తెలుగు సాహిత్యంలో ఒక విప్లవాత్మక ఉద్యమానికి తెరతీసిన రచయిత చలం. ఆయన రచనలు ఒకవైపు సాంప్రదాయ సామాజిక విలువలపై ప్రశ్నలు వేస్తే, మరోవైపు వ్యక్తిగత భావోద్వేగాలను, మానసిక స్వేచ్ఛను అవగాహన చేసుకునే ఆవశ్యకతనుప్రతిపాదించాయి.
చలం రచనలలో ప్రేమ, మోహం, కామం వంటి భావాలు కేవలం కథా అంశాలుగాక, తాత్వికంగా విశ్లేషించదగ్గ అంశాలుగా మారతాయి. ఈ విశ్లేషణలో మనం చలం రచనలపై ఫ్రాయిడ్ సైకాలజీ ప్రభావాన్ని పరిశీలిస్తాం.
ఫ్రాయిడ్ ప్రభావం
సిగ్మండ్ ఫ్రాయిడ్ "అవచేతన మనస్సు", "లిబిడో", "ఇడిపస్ కాంప్లెక్స్" వంటి భావనలతో మానవ వ్యక్తిత్వాన్ని విశ్లేషించాడు. చలం రచనల్లో ఈ భావజాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. “మైదానం” నవలలో కథానాయిక తన స్వేచ్ఛ కోసం సమాజ విలువలతో పోరాటం చేస్తుంది. ఇది ఫ్రాయిడ్ “ఇగో - సుపరీఇగో” సిద్ధాంతాన్ని ప్రతిబింబిస్తుంది.
ప్రేమ - ఒక విముక్తి తత్వం
చలానికి ప్రేమ అనేది బంధనాల కంటే విముక్తికి మార్గం. ఆయన ప్రేమను శరీర సంబంధానికి పరిమితం చేయలేదు. ప్రేమ అనేది సమాజ నియమాలకు భిన్నంగా అన్వేషించాల్సిన స్వేచ్ఛతో కూడిన అనుభూతిగా చూశాడు.
మోహం - బానిసత్వానికి ప్రతీక
మోహం వ్యక్తిని బానిసగా చేస్తుంది. చలం రచనలలో మోహానికి గురైన వ్యక్తి తన స్వేచ్ఛను కోల్పోతాడు.
కామం - ప్రకృతిసిద్ధమైన అనుభూతి
చలం కామాన్ని సహజమైన భావంగా గుర్తించి దాన్ని అణచడాన్ని తప్పుబట్టాడు. “మైదానం”, వంటి రచనలలో శారీరక భావాలు నిర్మొహమాటంగా వ్యక్తీకరించాడు.
ముగింపు
చలం రచనలు ప్రేమ, మోహం, కామం వంటి భావజాలాలను కేవలం కథా అవసరాలకు మాత్రమే పరిమితం చేయలేదు. అవి వ్యక్తిత్వ వికాసానికి, సామాజిక విమర్శకు పునాది వేశాయి. ఫ్రాయిడ్ ప్రభావం చలం గారి రచనల్లో కనిపిస్తుంది. చలాన్ని తాత్వికుడిగా గౌరవించవచ్చు.
- CH Ramamohan, B.A.