CONCEPT

CONCEPT భావన - వస్తు భావ పరంపర భావన ఈ భావన, ప్రగతికి మూలం. అజ్ఞానమే శత్రువు. జ్ఞానమనే చిరుజ్యోతిని వెలిగించి అజ్ఞాన తిమిరాన్ని పారద్రోలుదాం. ఈ చిరుప్రయత్నాన్ని మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేయడం ద్వారా ప్రోత్సహిస్తారని ఆశిస్తూ... – మీ రామమోహన్ చింతా
Showing posts with label C05.Philosophy of Futility – A Negative Reflection. Show all posts
Showing posts with label C05.Philosophy of Futility – A Negative Reflection. Show all posts

C05.Philosophy of Futility – A Negative Reflection


(“Philosophy of Futility – A Negative Reflection”)

🌑 జీవిత నిష్ఫలత – ఒక తాత్విక కవిత

✍️ రచన: చి. రామమోహన్ B.A.

జీవితంలో క్రమశిక్షణ ఉండదు,
నియమం పెట్టినా దారి తప్పుతుంది.

కోరికలు అదుపులో ఉండవు,
పూర్తి కాగానే కొత్త కోరిక పుడుతుంది.

మనస్సు అధీనంలో ఉండదు,
ఆలోచనలే తన బంధాలు కడుతుంది.

ఎరుక ఉండదు,
జ్ఞానం నిద్రపోతే చీకటి చెలరేగుతుంది.

స్వంత భావాలు సూన్యం,
మన హృదయం మనకే అన్యమవుతుంది.

పారాధీనతే పరమ సోపానం,
స్వేచ్ఛ అనేది మాయమాత్రం — నియంత్రణే జీవన సత్యం.

పుట్టుట గిట్టుతా పరమ ధర్మం,
జీవితం ఒక రహస్యం — ముగింపు ఒక మౌనం.