Index - impartant contents

Categories
Education / విద్య
General / సాధారణం
General Knowledge / జనరల్ నాలెడ్జ్
Health / ఆరోగ్యం
History / చరిత్ర
Literature / సాహిత్యం
Philosophy / తత్వం
Philosophers / తత్త్వవేత్తలు
Historical Philosophers / చరిత్ర తాత్వికులు
Politics / రాజకీయాలు
Religion / మతం
Photo of the Day / ఈరోజు ఫోటో
Personality Development / వ్యక్తిత్వ వికాసం
Music / సంగీతం
Let’s Learn / తెలుసుకుందాం
personality / వ్యక్తిత్వం

P.GREAT PERSONS@

విప్లవకారులు : భగత్ సింగ్ ,అల్లూరి సీతారామరాజు,కొమరం భీమ్, చారుమజుందార్ 

విప్లవభావాలు కలవారు  : Karlmarx, Leni , Stalin,Mao

విప్లవ కవులు :
1960 తెలుగు సాహిత్య చరిత్రలో దిగంబర కవులు 
1.నగ్నముని (మానేపల్లి హృషీకేశసవరావు 
2.మహాస్వప్న (కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు)
3.నిఖిలేశ్వర్ (కుంభంయాదవరెడ్డి) 4.జ్వాలాముఖి (ఆకారం వీరవెల్లి రాఘవాచారి ) 
5. భైరవయ్య (మన్మోహన్ సహాయ్ ) 6.చెరబండరాజు  (బద్ధం భాస్కర రెడ్డి )
వరవరరావు ,గద్దర్,శ్రీశ్రీ  .కాళొజి

కవులు : గురజాడ ,గుర్రం జాషువ,కృష్ణ శాస్త్రి ,గిడుగు రామమూర్తి ,చిలకమర్తి ,కందుకూరి విరేశలింగం,పానుగంటి ,జంధ్యాల పాపయ్య శాస్త్రి

వాగ్గేయకారులు : తాళ్ళపాక అన్నమయ్య,రామదాసు ,క్షేత్రయ్య ,త్యాగయ్య ,మంగళంపల్లి బాల మురళీకృష్ణ

శతక కర్తలువేమన , సుమతి ,భర్తృహరి,భాస్కర శతకము

ప్రాచిన కవులు : 1.అల్లసాని పెద్దన ,2.నంది తిమ్మన ,3. ధూర్జటి ,4.మాదయ్యగారి మల్లన ,5.అయ్యలరాజు రామభద్రుడు ,6.పింగళి సూరన ,7.రామరాజ భూషణుడు  ,8.తెనాలి రామకృష్ణ , ( అష్టదిగ్గజులు )
,శ్రీనాధుడు ,పోతన ,

సాహితీవేత్తలు : గోపీచంద్ ,కొడవగంటి కుటుంబరావు ,ముప్పాళ్ళ రంగనాయకమ్మ ,గుడిపాటి వెంకటాచలం ,ఎన్ గో పి ,విశ్వనాధ సత్యనారాయణ ,శ్రీ శ్రీ,గుర్రం జాషువా

వివిధ కళారూపాలు-ప్రముఖులు :  నండూరి రామమోహన రావు,డాక్టర్ సమరం ,కొమ్మూరి వేణుగోపాలరావు ,అడవి బాపిరాజు ,బీనాదేవి ,ఘంటసాల ,రేలంగి,కస్తూరి శివరావ్ ,ఎన్ టి ఆర్ ,ఎస్ వి రంగారావ్

మేథావులు :రామానుజన్  ,డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్

తత్వవేత్తలు : బుద్ధుడు,సోక్రటీస్ ,జీసస్ ,స్పోర్టకస్ ,వేమన ,ఫ్రాయిడ్, కార్ల్ మార్క్స్ ,లెనిన్ ,స్టాలిన్ ,మావో

CONCEPT ( development of human relations and human resources )

S.కవితలు 🌐


1.చావు పలకరిస్తోంది
ఆరు పదుల సహజ మరణం సమీపిస్తోంది
నువ్వు ఏమి చెయ్యలేవు
పక్క ఊరి ప్రయాణానికి వస్తువులు మూట కడతాం
చెప్పవలసిన జాగ్రత్తలు చెబుతాం
మరి శాశ్వత ప్రయాణానికి?సిద్ధమయ్యేవా?
ఏ మూట అవసరం లేదు ఏ జాగ్రత్త తోడు రాదు
మనసు ఖాళీ చేసి వెళ్ళాల్సిందే.


1. గులాబీ గుబాళింపు
స్వర నిర్మాణం (భూపాల్ రాగం - మోహన రాగం)
ఆరోహణ: స ర గ ప ధ స
అవరోహణ: స ధ ప గ ర స
(సా – షడ్జం, రి – ఋషభం, గ – గాంధారం, ప – పంచమం, ధ – ధైవతం)
స్వరాలు –  కవిత కోసం
(స గ ప, ప ధ స)
(Means: The fragrance of a rose spreads...)
2. కుక్కపిల్ల కేరింతలు
(స ర గ, గ ప, ప స)
(The puppy’s joyful bark...)
3. పసిపాప బోసినవ్వులు
(స గ ప, ప ధ, స)
(The innocent smile of a baby...)
4. లేగదూడ తల్లి ప్రేమ
(స ర గ, గ ప ధ, స)
(The mother’s love for her calf...)
5. జీవిత మాధుర్యం
(స గ ప, ప ధ స, స)
(The sweetness of life...)
6. కదిలే నది
(స ప, గ ర, స)
(The flowing river...)
7. వింజామరలు తరులు ఝరులు నీలిమబ్బులు
(స గ, గ ప, ప ధ, స)
(The cool breeze, trees, waterfalls, and blue clouds...)
8. ఉదయం భానుడు
(స గ ప, ప ధ, స)
(The morning sun...)
9. కదిలించే హృదయాన్ని
(స ర గ, గ ప, ప ధ, స)
(The heart that moves...)
10. పలికించే కవిత్వాన్ని
(స గ ప, ప ధ, స)
(The poetry that speaks...)
11. కవిత్వమై పరిమళించు
(స గ, గ ప, ప ధ, స)
(Spreading as poetry like fragrance...)

రాగం భావన

ఈ స్వరాలను తాళంతో ఆదితాళం / త్రిశ్ర జగతీ తాళం లో కుదిపితే సంగీత మాధుర్యాన్ని అందిస్తుంది. భూపాల్ రాగం మధురమైన అనుభూతిని కలిగిస్తుందనేందుకు,  కవితకి ఇది చాలా సరైనదిగా అనిపిస్తోంది.
❇️
Since you want to set your poem to Western music using the Bhupali raga (which corresponds to the major pentatonic scale in Western music), I will provide the notes accordingly.

Equivalent Western Scale:

Bhupali raga = Major Pentatonic Scale

Western Notes: C - D - E - G - A (relative to C Major)

Indian Swaras: S - R - G - P - D

Melody for Your Poem (in C Major Pentatonic)

1. The fragrance of the rose spreads (Gulabi Gubalinpu)

(C E G, G A C)

2. The puppy’s joyful bark (Kukka Pilla Kerintalu)

(C D E, E G, G C)

3. The innocent smile of a baby (Pasi Papa Bosina Navvulu)

(C E G, G A, C)

4. A mother’s love for her calf (Lega Dooda Talli Prema)

(C D E, E G A, C)

5. The sweetness of life (Jeevita Madhuryam)

(C E G, G A C, C)

6. The flowing river (Kadile Nadi)

(C G, E D, C)

7. The cool breeze, trees, waterfalls, blue clouds (Vinjamaralu Tarulu Jharulu Neelimabbulu)

(C E, E G, G A, C)

8. The morning sun (Udayam Bhanudu)

(C E G, G A, C)

9. The heart that moves (Kadilinche Hrudayanni)

(C D E, E G, G A, C)

10. The poetry that speaks (Palikinche Kavitvanni)

(C E G, G A, C)

11. Spreading as poetry like fragrance (Kavitvamai Parimalinchu)

(C E, E G, G A, C)

Musical Structure & Feel

Tempo: Moderate (80-100 BPM)

Time Signature: 4/4 (Simple & Flowing)

Style: This could be arranged as a soft folk ballad or a meditative chant with acoustic guitar, piano, or flute accompaniment.

Chord Progression Suggestion: C - G - A minor - G (loop)

 ❇️

3.ప్రేమ విలాపం

ఎగిరే పక్షులమవుదామా? 
ఈదే చేపలమవుదామా? 
చెట్లూ గాలులమవుదామా?
మనుషులమైనాము  దూరమైనాము?

ఏమయినాయి ఊసులు ఉల్లాసాలు  ఎడబాటులు ఎదురు చూపులు 
పంజరంలో చిలకవైనావు పలుకలేవు 
ఎంత కాలం మౌనంగా వుండేవు 

దూరం పెరిగి కాలం కరిగి
లోకాన్ని వీడక ముందే
చుక్కలమౌదామా శాశ్వతంగా 
జగతిలో నిలిచిపోదామా
✳️
4.కథానిక
వసంతంలో మారుతున్న ప్రతాపం

మార్చి నెల మొదటి వారం చండ ప్రచండుడు భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు మలయానిలుడు శరా ఘాత పరంపరలు  సంధిస్తూ అలసట చెంది ఉపసంహారానికి సమాయత్తుడు అయ్యేట్టున్నాడు ప్రకృతి లో ఉభయలు చేసే విన్యాసం నా శరీరం యావత్తు స్పర్శ వలన గమనిస్తుంది మనస్సు ఆహ్లాదంగా మారింది  
🌻🌻🌻
మార్చి నెల మొదటి వారంలో, ఆకాశం దహనమయ్యేలా భానుడు తన ప్రచండ తేజస్సును ప్రదర్శించసాగాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అతని ఉగ్రత పెరుగుతూనే ఉంది. చెట్ల నీడ కూడా చాలు అనిపించేలా ఎండ దహించేస్తోంది.

కానీ, మరోవైపు, మలయానిలుడు ఇంకా తాను ఓడిపోలేదని చూపించేందుకు ప్రయత్నిస్తున్నాడు. తన శరఘాతాల్లాంటి గాలులతో మృదువైన తాకిడిని కొనసాగిస్తూ, ఎక్కడైనా చెట్లు ఊగిపోతున్నాయా, పూలు తమ సుగంధాన్ని వెదజల్లుతున్నాయా అని పరీక్షిస్తున్నాడు. కానీ అతనికి అలసట పట్టినట్టుంది. భానుడి వేడి పెరుగుతున్న కొద్దీ, తాను క్రమంగా ఉపసంహారానికి సిద్ధమవుతున్నట్లు అనిపిస్తోంది. ప్రకృతి విన్యాసాలు నా శరీరాన్ని తాకుతూ  విభిన్న అనుభూతుల్ని కలిగిస్తున్నాయి. భానుడి వేడి ఒకవైపు, మలయానిలుడి చివరి గాలులు మరోవైపు—ఈ ద్వంద్వం నా మనసును ఊహల్లోకి తీసుకెళ్లింది. ఇది ఒక కాలచక్రం. ఒకదాని ప్రభావం తగ్గి, మరోదాని ఆధిపత్యం పెరుగుతుంది.

ఈ మార్పులను చూస్తూ నా మనసు ఆహ్లాదంగా మారింది. వసంతం చివరి అంచులలో ప్రవేశిస్తున్న ఈ క్షణాలను ఆస్వాదించాలనే తపన పెరిగింది. ఎందుకంటే, త్వరలోనే ఎండలు మరింత పెరిగి, మలయానిలుడు పూర్తిగా వెనుకంజ వేస్తాడు. ప్రకృతి నిరంతరం మారిపోతూనే ఉంటుంది, మనస్సు దానికి అనుగుణంగా కొత్త భావోద్వేగాలతో నిండిపోతూనే ఉంటుంది.
🍑🍑

5.ఆటవెలది 
బుద్ధ మార్గం 
1.చనిరి సఖులు సర్వురు చనని వారేరి 
2.నుర్వి జనులు కెల్ల నిజము దెలిపె 
3.నిన్న రేపు మాయ నేడు నిజమగున్ 
4.బుద్ధుని గను మేలు బుద్ద మార్గం 

కలత చెంది నెడెలె కానల బుద్ధుడు 
కారుణ్య మూర్తి బుద్ద దేవుడు  
భువి దుఃఖ కారణంబు దెలియ 
బుద్ధుని గను మేలు బుద్ద మార్గం 
   
1.విడచె నాలిన్ సుతుని వీడె భోగములను 
వెడచె నిల్లు వివివరింప దుఃఖ కారణం 
బోధి వృక్షము క్రింద బొందెను జ్ఞానమ్ము 
బుద్ధుని గను మేలు బుద్ద మార్గం 
🧆
[కార్యకరణ కారణ కార్యం కారణ ము చే 
UI U UU I UUI III 
ఇంద్ర గణాలు 
నల నగ సల భ ర త 
IIII IIIU IIUI UII UIU UUI
     
UI UI UI III UI
ఛందస్సు ద్విసంఖ్యామానంపై ఆధారపడి ఉంది. ఛందస్సులో రెండే అక్షరాలు. గురువు, లఘువు. గురువుని U తోటి, లఘువుని l తోటి సూచిస్తారు

గురువు, లఘువు, విభజించడము
మార్చు
ఈ గురు, లఘు నిర్ణయం ఒక అక్షరాన్ని పలికే సమయంపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు "అమల, అమ్మ, ఆవల, అండ" ఇందులో మొదటి పదము "అమల": అ మ ల మూడు అక్షరాలు ఒక్కొక్కటి ఒక లిప్త కాలము మాత్రమే తీసుకుంటున్నాయి. రెండవ పదము "అమ్మ" ఇందులో మొదటి అక్షరము అమ్ రెండు లిప్తల కాలము, ఆ తరువాతి మ ఒక లిప్త అక్షరము కాలము తీసుకుంటున్నది. అలాగే మూడవ పదము "ఆవల" ఆ = రెండు లిప్తలు, వ, లలు ఒక లిప్త కాలములు తీసుకుంటున్నాయి. ఇలా ఒక లిప్త కాలము తీసుకొను వాటిని లఘువు అని, రెండు లిప్తల కాలము తీసుకొను వాటిని గురువు అని అంటారు.

కొన్ని నియమాలు
మార్చు
దీర్ఘాలున్న అక్షరాలన్నీ గురువులు. ఉదాహరణకు ఆట = U I
"ఐ" "ఔ" అచ్చులతో కూడుకున్న అక్షరాలు గురువులు. (ఉదా: ఔనులో "ఔ" గురువు, "సైనికుడు"లో "సై" గురువు)
ఒక సున్నా, విసర్గలు ఉన్న అక్షరాలు అన్నీ గురువులే (ఉదా: సందడిలో సం గురువు, అంత:పురములో త: అనునది గురువు )
సంయుక్తాక్షరం (లేదా ద్విత్వాక్షరం) ముందున్న అక్షరం గురువవుతుంది. (ఉదా: అమ్మలో అ గురువు, భర్తలో భ గురువు). ఇది సాధారణంగా ఒకే పదంలోని అక్షరాలకే వర్తిస్తుంది. ఒక వాక్యంలో రెండు పదాలున్నప్పుడు, రెండవ పదం మొదటి అక్షరం సంయుక్తమైనా మొదటి పదం చివరి అక్షరం గురువు అవ్వదు. (ఉదా: అది ఒక స్తంభము అన్న వాక్యంలో "క" గురువు కాదు) అయితే రెండు పదాలూ ఒకే సమాసంలో ఉంటే ఈ నియమం వర్తిస్తుంది. (ఉదా: అది ఒక రత్నస్తంభము అన్నప్పుడు "త్న" గురువు అవుతుంది)
ఋ అచ్చుతో ఉన్న అక్షరాలు, వాటి ముందరి అక్షరాలు (కృ, మొదలగున్నవి ) లఘువులు మాత్రమే.
ర వత్తు ఉన్నప్పటికి దాని ముందు అక్షరములు కొన్ని సందర్భములలో లఘువులే! అద్రుచులోని అ లఘువు, సక్రమలో స గురువు. అభ్యాసము ద్వారా వీటిని తెలుసుకొనవచ్చు.
పొల్లుతో కూడిన అక్షరాలు గురువులు. (ఉదా: "పూసెన్ గలువలు"లో "సెన్" గురువు)]

ex :వేమన శతకం
చిత్త శుద్ధి కలిగి చేసిన పుణ్యంబు
కొంచమైన నదియు గొదవుగాదు
విత్తనంబు మఱ్ఱి వృక్షంబునకు నెంత
విశ్వదాభిరామ! వినురవేమ!

భావం: మంచి మనసుతొ చేసిన చిన్న పనియైన మంచి ఫలితాన్నిస్తుంది. పెద్ద మర్రిచెట్టుకి కూడ విత్తనము చిన్నదేకదా!

ఆత్మశుద్ధి లేని యాచారమది యేల
భాండశుద్ధి లేని పాకమేల?
చిత్తశుద్దిలేని శివపూజలేలరా?
విశ్వదాభిరామ! వినుర వేమ!

భావం: మనసు నిర్మలముగా లేనట్లయితే ఆచారములు పాతించతంవల్ల ప్రయోజనం లేదు. పాత్రలు శుభ్రముగాలేని వంట, మనసు స్థిరముగా లేని శివ పూజ వ్యర్థములే అవుతాయి. ఏమీ ప్రయోజనముండదు.
✳️
6.నా పేరు  Ramamohan, 60 పదులు దాటినాయి ప్లవ నామ సంవత్సరం లో పుట్టాను (హిందూ కాలమానం ప్రకారం, ప్లవ నామ సంవత్సరము ప్రతి 60 సంవత్సరాల క్రమంలో ఒకసారి వస్తుంది. ప్లవ సంవత్సరం చివరిసారిగా 2021-2022 కాలంలో వచ్చింది. ప్రతి 60 సంవత్సరాల తర్వాత అదే పేరు తిరిగి వస్తుంది. అందువల్ల, తదుపరి ప్లవ నామ సంవత్సరం 2081-2082 లో ఉంటుంది.)

హిందూ మతం క్రైస్తవ మతం హేతువాదం, ప్రస్తుతం బౌద్ధం (ఇప్పుడు 2025 సంవత్సరానికి సంబంధించిన నామ సంవత్సరం అంగిరస.అంగిరస నామ సంవత్సరము: 2025-2026 ).

7.మనోవాక్కాయ దండన లో మనో దండన ఉత్తమ మైనదిఅని బౌద్ధం బోధిస్తున్నది 

I.త్రిరత్నాలు 
బుద్ధం శరణం గచ్చామి, 
దమ్మం శరణం గచ్చామి, 
సంఘం శరణం గచ్చామి.

II. నాలుగు ఆర్యాసత్యాలు 
1.దుఃఖం అంతటా వుంది 
2.దుఃఖ కారణం తృష్ణ 
3.తృష్ణ కు మూలం అవిద్య 
4.అవిద్య నాశనకారి అష్టాంగ మార్గం
 
III.పంచశీల సూత్రాలు
1.జీవహింస చేయరాదు
2.అసత్య మాడరాదు 
3.దొంగిలంప కూడదు 
4.వ్యభిచారింప కూడదు
5.మత్తు పదార్ధాలు,పానీయాలు సేవింప రాదు 

IV.అష్టాంగ మార్గాలు 

అష్టాంగ మార్గం (అష్టాంగిక మార్గం) బౌద్ధ ధర్మంలో ముఖ్యమైన సిద్ధాంతం. ఇది బుద్ధుడు బోధించిన చతురార్య సత్యాలు (Four Noble Truths) లో నాల్గవ సత్యంగా ఉంటుంది, దీని ద్వారా దుఃఖనివృత్తి మరియు మోక్షం సాధించవచ్చు.

అష్టాంగ మార్గం లో ఎనిమిది భాగాలు ఉన్నాయి:

1. సమ్యక్ దృష్టి (సరైన దృష్టి) – నిజమైన జ్ఞానం కలిగి ఉండటం.

2. సమ్యక్ సంకల్ప (సరైన సంకల్పం) – హింస లేకుండా, కాపట్యం లేకుండా చింతించడం.

3. సమ్యక్ వాక్కు (సరైన వాక్కు) – నిజాయితీగా, హానికరం కాకుండా మాట్లాడటం.

4. సమ్యక్ కర్మ (సరైన కర్మ) – హింసా రహితమైన, ధార్మికమైన క్రియలు చేయడం.

5. సమ్యక్ ఆజీవిక (సరైన ఆజీవికం) – నైతికతకు వ్యతిరేకంగా లేని జీవనోపాధి.

6. సమ్యక్ వ్యాయామ (సరైన ప్రయత్నం) – చెడు ఆలోచనలను దూరం చేసి, మంచి ఆలోచనలను అభివృద్ధి చేయడం.

7. సమ్యక్ స్మృతి (సరైన ధ్యానం) – శరీరం, భావాలు, మనస్సు, ధర్మంపై కేంద్రీకరించుకోవడం.

8. సమ్యక్ సమాధి (సరైన సమాధి) – ఏకాగ్రతతో లోతైన ధ్యాన స్థితిని సాధించడం.

ఈ ఎనిమిది మార్గాలు 
సీల (నీతీశాస్త్రం), 
సమాధి (ధ్యానం), 
ప్రజ్ఞ (జ్ఞానం) 
అనే మూడు విభాగాలుగా విభజించబడతాయి.

సీల: సమ్యక్ వాక్య, సమ్యక్ కర్మ, సమ్యక్ ఆజీవిక.

సమాధి: సమ్యక్ వ్యాయామ, సమ్యక్ స్మృతి, సమ్యక్ సమాధి.

ప్రజ్ఞ: సమ్యక్ దృష్టి, సమ్యక్ సంకల్ప.

అష్టాంగ మార్గం ను అనుసరించడం ద్వారా మనసు శాంతిని పొందడం, దుఃఖనివృత్తి మరియు ఆత్మజ్ఞానాన్ని సాధించడం సాధ్యమవుతుంది.

V.దశ పరామితలు 

దశ పరమితలు (Ten Perfections) బౌద్ధ ధర్మంలో బోధిసత్త్వులు మరియు ఆధ్యాత్మిక సాధకులు అనుసరించాల్సిన ముఖ్యమైన నైతిక ధర్మాలు. ఇవి పరిపూర్ణత ను సాధించడం కోసం మార్గదర్శకాలు.

5.దశ పరమితలు:

1. దాతృత్వం (దానా).దాన 
2. నైతికత (సిలా) శీల
3. త్యజించడం (నెక్కమ్మ) నిష్కామ 
4. జ్ఞానం (పన్నా) ప్రజ్ఞ 
5. శక్తి (విరియా)వీర్య 
6. సహనం (ఖాంతి)క్షమా 
7. సత్యసంధత (సక్కా)
8. రిజల్యూషన్ (అధిత్థాన).అధిష్టాన 
9. ప్రేమపూర్వక దయ (మెట్టా)మైత్రి
10. సమా (ఉపేక్ష )

In Buddhism, Pāramīs (or Pāramitās in Sanskrit) are virtues or perfections that are cultivated on the path to enlightenment. They are essential qualities practiced by Bodhisattvas to attain Buddhahood. In Theravada Buddhism, there are Ten Pāramīs:

1. Dāna (Generosity) – The act of giving without expecting anything in return.

2. Sīla (Morality) – Upholding ethical conduct and virtuous behavior.

3. Nekkhamma (Renunciation) – Letting go of worldly attachments and desires.

4. Paññā (Wisdom) – Developing insight into the true nature of reality.

5. Viriya (Energy/Effort) – Perseverance and diligence in spiritual practice.

6. Khanti (Patience) – Cultivating tolerance and endurance.

7. Sacca (Truthfulness) – Commitment to honesty and integrity.

8. Adhiṭṭhāna (Resolution/Determination) – Strong resolve and willpower.

9. Mettā (Loving-kindness) – Unconditional love and goodwill towards all beings.

10. Upekkhā (Equanimity) – Maintaining mental balance and impartiality.

These perfections help in the development of a Bodhisattva's character, leading to the ultimate goal of enlightenment. 

1. దాన పరమిత (దానం) – ఉదారంగా దానం చేయడం.

పరిచయం:
దాన పరమిత (దానం) బౌద్ధ ధర్మంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన పరమితలలో ఒకటి. 'దానం' అంటే దానం చేయడం లేదా పంచుకోవడం. ఇది స్వార్థరహిత సేవ, ఉదారత, ఇతరుల సంక్షేమాన్ని కాంక్షించే మనోభావాన్ని వ్యక్తం చేస్తుంది. బుద్ధుడు దానాన్ని కేవలం సామగ్రిని పంచుకోవడమే కాకుండా, జ్ఞానాన్ని పంచుకోవడం, సానుభూతిని ప్రదర్శించడం, శక్తి మరియు సమయాన్ని సేవకు వినియోగించడం అని చెప్పాడు.

అవసరం మరియు ప్రాముఖ్యత:

1. అహంకార నిర్మూలనం: దానము చేయడం ద్వారా స్వార్థ భావనను తగ్గించి, అహంకారాన్ని నిర్మూలించుకోవచ్చు. ఇది అనాసక్తిని అభివృద్ధి చేయడానికి సహాయపడుతుంది.

2. కర్మ సిద్ధాంతం: బౌద్ధంలో కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి, దానము సత్ఫలితాలను ఇస్తుంది. ఇది మనస్సును శుభ్రపరచి, సుకృతిని పెంపొందిస్తుంది.

3. సామాజిక సమత్వం: దానం ద్వారా సమాజంలో సమానత్వ భావనను ప్రోత్సహించవచ్చు. ఇది పేద, ధనిక మధ్య ఖాళీని తగ్గించడంలో సహాయపడుతుంది.

దాన పరమిత రకాలు:

1. అమిష దానం: ఆహారం, వస్త్రాలు, ఆశ్రయం వంటి భౌతిక వస్తువులను పంచుకోవడం.

2. అభయ దానం: భయం లేకుండా సంతోషంగా జీవించేందుకు అవసరమైన రక్షణను ఇవ్వడం. ఉదాహరణకు, అహింసా ప్రవర్తన.

3. ధర్మ దానం: జ్ఞానం, శిక్షణ, విద్య, నీతులను పంచుకోవడం. ఇది అత్యున్నతమైన దానం అని భావిస్తారు.

దాన పరమితలో ప్రాక్టీస్ చేయాల్సిన విధానాలు:

1. స్వచ్ఛమైన ఉద్దేశ్యం: ఏదైనా ప్రతిఫలం ఆశించకుండా, స్వచ్ఛమైన మనసుతో దానం చేయాలి.

2. సమాన దృష్టితో దానం: ప్రాప్తికర్త ఎవరైనా సరే, ఆ వ్యక్తిని సమాన దృష్టితో చూడాలి.


3. ఆనందంతో దానం: నిర్బంధంగా కాకుండా, ఆనందంతో, ఉత్సాహంతో దానం చేయాలి.

ఉదాహరణలు:

గౌతమ బుద్ధుడు తన పూర్వ జన్మలో విపశ్యి బుద్ధునికి భోజన దానం చేసి, ఆ పుణ్యఫలంతో చివరికి బుద్ధత్వాన్ని పొందాడని కథలున్నాయి.

జాతక కథలలో, బోధిసత్త్వుడు తన శరీరాన్ని సింహానికి ఆహారంగా ఇవ్వడం ద్వారా దాన పరమితను ప్రదర్శించాడు.

తాత్వికత మరియు సాధన:
దాన పరమిత సాధన ద్వారా మనిషి లోభాన్ని అధిగమించి, మనశ్శాంతిని పొందుతాడు. ఇది బోధిసత్త్వ మార్గంలో ప్రథమమైన అడుగు. ఈ సాధన ఆత్మీయ పురోగతికి దారితీస్తుంది.

సారాంశం:
దాన పరమిత బౌద్ధ తాత్వికతలో ప్రాథమికమైనది. ఇది కేవలం భౌతిక దానానికి పరిమితం కాకుండా, జ్ఞానదానం, సానుభూతి, ప్రేమ, కరుణ రూపంలోనూ ఉండవచ్చు. దాన పరమిత ద్వారా మనిషి స్వార్థాన్ని వదిలిపెట్టే సద్గుణాన్ని అభివృద్ధి చేసుకుని, సమాజానికి ఉపయోగకరంగా మారతాడు.


2. శీల పరమిత (నీతీశాస్త్రం) – ధార్మిక నియమాలను పాటించడం.
3. త్యజించడం (నెక్కమ్మ) నిష్కామ 
త్యజించడం (నెక్కమ్మ) అంటే వదిలేయడం లేదా విడిచిపెట్టడం. ఇది బలవంతంగా కాదు, అసత్యమైన ఆనందాలు చాలా కాలం ఉండవని అర్థం చేసుకుని స్వచ్ఛందంగా వదిలేయడం.

నిష్కామ అంటే ఆసలు లేకుండా లేదా ప్రయోజనం ఆశించకుండా. అంటే, ఏదైనా చేయినప్పుడు దాని ఫలితాన్ని ఆశించకుండా, స్వార్థం లేకుండా చేయడం.

సరళంగా అర్థం:

నెక్కమ్మ అంటే: మనసుకు తాత్కాలిక ఆనందం ఇచ్చే పదార్థాలు లేదా విషయాలను వదిలేయడం. ఉదాహరణకు, అదనపు ఆస్తి, అదనపు సంపద, లేదా భోగాలను త్యజించడం.

నిష్కామ అంటే: ఇవి వదిలేసినప్పుడు దాని ఫలితం గురించి ఎటువంటి ఆశ లేకుండా, నిస్వార్థంగా వదిలేయడం.


ఉదాహరణ:

ఒకవేళ మీరు ధనం దానం చేస్తే:

పేరు పొందడానికి లేదా పుణ్యం వస్తుందని ఆశించి ఇస్తే, అది నిష్కామ కాదు.

సహాయం చేయాలనే భావంతో, ఎటువంటి ఫలితం ఆశించకుండా ఇస్తే, అది నిష్కామ.


నెక్కమ్మ అంటే వదిలేయడం, నిష్కామ అంటే ఆ వదిలేయడంలో స్వార్థం లేకుండా ఉండటం.

మరింత వివరంగా కావాలా?


4. ప్రజ్ఞా పరమిత (జ్ఞానం) – నిజమైన జ్ఞానాన్ని గ్రహించడం.
5. వీర్య పరమిత (పరాక్రమం) – శక్తి, పట్టుదలతో ప్రయత్నించడం.
6. క్షాంతి పరమిత (క్షమ) – సహనం, అంగీకారం కలిగి ఉండడం.
7. సత్యసంధత (సక్కా)
8. ప్రణిధాన పరమిత (సంకల్పం) – బోధిసత్త్వ సంకల్పంతో నిరంతర ప్రయత్నం.
9. ప్రేమపూర్వక దయ (మెట్టా)మైత్రి 
10. సమా (ఉపేక్ష )

ఈ పరమితలు బౌద్ధమార్గంలో ఉన్నత లక్ష్యాన్ని సాధించడానికి మార్గదర్శకాలు. బోధిసత్త్వులు ఈ పరమితలను పాటిస్తూ బుద్ధత్వం వైపు సాగుతారు.
✳️
పాట గానం AI
నాపేరు ఇషిత్
పాసయ్యను సెవెన్త్

సెలవులకు వెళతాను గుంటూరు
అమ్మమ్మ తాతయ్యలతో వుంటాను

మామయ్య కూతుళ్ళూ వస్తారు
సందడి సందడి  కలసి చేస్తారు

ఉత్సాహంగా ఆట పాటలతో గడిపి
ఆనందంగా తిరిగి వస్తాము అందరం

M.గుండె ఆరోగ్యం & వాగ్భట జీ సూచనలు@

🩺 

గుండె ఆరోగ్యం & వాగ్భట జీ సూచనలు 

మన దేశం, భారతదేశంలో, 3000 సంవత్సరాల క్రితం మహర్షి వాగ్‌భట అనే గొప్ప ఋషి ఉండేవారు. ఆయన పేరు మహర్షి వాగ్‌భట జీ. ఆయన "అష్టాంగ హృదయం" అనే పుస్తకాన్ని వ్రాశారు. ఈ పుస్తకంలో, ఆయన వ్యాధులను నయం చేయడానికి 7000 సూత్రాలను పొందుపరిచారు. ఇది ఆ సూత్రాలలో ఒకటి. వాగ్‌భట జీ ఇలా వ్రాస్తారు: ఎప్పుడైనా గుండెకు ప్రమాదం కలుగుతుంటే, అంటే గుండె నాళాలలో బ్లాకేజ్ ఏర్పడటం మొదలవుతుంటే, దాని అర్థం రక్తంలో ఆమ్లత్వం (acidity) పెరిగిందని. ఆమ్లత్వం రెండు రకాలుగా ఉంటుంది: - పొట్ట ఆమ్లత్వం - రక్త ఆమ్లత్వం పొట్టలో ఆమ్లత్వం పెరిగినప్పుడు మంట, పుల్ల త్రెన్పులు, నోటిలో నీరు వంటి లక్షణాలు వస్తాయి. ఇది రక్తంలోకి వెళ్ళితే, రక్త ఆమ్లత్వం అవుతుంది. రక్తం ఆమ్లమయమైతే, అది గుండె నాళాల్లోనికి సరిగ్గా వెళ్లదు. అప్పుడు బ్లాకేజ్ ఏర్పడి గుండెపోటు వస్తుంది. ఇది లేకుండా గుండెపోటు రావడం జరగదు. ఇది ఆయుర్వేదంలో చాలా పెద్ద సత్యం. వాగ్భట జీ సూచన: రక్తంలో ఆమ్లత్వం పెరిగినప్పుడు, క్షార (alkaline) వస్తువులు తినాలి. ఆసిడ్ + ఆల్కలైన్ కలిపితే న్యూట్రల్ అవుతుందన్నది సాధారణ సూత్రం. 
కాబట్టి రక్తంలోని ఆమ్లత్వం తగ్గించడానికి క్షార వస్తువులు తినడం తప్పనిసరి. అత్యంత క్షార వస్తువు మన వంటగదిలో దొరికేది "సొరకాయ (Bottle Gourd)". 
 సొరకాయ రసంలో రక్త ఆమ్లత్వాన్ని తగ్గించే అత్యధిక శక్తి ఉంది. వాగ్భట జీ ఇలా అంటారు: ప్రతిరోజూ సొరకాయ రసాన్ని త్రాగాలి లేదా పచ్చిగా తినాలి. ఎంత త్రాగాలి? - ప్రతిరోజూ 200-300 మిల్లీ లీటర్లు త్రాగాలి. - ఉదయం పరిగడుపున (టాయిలెట్‌కి వెళ్లిన తర్వాత) లేదా అల్పాహారం తర్వాత త్రాగవచ్చు. ఈ రసాన్ని మరింత క్షారంగా చేసుకోవడానికి: - 7-10 తులసి ఆకులు వేసుకోవాలి. - 7-10 పుదీనా ఆకులు కలపాలి. - నల్ల ఉప్పు లేదా సైంధవ లవణం మాత్రమే వాడాలి. అయోడిన్ కలిపిన ఉప్పు వాడకూడదు. సొరకాయ రసాన్ని 2-3 నెలల పాటు త్రాగితే గుండె నాళాల బ్లాకేజ్ తగ్గుతుంది. 21వ రోజు నుంచే ప్రభావం కనపడుతుంది. ఆపరేషన్ అవసరం ఉండదు. మన భారతదేశపు ఆయుర్వేదం ద్వారా మన గుండెను రక్షించుకోవచ్చు. లక్షల రూపాయల ఆపరేషన్ ఖర్చు కూడా తప్పించుకోవచ్చు.

 CONCEPT ( development of human relations and human resources )

S.కథానికలు : పాకశాల, యుద్ధం( the battle)🌐


యుద్ధం – ఓ కథానిక 

(వయస్సు: 64 | భార్య: 60 | ఆదాయం:  (పెన్షన్)  ఇద్దరు పిల్లలు – ఒక అబ్బాయి, ఒక అమ్మాయి స్థిరపడినవారు)

ప్రవేశం
జీవితం ఓ యుద్ధమే. మనిషి చిన్ననాటి నుండి అంతిమ శ్వాస వరకూ ప్రతీ రోజూ ఏదో ఒక విధంగా పోరాడుతూనే ఉంటాడు – మరొకరితో కాదు, తనలోని అసంతృప్తితో, భయాలతో, బాధలతో, బాధ్యతలతో.

ఇంతకాలం కుటుంబ భారాన్ని భుజాన వేసుకొని నిబద్ధతగా నడిపిన ఓ వ్యక్తి ఇప్పుడు 64వ వసంతంలోకి ప్రవేశించాడు. ఈ కథ అతని కథ. భార్య 60 సంవత్సరాల వయస్సులో ఆయుష్షుతో పాటు అనుభవాన్ని, సహనాన్ని పంచుకుంటోంది.

పిల్లలు ఇద్దరూ స్థిరపడినారు – కూతురు తన కుటుంబంతో సంతోషంగా ఉంది; కొడుకు తన ప్రయాణంలో ముందుకెళ్తున్నాడు. కానీ ఇప్పుడు ఈ దంపతుల ఎదురుగా నిలిచిన ప్రశ్న:
"ఇక మేము ఎలా జీవించాలి? మేము మిగిలిన జీవితాన్ని ఎలా గడపాలి?"

ప్రస్తుత స్థితి

ఆదాయం: నెలకి  (Pension)
బాధ్యతలు: పెద్దగా లేవు – పిల్లలు స్వతంత్రం.
ఆరోగ్యం: మోస్తరు స్థితి
ఉద్దేశ్యం: "ఇది ఒక ఆత్మచింతనతో కూడిన జీవితం కావాలి. మిగిలిన రోజులు మనశ్శాంతితో, ఆత్మానందంతో ఉండాలి."

అభిప్రాయ దిశ
 తినడానికి, నిద్రపోవడానికి మాత్రమే కాదు — జీవించడానికి, లోతుగా ఆలోచించడానికి, అనుభూతి చేసేందుకు ఇది సరైన సమయం.

ఈ దశలో మనకు అవసరమయినవి:
1. ఆర్థిక విముక్తి:
6 నెలల ఖర్చుకు సరిపడే అత్యవసర నిధిని (లిక్విడ్ కాష్ లేదా FD రూపంలో) సిద్ధం చేయాలి

ఖర్చులకు ఆమోదయోగ్యమైన పద్దతి రూపొందించాలి 
(రోజుకు ₹1,500 – ₹1,800 గరిష్ట వ్యయం)

2. ఆధ్యాత్మిక జీవనం:
ఉదయం ధ్యానం / జపం / ప్రార్థన
ఒక పుస్తకం – ప్రతిరోజూ ఓ అధ్యాయం (బౌద్ధం/ వేదం/బైబిల్ తాత్విక చింతన)

ఏదో ఒక చిన్న సేవా కార్యక్రమం – సమీపంలో ఉన్న ఆశ్రమం, ఆలయం, స్కూల్ లో  సహాయం అందించడం

3. శారీరక ఆరోగ్యం:
ఉదయపు నడక లేదా తేలికపాటి యోగా
సరైన ఆహారం – ఎక్కువగా పండ్లు, కూరగాయలు, తక్కువ ఉప్పు, తక్కువ మిర్చి
నెలకోసారి ఆరోగ్య పరీక్షలు

4. బ్లాగింగ్ / రచనా ధార:
 ఆలోచనలను బ్లాగ్ ద్వారా ప్రపంచానికి తెలియజేయలి

జీవితంలో  ఎదురైన అనుభవాలు – కొత్త తరానికి ఒక మార్గదర్శకంగా ఉండవచ్చు

PART 2
> “చాలా సంవత్సరాలుగా బాధ్యతల పేరుతో  మమ్మల్ని మేము మరిచిపోయాం. ఇప్పుడు మేము మమ్మల్ని తిరిగి గుర్తు చేసుకోవాల్సిన సమయం వచ్చింది... ఈ యుద్ధం ఇక స్వశాంతికై, అంతరానందానికై...”

PART 3: క్రమశిక్షణ జీవితం

ప్రతినెలా ఒకటవ తేదీ వస్తే, నేను నా పాత నోటుపుస్తకం తీసుకుంటాను. ఒక పేజీలో : ఖర్చులు.
ఆ పేజీలో ఇలా వ్రాస్తాను:

అద్దె: ₹7,000
ఇంటర్నెట్, టీవీ: ₹1,000
సెల్ బిల్లు: ₹600
కరెంటు బిల్లు: ₹1,000
పనిమనిషి వేతనం: ₹3,000
ఫ్యూయల్ : ₹2,000
మొత్తం: ₹14,600
పెన్షన్: 
మిగిలింది: 

మా జీవితాన్ని చూసే ప్రతిఒక్కరూ, “మీకు టెన్షన్ ఏమీ లేదు కదా!” అంటారు.
కానీ నేను మాత్రం లోపల ఓ అసహనం, ఓ బాధ్యతతో నిండిపోయి ఉంటాను – ఎందుకంటే మాపై ఇంకా భాద్యత లున్నాయి అని ఉంది.

అదే నా అసలు యుద్ధం.

ప్రతి నెలా  పొదుపు కు చెల్లించేందుకు నేను కొంత డబ్బు పక్కన పెట్టుతాను. మిగతా డబ్బుతోనే మా జీవితం. తిండి, మందులు, చిన్నపాటి జాయ్, పిల్లలకూ మనం బాగున్నామని చెప్పే మాట.

అర్థం చేసుకున్నాను – బతకడం అంటే ఖర్చు కాదు, ఆత్మశాంతి కోసం తక్కువతో సంతోషంగా జీవించడం.

నా భార్య ఎప్పటిలాగే ఊపిరి లాంటి తోడు. ప్రేమ గా ఇచ్చే కాఫీ .తనకు సత్యం మాట్లాడే ధైర్యం.అదే చాలు. మాకు ఎక్కువ అవసరం లేదు.

“We are happy. We are safe. We are fighters.”

ఇది జీవితాన్ని గౌరవంగా, ధైర్యంగా స్వీకరించిన ఒక దంపతుల గుండె ధ్వని. 

💫 We Are Happy. We Are Safe. We Are Fighters.

💫 మేము సంతోషంగా ఉన్నాము. మేము సురక్షితంగా ఉన్నాము. మేము యోధులమే.

జీవితాన్ని అన్ని రంగులలో చూశాము — ఆనందం, బాధ, బాధ్యత, నష్టాలు, ప్రేమ.
ఇప్పుడు, ఈ వయసులో మేము గర్వంగా చెబుతాము:

> మేము సంతోషంగా ఉన్నాము.
అందరిలా అన్ని కలవలేకపోయాం. కానీ మాకు సరిపడినంత ఉంది.
ఒక కప్పు టీ దగ్గర నవ్వుకుంటాం, ఒక వాకింగ్ లో ముచ్చట్లు, ఒక జ్ఞాపకంలో తలమునకలవుతాము .మనస్సు నిండింది. చేతుల్లో తక్కువ ఉన్నా సరే.

> మేము సురక్షితంగా ఉన్నాము.
ప్రపంచం మారలేదు. కానీ మేము ఇద్దరం కలసి ఉన్నాం.
ఈ హడావుడి లోకంలో, మాకు మా శాంతియుత ప్రదేశం ఉంది.
ఈ ఇంట్లో వెచ్చదనం ఉంది. ఈ బంధంలో ఆశ్రయం ఉంది.

> మేము యోధులమే.
గళం పెంచే యోధులు కాదు. ఓర్చే యోధులు.
బాధలు, అనిశ్చితి మధ్య — మేము నిలిచాము.
రోజలు, నెలలు — మౌనంగా, ఒకరినొకరం పక్కనుంచుకుని.

జీవితం మమ్మల్ని విరిచివేయలేదు. మమ్మల్ని నిర్మించింది.

🕉 మనసుపై ఆధిపత్యం,సమస్తం పై నియంత్రణ – ప్రతిక్షణం, రోజూ,నిరంతరం > మనల్ని మనం పాలించాలి. మన భావాలను మనం తీర్చిదిద్దాలి. మన చర్యలకు మౌలికత ఇవ్వాలి. అప్పుడు ప్రపంచం మన గమనాన్ని అనుసరిస్తుంది. 

🕉 మనసుపై ఆధిపత్యం
సహనం: అన్నివేళలా స్థితప్రజ్ఞతతో వ్యవహరించడం. సమస్యల మధ్యలో కూడా మనస్సును స్థిరంగా ఉంచే శక్తి.

ఓర్పు: విఘ్నాలను, నొప్పులను ఓర్చుకునే సహనశీలతే ధైర్యానికి మూలం.

నేర్పు: తెలివితేటలతో పరిష్కారాలను కనుగొని సమర్థంగా వ్యవహరించడం.

క్రమశిక్షణ: సమయపాలన, పద్ధతిపూర్వకమైన జీవితం విజయానికి మార్గదర్శకం.

పొదుపు: ధనం, శక్తి, కాలాన్ని దుర్వినియోగం కాకుండా జాగ్రత్తగా వినియోగించడం.

అదుపు: కోపం, ఆశలు, భావోద్వేగాలను నియంత్రించగలిగే శక్తి.

విద్య: మనలో ఉన్న శక్తిని వెలికితీసే సాధనం. విజ్ఞానం మరియు విశ్లేషణకు బీజం.

నిరంతర పరిశ్రమ: నిరుత్సాహం లేకుండా కష్టపడటం ద్వారానే విజయం సాధ్యమవుతుంది.
ఈ విలువల సమన్వయమే నిజమైన వ్యక్తిత్వ వికాసానికి దారితీస్తుంది. ప్రపంచాన్ని జయించాలంటే ముందు మనల్ని మనం జయించాలి.
జీవితం - అనుసరించాలిసిన 

బౌద్ధ సూత్రాలు (Buddhist Sutras)
అనేవి బుద్ధుని బోధనలు, జీవన మార్గదర్శకాలు. ఇవి మనస్సుని శుద్ధి చేసి, జీవితాన్ని ధర్మ మార్గంలో నడిపించే ప్రకాశమయమైన బోధనలుగా నిలుస్తాయి.

🪔 బౌద్ధం – సూత్రాలు & జీవిత మార్గదర్శకాలు
ఇక్కడ బౌద్ధ త్రిరత్నాలు (Three Jewels of Buddhism) 

1🪷 త్రిరత్నాలు (Triratnas / Three Jewels):
1. బుద్ధం శరణం గచ్చామి
I take refuge in the Buddha
(బుద్ధుడిలో శరణు పొందుతాను)
2. ధర్మం శరణం గచ్చామి
I take refuge in the Dhamma (Teachings)
(ధర్మంలో శరణు పొందుతాను)
3. సంఘం శరణం గచ్చామి
I take refuge in the Sangha (Community of Monks)
(సంఘంలో శరణు పొందుతాను)

ఈ మూడు త్రిరత్నాలు బౌద్ధమతంలో ఆత్మదీపంగా మారుతాయి — అవి బుద్ధుడు, ధర్మం, మరియు సంఘం అనే మూడు శాశ్వత ఆశ్రయాలను సూచిస్తాయి.

2 అర్య సత్యాలు (Four Noble Truths – చత్వారి ఆర్య సత్యాని)

1. దుఃఖం (Suffering exists)
– జీవితం లో దుఃఖం తప్పదు: జననం, మృతి, జ్ఞానం లోపం, వాంఛలు, 
వెరపులు.

2. దుఃఖ సముదయము (Cause of suffering)
– తృష్ణ (లాలస), ఆసక్తి, అహం, అసత్యం.

3. దుఃఖ నిరోధము (End of suffering)
– తృష్ణను నాశన పరచినపుడే దుఃఖం తగ్గుతుంది.

4. మార్గము (The Path to cessation)
– అష్టాంగిక మార్గము ద్వారా మోక్షం.

3 అష్టాంగిక మార్గము (Eightfold Path)

బుద్ధుడు సూచించిన జీవన సాంప్రదాయం – "మధ్యమ మార్గము"

మార్గం అర్థం

1. సమ్మ దిట్టి (Right View) సత్యం గ్రహించు
2. సమ్మ సంకప్ప (Right Thought) నిర్దోషమైన ఆలోచనలు
3. సమ్మ వాచా (Right Speech) అబద్ధం లేని, హింస లేని మాటలు
4. సమ్మ కమ్మంత (Right Action) హింసా రహిత క్రియలు
5. సమ్మ ఆజీవ (Right Livelihood) ధర్మబద్ధ జీవనోపాధి
6. సమ్మ వాయామ (Right Effort) మంచి దిశగా శ్రమ
7. సమ్మ సతి (Right Mindfulness) అహర్నిశ మనస్సు జాగృతంగా ఉంచడం
8. సమ్మ సమాధి (Right Concentration) ధ్యానం – చిత్త ఏకాగ్రత

4 పంచ శీలాలు (Five Precepts – పంచ శీలానీ)

ప్రతీ బౌద్ధుడు పాటించవలసిన ప్రాథమిక నైతిక నియమాలు:

1. హింస చేయవద్దు
2. దొంగతనం చేయవద్దు
3. అసత్య శీలాలకు లోనవద్దు
4. అబద్ధం చెప్పవద్దు
5. మత్తు పదార్థాలను వాడవద్దు

5.పారామితలు బౌద్ధ జీవన విలువలు

మైత్రీ (Loving-kindness)
కరుణ (Compassion)
ముదిత (Joy for others' success)
ఉపేక్ష (Equanimity – సమానత్వ భావం)
వివేకం (Right Discernment)
క్షమ (Forgiveness)

6. బుద్ధుని ముఖ్యమైన సూత్ర వాక్యాలు (Quotes)

📜 "అత్త దీపో భవ"
👉 నీవే నీకు దీపం కావాలి

📜 "సబ్బపాపస్స అకరణం"
👉 అన్ని పాపాలనుండి విముక్తి పొందడం ధర్మం

📜 "మనో పుబ్బంగమా ధమ్మా"
👉 మనస్సే ప్రతి విషయానికి మూలం

📜 "నిర్వాణం పరమం సుఖం"
👉 నిర్ద్వంద, మోక్ష స్థితిలో నిజమైన సుఖం ఉంది

🌼 జీవిత మార్గదర్శకంగా బౌద్ధ సూత్రాలు ఎందుకు?

బుద్ధుని బోధనలు తాత్వికమైనవి, ఆచరణాత్మకమైనవి

అన్ని వయస్సుల వారికి, అన్ని తరగతుల వారికి సామాన్యమైన మార్గం

ఇది ఆధ్యాత్మిక మార్గం మాత్రమే కాక, సాంఘిక నైతిక జీవన దారికీ మద్దతు

explanation of key Buddhist life-guiding principles (జీవిత మార్గదర్శకాలు) including Anatta (అనాత్మ), Anicca (అనిత్య), and Pratītyasamutpāda (పటిచ్చ సముత్పాద / ప్రతిత్య సముత్పాదం):


7. బౌద్ధ జీవిత మార్గదర్శకాలు

Buddhist Life-Guiding Principles

1. అనాత్మ (Anatta) – Not-Self

🪷 
ఈ లోకంలో శాశ్వతమైన స్వరూపముతో ఉన్న "నేను" అనే మనస్సు లేకుండా, ప్రతి వస్తువూ మరియు జీవి అనేక కారణాల వల్ల ఏర్పడిన అస్థిర రూపమే. "నేను", "నాది" అనే భావన తప్పిదమైన అహంకార భావన.

2. అనిత్య (Anicca) – Impermanence

🌀 
ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువు, జీవి, అనుభూతి కూడా మారిపోతూనే ఉంటుంది. శాశ్వతత అనే భావన వాస్తవానికి విరుద్ధమైనది.

3. పటిచ్చ సముత్పాదం / ప్రతిత్య సముత్పాదం (Pratītyasamutpāda) – Dependent Origination

🔁 
ఏదీ ఒక్కటి సొంతంగా లేదు. ప్రతి విషయం మరొకదానిపైన ఆధారపడి ఉంటుంది. ఇది "కారణ-ఫల సంబంధం" అని పిలవబడుతుంది. ఇది బుద్ధుని బోధనల లోతైన తాత్వికతను తెలియజేస్తుంది.

💠 ముగింపు | Conclusion

బుద్ధుని బోధనలు మానవుని సత్యాన్వేషణలో దారితీసే శాంతి మార్గాలు. ఇవి మనం కలిగించే అపోహలను తొలగించి, నిజమైన విముక్తిని సాధించేందుకు ఉపకరిస్తాయి.

✳️
పాకశాల – ఒక అనుబంధ గాథ
బాల్యాన్ని గడిపిన ఊరు — ఎల్లలు దాటిన ప్రేమ

— గోంగూర ముద్దపప్పు, గుత్తొంకాయ కూర కలయికలోంచి వచ్చే మసాలా మాధుర్యం.

🍲 పెరిగిన మమకారం – పెరుగన్నం
వడ్డించిన పెరుగన్నం, పక్కన కొత్తావకాయ పచ్చడి — వీటిలో ప్రేమ కలిసినంత వరకు అన్నం భోజనం కాదు, అనుభూతి.

🪔 పండుగల పుట – సకినాలు, బజ్జీలు
ఆదివారం ఉదయం పంచాయతీ వంక దగ్గర దసరా పండుగ. అమ్మ సకినాలు వడలు మిర్చి బజ్జి. సాయంత్రానికి పులిహోర అన్నం తింటే తలనొప్పి కూడా మాయమవుతుంది అన్నంత రుచి.

🍬 చెక్కెర కథలు – మిఠాయిల సవ్వడి
వీధిలో బందరు లడ్డు, చిటికెలో కరిగే కాకినాడ ఖాజా, పెచ్చులూళ్ళా కదలే జీడిపాకం, మామిడి తాండ్ర — ఇవన్నీ అప్పట్లో మిఠాయిలు మాత్రమే… ఇప్పుడు జ్ఞాపకాల చెక్కెరలు.

🌾 రాగి ముద్ద – ఆహారమా, ఆత్మగౌరవమా?
రాత్రికి రాగి ముద్ద నేయితో, పక్కన జొన్న రొట్టె. 

📚 కథ ముగింపు కాదు, ఓ అధ్యాయం మాత్రమే
 – తల్లి చేతి రుచి, ఊరి వంటల జ్ఞాపకాలు, మట్టివాసన గల గౌరవం, ఆ వంటల వెనుకున్న కథల అనుబంధం 

✅ ఈ నవలికలో చేరిన వంటకాలు:
గోంగూర ముద్దపప్పు
గుత్తొంకాయ కూర
కొత్తావకాయ పచ్చడి
పెరుగన్నం
పులిహోర
సకినాలు
మిర్చి బజ్జి
బందరు లడ్డు
కాకినాడ ఖాజా
జీడిపాకం
మామిడి తాండ్ర
రాగి ముద్ద
జొన్న రొట్టె
CONCEPT ( development of human relations and human resources )

G. - 1961 నాటి జీవన విధానం@

1961 నాటి జీవన విధానం
ఊరు పల్లెటూరు
నాటి జీవన విధానం
కథ నిజమైన వ్యక్తిగత అనుభవాలను కళ్ళకు కట్టేలా పాఠకుల ముందుంచగల  "60 ఏళ్ల పూర్వం ఆనాటి జీవన శైలి" 

ఉదయం పళ్ళు తోముకోవడానికి వేప్పుల్లలను ఉపయోగించే వారు. వీటినే పందొం పుల్లలు అని కూడా అనే వారు.

కొంతమంది కచ్చిక, (ఆవు పేడ పిడకలను కాల్చగా వచ్చిన పొడి), పళ్ళ పొడితో పళ్ళు తోముకునే వారు. తాటాకులు చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకుని వాటిని నాలిక శుభ్రపరచు కోవడానికి ఉపయోగించేవారు.

మగ వాళ్ళు చాలా మంది నూతి దగ్గరే, నీళ్ళు చేదలతో తోడుకు పోసుకొనే వారు. ఆ చన్నీటి స్నానం చాలా హాయి నిచ్చేది. చలి కాలంలో మాత్రం వేడి నీళ్ళు ఉండేవి.

ఉదయం నీళ్ళు కాచుకొనేoదుకు కర్రల పొయ్యి, లేదా పొట్టు పొయ్యి ఉండేది. పొట్టు పొయ్యిలో పొట్టు కూరడం చాలా చిత్ర మైన విషయం. Rs.3/- కి ఒక పొట్టు బస్తా వచ్చేది. పొట్టు బస్తాలను ఎడ్ల బండి మీద పట్టుకొచ్చి ఇంటి దగ్గర అమ్మే వారు.

కాఫీ డికాషన్ కి వేడి వేడి నీళ్లలో కాఫీ పొడి వేసి, కొంచం సేపు ఆగాక, పైన తేరిన నీటినే డికాషన్ గా ఉపయోగించే వారు. పాలు శేరు లెక్కన అమ్మే వారు.

బొగ్గుల కుంపటి మీద కాఫీ. కుంపటి విసరడానికి ఓ వెదురు విసినకర్ర. కొంతమంది వత్తుల స్టౌ, పంపు స్టౌ వాడేవారు కిరసనాయిలు ది.

అదే విధంగా గా బరువులను వీశ (1400 గ్రా), ఏబులం (అర వీశ), పదలం( పావు వీశ)గా తూచే వారు.

ఇంట్లో దేవుడి పూజలు అవీ సామాన్యంగా ఉండేవి. మడి, తడీ మాత్రం పాటించే వారు బాగా. వంట అంతా ఇత్తడి గిన్నెల తోనే. అందరి ఇళ్లలోనూ రాచ్చిప్పలు ఉండేవి. ఈ రాచ్చిప్పల్లో పచ్చి పులుసు, ఉల్లిపాయల పులుసు, పప్పుపులుసు కాచే వారు. ఆ రుచి అమోఘంగా ఉండేది. అన్ని పచ్చడులూ రుబ్బురోట్లోనే.

అప్పుడు బియ్యంలో మట్టి బెడ్డలు, వడ్లు, ఎక్కువుగా ఉండటంతో వాటిని బియ్యం నుండి ఏరేసుకుని వండుకునేవారు. రోజూ మధ్యాహ్నం ఆడవాళ్ళు అందరూ కలసి బియ్యం చేటల్లో పోసుకుని, వడ్లూ బెడ్డలూ ఏరుకునేవారు. అదే వారికి ఇరుగింటి పొరుగింటి వాళ్లతో కాలక్షేపం, పిచ్చాపాటి.

అదేవిధంగా అన్ని సామాన్లు అంటే, ఆవాలు, జీలకర్ర ఇలాoటివి కూడా బాగు చేసుకుని డబ్బాల్లో పోసుకొనేవారు.

బియ్యం లో అక్కుళ్లు, ఆట్రగడ్డలు, వంకసన్నాలు, కిచిడి అనే రకాలు ఉండేవి. ఆక్కుళ్లు, ఆట్రగడ్డలు అంటే ముతక బియ్యం. వంక సన్నాలు, మధ్య రకం. కిచిడి బియ్యం అంటే సన్నబియ్యం. మసూరీ బియ్యం ఇంకా ఖరీదు.కేజీ 1 రుపాయి

రాత్రిపూట7, 8 గంటలకు బిచ్చగాళ్ళు తల్లీ అంటూ వచ్చేవాళ్లకి ఆరాత్రి తినగా మిగిలిన అన్నం, కూరలు ఇచ్చేవాళ్ళు. చిన్న పిల్లలు పేచీ పెడుతుంటే బిచ్చగాళ్ళు అబ్బాయికిచ్చేస్తానని భయపెట్టేవారు తల్లులు.

టిఫిన్స్ ఉండేవి కావు. ఒక్క శనివారం మాత్రం మినపరొట్టి / ఎర్ర నూక ఉప్మా లాంటివి ఉండేవి.

పిల్లలు అందరూ 3 పూటలు అన్నం తినే వారు. భోజనం ఎప్పుడూ వంటింట్లో నేల మీద పీట వేసుకునే. తినడం అయ్యేక తిన్న చోట నీళ్ళు జల్లి శుద్ధి చేసేవారు. ప్రతి రోజూ రాత్రి వంటిల్లు కడిగి ముగ్గు పెట్టడం అలవాటు.

ఎప్పుడైనా చుట్టాలు వస్తే ఇంట్లో పిల్లలు వంటింట్లో పెద్దలు పడుకొనే వాళ్ళం బొంతలు వేసుకుని. చుట్టాలు లోపలిగదిలో పడుకునే వారు.

డబుల్ బెడ్రూం, సింగిల్ బెడ్రూం అనే పదాలే తెలియవు. చాలా మటుకు 3 గదుల ఇళ్లే. కొంచం స్థితి మంతులు ఐతే 4 గదులులోనూ, ఇంకా పెద్ద పెద్ద ఇండ్లలో ఉండే వారు. గదులు కూడా చాలా పెద్దవి.

3 వరుస గదుల ఇల్లు అద్దె నెలకి - 27 రూపాయలు. కరెంటు -1 బల్బు కి నెలకు 1 రూపాయి. అలాగ మొత్తం కరెంటుతో కలిపి నెలకి 30 అద్దె ఉండేది.

వైద్యం కి డాక్టర్స్ చెయ్యి పట్టుకు చూసి, బిళ్ళలు, అరకు ఇచ్చే వారు. జ్వరం తగ్గే వరకూ లంఖణమే. తర్వాత బన్ను, జావ, ఆ తర్వాత రోజు చారు అన్నం తినమనే వారు. డాక్టర్ భుజం తట్టి తగ్గిపోతుందిలే అనేమాటకే సగం జ్వరం తగ్గిపోయేది. అదే ప్రభుత్వాసుపత్రికి పోతే రంగు రంగుల ఔషథాలిచ్చేవారు.

ఇంకా, పిల్లల చదువుల మీద ఎక్కువ వత్తిడి ఉండేది కాదు. బాగా చదువుకోమని చెప్పే వారు. అంతే. ఊరికే చదివావా చదివావా అని ఏ తల్లిదండ్రులు పిల్లలని టెన్షన్ కి గురి చేసే వారు కాదు.

పుస్తకాలు ఎప్పుడు, వేరే వాళ్ళు వాడినవే. పై తరగతి పాసైన వాళ్ళ దగ్గర సగం రేట్ కి టెక్స్ట్ బుక్స్ కొనే వారు. నోట్స్ అన్నీ తెల్ల కాగితాల పుస్తకాలే. సింగిల్ రూల్లు, బ్రాడ్ రూళ్లు, పెన్సిల్ తో కొట్టుకోవడమే. క్రితం ఏడు నోట్ బుక్స్ లో మిగిలిన తెల్ల కాగితాలు అన్నీ చింపి, ఒక కొత్త బుక్ లా కుట్టించుకుని నెక్స్ట్ ఇయర్ లో రఫ్ బుక్ గా వాడుకునే వారు.

రాత్రి 9 గంటలకు రేడియోలో వచ్చే ఇంగ్లీష్ న్యూస్ వినే వారం. అర్థం అయినా కాకపోయినా, రాత్రి పెందలాడే, నిద్ర. వేసవి కాలం అయితే ఆరుబయట, మిగిలిన కాలాల్లో లోపల పక్కలమీద. ఉంటే ఫ్యాన్ ఉండేది లేకపోతే విసనకర్రే."*

ఇంకోటి ఏమిటంటే అప్పుడు సైకిల్ కి కూడా లైసెన్స్ ఉండేది. రెండు రూపాయలు పెట్టి, ఒక లైసెన్స్ రేకు బిళ్ళ కొనుక్కుని సైకిల్ కి బిగించేవారు.

అదీ ఆరోజుల్లో జీవన శైలి.
ఎవరికీ ఏ చీకూ చింతా ఉండేది కాదు. జీవితంలో ఏది ఎలా వస్తే అలాగే స్వీకరించే వారు. సంతోషంగా కాలం గడిపేసే వారు. ఆనందంగా భాద్యతలు నిర్వహించేవారు.

అప్పట్లో ఎన్నో ఉమ్మడి కుటుంబాలుండేవి 
వారాలబ్బాయిలు వీథి దీపాల చదువులు… మనుషులంత ఒక్కటిగా ఉండే వాళ్ళు. ప్రజలంతా అమాయకంగా ఉండేవాళ్ళు.

కక్షలూ కార్పణ్యాలు. కోప తాపాలు కుళ్ళూ కపటం. ఈర్ష్యా ద్వేషాలు వాళ్ళకుంది మాకులేదని ఏనాడూ అనుకునే వారే లేరు. అహంకారం ప్రతీకారం అనేవే తెలీదు అప్పటి జనాలకి.

వెనక్కి తిరిగి చూచుకుంటే ఆ రోజులే బాగున్నాయనిపిస్తుంది. ఇప్పుడున్నన్ని సౌకర్యాలు, విలాసాలు లేకపోయినా, ప్రకృతికి దగ్గరగా, ఆరోగ్యంగా గడచిన రోజులు.(సేకరణ సవరణ)