భావన

భావన -వస్తు భావ పరంపర భావన ఈ భావన, ప్రగతికి మూలం. అజ్ఞానమే శత్రువు. జ్ఞానమనే చిరు జ్యోతిని వెలిగించి అజ్ఞాన తిమిరాన్ని పారద్రోలుదాం. ఈ చిరు ప్రయత్నాన్ని మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేయడం ద్వారా ప్రోత్సహిస్తారని ఆశిస్తూ... - మీ రామమోహన్ చింతా
Showing posts with label 1BN చారిత్రక గతిని నిర్దేశించిన తాత్వికులు బుద్ధుడు చార్య నాగార్జునుడు. Show all posts
Showing posts with label 1BN చారిత్రక గతిని నిర్దేశించిన తాత్వికులు బుద్ధుడు చార్య నాగార్జునుడు. Show all posts

1BN.చారిత్రక గతిని నిర్దేశించిన తాత్వికులు బుద్ధుడు ఆచార్య నాగార్జునుడు

ఆచార్య నాగార్జునుడు (అశ్వఘోషుడు)CE150-250
(క్రీ. శ. 150-250) ప్రసిద్ధి గాంచిన బౌద్ధ ధర్మ తాత్వికుడు. ఇతను కనిష్క చక్రవర్తి సమకాలికుడు. మహాయాన బౌద్ధ మతాన్ని ప్రవచించాడు. అందలి మాధ్యమిక సూత్రములను నాగార్జునుడు రచించాడు. ఈ మాధ్యమిక తత్వము చైనా దేశానికి మూడు గ్రంథములు (సున్ లున్) గా వ్యాప్తి చెందింది. ఆచార్య నాగార్జునుడు మహాయానం విశేష వ్యాప్తి చెందటానికి కారకుడు. ప్రజ్ఞాపారమిత సూత్రములు కూడా నాగార్జునుడే రచించాడని అంటారు. నలందా విశ్వవిద్యాలయములో బోధించాడు. జోడో షింషు అను బౌద్ధ ధర్మ విభాగమునకు ఆద్యుడు. నాగార్జునిని రెండవ బుద్ధుడని కూడా అంటారు.