నీరాజనం"

"జోఅచ్యుతానంద జోజో ముకుంద
రావే పరమానంద రామ గోవింద "

"చెల్లఁబో తియ్యనినోరఁ జేఁ దేఁటికి యీ-
పల్లదపుఁగోరికలపాలు సేయవలెనా"

ఉదయాద్రి తెలుపాయె ఉడురాజు కొలువిడె
అదనెరిగి రాడాయెనమ్మా నా విభుడు
స్వర్ణయుగంలో తిక్కన యొక్క మహాభారత అనువాదం తెలుగు సాహిత్యాన్ని స్థాపించింది .
21వ శతాబ్దపు భారతదేశంలోని 28 రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ యొక్కచరిత్ర వేదకాలంలో
ప్రారంభమవుతుంది . ఇది ఐతరేయ
బ్రాహ్మణ వంటి సంస్కృత ఇతిహాసాలలో ప్రస్తావించబడింది .
అస్సాకా గోదావరి మరియు కృష్ణా నదుల మధ్య ఉంది ,
పదహారు మహాజనపదాలలో ఒకటి (700-300 BCE).
శాతవాహనులు వారి తర్వాత (230 BCE – 220 CE) అమరావతిని నిర్మించారు

మరియు గౌతమీపుత్ర శాతకర్ణి ఆధ్వర్యంలో అత్యున్నత స్థాయికి చేరుకున్నారు .
శాతవాహనుల తర్వాత ఈ ప్రాంతం రాజ్యాలుగా విడిపోయింది .

రెండవ శతాబ్దం CE చివరి నాటికి, ఆంధ్ర ఇక్ష్వాకులు కృష్ణా నది వెంబడి పాలించారు. 
నాల్గవ శతాబ్దం CEలో, పల్లవ రాజవంశం దక్షిణ ఆంధ్ర ప్రదేశ్ మరియు తమిళనాడు ను పాలించింది మరియు కాంచీపురంలో రాజధానిని కలిగి ఉంది . వారి శక్తి మహేంద్రవర్మన్ I (571–630) మరియు నరసింహవర్మన్ I (630–668) పాలనలో పెరిగింది మరియు తొమ్మిదవ శతాబ్దం చివరి వరకు ఉత్తర తమిళకం మరియు దక్షిణ తెలుగు మాట్లాడే ప్రాంతంపై ఆధిపత్యం చెలాయించింది. 

ఉత్తర ఆంధ్ర ప్రదేశ్ 624 CE నుండి వేంగి చాళుక్యుల ఆధీనంలో ఉంది. 
తరువాత 1002 CE సమయంలో తెలుగు చోళ రాజు జటా చోడ భీముడి నుండి వేంగి సింహాసనాన్ని పొందేందుకు రాజరాజ చోళుడు I వేంగి చాళుక్యులకు సహాయం చేసినప్పుడు వేంగి చాళుక్యులు ఇంపీరియల్ చోళులకు అధీనంలో ఉన్నారు . 1002 CE నుండి 1206 CE వరకు ఆంధ్ర ప్రదేశ్ ఇంపీరియల్ చోళుల ఆధీనంలో ఉంది.
1206 CE నుండి 1323 CE వరకు కాకతీయ రాజవంశం భూమిని ఏకం చేసింది మరియు ఆ 

1258 CE లో, పాండ్యన్ చక్రవర్తి జటవర్మన్ సుందర పాండ్యన్ I నెల్లూరు చోళులు మరియు కాకతీయులను ఓడించి , పాండ్యన్ సామ్రాజ్యాన్ని నెల్లూరు వరకు విస్తరించాడు. పాండ్య సామ్రాజ్యంలో అంతర్గత సంక్షోభం సమయంలో కాకతీయులు మళ్లీ ఆంధ్రను ఏకం చేశారు.
1323 CEలో, ఢిల్లీ సుల్తాన్ ఘియాత్ అల్-దిన్ తుగ్లక్ , ఉలుగ్ ఖాన్ ఆధ్వర్యంలో వరంగల్‌ను ముట్టడించడానికి పెద్ద సైన్యాన్ని పంపాడు .
కాకతీయ రాజవంశం పతనం తరువాత