Index - impartant contents

Categories
Education / విద్య
General / సాధారణం
General Knowledge / జనరల్ నాలెడ్జ్
Health / ఆరోగ్యం
History / చరిత్ర
Literature / సాహిత్యం
Philosophy / తత్వం
Philosophers / తత్త్వవేత్తలు
Historical Philosophers / చరిత్ర తాత్వికులు
Politics / రాజకీయాలు
Religion / మతం
Photo of the Day / ఈరోజు ఫోటో
Personality Development / వ్యక్తిత్వ వికాసం
Music / సంగీతం
Let’s Learn / తెలుసుకుందాం
personality / వ్యక్తిత్వం
Showing posts with label T.తెలుగు - సౌందర్యం - సాహిత్య కళారూపాలు ( కీర్తనలు )🌐. Show all posts
Showing posts with label T.తెలుగు - సౌందర్యం - సాహిత్య కళారూపాలు ( కీర్తనలు )🌐. Show all posts

T.కీర్తనలు తెలుగు - సౌందర్యం ( కీర్తనలు - సాహిత్య కళారూపాలు )🌐


1.అన్నమయ
|| తందనాన ఆహి తందనాన పురె |తందనాన భళా తందనాన ||
బ్రహ్మ మొకటే పరబ్రహ్మ మొకటే |పరబ్రహ్మ మొకటే పరబ్రహ్మ మొకటే ||

|| కందువగు హీనాధికము లిందు లేవుఅందరికి శ్రీహరే అంతరాత్మ |
ఇందులో జంతుకులమింతా నొకటే |అందరికి శ్రీహరే అంతరాత్మ ||


|| నిండార రాజు నిద్రించు నిద్రయు నొకటే |అండనే బంటునిద్ర అదియు నొకటే |
మెండైన బ్రాహ్మణుడు మెట్టుభూమి యొకటే |చండాలు డుండేటి సరిభూమి యొకటే ||


|| అనుగుదేవతలకును అలకామ సుఖమొకటే |ఘనకీట పశువులకు కామ సుఖమొకటే |
దినమహో రాత్రములు తెగి ధనాఢ్యునకొకటే |వొనర నిరుపేదకును వొక్కటే అవియు ||


|| కొరలి శిష్టాన్నములు గొను నాకలొకటే తిరుగు దుష్టాన్నములు తిను నాకలొకటే |
పరగ దుర్గంధములపై వాయువొకటే వరుస బరిమళముపై వాయువొకటే ||


|| కడగి యేనుగు మీద గాయు యెండొకటే |పుడమి శునకము మీద బొలయు నెండొకటే |
కడు బుణ్యులను బాప కర్ములను సరిగావ |జడియు శ్రీ వేంకటేశ్వర నామమొకటే ||
తిరుమలయ్య విందు మంచిదే వుండంటే వుంటినమ్మ
సరవిలేని చెంచువారి సంతయేలె తనకును
పరికిదండ పొగడదండ బండిగురిగింజ దండ
బెరకులేని పికిలిదండ బలిదండలన్నియు
మెరసి కానుకియ్యబోతె మేనిదండలడిగెనమ్మ
మరల చెంచువారితోడి మాటలేలె తనకును
ముసురుతేనె జుంటితేనె ముదిరినట్టి పెరలతేనె
పొసగ మించు పూవుతేనె పుట్టతేనె లన్నియు
వొసగి కానుకియ్యబోతె మోవితేనె లడిగె నమ్మ
యెసగ చెంచువారి యెంగి లేటికమ్మ తనకును
వెలగపండు జీడిపండు వెలలేని మోవిపండు
పలుకుదొండపండు పాలపండు కానుకిచ్చితే
చెలగి పక్కపండు మంట శ్రీవేంకటనాయకుడు
యెలమి కూడెనమ్మ చెంచు లేటికమ్మ తనకును
---------------------------------
ముద్దు గారీ జూడరమ్మ మోహన మురారి వీడె
మద్దులు విరిచిన మా మాధవుడుచల్ల లమ్మ నేరిచినజాణ గొల్లెతల కెల్ల
వల్లెతాడు మా చిన్న వాసుదేవుడు
మొల్లపు గోపికల మోవిపండులకు నెల్ల
కొల్లకాడు గదమ్మ మా గోల గోవిందుడు
మందడిసానుల కమ్మని మోముదమ్ములకు
చెందినతుమ్మిదవో మా శ్రీకృష్ణుడు 
చంద మైన దొడ్డీవారి సతులవయసులకు
విందువంటివా డమ్మ మా విఠ్ఠలుడు
హత్తిన రేపల్లెలోని అంగనామణుల కెల్ల
పొత్తుల సూత్రము మా బుద్ధుల హరి
మత్తిలి వ్రేతెల నిండుమనసుల కెల్లాను
చిత్తజునివంటి వాడు శ్రీ వేంకటేశుడు
--------------------------------
సిరుత నవ్వులవాడు (రాగం: ) (తా ప||
సిరుత నవ్వులవాడు సిన్నెకా వీడు 
వెరపెరుగడు సూడవే సిన్నెకా
|||| పొమేనివాడు బోరవీపు వాడు
సెలసు మోరవాడు సిన్నెకా
గొలుసుల వంకల కోరలతోబూమి
వెలిసినాడు సూడవే సిన్నెకా
|||| మేటి కురుచవాడు మెడమీది గొడ్డలి
సీటకాలవాడు సిన్నెకా
ఆటదానిబాసి అడవిలో రాకాశి
వేటలాడీ జూడవే సిన్నెకా
|||| బింకపు మోతల పిల్లగోవివాడు
సింక సూపులవాడు సిన్నెకా
కొంకక కలికియై కొసరి కూడె నన్ను 
వేంకటేశుడు సూడవే సిన్నెకా
---------------------------------
జగడపు జనవుల (రాగం: ) (తాళం : )
 జగడపు చనువుల జాజర,
సగినల మంచపు జాజర
మొల్లలు తురుముల ముడిచిన బరువున,
మొల్లపు సరసపు మురిపెమున
జల్లన పుప్పొడి జారగ పతిపై చల్లే పతిపై,
చల్లే రతివలు జాజర
భారపు కుచముల పైపై కడు 
సింగారము నెరపేటి గంధవొడి
చేరువ పతిపై చిందగ పడతులు,
సారెకు చల్లేరు జాజర
బింకపు కూటమి పెనగేటి చెమటల
పంకపు పూతల పరిమళము
వేంకటపతిపై వెలదులు నించేరు,
సంకుమ దంబుల జాజర
-----------------------------
|| అన్నిరాసుల యునికి యింతి చెలువపు రాశి |కన్నె నీ రాశి కూటమి గలిగిన రాశి ||
|| కలికి బొమ విండ్లుగల కాంతకును ధనురాశి |మెలయు మినాక్షికిని మీనరాశి |
కులుకు కుచకుంభముల కొమ్మకును కుంభరాశి |చెలగు హరిమధ్యకును సింహరాశి ||
|| చిన్నిమకరంకపు బయ్యెద చేడెకు మకరరాశి కన్నె పాయపు సతికి కన్నెరాశి|
వన్నెమై పైడి తులదూగు వనితకు దులారాశి |తిన్నని వాడి గోళ్ళ సతికి వృశ్చికరాశి ||
|| ఆముకొని నొరపుల మెరయు నతివకు వృషభరాశి గామిడి గుట్టుమూల సతి కర్కాటకరాశి |
కోమలపు చిగురుమోవి కొమలికి మేషరాశి ప్రేమ వేంకటపతి గలిసె ప్రియ మిథునరాశి ||

---------------------------------
 || తలమేల కులమేల తపమే కారణము |ఎలమి హరిదాసులు ఏజాతి యైననేమి ||
|| పంకములో పుట్టదా పరిమళపు తామెర |పొంక కీటములందు పుట్టదా పట్టు |
కొంకక శ్రీ వేంకటేశు కొలిచిన దాసులు |సంకెలేని జ్ఞానులు లెందు జనియించిరి ||
|| కాకము వల్ల పుట్టదా ఘన యశ్వర్థము |దాకొని గుల్లలో పుట్టదా ముత్తెము |
చౌకైన విషలతనె జనియించదా నిర్విషయము యేకడ మహానుభావు లెందు పుట్టిరేమి ||
|| చిడిపి రాళ పుట్టవా చెలువైన వజ్రములు |పుడమి నీగల వల పుట్టదా తేనె |
వెడగు పిల్లి మేనను వెళ్ళదా జవ్వాది |పుడివోని పుణ్యులెందు నుదయించి రేమి ||

ఎక్కడి మానుష జన్మం

ప|| ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమే మున్నది | నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను ||

చ|| మరవను ఆహారంబును మరవను సంసార సుఖము | 
మరవను యింద్రియ భోగము మాధవ నీ మాయ ||
మరచెద సుఙ్ణానంబును మరచెద తత్త్వ రహశ్యము | మరచెద గురువును దైవము మాధవ నీ మాయ ||

చ|| విడువను పాపము పుణ్యము విడువను నా దుర్గుణములు | 
విడువను మిక్కిలి యాసలు విష్ణుడ నీమాయ |
విడిచెద షట్కర్మంబులు విడిచెద వైరాగ్యంబును | విడిచెద నాచారంబును విష్ణుడ నీమాయ ||

చ|| తగిలెద బహు లంపటముల తగిలెద బహు బంధముల | 
తగులను మోక్షపు మార్గము తలపున యెంతైనా |
అగపడి శ్రీ వేంకటేశ్వర అంతర్యామివై | నగి నగి నను నీవేలితి నాకా యీమాయ ||

నానాటి బదుకు నాటకము
కానక కన్నది కైవల్యము
పుట్టుటయు నిజము పోవుటయు నిజము
నట్టనడిమి పని నాటకము
యెట్ట నెదుట గల దీ ప్రపంచము
కట్ట గడపటిది కైవల్యము
కుడిచే దన్నము కోక చుట్టెడిది
నడ మంత్రపు పని నాటకము
వొడి గట్టుకొనిన వుభయ కర్మములు
గడి దాటినపుడె కైవల్యము
తెగదు పాపము తీరదు పుణ్యము
నగి నగి కాలము నాటకము
యెగువనె శ్రీ వేంకటేశ్వరుడేలిక
గగనము మీదిది కైవల్యము
రచన: అన్నమాచార్య
రాగం: శివ రంజని
అంతర్యామి అలసితి సొలసితి |
ఇంతట నీ శరణిదె జొచ్చితిని ||
కోరిన కోర్కులు కోయని కట్లు |
తీరవు నీవవి తెంచక |
భారపు బగ్గాలు పాప పుణ్యములు |
నేరుపుల బోనీవు నీవు వద్దనక ||
జనుల సంగముల జక్క రోగములు |
విను విడువవు నీవు విడిపించక |
వినయపు దైన్యము విడువని కర్మము |
చనదది నీవిటు శాంతపరచక ||
మదిలో చింతలు మైలలు మణుగులు |
వదలవు నీవవి వద్దనక |
ఎదుటనె శ్రీ వెంకటేశ్వర నీవదె |
అదన గాచితివి అట్టిట్టనక ||

తందనాన భళా - తందనాన

బ్రహ్మమొక్కటె పర - బ్రహ్మమొక్కటె 
పరబ్రహ్మమొక్కటె పర బ్రహ్మమొక్కటె

కందువగు హీనాధికములిందు లేవు
అందరికి శ్రీహరే అంతరాత్మ

ఇందులో జంతుకుల మంతానొక్కటె
అందరికి శ్రీహరే అంతరాత్మ 

నిండార రాజు నిద్రించు నిద్రయు నొకటె
అంటనే బంటునిద్ర అదియు నొకటె

మెండైన బ్రాహ్మణుడు మెట్టుభూమి యొకటె
చండాలు డుండేటి సరిభూమి యొకటే

కడగి యేనుగు మీద కాయు యెండొకటే
పుడమి శునకము మీద బొలయు యెండొకటే

కడుపుణ్యులను పాపకర్ములను సరిగావ
జడియు శ్రీవేంకటేశ్వరుని నామమొకటె  

CONCEPT ( development of human relations and human resources )