తాత్వికులు - భావనలు 🌐
సముద్రాల
సంగీతం: మాష్టర్ వేణు
రచన: సముద్రాల
గానం: జిక్కి, భానుమతి
తాత్విక గీతం
కనులకు దోచి చేతికందని ఎండమావులున్నయ్
సోయగముండి సుఖము నోచని బ్రతుకులున్నవి కొన్ని

భూమిజనించి ఆకలి కొదగని ఫలములున్నవి కొన్ని

మనసున నిండి పలుకగరాని తలపులున్నవి కొన్ని
తలపులున్నవి కొన్ని
సృష్టి చేసినది దేవుడైన మరి నాశమునేల సృజించే
పలుకు నొసగినది దేవుడైన మరి మూగలనేల సృజించే
కనుల నొసగినది దేవుడైన మరి అంధులనేల సృజించే

వెలుగునిచ్చినది దేవుడైన మరి చీకటినేల సృజించే
వేద శాస్త్రములు చదివినవారే ఎరుగరు సృష్టి విలాసం

అల్పబుద్దితో జ్ఞానదాతనే సలుపకు పరిహాసం
నువ్వు సలుపకు పరిహాసం
బ్రతుకంతా పలు ప్రశ్నలమయమై బ్రతుకును జనసముదాయం
బదులు కోసమై వెదకుటమాని బ్రతుకుటయే న్యాయం

భావం
ఈ గీతంలో జీవితం అనేక ప్రశ్నల సమాహారమని, మన కళ్లకు కనిపించే ప్రతిదీ అందుబాటులో ఉండదని చెప్పబడింది.
సృష్టిలోని అసమానతలు, బాధలు, సందేహాలు మనిషిని ఆలోచింపజేస్తాయి.
ప్రతి ప్రశ్నకు సమాధానం వెదుకుతూ కాలం గడపడం కంటే, జీవితం అర్థవంతంగా బ్రతకడమే న్యాయం అని ఈ గీతం సందేశం.