Showing posts with label 06.చారిత్రికగతిని నిర్దేశించిన తాత్వికులు. Show all posts
Showing posts with label 06.చారిత్రికగతిని నిర్దేశించిన తాత్వికులు. Show all posts

25.12.24

6.చారిత్రిక గతిని నిర్దేశించిన తాత్వికులు


      1 సమాజం వసుదైకకుటుంబం నమూన. తాత్వికులు సమాజం తో మమేకమై వారి కాలచక్రపరిధిని దాటి ఆలోచించారు .  సమాజానికి నూతనమార్గాన్ని నిర్దేశించారు .
-Chinta Ramamohan

2."There are no facts, only interpretations."- Friedrich Nietzsche (1844-1900)

3.అజ్ఞానపు టంధయుగంలొ ఆకలిలొ,ఆవేశంలో తెలియని ఏ తీవ్రశక్తులో నడిపిస్తే నడిచి మనుష్యులు అంతా తమప్రయోజకత్వం తామేభువికధినాధులమని స్థాపించిన సామ్రాజ్యాలునిర్మించిన క్రుత్రిమ చట్టాలు ఇతరేతర శక్తులు లేస్తే పడిపోయెను పెకమేడలై పరస్పరం సంఘర్షించినశక్తులతో చరిత్ర పుట్టెను.
4.నేను సైతం ప్రపంచానికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను
నేను సైతం విశ్వ వ్రుష్టికి అశృఉవొక్కటి ధారవోసాను
నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మొసానూ -శ్రీ శ్రీ 
🌹🌹🌹
1.బుద్డుడు - (563 - 483 BCE) :
(గతి తార్కిక భౌతిక వాదం)
ప్రతీత్య సమోత్పదం 

2.సోక్రటీస్ (469 - 399 BCE)  నిన్నునీవు తెలుసుకో
(method of arriving at truth )

3.స్పొర్టకస్ - (71 BCE) తిరుగుబాటు 
 ( the first revolutionist in the history )

4.జీసస్ - మానవసంబంధాలు 
 ( human relations )
5.వేమన - (1650  రాయలసీమ ) భావవిప్లవం 

6.కారల్ మార్క్స్ - (1818 - 1883 ) కమ్యూనిజం 
(చారిత్రిక గతి తార్కిక భౌతిక వాదం)

7.ఫ్రౌయిడ్ - (1856 - 1939) మనోవిశ్లేషణ (psychoanalysis)
వ్యక్తుల ఆలోచనలు మరియు ఆచరణలపై మానసిక క్షోభ, సంఘర్షణలు, మరియు అసంతృప్తి ప్రభావం చూపుతాయని సూచించాడు.

స్వేచ్ఛ లో బాధ్యత ఉంటుంది
ఫ్రాయిడ్ ను చదవడమంటే మనల్ని మనం చదవడమే,ఫ్రాయిడ్ ను తెలుసుకోవడమంటే మన గురించి మనం తెలుసు కోవడమే.మన అంతరంగ సంఘర్షణ..ఫ్రాయిడ్,
ద్వందభావాల పెనుగులాట..ఫ్రాయిడ్
అస్పష్టాస్పష్ట కలల డికోడ్..ఫ్రాయిడ్,
అర్ధం కాని మన మనస్సు..ఫ్రాయిడ్ 
పురాణాల్లోంచి గాలించి సిగ్మండ్ అనే చక్రవర్తి పేరు పెట్టుకుందట వాళ్ళమ్మ.
భౌతికార్ధంలో అతడు చక్రవర్తి కాక పోయినా మనస్సు అనే మరో ప్రపంచాన్ని పాలించాడు.అన్వేషించాడు దాని లోతులు కనుక్కుని శిఖరం ఎత్తుకు
ఎదిగాడు. ఆస్ట్రియాకు చెందిన ఈసైక్రియాటిస్ట్ సైకో ఎనాలసిస్ అనే కొత్తదారి పరచి స్టడీస్ ఆఫ్ హిస్టిరియా
ది ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్ 
ది ఇగో అండ్ ది ఇడ్  
త్రి ఎస్సేస్ ఆన్ది థియరీ ఆఫ్ సెక్సువాలిటి బియాండ్ ద ప్లెజర్ 
ప్రిన్సిపుల్ లాంటి పుస్తకాలను వెలువరించాడు
ప్రపంచాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిన
వ్యక్తుల్లో ఒకడిగా చరిత్రకెక్కాడు

8.లెనిన్ - కమ్యూనిజం (1872 - 1924) పెట్టుబడిదారి విధానం యొక్క అంత్యదశ సామ్రాజ్యవాదం
(the last refuge of capitalisum is imperialisom )

9.స్టాలిన్ - కమ్యూనిజం (1879 -1953) రాజ్యరహిత సమాజం 
(The Legacy of Statelessness)

10.మావొ - (1893 - 1976) *కమ్యూనిజం
( సాంస్కృతిక విప్లవం )
 (cultural revolution)

🍮🍮
తాత్వికుల భావాలు,భావజాలాలు వారిని మనమధ్య సజీవంగా ఉంచుతాయి.

చారిత్రక గతిని నిర్దేశించిన తాత్వికులు 
 1.బుద్ధుడు - (563 - 483 BC)
ప్రతిత్యసముత్పాద/పటిచ్చసముప్పద
కార్యకారణత్వం 
ఒక దాని కారణంగా మరొకటి జరగడం
(గతి తార్కిక భౌతిక వాదం) 

2.సోక్రటీస్ (469 - 399 BCE) 
నిన్నునీవు తెలుసుకో 
 (method of arriving at truth )

#ఎరుక తో జీవితం సాగాలని తన జీవితాన్నే ఫణంగా పెట్టి చరిత్ర గతిని నిర్దేశించిన తాత్వికుడు 

3.స్పోర్టకస్ - (71 BC) తిరుగుబాటు 
అతను ఓడిపోయాడు చనిపొయాడు క్రీస్తు కి పూర్వమే పుట్టాడు గిట్టాడు . కానీ అతని పేరు చెప్తే దోపిడీదారులందరికీ బెదురు. ఎందుకా ? వారు శ్రామికవర్గాల జనాన్ని పందులకంటే హీనంగా చూస్తారు . కానీ ఆజనాలు ఉగ్రనరసింహులుగా మారి విజృంభించగలరన్న సత్యాన్ని చరిత్రలో మొదటిసారిగా చెప్పినవాడు స్పోర్టకస్.(రాచకొండ విశ్వనాధశాస్త్రి)

4.జీసస్ - మానవసంబంధాలు 
మాటలకు, ప్రభోదాలకు,నీతి సూక్తులకు చరిత్ర గతినే మార్చేంత బలం ఉంటుందా? తప్పక ఉంటుంది. అన్నది యేసుప్రభువు జీవితాన్నిబట్టి తెలుస్తుంది. ఒకరోజున శిష్యులంతా తగవులాడుకొంటున్నారు.తమలోఎవరు గొప్ప? అన్నది తేల్చుకోవాలన్న వాళ్ళ ప్రయాస .వాళ్ళని ప్రభువు తనవద్దకు పిలిచి మీలోగొప్పవాడుగా,నాయకుడుగా ఉండగోరువారు ముందు మంచి పరిచారకుడుగా ఉండాలి.నేనుకూడా ఈ లోకానికి పరిచారంచేయించుకోడానికి రాలేదు,పరిచర్య చేయడానికే వచ్చానని ప్రభోదిచాడు.(గ్రహించినది )

5.వేమన - (1650 రాయలసీమ )
(సామ్య వాద ) భావవిప్లవం 
తనకాలపు సామాజికనైనా చైతన్య దృష్టితో కవిత్వం చెప్పిన తొలి తెలుగు కవి వేమన్న. అదే దృష్టితో రచన చేస్తున్న ఈనాటి కవులు తమకన్నా పూర్వుల సంప్రదాయాన్ని తెలుసుకోవడం ఆరోగ్యకరమే గాక అవసరమని కూడా కోరుకుంటున్నాం. వెనకటి మంచిని జీర్ణించుకొని కొత్త పరిస్థితులను గుర్తించి ముందు చూపుతో రచనలు చేయటం ఈనాటి రచయితల కర్తవ్యం.
తన కాలాన్ని మించి కొన్ని విషయాల్లో ముందుకు చూడగలిగిన కవిగా వేమన్నను మనం గౌరవించాలి. 
విగ్రహారాధనను వ్యతిరేకించాడు. శైవ వైష్ణవ మతాలవారి ఆర్భాటాలను, వారి దురాచారాలను, మోసాలను బట్టబయలు చేశాడు. చిలుక పలుకుల చదువులను విమర్శించాడు. కాకులకు పిండాలు పెట్టటం వంటి మూర్ఖాచారాలను తీవ్రంగా ఖండించాడు. శ్రమశక్తిలోనే సర్వమూ ఉన్నది అనేంత నిశిత పరిశీలన చెయ్యగలిగిన వేమన్న మామూలు కవి, తనకాలపు ఛత్రంలో ఇమడని గొప్ప కవి.
వేమన్న రచనా మార్గంలో మూడు అంశాలు గుర్తించవచ్చు.
 1.ప్రజలభాషలో ప్రచారంగా ఉన్న పదాలను, మాండలికాలను ప్రయోగించి ప్రజలకు సన్నిహితమైన రచన చెయ్యటం. 2.చెప్పదలచుకున్న భావాన్ని తగిన విస్తీర్ణంలోనే క్లుప్తంగా చెప్పటం. 3.ఊహలోనుంచికాక జీవితం నుంచి ఉపమానాలను ఏరుకోవటం. కవితా దృక్పథం విషయంలో మాత్రమే కాక రచనా విధానంలో కూడా వేమన్న ఆదర్శం నుంచి ఈనాటి కవులు నేర్చుకోవలసింది చాలా ఉందని దృఢంగా భావిస్తున్నాం.- చేకూరి రామారావు (గ్రహించినది )

6.కారల్ మార్క్స్ - (1818 - 1883) 
కమ్యూనిజం (చారిత్రిక గతి తార్కిక భౌతిక వాదం)
"తత్వవేత్తలు ప్రపంచాన్ని పరిపరి విధాల నిర్వచించారు. కావలసింది దాన్ని మార్చడం " .సోషలిస్టు విప్లవం తీసుకురాగలిగింది కార్మికవర్గం మాత్రమే.నడచిన చరిత్ర యావత్తు వర్గ పోరాటాల చరిత్రే.మానవాళిని దోపిడీనుండి విముక్తి చేసే కర్తవ్యానికి శ్రామికవర్గాన్ని సమాయత్తం చేయాలి ! పీడనను , ఆకలిమంటలను , యుధ్దాన్ని నిర్మూలించాలి .శతాబ్దాల క్రమంలో "పెట్టుబడి" ఎలాగుపడిందీ,పెంపొందిందీ కారల్ మార్క్స్వవర్ణించాడు. "నఖశిఖ పర్యంతం,దాని ప్రతి అణువు రుధిరంతో తడిసి " పుట్టిందన్నాడు .( దాస్ క్యాపిటల్ ) వ్యక్తిగత ఆస్తి ప్రసక్తిలేని సమాజంలో మాత్రమే దారిద్ర నిర్మూలన సాధ్యమని ఎంగెల్స్ సూత్రీకరించాడు.ఈనాటి పెట్టుబడిదారులు సమకూర్చుకున్న సంపదలు - బానిసలు యజమానులు లేదా ఫ్యూడల్ ప్రభువులు అర్ధబానిసల శ్రమను దోచుకొని గడించినదానికన్నా భిన్నమేంకాదు . ఈ రకరకాల దోపిడీల మధ్య వ్యత్యాసం తిఫలమివ్వకుండా శ్రమను కొల్లగొట్టే విధానంలో తేడా మాత్రమే .ఈనాటి బూర్జువా సమాజం లోగడ వున్న వాటికన్నా మెరుగైందేమీకాదు .అపార జనసందోహాన్ని అత్యల్పసంఖ్యాకులు దోచుకునేందుకు అవకాశమిస్తున్న మహా భీకర వ్యవస్థ ఇది .(గ్రహించినది )

7.ఫ్రౌయిడ్ - (1856 - 1939) మనోవిశ్లేషణ )

8.లెనిన్ - కమ్యూనిజం (1872 - 1924) పెట్టుబడిదారి విధానం యొక్క అంత్యదశ సామ్రాజ్యవాదం


లెనిన్ అనే పేరుతో ప్రసిద్ధుడైన వ్లాదిమిర్ ఇల్యీచ్ ఉల్యొనోవ్ (ఆంగ్లం: Vladimir Ilyich Ulyanov, Lenin, Влади́мир Ильи́ч Улья́нов, vlʌˈdʲimʲɪr ɪˈlʲitɕ uˈlʲanəf, Ленин) 
(ఏప్రిల్ 22, 1870 – జనవరి 21, 1924), రష్యా విప్లవ నాయకుడు, కమ్యూనిస్ట్ రాజకీయ వేత్త. ఇతడు 1917లో జరిగిన అక్టోబర్ విప్లవం ప్రధాన నాయకుడు. రష్యన్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ లేదా 'బోల్షెవిస్ట్ రష్యా' దేశానికి మొదటి అధినేత. 1922వరకు ఆ పదవిలో కొనసాగాడు. కార్ల్ మార్క్స్ ప్రతిపాదించిన మార్క్సిజమ్‌కు ఇతడు కూర్చిన మార్పులతో కలిపి ఆ సిద్ధాంతాన్ని లెనినిజమ్ లేదా మార్క్స్సిజమ్-లెనినిజమ్ అని అంటారు.
9.స్టాలిన్ - కమ్యూనిజం (1879-1953) 
రాజ్యరహిత సమాజం
Stalin's Legacy of Statelessness)
Joseph Stalin

10.మావొ - (1893 - 1976) *కమ్యూనిజం
( సాంస్కృతిక విప్లవం )

CONCEPT ( development of human relations and human resources )