Showing posts with label 20.శతకం. Show all posts
Showing posts with label 20.శతకం. Show all posts

29.10.20

20.శతకాలు చర్చ

శతకాలు - కవులు . - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
శతకము .
అనగా వంద పద్యాలతో రచించే ఒక సాహితీ ప్రక్రియ. శతక సాహితీ ప్రక్రియలో ఒకటే మకుటము గల పద్యాలు కనీసం వంద వ్రాస్తారు. భర్తృహరి వ్రాసిన సుభాషిత త్రిశతి సంస్కృతములో ప్రసిద్ధి చెందినది.
"ఆంధ్ర వాఙ్మయమున శాఖోపశాఖలుగా వికాసమునందిన కావ్య ప్రక్రియలలో శతకమొకటి. ప్రాకృత, సంస్కృత ప్రక్రియలననుసరించియే తెలుగు శతక రాచనమారంభమై, కాలక్రమమున విశిష్ట సాహితీ ప్రక్రియగా రూపొందినది. తెలుగులో పన్నెండో శతాబ్దంలో శతకమావిర్భవించినది. ఈ ఎనిమిది వందల యేండ్లలో తెలుగు శతకం శాఖోపశాఖలుగా విస్తరిల్లిస్వరూపంలోనూ స్వభావంలో ఎంతో మార్పు నొందినది. భారతీయ భాషలలో ఎందులోనూ శతక ప్రక్రియ తెలుగులో వలె బహుముఖ వికాసము పొంది వైశిష్ట్యమునొందలేదు. నేటికీ ఏ మూలనో ఒకచోట శతకం వెలువడుతూనే ఉన్నది. సజీవ స్రవంతివలె అవిచ్చిన్నంగా సాగుతూ వస్తున్నది శతకమే" అని శతక సాహిత్యంపై పరిశోధన చేసిన ఆచార్య కె. గోపాలకృష్ణరావు అభిప్రాయం.


శతకములు పురాణముల వలె కథా ప్రధాన మైనవి కావు.
ప్రబంధముల వలే వర్ణనా ప్రాధాన్యములు గావు, 
గేయ కృతులవలె సంగీత ప్రాధాన్యములు గావు, కాని తెలుగు నాట పండిత పామరులనే తారతమ్యము లేక, పిల్లలు- పెద్దలు అనే తేడాలేక, చదువురాని వారితో సహా.... అందరి లోనూ బహుళ ప్రచారము నొందినది శతక సాహిత్యము. ఇంతటి బహుళ ప్రాచుర్యమును పొందిన తెలుగు సాహిత్య ప్రక్రియ మరొకటి లేదు అనడంలో సందేహం లేదు. ఇంతవరకు ఉపలబ్ధమైన పాత తెలుగు గ్రంథాలలో సంఖ్యా పరంగా చూస్తే శతకాలదే ప్రథమ స్థానమని చెప్పడంలో అతిశయోక్తి లేదు. శతక రచనా ప్రక్రియ నాటి నుండి నేటి వరకు అవచ్చిన్నంగా కొన సాసుతూనే ఉంది. ఇక తెలుగుకు సజాతీయములైన కన్నడ, తమిళము, మలయాళము భాషలలో వెలువడిన శతకముల సంఖ్య అతి తక్కువ. కన్నడ భాషలో శతక రచన తెలుగు భాష కంటే ముందు ప్రారంభ మైనను ఆ భాషలో శతక సాహిత్యానికి ప్రాధాన్యత ఎంత మాత్రము లేదు. తెలుగుకు మాతృక యైన సంస్కృతమున కూడా ఇన్ని శతకములు లేవు. తెలుగులో మాత్రమే శతక సాహిత్యము ప్రత్యేకతను చాటుకున్నది.తెలుగు సాహిత్యం ప్రసిద్ధి చెందింది

శతకం లక్షణాలు.

శతకములో ప్రతి పద్యానికీ చివరలో ఒక పదము గానీ, పదాలుగానీ, పూర్తి చరణము గానీ ఉండటం ఆనవాయితీ. ఇది ఆ రచయిత సంతకం లాంటిది. దీనిని మకుటము అంటారు. ఉదాహరణకు విశ్వదాభిరామ వినురవేమ అనునది వేమన శతకము నకు మకుటము, అలాగే సుమతీ అనునది సుమతీ శతకము నకు మకుటము, అలాగే వేంకటేశ్వరా, దాశరథీ అనునవి ఇతర ఉదాహరణములు.

శతక సాహిత్యం గురించి చెప్పే టప్పుడు, విశ్వనాథ సత్యనారాయణ వారి శతకాల గురించి తప్పకుండా ప్రస్తావన చెయ్యాల్సిందే.

ఈ క్రింద చెప్పిన 10 శతకాలు వాటి పేర్లు, మకుటము ప్రస్తావించటం జరిగింది.

1. శ్రీగిరి శతకము (మధ్యాక్కరలు) - మకుటం: శ్రీ శైల మల్లికార్జున మహా లింగ! - విశ్వనాథ సత్యనారాయణ

2. శ్రీకాళహస్తి శతకము (మధ్యాక్కరలు) - మకుటం: శ్రీ కాళ హస్తీస్వరా! మహా దేవ! - విశ్వనాథ సత్యనారాయణ

3. భద్రగిరి శతకము (మధ్యాక్కరలు) - మకుటం: భద్ర గిరి పుణ్య నిలయ శ్రీ రామ! - విశ్వనాథ సత్యనారాయణ

4. కులస్వామి శతకము (మధ్యాక్కరలు) - మకుటం: నందమూర్నిలయ! విశ్వేశ్వరా! కులస్వామి! - విశ్వనాథ సత్యనారాయణ

5. శేషాద్రి శతకము (మధ్యాక్కరలు) - మకుటం: వేంకటేశ్వరా! శేషాద్రి నిలయ! - విశ్వనాథ సత్యనారాయణ

6. ద్రాక్షారామ శతకము (మధ్యాక్కరలు) - మకుటం: భీమేశలింగ! ద్రాక్షారామ సంగ! - విశ్వనాథ సత్యనారాయణ

7. నందమూరు శతకము (మధ్యాక్కరలు) - మకుటం: నందమూర్నిలయ! సంతాన వేణు గోపాల! - విశ్వనాథ సత్యనారాయణ

8. నెకరు కల్లు శతకము (మధ్యాక్కరలు) - మకుటం: నెకరుకల్ ప్రాంత సిద్ధాబ్జ హేళి! - విశ్వనాథ సత్యనారాయణ

9. మున్నంగి శతకము (మధ్యాక్కరలు) - మకుటం: నిర్ముల! మున్నంగి వేణు గోపాల! - విశ్వనాథ సత్యనారాయణ

10. వేములవాడ శతకము (మధ్యాక్కరలు) - మకుటం: వేములవాడ రాజరాజేశ్వర! స్వామి! - విశ్వనాథ సత్యనారాయణ

సాధారణంగా ఇతర కావ్య, సాహిత్య ప్రక్రియలు పండితులకు పరిమితమైనాగాని, శతకాలు మాత్రం సామాన్య ప్రజానీకంలో ఆదరణపొందినవి. ఇలా తెలుగులో శతక సాహిత్యము పామరులకూ పండితులకూ వారధిగా నిలిచింది. వీటిలో వేమన శతకానికీ, సుమతీ శతకానికీ ఉన్న ప్రాచుర్యము గురించి వేరే చెప్పాల్సిన పని లేదు.

మిగిలిన సాహిత్య ప్రక్రియలకున్న అలంకారిక, లాక్షణిక నియమాలు అనే బంధాలు శతక సాహిత్యానికి లేవు. ఛందస్సుకు అనుగుణంగా ఉంటే చాలు. విషయాన్ని ఒక పద్యంలో వెళ్ళగ్రక్కవచ్చును. లేదా 10 పద్యాలలో విస్తరింప వచ్చును. కథ చెప్పాలనీ, ముగింపు ఉండాలనీ నియమం లేదు. కనుక కవికి బోలెడంత స్వేచ్ఛ ఉంది. చదివేవాడికి కూడా రోజులతరబడి ఒకే గ్రంథాన్ని అధ్యయనం చేయాల్సిన పని బడదు. కనుక ఒక్కపద్యంతోనే కవికీ, చదువరికీ అనుబంధం ఏర్పడవచ్చును. శతకాలు క్లుప్తంగా విషయాన్ని విడమరచి చెప్పే సాధనాలు. అందుకే ఇవి ప్రజా కవిత్వముగా ఆదరణ సంతరించుకొని ఉండవచ్చును.

శతకానికుండ వలసిన లక్షణాలను ముఖ్యంగా ఐదింటిని పేర్కొన వచ్చును. అవి. 1. సంఖ్యా నియమము, 2. మకుట నియమము, 3. వృత్త నియమము, 4. రస నియమము, 5. భాషా నియమము.

1. సంఖ్యా నియమము

శతకము అనగా వంద అని అర్థము. ఏ శతకము లోనైనా వందకు పైగానె పద్యము లుండవలెను, అంతకన్న తక్కువ పద్యములతో నున్నది శతకమనిపించు కోదు. వందకు తక్కువ గానీ, ఎక్కువ గాని పద్యములున్నచో వాటి విడిగా పేర్లున్నాయి. ఉదాహరణకకు..... పది పద్యములున్నచో దశకము, ఇరవై ఐదు పద్యములతో నున్నదానిని పంచవిశంతి అనీ, ముప్పదిరెండు పద్యములు గల దానికి రాగ సంఖ్య అనీ, మూడు వందల పద్యములున్నచో త్రిశతి అనీ వాటికి ప్రత్యేకమైన పేర్లు ఉన్నాయి.

2.మకుట నియమము.

శతకము లోని ప్రతి పద్యంలో చివర నున్న సంబోధనా పదమే మకుటము. ఈ మకుటము తప్పని సరిగా సంబోధన గానే వుండవలెను. ఈ సంబోధన కూడా ఒకే రీతిగా నుండ వలెను. మకుటమునకు వాడిన పదానికి సంబంధించిన పదానికి పర్యాయ పదములు గానీ, సమానార్థమైన పదములు గాని వుండ కూడదు. ఒక శతకములో మకుటము.గా సర్వేశ్వరా అనే పదాన్ని వాడిన యడల అన్ని పద్యములకు అదే పదాన్ని వాడవలెను గానీ, దానికి ప్రత్యామ్నాయమైన ఇతర పదాలు అనగా విశ్వేశ్వరా., లోకేశ్వరా వంటి వాడకూడదు. కొన్ని పద్యములలో ఒక పదమే మకుటముగా నుండగా.... కొందరు కవులు ఒక పద్య పాదమంతయూ మకుటముగా నెంచుకొనిరు. ఒక పద్య పాదమంతయు మకుటముగా నున్న శతకమునకు యుధాహరణముగా వేమన శతకాన్ని ప్రధానంగా చెప్పుకోవచ్చు. విశ్వదాభిరామ వినుర వేమ అను మకుటము పూర్తిగా ఒక పద్య పాదము. ఆవిధంగా ఒకే పదము మకుటం నెంచుకుని వ్రాసిన శతకానికి యుధాహరణగా సుమతీ శతకాన్ని చెప్పుకోవచ్చు. సుమతీ అను ఒక పదము ఇందులోని మకుటము.

3.వృత్తనియమము

శతకము లోని మకుట నియమమును బట్టే వృత్త నియమము యేర్పడినది. తెలుగున తొలి శతకము..... మల్లికార్జున పండితారాధ్యుని శ్రీ గిరి మల్లికార్జున శతకము. ఇందలి మకుటము శ్రీగిరి మల్లికార్జునా అని యుండుట చేత నిందు చంపక మాల, ఉత్పల మాల పద్యములు తప్ప వేరు వృత్తములు ఇమడనేరవు. ఇట్లే సర్వేశ్వర అను మకుటమున్నపుడు ఆ పద్యము మత్తేభము గానీ, శార్దూలము గాని అయి యుండవలెను. వేమన పద్యాలలోని మకుటము విశ్వదాభిరామ వినుర వేమ ఇందులో ఆటవెలది తప్ప మరొకటి వుండే అవకాశము లేదు. అలా వేరు వృత్తములను వ్రాయడాని ప్రయత్నిస్తే చందస్సు కుదరదు. కనుక శతకములో ప్రతి పద్యమూ ఒకే వృత్తంలో నుండవలెననెడి నియమమేర్పడినది.

4.రసనియమము

శతకములో యే రసము ప్రతిపాదిన రచన సాగించాలో ముందే నిర్ణయించుకొని అందులోని పద్యములన్నియు ఆ రస ప్రధానమైనవిగానె వుండవలెను. ఉదాహరణకు భక్తి రస ప్రధానమైన శతకములో ఇతర రసాలైన, శృంగార రసము, ప్రసక్తి రాకూడదు. శతకములో ఒకరసప్రధానమైన చో అందులో ఇతర రసాల ప్రయోగముండారాదని నియమము. అలా ఆయా రసప్రధానమైన శతకములెన్నో ఉన్నాయి. రసనియమముల ననుసరించి వెలువడిన శతకములలో కొన్ని ముఖ్యమైనవి......., భక్తి శతము, శృంగార శతకము, నీతి శతకము, వేదాంత శతకము, హాస్య శతకము, కథా శతకము, సమస్యా శతకము, మొదలగునవి..

5.భాషా నియమము

శతకము లన్నియు సలక్షణమైన కావ్వ భాషలోనే యుండును. కావుననే లాక్షణికులు శతకములనుండి ప్రయోగములు వంటి వాటిని ప్రామాణికములుగా తీసుకొంటారు. కానీ తెలుగున చంద్రశేఖర శతకమని ఒకటున్నది. దానిలో చంద్ర శేఖర అనే మకుటముతో చంపక, ఉత్పలమాలిక లతోవున్నది. ఇందలి భాష అంతయూ గ్రామ్యమే.

శతక వాఙ్మయము ప్రగతి.

మల్లికార్జున పండితారాధ్యుని శివతత్త్వసారము శతక వాఙ్మయమునకు ఆద్యముగా చెప్పవచ్చును. పాల్కురికి సోమన (సా.శ.1300) వృషాధిప శతకము మొట్టమొదటి సంపూర్ణ శతకము. సుమారు ఈ కాలములోనే బద్దెన సుమతీ శతకము, యథావాక్కుల అన్నమయ్య సర్వేశ్వర శతకము వెలువడ్డాయి. వీటి ఒరవడిలోనే తెలుగులోను, కన్నడములోను శతక వాఙ్మయము చాలాకాలం కొనసాగింది.

తరువాత తెలుగులో ఎన్ని వేల శతకాలు వచ్చాయో చెప్పడం కష్టం. ఎందరో పండితులు, కవులు, ఔత్సాహిక రచయితలు వేర్వేరు అంశాలలో శతకాలు రచించారు. భక్తి (కృష్ణ శతకము), శృంగారము (భర్తృహరి), తత్వము, వేదాంతము (బమ్మెర పోతన - నారాయణ శతకము), నీతి (సుమతీ శతకము), పొగడటం, తిట్టటం, పొగడినట్టు తిట్టడం, తిట్టినట్టు పొగడడం, వర్ణించడం, బోధించడం - అన్ని విషయాలలోనూ శతకాలు వ్రాశారు. వీటిలో చాలావరకు ముద్రణకు నోచుకొనబడలేదు.

తెలుగు వాగ్మయమున మొట్టమొదట వెలసిన శతకములన్నియి శైవమత సంప్రదాయకములు. దీనిని బట్టి తెలుగున శతక సాహిత్య ప్రక్రియకు ఆద్యులు శివ కవులే నని రూడిగా చెప్పవచ్చు.

బహుశా అప్పటి సాహితీ ప్రక్రియలలో ఒక్క శతకసాహిత్యమే సంఘంలోని ఆచారాలను నిశితంగా విమర్శించడానికి ఉపయోగపడింది. వీటిల్లో వేమన శతకము ఎప్పటికీ అగ్రగామి. మూడు పంక్తులలో ముప్ఫై పేజీలకు సరిపోయే భావాన్ని ఇమిడ్చిన మేధావి, తత్వ వేత్త. అందరూ అనుకొన్నదానికి కూడా నిక్కచ్చిగా ఎదురు నిలచిన మహానుభావుడు వేమన.

శతక సాహిత్యంలో ముప్ఫైకి పైగా ముస్లిం కవులు వ్రాసిన శతకాలున్నాయన్న సంగతి చాలా మందికి తెలియదు. అలాగే క్రైస్తవ భక్తిపరంగా కూడా చాలా శతకాలున్నాయి.

తెలుగు శతకాలు.

• అంతర్మథనము - కోవెల సంపత్కుమారాచార్య

• అఘవినాశ శతకము - దాసరి అంజదాసు

• అచ్యుతానంత గోవింద శతకములు - అద్దంకి తిరుమల సమయోద్దండకోలాహల లక్ష్మీనరసింహకుమార తిరువేంగడతాత దేశికాచార్యులు

• అధర్మానుతాప శతకము - వేమూరి నృసింహశాస్త్రి

• అనుగుబాల నీతి శతకము - ముహమ్మద్ హుస్సేన్

• అన్యాపదేశ శతకము - కొమాండూరు

• ఆదిత్య శతకము - పటేల్ అనంతయ్య

• ఆదినారాయణ శతకము - అబ్బరాజు శేషాచలం

• ఆదివెలమ శతకము - పిళ్లారిసెట్టి రంగబ్రహ్మారావు నాయుడు(1930)

• ఆధునిక సుమతి శతకము - లింగుట్ల కోనేటప్ప

• ఆనందరామ శతకము - ముత్తనపెద్ది సత్యనారాయణ

• ఆపదుద్ధారక శతకము - బాపట్ల హనుమంతరావు

• ఆర్తరక్షామణీ శతకము - అనంతరామయ పట్నాయక్

• ఆర్యాశతకము - కపిలవాయి లింగమూర్తి

ఈ.

• ఈశ్వరశతకము - అల్లంశెట్టి అప్పయ్య

ఉ.

• ఉన్నమాటలు - జోస్యం జనార్ధనశాస్త్రి

• ఉమా మహేశ్వర శతకము - అంగూరు అప్పలస్వామి

ఏ.

• ఏకప్రాస కందపద్య దశరథరామ శతకము - లింగుట్ల కోనేటప్ప

ఒ.

• ఒంటిమిట్ట జానకీవల్లభ శతకము - ఉప్పలపాటి వేంకటనరసయ్య

క.

• కరుణ శతకము - చలివేంద్ర రామమూర్తి

• కవి చౌడప్ప శతకము - కవి చౌడప్ప

• కవి ప్రభునామ గుంభిత విచిత్ర పద్యగర్భిత కందపద్య సకలేశ్వర శతకము - దేవులపల్లి తమ్మన్నశాస్త్రి

• కవులుట్ల చెన్నకేశవశతకము - గంటి వేంకటసుబ్బయ్య

• కామదేవ శతకము - నందివాడ వేంకటరత్నము

• కామాక్షీ శతకము - గంటి కృష్ణవేణమ్మ

• కామేశ్వరీ శతకము - తిరుపతి వేంకట కవులు (1925, 1934)

• కాళీమాత శతకం - రాధశ్రీ

• కావ్ కావ్ శతకము - కోగిర జయసీతారాం

• కాశీవిశ్వనాథ శతకము - రామకృష్ణసీతారామ కవులు (1950)

• కాశీవిశ్వనాయక శతకము - మడిపల్లి వీరభద్రశర్మ

• కులస్వామి శతకము (మధ్యాక్కరలు) - మకుటం: నందమూర్నిలయ! విశ్వేశ్వరా! కులస్వామి! - విశ్వనాథ సత్యనారాయణ

• కుక్కుటలింగ శతకము - పాపయలింగ కవి

• కుక్కుటేశ్వర శతకము - కూచిమంచి తిమ్మకవి

• కుప్పుసామి శతకము - త్రిపురనేని రామస్వామి

• కుమతి శతకము - కె.నారాయణరావు

• కుమతీ శతకము - పుల్లెల శ్రీరామచంద్రుడు

• కుమార శతకము - పక్కి వేంకటనరసయ్య

• కుమార శతకము - కల్లూరు అహోబలరావు

• కుమారీ శతకము - పక్కి వేంకటనరసయ్య

• కృష్ణ శతకము - నృసింహకవి

• కృష్ణశతకము - మంచెళ్ల కృష్ణకవి

• కృష్ణశతకము - కొడవలూరి చిన్న రామరాజకవి

• కృష్ణశతకము - గార్లదిన్న సుబ్బరావు

• కృష్ణశతకము - పరసా సుబ్బరాయుడు

• కేశవశతకము - నేలకొండపల్లి లక్ష్మణసింగు

• కొండవీటి కృష్ణశతకము - మానూరు రామకృష్ణారావు

• కొచ్చెర్లధామ శతకము - గాదె ఆదిశేషకవి (1825)

- కవి చౌడప్ప

• కవి ప్రభునామ గుంభిత విచిత్ర పద్యగర్భిత కందపద్య సకలేశ్వర శతకము - దేవులపల్లి తమ్మన్నశాస్త్రి

• కవులుట్ల చెన్నకేశవశతకము - గంటి వేంకటసుబ్బయ్య

• కామదేవ శతకము - నందివాడ వేంకటరత్నము

• కామాక్షీ శతకము - గంటి కృష్ణవేణమ్మ

• కామేశ్వరీ శతకము - తిరుపతి వేంకట కవులు (1925, 1934)

• కాళీమాత శతకం - రాధశ్రీ

• కావ్ కావ్ శతకము - కోగిర జయసీతారాం

• కాశీవిశ్వనాథ శతకము - రామకృష్ణసీతారామ కవులు (1950)

• కాశీవిశ్వనాయక శతకము - మడిపల్లి వీరభద్రశర్మ

• కులస్వామి శతకము (మధ్యాక్కరలు) - మకుటం: నందమూర్నిలయ! విశ్వేశ్వరా! కులస్వామి! - విశ్వనాథ సత్యనారాయణ

• కుక్కుటలింగ శతకము - పాపయలింగ కవి

• కుక్కుటేశ్వర శతకము - కూచిమంచి తిమ్మకవి

• కుప్పుసామి శతకము - త్రిపురనేని రామస్వామి

• కుమతి శతకము - కె.నారాయణరావు

• కుమతీ శతకము - పుల్లెల శ్రీరామచంద్రుడు

• కుమార శతకము - పక్కి వేంకటనరసయ్య

• కుమార శతకము - కల్లూరు అహోబలరావు

• కుమారీ శతకము - పక్కి వేంకటనరసయ్య

• కృష్ణ శతకము - నృసింహకవి

• కృష్ణశతకము - మంచెళ్ల కృష్ణకవి

• కృష్ణశతకము - కొడవలూరి చిన్న రామరాజకవి

• కృష్ణశతకము - గార్లదిన్న సుబ్బరావు

• కృష్ణశతకము - పరసా సుబ్బరాయుడు

• కేశవశతకము - నేలకొండపల్లి లక్ష్మణసింగు

• కొండవీటి కృష్ణశతకము - మానూరు రామకృష్ణారావు

• కొచ్చెర్లధామ శతకము - గాదె ఆదిశేషకవి (1825)

ర.

• రంగనాథశతకము - కాండూరు నరసింహాచార్యులు

• రంగశతకము - మంచెళ్ల కృష్ణకవి

• రంగశతకము - కాంచనపల్లి కనకమ్మ

• రంగేశశతకము - ముడుంబ నరసింహాచార్యులు

• రఘుపుంగవ శతకము - మంచెళ్ల కృష్ణకవి

• రసూల్ ప్రభు శతకము - షేక్ దావూద్ (1963)

• రఘురామ శతకము - కేసనపల్లి లక్ష్మణకవి

• రాఘవ శతకము (అసంపూర్ణము) - రొద్దము హనుమంతరావు

• రాఘవ శతకము - కృష్ణకుమార మిత్రులు

• రాఘవ శతకము - పుల్లెల శ్రీరామచంద్రుడు

• రాజరాజేశ్వరీ శతకము - గంటి కృష్ణవేణమ్మ

• రాజరాజేశ్వరీ శతకము - గూడ కృష్ణకవి

• రాజేశ్వరీ శతకము - అక్కిరాజు సుందర రామకృష్ణ

• రామచంద్ర శతకము - ఆదిభట్ల నారాయణదాసు

• రామచంద్రప్రభు శతకము - కొడవలూరి రామచంద్రకవి

• రామచంద్రప్రభు శతకము - పోలూరి రామకృష్ణయ్య

• రామప్రభు శతకము - అష్టకాల నరసింహరామశర్మ

• రామ పంచాశత్కందములు - జూలూరు అప్పయ్య

• రామభూపతి శతకము - గాడేపల్లి వీరరాఘవశాస్త్రి(1914)

• రామలింగ పద్యాలు - నీలా జంగయ్య

• రామలింగేశ శతకము - అడిదము సూరకవి

• రామలింగేశ్వర శతకము - సన్నపురెడ్డి వెంకటరెడ్డి, జీరెడ్డి బాలచెన్నారెడ్డి

• రామ శతకము - మణూరు రామారావు

• రామ శతకము - బాయన మొగ్గన్న

• రామ శతకము - వి.వీరబ్రహ్మం

• రామ శతకము - నీలా జంగయ్య

• రామేశ్వర శతకము - మేకా బాపన్నకవి

ల.

• లక్ష్మీ నృసింహ శతకము - పాటూరి లక్ష్మీనృసింహ కవి

• లక్ష్మీ శతకము - పరవస్తు మునినాథుడు

• లలితాంబాశతకము - జనమంచి వేంకట సుబ్రహ్మణ్యశర్మ

• లలితా శతకము - పరవస్తు మునినాథుడు

• లోకబాంధవ శతకము - బేవినహళ్లి కరణము కృష్ణరావు(1921)

వ.

• వరదరాజశతకము - ఆశావాది ప్రకాశరావు

• వర్గల్ వాణీ శతకం - రాధశ్రీ

• వాయునందన శతకము - కిరికెర రెడ్డి భీమరావు

• వాగ్దేవతా శతకము - అవుసుల భానుప్రకాశ్

• వాయునందన శతకము - కొవ్వలి వేంకట రాజేశ్వరరావు

• వాయుపుత్ర శతకము - శిష్టు కృష్ణమూర్తి

• విఘ్నరాజ శతకము - కోసంగి సిద్ధేశ్వరప్రసాద్

• విజయ శతకము - దీర్ఘాసి విజయభాస్కర్

• విజయరామ శతకము - గోగులపాటి కూర్మనాథకవి

• విజ్ఞాన కంద శతకము - మద్రాసు రాజారావు

• విజ్ఞాన శతకము - బొగ్గరపు వీరశేఖరశాస్త్రి

• విఠలేశ్వర శతకము - "మధుర కవి" డా.కూరెళ్ళ విఠలాచార్యులు

• వినయరంగ శతకము - నీలకంఠ పాండురంగము

• వినాయక శతకము -నిర్విషయానంద స్వామి

• వినాయక శతకము - మంకు శ్రీను

• విరివిండి గోపాల శతకము - కురింగంటి రామానుజాచార్యులు

• విశ్వనాథ శతకం - రాధశ్రీ

• విశ్వశతకము - వేదాటి రఘుపతి

• విశ్వేశ్వర శతకము - గాడేపల్లి వీరరాఘవశాస్త్రి

• విష్ణు సర్వోత్తమ శతకము - పత్రి రమణప్ప

• వరాహ శతకము - ఆచార్య ఫణీంద్ర

• వేములవాడ శతకము (మధ్యాక్కరలు) - మకుటం: వేములవాడ రాజరాజేశ్వర! స్వామి! - విశ్వనాథ సత్యనారాయణ

• వేంకటేశ శతకము సోమంచి వాసుదేవరావు

• వేంకటేశ్వర భక్తిశతకము - వీరభద్రకవి

• వేంకటేశ్వర శతకము - అందలం కృష్ణమూర్తి

• వేంకటేశ్వర శతకము - గాడేపల్లి వీరరాఘవశాస్త్రి

• వేంకటేశ్వర శతకము - నరసింహదేవర వేంకటశాస్త్రి

• వేంకటేశ్వర శతకము - రామకృష్ణసీతారామకవులు

• వేంకటేశ్వర శతకము - పటేల్ అనంతయ్య

• వేణుగోపాల శతకము - సోమరాజు ఇందుమతీదేవి

• వేణుగోపాల శతకము - ముదిగొండ వీరభద్రమూర్తి

• వేమన శతకము - వేమన

• వైద్యనాథ శతకము - పాపయలింగ కవి

• వృషాధిప శతకము- పాల్కురికి సోమనాధుడు

శ.

• శంకర శతకము - కవి రామయోగి(1911)

• శంభో శతకము - కొడవలూరి చిన్న రామరాజకవి

• శంభూ శతకము - విభావనుఫణిదపు ప్రభాకరశర్మ

• శతకభారతి - మాడ్గుల వేంకటరామాశాస్త్రి

• శతక షోడశి - బుర్రా వెంకటేశం

• శశిమౌళి శతకం - రాధశ్రీ

• శారదాంబ పద్యాలు - నీలా జంగయ్య

• శిఖినరసింహ శతకము - నేదునూరి గంగాధరం

• శివ శతకము - ఆదిభట్ల నారాయణదాసు

• శిష్య ద్విశతి - దూడం నాంపల్లి

• శిష్యనీతిబోధినీ శతకము - వేదము వెంకటకృష్ణశర్మ

• శ్యామలాంబా శతకము - మల్లంపల్లి మల్లికార్జున పండితుడు

• శ్రీ (అలమేలుమంగా) వేంకటేశ్వర శతకము- తాళ్ళపాక అన్నమయ్య

• శ్రీ అయ్యప్పస్వామి శతకము - అందలం కృష్ణమూర్తి

• శ్రీ కన్యకాపరమేశ్వరీ శతకము - కోట సోదరకవులు

• శ్రీ కామేశ్వరి శతకము - దోమా వేంకటస్వామిగుప్త

• శ్రీ కాళహస్తీశ్వర శతకము - ధూర్జటి

• శ్రీ కుమార శతకము (సంస్కృత శతకానికి ఆంధ్రానువాదం) - దేవులపల్లి సుబ్బరాయశాస్త్రి

• శ్రీ కురుమూర్తి శ్రీనివాస శతకము - వైద్యం వేంకటేశ్వరాచార్యులు

• శ్రీ కృష్ణభూపతి లలామ శతకము - అల్లమరాజు సుబ్రహ్మణ్యకవి

• శ్రీ కృష్ణశాస్త్రీయము (కలివిడంబన శతకము) - వేదము వెంకటకృష్ణశర్మ

• శ్రీ గురుజాల రామలింగేశ్వర శతకము - పుల్లాపంతుల వేంకటరామశర్మ

• శ్రీ చంద్రమౌళీశ్వర శతకము - బండమీదపల్లి భీమరావు

• శ్రీ చిలుకూరు వెంకటేశ్వర శతకం - జనువాడ రామస్వామి

• శ్రీ జానకీవల్లభ శతకము - మలుగూరు గురుమూర్తి

• శ్రీ జ్ఞానప్రసూనాంబికా శతకము - గంటి కృష్ణవేణమ్మ

• శ్రీ తిరుమలేశ శతకం - జనువాడ రామస్వామి

• శ్రీ దత్తప్రభు శతకము - పూర్వకవి విరచితము

• శ్రీ దత్తాత్రేయ శతకము - క్రిష్టిపాటి వేంకటసుబ్బకవి

• శ్రీ దత్తావధూత శతకము - రంగయామాత్యుని రామకృష్ణకవి

• శ్రీ దీనబాంధవ శతకము - డబీరు కాంతారత్నం

• శ్రీ దుర్గాసప్తశతి - మాడ్గుల వేంకటరామాశాస్త్రి

• శ్రీ నరసింహ శతకము - దండా నృసింహకవి

• శ్రీనివాస శతకము - కంభంపాటి రామగోపాలకృష్ణమూర్తి

• శ్రీనివాస శతకము - శంకరంబాడి సుందరాచారి

• శ్రీనివాస శతకము - కొంగే శ్రీనివాసరావు (1982)

• శ్రీ పరాంకుశ శతకము - తిరువేంకటాచార్యులు

• శ్రీ పులివెందల రంగనాయకశతకము - నీలా జంగయ్య

• శ్రీ బాలామణీ శతకము - డబీరు కాంతారత్నం

• శ్రీ భర్గ శతకము - కూచిమంచి తిమ్మకవి

• శ్రీ భావానీశంకరార్ధాష్టోత్తర శతకము - కూరపాటి వేంకటరత్నము

• శ్రీమత్కేశవ శతకము - ఆసూరి మరింగంటి వేంకటరామానుజాచార్యులు

• శ్రీమదొంటిమిట్ట రఘువీర శతకము - తిప్పరాజు

• శ్రీ మల్లికార్జున శతకము - చోడవరపు సత్యవతీదేవి

• శ్రీ మల్లేశ్వార శతకము - మావుడూరు శ్రీశైలమల్లికార్జునరావు

• శ్రీ మహాత్మాగాంధీశతకము - వనం శంకరశర్మ

• శ్రీ మృత్యుంజయ శతకము - పరిటి సూర్యసుబ్రహ్మణ్యం

• శ్రీ రంగ శతకము - మరింగంటి సింగరాచార్యులు

• శ్రీ రంగనాయక శతకము - వైద్యం వేంకటేశ్వరాచార్యులు

• శ్రీ రాఘవ శతకము - జోశ్యుల సూర్యనారాయణమూర్తి

• శ్రీ రాఘవేంద్ర శతకము - సి.యెల్లప్ప

• రాజరాజేశ్వరీ శతకము - బండకాడి అంజయ్య గౌడ్

• శ్రీ రామచంద్ర శతకము - రౌతురెడ్డి లక్ష్మణమూర్తి

• శ్రీ రామజపమాల (రామశతకము) -ఏలూరు యంగన్న

• శ్రీ రామప్రభుశతకము - కె.రామచంద్రరావు

• శ్రీ రామలింగేశ్వర శతకము - గుంటూరు సీతారామదీక్షితులు

• శ్రీ రామశతకము - కల్లూరి విశాలాక్షమ్మ

• శ్రీ రామశతకము - తిరుకోవలూరు రామానుజస్వామి

• శ్రీ రామశతకము - కొండూరు వెంకటశివరాజు

• శ్రీ రామశతకము - సత్యవోలు రాధామాధవరావు

• శ్రీ రామాయణ సారామృతము అను శ్రీ దాశరథీమకుట కందపద్యశతకము - టంకాల సత్యనారాయణ

• శ్రీ లక్ష్మీనృసింహ ధ్వరీయం (శతకము)- దోమా వేంకటస్వామిగుప్త

• శ్రీ వరేశీ శతకము - పిండి రామయోగి

• శ్రీ విలాసము (మకుట రహిత శతకము) - లంకా కృష్ణమూర్తి

• శ్రీ వీరరాఘవ శతకము - దోమా వేంకటస్వామిగుప్త

• శ్రీ వెలిగొండ వేంకటేశ్వరశతకము - చేతన

• శ్రీవేంకటాచల విహార శతకము - అజ్ఞాత కవి

• శ్రీ వేంకటేశ్వర శతకము - వంగీపురం వేంకటశేషాచార్యులు

• శ్రీ వేంకటేశ్వర శతకము - తెలిదేవర వెంకటబాలకృష్ణరావు

• శ్రీ వేంకటేశ్వర శతకము - దర్భా వేంకటకృష్ణమూర్తి

• శ్రీ వేంకటేశ్వర శతకము - వావిలాల రామమూర్తి

• శ్రీ శంకర శతకము - చాగంటి సుందరశివరావు (1963)

• శ్రీ శనీశ్వర శతకము - అక్కిరాజు సుందర రామకృష్ణ

• శ్రీశైల మల్లికార్జున శతకము - దేవులపల్లి చెంచుసుబ్బయ్య (1982)

• శ్రీశైల మల్లేశ్వరా శతకము - శొంఠి శ్రీనివాసమూర్తి

• శ్రీశైలవాసా! శివా! - బొమ్మన సుబ్బారావు

• శ్రీ సత్యనారాయణ శతకము - తెలిదేవర వెంకటబాలకృష్ణరావు

• శ్రీ సద్గురు మాణిక్యప్రభు శతకము - వనం శంకరశర్మ

• శ్రీ సూర్యరాయ శతకము -దేవగుప్తాపు భరద్వాజము

• శ్రీ సూర్యశతకము - నేమాన సూర్యప్రకాశ కవిరాజు

• శ్రీ సోమశేఖరీయము (సభారంజన శతకము) - వేదము వెంకటకృష్ణశర్మ

• శ్రీహరి శతకము - ధన్నవాడ ఆనందరావు

• శ్రీహరి శతకము - కల్లూరి విశాలాక్షమ్మ

• శ్రీగిరి శతకము (మధ్యాక్కరలు) - మకుటం: శ్రీ శైల మల్లికార్జున మహా లింగ! - విశ్వనాథ సత్యనారాయణ

• శ్రీకాళహస్తి శతకము (మధ్యాక్కరలు) - మకుటం: శ్రీ కాళ హస్తీస్వరా! మహా దేవ! - విశ్వనాథ సత్యనారాయణ

• శేషాద్రి శతకము (మధ్యాక్కరలు) - మకుటం: వేంకటేశ్వరా! శేషాద్రి నిలయ! - విశ్వనాథ సత్యనారాయణ

స.

• సంగమేశ్వర శతకము - బైరపురెడ్డి రెడ్డి నారాయణరెడ్డి

• సంగమేశ్వర శతకము - తాడూరు మోహనాచార్యులు

• సంగమేశ్వర శతకము - పరిమి వేంకటాచలకవి

• సంగ్రహ రామాయణ శతకము - మచ్చా వేంకటకవి

• సంఘజీవి శతకము - సవ్వప్పగారి ఈరన్న

• సఖుడా (శతకము) - షేక్ దావూద్

• సగ్రహ రాఘవేశ శతకము - కంభాలూరి నరసింహశర్మ

• సత్యనారాయణ శతకము - దేవులపల్లి తమ్మన్నశాస్త్రి

• సత్యనారాయణ శతకము - పండితారాధ్యుల సూర్యనారాయణకవి

• సత్యవ్రతి శతకము - గురజాడ అప్పారావు

• సదాశివ శతకము - అనంతరాజు సుబ్బరాయుడు

• సదుపదేశ శతకము - బేవినహళ్లి కరణము కృష్ణరావు

• సద్గురు శ్రీ సోమనాథ శతకము - పైడి లక్ష్మయ్య

• సర్వేశ్వర శతకము - యథావాక్కుల అన్నమయ్య

• సర్వేశ్వర శతకము - చెముడుపాటి వెంకట కామేశ్వరకవి

• సర్వేశ్వర శతకము - రావిపాటి లక్ష్మీనారాయణ

• సాంబశివ శతకము - సామల సదాశివ

• సాధురక్షణ శతకము - కొటికలపూడి సీతమ్మ

• సాధుశీల శతకము - షేక్ ఖాసిం

• సాయి శతకము - షేక్ దావూద్

• సింహాద్రి రామాధిప శతకము - అల్లంరాజు సుబ్రహ్మణ్యకవి

• సింహావలోకనము (శతకము) - చక్రాల నృసింహకవి

• సినారె శతకం - రాధశ్రీ

• సీతారామ కల్పద్రుమ శతకము - గాడేపల్లి వీరరాఘవశాస్త్రి

• సీతాదేవి శతకము - రాయవరపు కొండలరావు

• సుగుణా శతకము - కోగిర జయసీతారాం

• సుధామా శతకము - అరుణాచల భారతం

• సుప్రకాశ శతకము - రాప్తాటి సుబ్బదాసు

• సుభాషిత త్రిశతి - రూపావతారం నారాయణశర్మ

• సుభాషిత రత్నాష్టోత్తర శతకము - ఊటుకూరు వేంకటగోపాలరావు

• సుమతీ శతకము- బద్దెన (భద్ర భూపాలుడు)

• సుమాంజలి - ముహమ్మద్ హుస్సేన్, మొక్కపాటి శ్రీరామ శాస్త్రి

• సూక్తి శతకము - సయ్యద్ ముహమ్మద్ అజమ్

• సూర్య శతకము - ఆకొండి వ్యాసమూర్తి

• సూర్యనారాయణ శతకము - ఝంఝామారుతము వేంకటసుబ్బకవి

• సూర్యనారాయణ శతకము - ఆదిభట్ల నారాయణదాసు

• సోదర సూక్తులు - ముహమ్మద్ యార్

• సోమేశ్వర శతకము - గాడేపల్లి వీరరాఘవశాస్త్రి

• సోమేశ్వర శతకము - రామవరపు నరసింగరావు

హ.

• హనుమచ్ఛతకము - దీక్షితుల పాపాశాస్త్రి

• హనుమచ్ఛతకము - క్రిష్టిపాటి వేంకటసుబ్బకవి

• హర శతకము - పెండ్యాల నాగేశ్వరశర్మ

• హరిజన శతకము - కుసుమ ధర్మన్న

• హరిహరనాథ శతకము - ముహమ్మద్ హుస్సేన్

• హరిహరేశ్వర శతకము - మండపాక కామశాస్త్రి

• హిమగిరి శతకము - త్యాగి

• హ్రీంకార శతకము - నూకల సత్యనారాయణశాస్తి

• హుస్సేన్ దాస్ శతకము - గంగన్నవలి హుస్సేన్ దాస్

• హైమవతీశ శతకము - పాలుట్ల వెంకటనరసయ్య


నరసింహ శతకము
తెలుగు పద్యంశ్రీ నరసింహ శతకము తెలుగు శతక సాహిత్యంలో ప్రముఖమైనది . ఈ శతకమును రచించినది కరీంనగర్ జిల్లా ధర్మపురికి చెందిన శేషప్ప కవి. ఈ పద్యాలన్నీ

భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!

దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

అనే మకుటంతో అంతమవుతాయి. దీనర్థం అలంకారాలతో విలసిల్లేవాడా, ధర్మపురి యందు వెలసిన వాడా, దుష్ట సంహారం కావించిన వాడా, పాపములను దూరం చేయువాడా నరసింహా! అని అర్థం.

సీ: శ్రీ మనోహర! సురార్చిత! సింధుగంభీర!

భక్త వత్సల! కోటి - భానుతేజ!

కంజనేత్ర! హిరణ్యకశిపు నాశక! శూర!

సాధురక్షణ! శంఖచక్రహస్త!

ప్రహ్లాదవరద! పాపధ్వంస! సర్వేశ!

క్షీరసాగరశాయి! కృష్ణవర్ణ!

పక్షివాహన! నీలబృమరకుంతలజాల!

పల్లవారుణ పాదపద్మ యుగళ!

తే|| చారు శ్రీ చందనాగరు చర్చితాంగ!

కుందకుట్మలదంత! వైకుంఠ ధామ!

భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!

దుష్ట సంహార! నరసింహ! దురితదూర!


సీ|| పద్మలోచన సీసపద్యముల్ నీ మీఁదఁ

జెప్పఁబూనితినయ్య! చిత్తగింపు

గణ యతి ప్రాస లక్షణముఁజూడగ లేదు;

పంచకావ్య శ్లోక పఠన లేదు,

అమరకాండత్రయం బరసి చూఁడగ లేదు,

శాస్త్రీయ గ్రంథముల్ చదువలేదు,

నీ కటాక్షంబున నే రచించెదఁగాని

ప్రజ్ఞ నాయదికాదు ప్రస్తుతింపఁ

తే|| దప్పు గలిగిన సద్భక్తి తక్కువౌనె?

చెఱకునకు వంకపోతేమి జెడునె తీపి! భూ.


సీ|| నరసింహ! నీ దివ్యనామ మంత్రము చేత

దురితజాలము లెల్లఁదోలవచ్చు,

నరసింహ! నీ దివ్యనామమంత్రముచేత

బలువైన రోగముల్ బాపవచ్చు,

నరసింహ! నీ దివ్యనామమంత్రము చేత

రిపు సంఘముల సంహరింపవచ్చు,

నరసింహ! నీ దివ్య నామమంత్రము చేత

దండహస్తుని బంట్లఁ దఱుమవచ్చు.

తే|| భళిర! నే నీ మహామంత్ర బలము చేత

దివ్యవైకుంఠ పదవి సాధింపవచ్చు! భూ.


సీ|| ఆదినారాయణా యనుచు నాలుకతోడఁ

బలుక నేర్చినవారి పాదములకు

సాష్టాంగముగ నమస్కార మర్పణఁజేసి

ప్రస్తుతించెదనయ్య బహువిధముల

ధరణిలో నరులెంత దండివారైనను

నిన్నుఁగాననివారి నే స్మరింప,

మేము శ్రేష్ఠుల మంచు ముడుకుచుండెడివారి

చెంతఁజేరఁగఁ బోను శేషశయన!

తే|| పరమ సాత్త్వికులైన నీ భక్తవరుల

దాసులకు దాసుఁడను జుమీ ధాత్రిలోన, భూ.


సీ|| చిత్తశుద్ధిగ నీకు సేవఁజేసెదఁ గాని,

పుడమిలో జనుల మెప్పులకు గాదు,

జన్మ పావనతకై స్మరణ జేసెదఁగాని,

సరివారిలోఁ బ్రతిష్ఠలకుఁగాదు,

ముక్తికోసము నేను మ్రొక్కివేడెద గాని,

దండిభాగ్యము నిమిత్తంబుగాదు,

నిన్నుఁబొగడను విద్య నేర్చితినేకాని,

కుక్షి నిండెడు కూటి కొఱకుఁగాదు,

తే|| పారమార్ధికమునకు నేఁబాటుపడితిఁ

గీర్తికి నపేక్ష పడలేదు కృష్ణవర్ణ!భూ


సీ|| ఐశ్వర్యములకు నిన్ననుసరింపఁగలేదు.

ద్రవ్య మిమ్మని వెంటఁ దగులలేదు,

కనకమిమ్మని చాలఁ గష్ట పెట్టఁగ లేదు!

పల్లకిమ్మని నోటఁ బలుక లేదు,

సొమ్ము లిమ్మని నిన్ను నమ్మి కొల్వఁగ లేదు,

భూమి లిమ్మని పేరు పొగడ లేదు,

బలము లిమ్మని నిన్ను బ్రతిమాలఁగా లేదు,

పసుల నిమ్మని పట్టు బట్టలేదు,

తే|| నేను గోరిన దొక్కటే నీలవర్ణ!

చయ్యనను మోక్షమిచ్చినఁ జాలు నాకు, భూ.


సీ|| మందుడనని నన్ను నిందఁజేసిన నేమి?

నా దీనతను జూచి నవ్వనేమి?

దూరభావములేక తూలనాడిననేమి?

ప్రీతి సేయక వంక బెట్టనేమి?

కక్కసంబులు పల్కి వెక్కిరించిన నేమి?

తీవ్రకోపముచేతఁ దిట్టనేమి?

హెచ్చుమాటలచేత నెమ్మెలాడిన నేమి?

చేరి దాపట గేలి సేయనేమి?

తే|| కల్పవృక్షంబువలె నీవు కల్గ నింకఁ

బ్రజల లక్ష్యంబు నాకేల! పద్మనాభ! భూ...


సీ|| శ్రవణ రంధ్రముల నీ సత్కథల్ పొగడంగ

లేశ మానందబు లేనివాఁడు

పుణ్యవంతులు నిన్నుఁౠజ సేయ గ జూచి

భావమందుత్సాహ పడనివాఁడు

భక్తవర్యులు నీ ప్రభావముల్ పొగడంగఁ

దత్పరత్వములేక తలఁగువాఁడు

తన చిత్తమందు నీ ధ్యాన మెన్నఁడు లేక

కాలమంతయు వృధా గడపువాఁడు

తే|| వసుధలోనెల్ల వ్యర్ధుండు వాఁడె యగును;

మఱియుఁజెడుఁగాక యెప్పుడు మమతనొంది; భూ


సీ|| గౌతమీస్నానానఁ గడతేరుదమటన్న

మొనసి చన్నీళ్ళలో మునుఁగలేను;

దీర్ధయాత్రలచేఁ గృతార్ధు డౌదమటన్న

బడలి నీమంబులె నడపలేను;

దానధర్మముల సద్గతినిఁ జెందుదమన్న

ఘనముగా నాయొద్ద ధనములేదు;

తపమాచరించి సార్ధకము నొందుదమన్న

నిమిషమైన మనస్సు నిలుపలేను;

తే|| కష్టములకోర్వ నాచేతఁగాదు: నిన్ను

స్మరణఁజేసెద నా యధాశక్తి కొలఁది; భూ.


సీ|| అర్ధివాండ్రకు నీక హానిఁజేయుటకంటెఁ

దెంపుతో వసనాభిఁ దినుటమేలు;

ఆఁడుబిడ్డలసొమ్ము లపహరించుటకంటె

బండఁగట్టుక నూతఁబడుట మేలు;

పరులకాంతలఁ బట్టి బల్మిఁ గూడుటకంటె;

బడబాగ్ని కీలలఁ బడుటమేలు;

బ్రతుక జాలక దొంగపనులు సేయుటకంటెఁ

గొంగుతో ముష్టెత్తుకొనుట మేలు;

తే|| జలజదళనేత్ర! నీ భక్త జనులతోడి

జగడమాడెడు పనికంటెఁ జావుమేలు; భూ.


సీ|| గార్ధభంబున కేల కస్తూరి తిలకంబు?

మర్కటంబున కేల మలయజంబు?

శార్దూలమున కేల శర్కరాపూపంబు?

సూకరంబులకేల చూతఫలము?

మార్జాలమున కేల మల్లెపువ్వులబంతి?

గుడ్లగూబల కేల కుండలములు?

మహిషంబు కేల నిర్మలమైన వస్త్రముల్?

బకసంతతికి నేల పంజరంబు?

తే|| ద్రోహచింతనఁ జేసెడి దుర్జనులకు

మధురమైనట్టి నీ నామ మంత్రమేల? భూ


సీ|| పసరంబు పంజైనఁ బసులకాపరితప్పు,

ప్రజలు దుర్జనులైనఁ బ్రభుని తప్పు,

భార్య గయ్యాళైనఁ బ్రాణనాధుని తప్పు,

తనయుఁడు దుడుకైన దండ్రి తప్పు,

సైన్యంబు చెదరిన సైన్యనాధుని తప్పు,

కూతుఁరు చెడుగైన మాతతప్పు,

అశ్వఁబు దురుసైన నారోహకుని తప్పు,

దంతి మదించ మావంతు తప్పు,

తే|| ఇట్టి తప్పు లెఱుంగక యిచ్చవచ్చి

నటుల మెలఁగుదు రిప్పు డీ యవని జనులు; భూ.


సీ|| కోఁతికి జలతారు కుళ్ళాయి యేటికి?

విరజాజి పూదండ విధవకేల?

ముక్కిడి తొత్తుకు ముత్తెంపు నత్తేల?

నద్దమేమిటికి జాత్యంధునకును?

మాచకమ్మకు నేల మౌక్తిక హారముల్?

క్రూరచిత్తునకు సద్గోష్ఠు లేల?

ఱంకుఁబోతుకు నేల రమ్యంపు నిష్ఠలు?

వావి యేటికి దుష్ట వర్తనునకు?

తే|| మాట నిలకడ సుంకరి మోటు కేల?

చెవిటివానికి సత్కథా శ్రవణమేల? భూ.


సీ|| మాన్యంబులీయ సమర్ధుఁ డొక్కఁడు లేఁడు;

మాన్యముల్ చెఱుప సమర్ధులంత;

యెండిన యూళ్ళ గోడెరిఁగింపఁ డెవ్వఁడుఁ;

బండిన యూళ్ళకుఁ బ్రభువు లంత;

యితఁడు పేద యటంచు నెఱిఁగింపఁడెవ్వఁడు;

గలవారి సిరులెన్నఁగలరు చాలఁ;

దన యాలి చేష్టలఁ దప్పెన్నఁ డెవ్వఁడుఁ

బెఱకాంత తప్పెన్నఁ బెద్దలంత;

తే|| యిట్టి దుష్టుల కథికార మిచ్చినట్టి

ప్రభువు తప్పులటంచును బలుకవలెను; భూ.


సీ|| తల్లి గర్భమునుండి ధనముఁదేఁడెవ్వఁడు,

వెళ్ళిపోయెడినాఁడు వెంటరాదు,

లక్షాధికారైన లవణ మన్న మెకాని,

మెఱుఁగు బంగారంబు మ్రింగఁబోఁడు,

విత్తమార్జనఁజేసి విఱ్ఱవీఁగుటె కాని,

కూడఁబెట్టిన సొమ్ము గుడువబోఁడు,

పొందుగా మఱుఁగైన భూమిలోపలఁబెట్టి

దానధర్మము లేక దాఁచి దాఁచి,

తే|| తుదకు దొంగల కిత్తురో? దొరల కవునొ?

తేనె జుంటీ గ లియ్యవా తెరువరులకు? భూ.


సీ|| లోకమం దెవఁడైన లోభిమానవుఁడున్న

భిక్షమర్ధికిఁ జేతఁ బెట్టలేఁడు,

తాను బెట్టకయున్నఁ దగవు పుట్టదుకాని

యొరులు పెట్టఁగజూచి యోర్వలేఁడు,

దాతదగ్గఱఁ జేరి తన ముల్లె పోయినట్లు

జిహ్వతోఁ జాడీలు చెప్పు చుండు

ఫలము విఘ్నంబైనఁబలు సంతసము నందు,

మేలుకలిగినఁ జాల మిణుఁకుచుండు,

తే|| శ్రీరమానాధ ! యిటువంటి క్రూరునకును

భిక్షుకుల శత్రువని పేరు బెట్టవచ్చు, భూ.


సీ|| తనువులోఁ బ్రాణముల్ తరలిపోయెడివేళ

నీ స్వరూపమును ధ్యానించునతఁడు

నిమిషమాత్రములోన నిన్నుఁ జేరునుగాని,

యమునిచేతికిఁ జిక్కిశ్రమలఁబడఁడు;

పరమసంతోషాన భజనఁ జేసెడి వాని

పుణ్య మేమనవచ్చు భోగిశయన !

మోక్షము నీ దాస ముఖ్యుల కగు గాని

నరక మెక్కడిదయ్య నళిననేత్ర !

తే|| కమలనాభుని మహిమలు కానలేని

తుచ్ఛులకు ముక్తి దొరకుట దుర్లభంబు; భూ


సీ|| నీలమేఘశ్యామ ! నీవె తండ్రివి మాకు,

కమలవాసిని మమ్ముఁగన్న తల్లి,

నీ భక్తవరులంత నిజమైన బాంధవుల్,

నీ కటాక్షము మా కనేకథనము,

నీ కీర్తనలు మాకు లోక ప్రపంచంబు.

నీ సహాయము మాకు నిత్యసుఖము,

నీ మంత్రమే మాకు నిష్కళంకపు విద్య,

నీ పద ధ్యానంబు నిత్య జపము

తే|| తోయజాతాక్ష ! నీ పాద తులసిదళము

రోగముల కౌషధము బ్రహ్మరుద్ర వినుత ! భూ.


సీ|| బ్రతికినన్నాళ్లు నీ భజన తప్పను గాని,

మరణకాలమునందు మఱతునేమో?

యావేళ యమదూత లాగ్రహంబున వచ్చి

ప్రాణముల్ పెకలించి పట్టునపుడు

కఫ వాత పైత్యముల్ కప్పఁగా భ్రమచేతఁ

గంప ముద్భవమంది, కష్టపడుచు

నా జిహ్వతో నిన్ను నారాయణా! యంచుఁ

బిలుతునో! శ్రమచేతఁ బిలువలేనొ?

తే|| నాటికిప్పుడె చేసెద నామభజనఁ

దలఁచెదను జేరి వినవయ్య ! దైర్యముగను, భూ.


సీ|| పాంచభౌతికము దుర్భరమైన కాయం బి

దెప్పడో విడుచుట యెఱుకలేదు,

శతవర్షములదాఁక మితముఁ జెప్పిరి కాని,

నమ్మరాదామాట నెమ్మనమున

బాల్యమందో; మంచి ప్రాయమందో, లేక

ముదిమియందో, లేక ముసలియందొ,

యూరనో, యడవినో, యుదకమధ్యముననో,

యెప్పుడో యేవేళ నే క్షణంబొ?

తే|| మరణమే, నిశ్చయము, బుద్ధిమంతుఁడైన

దేహ మున్నంతలో మిమ్ముఁ దెలియవలయు, భూ.


సీ|| తల్లిదండ్రులు భార్య తనయు లాప్తులు బావ

మఱఁదు లన్నలు మేన మామగారు,

ఘనముగా బంధువుల్ కలిగినప్పటికైనఁ

దాను దర్లగ వెంటఁ దగిలి రారు,

యమునిదూతలు ప్రాణ మపహరించుక పోఁగ

మమతతోఁ బోరాడి మాన్పలేరు,

బలగమందఱు దుఃఖపడుట మాత్రమె కాని,

యించుక యాయుష్య మీయలేరు,

తే|| చుట్టములమీఁది భ్రమఁదీసి చూరఁ జెక్కి,

సంతతము మిమ్ము నమ్ముట సార్ధకంబు, భూ.


సీ|| ఇభరాజవరద ! నిన్నెంత పిల్చిన గాని

మాఱు పల్కవదేమి మౌనితనమొ,

మునిజనార్చిత ! నిన్ను మ్రొక్కి వేడినఁగాని

కనుల!జూచి వదేమి గడుసుదనమొ?

చాల దైన్యమునొంది చాటు జొచ్చినఁగాని

భాగ్యమీయ వదేమి ప్రౌఢతనమొ?

స్ధిరముగా నీపాద సేవఁ జేసెదనన్న

దొరకఁజాల వదేమి ధూర్తతనమొ?

తే|| మోక్షదాయక! యిటువంటి మూర్ఖజనునిఁ

గష్టపెట్టిన నీకేమి కడుపునిండు ? భూ.


సీ|| నీమీఁద కీర్తనల్ నిత్యగానముఁజేసి

రమ్యమొందింప నారదుఁడ గాను;

సావధానముగ నీ చరణపంకజసేవ

సలిపి మెప్పింపంగ శబరిఁగాను;

బాల్యమప్పటినుండి భక్తి నీయందునఁ

గలుగను బ్రహ్లాద ఘనుఁడఁగాను;

ఘనముగా నీమీఁద గ్రంధముల్ కల్పించి

వినుతిసేయను వ్యాస మునిని గాను;

తే|| సాధువును, మూర్ఖమతి, మనుష్యాధముఁడను;

హీనుఁడను, జుమ్మి; నీవు నన్నేలు కొనుము: భూ.


సీ|| అతిశయంబుగఁ గల్లలాడ నేర్చితిఁ గాని

పాటిగా సత్యముల్ బలుకనేర;

సత్కార్య విఘ్నముల్ సలుపనేర్చితిఁగాని

యిష్ట మొందఁగ నిర్వహింపనేర;

నొకరిసొమ్ముకు దోసిలొగ్గనేర్చితిఁగాని

చెలువుగా ధర్మంబు సేయనేర;

ధనము లియ్యంగ వద్దనఁగ నేర్చితిఁగాని

శీఘ్రమిచ్చెడునట్లు చెప్పనేర;

తే|| పంకజాతాక్ష ! నే నతి పాతకుఁడను

దప్పులన్నియు క్షమియింపఁ దండ్రివీవె; భూ.


సీ|| ఉర్విలో నాయుష్యమున్న పర్యంత్మంబు

మాయ సంసారంబు మరగి, నరుఁడు

సకల పాపములైన సంగ్రహించునుగాని

నిన్ను జేరెడి యుక్తి నేర్వలేఁడు,

తుదకుఁ గాలునియొద్ద దూత లిద్దఱువచ్చి

గుంజుక చనివారు గ్రుద్దుచుండ,

హింస కోర్వఁగలేక యేడ్చి గంతులు వేసి

దిక్కులేదని నాల్గు దిశలు చూడఁ,

తే|| దన్ను విడిపింప వచ్చెడి ధన్యుఁడెవడు?

ముందె నీ దాసుఁడైయున్న ముక్తిగలుగు; భూ.


సీ|| అధిక విద్యావంతుల ప్రయోజకులైరి,

పూర్ణశుంఠలు సభా పూజ్యులైరి,

సత్యవంతులమాట జనవిరోధంబాయె,

వదరుపోతులమాట వాసికెక్కె,

ధర్మవాసనపరుల్ దారిద్ర్య మొందిరి,

పరమలోభులు ధన ప్రాప్తులైరి,

పుణ్యవంతులు రోగ భూత పీడితులైరి,

దుష్ట మానవులు వర్ధిష్టులైరి,

తే|| పక్షివాహన! మావంటి భిక్షుకులకు

శక్తిలేదాయె, నిఁక నీవె చాటు మాకు, భూ.


సీ|| భుజబలంబునఁ బెద్దపులులఁ జంపగవచ్చు,

పాముకంఠముఁ జేతఁ బట్టవచ్చు,

బ్రహ్మరాక్షస కోట్ల బాఱఁద్రోలఁగ వచ్చు,

మనుజుల రోగముల్ మాన్పవచ్చు,

జిహ్వ కిష్టముగాని చేదు మ్రింగఁగ వచ్చు,

బదను ఖడ్గము చేత నదుమవచ్చుఁ,

గష్టమొందుచు ముండ్ల కంపలోఁ జొరవచ్చుఁ,

దిట్టుపోతుల నోళ్ళు కట్టవచ్చుఁ,

తే|| బుడమిలో దుష్టులకు జ్ఞానబోధఁ దెలిపి

సజ్జనుల జేయలేఁడెంత చతురుఁడైన, భూ.


సీ|| అవనిలోఁగల యాత్రలన్ని చేయఁగవచ్చు,

ముఖ్యుడై నదులందు మునుఁగవచ్చు,

ముక్కుపట్టుక సంధ్య మొనసి వార్వఁగవచ్చుఁ,

దిన్నగాఁ జపమాల ద్రిప్పవచ్చు,

వేదాల కర్ధంబు విఱిచి చెప్పఁగవచ్చు,

శ్రేష్ఠయాగములెల్లఁ జేయవచ్చు,

ధనము లక్షలు కోట్లు దానమీయఁ

నైష్ఠికాచారముల్ నడుపవచ్చు,

తే|| జిత్త మన్యస్ధలంబునఁ జేరకుండ

నీ పదాంభోజములయందు నిలుపరాదు; భూ.


సీ|| కర్ణయుగ్మమున నీ కథలు సోఁకినఁ జాలు

పెద్ద పోగుల జోళ్లు పెట్టినట్లు

చేతు లెత్తుచుఁ ౠజ సేయఁగల్గినఁ జాలు

తోరంపుఁ గడియాలు తొడిగినట్లు,

మొనసి మస్తకముతో మ్రొక్కఁగల్గినఁ జాలు

చెలువమైన తురాయి చెక్కినట్లు,

గళము నొవ్వఁగఁ నామస్మరణ గల్గినఁ జాలు,

వింతగాఁ గంఠీలు వేసినట్లు,

తే|| పూని నినుఁ గొల్చుటే సర్వ భూషణంబు,

లితర భూషణముల నిచ్చగింపనేల? భూ


శతకములు
ఆంధ్ర నాయక శతకము | కామేశ్వరీ శతకము | కుక్కుటేశ్వర శతకము | కుప్పుసామి శతకము | కుమార శతకము | కుమారీ శతకము | కృష్ణ శతకము | గాంధిజీ శతకము | గువ్వలచెన్న శతకము | గోపాల శతకము | చక్రధారి శతకము | చిరవిభవ శతకము | చెన్నకేశవ శతకము | దాశరథీ శతకము | దేవకీనందన శతకము | ధూర్తమానవా శతకము | నరసింహ శతకము | నారాయణ శతకము | నీతి శతకము | భారతీ శతకము | భాస్కర శతకము | మారుతి శతకము | మందేశ్వర శతకము | రామలింగేశ శతకము | విజయరామ శతకము | విఠలేశ్వర శతకము | వేమన శతకము | వేంకటేశ శతకము | వృషాధిప శతకము | శిఖినరసింహ శతకము | శ్రీ (అలమేలుమంగా) వేంకటేశ్వర శతకము | శ్రీ కాళహస్తీశ్వర శతకము | శ్రీవేంకటాచల విహార శతకము | సర్వేశ్వర శతకము | సింహాద్రి నారసింహ శతకము | సుమతీ శతకము | సూర్య శతకము | సమాజ దర్పణం | విశ్వనాథ పంచశతి | విశ్వనాథ మధ్యాక్కఱలు | టెంకాయచిప్ప శతకము | శ్రీగిరి శతకము | శ్రీకాళహస్తి శతకము | భద్రగిరి శతకము | కులస్వామి శతకము | శేషాద్రి శతకము | ద్రాక్షారామ శతకము | నందమూరు శతకము | నెకరు కల్లు శతకము | మున్నంగి శతకము | వేములవాడ శతకము | శతకము
  • అప్పులేనిసంసార మైనపాటే చాలు
  • ప : అప్పులేనిసంసార మైనపాటే చాలు
  • తప్పులేనిజీత మొక్కతారమైన జాలు
  • చ : కంతలేనిగుడిశొక్కగంపంతయిన జాలు
  • చింతలేనుయంబ లొక్కచేరెడే చాలు
  • జంతగానితరుణి యేజాతైన నదె చాలు
  • వింతలేనిసంప దొక్కవీసమే చాలు
  • చ : తిట్టులేనిబ్రదు కొక్కదినమైన నదె చాలు
  • ముట్టులేనికూ డొక్కముద్దెడే చాలు
  • గుట్టుచెడి మనుకంటే కొంచపుమేలైన జాలు
  • వట్టిజాలి బడుకంటే వచ్చినంతే చాలు
  • చ : లంపటపడనిమేలు లవలేశమే చాలు
  • రొంపికంబమౌకంటె రోయుటే చాలు
  • రంపపుగోరికకంటె రతి వేంకటపతి-
  • పంపున నాతనిజేరేభవమే చాలు
CONCEPT ( development of human relations and human resources )