6.E-BOOK RESEARCH EDITION

బుద్ధుని జీవిత చరిత్ర

Page No: 6

1. బుద్ధుడు (563 – 483 BCE)

తాత్వికుల భావాలు, భావజాలాలు కాల పరంపరలో మన మధ్య సజీవంగా ఉంటాయి.

ప్రతిత్యసముత్పాదం / పటిచ్చ సముప్పాదం
(కార్యకారణత్వం)
(ఒక దాని కారణంగా మరొకటి జరగడం)
గతి తార్కిక భౌతికవాదం

తనకాలపు పరిస్థితుల మానసిక సంఘర్షణలోనుంచి స్వీయ సాక్షాత్కారం, స్వీయ ప్రభోదాన్ని పొందాడు. ప్రపంచానికి ఒక నూతన మార్గాన్ని నిర్దేశించాడు.

తన ముందు తరం యొక్క భావాలు భావజాలాల నుండి నూతన భావజాలాన్ని ప్రపంచానికి అందించి తరువాత తరాల తాత్వికులకు, తత్త్వవేత్తలకు మార్గం సుగమం చేయడమే కాకుండా తన ముందు, తర్వాత తరాల వారికీ వారధిగా నిలిచాడు.

బుద్ధుడి జీవిత కథ | Life of the Buddha

1. జననం మరియు శాక్య వంశం
బుద్ధుడు (గౌతమ బుద్ధుడు) ఇ.సా.పూ. 563లో లుంబినిలో జన్మించాడు. ఆయన తండ్రి శుద్ధోదనుడు శాక్యుల రాజు. తల్లి మాయాదేవి.

2. బాల్యం మరియు రాజభవనం
బాల్యంలో రాజభవనంలోనే జీవించాడు. బయటి ప్రపంచపు బాధలు తెలియకుండా ఉంచబడ్డాడు.

3. నాలుగు దృశ్యాలు
వృద్ధుడు, రోగి, మృతదేహం, తపస్వి — ఇవి జీవిత నిస్సారతను తెలియజేశాయి.

4. రాజభవనాన్ని విడిచిపెట్టు
29వ ఏట భార్య యశోదర, కుమారుడు రాహులను వదిలి బయలుదేరాడు.

5. తపస్సు మరియు ధ్యానం
ఆరేళ్లు తపస్సు చేసిన తర్వాత మాధ్యమ మార్గం అవసరమని గ్రహించాడు.