కుల సమస్య- భారత ప్రజాస్వామిక విప్లవం
(పీపుల్స్ వార్ గ్రూప్ సంస్థాపకులు కామ్రేడ్ కొండపల్లి సీతారామయ్య రచన, ‘వ్యవసాయ విప్లవం’ పుస్తకం నుండి, "కుల సమస్య- భారత ప్రజాస్వామిక విప్లవం" అనే వ్యాసం)
భారత ప్రజాతంత్ర విప్లవంలో కులాల సమస్య ఒక ప్రత్యేక సమస్య. ఐరోపాలో జరిగిన ప్రజాతంత్ర విప్లవంలో (19వ శతాబ్దంలో) ఈ సమస్య ఏ రూపంలోనూ తలెత్తలేదు. కానీ మన దేశంలో ఉన్న ప్రజానీకమంతా ఈనాడు వివిధ వర్గాల క్రింద ఎలా విభజింపబడ్డారో, అలాగే వివిధ కులాల క్రింద కూడా వారు విభజింపబడి ఉన్నారు. ఇది కాదనలేని యదార్థం. అందువల్ల మనం కళ్ళు మూసుకొని ముందుకు పోతున్నా ఏదో ఒక రూపంలో కులాల సమస్యలు ఎదురవుతూ వస్తాయి. అందువల్ల ఆ సమస్యల యెడల జనరల్ గానూ, నిర్దిష్టంగానూ కూడా విప్లవకారులకు స్పష్టమైన వైఖరి ఉండాల్సిందే. మనం ఈ కుల సమస్యకు సంబంధించిన ఈ కింది అంశాలను పరిశీలించడం అవసరం:
1) మన దేశంలో కుల సమస్య స్వభావము, అందుకు పరిష్కారము.
2) వర్గపోరాటం పైనా, సామాజిక అభివృద్ధి క్రమం పైనా, ఆ సమస్య యొక్క అనుకూల, వ్యతిరేక ఫలితాలు ఏమిటి?
3) వెనకబడ్డ, షెడ్యూల్డ్ (నిమ్న) కులాలపై సాగుతున్న సాంఘిక దురంతాలను, జనరల్ కుల సమస్యతో ముడిపెట్టి ఉపేక్షించడం ఎంతవరకు సబబు?
4) యాదృచ్చికంగా ఎదురయ్యే కుల సమస్యల యెడల మనం ఎలాంటి వైఖరి తీసుకోవాలి?
5) ఈ సమస్యపై రివిజనిస్టు వైఖరి, విప్లవకారుల (మార్క్సిస్టు-లెనినిస్టు) వైఖరుల మధ్య గల తేడా ఏమిటి?
6) ఈ సమస్యకు సంబంధించి రివిజనిస్టు పీరియడ్ లోని ఆచరణ యొక్క పర్యావరణం ఏమిటి?
ఒక్కొక్క విషయాన్నే తీసుకుందాం.
మన దేశంలో కుల వ్యవస్థ చాలా పురాతనమైనది. అది చాలా పవిత్రమైనదిగానూ భారతీయ సంస్కృతి యొక్క విశిష్టత గానూ బోధిస్తూ, దాన్ని చెక్కుచెదరకుండా కాపాడాలని కంకణం కట్టుకున్న వారు ఇప్పటికీ ఎంతోమంది ఉన్నారు. కుల వ్యవస్థ గూర్చి ఎవరికి ఎలాంటి అభిప్రాయాలున్నా అది మార్పుకు అతీతమైనది కాదు, ఆది మధ్యాంత రహితమయిందీ కాదు. ప్రకృతిలోని అన్ని విషయాలలో లాగానే కుల వ్యవస్థకు కూడా పుట్టుక, అభివృద్ధి, అంతము ఉండి తీరాలి. సామాజిక అభివృద్ధి క్రమంలోని కొన్ని చారిత్రిక, భౌగోళిక కారణాల వల్ల ఐరోపాల కంటే పటుతరమైన పునాదులతో మన దేశంలో గ్రామీణ వ్యవస్థ ఏర్పడింది. ఆ వ్యవస్థ యొక్క అభివృద్ధి క్రమంలో జీవితావసరాలు ఉత్పత్తి కొరకు ప్రజల మధ్య జరిగిన శ్రమ విభజన వంశపారంపర్యంగా కొనసాగి, క్రమంగా ఒక్కొక్క వృత్తికి చెందిన వారు ఒక్కొక్క కులంగా రూపొందారు. ఆ పిమ్మట శాఖోపశాఖలు గానూ, క్లిష్టతరమైనదిగానూ ఆ కుల వ్యవస్థ రూపొందడానికి ఎన్ని తదితర భౌతిక కారణాలు ఉన్నా, అసలది ఆవిర్భవించడానికి భారతీయ గ్రామీణ వ్యవస్థ యొక్క ఉత్పత్తి క్రమంలో ప్రజల మధ్య ఏర్పడిన శ్రమ విభజనే మూలం. ఫ్యూడలిజం మనదేశంలో చాలా దీర్ఘకాలం కొనసాగి సామాజిక అభివృద్ధి స్తంభించిపోగా, అలా రూపొందిన కులవ్యవస్థ పోను పోను అనేక వెర్రితలలు వేసి క్లిష్టతరమైందిగా తయారయింది. ఫ్యూడల్ ఆర్థిక విధానం సమూలంగా నశించి, పెట్టుబడిదారీ ఆర్థిక విధానం అభివృద్ధి చెందే క్రమంలో, మానవుల మధ్య శ్రమ విభజనలో కొత్త పద్ధతి ఆరంభమవుతుంది. యంత్ర అభివృద్ధికీ యంత్ర నిర్వహణకూ అనుకూలంగా ఆ విభజన ఉంటుంది. ఒకే కుటుంబానికి చెందిన ఒకరు డ్రైవర్ కాగా, అదే కుటుంబానికి చెందిన మరొకరు అదే ఫ్యాక్టరీలో పద్దులు రాసే గుమస్తాగా ఉండొచ్చు. అంటే కుటుంబమంతా ఒకే వృత్తికి పరిమితం కావటం అంతరిస్తుంది. అది ఎప్పుడు అంతరిస్తుందో, అప్పుడే ఒకే వృత్తి చేసే వారంతా ఒకే కులం అనే వ్యవస్థకు ఆధారంగా ఉన్న భౌతిక పునాది కూడా దెబ్బ తిని పోతుంది. అంతేకాదు, యంత్రాలతో ఉత్పత్తి ఆరంభమైన తర్వాత, ఫ్యూడల్ ఆర్థిక విధానంలో లాగా ఒక పని సంపూర్ణంగా ఒకరే చేయగల పరిస్థితి కూడా అంతరిస్తుంది. ఉదాహరణకు, ఫ్యూడల్ సమాజం లో బట్టలు ఉత్పత్తి చేసే చేనేత కార్మికునికి పడుగు పన్నడం దగ్గర నుండి బట్టలు నేయడం పూర్తయ్యే వరకు చేయవలసిన పని విధానమంతా ఆమూలాగ్రంగా తెలుసు. అలాగే, ఒక ఇనుప పనిముట్టును చేయవలసిన ఆనాటి కమ్మరికి, ఇనుము కరిగించడం నుండి ఆ పనిముట్టు పూర్తి చేసే వరకు అవసరమైన సంపూర్ణ జ్ఞానం ఉంది. కానీ యంత్రాలతో ఉత్పత్తి ఆరంభమైన తర్వాత, యంత్ర చలనానికి అనుగుణంగా ప్రతి ఒక్క పని భిన్న భిన్న భాగాలుగా విభజింపబడి, అందులో పనిచేసే వారు ఒక్కొక్కరికి ఆ ప్రత్యేక విభాగానికి సంబంధించిన జ్ఞానం మాత్రమే ఉండి, మొత్తం ఆ వస్తువు తయారవడానికి అవసరమైన సంపూర్ణ జ్ఞానం ఏ ఒక్కరికి లభ్యం కాని స్థితి ఏర్పడుతుంది. వెల్డర్ చేయవలసిన పని ఫిట్టర్ కు తెలియదు. ఫిట్టర్ చేయవలసిన పని మరొకరికి తెలియదు. వారందరి శ్రమ కలిస్తే గాని విలువలు సంతరించుకునే ఏ సరుకూ తయారు కాదు. ఆ విధంగా ఫ్యూడల్ ఆర్థిక విధానం స్థానే పెట్టుబడిదారీ ఆర్థిక విధానం అమల్లోకి వచ్చే క్రమానికి అనుగుణంగా శ్రమ విభజన బహుముఖంగా విస్తరించింది. ఒకే కులం వారందరికీ ఒకే పని విభజన అనే సంగతి అలా ఉంచి, ఒకే కుటుంబం వారందరికీ ఒకే రకమైన శ్రమ విభజన అనేదానికి కూడా ఆస్కారం లేకుండా పోయి, కుల వ్యవస్థ ఆవిర్భవించడానికి గల భౌతిక పునాది శిధిలమై పోతుంది. పెట్టుబడిదారి విధానం అభివృద్ధి చెందిన తర్వాత కూడా కులవ్యవస్థ అవశేషాలు మిగిలి ఉండొచ్చు. అయితే పెట్టుబడిదారులు తమ స్వప్రయోజనాలు సాధించుకోవడానికి అవి ఉపకరిస్తాయి. కానీ కుల వ్యవస్థ యొక్క అస్తిత్వానికి గల పునాది రద్దు కావడంతో, పెట్టుబడిదారీ విధానం అమలులో ఉన్న దశలోనే అది దుర్బలమై, చివరకు సోషలిస్టు సమాజంలో వర్గాలు సమూలంగా రద్దయి, ఉత్పత్తి మరింత కేంద్రీకృతమై మానవుల మధ్య శ్రమ విభజన మరింత ఉన్నత స్థాయి అందుకోగా, దాని అవశేషాలు సైతం సమూలంగా అంతరించడం అనివార్యం. ఇది కుల వ్యవస్థ యొక్క ఆద్యంతాల పరిణామ క్రమం. దీన్ని అనుసరించి పీడిత ప్రజలందరిలోనూ కుల చైతన్యం స్థానే వర్గ చైతన్యాన్ని పెంపొందింప జేసి, వర్గ పునాదులపై వారిని సంఘటితపరిచి, కార్మికవర్గ నాయకత్వం క్రింద జనతా ప్రజాతంత్ర విప్లవాన్ని విజయవంతం చేయడంలో భాగంగానే కుల సమస్య పరిష్కారమవుతుందని బోధపడుతుంది. కుల వ్యవస్థకూ దాని పరిష్కారానికీ సంబంధించి మనకున్న జనరల్ అవగాహన ఇది.
ఇక రెండో విషయానికి - అంటే వర్గపోరాటం పైనా, సామాజిక అభివృద్ధి క్రమం పైనా ప్రభావం ఏమిటి? అనేదానికి వద్దాం.
ఒకప్పుడు ఈ వ్యవస్థ, సామాజిక ఉత్పత్తి క్రమంలో ఒడిదుడుకులు లేకుండా కొనసాగడానికీ, అభివృద్ధి చెందడానికీ తోడ్పడి ఉండవచ్చు, తోడ్పడింది కూడా. లేకుంటే ఆ వ్యవస్థ ఆవిర్భవించడానికి ఆస్కారం లేదు. కానీ ఈ నాడు అది ఆ పాత్రను కోల్పోయింది. మానవ సమాజం యావత్తూ ఈ రోజు సరుకుల ఉత్పత్తి విధానం లోనే, అంటే పెట్టుబడిదారీ ఆర్థిక విధానంలోనే, జీవిస్తోంది. మన దేశంలో ఇప్పటికీ ఫ్యూడలిజం బలమైన శక్తిగా ఉన్నప్పటికీ, పెట్టుబడిదారీ విధానం ఇంకా తగినంతగా బలపడక ఈనాటికీ మనది వ్యవసాయక దేశం గానే ఉన్నప్పటికీ, అర్ధ వలస దేశంగా మనం సరుకుల ఉత్పత్తి విధానం లోనే మునిగితేలుతున్నాం. అందుమూలంగా ఉత్పత్తిని పెంపొందించడానికి సాధనంగా ఉపకరించగల పాత్రను కులవ్యవస్థ ఈనాడు కోల్పోతోందని చెప్పవచ్చు. కులవృత్తులు ఈనాటికీ మిగిలి ఉన్నా, అవి పెట్టుబడిదారీ మార్కెట్ పోటీ ధాటికి నిలువలేక నీరసించి పోతూనో, జీవచ్ఛవాలుగా మనగలుగుతూనో, మిగిలి ఉన్నాయి. కుల వ్యవస్థ ఈనాడు సామాజిక అభివృద్ధికి ఆటంకంగానే తయారైంది. వర్గ పోరాటంలో పీడిత ప్రజలందరినీ సంఘటిత పరచడానికి ఆది కొంతవరకు అవరోధంగా తయారయింది అనడం అతిశయోక్తి కాదు. అలాగే కుల దురహంకారం రెచ్చగొట్టడం ద్వారా పీడిత ప్రజలలో విభేదాలు పెంచి చీల్చడానికి దోపిడీ వర్గాల చేతిలో ఈనాడది ఒక బలమైన సాధనంగా కూడా ఉపకరిస్తోంది.
జాతీయోద్యమం పురోగమిస్తున్నప్పుడల్లా మన దేశంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదులు హిందూ ముస్లిం గలాటాలను రేపి జాతీయ సమైక్యతను ఎలా దెబ్బ కొట్ట ప్రయత్నించారో, అలాగే ఈనాడు వర్గ పోరాటాలు తీవ్రతరం అయినప్పుడల్లా పీడిత ప్రజల సమైక్య ప్రతిఘటన శక్తిని దెబ్బ కొట్టడానికి గాను ఒకవైపు కుల దురహంకారాలను రెచ్చగొట్టడం ద్వారానూ, మరోవైపు వెనకబడ్డ కులాల సంక్షేమం లాంటి దగుల్బాజీ కార్యక్రమాలతో భ్రమలు రేకెత్తించి పోరాటం పట్ల వారిలో ఉదాసీనత పెంపొందించడం ద్వారానూ, పాలకవర్గాలు పడరాని పాట్లు పాడడం మనం చూస్తూనే ఉన్నాము. అందువల్ల జనరల్ గా కుల వ్యవస్థ ఈనాడు అభివృద్ధి నిరోధక పాత్రే వహిస్తోంది. అభివృద్ధికర పాత్రను శాశ్వతంగా అది కోల్పోయింది.
ఇక మూడవ అంశానికి వద్దాం. ఈ సందర్భంగా, వెనకబడ్డ, షెడ్యూలు కులాలపై కొనసాగుతున్న సాంఘిక దురంతాలను జనరల్ గా కుల వ్యవస్థతో ముడిపెట్టి, ప్రజాతంత్ర సమాజ స్థాపనతో పాటు వాటంతట అవిగానే ఆ దురంతాలు నశిస్తాయని ఉపేక్షించడం సరి అయినదా, కాదా అనేది ప్రస్తుతాంశం. అలా ఉపేక్షించరాదనీ, ఆ దురంతాలను ప్రతిఘటించడానికి ఆయా కులాలకు చెందిన వారిని సంఘటిత పరిచి పార్టీ నాయకత్వం వహించాలనీ, ఆ పోరాటానికి మద్దతుగా అగ్రకులాల అనబడే వాటికి చెందిన పీడిత ప్రజలను సైతం సమీకరించి ప్రయత్నించాలనీ, ఆ డాక్యుమెంట్ స్పిరిటు. పీడిత ప్రజలందరినీ వర్గ పునాదులపై సంఘటిత పరచడానికి అలాంటి సమీకరణ పెద్దగా తోడ్పడుతుంది. ఎన్ని కులాలు కింద విభజింపబడినా పీడితులు అంతా ఒకటేననీ, ఒకరినొకరు ఆదుకోవడానికి పూనుకోవటం ద్వారానే భూస్వాముల దౌర్జన్యాలనూ దోపిడీనీ ఎదుర్కోగలమనీ వారంతా భావిస్తారు. అలాగే వర్గ చైతన్యమూ, సంఘటిత శక్తీ, వారిలో పెంపొందుతుంది. కేవలం ఆర్థిక సమస్యలపై జరిగే పోరాటమే వర్గపోరాటమని భావించటం గాని, సాంఘిక సమస్యలనూ ఆర్థిక సమస్యలనూ యాంత్రికంగా విడదీసి చూడటం గాని, సరి అయింది కాదు. మన దేశంలోని కులవ్యవస్థ స్వభావాన్ని అనుసరించి కులాల సమస్య సారాంశంలో ఈనాడు వర్గ సమస్యయే. మన రాజకీయ తీర్మానాన్ని, అవగాహనను అనుసరించి, ప్రస్తుతం మన సమాజంలో కొనసాగుతున్న వివిధ వైరుధ్యాలలో చూడాలి. దానికి విశాల జనసామాన్యానికి మధ్య వైరుధ్యం ప్రధానమైనది. ఈ వైరుధ్యం కులాల రూపంలో ఎలా ప్రతిబింబిస్తుందో చూద్దాం. రైతాంగంలో ఫ్యూడల్ భూస్వాములు గానీ, పెట్టుబడిదారీ భూస్వాములు గానీ, సగటున ఆరు, ఏడు శాతానికి మించి ఉండరు. నేటి కులాల ప్రకారం నూటికి 90 కి పైగా భూస్వాముల కుటుంబాలు అగ్రకులాలు అని చెప్పబడే బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, రెడ్డి, కమ్మ, వెలమ కులాలకు చెందినవే. అలాగే వెనుకబడిన కులాలు అని చెప్పబడే యాదవ, చాకలి, మంగలి, పెరిక, గౌడ, మున్నేటి కాపు వగైరా కులాలకూ, షెడ్యూల్ కులాలుగా పిలువబడుతున్న మాల, మాదిగ, నేతగాని, వగైరా కులాలకూ చెందిన కుటుంబాలు నూటికి తొంభై కి మించి కేవలం నిరుపేద రైతులు, వ్యవసాయ కూలీలు. అందులో ప్రత్యేకించి హరిజనులలో నూటికి 95 కుటుంబాలకు పైగా కేవలం వ్యవసాయ కూలీలుగానే జీవిస్తున్నారు. అందువల్ల కుల ప్రాతిపదికపై చూస్తే ప్రజాస్వామిక విప్లవానికి, వ్యవసాయ విప్లవం, అగ్రకులాలు అనబడే వాటికీ, వెనకబడిన కులాల అనబడే వాటికీ మధ్యనే కొనసాగుతుందని బోధపడుతుంది. అందుకనే ప్రపంచమంతటా జాతుల సమస్య ఎలా సారాంశంలో వర్గ సమస్యయో. అలా మన దేశంలో కుల సమస్య కూడా సారాంశంలో వర్గ సమస్యయే. అయితే బహిరంగంగా, ప్రజాస్వామిక విప్లవమన్నా, వ్యవసాయక విప్లవమన్నా, అగ్రకులాలకు వ్యతిరేకంగా వెనుకబడిన కులాలు చేయవలసిన విప్లవమేనని సూటిగా ఎందుకు సిద్ధాంతీకరించరాదు. అలాంటి పిలుపు ఇవ్వకూడదు. భూస్వాములలో 90శాతం అగ్రకులాలు అనబడే వాటికి చెందియున్నారే గాని, ఆ కులాలకు చెందిన మొత్తం ప్రజానీకంలో అత్యధికభాగం ఏదో ఓ రూపంలో భూస్వాముల దోపిడికీ, లేదా అణిచివేతకూ, గురి అవుతున్న వారే అనే విషయాన్ని ఎంత మాత్రమూ మరవరాదు. అలాగే వెనుకబడిన కులాలు అనబడే వాటిలో కూడా 90% నిరు పేద రైతులూ వ్యవసాయ కూలీలూ అయినా, అందులో నూటికి ఏ ఒకరిద్దరో భూస్వాములు కాని, దళారి లేదా బ్యూరాక్రటిక్ వర్గాలకు చెందిన వారు గాని, లేక పోలేదు. పనికట్టుకుని పాలకవర్గాలు వెనుకబడిన కులాలలో అలాంటి ఏజెంట్లను సృష్టిస్తున్నాయి. పీడిత వర్గాలను చీల్చడానికి పాలకవర్గాలకు సులువైన పద్ధతులలో ఇది ఒకటి. ముసలయ్యలూ, సంజీవయ్యలూ, జగ్జీవన్ రామ్ లూ అలాంటి బాపతే. నూటికి ఇద్దరో ముగ్గురో హరిజనుల నుండి తయారయ్యే పెద్దపెద్ద ఆఫీసర్లూ, కాంగ్రెస్ సంస్థ నాయకత్వ స్థానాల్లోకి శాసనసభ స్థానాల్లోకి ఆ కులాల నుండి పాలకవర్గాలు పనిగట్టుకుని నెట్టుకొని వస్తున్న వారూ - అంతా అలాంటి సరుకే. వెనుకబడిన కులాల ఉద్ధరణ గూర్చి ఎన్ని చిలక పలుకులు పలికినా, అలాంటి వారంతా ఆచరణలో పాలకవర్గాల ఏజెంట్లుగానూ, ఈనాటి అర్థ ఫ్యూడల్, అర్ధ వలస సమాజాన్ని చెక్కుచెదరకుండా యథాతథంగా సంరక్షించేందుకు నమ్మకమైన బంటులుగానూ ఉపకరిస్తున్నారు. ఇది మన కళ్ళముందు కనిపిస్తున్న యదార్థం. అందువల్ల వ్యవసాయ విప్లవం అగ్రకులాలు అనబడే వాటికీ, వెనకబడ్డ కులాల అనబడే వాటికీ మధ్య జరుగుతున్న విప్లవం కాదు. అగ్ర కులాలు అనబడే వాటికి చెందిన పీడిత రైతాంగాన్నీ, వ్యవసాయ కూలీలనూ తమ వెనక నిలబెట్టుకోవడానికి వీలుగా భూస్వాములు మాత్రమే అటువంటి నిర్వచనం ఇవ్వగలరు. పీడిత రైతాంగాన్ని చీల్చడం అనే కుట్రలో అటువంటి ప్రచారం ఒక భాగం మాత్రమే.
ఈ విషయాన్ని మరో వైపు నుండి కూడా చూద్దాం.
ప్రజాస్వామిక విప్లవం లో మధ్య తరగతి రైతులు మిత్రులనీ, ధనిక రైతులను తటస్థం చేయాలనీ మన వ్యూహం. అయితే నూటికి 90 మందికి పైగా ధనిక రైతులు, మెజార్టీ మధ్య తరగతి రైతులు అగ్రకులాలు అనబడే వాటికి చెందియున్నారు. కాబట్టి వ్యవసాయ విప్లవాన్ని అగ్రకులాలకు వ్యతిరేకంగా భావించడం ఎంత తప్పో, అగ్రకులాలు అనబడే వాటికి చెందిన భూస్వాములు వెనుకబడిన కులాలపై కొనసాగించే సాంఘిక దురంతాలను ఎదుర్కొనడంలో వెనుకంజ వేయడం కూడా అంతకంటే పెద్ద తప్పు. తరతరాలుగా బానిసలుగా జీవించడానికి అలవడ్డ కారణంగా ఇంతవరకూ ఎన్నో సాంఘిక దురాచారాలకు వారు తలవొగ్గి జీవిస్తున్నప్పటికీ, వారిలో వర్గ చైతన్యం, విప్లవ చైతన్యం పెంపొందే కొద్దీ, కేవలం కూలి రేట్లు, పాలేళ్ళ జీతాలు పెంచడం తోనే సంతృప్తి చెందరు. సాంఘికంగా తాము అందరిలాంటి మనుషులమేననీ, అందరితో సమానంగా బతికే అర్హత తమకు ఉందనీ వారు భావిస్తారు. వారిలో బానిసత్వం స్థానే పెరుగుతున్న వ్యక్తిత్వానికి అది చిహ్నం. అలాంటి వ్యక్తిత్వం పెరగకుండా విప్లవ చైతన్యం పెంపొందడం అసంభవం. వెనకబడిన కులాలు అనబడే వాటికి చెందిన పీడిత ప్రజానీకంలో క్రమంగా పెంపొందే ఆ వ్యక్తిత్వాన్ని అగ్రకులాలు అనబడే వాటిలో ఉన్న పీడిత రైతాంగం సమర్థించేలా మన పార్టీ కృషి చేయాలి. అప్పుడే గ్రామాల్లో భూస్వాములకు వ్యతిరేకంగా నిజమైన పీడిత ప్రజల ఐక్య సంఘటన ఏర్పడుతుంది. వెనుకబడిన కులాలు అనబడే వాటికి చెందిన వారు తెగించి పోరాడడం ద్వారానే అలాంటి పరిస్థితిని సృష్టించగలరు. అందుకు మనం చాలా ఓపికతో కృషి చేయాల్సిన అవసరం ఉన్న మాట వాస్తవమే గానీ, పట్టుదలతో కృషి చేస్తే అగ్రకులాలకు చెందిన పీడిత ప్రజలను అందుకు సంసిద్ధం చేయటం అసంభవమేమీ కాదు. కాబట్టి అగ్రకులాలు అనబడే వారు సాగించే సాంఘిక దురంతాలను ఎదుర్కోవాలనే విషయాన్ని, జనరల్ గా కుల వ్యవస్థ యొక్క అభివృద్ధి నిరోధక పాత్రతో ముడిపెట్టి తప్పించుకో ప్రయత్నించడం పొరపాటు. బలమైన భూస్వామ్య వ్యతిరేక గ్రామీణ పీడిత ప్రజల ఐక్య సంఘటనను నిర్మించడంలో తద్వారా విఫలత చెందుతాం. అందుకే "విప్లవానికి బాట" డాక్యుమెంటులో, మనదేశంలో ప్రజాస్వామిక విప్లవం విజయవంతం అవడానికి దీర్ఘకాలం సాయుధ విప్లవం అని భావించడానికి దారితీసిన పరిస్థితులను వివరిస్తూ ఇవ్వబడిన 11 అంశాలలోని భాగంగా ఎనిమిదో అంశంలో, జాతుల అణచివేతకు తోడు వెనుకబడిన కులాలు, షెడ్యూల్డ్ కులాలకు చెందిన కోట్లాది ప్రజలపై ఈ దేశంలో సాంఘికమైన అణిచివేత కొనసాగుతోంది, వీరిలో అత్యధికభాగం గ్రామీణ కార్మికులు, అర్ధ కార్మికులే, వీరు శతాబ్దాల తరబడి అత్యంత దారుణమైన సాంఘిక అణిచివేతకు గురవుతున్నారు, అని రాయబడింది. ఈ అణచివేత సారాంశంలో వర్గ సంఘర్షణలో భాగమే. దీన్ని జనరల్ కుల సమస్యతో ముడిపెట్టి చూడటం సరికాదు.
ఇక నాలుగో విషయం - యాదృచ్చికంగా ఎదురయ్యే కుల సమస్యల ఎడల మనం ఎలాంటి వైఖరి అవలంబించాలనేది. యాదృచ్ఛికమైనదైనా లేక ప్లాన్ ప్రకారం రెచ్చగొట్టబడింది అయినా, ఆ సమస్య స్వభావం ఏమిటి? దాని వెనక ఉన్న శక్తులేవి? దానినుండి యే యే వర్గాలు ఇలాంటి ప్రయోజనాన్ని పొందనాకాంక్షిస్తున్నాయి ? అనే విషయాల పరిశీలనపై మనం అవలంబించాల్సిన వైఖరి ఆధారపడి ఉంటుంది. కుల దురహంకారాన్ని ఎదుర్కోవడం, మరో కులానికి హాని కలిగించనంతవరకూ వివిధ కులాల ఆచారవ్యవహారాలను పరస్పరం గౌరవించుకునే చైతన్యాన్ని అన్ని కులాలకు చెందిన, ముఖ్యంగా అగ్రకులాలు అనబడే వాటికి చెందిన, పీడిత ప్రజలలో పెంపొందింప చేయడం, ఆయా సమస్యలను రెచ్చగొట్టడానికి వెనుకగల భూస్వాముల వర్గ ప్రయోజనాలను బహిర్గతపరచి వారికి వ్యతిరేకంగా పీడిత ప్రజల్ని సమైక్యం చేయడం- అలాంటి సమస్యల పరిష్కారంలో అవలంబించాల్సిన విధానానికి ప్రాతిపదికగా తీసుకోవాలి. కొన్ని సమస్యలు, అనుకోకుండానే, యాదృచ్ఛికంగానే, వివిధ కులాలకు చెందిన పీడిత ప్రజలలో ఈనాటికీ ఉన్న కుల చాదస్తం మూలంగా ఉత్పన్నం కావచ్చు, మరి కొన్ని సమస్యలు పీడిత ప్రజల సమైక్య ప్రతిఘటన శక్తిని దెబ్బ తీయడానికి భూస్వాములు తలపెట్టే కుతంత్రాలు వల్ల తలఎత్తవచ్చు. ఎలా ఉత్పన్నమైనా మనం ఆ సమస్యలను దాటవేయలేం, చూచి చూడనట్టు నటించలేము. తప్పక వాటిని పరిష్కరించ పూనుకోవాలి. అయితే వైరుధ్యం స్వభావాన్ని బట్టి ఒక్కొక్క వైరుధ్యాన్ని ఒక్కొక్క రీతిలో పరిష్కరిస్తాం. కంచికచర్ల కోటేశును ఏదో ఒక చిన్న సాకుతో పందిరి గుంజకు కట్టి కాల్చిన ఉదంతం కానీ, తమిళనాడులో కీలవేలన్మనిలో మొత్తం మాలపల్లెను క్రూరంగా తగలబెట్టి అనేకమందిని సజీవంగా ఆహుతి చేసిన ఉదంతం గాని అయితే, ఆ సమస్యకు కారకులైన భూస్వాముల దౌర్జన్యాలనూ, ఆ చర్యలకు తలపడటంలో వారి వర్గ ప్రయోజనాలనూ గ్రామీణ పీడిత ప్రజానీకం అంతటిలోనూ బహిర్గతం చేసి, వారందరినీ సంఘటితపరచి, కంటికి కన్ను పంటికి పన్ను రీతిలో ప్రతీకారం తీర్చుకోవడం ద్వారానే ఆ సమస్యను పరిష్కరిస్తాం. కొన్ని గ్రామాలలో ప్రజలు త్రాగటానికి చెరువు నీరు ఉపయోగిస్తారు. వేసవికాలం చెరువులు ఎండిపోయి అచ్చటి ప్రజలు ఒకటి, రెండు నెలలు నీటికి ఎంతో ఇబ్బందికి గురి అవుతారు. ఒకటో రెండో బావులు ఉంటే, అవి వాస్తవానికి పబ్లిక్ బావులే అయినా, అందులో నీరు తోడుకోవడం హరిజనులకు ఆచార రీత్యా నిషిద్ధం కావడంతో, వారి సమస్య మరింత ఇబ్బందిగా తయారవుతుంది. నీరు లేకుండా బ్రతకడం ఇబ్బంది కనుక అలాంటి సమయాలలో తగవులు పెరగటం చాలా తేలిక. పీడిత ప్రజల మధ్య కులతత్వాన్ని రెచ్చగొట్టి తగవులను పెంచి చీల్చడానికి భూస్వాములకు అలాంటి సమయాలు చాలా అనుకూలమైనవి. పీడిత ప్రజలలో కుల వ్యవస్థ పేరుతో గూడుకట్టుకొని ఉన్న మూఢత్వం భూస్వాములకు అలాంటి సమయాల్లో చక్కటి ఆయుధంగా ఉపకరిస్తుంది. అలాంటి సందర్భంలో చెలరేగే అగ్రకులాలు అనబడే వాటికి చెందిన పీడిత ప్రజానీకానికి నచ్చచెప్పడం ద్వారా తాత్కాలిక పరిష్కారంగా హరిజనులందరికీ నీళ్ళు తోడించి పోయించే ఏర్పాటు చేయించడం ద్వారానూ, శాశ్వత పరిష్కారంగా సమిష్టి కృషితో వారికి కూడా ప్రత్యేకంగా బావి ఏర్పాటు చేయడం ద్వారానూ పరిష్కరిస్తాం. తద్వారా పీడిత ప్రజలు చీలిపోకుండా నిలబెట్టి భూస్వాముల కుతంత్రాలు ఫలించ కుండా చేస్తాం.
దీనినే ప్రజల మధ్య వైరుధ్యాలను పరిష్కరించే పద్ధతి అంటాం. ఆ విధంగా యాదృచ్చికంగా గాని, ప్లాన్ ప్రకారం రెచ్చగొట్టడం ద్వారా గాని, ఉత్పన్నమయ్యే సమస్యలన్నింటినీ, భూస్వాములకు వ్యతిరేకంగా పీడిత ప్రజలందరి సమైక్య లక్ష్యంతో పరిష్కరించడం ద్వారా, వ్యవసాయ విప్లవాన్ని ముందుకు తీసుకొని పోవాలి. అంతేగాని చూచి చూడనట్లు సమస్యను వదిలివేయటం కూడదు.
ఇలాంటి సమస్యల ఎడల రివిజనిస్టుల వైఖరికీ విప్లవకారుల వైఖరికీ గల తేడా ఏమిటనేది ఐదవ అంశం. అనేక ఇతర సమస్యలలో మాదిరిగానే రివిజనిస్టులు, ఫారంకు (స్వరూపం, పద్ధతి) ప్రాముఖ్యతనిచ్చి కంటెంటు (విషయం) పట్ల ఉదాసీనత వహిస్తారు. ఇలాంటి సమస్యలేవీ ఎదురైనా అవన్నీ కుల సమస్యలుగా పేర్కొని అసలు సమస్యలలో తల దూర్చకుండా తప్పించుకోడానికి ప్రయత్నిస్తారు. వెనకబడిన కులాల సమస్యలన్నీ సారాంశం లో వర్గ సమస్య లేనన్న యదార్థాన్ని వారు గుర్తించరు. తీరా సమస్య తీవ్రమై భూస్వాములు ఒక పక్షం గానూ, వెనుకబడిన కులాలకు చెందిన వారు మరో పక్షం గానూ చీలిపోయి, అగ్రకులాలకు చెందిన పేద, మధ్యతరగతి వారు కొంతమంది తటస్తులై, మరికొందరు భూస్వాముల పక్షం వహించి, పోరాటం తీవ్రతరమైన స్థితిలో, అగ్రకులాలకు చెందిన రివిజనిస్టులంతా, "హరిజనులు మరీ మితిమీరి పోతున్నారు", "అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు" లాంటి సాకులు చెప్పి, చివరకు భూస్వాముల పక్షం వహిస్తారు. (కమ్యూనిస్టు పార్టీకి బలమైన గ్రామం అనుకున్న చోట యదార్ధంగా జరిగిన సంఘటన). పాలకవర్గాల ఏజెంట్లుగా కార్మిక వర్గ బురఖాలో దూరిన రివిజనిస్టుల పాత్ర వర్గపోరాటం మొత్తంలో ఎలా ఉంటుందో, ఈ సమస్యలోనూ అలాగే ఉంటుంది. అంతిమంగా వారు భూస్వాముల సేవలోనే తరిస్తారు. విప్లవకారులు అలాకాకుండా వెనకబడ్డ కులాలు అనబడే వాటిపై సాంఘికంగా జరుగుతున్న దాడులను సారాంశంలో వర్గ సమస్యలుగానే భావించి, పైన చెప్పిన రీతిలో పరిష్కరించడానికి పూనుకుంటారు. అదే తేడా.
ఇక ఆఖరు విషయం - రివిజనిస్టు పిరియడ్ లో ఈ సమస్యకు సంబంధించిన ఆచరణ పర్యవసానం ఏమిటి? అనేది. ఆంధ్ర రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీ మొదట డెల్టా ఏరియాలోని భూస్వాములు, ధనిక రైతుల కుటుంబాల నుండి వచ్చిన యువకులలో పుట్టింది. వారి నాయకత్వం క్రింద గ్రామీణ యువకులలో ఒక బలమైన శక్తిగా తయారైన తర్వాత వ్యవసాయ కూలీలలోకి, మెట్ట ప్రాంతంలోని రైతాంగంలోకి అది విస్తరించింది. రాయలసీమ, తెలంగాణ ప్రాంతాలకు కూడా పెద్ద పెద్ద భూస్వాముల కుటుంబాలకు చెందిన యువకుల ద్వారానే పార్టీ విస్తరించింది.
రెండో ప్రపంచ యుద్ధం పూర్తి అయ్యేనాటికి (1945) డెల్టా జిల్లాలోని (అప్పట్లో ఆంధ్ర రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీకి అదే గుండెకాయ లాంటిది) హరిజనులలో గమనించదగిన స్థాయిలో ఆదరాభిమానాలు ఏర్పడ్డాయి. అయితే ఆ అభిమానం వెనక, భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా వ్యవసాయ విప్లవంలో తమను శక్తివంతంగా నడిపించగల నాయకత్వం అనే భావం కంటే, ఇంతకు పూర్వం ఆ గ్రామంలో తమను పీడిస్తున్న భూస్వాములతో పోల్చగా వీరు మంచి వారు అనే భావమే హెచ్చు. మంచి విషయాలు చెప్పే బోధకులు గానే వారిలో గౌరవం ఏర్పడింది తప్ప, తమలో ఒకరిగా కానీ, తమకు నిజమైన నాయకులుగా కానీ, వారు ఎన్నడూ భావించలేదు. అందుకు కారణం ఆనాటి హరిజనులలో కమ్యూనిస్టు పార్టీ పట్ల ఏర్పడిన గౌరవం. అచ్చటచ్చట రోజు కూలీ సమస్యల పైనా, పాలేళ్ళ జీతాల పైనా కొన్ని పోరాటాలు నడిపినప్పటికీ, ప్రధానంగా అది పాత భూస్వాములతో పోల్చి చూస్తే వారు అవలంబించిన లిబరల్ ధోరణి మూలంగానూ, జనరల్ సోషలిజాన్ని గూర్చి చేస్తున్న ప్రచారం ద్వారానూ, తదితర సంస్కరణ కార్యకలాపాల ద్వారా ఏర్పడినదే తప్ప, సునిశితమైన వర్గ పోరాటాల ద్వారా ఏర్పడింది కాకపోవటమే. తూర్పుగోదావరి జిల్లా రాజోలు, అమలాపురం తాలూకాలో మాత్రం వ్యవసాయ కూలీలతో కొంతవరకు వర్గ పోరాటాల పునాదిపై అలాంటి సంఘటిత శక్తి ఏర్పడింది. అయితే అచట నాయకత్వంలో ఉన్న చిన్న చిన్న లోపాలను సాకుగా తీసుకుని రాష్ట్ర కమ్యూనిస్టు కమిటీ నాయకత్వం పనిగట్టుకుని ఆ ఉద్యమంలో మిలిటేన్సీని చంపేసే వరకూ నిద్రపోలేదు. తరువాత క్రమంగా భూస్వాములలోని ఒక సెక్షన్ తో కలిసి పోయి, చాలా గ్రామాల్లో కమ్యూనిస్టు పార్టీ మెజార్టీ పార్టీ గానో, లేక బలమైన ప్రత్యర్థి పార్టీ గానో రూపొందింది. అదే కాలానికి వ్యవసాయ కూలీలలో పెంపొందిన చైతన్యం, రివిజనిస్టు నాయకత్వం మూలంగా ఎన్నో పరిమితులకు లోనై ఉన్నప్పటికీ, వారిలో ఎంతో కొంత వ్యక్తిత్వం, సంఘటిత శక్తి పెంపొందడం కూడా నిర్వివాదమైన విషయం. అందువలన గ్రామాలలో వర్గపోరాటాలు కూడా తీవ్రతరం అయినాయి. కానీ అప్పటికే ఒక సెక్షన్ భూస్వాములతో కలిసిపోయిన కమ్యూనిస్టు పార్టీ, ఆ పోరాటాలకు నాయకత్వం వహించ లేకపోయింది సరికదా, భూస్వాములతో ఏర్పడ్డ ఐక్య సంఘటనకు నష్టదాయకంగా భావించి, వాటి ఎడల విముఖత ప్రదర్శించడం కూడా ఆరంభమైంది. అన్ని మురుగు కాలువలూ సముద్రంలో లీనమైనట్టు, అంతలోనే ప్రారంభమైన తెలంగాణ రైతాంగ మహా విప్లవంలో ఆ లొసుగులన్నీ కలిసి పోయాయి.
కానీ రివిజనిస్టు నాయకత్వం ఆ విప్లవాన్ని వెన్నుపోటు పొడిచి విచ్ఛిన్నం చేసిన తర్వాత, తిరిగి యధాస్థితికి దాపురించింది. పోరాట కాలంలో ద్రోహం చేసిన నాయకత్వంలో క్రింది నుండి పైకి తీసి వేశారు.
తెలంగాణ పోరాట ప్రభావంతో వ్యవసాయ కూలీలలో జనరల్ గా వర్గ చైతన్యం హెచ్చింది. అంతవరకూ గ్రామాలతో సంబంధం లేకుండా దూరంగా నెట్టబడ్డ హరిజనులు, గ్రామీణ జీవితం రూపురేఖలు దిద్దడంలో తాము కూడా ఇతరులతో పాటు సమానత్వాన్ని డిమాండ్ చేసే స్థితికి తయారైనారు. హరిజనులలో పెంపొందుతున్న ఈ చైతన్యం విప్లవకారులకు ఎవరికైనా ఉత్తేజాన్నిస్తుంది. కానీ ఆ నాటి రివిజనిస్టు పార్టీకి అది చీమలు పాకినట్లు అయింది."లేబర్ అరాచకం"అని దానికి నామకరణం చేశారు. ఆ చైతన్యాన్ని అణిచివేయడానికి ఎన్నో తప్పుడు సిద్ధాంతాలు వల్లించారు. "ప్రపంచ కార్మికులారా! ఏకంకండి"! అని చిలక పలుకులు పలికిన ఆనాటి
నాయకమ్మన్యులు చివరకు గ్రామాల్లో ఉండే అన్ని కులాలకు చెందిన పీడితుల అంతా ఏకం కాగా ఆ సంఘటిత శక్తిని చూసి బెదిరిపోయి, దాన్ని అణచడానికి భూస్వామ్య వర్గంలో గల వైరుధ్యాలన్నింటిని అప్పటికప్పుడు పరిష్కరించి, సమైక్య పరచి, ఆ దుష్ట కూటమి కి నాయకత్వం వహించే దుస్థితికి దిగజారారు. ఈ విప్లవ ద్రోహమంతా కుల సమస్యలలో తలదూర్చరాదనే పేరుతోనే జరిగింది.
పర్యావసానంగా రివిజనిస్టు పార్టీలు వ్యవసాయ కూలీల నుండి, ప్రధానంగా హరిజన వ్యవసాయ కూలీల నుండి, రాను రాను మరింత దూరం అయిపోయాయి. ఆచరణలో, నిర్మాణంలో, ఆ పార్టీలు కాంగ్రెస్ పార్టీకి నకల్ గానే తయారయ్యాయి. ఏ కోణం నుంచి చూసినా రివిజనిస్టుల ప్రయాణం విప్లవ విచ్ఛిన్నం వైపే ఉంటుంది. భూస్వాముల సేవకు అంకితమైన వారి ఆచరణ అంతకంటే భిన్నంగా ఉండడం అసంభవం. సాంఘిక దురంతాలను ఎదుర్కోవడంలో కూడా వారి ఆచరణ అంతే. రివిజనిస్టు కమ్యూనిస్టులు ముసుగులో ఉన్న భూస్వాముల ఏజెంట్లు కనుక బుద్ధి పూర్వకంగానే అలా వ్యవహరిస్తారు. అందుకు భిన్నంగా "విప్లవానికి బాట" డాక్యుమెంట్ వ్యక్తపరిచినట్టు, వెనకబడ్డ కులాలపై అగ్రకులాలు అనబడే వాటికి చెందిన భూస్వాములు కొనసాగించే సాంఘిక దురంతాలను సారాంశంలో వర్గ సమస్యలుగానే భావించి, ప్రజాస్వామిక విప్లవం లో భాగంగానే వాటి ని ఎదుర్కొనడంలో ముందు నిలబడాలి, అగ్రకులాలకు చెందిన పీడిత ప్రజలందరినీ ఆ పోరాటంలో మద్దతుగా నిలబెట్టడానికి శక్తి వంచన లేని కృషి చేయాలి.
నడెవు దొందె భూమి కుడివు దొందె నీరు
నుడువగ్ని మొందె తిరలు
కులగోత్ర నడువె యత్తణదు సర్వజ్ఞ.
(మనుష్యులందరూ ఒకే భూమి మీద నడుస్తూ,
ఒకే నీరు తాగుతూ చివరకు ఒకే నిప్పు లో కాలి నశిస్తుంటే
ఇక కుల గోత్రాల గోప్ప ఎక్కడిది ?)
తందనాన భళా - తందనానబ్రహ్మమొక్కటె పర - బ్రహ్మమొక్కటెపరబ్రహ్మమొక్కటె పర బ్రహ్మమొక్కటెకందువగు హీనాధికములిందు లేవుఅందరికి శ్రీహరే అంతరాత్మఇందులో జంతుకుల మంతానొక్కటెఅందరికి శ్రీహరే అంతరాత్మనిండార రాజు నిద్రించు నిద్రయు నొకటెఅంటనే బంటునిద్ర అదియు నొకటెమెండైన బ్రాహ్మణుడు మెట్టుభూమి యొకటెచండాలు డుండేటి సరిభూమి యొకటేకడగి యేనుగు మీద కాయు యెండొకటేపుడమి శునకము మీద బొలయు యెండొకటేకడుపుణ్యులను పాపకర్ములను సరిగావజడియు శ్రీ వేంకటేశ్వరుని నామమొకటెఅన్నమయ్య - కీర్తనలువాని ఱెక్కల కష్టంబు లేనినాడు
సస్యరమ పండి పులకింప సంశయించు
వాడు చెమ్మటలోడ్చి ప్రపంచమునకు
భోజనము బెట్టు వానికి భుక్తిలేదువాని తలమీద పులిమిన పంకిలమును
కడిగి కరుణింప లేదయ్యె గగనగంగ
వాని నైవేద్యమున నంటువడిన నాడు
మూడుమూర్తులకు కూడ కూడులేదుపామునకు పాలు చీమకు పంచదార
మేపుకొనుచున్న కర్మభూమిం జనించు
ప్రాక్తనంబైన ధర్మదేవతకు కూడ
నులికిపడు జబ్బు కలదు వీడున్న చోటవాని నుద్ధరించు భగవంతుడే లేడు
మనుజుడెట్లు వాని కనికరించు
వాడు చేసికొన్న పాపకారణమేమొ
యింతవరకు వాని కెరుక లేదుఆ యభాగ్యుని రక్తంబు నాహరించి
యినుపగజ్జెల తల్లి జీవనము సేయు
కసరి బుసకొట్టు నాతని గాలిసోక
నాల్గుపడగల హైందవ నాగరాజు ***ఇట నస్ప్ర్సశ్యత సంచరించుటకు తావే లేదు;విశ్వంభరానటనంబున్ గబళించి గర్భమున విన్యస్తంబు గావించి యుత్కటపుం బెబ్బులి తోడ మేకనోకప్రక్కన్ జేర్చి జోకొట్టి యూఱట గల్పించు నభేదభావమును ధర్మంబిందు గారాడెడిన్- జాషువ
[Caste prevents Hindus from forming a real society or nation]
[Caste is a powerful weapon for preventing all reform]
[The worst feature of the Caste System is an anti-social spirit]
- B. R. Ambedkar
- Bhimrao Ramji Ambedkar, popularly known as Babasaheb, was an Indian lawyer, politician and academic. A revivalist for Buddhism in India, he inspired the Modern Buddhist movement. Wikipedia
- Education: London School of Economics and Political Science (1916–1922), more
- Spouse: Savita Ambedkar (m. 1948–1956), Ramabai Ambedkar (m. 1906–1935)
[Caste is a powerful weapon for preventing all reform]
[1:] The assertion by the individual of his own opinions and beliefs, his own independence and interest—as over against group standards, group authority, and group interests—is the beginning of all reform. But whether the reform will continue depends upon what scope the group affords for such individual assertion. If the group is tolerant and fair-minded in dealing with such individuals, they will continue to assert [their beliefs], and in the end will succeed in converting their fellows. On the other hand if the group is intolerant, and does not bother about the means it adopts to stifle such individuals, they will perish and the reform will die out. [2:] Now a caste has an unquestioned right to excommunicate any man who is guilty of breaking the rules of the caste; and when it is realized that excommunication involves a complete cesser [=cessation] of social intercourse, it will be agreed that as a form of punishment there is really little to choose between excommunication and death. No wonder individual Hindus have not had the courage to assert their independence by breaking the barriers of Caste. [3:] It is true that man cannot get on with his fellows. But it is also true that he cannot do without them. He would like to have the society of his fellows on his terms. If he cannot get it on his terms, then he will be ready to have it on any terms, even amounting to complete surrender. This is because he cannot do without society. A caste is ever ready to take advantage of the helplessness of a man, and to insist upon complete conformity to its code in letter and in spirit. [4:] A caste can easily organize itself into a conspiracy to make the life of a reformer a hell; and if a conspiracy is a crime, I do not understand why such a nefarious act as an attempt to excommunicate a person for daring to act contrary to the rules of caste should not be made an offence punishable in law. But as it is, even law gives each caste an autonomy to regulate its membership and punish dissenters with excommunication. Caste in the hands of the orthodox has been a powerful weapon for persecuting the reformers and for killing all reform.[The worst feature of the Caste System is an anti-social spirit]
[1:] The Hindus often complain of the isolation and exclusiveness of a gang or a clique and blame them for anti-social spirit. But they conveniently forget that this anti-social spirit is the worst feature of their own Caste System. One caste enjoys singing a hymn of hate against another caste as much as the Germans enjoyed singing their hymn of hate against the English during the last war [=World War I]. The literature of the Hindus is full of caste genealogies in which an attempt is made to give a noble origin to one caste and an ignoble origin to other castes. The Sahyadrikhand is a notorious instance of this class of literature.[2:] This anti-social spirit is not confined to caste alone. It has gone deeper and has poisoned the mutual relations of the sub-castes as well. In my province the Golak Brahmins, Deorukha Brahmins, Karada Brahmins, Palshe Brahmins, and Chitpavan Brahmins all claim to be sub-divisions of the Brahmin caste. But the anti-social spirit that prevails between them is quite as marked and quite as virulent as the anti-social spirit that prevails between them and other non-Brahmin castes. There is nothing strange in this. An anti-social spirit is found wherever one group has "interests of its own" which shut it out from full interaction with other groups, so that its prevailing purpose is protection of what it has got. [3:] This anti-social spirit, this spirit of protecting its own interests, is as much a marked feature of the different castes in their isolation from one another as it is of nations in their isolation. The Brahmin's primary concern is to protect "his interest" against those of the non-Brahmins; and the non-Brahmins' primary concern is to protect their interests against those of the Brahmins. The Hindus, therefore, are not merely an assortment of castes, but are so many warring groups, each living for itself and for its selfish ideal. [4:] There is another feature of caste which is deplorable. The ancestors of the present-day English fought on one side or the other in the Wars of the Roses and the Cromwellian War. But the descendants of those who fought on the one side do not bear any animosity—any grudge—against the descendents of those who fought on the other side. The feud is forgotten. But the present-day non-Brahmins cannot forgive the present-day Brahmins for the insult their ancestors gave to Shivaji. The present-day Kayasthas will not forgive the present-day Brahmins for the infamy cast upon their forefathers by the forefathers of the latter. To what is this difference due? Obviously to the Caste System. The existence of Caste and Caste Consciousness has served to keep the memory of past feuds between castes green, and has prevented solidarity.
6 [Caste prevents Hindus from forming a real society or nation]
[1:] Caste does not result in economic efficiency. Caste cannot improve, and has not improved, the race. Caste has however done one thing. It has completely disorganized and demoralized the Hindus. [2:] The first and foremost thing that must be recognized is thatHindu Society is a myth. The name Hindu is itself a foreign name. It was given by the Mohammedans to the natives for the purpose of distinguishing themselves [from them]. It does not occur in anySanskrit work prior to the Mohammedan invasion. They did not feel the necessity of a common name, because they had no conception of their having constituted a community. Hindu Society as such does not exist. It is only a collection of castes. Each caste is conscious of its existence. Its survival is the be-all and end-all of its existence. Castes do not even form a federation. A caste has no feeling that it is affiliated to other castes, except when there is a Hindu-Muslim riot. On all other occasions each caste endeavours to segregate itself and to distinguish itself from other castes. [3:] Each caste not only dines among itself and marries among itself, but each caste prescribes its own distinctive dress. What other explanation can there be of the innumerable styles of dress worn by the men and women of India, which so amuse the tourists? Indeed the ideal Hindu must be like a rat living in his own hole, refusing to have any contact with others. There is an utter lack among the Hindus of what the sociologists call "consciousness of kind." There is no Hindu consciousness of kind. In every Hindu the consciousness that exists is the consciousness of his caste. That is the reason why the Hindus cannot be said to form a society or a nation. [4:] There are, however, many Indians whose patriotism does not permit them to admit that Indians are not a nation, that they are only an amorphous mass of people. They have insisted that underlying the apparent diversity there is a fundamental unity which marks the life of the Hindus, inasmuch as there is a similarity of those habits and customs, beliefs and thoughts, which obtain all over the continent of India. Similarity in habits and customs, beliefs and thoughts, there is. But one cannot accept the conclusion that therefore, the Hindusconstitute a society. To do so is to misunderstand the essentials which go to make up a society. Men do not become a society by living in physical proximity, any more than a man ceases to be a member of his society by living so many miles away from other men. [5:] Secondly, similarity in habits and customs, beliefs and thoughts, is not enough to constitute men into society. Things may be passed physically from one to another like bricks. In the same way habits and customs, beliefs and thoughts of one group may be taken over by another group, and there may thus appear a similarity between the two. Culture spreads by diffusion, and that is why one finds similarity between various primitive tribes in the matter of their habits and customs, beliefs and thoughts, although they do not live in proximity. But no one could say that because there was this similarity, the primitive tribes constituted one society. This is because similarity in certain things is not enough to constitute a society. [6:] Men constitute a society because they have things which they possess in common. To have similar things is totally different from possessing things in common. And the only way by which men can come to possess things in common with one another is by being in communication with one another. This is merely another way of saying that Society continues to exist by communication—indeed, in communication. To make it concrete, it is not enough if men act in a way which agrees with the acts of others. Parallel activity, even if similar, is not sufficient to bind men into a society. [7:] This is proved by the fact that the festivals observed by the different castes amongst the Hindus are the same. Yet these parallel performances of similar festivals by the different castes have not bound them into one integral whole. For that purpose what is necessary is for a man to share and participate in a common activity, so that the same emotions are aroused in him that animate the others. Making the individual a sharer or partner in the associated activity, so that he feels its success as his success, its failure as his failure, is the real thing that binds men and makes a society of them. The Caste System prevents common activity; and by preventing common activity, it has prevented the Hindus from becoming a society with a unified life and a consciousness of its own being.
సమాజంలో ఉన్న ప్రతీ మనిషీ శ్రమ చెయ్యాలని గ్రహించడమూ; ప్రతి మనిషీ శారీరక - మేధా శ్రమలు రెండూ చెయ్యాలని గ్రహించడమూ, మొదటి సంగతి. ఆ మార్పుల కోసం, శ్రామిక వర్గ పోరాటం అత్యవసరమని గ్రహించడం, మరో సంగతి. ఏ గ్రహింపూ లేకుండా, ‘కుల విధానాన్ని తక్షణం నిర్మూలించాలి’ అంటూ అరిచే నినాదాలు ఆ నిర్మూలనకు ఏ మాత్రమూ పనికి రావు. పైగా ఆ శబ్దాలు, సిద్ధాంత శబ్ద కాలుష్యాన్ని మాత్రమే దట్టంగా సృష్టిస్తాయి.
‘కులాల విధానం’ అనే సమస్యకి పరిష్కారం, కులాంతర వివాహాలే. కుల విధానాన్ని అంగీకరించని వారందరూ గ్రహించవలసింది ఇదే. సమస్య ఉంటే, దాని వెంటే పరిష్కారం ఉంటుంది. సమస్య వల్ల బాధపడే వాళ్ళకి పరిష్కారం తెలియలేదంటే సమస్యే తెలియలేదని అర్థం.
కుల విధానం పుట్టుక గురించి మాట్లాడే వారు కొందరు, ‘చాతుర్వర్ణాలు’ అనే పేరుతో ‘బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర’ అంటూ మొదలు పెడతారు. అలా మొదలు పెట్టి, ఆ నాలుగు వర్ణాలూ, ఏ శ్రమల తోటీ, ఏ వృత్తుల తోటీ సంబంధాలు లేకుండా పుట్టుకొచ్చినట్టు చెప్పుకొస్తారు. ప్రతీ వర్ణమూ అనేక విభాగాలుగా వేరు వేరు వృత్తుల్లో నిమగ్నమై ఉండడమూ; ‘శూద్రులు’ అనే వర్ణం, అనేకానేక శారీరక శ్రమలు చేసే వృత్తులు గానూ, ప్రతీ వృత్తీ ఒక కులం గానూ ఏర్పరడమూ; ఇవన్నీ సమాజంలో స్పష్టంగా కనపడుతూ ఉన్నవే.
బట్టలు ఉతికే వృత్తి ఒక కులం. క్షవరాలు చేసే వృత్తి ఇంకో కులం. చేపలు పట్టే వృత్తి మరో కులం. నేతా, కుట్టూ, వేరు వేరు కులాలే. వృత్తులు మారినా, కలిసినా, కులాలు నిలబడే ఉండడం సంప్రదాయంగా సాగుతోంది. ఒక వృత్తినీ, దాని కులం పేరునీ చూస్తే, వృత్తి మొదటిదో, కులం మొదటిదో, తేలికగానే గ్రహించవచ్చు. శ్రమలే లేని కాలంలో వృత్తులు ఉండవు. వృత్తులే లేని కాలంలో, దానికి కులం పేరు ఏర్పడదు. ఒక కులం గల కుటుంబంలో ఒక పెళ్ళి జరగాలంటే, అదే కులం గల, అంటే అదే వృత్తి గల వ్యక్తే, ఆ కుటుంబంలోకి రావడం జరుగుతోంది. వివాహ సంబంధాలు ఏ కులానికి ఆ కులంలోనే ఏర్పడాలి - అనే సంప్రదాయానికి మూల కారణం, ‘ఒకే రకం వృత్తి’ అనేదే. అంటే, వృత్తిని బట్టే కులం. కులాన్ని బట్టే వివాహ సంప్రదాయం. అంటే, కులాలు పోవాలంటే, వృత్తుల విధానంలో పెద్ద మార్పు జరగాలని అర్థం.
‘కులాలు’ అన్నప్పుడు, అవి కేవలం వేరు వేరు భిన్న వృత్తులు మాత్రమే కాదు; ఆ వృత్తులకూ, వాటిని బట్టి ఆ కులాలకూ, చిన్నా - పెద్దా గుర్తింపులు కూడా ఏర్పడ్డాయి. అయితే, ‘వృత్తులు అన్ని దేశాల్లోనూ ఉన్నాయి. ఈ కుల విధానం ఈ దేశంలోనే ఎందుకు ఉంది?’ అనే ప్రశ్న తలెత్తుతుంది. ప్రశ్నలు ఎప్పుడూ మంచివి. కారణాల్ని గ్రహించాలనే ప్రయత్నాలు అవి. ఇతర దేశాల్లో ఉన్న వేరు వేరు చెత్త సంప్రదాయాలు ఈ దేశంలో లేవు. ఒక దేశంలో ఉన ్న మంచిగానీ చెడ్డగానీ, అదే రకంగా ప్రతీ చోటా ఉండడం లేదు. ఇక్కడి చెడ్డని మించిన చెడ్డ, అక్కడ ఉండవచ్చు. అక్కడి మంచిని మించిన మంచి, ఇక్కడ ఉండవచ్చు. ‘ఇక్కడ ఉన్నది అక్కడ లే దేం?’ ప్రశ్నకి జవాబు, ‘‘అక్కడ ఉన్నది ఇక్కడ లేదేం?’’ అనేదే. మన దగ్గిర ఉన్నది చెడ్డే అని తెలిస్తే, దాన్ని మనం మార్చుకోవాలి ‘కుల విధానం’ పోవలిసిందే. కానీ ఎలాగ? పరిష్కారం కావాలంటే, సమస్యని సరిగా అర్థం చేసుకోవాలి.
ఇద్దరు వేరు వేరు కులాల వాళ్ళు స్నేహంగా ఉన్నా, ఆ కులాలు పోయినట్టు కాదు. ఆ ఇద్దరూ రోజూ కలిసి భోజనాలు చేస్తూ ఉన్నా, ఆ కులాలు పోయినట్టు కాదు. కాలేజీల్లో, స్నేహాలూ, హోటళ్ళలో పక్కపక్కనే కూర్చుని భోజనాలూ, ఇవన్నీ సాగుతూనే ఉన్నాయి. అయినా కులాలు కులాల్లాగే ఉంటున్నాయి.
ఇద్దరు చిన్నా పెద్దా కులాల స్ర్తీ పురుషులు, రహస్య సంబంధాలతో ఉంటే, కులాలు పోయినట్లు కాదు. ఆ సీ్త్ర పురుషులు బహిరంగంగా, పెళ్ళి తంతు ఉన్నా లేకపోయినా, భార్యాభర్తలుగా, కుటుంబ సంబంధాలతోనే, పిల్లలకు తల్లిదండ్రులు గానే, కలిసి జీవిస్తూ ఉంటే, అటువంటి సంబంధంలో బైల్దేరే పిల్లలకు ఏ కులాలూ లెక్కలోకి రావు. కానీ, రిజర్వేషన్ పద్ధతి సాగుతూనే ఉంటే, తండ్రి కులమో, తల్లి కులమో, ఏది చిన్న కులమైతే అది, ఆ పిల్లలకు కూడా చుట్టుకుంటుంది. తల్లి దండ్రులు కులాంతర వివాహం చేసుకున్నా, రిజర్వేషన్ల ద్వారా, పిల్లల తరానికి కూడా చిన్న కులాలు నిలిచిపోతాయి!
కులాంతర వివాహాలు, నూటికొకటో కోటి కొకటో జరగడం గాక, నిరభ్యంతరంగా జరిగే మార్గం ఏది? ఆ మార్గం ఏమిటో తెలుసుకోవాలంటే, కనీసం 100 కులాంతర వివాహాల్ని పరిశీలించి చూడాలి. ఈ పరిశీలనలో, రెడ్డి యువతికి మాల యువకుడితో పెళ్ళీ; బ్రాహ్మణ యువతికి, మాదిగ యువకుడితో పెళ్ళీ; వైశ్య యువకుడికి, మంగలి యువతితో పెళ్ళీ; ఇలా ఆ 100 పెళ్ళిళ్ళూ చిన్నా పెద్దా కులాల మధ్య జరగడం కనపడతాయి. అందులో కారణాల కోసం వెతికితే, చిన్న కులాల వ్యక్తులకు, వారి కుల వృత్తులు మారిపోవడమే కనపడుతుంది. ఒక బ్రాహ్మణ యువతికీ, ఒక టీచరుగా ఉన ్న మంగలి యువకుడికీ పెళ్ళి జరిగిందంటే, ఆ చిన్న కులం యువకుడికి విద్యా స్థాయి పెరిగి, తన కుల వృత్తి వదిలి, పై స్థాయి ఉద్యోగిగా మారడమే, పెద్ద కులం యువతితో పరిచయం, చివరికి పెళ్ళికి అంగీకారం!
కుల విధానం పుట్టుక గురించి మాట్లాడే వారు కొందరు, ‘చాతుర్వర్ణాలు’ అనే పేరుతో ‘బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర’ అంటూ మొదలు పెడతారు. అలా మొదలు పెట్టి, ఆ నాలుగు వర్ణాలూ, ఏ శ్రమల తోటీ, ఏ వృత్తుల తోటీ సంబంధాలు లేకుండా పుట్టుకొచ్చినట్టు చెప్పుకొస్తారు. ప్రతీ వర్ణమూ అనేక విభాగాలుగా వేరు వేరు వృత్తుల్లో నిమగ్నమై ఉండడమూ; ‘శూద్రులు’ అనే వర్ణం, అనేకానేక శారీరక శ్రమలు చేసే వృత్తులు గానూ, ప్రతీ వృత్తీ ఒక కులం గానూ ఏర్పరడమూ; ఇవన్నీ సమాజంలో స్పష్టంగా కనపడుతూ ఉన్నవే.
బట్టలు ఉతికే వృత్తి ఒక కులం. క్షవరాలు చేసే వృత్తి ఇంకో కులం. చేపలు పట్టే వృత్తి మరో కులం. నేతా, కుట్టూ, వేరు వేరు కులాలే. వృత్తులు మారినా, కలిసినా, కులాలు నిలబడే ఉండడం సంప్రదాయంగా సాగుతోంది. ఒక వృత్తినీ, దాని కులం పేరునీ చూస్తే, వృత్తి మొదటిదో, కులం మొదటిదో, తేలికగానే గ్రహించవచ్చు. శ్రమలే లేని కాలంలో వృత్తులు ఉండవు. వృత్తులే లేని కాలంలో, దానికి కులం పేరు ఏర్పడదు. ఒక కులం గల కుటుంబంలో ఒక పెళ్ళి జరగాలంటే, అదే కులం గల, అంటే అదే వృత్తి గల వ్యక్తే, ఆ కుటుంబంలోకి రావడం జరుగుతోంది. వివాహ సంబంధాలు ఏ కులానికి ఆ కులంలోనే ఏర్పడాలి - అనే సంప్రదాయానికి మూల కారణం, ‘ఒకే రకం వృత్తి’ అనేదే. అంటే, వృత్తిని బట్టే కులం. కులాన్ని బట్టే వివాహ సంప్రదాయం. అంటే, కులాలు పోవాలంటే, వృత్తుల విధానంలో పెద్ద మార్పు జరగాలని అర్థం.
‘కులాలు’ అన్నప్పుడు, అవి కేవలం వేరు వేరు భిన్న వృత్తులు మాత్రమే కాదు; ఆ వృత్తులకూ, వాటిని బట్టి ఆ కులాలకూ, చిన్నా - పెద్దా గుర్తింపులు కూడా ఏర్పడ్డాయి. అయితే, ‘వృత్తులు అన్ని దేశాల్లోనూ ఉన్నాయి. ఈ కుల విధానం ఈ దేశంలోనే ఎందుకు ఉంది?’ అనే ప్రశ్న తలెత్తుతుంది. ప్రశ్నలు ఎప్పుడూ మంచివి. కారణాల్ని గ్రహించాలనే ప్రయత్నాలు అవి. ఇతర దేశాల్లో ఉన్న వేరు వేరు చెత్త సంప్రదాయాలు ఈ దేశంలో లేవు. ఒక దేశంలో ఉన ్న మంచిగానీ చెడ్డగానీ, అదే రకంగా ప్రతీ చోటా ఉండడం లేదు. ఇక్కడి చెడ్డని మించిన చెడ్డ, అక్కడ ఉండవచ్చు. అక్కడి మంచిని మించిన మంచి, ఇక్కడ ఉండవచ్చు. ‘ఇక్కడ ఉన్నది అక్కడ లే దేం?’ ప్రశ్నకి జవాబు, ‘‘అక్కడ ఉన్నది ఇక్కడ లేదేం?’’ అనేదే. మన దగ్గిర ఉన్నది చెడ్డే అని తెలిస్తే, దాన్ని మనం మార్చుకోవాలి ‘కుల విధానం’ పోవలిసిందే. కానీ ఎలాగ? పరిష్కారం కావాలంటే, సమస్యని సరిగా అర్థం చేసుకోవాలి.
ఇద్దరు వేరు వేరు కులాల వాళ్ళు స్నేహంగా ఉన్నా, ఆ కులాలు పోయినట్టు కాదు. ఆ ఇద్దరూ రోజూ కలిసి భోజనాలు చేస్తూ ఉన్నా, ఆ కులాలు పోయినట్టు కాదు. కాలేజీల్లో, స్నేహాలూ, హోటళ్ళలో పక్కపక్కనే కూర్చుని భోజనాలూ, ఇవన్నీ సాగుతూనే ఉన్నాయి. అయినా కులాలు కులాల్లాగే ఉంటున్నాయి.
ఇద్దరు చిన్నా పెద్దా కులాల స్ర్తీ పురుషులు, రహస్య సంబంధాలతో ఉంటే, కులాలు పోయినట్లు కాదు. ఆ సీ్త్ర పురుషులు బహిరంగంగా, పెళ్ళి తంతు ఉన్నా లేకపోయినా, భార్యాభర్తలుగా, కుటుంబ సంబంధాలతోనే, పిల్లలకు తల్లిదండ్రులు గానే, కలిసి జీవిస్తూ ఉంటే, అటువంటి సంబంధంలో బైల్దేరే పిల్లలకు ఏ కులాలూ లెక్కలోకి రావు. కానీ, రిజర్వేషన్ పద్ధతి సాగుతూనే ఉంటే, తండ్రి కులమో, తల్లి కులమో, ఏది చిన్న కులమైతే అది, ఆ పిల్లలకు కూడా చుట్టుకుంటుంది. తల్లి దండ్రులు కులాంతర వివాహం చేసుకున్నా, రిజర్వేషన్ల ద్వారా, పిల్లల తరానికి కూడా చిన్న కులాలు నిలిచిపోతాయి!
కులాంతర వివాహాలు, నూటికొకటో కోటి కొకటో జరగడం గాక, నిరభ్యంతరంగా జరిగే మార్గం ఏది? ఆ మార్గం ఏమిటో తెలుసుకోవాలంటే, కనీసం 100 కులాంతర వివాహాల్ని పరిశీలించి చూడాలి. ఈ పరిశీలనలో, రెడ్డి యువతికి మాల యువకుడితో పెళ్ళీ; బ్రాహ్మణ యువతికి, మాదిగ యువకుడితో పెళ్ళీ; వైశ్య యువకుడికి, మంగలి యువతితో పెళ్ళీ; ఇలా ఆ 100 పెళ్ళిళ్ళూ చిన్నా పెద్దా కులాల మధ్య జరగడం కనపడతాయి. అందులో కారణాల కోసం వెతికితే, చిన్న కులాల వ్యక్తులకు, వారి కుల వృత్తులు మారిపోవడమే కనపడుతుంది. ఒక బ్రాహ్మణ యువతికీ, ఒక టీచరుగా ఉన ్న మంగలి యువకుడికీ పెళ్ళి జరిగిందంటే, ఆ చిన్న కులం యువకుడికి విద్యా స్థాయి పెరిగి, తన కుల వృత్తి వదిలి, పై స్థాయి ఉద్యోగిగా మారడమే, పెద్ద కులం యువతితో పరిచయం, చివరికి పెళ్ళికి అంగీకారం!
చిన్న కులాల వ్యక్తులు, తమ కుల వృత్తుల్ని వదిలి వేస్తే, అప్పుడు సమాజానికి ఆ వృత్తులతో అవసరం ఎలా తీరుతుంది? ఈ నాడైతే, చిన్న కులాల్లో ఇంకా కుల వృత్తుల్ని వదలని వాళ్ళ ద్వారానే, సమాజ అవసరాలు తీరుతున్నాయి. కానీ, ఒక క్షవరాల కులంలో అందరూ కుల వృత్తిని వదిలేస్తే, అప్పుడేమవుతుంది? - సమాజానికి అవసరమైన ప్రతీ శ్రమనీ నిలబెట్టుకునే కొత్త విధానాన్ని మార్క్సిజం చెపుతుంది. చిన్నా - పెద్దా వృత్తులుగా సాగుతూ ఉన్న శ్రమ విభజనని, ‘సమానత్వ శ్రమ విభజన’గా మార్చాలనేదే ఆ కొత్త విధానం. కొత్త విధానమే లేకపోతే, అట్టడుగు శ్రమలు చేసే కులాలకు విముక్తి ఎలాగ?
ఈనాడు, చిన్న కులాల కుటుంబాల్లో మార్పులు, రిజర్వేషన్ల ద్వారా జరగడం నిజమే. కానీ ఆ మార్పు, ఆ కులాల జనాభాలో అత్యల్ప సంఖ్యకి మాత్రమే దొరుకుతుంది. రిజర్వేషన్లలోనే క్రీమీ లేయర్ పద్ధతిని ప్రవేశపెడితే, ఆ రకమైన మేలు కూడా ఎక్కువ జనాభాకి అందదు. భారత దేశంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ పేర్లతో ఉన్న మొత్తం జనాభాని చూస్తే, ఆ సంఖ్యలో మెజారిటీకి రిజర్వేషన్ల ద్వారా జరిగే మేలేమీ ఉండదు. పెద్ద కులాల పేదల్లో జరిగినట్టే చిన్న కులాల్లో కూడా, పరిశ్రమల్లో ఉద్యోగాలూ జీతాలూ సంపాదిస్తూ ఎదగడం అంటే, భూస్వాముల కిందా పెట్టుబడిదారుల కిందా వేతన బానిసలుగా బతకడమే. అదే ఆ ఎదుగుదలకి అర్థం! ఈనాడు కూడా, అనేక పరిశ్రమల్లో పని పనిచేసే ఇంజనీర్ల వంటి ఉద్యోగులకు కూడా, రోజుకి 16 గంటల పని, తప్పనిసరి నియమం!
ఒక చిన్న కులస్తుడు, పెట్టుబడిదారుడిగా ఎదిగి, లేదా రిజర్వేషన్ల మార్గం ద్వారా ప్రభుత్వంలో మంత్రిగా మారి, స్వంత భవనాలతో, స్వంత పెట్టుబడులతో ఎదిగిపోయినప్పుడు, తన పిల్లల వివాహాల కోసం, తన కులంలోనే పేదల వేపు చూడడు. పెద్ద కులాల్లో పేదల వేపు కూడా చూడడు. తనతో సమాన ఆర్థిక స్థాయి గల సంబంధాల కోసమే చూస్తాడు. పెద్ద కులాల వాళ్ళయినా చేసేది అక్షరాలా అదే. అంటే, యజమాని వర్గంగా ఎదిగిన ఆ చిన్నా - పెద్దా కులాల వాళ్ళకి, కులాల దృష్టి పోయి, యజమానుల వర్గ దృష్టే ప్రధాన దృష్టి అవుతుంది.
రాబోయే కాలం అంతా ప్రైవేటు పరిశ్రమల కాలమే. శ్రామికులు ఏ కులాల వారైనా, వారి డిగ్రీల గురించీ, జీతాల గురించీ, నిర్ణయాలన్నీ పారిశ్రామికవేత్తల ఇష్టాయిష్టాలే. అప్పుడు చిన్న కులాల్లో అల్పసంఖ్యని కూడా రిజర్వేషన్లు రక్షించలేవు. నిత్యం బానిస బతుకులూ, నిరుద్యోగాలూ, అడుగు స్థాయి వృత్తులూ, కులాల స్తిరత్వాలూ, అన్నీ వెనకడుగులే.
పెద్ద కులాల్లో అయినా, చిన్న కులాల్లో అయినా, అత్యధిక జనం శ్రామికులే. అందరూ తమ కులాల్ని గురించే తలపోస్తూ, కుల సంఘాలు పెట్టుకుంటూ, ‘కుల విధానాన్నే’ మరింత స్థిరంగా నిలబెట్టుకుంటున్నారు. చిన్న కులాల వారు రిజర్వేషన్ల భ్రమలతో, తమ కులాలే తమకు శాశ్విత రక్షణ అనుకుంటున్నారు. తాము ఏ వర్గ సంబంధాల్లో, ఏ స్తితిలో ఉన్నారో, గ్ర హించడం లేదు. రిజర్వేషన్లని ఉపయోగించుకుంటూ కూడా వర్గ స్పృహతో ఉండాలని గ్రహించడం లేదు. .
ఈనాడు, చిన్న కులాల కుటుంబాల్లో మార్పులు, రిజర్వేషన్ల ద్వారా జరగడం నిజమే. కానీ ఆ మార్పు, ఆ కులాల జనాభాలో అత్యల్ప సంఖ్యకి మాత్రమే దొరుకుతుంది. రిజర్వేషన్లలోనే క్రీమీ లేయర్ పద్ధతిని ప్రవేశపెడితే, ఆ రకమైన మేలు కూడా ఎక్కువ జనాభాకి అందదు. భారత దేశంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ పేర్లతో ఉన్న మొత్తం జనాభాని చూస్తే, ఆ సంఖ్యలో మెజారిటీకి రిజర్వేషన్ల ద్వారా జరిగే మేలేమీ ఉండదు. పెద్ద కులాల పేదల్లో జరిగినట్టే చిన్న కులాల్లో కూడా, పరిశ్రమల్లో ఉద్యోగాలూ జీతాలూ సంపాదిస్తూ ఎదగడం అంటే, భూస్వాముల కిందా పెట్టుబడిదారుల కిందా వేతన బానిసలుగా బతకడమే. అదే ఆ ఎదుగుదలకి అర్థం! ఈనాడు కూడా, అనేక పరిశ్రమల్లో పని పనిచేసే ఇంజనీర్ల వంటి ఉద్యోగులకు కూడా, రోజుకి 16 గంటల పని, తప్పనిసరి నియమం!
ఒక చిన్న కులస్తుడు, పెట్టుబడిదారుడిగా ఎదిగి, లేదా రిజర్వేషన్ల మార్గం ద్వారా ప్రభుత్వంలో మంత్రిగా మారి, స్వంత భవనాలతో, స్వంత పెట్టుబడులతో ఎదిగిపోయినప్పుడు, తన పిల్లల వివాహాల కోసం, తన కులంలోనే పేదల వేపు చూడడు. పెద్ద కులాల్లో పేదల వేపు కూడా చూడడు. తనతో సమాన ఆర్థిక స్థాయి గల సంబంధాల కోసమే చూస్తాడు. పెద్ద కులాల వాళ్ళయినా చేసేది అక్షరాలా అదే. అంటే, యజమాని వర్గంగా ఎదిగిన ఆ చిన్నా - పెద్దా కులాల వాళ్ళకి, కులాల దృష్టి పోయి, యజమానుల వర్గ దృష్టే ప్రధాన దృష్టి అవుతుంది.
రాబోయే కాలం అంతా ప్రైవేటు పరిశ్రమల కాలమే. శ్రామికులు ఏ కులాల వారైనా, వారి డిగ్రీల గురించీ, జీతాల గురించీ, నిర్ణయాలన్నీ పారిశ్రామికవేత్తల ఇష్టాయిష్టాలే. అప్పుడు చిన్న కులాల్లో అల్పసంఖ్యని కూడా రిజర్వేషన్లు రక్షించలేవు. నిత్యం బానిస బతుకులూ, నిరుద్యోగాలూ, అడుగు స్థాయి వృత్తులూ, కులాల స్తిరత్వాలూ, అన్నీ వెనకడుగులే.
పెద్ద కులాల్లో అయినా, చిన్న కులాల్లో అయినా, అత్యధిక జనం శ్రామికులే. అందరూ తమ కులాల్ని గురించే తలపోస్తూ, కుల సంఘాలు పెట్టుకుంటూ, ‘కుల విధానాన్నే’ మరింత స్థిరంగా నిలబెట్టుకుంటున్నారు. చిన్న కులాల వారు రిజర్వేషన్ల భ్రమలతో, తమ కులాలే తమకు శాశ్విత రక్షణ అనుకుంటున్నారు. తాము ఏ వర్గ సంబంధాల్లో, ఏ స్తితిలో ఉన్నారో, గ్ర హించడం లేదు. రిజర్వేషన్లని ఉపయోగించుకుంటూ కూడా వర్గ స్పృహతో ఉండాలని గ్రహించడం లేదు. .
చిన్న కులాల జనాభాకి తాము ఘోరమైన ‘శ్రమ దోపిడీ’కి గురి అవుతున్నామని తెలీదు. దాని వల్ల దోపిడీ శ్రమ - విభజనలో చిక్కి ఉన్నామనీ తెలీదు. పిల్లి నోటిలో చిక్కిన ఎలక కూడా ఆత్మరక్షణ కోసం పెనుగులాడుతుంది. ఆ మాత్రపు రక్షణ స్పృహ కూడా శ్రామిక జనాభాకి లేదు.
కుల విధానమే కాదు. ఇంకా ఉన్న ఏ చెడ్డ విధానం అయినా గతించేది ఎవరి ద్వారా? సమస్య ఎవరిదో వారి ద్వారా.
మేధావులు బైల్దేరి, ‘కుల విధానం తక్షణం నశించాలి. దాన్ని వెంటనే తీసివెయ్యాలి’ అని ఘోషిస్తారు. దారి మధ్యలో ఉన్న ముళ్ళపొదని తక్షణం తవ్వి పైకి లాగి దాన్ని దారికి దూరంగా విసిరెయ్యడం ఎంత సాధ్యమో, కుల విధానాన్ని తీసివెయ్యడం అంత సాధ్యం అనుకుంటారు.
‘‘ఏ పెద్ద కులం వ్యక్తి అయినా, చిన్న కులం వ్యక్తినే పెళ్ళి చేసుకోవాలి’ అని చట్టం చెయ్యడం సాధ్యం కాదు. అలాంటి చట్టమే ఉంటే, పెద్ద కులాల వాళ్ళు పెళ్ళిళ్ళే మానుకుంటారు. పెళ్ళిళ్ళు లేని విధానాన్ని పెద్ద కులాల మధ్యనే పాటిస్తారు.
కులాంతరాల భార్యాభర్తలు, తమ పిల్లలకి తామే ఏదో ఒక కులాన్ని అంటగట్టడం తప్పకపోతే, కుల నిర్మూలన మాట ఎత్తడం దండగ.
సమాజంలో ఉన్న ప్రతీ మనిషీ శ్రమ చెయ్యాలని గ్రహించడమూ; ప్రతీ మనిషీ శారీరక - మేధా శ్రమలు రెండూ చెయ్యాలని గ్రహించడమూ, మొదటి సంగతి. ఆ మార్పుల కోసం, శ్రామిక వర్గ పోరాటం అత్యవసరమని గ్రహించడం, మరో సంగతి.
ఏ గ్రహింపూ లేకుండా, ‘కుల విధానాన్ని తక్షణం నిర్మూలించాలి’ అంటూ అరిచే నినాదాలు ఆ నిర్మూలనకు ఏ మాత్రమూ పనికి రావు. పైగా ఆ శబ్దాలు, సిద్ధాంత శబ్ద కాలుష్యాన్ని మాత్రమే దట్టంగా సృష్టిస్తాయి.
కుల విధానమే కాదు. ఇంకా ఉన్న ఏ చెడ్డ విధానం అయినా గతించేది ఎవరి ద్వారా? సమస్య ఎవరిదో వారి ద్వారా.
మేధావులు బైల్దేరి, ‘కుల విధానం తక్షణం నశించాలి. దాన్ని వెంటనే తీసివెయ్యాలి’ అని ఘోషిస్తారు. దారి మధ్యలో ఉన్న ముళ్ళపొదని తక్షణం తవ్వి పైకి లాగి దాన్ని దారికి దూరంగా విసిరెయ్యడం ఎంత సాధ్యమో, కుల విధానాన్ని తీసివెయ్యడం అంత సాధ్యం అనుకుంటారు.
‘‘ఏ పెద్ద కులం వ్యక్తి అయినా, చిన్న కులం వ్యక్తినే పెళ్ళి చేసుకోవాలి’ అని చట్టం చెయ్యడం సాధ్యం కాదు. అలాంటి చట్టమే ఉంటే, పెద్ద కులాల వాళ్ళు పెళ్ళిళ్ళే మానుకుంటారు. పెళ్ళిళ్ళు లేని విధానాన్ని పెద్ద కులాల మధ్యనే పాటిస్తారు.
కులాంతరాల భార్యాభర్తలు, తమ పిల్లలకి తామే ఏదో ఒక కులాన్ని అంటగట్టడం తప్పకపోతే, కుల నిర్మూలన మాట ఎత్తడం దండగ.
సమాజంలో ఉన్న ప్రతీ మనిషీ శ్రమ చెయ్యాలని గ్రహించడమూ; ప్రతీ మనిషీ శారీరక - మేధా శ్రమలు రెండూ చెయ్యాలని గ్రహించడమూ, మొదటి సంగతి. ఆ మార్పుల కోసం, శ్రామిక వర్గ పోరాటం అత్యవసరమని గ్రహించడం, మరో సంగతి.
ఏ గ్రహింపూ లేకుండా, ‘కుల విధానాన్ని తక్షణం నిర్మూలించాలి’ అంటూ అరిచే నినాదాలు ఆ నిర్మూలనకు ఏ మాత్రమూ పనికి రావు. పైగా ఆ శబ్దాలు, సిద్ధాంత శబ్ద కాలుష్యాన్ని మాత్రమే దట్టంగా సృష్టిస్తాయి.
. రంగనాయకమ్మ
కులం