1.E-BOOK RESEARCH EDITION

Page No: 1

ముందుమాట

సమాజం వసుధైక కుటుంబం నమూనా. తాత్వికులు సమాజంతో మమేకమై, వారి కాలచక్ర పరిధిని దాటి ఆలోచించారు. వారు తమ కాలానికే పరిమితం కాకుండా, భవిష్యత్ తరాలకు మార్గదర్శకులయ్యారు. సమాజానికి నూతన దారులను చూపి చరిత్ర గతిని నిర్దేశించారు.

— Chinta Ramamohan

ప్రసిద్ధ వాక్యం

“There are no facts, only interpretations.”
— Friedrich Nietzsche (1844–1900)

ప్రసిద్ధ కవితలు

అజ్ఞానపు టంధయుగంలో
ఆకలిలో, ఆవేశంలో
తెలియని ఏ తీవ్రశక్తులో నడిపిస్తే నడిచి
మనుష్యులు అంతా తమ ప్రయోజకత్వం తామే
భువికధినాధులమని స్థాపించిన సామ్రాజ్యాలు
నిర్మించిన కృత్రిమ చట్టాలు
ఇతరేతర శక్తులు లేస్తే పడిపోయెను పెకమేడలై
పరస్పరం సంఘర్షించిన శక్తులతో చరిత్ర పుట్టెను.

నేను సైతం ప్రపంచానికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను
నేను సైతం విశ్వ వృష్టికి అశ్రువొక్కటి ధారవోసాను
నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక పిచ్చి మోసాను

— శ్రీ శ్రీ