భావన

భావన
వస్తు భావ పరంపర భావన ఈ భావన ప్రగతికి మూలం
Showing posts with label 01.తాత్వికులు - భావనలు జాషువా. Show all posts
Showing posts with label 01.తాత్వికులు - భావనలు జాషువా. Show all posts

01.తాత్వికులు - భావనలు జాషువా

తాత్వికులు - భావనలు

జాషువ

మొదటి పద్యంలో ఈ విషయాన్నే ప్రస్తావిస్తూ, ఈ శ్మశానవాటికలో కొన్నివందల, వేల ఏండ్లుగా నిద్రిస్తున్నవారు ఒక్కరుకూడా లేచి రాలేదు కదా అంటూ ప్రారంభించాడు.

ఇంకా ఎన్ని సంవత్సరాలు ఈ చలనంలేని నిద్ర అంటూ వాపోతున్నాడు.

ఈ రుద్రభూమిలో తమ బిడ్డలను పోగొట్టుకున్న తల్లుల రోదనలతో నిండిన కన్నీళ్లకు వల్లకాడులోని రాళ్లు క్రాగిపోయాయని చింతిస్తున్నాడు.

కవి హృదయం చూడండి.

ఎన్నో యేండ్లు గతించిపోయినవి గానీ, యీ శ్మశానస్ధలిన్
గన్నుల్ మోడ్చిన మందభాగ్యుడొకఁడైనన్ లేచిరాఁ, డక్కటా!
యెన్నాళ్ళీ చలనంబులేని శయనం? బేతల్లు లల్లాడిరో!
కన్నీటంబడి క్రాఁగిపోయినవి నిక్కంబిందు పాషాణముల్

ఈ పద్యంలో జాషువ మరణం, మానవ దుఃఖం, తల్లుల బాధ, జీవితం యొక్క నశ్వరతను హృదయాన్ని కదిలించేలా చిత్రించాడు.

CONCEPT ( development of human relations and human resources )