Index - impartant contents

Categories
Education / విద్య
General / సాధారణం
General Knowledge / జనరల్ నాలెడ్జ్
Health / ఆరోగ్యం
History / చరిత్ర
Literature / సాహిత్యం
Philosophy / తత్వం
Philosophers / తత్త్వవేత్తలు
Historical Philosophers / చరిత్ర తాత్వికులు
Politics / రాజకీయాలు
Religion / మతం
Photo of the Day / ఈరోజు ఫోటో
Personality Development / వ్యక్తిత్వ వికాసం
Music / సంగీతం
Let’s Learn / తెలుసుకుందాం
personality / వ్యక్తిత్వం
Showing posts with label B05.చారిత్రక గతిని నిర్దేశించిన తాత్వికులు వేమన🌐. Show all posts
Showing posts with label B05.చారిత్రక గతిని నిర్దేశించిన తాత్వికులు వేమన🌐. Show all posts

B05.చారిత్రక గతిని నిర్దేశించిన తాత్వికులు వేమన🌐


5.చారిత్రక గతిని నిర్దేశించిన తాత్వికులు
వేమన ( 1650 రాయలసీమ )

భావ విప్లవం
CP బ్రౌన్ ద్వారా వేమన పద్యాలు 1839లో పుస్తకం రూపంలో తొలిసారిగా వెలుగులోకి వచ్చాయి. పామరులకు కూడా అర్థమయ్యే భాషలో పద్యాలు చెప్పి, ప్రజల్ని మెప్పించాడు.

@చారిత్రక గతిని నిర్దేశించిన తాత్వికులలో వేమన ఒకరు.
@సమాజం వసుదైకకుటుంబం యెక్క నమూన. తాత్వికులు సమాజంతో మమేకమై వారి కాలచక్రపరిధిని దాటి ఆలోచించారు సమాజానికి నూతనమార్గాన్ని నిర్దేశించారు .  

@వేమన సమాజంలో భావవిప్లవ ఆద్యుడు తన కాలం తర్వాత వచ్చిన karkl మార్క్స్ కు ధీటుగా భావన చేయగలిగినవాడు 

అజ్ఞానపు టంధయుగంలొ ఆకలిలొ,ఆవేశంలో తెలియని ఏ తీవ్రశక్తులో నడిపిస్తే నడిచి మనుష్యులు అంతా తమప్రయోజకత్వం తామేభువికధినాధులమని స్థాపించిన సామ్రాజ్యాలునిర్మించిన క్రుత్రిమ చట్టాలు ఇతరత్రా శక్తులు లేస్తేనే పెకమేడలై పరస్పరం సంఘర్షించిన శక్తులతో చరిత్ర పుట్టింది.
***
నేను సైతం ప్రపంచానికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను 
నేను సైతం విశ్వవృష్ఠికి అశృవొక్కటి ధారవోసాను 
నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మొసానూ - శ్రీశ్రీ
***
@సాహిత్య భావ శకలాలతో వ్యక్తులను , చరిత్రని దర్శించగలం, (CH R)
 వేమన సామజిక చైతన్యం తనకాలపు పరిధిలోనైనా సామాజిక చైతన్య దృష్టితో కవిత్వం చెప్పిన తొలి తెలుగు కవి వేమన్న. 
దార్శినికుడు 
తన కాలాన్ని మించి కొన్ని విషయాల్లో ముందుకు చూడగలిగిన కవిగా వేమన్నను మనం గౌరవించాలి.

విగ్రహారాధనను వ్యతిరేకించాడు. శైవ వైష్ణవ మతాలవారి ఆర్భాటాలను, వారి దురాచారాలను, మోసాలను బట్టబయలు చేశాడు. చిలుక పలుకుల చదువులను విమర్శించాడు. కాకులకు పిండాలు పెట్టటం వంటి మూర్ఖాచారాలను తీవ్రంగా ఖండించాడు. శ్రమశక్తిలోనే సర్వమూ ఉన్నది అనేంత నిశిత పరిశీలన చెయ్యగలిగిన వేమన్న మామూలు కవికాడు, తనకాలపు చట్రంలో ఇమడని గొప్ప కవి.



ప్రపంచ భాషా కవుల్లో గొప్పవారిని ఎంపిక చేసే సందర్భంలో వేమనను ఎన్నుకొని ఆ రచనలను పలు భాషలలోకి అనువదించారు.
యోగివేమన జయంతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వేడుకగా ప్రతి సంవత్సరం జనవరి 19న అధికారికంగా నిర్వహించారు.

కేంద్ర సాహిత్య అకాడమీ ప్రముఖ పాత్రికేయుడు నార్ల వెంకటేశ్వరరావు చేత వేమన జీవిత చరిత్రను వ్రాసి 14 భాషల్లోకి అనువదించారు. ఆంగ్ల, ఐరోపా భాషలన్నింటిలోకి, అన్ని ద్రావిడ భాషలలోకి వేమన పద్యాలు అనువదించబడ్డాయి. వేమనకు లభించిన ఈ గౌరవం మరే తెలుగు కవికి లభించలేదు.
వేమన చర్చ_ప్రముఖులు - భావాలు
బహుశా అప్పటి సాహితీ ప్రక్రియలలో ఒక్క శతకసాహిత్యమే సంఘంలోని ఆచారాలను నిశితంగా విమర్శించడానికి ఉపయోగపడింది. వీటిల్లో వేమన శతకము ఎప్పటికీ అగ్రగామి. మూడు పంక్తులలో ento  భావాన్ని ఇమిడ్చిన మేధావి, తత్వవేత్త. అందరూ అనుకొన్నదానికి కూడా నిక్కచ్చిగా ఎదురు నిలచిన మహానుభావుడు వేమన.

వేమన్నా రచన మార్గంలో మూడు అంశాలు గుర్తించవచ్చు. 
1.ప్రజలభాషలో ప్రచారంలో ఉన్న పదాలను, మాండలికాలను ప్రయోగించి ప్రజలకు సన్నిహితమైన రచన చెయ్యటం. 2.చెప్పదలచుకున్న భావాన్ని తగిన విస్తీర్ణంలోనే క్లూప్తంగా చెప్పటం. 3.ఊహలోనుంచికాక జీవితం నుంచి ఉపమానాలను ఏరుకోవటం. కవితా దృక్పథం విషయంలో మాత్రమే కాక రచనా విధానంలో కూడా వేమన్న ఆదర్శం నుంచి ఈనాటి కవులు నేర్చుకోవలసింది చాలా ఉందని దృఢంగా కోరుకుంటున్నాం. 
- చేకూరి రామారావు 

ఆయన పండితుల కోసం రాయలేదు.
పల్లెసీమల్లోని నిరక్షరాస్యులెైన అకృత్రిమ పామర జనం కోసం రాసాడు.ఆయన పొందిన లోకప్రియత ఆయన కవితాశక్తివల్ల,ఉపదేశ విశిష్టతవల్ల కలిగిందే! 

గ్రంథస్తం కాకుండా కేవలం సామాన్యుల నోటనే విలచి ఉన్నాయి. 
1731లో ఫాదర్ లెగాక్ తొలిసారిగా వేమన పద్యాలు సేకరించాడని పరిశోధకులు భావిస్తారు. 
1816లో ఒక ఫ్రెంచి మిషనరీ, తరువాత ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్ ఎన్నో వేమన పద్యాలను సేకరించారు. తాను వేమనను కనుగొన్నానని బ్రౌన్ దొర సాధికారికంగా ప్రకటించుకొన్నాడు. అతను వందల పద్యాలను సేకరించి వాటిని లాటిన్, ఆంగ్ల భాషలలోకి అనువదించాడు. అలాగే హెన్రీ బ్లూచాంస్ (1897), విలియమ్ హోవర్డ్ కాంబెల్ (1910), జి.యు.పోప్, సి.ఇ.గోవర్ వంటి ఆంగ్ల సాహితీవేత్తలు వేమనను లోకకవిగా కీర్తించారు.

తెలుగు సాహిత్య చరిత్రకారులలో ప్రథములైన కందుకూరి వీరేశలింగం, గురజాడ శ్రీరామమూర్తి, కావలి రామస్వామి తన ఆంగ్ల గ్రంథంలోను వేమన చరిత్రను చేర్చలేదు. దీనిగూర్చి నార్ల వేంకటేశ్వరరావు "ఇట్టి మూగకుట్ర, ఒక మహావ్యక్తి పేరైనను ఉచ్ఛరించక మరుగుపరచిన మౌనకుతంత్రము 
ప్రపంచ భాషా చరిత్రలందెచ్చటను కానము, ఇది ఒక పెద్ద విస్మయము "అని అన్నాడు.
అయితే వేమన పద్యాలను కందుకూరి వీరేశలింగం తన సాహిత్యంలో కొన్ని పద్యాలనుదహరించాడు. గురజాడ అప్పారావు కన్యాశుల్కంలో వేమనను విరివిగా ప్రశంసించాడు.బ్రౌన్ తరువాత కట్టమంచి రామలింగారెడ్డి తన కవిత్వతత్వవిచారం గ్రంథంలో మహాకవిగా గుర్తించాడు. తరువాత 1928 లో రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ విశేష పరిశోధన చేసి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఉపన్యాసాలిచ్చాడు. ఆ తరువాత ఏభై ఎళ్లకు శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆరుద్రచే వేమన్న గురించిన ఉపన్యాసాలు నిర్వహించింది. పైన పేర్కొన్న సాహితీ వేత్తల కృషి తరువాత వేమన రచనలకు పండితులనుండి అనన్యమైన గౌరవం లభించసాగింది. కొమర్రాజు వేంకటలక్ష్మణరావు, సురవరం ప్రతాపరెడ్డి, మల్లంపల్లి సోమశేఖరశర్మ, వేటూరి ప్రభాకరశాస్త్రి వంటివారు వేమనను సంస్కర్తగా ప్రస్తుతించారు తరువాత ఎందరో యువ కవులు, రచయితలు వేమన గురించి, వేమన రచనల గురించి పరిశోధనలు చేశారు. ఎన్. గోపి, బంగోరె వంటివారు వీరిలో ప్రముఖులు. 

@వేమన భావ విప్లవం :తన కాల పరిస్తుతల నుంచి,జీవిత అనుభవాలనుంచి, స్వీయ సాక్షాత్కారం పొందిన వేమన కాలాచక్ర పరిధిని దాటి ఆలోచించాడు పద్యాల్లో (భావ) విప్లవాత్మక బోధనలు చేసాడు.

తనకాలం నాటి పరిస్థితులను 
ఆటవెలది చందస్సుని విస్త్రుతంగా వాడుకుని సామాజిక దోషాలను కడిగి పారేసిన వాడు  వేమన.
వేమన ఛందస్సు కంటే భావానికి ప్రాధాన్యత నిచ్చాడు