Showing posts with label 47.తెలుగు కవులు తెలుగు భాష. Show all posts
Showing posts with label 47.తెలుగు కవులు తెలుగు భాష. Show all posts

30.12.24

47.తెలుగు కవులు తెలుగు భాష

ఆంధ్ర భోజునిగా, కన్నడ రాజ్య రమారమణగా కీర్తించబడిన శ్రీ కృష్ణదేవ రాయలు తెలుగు భాషకు దేశ భాషలందు ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా పలికిన పలుకులు ఇవి.

ప్రపంచ తెలుగు మహాసభల సందర్భముగా విడుదలైన తపాలా బిళ్ళ - ఇందులో వ్రాసినవి - దేశ భాషలందు తెలుగు లెస్స, "ఎందరో మహానుభావులు అందరికీ వందనములు" ," పంచదార కన్న పనస తొనల కన్న కమ్మని తేనె కన్న తెలుగు మిన్న"

“ తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను

తెలుగు వల్లభుండ తెలుగొకండ

ఎల్ల నృపులు గొలువ ఎరుగవే బాసాడి

దేశ భాషలందు తెలుగు లెస్స ”

—శ్రీ కృష్ణదేవ రాయలు

తెలుగు గుణింతం

క కా కి కీ కు కూ కృ కౄ కె కే కై కొ కో కౌ కం కః🍮 

ఖ ఖా ఖి ఖు ఖు ఖూ ఖృ ఖౄ ఖె ఖే ఖై ఖొ ఖో ఖౌ ఖం ఖః🌹 

గ గా గి గీ గు గూ గృ గౄ గె గే గై గొ గో గౌ గం గః@ 

ఘ ఘా ఘి ఘీ ఘు ఘూ ఘృ ఘౄ ఘె ఘే ఘై ఘొ ఘూ ఘౌ ఘం ఘః 

చ చా చి చీ చు చూ చృ చౄ చె చే చై చొ చో చౌ చం చః 

ఛ ఛా ఛి ఛీ ఛు ఛూ ఛృ ఛౄ ఛె ఛే ఛై ఛొ ఛో ఛౌ ఛం ఛః 

జ జా జి జీ జు జూ జృ జౄ జె జే జై జొ జో జౌ జం జః 

ఝ ఝా ఝి ఝీ ఝు ఝూ ఝృ ఝౄ ఝె ఝే ఝై ఝొ ఝూ ఝౌ ఝం ఝః ట టా టి టీ టు టూ టృ టౄ టె టే టై టొ టో టౌ టం టః 

ఠ ఠా ఠి ఠీ ఠు ఠూ ఠృ ఠౄ ఠె ఠే ఠై ఠొ ఠో ఠౌ ఠం ఠః 

డ డా డి డీ డు డూ డృ డౄ డె డే డై డొ డో డౌ డం డః 

ఢ ఢా ఢి ఢీ ఢు ఢూ ఢృ ఢౄ ఢె ఢే ఢై ఢొ ఢో ఢౌ ఢం ఢః 

ణ ణా ణి ణీ ణు ణూ ణృ ణౄ ణె ణే ణై ణొ ణో ణౌ ణం ణః 

త తా తి తీ తు తూ తృ తౄ తె తే తే తొ తో తౌ తం తః 

థ థా థి థీ థు థూ థృ థౄ థె థే థై థొ థో థౌ థం థః 

ద దా ది దీ దు దూ దృ దౄ దె దే దై దొ దో దౌ దం దః ధ ధా ధి ధీ ధు ధూ ధృ ధౄ ధె ధే ధై ధొ ధో ధౌ ధం ధః 

న నా ని నీ ను నూ నృ నౄ నె నే నై నొ నో నౌ నం నః

ఫ, ఫా, ఫి, ఫీ, ఫు, ఫూ, ఫె, ఫే, ఫై, ఫొ, ఫో, ఫౌ, ఫం, ఫః

తెలుగు భాషకు కవిత్రయం తిక్కన, వేమన, గురజాడ. శ్రీ శ్రీ 

తిక్కన లేదా తిక్కన సోమయాజి (1205 - 1288). 

విక్రమసింహపురి (నేటి నెల్లూరు ప్రాంతాన్ని) పరిపాలించిన మనుమసిద్ధికి మంత్రిత్వంవహించారు. కవిత్రయములో తిక్కనది నాటకీయ శైలి, సంభాషణాత్మక శైలి. అతనికి "కవి బ్రహ్మ", "ఉభయ కవిమిత్రుడు" అనే బిరుదులు ఉన్నాయి.

ద్రౌపది కీచకునితో

దుర్వారోద్యమ బాహువిక్రమ రసాస్తోక ప్రతాపస్ఫురత్

గర్వాంధ ప్రతివీర నిర్మథన విద్యాపారగుల్ మత్పతుల్

గీర్వాణాకృతు లేవు రిప్డు నిను దోర్లీలన్ వెసంగిట్టి గంధర్వుల్ మానము బ్రాణమున్ గొనుట తధ్యంబెమ్మెయిన్ గీచకా


వేమన 

అల్పుడెపుడు బల్కు నాడంబరముగాను

సజ్జనుండు పలుకు చల్లగాను

కంచుమ్రోగినట్లు కనకంబుమ్రోగునా

విశ్వదాభిరామ వినురవేమ.

పద్యము తెలుగు కవితా రచనలో ఒక విధానము. పూర్వం తెలుగులో సాహిత్యరచన దాదాపుగా అంతా పద్యరూపంలోనే జరిగేది. పద్యంలోని ముఖ్య లక్షణం ఛందస్సు. వైజ్ఞానిక రచనలు, గణిత రచనలు, సాహిత్యపరమైన రచనలు మొదలుకొని అనేకానేకమైన విధాలైన రచనలు కూడా పద్యాల్లో ఉండేవి.


పుత్తడి బొమ్మ పూర్ణమ్మ గురజాడ అప్పారావు రచించిన కరుణ రసాత్మక గేయం. ఈ గేయ ఇతివృత్తం కన్యాశుల్కం అనే దురాచారం. నాటి సమాజంలోని కన్యాశుల్కం దురాచారానికి బలి అవుతున్న బాలికల పట్ల అత్యంత కరుణతో, వారికి సమాజం చేస్తున్న దురన్యాయాన్ని కళ్ళకు కట్టే ఉద్దేశంతో అటువంటి చిన్నారి బాలికలకు ప్రతినిధిగా పూర్ణమ్మ అనే పాత్రను సృష్టించి కథనాత్మక మైన కావ్యంగా, అత్యంత కరుణరస ప్లావితమైన రసభరితమైన గేయంగా పూర్ణమ్మ కథ పేరుతో ఈ రచన చేసారు గురజాడ. ‘పుత్తడిబొమ్మా పూర్ణమ్మా’అంటూ అందచందాల రాశిపోసిన ముగ్ధ అయిన ఓ కన్య బ్రతుకు, మూఢాచారానికి బలయిన తీరును ఈ కథలో వివరించారు గురజాడ.ఇది కన్యాశుల్కం ద్వారా చిన్న వయసులోనే ధనం ఆశతో పిల్లల్ని ముసలి వరులకు తండ్రులు పెళ్ళిచేయడాన్ని ఇతివృత్తంగా రచించింది.

పద్యం ఒక తెలుగు సాహితీ ప్రక్రియ. పద్యాలు వృత్తాలు కావొచ్చు, జాతులు కావొచ్చు, ఉపజాతులు కావొచ్చు. ఉత్పలమాల, చంపకమాల, శార్దూలము, మత్తేభము, మున్నగునవి వృత్తాలు. కందము, ఉత్సాహ, ద్విపద, తరువోజ, అక్కర, మున్నగునవి జాతులు. సీసము, తేటగీతి, ఆటవెలది అనునవి ఉపజాతులు.

848 నాటి పండరంగుని అద్దంకి శాసనములో ఒక తరువోజ పద్యమూ, తరువాత కొంత వచనమూ ఉన్నాయి. 934 నాటి యుద్ధమల్లుని బెజనాడ శాసనములో ఐదు సీస పద్యాలున్నాయి. 1000 ప్రాంతమునాటిదని చెప్పబడుతున్న విరియాల కామసాని గూడూరు శాసనములో మూడు చంపకమాలలు, రెండు ఉత్పల మాలలు వ్రాయబడ్డాయి. వీటి ఆధారాల కారణంగా నన్నయకు ముందే పద్య సాహిత్యం ఉండి ఉండాలని నిశ్చయంగా తెలుస్తున్నది. కాని లిఖిత గ్రంధాలు మాత్రం ఇంతవరకు ఏవీ లభించలేదు.