Showing posts with label Bhaskarudu. Show all posts
Showing posts with label Bhaskarudu. Show all posts

Bhaskarudu, varahamihirudu

భాస్కరాచార్యుడు మరియు వరాహమిహిరుడు

భాస్కరాచార్యుడు

భాస్కరుడు సా.శ. 1114 సంవత్సరంలో మహారాష్ట్రలోని విజ్జదిత్ (విజ్జలబిడ / విజయపురం) అనే గ్రామంలో జన్మించాడు. భాస్కరుడు బ్రాహ్మణుడు, శాండిల్య గోత్రజుడు. మహేశ్వరుని తనయుడు, మనోరధుడి మనుమడు. ఇతని గ్రంథాలలో వైష్ణవ ప్రార్థనలు కనిపించుటవల్ల కొందరు ఇతడిని వైష్ణవుడని పేర్కొన్నారు.

చిన్నప్పటి నుండే గణితంలో అనేక పరిశోధనలు ప్రారంభించాడు. ప్రపంచప్రఖ్యాతి పొందడానికి కారణమైన ఒక విశేష సంఘటన ఉంది. భాస్కరుడు జ్యోతిష్యంలో కూడా ప్రావీణ్యం కలవాడు. కుండలలో నీరు, ఇసుక వేసి క్రింద చిన్న రంధ్రాల ద్వారా పడే చుక్కల సమయాన్ని బట్టి ముహూర్తాలు నిర్ణయించేవాడు.

తన కుమార్తె లీలావతి పెళ్లి కొరకు శుభముహూర్తం నిర్ణయించాడు. కానీ ఒక రోజు లీలావతి ఆడుకుంటూ ఉండగా ముక్కుపుడకలోని ముత్యం పై కుండలో పడింది. ఆ ముత్యం రంధ్రానికి అడ్డుపడి నీటి చుక్కల లెక్క మారింది. ఫలితంగా నిర్ణయించిన ముహూర్తం తప్పిపోయింది. పెళ్లైన కొద్దికాలానికే లీలావతి భర్త మరణించాడు.

ఈ దుఃఖం నుండి బయటపడేందుకు భాస్కరుడు లీలావతికి గణితం నేర్పించాడు. తాను కూడా గణితంపై తీవ్ర పరిశోధనలు కొనసాగించి ఎన్నో కొత్త సూత్రాలు, ప్రక్రియలు కనుగొన్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి పొందాడు. తన కుమార్తె పేరు మీదే ప్రసిద్ధ గ్రంథం లీలావతి రచించాడు.

భాస్కరుని వంశ వృక్షము

త్రివిక్రమ → భాస్కరభట్ట → గోవింద → ప్రభాకర → మనోరధ → మహేశ్వర → భాస్కరాచార్య → లక్ష్మీధర

సనాతన భారతదేశం కన్న గణిత శాస్త్రవేత్తలలో భాస్కరాచార్యుడు చిరస్మరణీయుడు. ఇప్పటికీ ఇతను కనుగొన్న కొన్ని గణిత సూత్రాలు పాశ్చాత్య శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తున్నాయి. బీజగణితం, గ్రహగణితం వంటి విభాగాల్లో అతని సేవలు విశేషమైనవి.


వరాహమిహిరుడు

వరాహమిహిరుడు సా.శ. 499 ప్రాంతంలో జీవించిన ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త. చంద్రగ్రహణం, సూర్యగ్రహణం రాహు, కేతువుల వల్ల కాక భూమి నీడ కారణంగా జరుగుతాయని వివరించాడు. తోకచుక్కలు మరియు వాటి రకాల గురించి కూడా తెలిపాడు.

అనేక సందర్భాలలో గర్గ, పరాశర, కశ్యప, బృగు, వసిష్ట, మను, మయ వంటి ప్రాచీన ఋషులను ప్రస్తావించాడు. దీనివల్ల ఆయన పరిశీలనాత్మక దృష్టి, వినయ సంపత్తి తెలుస్తాయి.


హిందూ కాలగణన (Hindu Calendar)

హిందూ కాలగణన కాలక్రమేణా అనేక మార్పులు చెందింది. ప్రస్తుతం వివిధ ప్రాంతీయ విధానాలు ఉన్నాయి. అధికంగా ఈ కాలగణన సూర్య సిద్ధాంతం ఆధారంగా ఉంది. ఇది సుమారుగా సా.శ. 3వ శతాబ్దంలో ప్రామాణిక రూపం పొందినట్లు భావిస్తున్నారు.

వేదాంగాలలో ఒకటైన జ్యోతిష శాస్త్రంలో హిందూ కాలగణనకు ప్రత్యేక స్థానం ఉంది.

CONCEPT ( development of human relations and human resources )