CONCEPT

భావన

తెలుగు - సౌందర్యం - సాహిత్య కళారూపాలు ( పద్యాలు )


పద్యాలు
  • ఉప్పుగప్పురంబు న్రొక్కపోలికనుండు,
  • చూడచూడ రుచుల జాడవేరు,
  • పురుషులందు పుణ్య పురుషులువేరయ,
  • కరకు కాయల దిని కాషాయ వస్త్రముల్
  • ,బోడినెత్తి గలిగి బొరయుచుండ్రు,
  • తలలు బోడులైన తలపులు బోడులా
  • కుండ కుంభమన్న కొండ పర్వతమన్న
  •  నుప్పు లవణమన్న నొకటి కాదె 
  • భాష లిట్టె వేరు పరతత్వమొకటె (4-12-2014)
  • చంపదగిన యట్టి శత్రువు తన చేత
  • చిక్కెనేని కీడు సేయరాదు
  • పొసగ మేలు చేసి పొమ్మనుటే చావు (5-12-2014)
  • చిత్తశుద్ధి గలిగి చేసిన పుణ్యంబు
  • కొంచమైన నదియు కొదువ గాదు
  • విత్తనంబు మర్రి వృక్షంబునకు నెంత? (11-12-2014)
  • పట్ట నేర్చు పాము పడగ యోరగజేయు
  • చెరుప జూచు వాడు చెలిమి జేసు
  • చంపదలచు రాజు చనువిచ్చుచుండురా 
  • విశ్వధాభిరామ వినుర వేమ ! (3-12-2014)
కుండ కుంభమన్న కొండ పర్వతమన్న
నుప్పు లవణమన్న నొకటి కాదె
భాష లిట్టె వేరు పరతత్వమొకటె
విశ్వధాభిరామ వినుర వేమ !  -1
పట్ట నేర్చు పాము పడగ యోరగజేయు
చెరుప జూచు వాడు చెలిమి జేసు
చంపదలచు రాజు చనువిచ్చుచుండురా
విశ్వధాభిరామ వినుర వేమ ! -2
-వేమ
-----------------------------
నడెవు దొందె భూమి కుడివు దొందె నీరు
నుడువగ్ని మొందె తిరలు
కులగోత్ర నడువె యత్తణదు సర్వజ్ఞ.
(మనుష్యులందరూ ఒకే భూమి మీద నడుస్తూ,ఒకే నీరు తాగుతూ చివరకు 
ఒకే నిప్పు లో కాలి నశిస్తుంటే ఇక కుల గోత్రాల గోప్ప ఎక్కడిది ?) 
-కన్నడ కవి సర్వజ్ఞుడు
-------------------------------
నిద్రేసి ఆసన్ ఉత్తమ్ పాషాణ
వరీ ఆవరణా అకాశాచే
తే థే కాయకరణే కవణాచీ ఆస్
వాయా హోయ నాశ ఆయుష్యాచా
(నిద్రకు రాతిపానుపు మేలు,ఆకాశమే మంచి కప్పు,
కోరిక జీవితాన్ని వ్యయపరుస్తుంది)- తుకారాం

భర్తృహరి


కేయూరాణి న భూషయంతి పురుషం హారా న చంద్రోజ్వ్జలా
నస్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజాః
వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే
క్షీయంతే-ఖిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణమ్‌ ॥

వయ మిహ సరితుష్టా వల్కలై స్త్వం దుకూలై:
స్సమఇవ పరితోషో నిర్విశేషో విశేషః
సతు భవతు దరిద్రోయస్య తృష్ణా విశాలా
మనసి చ పరితుష్టే కోర్ధవాన్ కో దరిద్రః
ద్రవ్యాశ గలవానికి దారిద్ర్యము గాని
మన స్సం తు ష్టి గలవానికి ద్రవ్య మక్కరలేదు.

కవిత్రయం

Preview

దళిత నవీన కందళ కదంబ కదంబక కేతకీ రజో-
మిళిత సుగంధ బంధుర సమీరణుఁడన్ సఖుఁ డూచుచుండఁగా
నులియుచుఁ బువ్వు గుత్తు లను నుయ్యెల లొప్పుగ నెక్కి యూఁగె ను-
ల్లలదళినీకులంబు మృదులధ్వని గీతము విస్తరించుచున్

సీ. ఈ వెండ్రుకలు వట్టి యీడ్చిన యా చేయి
దొలుతగాఁ బోరిలో, దుస్ససేను
తను వింత లింతలు తునియలై చెదరి రూ
పఱి యున్నఁ గని ఉడుకాఱుఁ గాక
యలుపాలఁ బొనుపడునట్టి చిచ్చే యిది
పెనుగద వట్టిన భీమసేను
బాహుబలంబునుఁ బాటించి గాండీవ
మను నొక విల్లెప్పుడును వహించు
ఆ.వె. కఱ్ఱి విక్రమంబుఁ గాల్పనే యిట్లు
బన్నములు వడిన ధర్మనందనుడును
నేను రాజరాజు పీనుంగుఁ గన్నారఁ
గానఁ బడయమైతి మేనిఁ గృష్ణ!
ఎఱ్ఱన్న(1325–1353)

Preview
కృష్ణదేవరాయలు 1509-1530 (ఈ సామ్రాజ్యం 1336 నుండి 1660 వరకు వర్ధిల్లింది. )
Preview

 స్వస్వయంగా  కవిపండితుడు కూడా కావడంతో 
ఇతనికి సాహితీ సమరాంగణ సార్వభౌముడుఅని బిరుదు. 
ఈయన స్వయంగా సంస్కృతంలో జాంబవతీ కళ్యాణము
మదాలసాచరితము,సత్యవధూపరిణయము,
సకలకథాసారసంగ్రహముజ్ఞానచింతామణిరసమంజరితదితర గ్రంథములు,
 తెలుగులో ఆముక్తమాల్యద లేకగోదాదేవి కథ అనే గ్రంథాన్ని రచించాడు.[3] 
తెలుగదేల యన్న దేశంబు తెలుగేను 
తెలుగు రేడ నేను తెలుగొకొండ 
ఎల్ల జనులు వినగ ఎరుగవే బాసాడి
 దేశభాష లందు తెలుగు లెస్స
అన్న పలుకులు రాయలు వ్రాసినవే

రాయల ఆస్థానానికి భువన విజయము అని పేరు. భువనవిజయంలోఅల్లసాని పెద్దననంది తిమ్మనధూర్జటి,మాదయ్యగారి మల్లన (కందుకూరి రుద్రకవి), అయ్యలరాజు రామభద్రుడుపింగళి సూరనరామరాజభూషణుడు(భట్టుమూర్తి), తెనాలి రామకృష్ణుడు అనే ఎనిమిది మంది కవులు ఉండేవారని ప్రతీతి. వీరు అష్టదిగ్గజములు గా ప్రఖ్యాతి పొందారు.


కేదారేశు భజించితిన్‌ శిరమునన్‌ కీలించితిన్‌ హింగుళా 
పాదాంభోరుహముల్‌ ప్రయాగనిలయుం పద్మాక్షు సేవించితిన్‌ 
యాదోనాథసుతాకళత్రు బదరీనారాయణుం కంటి నీ 
యా దేశంబననేల చూచితి సమస్తాశావకాశంబులన
*తొలితెలుగు ప్రబంధం , ప్రథమాశ్వాసము మనుచరిత్ర-
------------------------------------------------------------------------------
కలలంచు న్శకునంబులంచు గ్రహయోగంబంచు సాముద్రికం
బు లటంచుం దెవులంచు ,దిష్టియనుచు న్భూతంబులంచు న్విషా
దు లటంచు న్నిమిషార్ధ జీవనములందుం బ్రీతి పుట్టించి నా
సిలుగుల్ ప్రాణుల కెన్ని చేసితివయా ! శ్రీ కాళహస్తీశ్వరా !        

                   ఈశ్వరా !  రెప్పపాటు లో మరణించే  ఈ జీవుల యొక్క  జీవితాల లో మమకారాన్ని పుట్టించి ,  కలలనీ , శకునాలనీ ,  గ్రహా యోగ సాముద్రికాలనీ , రోగాలు ,  దిష్టులు భూతాలనీ , విషప్రయోగాలనీ  ఎన్ని ఆపదలను సృష్టించావు  స్వామీ  !
*ధూర్జటి   శ్రీ కాళహస్తీశ్వర శతకము

బమ్మెర పోతన - 1450–1510

Preview
మందార మకరంద మాధుర్యమునఁ దేలు మధుపంబు వోవునే మదనములకు
నిర్మల మందాకినీ వీచికలఁ దూఁగు రాయంచ సనునె తరంగిణులకు
లలిత రసాలపల్లవ ఖాది యై చొక్కు కోయిల సేరునే కుటజములకు
బూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరక మరుగునే సాంద్ర నీహారములకు
అంబుజోదర దివ్య పాదారవింద
చింతనామృత పానవిశేష మత్త
చిత్త మేరీతి నితరంబు జేరనేర్చు
వినుతగుణశీల! మాటలు వేయునేల?
శతకములు ,శతక కర్తలు
Preview
పద్యం:
ఆత్మశుద్ది లేని యాచారమదియేల?
భాండశుద్ది లేని పాకమేల?
చిత్తశుద్ది లేని శివపూజలేలరా?
విశ్వదాభిరామ వినురవేమ.

తాత్పర్యం:
మనసు నిర్మలతో లేనపుడు ఏపని చేసిన అది వ్యర్ధమే అగును.అపరిశుభ్రముగా వున్న పాత్రలో వంట చేసినచో అది శరీరమునకు మంచిదికాదుగదా.అదేవిధముగా నిశ్చలమైన మనస్సుతో చేయని భగవంతుని పూజలు కూడా ఎలాంటి ఫలితాలనివ్వవు.
కుండ కుంభ మన్న కొండ పర్వతమన్న
నుప్పు లవణ మన్న నొకటికాదె
భాష లిట్టె వేరు పరతత్వమొక్కటే
విశ్వదాభిరామ వినురవేమ
------------------------------------------
Preview
నడువకుమీ తెరువొక్కటఁ
గుడువకుమీ శతృనింటఁ గూరిమితోడన్‌
ముడువకుమీ పరధనముల
నుడువకుమీ యెరులమనసు నొవ్వగ సుమతీ!

తాత్పర్యం:తోడులేకుండా వంటరిగా పోవద్దు. విరోధి ఇంట్లో భుజింపవద్దు. 
ఇతరుల ధనం దగ్గర ఉంచుకోవద్దు. ఇతరుల మనస్సు బాధపడేట్లు మాట్లాడవద్దు.

మ.    అరి జూచున్ హరి జూచు జూచుకములం దందంద మందార కే
        సరమాలామకరందబిందుసలిలస్యందంబు లందంబులై
        తొరుగం బయ్యెద కొం గొకింత దొలగం దొడ్తో శరాసారమున్
        దరహాసామృతపూరముం గురియుచుం దన్వంగి కేలీగతిన్

పై పద్యం ఉత్తర హరివంశ కావ్యం లోనిది. నాచన సోమనాథుడు రచించినది. చాలా ప్రసిద్ధమైన పద్యం.
పరు జూచున్ వరు జూచు నొంప నలరింపన్ రోష రాగోదయా
విరత భ్రూకుటి మందహాసములతో వీరంబు శృంగారమున్
జరుగన్ కన్నులు కెంపు సొంపు బరగన్ జండాస్త్ర సందోహముల్
సరసాలోక సమూహమున్ నెరపుచున్ చంద్రాస్య హేలాగతిన్
పోతన
CONCEPT ( development of human relations and human resources )