CONCEPT

భావన

Cచారిత్రక గతిని నిర్దేశించిన తాత్వికులు : వేమన



చారిత్రక గతిని నిర్దేశించిన తాత్వికులలో వేమన ఒకరు 
సమాజం వసుదైకకుటుంబం యెక్క నమూన. తాత్వికులు సమాజం తో మమేకమై వారి కాలచక్రపరిధిని దాటి ఆలోచించారు .  సమాజానికి నూతనమార్గాన్ని నిర్దేశించారు .( భావవిప్లవం )
philosophers  are pillors of the world, they dictates the dialectical worlds history . vamana was one of them
వేమన చరిత్ర 
1.వేమన కాలము 
2.వేమన కాలంనాటికి ప్రపంచం చరిత్ర 
3.విదేశీ యాత్రికులు
4.పురావస్తు ఆధారాలు
5.శాసనాలు
6.నాణెములు 
7.సాహిత్యఆధారాలు
8.మత లౌకిక
9.స్వదేశీ
10.విదేశీ

"There are no facts, only interpretations."- Friedrich Nietzsche (1844-1900)

అజ్ఞానపు టంధయుగంలొ ఆకలిలొ,ఆవేశంలో తెలియని ఏ తీవ్రశక్తులో నడిపిస్తే నడిచి మనుష్యులు అంతా తమప్రయోజకత్వం తామేభువికధినాధులమని స్థాపించిన సామ్రాజ్యాలునిర్మించిన క్రుత్రిమ చట్టాలు ఇతరేతర శక్తులు లేస్తే పడిపోయెను పెకమేడలై పరస్పరం సంఘర్షించినశక్తులతో చరిత్ర పుట్టెను.
   - - -
నేను సైతం ప్రపంచానికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను
నేను సైతం విశ్వవృష్ఠికి అశృవొక్కటి ధారవోసాను
నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మొసానూ - శ్రీశ్రీ

5.వేమన : ( 1650 రాయలసీమ ) - భావ విప్లవం

తనకాలపు పరిధిలోనైనా సామాజిక చైతన్య దృష్టితో కవిత్వం చెప్పిన తొలి తెలుగు కవి వేమన్న. అదే దృష్టితో రచన చేస్తున్న ఈనాటి కవులు తమకన్నా పూర్వుల సంప్రదాయాన్ని తెలుసుకోటం ఆరోగ్యకరమే గాక అవసరమని కూడా భావిస్తున్నాం. వెనకటి మంచిని జీర్ణించుకొని కొత్త పరిస్థితులను గుర్తించి ముందు చూపుతో రచనలు చేయటం ఈనాటి రచయితల కర్తవ్యం.

తన కాలాన్ని మించి కొన్ని విషయాల్లో ముందుకు చూడగలిగిన కవిగా వేమన్నను మనం గౌరవించాలి. విగ్రహారాధనను వ్యతిరేకించాడు. శైవ వైష్ణవ మతాలవారి ఆర్భాటాలను, వారి దురాచారాలను, మోసాలను బట్టబయలు చేశాడు. చిలుక పలుకుల చదువులను విమర్శించాడు. కాకులకు పిండాలు పెట్టటం వంటి మూర్ఖాచారాలను తీవ్రంగా ఖండించాడు. శ్రమశక్తిలోనే సర్వమూ ఉన్నది అనేంత నిశిత పరిశీలన చెయ్యగలిగిన వేమన్న మామూలు కవికాడు, తనకాలపు చట్రంలో ఇమడని గొప్ప కవి.

వేమన్న రచనా మార్గంలో మూడు అంశాలు గుర్తించవచ్చు. 1.ప్రజలభాషలో ప్రచారంగా ఉన్న పదాలను, మాండలికాలను ప్రయోగించి ప్రజలకు సన్నిహితమైన రచన చెయ్యటం. 2.చెప్పదలచుకున్న భావాన్ని తగిన విస్తీర్ణంలోనే క్లుప్తంగా చెప్పటం. 3.ఊహలోనుంచికాక జీవితం నుంచి ఉపమానాలను ఏరుకోవటం. కవితా దృక్పథం విషయంలో మాత్రమే కాక రచనా విధానంలో కూడా వేమన్న ఆదర్శం నుంచి ఈనాటి కవులు నేర్చుకోవలసింది చాలా ఉందని దృఢంగా భావిస్తున్నాం. ( చేకూరి రామారావు ) వేమన  నిక్కమైన ప్రజాకవి

ఆయన పండితుల కోసం రాయలేదు.
పల్లెసీమల్లోని నిరక్షరాస్యులెైన అకృత్రిమ పామర జనం కోసం రాసాడు.ఆయన పొందిన లోకప్రియత ఆయన కవితాశక్తివల్ల,ఉపదేశ విశిష్టతవల్ల కలిగిందే!
:-హోవర్డ్ క్యాంబెల్ క్రెైస్తవ మిషనరి (క్రీశ 1859-1910)

వేమన పద్యాలు వందల సంవత్సరాల వరకు గ్రంథస్తం కాకుండా కేవలం సామాన్యుల నోటనే విలచి ఉన్నాయి. 1731లో ఫాదర్ లెగాక్ తొలిసారిగా వేమన పద్యాలు సేకరించాడని పరిశోధకులు భావిస్తారు. 1816లో ఒక ఫ్రెంచి మిషనరీ, తరువాత ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్ ఎన్నో వేమన పద్యాలను సేకరించారు. తాను వేమనను కనుగొన్నానని బ్రౌన్ దొర సాధికారికంగా ప్రకటించుకొన్నాడు. అతను వందల పద్యాలను సేకరించి వాటిని లాటిన్, ఆంగ్ల భాషలలోకి అనువదించాడు. అలాగే హెన్రీ బ్లూచాంస్ (1897), విలియమ్ హోవర్డ్ కాంబెల్ (1910), జి.యు.పోప్, సి.ఇ.గోవర్ వంటి ఆంగ్ల సాహితీవేత్తలు వేమనను లోకకవిగా కీర్తించారు.

35.పరమహంసననుచు పరవ గట్టుకభూమి
పరధనములకాశ పడెడు వాడు
పరమహంసగాడు పరమహింస యండ్రు

34.ఆలుబిడ్డలనుచు అతి మోహమున నున్న
ధనము మీది వాంఛ తగిలియున్న
అట్టివాని ముక్తి అవనిలో లేదయా

33.ఆర్త విద్య లెల్ల అపకీర్తి పాలాయె
వార్తకెక్కు నెంతవారికైన
ఆర్త విద్య లెల్ల ధూర్తుల పాలాయె

32.తనదు బ్రాతలెల్ల దానంబు సేయంగ
తనకు ఫలమటంచు మిణుక (మురిసిపో)రాదు
తనకు కాలుగోయ తన తమ్ముడేడ్చునా
విశ్వదాభిరామ వినురవేమ

31.తలను పాగ,పైని తగు పచ్చడము,బొజ్జ
చెవుల పోగులరసి చెరునర్ధి
శుద్ధ పశువులౌట బుద్ధిలో నెరుగక
విశ్వదాభిరామ వినురవేమ

30.ఎండ చీకటులకు నిమ్మయి యుండెడు
నిండు కుండలోన నిద్ర మరచి
దండియైన పరమ తత్వంబు తెలియదు
విశ్వదాభిరామ వినురవేమ

దేహం కుండలాగ అస్థిరమైనది. ఆత్మనిష్టతో అజ్ఞానమనే నిద్రను వదిలించుకోవాలి.ఆత్మనిష్ట గలవాడు జ్ఞాన పథంలో పయనించి యోగనిద్రను పొందుతాడు యోగనిద్ర నిత్య జాగృతికి నిలయం నిత్యజాగృతిలోకి మారటమే పరమార్ధాన్ని పొందటం

29.చూలు వలన పుట్టు సుఖదుఃఖములు రెండు
పతికి సతికి పుట్టు పరగ సుతుడు
సతికి సుతుని వలన సౌఖ్యంబు కలుగును
విశ్వదాభి రామ వినుర వేమ

 27.ఎక్కుడైన అశలినుమడి యుండగా
తిక్కబట్టి నరుడు తిరుగుచుండు
కుక్క వంటి ఆశ కూర్చుండనివ్వదు
విశ్వదాభి రామ వినుర వేమ

తాత్పర్యం:
అత్యాశ (దురాశ)కుక్కలాగ చంచలమైంది ఒక చోట ప్రశాంతంగా ఉండనివ్వదు

 26.ఓజమాలు పొలతి ఓలి మాడల చేటు
పోటుకెడలు బంటు కూటి చేటు
పనికిమాలు తొత్తు బత్తెంటు చెటురా
విశ్వదాభిరామ వినురవేమ

తాత్పర్యం:
పద్ధతి లేని పెండ్లాం వల్ల పెండ్లి ఖర్చులు,సమర్ధతలేని  బంటు (అంగరక్షకుడు) వల్ల అతనికి పెట్టిన గ్రాసం,పని చేత  గాని సేవకుని వల్ల భత్యంవృథా అంటున్నాడు వేమన
26.రాతిప్రతిమదెచ్చి రాజసంబున నుంచి
పూజసేయు నరుడు బుద్ధిమాలి
భావమందు పరము భావించ నేరడో!

25.సిద్ధులైనవారి చిత్తము రంజిల్లు
ఒడలు మెరుగు లెక్కకిడరు గాన
పనసపండు ఘనత పైనేమి గలదురా

24.వాడకురికి తిట్టు వలదన్న మొరపెట్టు
ముందు మగని దిట్టు ముసుగుబెట్టు
గడుసురాలు మగని గంప బెట్టమ్మురా

23.జాణలైన యట్టి చపలాయతాక్షుల
వలపు లరసి చూసి బ్రమయనేల?
బయలిరూపు లెల్ల పరికింపగానేల

22.స్త్రీలు గల్గు చోట చెల్లాటములు గలుగు
స్త్రీలు లేని చోట చిన్న బోవు
స్త్రీల చేత నరులు చిక్కు చున్నారయా
విశ్వదాభిరామ వినురవేమ

21.మంట,లోహమందు,మాకుల, శిలలందు
పటము గోడలందు ప్రతిమలందు
తన్నుదెలుసు కొరకు తగలదా పరమాత్మ?

20.జీవ,లింగ పూజ సేసిన వారికి
శిలల రూపమందు చింతయేల?
చెలగి మధువు గ్రోల చేదు రుచించునా

19.పాప పుణ్యములను పసికాపెరుంగునా
ధరను పరమయోగి యెరుగుగాక
లోని పొందికె గని లోహముల్ గూర్పరో

18.పచ్చవిల్తు చేత గ్రచ్చర జనులెల్ల
తచ్చనాడ బడిరి ధరణిలోన
కులజుడెవ్వడిందు కులహీనుడెవ్వడు ?


17.అధికమైన యజ్ఞమల్పుండు తాజేసి
మొనసి శాస్త్రము విడి మురుపు దక్కు
దొబ్బ నేర్చు కుక్క దుత్తలు మోసునా

నిపుణుడు చెయ్వాల్సిన పనిని నికృష్టుడు చెయ్యరాదని వేమన సందేశం


16.ప్రభువు కోతియైన ప్రగడలు పందులు
సైనికుండు పక్కి,సేన పసులు
ఏన్గులశ్వచయము లెలుకలు,పిల్లులు

15.పెట్టినంత ఫలము పెక్కండ్ర కుపహతి
చేయకున్న తాను చెరపకున్న
పెండ్లి చెయునట్టి  పెద్దఫలంబురా

14.గతము చేసినట్టి కర్మ బంధములన్ని 
పరిసిపోవు సత్యగురుని వలన
కుమ్శరికొక యేడు గుదియకు నొకనాడు

13.పుట్టు దుఃఖమునను,పొరలు దుఃఖమునను
గిట్టు దుఃఖమునను ,క్రింద జనును
మనుజ దుఃఖము వలె మరి లేదు దుఃఖంబు

12.మెలత నడవి నుంచి మృగము వెంటనెపోయె
రామచంద్రుకన్న రసికుడేడి?
చేటుకాలమునకు చెడుబుద్ధి పుట్టును

11.సతికి పతికినైన సంపద సంపదె
పుత్ర సంపదలును భువిని మేలు
సరగ ముదిసి బ్రతుకు సంపద సంపద

10.తనకు లేనినాడు దెైవము దూరును
తనకు కలిగెనేని దెైవమేల
తనకు దైవమునకు తగులాటమే శాంతి

9.కడుపు చిచ్చు చేత కామానలము చేత
క్రోధ వహ్ని చేత కుటిల పడక
ఒక్క మనసు తోడ నుండినపుడె ముక్తి

8.భూమిలోన పుణ్యపురుషులు లేకున్న
జగములేల నిలుచు పొగులుగాక
అంత తరచు దొరక రాడనాడను గాని

7.తిర్రివాని మిగుల దీవించగా రాదు
వెర్రివాని మాట వినగరాదు
వెర్రికుక్క బట్టి వేటాడవచ్చునా

6.ఎదుటి తన బలంబు నెంచుకోనేరక
దీకొని చలమునన్ దీర్చెనేని
ఎలుగు పంజు సేవకేర్పడు చందమో

5.పాలు పెరుగు వెన్న పాయసాన్నము నెయ్యి
జున్ను నెన్నియైన చూడపాలు
పాలవంటి కులము బ్రహ్శంబు గానరో

4.దొంగ తెలివిచేత దొరుకునామోక్షంబు
చేతగాని పనులు చేయరాదు
గురుడనంగవలదు గుణహీనుడనవలె

3.మొండి వానికేల ముంజేతి కడియాలు
తొర్రివానికేల కర్రపండ్లు
గాడిదెలకు నేల గడ్డముల్ మీసముల్
విశ్వదాభిరామ వినురవేమ

2.బంగరు పొడగన్న భామల పొడగన్న
చిత్తమునను చింత సేయడేని
వాడె పరమయోగి వర్ణింప జగమందు
విశ్వదాభిరామ వినురవేమ

1.మనసు పూనిగెల్చి మనసులో సుఖియించి
కడకు మోక్షపదము గనునువాడు
చెట్టుబెట్ట ఫలము చేకూరకుండునా
విశ్వదాభిరామ వినురవేమ

తెలుగు సాహిత్య చరిత్రకారులలో ప్రథములైన కందుకూరి వీరేశలింగంగురజాడ శ్రీరామమూర్తికావలి రామస్వామి తన ఆంగ్ల గ్రంథంలోను వేమన చరిత్రను చేర్చలేదు. దీనిగూర్చి నార్ల వేంకటేశ్వరరావు "ఇట్టి మూగకుట్ర, ఒక మహావ్యక్తి పేరైనను ఉచ్ఛరించక మరుగుపరచిన మౌనకుతంత్రము ప్రపంచ భాషా చరిత్రలందెచ్చటనుకానము, ఇది ఒక పెద్ద విస్మయము "అని అన్నాడు.[17] అయితే వేమన పద్యాలను కందుకూరి వీరేశలింగం తన సాహిత్యంలో కొన్ని పద్యాలనుదహరించాడు. గురజాడ అప్పారావు కన్యాశుల్కంలో వేమనను విరివిగా ప్రశంసించాడు.[17] బ్రౌన్ తరువాత కట్టమంచి రామలింగారెడ్డి తన కవిత్వతత్వవిచారం గ్రంథంలో మహాకవిగా గుర్తించాడు. తరువాత 1928 లో రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ విశేష పరిశోధన చేసి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఉపన్యాసాలిచ్చాడు. ఆ తరువాత ఏభై ఎళ్లకు శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆరుద్రచే వేమన్న గురించిన ఉపన్యాసాలు నిర్వహించింది. పైన పేర్కొన్న సాహితీ వేత్తల కృషి తరువాత వేమన రచనలకు పండితులనుండి అనన్యమైన గౌరవం లభించసాగింది. కొమర్రాజు వేంకటలక్ష్మణరావుసురవరం ప్రతాపరెడ్డిమల్లంపల్లి సోమశేఖరశర్మవేటూరి ప్రభాకరశాస్త్రి వంటివారు వేమనను సంస్కర్తగా ప్రస్తుతించారు తరువాత ఎందరో యువ కవులు, రచయితలు వేమన గురించి, వేమన రచనల గురించి పరిశోధనలు చేశారు. ఎన్. గోపిబంగోరె వంటివారు వీరిలో ప్రముఖులు.

కేంద్ర సాహిత్య అకాడమీ ప్రముఖ పాత్రికేయుడు నార్ల వెంకటేశ్వరరావు చేత వేమన జీవిత చరిత్రను వ్రాయించి 14 భాషల్లోకి అనువదింపజేశారు. ఆంగ్ల, ఐరోపా భాషలన్నింటిలోకి, అన్ని ద్రావిడ భాషలలోకి వేమన పద్యాలు అనువదింపబడ్డాయి. వేమనకు లభించిన ఈ గౌరవం మరే తెలుగు కవికి లభించలేదు. ఐక్య రాజ్య సమితి - యునెస్కో విభాగం వారు ప్రపంచ భాషా కవుల్లో గొప్పవారిని ఎంపిక చేసే సందర్భంలో వేమనను ఎన్నుకొని ఆ రచనలను పలు భాషలలోకి అనువదింపజేశారు.

యోగివేమన జయంతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వేడుకగా ప్రతి సంవత్సరం జనవరి 19న అధికారికంగా నిర్వహిస్తుంది. దీనికి సంబంధించిన జీఓ (నెంబర్‌ 164)ను రాష్ట్ర ప్రభుత్వం డిసెంబరు 2023లో విడుదల చేసింది.[18]



CONCEPT:
( development of human relations and human resources )