భావన

భావన -వస్తు భావ పరంపర భావన ఈ భావన, ప్రగతికి మూలం. అజ్ఞానమే శత్రువు. జ్ఞానమనే చిరు జ్యోతిని వెలిగించి అజ్ఞాన తిమిరాన్ని పారద్రోలుదాం. ఈ చిరు ప్రయత్నాన్ని మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేయడం ద్వారా ప్రోత్సహిస్తారని ఆశిస్తూ... - మీ రామమోహన్ చింతా

87R.మత్తయి సువార్తా 📕

మత్తయి సువార్త నూతన ఒడంబడికలోని నాలుగు సువార్తలలో మొదటిది. 

అధ్యాయాలు: 28
వాక్యాలు: 1,071
మాటలు: సుమారు 23,684 
(ప్రాంతాన్ని బట్టి తేడా ఉండవచ్చు)


ఇది యేసు క్రీస్తు జీవిత చరిత్రను, ఆయన బోధలను వివరించేదిగా మత్తయి రచించినదిగా భావించబడుతుంది.

మత్తయి 1:1
అబ్రాహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు(క్రీస్తు అను శబ్దమునకు అభిషిక్తుడని అర్థము
వంశావళి.
మత్తయి 1:17
ఇట్లు అబ్రాహాము మొదలుకొని దావీదు వరకు తరము లన్నియు పదునాలుగు తరములు. దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలమువరకు పదునాలుగు తరములు; బబులోనుకు కొనిపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు పదునాలుగు తరములు. 42 తరములు
మత్తయి 1:18
యేసు క్రీస్తు జననవిధ మెట్లనగా, ఆయన తల్లియైన మరియ యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మవలన గర్భవతిగా ఉండెను.
మత్తయి 1:19
ఆమె భర్తయైన యోసేపు నీతిమంతుడైయుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను.
మత్తయి 1:20
అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడవైన యోసేపూ, నీ భార్యయైన మరియను చేర్చు కొనుటకకు భయపడకుము, ఆమె గర్భము ధరించునది పరిశుద్ధాత్మవలన కలిగినది; ఆమె యొక కుమారుని కనును;
మత్తయి 1:21
తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు(యేసు అను శబ్దమునకు రక్షకుడని అర్థము.) అను పేరు పెట్టుదువనెను.
మత్తయి 1:22
ఇదిగో కన్యక గర్భవతియై కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు
మత్తయి 1:23
అని ప్రభువు తన ప్రవక్తద్వారా పలికిన మాట నెరవేరు నట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము.
మత్తయి 1:24
యాసేపు నిద్రమేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారముచేసి, తన భార్యను చేర్చుకొని
మత్తయి 1:25
ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను; అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను.
మత్తయి 2:1
రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బేత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి
మత్తయి 2:2
యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ నున్నాడు? తూర్పుదిక్కున మేము ఆయన నక్షత్రము చూచి, ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి
మత్తయి 2:3
హేరోదురాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడ యెరూషలేము వారందరును కలవరపడిరి.
మత్తయి 2:4
కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలోనుండు శాస్త్రులను అందరిని సమకూర్చిక్రీస్తు ఎక్కడ పుట్టునని వారినడిగెను.
మత్తయి 2:5
అందుకు వారుయూదయ బేత్లెహేములోనే; ఏలయనగాయూదయదేశపు బేత్లెహేమా నీవు యూదా ప్రధానులలో ఎంతమాత్రమును అల్పమైనదానవు కావు;ఇశ్రాయేలను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలోనుండి వచ్చును అని ప్రవక్తద్వరా వ్రాయబడియున్నదనిరి.
మత్తయి 2:6
అంతట హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి,
మత్తయి 2:7
ఆ నక్షత్రము కనబడిన కాలము వారిచేత పరిష్కారముగా తెలిసికొని
మత్తయి 2:8
మీరు వెళ్లి, ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలిసికొనగానే, నేనును వచ్చి,ఆయనను పూజించునట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బేత్లెహేమునకు పంపెను.
మత్తయి 2:9
వారు రాజు మాటవిని బయలుదేరి పోవుచుండగా, ఇదిగో తూర్పుదేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచువరకు వారికి ముందుగా నడిచెను.
మత్తయి 2:10
వారు ఆ నక్షత్రమును చూచి, అత్యానందభరితులై యింటిలోనికి వచ్చి,
మత్తయి 2:11
తల్లియైన మరియను ఆ శిశువును చూచి, సాగిలపడి, ఆయనను పూజించి, తమ పెట్టెలు విప్పి, బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి.
మత్తయి 2:12
తరువాత హేరోదునొద్దకు వెళ్లవద్దని స్వప్నమందు దేవునిచేత బోధింపబడినవారై వారు మరియొక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్లిరి.
ఐగుప్తునకు
మత్తయి 2:13
వారు వెళ్ళినతరువాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెదకబోవుచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి, నేను నీతో తెలియజెప్పువరకు అక్కడనే యుండుమని అతనితో చెప్పెను.
మత్తయి 2:14
అప్పుడతడు లేచి, రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని,
మత్తయి 2:15
ఐగుప్తునకు వెళ్లి ఐగుప్తులోనుండి నా కుమారుని పిలిచితిని అని ప్రవక్తద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేర్చబడునట్లు హేరోదు మరణమువరకు అక్కడనుండెను.
మత్తయి 2:16
ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని, తాను జ్ఞానులవలన వివరముగా తెలిసికొనిన కాలమునుబట్టి, బేత్లెహేములోను దాని సకల ప్రాంతములలోను, రెండు సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సుగల మగపిల్లల నందరిని వధించెను.
మత్తయి 2:17
అందువలన రామాలో అంగలార్పు వినబడెను ఏడ్పును మహా రోదనధ్వనియు కలిగెను
మత్తయి 2:18
రాహేలు తన పిల్లలవిషయమై యేడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనొల్లక యుండెను అని ప్రవక్తయైన యిర్మీయాద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరెను.
యూదయదేశము
గలిలయ ప్రాంతము 
నజరేతను ఊరు 
మత్తయి 2:19
హేరోదు చనిపోయిన తరువాత ఇదిగో ప్రభువు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై
మత్తయి 2:20
నీవు లేచి, శిశువును తల్లిని తోడుకొని, ఇశ్రాయేలు దేశమునకు వెళ్లుము;
మత్తయి 2:21
శిశువు ప్రాణము తీయజూచుచుండినవారు చనిపోయిరని చెప్పెను. అప్పుడతడు లేచి, శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వచ్చెను.
మత్తయి 2:22
అయితే అర్కెలాయు తన తండ్రియైన హేరోదునకు ప్రతిగా యూదయదేశము
మత్తయి 2:23
ఏలుచున్నాడని విని, అక్కడికి వెళ్ల వెరచి, స్వప్నమందు దేవునిచేత బోధింపబడినవాడై గలిలయ ప్రాంతములకు వెళ్లి, నజరేతను ఊరికి వచ్చి అక్కడ కాపురముండెను. ఆయన నజరేయుడనబడునని ప్రవక్తలు చెప్పినమాట నెరవేరునట్లు (ఈలాగు జరిగెను.)
మత్తయి 3:3
ప్రభువు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరాళము చేయుడని అరణ్యములో కేకవేయు నొకని శబ్దము అని ప్రవక్తయైన యెషయా ద్వారా చెప్పబడినవాడితడే.
మత్తయి 3:4
ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును, మొలచుట్టు తోలుదట్టియు ధరించుకొనువాడు; మిడతలును అడవి తేనెయు అతనికి ఆహారము.
మత్తయి 3:5
ఆ సమయమున యెరూషలేమువారును యూదయ వారందరును యొర్దాను నదీప్రాంతముల వారందరును, అతనియొద్దకు వచ్చి,
మత్తయి 3:6
తమ పాపములు ఒప్పుకొనుచు, యొర్దాను నదిలో అతనిచేత బాప్తిస్మము పొందుచుండిరి.
మత్తయి 3:7
అతడు పరిసయ్యులలోను, సద్దూకయ్యులలోను, అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచిసర్పసంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పినవాడెవడు? మారుమనస్సుకు తగిన ఫలము ఫలించుడి.
మత్తయి 3:8
అబ్రాహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొనతలంచవద్దు;
మత్తయి 3:9
దేవుడు ఈ రాళ్లవలన అబ్రాహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను.
మత్తయి 3:10
ఇప్పుడే గొడ్డలి చెట్లవేరున ఉంచబడియున్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును.
మత్తయి 3:11
మారుమనస్సు నిమిత్తము నేను నీళ్లలో(లేక-నీళ్ళతో.) మీకు బాప్తిస్మ మిచ్చుచున్నాను; అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటె శక్తిమంతుడు; ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను; ఆయన పరిశుద్ధాత్మలోను(లేక, పరిశుద్ధాత్మతోను) అగ్నితోను మీకు బాప్తిస్మమిచ్చును.
మత్తయి 3:12
ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది; ఆయన తన కళ్లమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులోపోసి, ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని వారితో చెప్పెను.
బాప్తిస్మము
మత్తయి 3:13
ఆ సమయమున యోహానుచేత బాప్తిస్మము పొందుటకు యేసు గలిలయనుండి యొర్దాను దగ్గర నున్న అతనియొద్దకు వచ్చెను.
మత్తయి 3:14
అందుకు యోహాను నేను నీచేత బాప్తిస్మము పొందవలసినవాడనై యుండగా నీవు నాయొద్దకు వచ్చుచున్నావా? అని ఆయనను నివారింపజూచెను గాని
మత్తయి 3:15
యేసుఇప్పటికి కానిమ్ము; నీతి యావత్తు ఈలాగు నెర వేర్చుట మనకు తగియున్నదని అతనికి ఉత్తరమిచ్చెను గనుక అతడాలాగు కానిచ్చెను.
మత్తయి 3:16
యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలోనుండి ఒడ్డునకు వచ్చెను; ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురమువలె దిగి తనమీదికి వచ్చుట చూచెను.
మత్తయి 3:17
మరియుఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేనానందించుచున్నానని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను.
మత్తయి 4:1
ఉపవాసము
అప్పుడు యేసు అపవాది(అనగా సాతాను.) చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను.
మత్తయి 4:2
నలువది దినములు నలువది రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా
అపవాది శోధకుడు
మత్తయి 4:3
ఆ శోధకుడు ఆయనయొద్దకు వచ్చినీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు మనెను
మత్తయి 4:4
అందుకాయనమనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదుగాని దేవుని నోటనుండి వచ్చు ప్రతిమాటవలనను జీవించును అని వ్రాయబడియున్నదనెను.
మత్తయి 4:5
అంతట అపవాది(అనగా, సాతాను.) పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసికొనిపోయి, దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి
మత్తయి 4:6
నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుముఆయన నిన్ను గూర్చి తన దూతల కాజ్ఞాపించును,నీ పాదమెప్పుడైనను రాతికి తగులకుండ వారు నిన్ను చేతులతో ఎత్తికొందురు
మత్తయి 4:7
అని వ్రాయబడియున్నదని ఆయనతో చెప్పెను.అందుకు యేసుప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరియొక చోట వ్రాయబడియున్నదని వానితో చెప్పెను.
మత్తయి 4:8
మరల అపవాది మిగుల ఎత్తయిన యొక కొండమీదికి ఆయనను తోడుకొనిపోయి, యీ లోక రాజ్యములన్నిటిని, వాటి మహిమను ఆయనకు చూపి
మత్తయి 4:9
నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసినయెడల వీటినన్నిటిని నీకిచ్చెదనని ఆయనతో చెప్పగా
మత్తయి 4:10
యేసు వానితోసాతానా, పొమ్ముప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడియున్నదనెను.
మత్తయి 4:12
​యాహాను చెరపట్టబడెనని యేసు విని గలిలయకు తిరిగి వెళ్లి
కపెర్న హూము
మత్తయి 4:13
నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలి యను దేశముల ప్రాంతములలో సముద్రతీరమందలి కపెర్న హూమునకు వచ్చి కాపురముండెను.
మత్తయి 4:14
​జెబూలూను దేశమును, నఫ్తాలిదేశమును, యొర్దానుకు ఆవలనున్న సముద్రతీరమున అన్యజనులు నివసించు గలిలయయు
మత్తయి 4:15
చీకటిలో కూర్చుండియున్న ప్రజలును గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణచ్ఛాయలోను కూర్చుండియున్న వారికి వెలుగు ఉదయించెను
మత్తయి 4:16
అని ప్రవక్తయైన యెషయాద్వారా పలుకబడినది నెరవేరునట్లు (ఈలాగు జరిగెను.)
యేసుపరలోక రాజ్యము
మత్తయి 4:17
అప్పటినుండి యేసుపరలోక రాజ్యము సమీపించియున్నది గనుక మారుమనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను.
శిష్యులు 
మత్తయి 4:18
యేసు గలిలయ సముద్రతీరమున నడుచుచుండగా, పేతురనబడిన సీమోను అతని సహోదరుడైన అంద్రెయ అను ఇద్దరు సహోదరులు సముద్రములో వలవేయుట చూచెను; వారు జాలరులు.
మత్తయి 4:19
ఆయననా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టుజాలరులనుగా చేతునని వారితో చెప్పెను;
మత్తయి 4:20
వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి.
మత్తయి 4:21
ఆయన అక్కడనుండి వెళ్లి జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను మరి యిద్దరు సహోదరులు తమ తండ్రియైన జెబెదయి యొద్ద దోనెలో తమ వలలు బాగుచేసి కొనుచుండగా చూచి వారిని పిలిచెను.
మత్తయి 4:22
వంటనే వారు తమ దోనెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి.
స్వస్థపరచుట 
మత్తయి 4:23
యేసు వారి సమాజమందిరములలో బోధించుచు, (దేవుని) రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు, ప్రజలలోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుచు గలిలయయందంతట సంచరించెను.
మత్తయి 4:24
ఆయన కీర్తి సిరియ దేశమంతట వ్యాపించెను. నానావిధములైన రోగముల చేతను వేదనలచేతను పీడింపబడిన వ్యాధి గ్రస్తులనందరిని, దయ్యముపట్టినవారిని, చాంద్రరోగులను, పక్షవాయువు గలవారిని వారు ఆయనయొద్దకు తీసికొని రాగా ఆయన వారిని స్వస్థపరచెను.
మత్తయి 4:25
గలిలయ, దెకపొలి, యెరూషలేము, యూదయయను ప్రదేశములనుండియు యొర్దానునకు అవతలనుండియు బహు జనసమూహములు ఆయనను వెంబడించెను.
కొండయెక్కి కూర్చుండగా ఆయన శిష్యులాయనయొద్దకు వచ్చిరి.

మత్తయి 5:1
ఆయన ఆ జనసమూహములను చూచి కొండయెక్కి కూర్చుండగా ఆయన శిష్యులాయనయొద్దకు వచ్చిరి.
మత్తయి 5:2
అప్పుడాయన నోరు తెరచి యీలాగు బోధింపసాగెను
మత్తయి 5:3
ఆత్మవిషయమై దీనులైనవారు ధన్యులు; పరలోకరాజ్యము వారిది.
మత్తయి 5:4
దుఃఖపడువారు ధన్యులు; వారు ఓదార్చబడుదురు.
మత్తయి 5:5
సాత్వికులు ధన్యులు ; వారు భూలోకమును స్వతంత్రించుకొందురు.
మత్తయి 5:6
నీతికొరకు ఆకలిదప్పులు గలవారు ధన్యులు; వారు తృప్తిపరచబడుదురు.
మత్తయి 5:7
కనికరముగలవారు ధన్యులు; వారు కనికరము పొందుదురు.
మత్తయి 5:8
హృదయశుద్ధిగలవారు ధన్యులు; వారు దేవుని చూచెదరు.
మత్తయి 5:9
సమాధానపరచువారు ధన్యులు ; వారు దేవుని కుమారులనబడుదురు.
మత్తయి 5:10
నీతినిమిత్తము హింసింపబడువారు ధన్యులు; పరలోక రాజ్యము వారిది.
మత్తయి 5:11
నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీమీద అబద్ధముగా చెడ్డమాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు.
మత్తయి 5:12
సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి.
మత్తయి 5:13
మీరు లోకమునకు ఉప్పయి యున్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేనివలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుష్యులచేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు.
మత్తయి 5:14
మీరు లోకమునకు వెలుగైయున్నారు; కొండమీదనుండు పట్టణము మరుగై యుండనేరదు.
మత్తయి 5:15
మనుష్యులు దీపము వెలిగించి కుంచము క్రింద పెట్టరు కాని అది యింటనుండువారికందరికి వెలుగిచ్చుటకై దీపస్తంభముమీదనే పెట్టుదురు.
మత్తయి 5:16
మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారియెదుట మీ వెలుగు ప్రకాశింప నియ్యుడి.
మత్తయి 5:17
ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టి వేయవచ్చితినని తలంచవద్దు; నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు.
మత్తయి 5:18
ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరువరకు దానినుండి యొక పొల్లయినను ఒక సున్నయైనను తప్పి పోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.
మత్తయి 5:19
కాబట్టి యీ యాజ్ఞలలో మిగుల అల్పమైన యొకదానినైనను మీరి, మనుష్యులకు ఆలాగున చేయ బోధించువాడెవడో వాడు పరలోకరాజ్యములో మిగుల అల్పుడనబడును; అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోకరాజ్యములో గొప్పవాడనబడును.
మత్తయి 5:20
శాస్త్రుల నీతి కంటెను పరిసయ్యుల నీతికంటెను మీ నీతి అధికము కానియెడల మీరు పరలోకరాజ్యములో ప్రవేశింపనేరరని మీతో చెప్పుచున్నాను.
మత్తయి 5:21
నరహత్య చేయవద్దు; నరహత్య చేయువాడు విమర్శకులోనగునని పూర్వికులతో చెప్పబడిన మాట మీరు విన్నారు గదా.
మత్తయి 5:22
నేను మీతో చెప్పునదేమనగాతన సహోదరునిమీద(కొన్ని ప్రాచీన ప్రతులలో-నిర్నిమిత్తముగా అని కూర్చబడియున్నది.) కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును; ద్రోహీ అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును.
మత్తయి 5:23
కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము నర్పించుచుండగా నీమీద నీ సహోదరునికి విరోధమేమైననుకలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చినయెడల
మత్తయి 5:24
అక్కడ బలిపీఠము నెదుటనే నీ యర్పణము విడిచిపెట్టి, మొదట వెళ్లి నీ సహోదరునితో సమాధానపడుము; అటు తరువాత వచ్చి నీ యర్పణము నర్పింపుము.
మత్తయి 5:25
నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడుము; లేనియెడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బంట్రౌతుకు అప్పగించును, అంతట నీవు చెరసాలలో వేయబడుదువు.
మత్తయి 5:26
కడపటి కాసు చెల్లించువరకు అక్కడనుండి నీవు వెలుపలికి రానేరవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
మత్తయి 5:27
వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారుగదా;
మత్తయి 5:28
నేను మీతో చెప్పునదేమనగాఒక స్త్రీని మోహపుచూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును.
మత్తయి 5:29
నీ కుడికన్ను నిన్ను అభ్యంతర పరచినయెడల దాని పెరికి నీయొద్దనుండి పారవేయుము; నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండ నీ అవయవములలో నొకటి నశించుట నీకు ప్రయోజనకరముగదా.
మత్తయి 5:30
నీ కుడిచెయ్యి నిన్నభ్యంతర పరచినయెడల దాని నరికి నీయొద్దనుండి పారవేయుము; నీ దేహమంతయు నరకములో పడకుండ నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము గదా.
మత్తయి 5:31
తన భార్యను విడనాడువాడు ఆమెకు పరిత్యాగ పత్రిక యియ్యవలెనని చెప్పబడియున్నది గదా;
మత్తయి 5:32
నేను మీతో చెప్పునదేమనగావ్యభిచారకారణమునుబట్టి గాక, తన భార్యను విడనాడు ప్రతివాడును ఆమెను వ్యభిచారిణిగా చేయుచున్నాడు; విడనాడబడినదానిని పెండ్లాడువాడు వ్యభిచరించుచున్నాడు.
మత్తయి 5:33
మరియునీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలెనని పూర్వికులతో చెప్పబడిన మాట మీరు విన్నారు గదా,
మత్తయి 5:34
నేను మీతో చెప్పునదేమనగాఎంతమాత్రము ఒట్టుపెట్టుకొనవద్దు; ఆకాశము తోడన వద్దు; అది దేవుని సింహాసనము,ఒ భూమి తోడన వద్దు,
మత్తయి 5:35
అది ఆయన పాదపీఠము, యెరూషలేముతోడన వద్దు; అది మహారాజు పట్టణము
మత్తయి 5:36
నీ తల తోడని ఒట్టుపెట్టుకొనవద్దు, నీవు ఒక వెండ్రుకనైనను తెలుపుగా గాని నలుపుగా గాని చేయలేవు.
మత్తయి 5:37
మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని యుండవలెను; వీటికి మించునది దుష్టునినుండి(లేక-కీడునుండి) పుట్టునది.
మత్తయి 5:38
కంటికి కన్ను, పంటికి పల్లు అని చెప్పబడిన మాట మీరు విన్నారు గదా.
మత్తయి 5:39
నేను మీతో చెప్పునదేమనగా దుష్టుని ఎదిరింపక, నిన్ను కుడిచెంపమీద కొట్టువాని వైపునకు ఎడమచెంపకూడ త్రిప్పుము.
మత్తయి 5:40
ఎవడైన నీమీద వ్యాజ్యెము వేసి నీ అంగీ తీసికొనగోరిన యెడల వానికి నీ పైవస్త్రముకూడ ఇచ్చివేయుము.
మత్తయి 5:41
ఒకడు ఒక మైలు దూరము రమ్మని నిన్ను బలవంతము చేసినయెడల, వానితో కూడ రెండు మైళ్లు వెళ్లుము.
మత్తయి 5:42
నిన్ను అడుగువానికిమ్ము, నిన్ను అప్పు అడుగ గోరువానినుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు.
మత్తయి 5:43
నీ పొరుగువాని ప్రేమించి, నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు గదా;
మత్తయి 5:44
నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించు వారికొరకు ప్రార్థన చేయుడి.
మత్తయి 5:45
ఆయన చెడ్డవారిమీదను మంచివారిమీదను తన సూర్యుని ఉదయింపజేసి, నీతిమంతులమీదను, అనీతి మంతులమీదను వర్షము కురిపించుచున్నాడు.
మత్తయి 5:46
మీరు మిమ్మును ప్రేమించువారినే ప్రేమించినయెడల మీకేమి ఫలము కలుగును? సుంకరులును ఆలాగు చేయుచున్నారుగదా.
మత్తయి 5:47
మీ సహోదరులకు మాత్రము వందనము చేసినయెడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులును ఆలాగు చేయుచున్నారుగదా.
మత్తయి 5:48
మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు.
మత్తయి 6:1
మనుష్యులకు కనబడవలెనని వారియెదుట మీ నీతి కార్యము చేయకుండ జాగ్రత్తపడుడి; లేనియెడల పరలోకమందున్న మీ తండ్రియొద్ద మీరు ఫలము పొందరు.
మత్తయి 6:2
కావున నీవు ధర్మము చేయునప్పుడు, మనుష్యులవలన ఘనత నొందవలెనని, వేషధారులు సమాజమందిరములలోను వీధులలోను చేయులాగున నీ ముందర బూర ఊదింపవద్దు; వారు తమ ఫలము పొందియున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.
మత్తయి 6:3
నీవైతే ధర్మము చేయునప్పుడు, నీ ధర్మము రహస్యముగానుండు నిమిత్తము నీ కుడిచెయ్యి చేయునది నీ యెడమచేతికి తెలియక యుండవలెను.
మత్తయి 6:4
అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును
మత్తయి 6:5
మరియు మీరు ప్రార్థనచేయునప్పుడు వేషధారుల వలె ఉండవద్దు; మనుష్యులకు కనబడవలెనని సమాజ మందిరములలోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికిష్టము; వారు తమ ఫలము పొందియున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.
మత్తయి 6:6
నీవు ప్రార్థన చేయునప్పుడు, నీ గదిలోనికి వెళ్లి తలుపువేసి, రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థనచేయుము; అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును.
మత్తయి 6:7
మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు అన్యజనులవలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు; విస్తరించి మాటలాడుటవలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు;
మత్తయి 6:8
మీరు వారివలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడుగక మునుపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలియును
ప్రార్థన చేయుడి
మత్తయి 6:9
కాబట్టి మీరీలాగు ప్రార్థనచేయుడి, పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడుగాక,
మత్తయి 6:10
నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక,
మత్తయి 6:11
మా అనుదినాహారము నేడు మాకు దయచేయుము.
మత్తయి 6:12
మా ఋణస్థులను మేము క్షమించియున్న ప్రకారము మా ఋణములు క్షమించుము.
మత్తయి 6:13
మమ్మును శోధనలోకి తేక దుష్టునినుండి(లేక-కీడునుండి) మమ్మును తప్పించుము.(కొన్ని ప్రాచీన ప్రతులలో-రాజ్యము, బలము, మహిమయు నీవైయున్నవి, ఆమేన్, అని కూర్చబడియున్నది)
మత్తయి 6:14
మనుష్యుల అపరాధములను మీరు క్షమించినయెడల, మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును.
మత్తయి 6:15
మీరు మనుష్యుల అపరాధములను క్షమింపక పోయినయెడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు.
మత్తయి 6:16
మీరు ఉపవాసము చేయునప్పుడు వేషధారులవలె దుఃఖముఖులై యుండకుడి; తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుష్యులకు కనబడవలెనని వారు తమ ముఖములను వికారము చేసికొందురు; వారు తమ ఫలము పొందియున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.
మత్తయి 6:17
ఉపవాసము చేయుచున్నట్టు మనుష్యులకు కనబడవలెనని కాక, రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలెనని, నీవు ఉపవాసము చేయునప్పుడు నీ తల అంటుకొని, నీ ముఖము కడుగుకొనుము.
మత్తయి 6:18
అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును.
మత్తయి 6:19
భూమిమీద మీకొరకు ధనమును కూర్చుకొనవద్దు; ఇక్కడ చిమ్మెటయు, తుప్పును తినివేయును, దొంగలు కన్నమువేసి దొంగిలెదరు.
మత్తయి 6:20
పరలోకమందు మీకొరకు ధనమును కూర్చుకొనుడి; అచ్చట చిమ్మెటయైనను, తుప్పైనను దాని తినివేయదు, దొంగలు కన్నమువేసి దొంగిలరు.
మత్తయి 6:21
నీ ధనమెక్కడ నుండునో అక్కడనే నీ హృదయము ఉండును.
మత్తయి 6:22
దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండినయెడల నీ దేహమంతయు వెలుగు మయమైయుండును.
మత్తయి 6:23
నీ కన్ను చెడినదైతే నీ దేహ మంతయు చీకటిమయమై యుండును; నీలోనున్న వెలుగు చీకటియై యుండిన యెడల ఆ చీకటి యెంతో గొప్పది.
మత్తయి 6:24
ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు; అతడు ఒకని ద్వేషించియొకని ప్రేమించును; లేదా యొకని పక్షముగానుండి యొకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు.
మత్తయి 6:25
అందువలన నేను మీతో చెప్పునదేమనగాఏమి తిందుమో యేమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చియైనను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చియైనను చింతింపకుడి; ఆహారముకంటె ప్రాణము,వస్త్రముకంటె దేహమును గొప్పవి కావా?
మత్తయి 6:26
ఆకాశపక్షులను చూడుడి; అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు; అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు; మీరు వాటికంటె బహు శ్రేష్టులు కారా?
మత్తయి 6:27
మీలో నెవడు చింతించుటవలన తన యెత్తు మూరెడెక్కువ చేసికొనగలడు?
మత్తయి 6:28
వస్త్రములను గూర్చి మీరు చింతింపనేల? అడవిపువ్వులు ఏలాగు నెదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, ఒడకవు
మత్తయి 6:29
అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో నొకదానివలెనైనను అలంకరింపబడలేదు.
మత్తయి 6:30
నేడుండి రేపు పొయిలో వేయబడు అడవి గడ్డిని దేవుడీలాగు అలంకరించినయెడల, అల్పవిశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును గదా.
మత్తయి 6:31
కాబట్టి ఏమి తిందుమో యేమి త్రాగుదుమో యేమి ధరించుకొందుమో అని చింతింపకుడి; అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు.
మత్తయి 6:32
ఇవన్నియు మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియును.
మత్తయి 6:33
కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును.
మత్తయి 6:34
రేపటినిగూర్చి చింతింపకుడి; రేపటి దినము దాని సంగతులనుగూర్చి చింతించును; ఏనాటికీడు ఆనాటికి చాలును.
మత్తయి 7:1
మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మునుగూర్చి తీర్పు తీర్చబడదు.
మత్తయి 7:2
మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చియు తీర్పు తీర్చబడును, మీరు కొలుచుకొలత చొప్పుననే మీకును కొలువబడును.
మత్తయి 7:3
నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట యేల?
మత్తయి 7:4
నీ కంటిలో దూలముండగా, నీవు నీ సహోదరుని చూచినీకంటిలో నున్న నలుసును తీసివేయనిమ్మని చెప్పనేల?
మత్తయి 7:5
వేషధారీ, మొదట నీ కంటిలో నున్న దూలమును తీసివేసికొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును.
మత్తయి 7:6
పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందులయెదుట వేయకుడి; వేసినయెడల అవి యొకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీమీద పడి మిమ్మును చీల్చి వేయును.
మత్తయి 7:7
అడుగుడి మీకియ్యబడును. వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును.
మత్తయి 7:8
అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరకును, తట్టువానికి తీయబడును.
మత్తయి 7:9
మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగినయెడల వానికి రాతినిచ్చునా? చేపను అడిగినయెడల పామునిచ్చునా?
మత్తయి 7:10
మీరు చెడ్డవారై యుండియు మీ పిల్లలకు మంచి యీవుల నియ్యనెరిగి యుండగా
మత్తయి 7:11
పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటె ఎంతో నిశ్చయముగా మంచియీవుల నిచ్చును.
మత్తయి 7:12
కావున మనుష్యులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో ఆలాగుననే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశము నైయున్నది.
మత్తయి 7:13
ఇరుకు ద్వారమున ప్రవేశించుడి; నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునైయున్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు.
మత్తయి 7:14
​జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై యున్నది, దాని కనుగొనువారు కొందరే.
మత్తయి 7:15
అబద్ధ ప్రవక్తలనుగూర్చి జాగ్రత్తపడుడి. వారు గొఱ్ఱెల చర్మములు వేసికొని మీయొద్దకు వత్తురు కాని లోపల వారు క్రూరమైన తోడేళ్లు.
మత్తయి 7:16
వారి ఫలములవలన మీరు వారిని తెలిసికొందురు. ముండ్లపొదలలో ద్రాక్ష పండ్లనైనను, పల్లేరుచెట్లను అంజూరపు పండ్లనైనను కోయుదురా?
మత్తయి 7:17
ఆలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికిమాలిన చెట్టు, కానిఫలములు ఫలించును.
మత్తయి 7:18
మంచి చెట్టు కానిఫలములు ఫలింపనేరదు, పనికిమాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు.
మత్తయి 7:19
మంచి ఫలములు ఫలింపని ప్రతిచెట్టు నరకబడి అగ్నిలో వేయబడును.
మత్తయి 7:20
కాబట్టి మీరు వారి ఫలములవలన వారిని తెలిసికొందురు.
మత్తయి 7:21
ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకరాజ్యములో ప్రవేశింపడుగాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును.
మత్తయి 7:22
ఆ దినమందు అనేకులు నన్ను చూచిప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? అని చెప్పుదురు.
మత్తయి 7:23
అప్పుడు నేను మిమ్మును ఎన్నడును ఎరుగను, అక్రమము చేయువారలారా, నాయొద్దనుండి పొండని వారితో చెప్పుదును.
మత్తయి 7:24
కాబట్టి యీ నా మాటలు విని వాటిచొప్పున చేయు ప్రతివాడును బండమీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును.
మత్తయి 7:25
వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ యింటిమీద కొట్టెను గాని దాని పునాది బండమీద వేయబడెను గనుక అది పడలేదు.
మత్తయి 7:26
మరియు యీ నా మాటలు విని వాటిచొప్పున చేయని ప్రతివాడు ఇసుకమీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును.
మత్తయి 7:27
వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ యింటిమీద కొట్టెను, అప్పుడది కూలబడెను; దాని పాటు గొప్పదని చెప్పెను.
మత్తయి 7:28
యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి.
మత్తయి 7:29
ఏలయనగా ఆయన వారి శాస్త్రులవలె కాక అధికారముగలవానివలె వారికి బోధించెను.
మత్తయి 8:1
ఆయన ఆ కొండమీదనుండి దిగి వచ్చినప్పుడు బహు జనసమూహములు ఆయనను వెంబడించెను.
మత్తయి 8:2
ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కిప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవనెను.
మత్తయి 8:3
అందుకాయన చెయ్యి చాపి వాని ముట్టినాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ట రోగము శుద్ధియాయెను.
మత్తయి 8:4
అప్పుడు యేసుఎవరితోను ఏమియు చెప్పకు సుమీ; కాని నీవు వెళ్ళి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనబరచుకొని, మోషే నియమించిన కానుక సమర్పించుమని వానితో చెప్పెను.
మత్తయి 8:5
ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయనయొద్దకు వచ్చి
మత్తయి 8:6
ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడియున్నాడని చెప్పి, ఆయనను వేడుకొనెను.
మత్తయి 8:7
యేసు నేను వచ్చి వాని స్వస్థపరచెదనని అతనితో చెప్పగా
మత్తయి 8:8
ఆ శతాధిపతిప్రభువా, నీవు నా యింటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను; నీవు మాటమాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును.
మత్తయి 8:9
నేను కూడ అధికారమునకు లోబడినవాడను; నా చేతిక్రింద సైనికులున్నారు; నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును, నా దాసుని ఈ పని చేయుమంటే చేయును అని యుత్తరమిచ్చెను.
మత్తయి 8:10
యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి, వెంట వచ్చుచున్నవారిని చూచిఇశ్రాయేలులో నెవనికైనను నేనింత విశ్వాసమున్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.
మత్తయి 8:11
అనేకులు తూర్పునుండియు పడమటనుండియు వచ్చి అబ్రాహాముతో కూడను, ఇస్సాకుతో కూడను, యాకోబుతో కూడను, పరలోకరాజ్యమందు కూర్చుందురు గాని
మత్తయి 8:12
రాజ్య సంబంధులు(మూలభాషలో-రాజ్యకుమారులు) వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు; అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు నుండునని మీతో చెప్పుచున్నాననెను.
మత్తయి 8:13
అంతట యేసుఇక వెళ్ళుము; నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాకని శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతనిదాసుడు స్వస్థతనొందెను.
మత్తయి 8:14
తరువాత యేసు పేతురింటిలో ప్రవేశించి, జ్వరముతో పడియున్న అతని అత్తను చూచి
మత్తయి 8:15
ఆమె చెయ్యిముట్టగా జ్వరమామెను విడిచెను; అంతట ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగెను.
మత్తయి 8:16
సాయంకాలమైనప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయనయొద్దకు తీసికొని వచ్చిరి.
మత్తయి 8:17
ఆయన మాటవలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులనెల్లను స్వస్థపరచెను. అందువలనఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెనని ప్రవక్తయైన యెషయాద్వార చెప్పబడినది నెరవేరెను.
మత్తయి 8:18
యేసు తన యొద్దనున్న జన సమూహమును చూచి అద్దరికి వెళ్ళవలెనని ఆజ్ఞాపించెను.
మత్తయి 8:19
అంతట ఒక శాస్త్రి వచ్చిబోధకుడా నీ వెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చెదనని ఆయనతో చెప్పెను.
మత్తయి 8:20
అందుకు యేసునక్కలకు బొరియలును ఆకాశపక్షులకు నివాసములును కలవు గాని మనుష్యకుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలములేదని అతనితో చెప్పెను.
మత్తయి 8:21
శిష్యులలో మరియొకడుప్రభువా, నేను మొదట వెళ్ళి, నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయనను అడుగగా
మత్తయి 8:22
యేసు అతని చూచినన్ను వెంబడించుము; మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననిమ్మని చెప్పెను.
మత్తయి 8:23
ఆయన దోనె యెక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్లిరి.
మత్తయి 8:24
అంతట సముద్రముమీద తుపాను లేచినందున ఆ దోనె అలలచేత కప్పబడెను. అప్పుడాయన నిద్రించుచుండగా
మత్తయి 8:25
వారు ఆయన యొద్దకు వచ్చిప్రభువా, నశించిపోవుచున్నాము, మమ్మును రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి.
మత్తయి 8:26
అందుకాయనఅల్పవిశ్వాసులారా, యెందుకు భయపడుచున్నారని వారితో చెప్పి, లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మళ మాయెను.
మత్తయి 8:27
ఆ మనుష్యులు ఆశ్చర్యపడిఈయన ఎట్టివాడో; ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి.
మత్తయి 8:28
ఆయన అద్దరినున్న గదరేనీయుల దేశము చేరగా దయ్యములు పట్టిన యిద్దరు మనుష్యులు సమాధులలో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి. వారు మిగుల ఉగ్రులైనందున ఎవడును ఆ మార్గమున వెళ్లలేక పోయెను.
మత్తయి 8:29
వారుఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి? కాలము రాకమునుపే మమ్మును బాధించుటకు ఇక్కడికి వచ్చితివా? అని కేకలువేసిరి.
మత్తయి 8:30
వారికి దూరమున గొప్ప పందుల మంద మేయుచుండగా
మత్తయి 8:31
ఆ దయ్యములు నీవు మమ్మును వెళ్ల గొట్టినయెడల ఆ పందుల మందలోనికి పోనిమ్మని ఆయనను వేడుకొనెను.
మత్తయి 8:32
ఆయన వాటిని పొమ్మనగా అవి ఆ మనుష్యులను వదలిపెట్టి ఆ పందులలోనికి పోయెను; ఇదిగో ఆ మందంతయు ప్రపాతము నుండి సముద్రములోనికి వడిగా పరుగెత్తికొనిపోయి నీళ్లలో పడిచచ్చెను.
మత్తయి 8:33
వాటిని మేపుచున్నవారు పారిపోయి పట్టణములోనికి వెళ్లి జరిగిన కార్యములన్నియు దయ్యములు పట్టినవారి సంగతియు తెలిపిరి.
మత్తయి 8:34
ఇదిగో ఆ పట్టణస్థులందరు యేసును ఎదుర్కొనవచ్చి ఆయనను చూచి తమ ప్రాంతములను విడిచి పొమ్మని ఆయనను వేడుకొనిరి.
మత్తయి 9:1
తరువాత ఆయన దోనె యెక్కి సముద్రము దాటి తన పట్టణములో ప్రవేశింపగా
మత్తయి 9:2
ఇదిగో జనులు పక్ష వాయువుతో మంచముపట్టియున్న యొకని ఆయన యొద్దకు తీసికొనివచ్చిరి. యేసు వారి విశ్వాసముచూచి కుమారుడా(మూలభాషలో-బిడ్డా) ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడియున్నవని పక్షవాయువు గల వానితో చెప్పెను.
మత్తయి 9:3
ఇదిగో శాస్త్రులలో కొందరుఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలోతాము అనుకొనగా
మత్తయి 9:4
యేసు వారి తలంపులు గ్రహించిమీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు?
మత్తయి 9:5
నీ పాపములు క్షమింపబడియున్నవని చెప్పుట సులభమా, లేచి నడువుమని చెప్పుట సులభమా?
మత్తయి 9:6
అయినను పాపములు క్షమించుటకు భూమిమీద మనుష్యకుమారునికి అధికారము కలదని మీరు తెలిసికొనవలెను అని చెప్పి, ఆయన పక్షవాయువుగలవాని చూచినీవు లేచి నీ మంచమెత్తికొని నీ యింటికి పొమ్మని చెప్పగా
మత్తయి 9:7
వాడు లేచి తన యింటికి వెళ్లెను.
మత్తయి 9:8
జనులు అది చూచి భయపడి, మనుష్యులకిట్టి అధికారమిచ్చిన దేవుని మహిమపరచిరి.
మత్తయి 9:9
యేసు అక్కడనుండి వెళ్లుచు సుంకపు మెట్టునొద్ద కూర్చుండియున్న మత్తయి అను ఒక మనుష్యుని చూచినన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను.
మత్తయి 9:10
ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుండియుండగా ఇదిగో సుంకరులును పాపులును అనేకులు వచ్చి ఆయనయొద్దను ఆయన శిష్యులయొద్దను కూర్చుండిరి.
మత్తయి 9:11
పరిసయ్యులు అది చూచిమీ బోధకుడు సుంకరులతోను పాపులతోను కలిసి యెందుకు భోజనము చేయుచున్నాడని ఆయన శిష్యులనడిగిరి.
మత్తయి 9:12
ఆయన ఆ మాటవినిరోగులకేగాని ఆరోగ్యము గలవారికి వైద్యుడక్కరలేదు గదా.
మత్తయి 9:13
అయితే నేను పాపులను పిలువ వచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదు. గనుకకనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అనువాక్య భావమేమిటో మీరు వెళ్లి నేర్చుకొనుడని చెప్పెను.
మత్తయి 9:14
అప్పుడు యోహాను శిష్యులు ఆయనయొద్దకు వచ్చిపరిసయ్యులును, మేమును తరచుగా ఉపవాసము చేయుచున్నాము గాని నీ శిష్యులు ఉపవాసము చేయరు; దీనికి హేతువేమని ఆయనను అడుగగా
మత్తయి 9:15
యేసుపెండ్లి కుమారుడు తమతో కూడ నుండు కాలమున పెండ్లియింటి వారు దుఃఖపడగలరా? పెండ్లికుమారుడు వారియొద్దనుండి కొనిపోబడు దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసము చేతురు.
మత్తయి 9:16
ఎవడును పాత బట్టకు క్రొత్తబట్ట మాసిక వేయడు; వేసినయెడల ఆ మాసిక బట్టను వెలితిపరచును చినుగు మరి ఎక్కువగును.
మత్తయి 9:17
మరియు పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము పోయరు; పోసినయెడల తిత్తులు పిగిలి, ద్రాక్షారసము కారిపోవును, తిత్తులు పాడగును. అయితే క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తులలో పోయుదురు, అప్పుడు ఆ రెండును చెడిపోక యుండునని చెప్పెను.
మత్తయి 9:18
ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా, ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కినా కుమార్తె యిప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమెమీద ఉంచుము, ఆమె బ్రదుకుననెను.
మత్తయి 9:19
యేసు లేచి అతని వెంట వెళ్లెను; ఆయన శిష్యులు కూడ వెళ్లిరి.
మత్తయి 9:20
ఆ సమయమున, ఇదిగో పండ్రెండు సంవత్సరములనుండి రక్తస్రావరోగముగల యొక స్త్రీ
మత్తయి 9:21
నేను ఆయన పై వస్త్రము మాత్రము ముట్టితే బాగుపడుదునని తనలో తాను అనుకొని, ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను.
మత్తయి 9:22
యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచికుమారీ, ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరచెనని చెప్పగా ఆ గడియనుండి ఆ స్త్రీ బాగుపడెను.
మత్తయి 9:23
అంతలో యేసు ఆ అధికారి యింటికి వచ్చి, పిల్లన గ్రోవులు వాయించు వారిని, గొల్లు చేయుచుండు జనసమూహమును చూచి
మత్తయి 9:24
స్థలమియ్యుడి; ఈ చిన్నది నిద్రించుచున్నదేగాని చనిపోలేదని వారితో చెప్పగా వారాయనను అపహసించిరి.
మత్తయి 9:25
జనసమూహమును పంపివేసి, ఆయన లోపలికి వెళ్లి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను.
మత్తయి 9:26
ఈ సమాచారము ఆ దేశమంతటను వ్యాపించెను.
మత్తయి 9:27
యేసు అక్కడనుండి వెళ్లుచుండగా ఇద్దరు గ్రుడ్డివారు ఆయన వెంట వచ్చిదావీదు కుమారుడా, మమ్మును కనికరించుమని కేకలువేసిరి.
మత్తయి 9:28
ఆయన యింట ప్రవేశించిన తరువాత ఆ గ్రుడ్డివారు ఆయనయొద్దకు వచ్చిరి. యేసు నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా? అని వారి నడుగగా
మత్తయి 9:29
వారునమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడాయన వారి కన్నులు ముట్టిమీ నమ్మికచొప్పున మీకు కలుగుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరువబడెను.
మత్తయి 9:30
అప్పుడు యేసుఇది ఎవరికిని తెలియకుండ చూచుకొనుడని వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను.
మత్తయి 9:32
యేసును ఆయన శిష్యులును వెళ్లుచుండగా కొందరు, దయ్యముపట్టిన యొక మూగవాని ఆయనయొద్దకు తీసికొని వచ్చిరి.
మత్తయి 9:33
దయ్యము వెళ్లగొట్టబడిన తరువాత ఆ మూగవాడు మాటలాడగా జనసమూహములు ఆశ్చర్యపడిఇశ్రాయేలులో ఈలాగు ఎన్నడును కనబడలేదని చెప్పుకొనిరి.
మత్తయి 9:34
అయితే పరిసయ్యులుఇతడు దయ్యముల అధిపతివలన దయ్యములను వెళ్లగొట్టుచున్నాడని చెప్పిరి.
మత్తయి 9:35
యేసు వారి సమాజమందిరములలో బోధించుచు రాజ్యసువార్త ప్రకటించుచు, ప్రతివిధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు, సమస్త పట్టణములయందును గ్రామములయందును సంచారము చేసెను.
మత్తయి 9:36
ఆయన సమూహములను చూచి, వారు కాపరిలేని గొఱ్ఱెలవలె విసికి చెదరియున్నందున వారిమీద కనికరపడి
మత్తయి 9:37
​కోత విస్తారమేగాని పనివారు కొద్దిగా ఉన్నారు
మత్తయి 9:38
గనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పెను.
12 మంది శిష్యలు
మత్తయి 10:1
ఆయన తన పండ్రెండుమంది శిష్యులను పిలిచి, అపవిత్రాత్మలను వెళ్లగొట్టుటకును, ప్రతివిధమైన రోగమును ప్రతివిధమైన వ్యాధిని స్వస్థపరచుటకును, వారికి అధికార మిచ్చెను.
మత్తయి 10:2
ఆ పండ్రెండుమంది అపొస్తలుల పేర్లు ఏవనగా, మొదట పేతురనబడిన సీమోను, అతని సహోదరుడగు అంద్రెయ; జెబెదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను;
మత్తయి 10:3
ఫిలిప్పు, బర్తొలొమయి; తోమా, సుంకరియైన మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, తద్దయియను మారుపేరుగల లెబ్బయి;
మత్తయి 10:4
కనానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా.
మత్తయి 10:5
యేసు ఆ పండ్రెండుమందిని పంపుచు, వారినిచూచి వారికాజ్ఞాపించినదేమనగామీరు అన్యజనుల దారిలోనికి వెళ్లకుడి, సమరయుల యే పట్టణములోనైనను ప్రవేశింపకుడి గాని
మత్తయి 10:6
ఇశ్రాయేలు వంశములోని నశించిన గొఱ్ఱెల యొద్దకే వెళ్లుడి.
మత్తయి 10:7
వెళ్లుచుపరలోకరాజ్యము సమీపించియున్నదని ప్రకటించుడి.
మత్తయి 10:8
రోగులను స్వస్థపరచుడి, చనిపోయినవారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులనుగా చేయుడి, దయ్యములను వెళ్లగొట్టుడి. ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయ్యుడి.
మత్తయి 10:9
మీ సంచులలో బంగారమునైనను వెండినైనను రాగినైనను ప్రయాణము కొరకు జాలెనైనను రెండు అంగీలనైనను చెప్పులనైనను చేతికఱ్ఱనైనను సిద్ధపరచుకొనకుడి;
మత్తయి 10:10
పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా?
మత్తయి 10:11
మరియు మీరు ఏపట్టణములో నైనను గ్రామములోనైనను ప్రవేశించునప్పుడు, అందులో ఎవడు యోగ్యుడో విచారణచేసి, అక్కడనుండి వెళ్లువరకు అతని యింటనే బసచేయుడి.
మత్తయి 10:12
ఆ యింటిలో ప్రవేశించుచు, ఇంటివారికి శుభమని చెప్పుడి.
మత్తయి 10:13
ఆ యిల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దానిమీదికి వచ్చును; అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును.
మత్తయి 10:14
ఎవడైనను మిమ్మును చేర్చు కొనక మీ మాటలు వినకుండిన యెడల మీరు ఆ యింటినైనను ఆ పట్టణమైనను విడిచిపోవునప్పుడు మీ పాదధూళి దులిపివేయుడి.
మత్తయి 10:15
విమర్శదినమందు ఆ పట్టణపు గతికంటె సొదొమ గొమొఱ్ఱా ప్రదేశముల గతి ఓర్వతగినదై యుండునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.
మత్తయి 10:16
ఇదిగో తోడేళ్లమధ్యకు గొఱ్ఱెలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను గనుక పాములవలె వివేకులును పావురములవలె నిష్కపటులునైయుండుడి.
మత్తయి 10:17
మనుష్యులనుగూర్చి జాగ్రత్తపడుడి; వారు మిమ్మును మహాసభలకు అప్పగించి, తమ సమాజమందిరములలో మిమ్మును కొరడా లతో కొట్టింతురు,
మత్తయి 10:18
వీరికిని అన్యజనులకును సాక్ష్యార్థమై నానిమిత్తము మీరు అధిపతులయొద్దకును రాజులయొద్దకును తేబడుదురు.
మత్తయి 10:19
వారు మిమ్మును అప్పగించునప్పుడు, ఏలాగు మాటాడుదుము? ఏమి చెప్పుదుము? అని చింతింప కుడి; మీరేమి చెప్పవలెనో అది ఆ గడియలోనే మీకను గ్రహింపబడును.
మత్తయి 10:20
మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాటలాడుచున్నాడే గాని మాటలాడువారు మీరు కారు.
మత్తయి 10:21
సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుని, మరణమునకు అప్పగించెదరు; పిల్లలు తలిదండ్రులమీద లేచి వారిని చంపించెదరు.
మత్తయి 10:22
మీరు నా నామము నిమిత్తము అందరిచేత ద్వేషింపబడుదురు; అంతమువరకును సహించిన వాడు రక్షంపబడును.
మత్తయి 10:23
వారు ఈ పట్టణములో మిమ్మును హింసించునప్పుడు మరియొక పట్టణమునకు పారిపోవుడి; మనుష్యకుమారుడు వచ్చువరకు మీరు ఇశ్రాయేలు పట్టణములలో సంచారము చేసియుండరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.
మత్తయి 10:24
శిష్యుడు బోధకునికంటె అధికుడు కాడు; దాసుడు యజమానునికంటె అధికుడు కాడు.
మత్తయి 10:25
శిష్యుడు తన బోధకునివలెను దాసుడు తన యజమానునివలెను ఉండిన చాలును. ఇంటి యజమానునికి బయెల్జెబూలని వారు పేరుపెట్టి యుండినయెడల ఆయన యింటివారికి మరి నిశ్చయముగా ఆ పేరు పెట్టుదురు గదా.
మత్తయి 10:26
కాబట్టి మీరు వారికి భయపడకుడి, మరుగైనదేదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు.
మత్తయి 10:27
చీకటిలో నేను మీతో చెప్పునది మీరు వెలుగులో చెప్పుడి; చెవిలో మీకు చెప్పబడినది మేడలమీద ప్రకటించుడి.
మత్తయి 10:28
మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని, ఆత్మను దేహమునుకూడ నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి.
మత్తయి 10:29
రెండు పిచ్చుకలు కాసుకు అమ్మబడును గదా; అయినను మీ తండ్రి సెలవులేక వాటిలో ఒకటైనను నేలను పడదు.
మత్తయి 10:30
మీ తలవెండ్రుకలన్నియు లెక్కింపబడియున్నవి
మత్తయి 10:31
గనుక మీరు భయపడకుడి; మీరనేకమైన పిచ్చుకలకంటె శ్రేష్ఠులు.
మత్తయి 10:32
మనుష్యులయెదుట నన్ను ఒప్పుకొనువాడెవడో పరలోకమందున్న నా తండ్రి యెదుట నేనును వానిని ఒప్పుకొందును.
మత్తయి 10:33
మనుష్యుల యెదుట ఎవడు నన్ను ఎరుగననునో వానిని పరలోకమందున్న నా తండ్రియెదుట నేనును ఎరుగనందును.
మత్తయి 10:34
నేను భూమిమీదికి సమాధానమును పంపవచ్చితినని తలంచకుడి; ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు.
మత్తయి 10:35
ఒక మనుష్యునికిని వాని తండ్రికిని, కుమార్తెకును ఆమె తల్లికిని, కోడలికిని ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చితిని.
మత్తయి 10:36
​ఒక మనుష్యుని యింటివారే అతనికి శత్రువులగుదురు.
మత్తయి 10:37
తండ్రినైనను తల్లినైనను నా కంటె ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడుకాడు; కుమారునినైనను కుమార్తెనైనను నాకంటె ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు;
మత్తయి 10:38
తన సిలువను ఎత్తికొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు.
మత్తయి 10:39
తన ప్రాణము దక్కించుకొనువాడు దాని పోగొట్టుకొనును గాని నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకొనువాడు దాని దక్కించుకొనును.
మత్తయి 10:40
మిమ్మును చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును; నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపినవాని చేర్చుకొనును.
మత్తయి 10:41
ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకొనువాడు ప్రవక్తఫలము పొందును; నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకొనువాడు నీతిమంతుని ఫలము పొందును.
మత్తయి 10:42
మరియు శిష్యుడని యెవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.
మత్తయి 11:5
గ్రుడ్డివారు చూపుపొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటి వారు వినుచున్నారు, చనిపోయినవారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది.
మత్తయి 11:19
మనుష్యకుమారుడు తినుచును త్రాగుచును వచ్చెను గనుకఇదిగో వీడు తిండిబోతును మద్యపానియు సుంకరులకును పాపులకును స్నేహితుడునని వారనుచున్నారు. అయినను జ్ఞానము జ్ఞానమని దాని క్రియలనుబట్టి(అనేక ప్రాచీన ప్రతులలో-దాని పిల్లలనుబట్టి అని పాఠాంతరము) తీర్పుపొందుననెను.
మత్తయి 11:20
పిమ్మట ఏ యే పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ పట్టణములవారు మారుమనస్సు పొందకపోవుటవలన ఆయన వారి నిట్లు గద్దింపసాగెను.
మత్తయి 11:21
అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సయిదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోనుపట్టణములలో చేయబడిన యెడల ఆ పట్టణములవారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిదె వేసికొని మారుమనస్సు పొందియుందురు.
మత్తయి 11:22
విమర్శదినమందు మీ గతికంటె తూరు సీదోను పట్టణములవారి గతి ఓర్వతగినదై యుండునని మీతో చెప్పుచున్నాను.
మత్తయి 11:23
కపెర్నహూమా, ఆకాశముమట్టునకు హెచ్చింపబడెదవా? నీవు పాతాళమువరకు దిగి పోయెదవు. నీలో చేయబడిన అద్భుతములు సొదొ మలో చేయబడిన యెడల అది నేటివరకు నిలిచియుండును.
మత్తయి 11:24
విమర్శదినమందు నీ గతికంటె సొదొమ దేశపువారి గతి ఓర్వతగినదై యుండునని మీతో చెప్పుచున్నాననెను.
మత్తయి 11:25
ఆ సమయమున యేసు చెప్పినదేమనగాతండ్రీ, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగుచేసి పసిబాలురకు బయలుపరచినావని నిన్ను స్తుతించుచున్నాను.
మత్తయి 11:26
అవును తండ్రీ, ఈలాగు చేయుట నీ దృష్టికి అనుకూలమాయెను.
మత్తయి 11:27
సమస్తమును నా తండ్రిచేత నా కప్పగింపబడి యున్నది. తండ్రిగాక యెవడును కుమారుని ఎరుగడు; కుమారుడు గాకను, కుమారుడెవనికి ఆయనను బయలుపరచనుద్దేశించునో వాడు గాకను మరి ఎవడును తండ్రిని ఎరుగడు.
మత్తయి 11:28
ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును.
మత్తయి 11:29
నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చుకొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును.
మత్తయి 11:30
ఏలయనగా నా కాడి సుళువుగాను నా భారము తేలిక గాను ఉన్నవి.

64L.కవితలు📕

నాకవితలు :Ch.RamaMohan,BA.,

( మంచి పుస్తకం, ద్రాక్ష రసం, తినే అన్నం, ప్రియమైన వ్యక్తి ఉంటే అదే పరమానందం! ఉమర్ ఖయ్యాం )

గతం లేదు భవిష్యత్ భ్రమలు వీడు 
నేడు సత్యం అని తెలుసుకో
మానవత్వం వీడకు
ఆత్మవంచనకు గురికాకు

Neglected man in the universe,
Provoking like everything—
Truth, Beauty, God—never alone.

What is desired, desires us back,
Yet we are but empty vessels.
Pour happiness in,
And let it flow.

విశ్వంలో విస్మరించబడిన మనిషి,
ప్రేలాపనలు చేస్తున్నాడు  "ప్రతిదీ రెచ్చగొట్టినట్లుగా

సత్యం, సౌందర్యం, దేవుడు—ఎప్పటికీ ఒంటరిగా లేవు .

ఏది కోరబడుతోందో , అ కోరికలు మనల్ని వెన్నంటి ఉంటాయి అయినా కానీ మనము ఖాళీ పాత్రలం అందులో ఆనందాన్ని నింపు మరియు దాన్ని పొర్లని 

పరలోకం - నమ్మకం → విశ్వాసం

ఇహలోకం →నిజం → వాస్తవం
తెలియని → స్వర్గమా
తెలిసిన ప్రపంచమా → 
జీవితాన్ని స్వర్గంగా చేసుకో
🍑🍑🍑🍑

నేనెవర్ని?
అదిమ సమాజపు వారసుడ్ని,
బలవంతుల నీడలో నడిచే వారినీ,
భూస్వాముల చేతుల్లో కాళ్లూనిన వారినీ,
పెట్టుబడిదారుల అణచివేతలో కొట్టుకున్న వారినీ.

వలసవాదుల గుళ్ళల్లో దాగి,
సోషలిస్ట్ ఆశయాలలో వెలుగుతూ,
ప్రపంచాన్ని ప్రశ్నించిన వాణ్ని.
నేను...
సమాజాన్ని మార్చాలనుకున్న మనిషిని!

బుద్ధుడి బోధనలు నా ఆశయాలు,
ప్రతిత్యసముత్పాదం నా తత్వం,
దుఃఖ నిర్మూలనలో శాంతి దారి,
అహింస ద్వారా ప్రేమ ధార!

ప్రపంచ శాంతికి మార్గం,
క్రూరతల్ని జయించే సత్యం,
నిరాశలు చెరిపివేసే జ్ఞానం,
నిరంతరంతర  పోరు నా ప్రయాణం.

నేనెవర్ని?
శాంతిని ఆశించే విజయగాధని.

తనవు తనువు తాకితే స్వర్గం 
మనస్సు మనస్సు కలిస్తే మొహం 
గుండె గుండె స్పందిస్తే నందనం 
🛣️🛣️🛣️🛣️
కవిత 
గులాబీ గుబాలింపు
కుక్కపిల్ల కేరింతలు
పసిపాప బోసినవ్వులు
లేగదూడ తల్లి ప్రేమ
జీవిత మాధుర్యము 
కవిత్వమై పరిమళించు
By chr
తాత్వికుల కీర్తి

బుద్ధుడు –
ప్రతీత్య సముత్పాదం చాటి,
సకల బంధాలను విడిచిపెట్టిన తపస్వి,
జగతికి జ్ఞానార్ణవమై నిలిచిన మార్గదర్శి.

సోక్రటిస్ –
సత్యం కోసం తన జీవితాన్ని అర్పించిన యోధుడు.
ఆలోచనలతో సమాజాన్ని కదిలించిన తాత్వికుడు.
ప్రశ్నించడం మానవ ధర్మమని చెప్పి,
మరణాన్ని సైతం స్వీకరించిన దార్శనికుడు.

స్పార్టకస్ –
దాస్యపు చీకటిలో తిరుగుబాటు వెలుగులు పంచి,
సామాన్య జనానికి దారి చూపిన యోధుడు,
తన బలిదానంతో స్వేచ్ఛకు పునాది వేసిన.

జీసస్ –
దయ, ప్రేమ, సేవ అంటూ ప్రబోధించి,
సిలువపై తన రక్తంతో చరిత్ర రాసిన,
మానవతా బాటలో నవజీవనాన్ని జ్వలింపజేసిన.

వేమన –
భావ విప్లవ ఆద్యుడు –
సామాజిక చైతన్యం కలిగించిన ప్రథమ కవి.
వాస్తవికతను కవిత్వంగా మార్చిన మార్గదర్శి.
సమాజానికి కొత్త దిశ చూపిన భావవిప్లవ యోధుడు.

ఫ్రాయిడ్ –
మనసు చీకటిని వెలుగులోకి తెచ్చిన యోధుడు,
ఆలోచనల లోతుల్లోకి ప్రయాణించి,
ఆత్మ గాఢతలను అర్థం చేసిన తాత్వికుడు.

మార్క్స్ –
చరిత్రను మలుపు తిప్పి,
ప్రజల స్వప్నాలకు వేదికగా సామ్యవాదం ప్రతిపాదించి,
సమాజానికి న్యాయం చాటిన నాయకుడు.

లెనిన్ –
పెట్టుబడిదారుల రహస్యాలను విప్పి,
ప్రజల స్వేచ్ఛకు ఊపిరి పోసిన మేధావి,
చరిత్రను కొత్తగా రచించిన యోధుడు.

స్టాలిన్ –
రాజ్యరహిత సమాజం అనేది ఊహ కాదు,
వాస్తవమని చాటిచెప్పిన కార్యదక్షుడు,
సంకల్ప శక్తికి రూపం ఇచ్చిన నేత.

మావో –
సాంస్కృతిక విప్లవానికి నూతన దీపం వెలిగించి,
ప్రగతికి మార్గం చూపిన యోధుడు,
సంఘానికి తేజోవంతమైన సంకేతమిచ్చిన నాయకుడు.

అంబేద్కర్ –
అసమానతలకు వ్యతిరేకంగా ధర్మశాస్త్రం చాటించిన,
భారత రాజ్యాంగానికి ప్రాణం పోసిన,
వివక్షకు ప్రతీకగా నిలిచిన మహానుభావుడు.

ముగింపు:
వీరు తాత్వికులు, చరిత్ర గమనాన్ని మార్చిన వారు,
సమాజానికి శాశ్వత దిశ చూపిన చైతన్యవంతులు.
కాలం, సమాజం, మానవతా భావనలతో మమేకమై,
విశ్వవంతాన్ని తమ ఆలోచనలతో ప్రకాశింపజేసిన అమర తారలు.
🍮🍮🍮🍮🍮
నీ దర్శనం రాగరంజిత మయం 
నీ పరిచయం ఆనందసుమం,
నీ సాన్నిధ్యం త్రివేణి సంగమం.

నీ ప్రేమ నా జీవిత గీతం,
నీ స్పర్శ శాంతి సంగీతం.
నీ మాటలు వేదమంత్రాలు,
నీ చూపు దివ్య ప్రబంధాలు.

నీ నవ్వు సూర్యకాంతం,
నీ దయ పరమానందం.
నీ జ్ఞాపకం చిరస్మరణం,
నీ తోడు జగమంత నందనం.

నీతోనే జీవితం, నీతోనే ఆశ,
నీ ప్రేమే నా శ్వాస .

ప్రియతమా
నీ రూపసందర్శనం తో తారలు మెరుస్తాయి,
ఆకాశపు ఆభరణాలుగా వెలుగుతాయి.
నీ గళం, కోయిల గానం,
నా హృదయంలో ప్రతిధ్వనించే
నాద స్వర విన్యాసం 

నీ దర్శనం ఆనందం 
నీ పరిచయం ప్రమోదం 
నీ సాన్నిధ్యం త్రివేణి సంగమం,
నీ ప్రేమ అమరం 

నీతో గడిపే ,ప్రతి క్షణం
నా మనసుకు అపారమైన ధనం.

దారులు వేరవుతాయి, క్షణాలు పారిపోతాయి,
కానీ నీవుతో జీవించడమే నిజమైన జీవితం.
ప్రేమ మించినది ఏముందీ లోకంలో,
నీ తలపులతోనే నా జీవనం సఫలం.

When lotuses bloom in graceful cheer,
The cuckoo's song delights the ear,
Paths extend a warm embrace,
Life's journey flows with gentle grace.

Meaning:
This poetic verse captures the essence of nature's beauty as a guide and inspiration for life's journey. The blooming flowers, melodious songs, and welcoming paths symbolize harmony and the joy of progressing through life with serenity and wonder.

కలువలు పూచిన వేళ,
కోయిల కమ్మగా పాడగా,
దారులు స్వాగతం పలుకగా,
మన జీవితం సాగిన వేళ.

అర్ధం:
ప్రకృతి అందాలతో సౌందర్యానికి పునాది వేసిన కవిత్వం ఇది. కలువ పూల సౌరభం, కోయిల గానం, మరియు మన ముందున్న మార్గాలు స్వాగతం పలకడం మన జీవితయాత్రకు ప్రేరణను సూచిస్తాయి. జీవితాన్ని ఒక పయనంగా స్వీకరించి, ప్రకృతి సౌందర్యంతో ఆనందం పొందడం ఈ కవితలో వ్యక్తమవుతుంది.

Beloved

The stars shimmer in your form,
Like jewels sparkling in the sky,
Your voice is the cooing of the cuckoo,
A melody that echoes in my heart.

Your presence is the confluence of the three rivers,
Since the day I met you,
Every moment spent with you is a heart's treasure,
A bridge of life that spans between us.

Love knows no boundary,
It endures, glowing in the shadows.
There are many paths, many moments,
But the feeling of living with you is the only truth.

This English version retains the poetic essence of the original Telugu, portraying love as a divine, eternal, and transformative experience.

శీర్షిక: మొదటి చూపులో ప్రేమ

పల్లవి:
మొదటి చూపులో ప్రేమగా పడ్డాను,
నీ హృదయంలో స్థానం పొందాను.
నువ్వు నేనూ ఒకటే కదా,
ఎప్పటికీ వేరుకాలం ఇదా!

చరణం 1:
నీ చూపే నా కలల జననం ,
నీ నవ్వే నా హృదయ కవనం.
నీతోనే నీడలా నేనున్నా,
నీ ఎద నా ప్రేమ చిరునామా.

పల్లవి:
మొదటి చూపులో ప్రేమగా పడ్డాను,
నీ హృదయంలో స్థానం పొందాను.
నువ్వు నేనూ ఒకటే కదా,
వేరుకాదు కలసుందాం సదా!

చరణం 2:
జ్ఞాపకాల బడిలో నేర్చుకున్నా,
నీ పిలుపుతో నిన్నే ప్రపంచంలా మార్చుకున్నా.
నవ్వినా నీతోనే నవ్వాలనిపించేది,
నువ్వు లేక జీవితం ఏదీ లేదనిపించేది.

బ్రిడ్జ్:
గాలి లా నువ్వు నాతో నడుస్తావు,
నీడలా నా పక్కన ఉంటావు.
ప్రతి క్షణం ప్రేమతో నిండిపోతుంది,
నీ హృదయం నాలో నిలిచిపోతుంది.

ముగింపు:
మొదటి చూపులో ప్రేమగా పడ్డాను,
నీతోనే జీవితం గడపమని అర్ధమైంది.
ఎప్పటికీ నీవు నా వెంటే ఉంటావు,
ఈ ప్రేమ సజీవంగా నిలుస్తుంది.

Here’s a concept for a love song based on your ideas:

Title: Forever at First Look

Verse 1:
The moment I saw you, the world stood still,
A glance, a spark, a heart to fill.
In your eyes, I found my place,
A timeless love, a warm embrace.

Chorus:
At first look, I fell in love,
A bond so pure, sent from above.
You’re my forever, my perfect other,
Two souls entwined, made for each other.

Verse 2:
Every memory we make, a treasure to hold,
Your touch, your smile, more precious than gold.
Through every storm, through highs and lows,
Our love’s a fire that forever glows.

Chorus:
At first look, I fell in love,
A bond so pure, sent from above.
You’re my forever, my perfect other,
Two souls entwined, made for each other.

Bridge:
The stars may fade, the seasons turn,
But for your love, my heart will yearn.
A thousand lifetimes, and even more,
You’re the dream I’ll always adore.

Outro:
At first look, I knew it was true,
My heart, my soul, they belong to you.
Forever yours, my love won’t tether,
For we are one, made for each other.

Would you like me to refine or expand any part of it?
మొక్కను యెంచి పెంచ మహిని
మానౌను మంచి చేయు బహుగా
ప్రకృతి మెచ్చు ప్రాణవాయువు నిచ్చు
విన్న వించ మంచి  వినుము బాల

[04/04, 12:56] Ch RAMAMOHAN:

చదువుల బడి అమ్మఒడి
గురువు మీద గురి
బ్రతుకు పడవను చేర్చు దరి
విన్న వించ మంచి వినుము బాల
***

సమత పంచలేని వాడు

మమత పంచలేడు

మమత పంచలేనివాడు

మహిని లేడు ఉన్నా లేనివాడే

విన్న వించ మంచి వినుము బాల

***

ఓటు

వేస్తారు ఇస్తే నోటు

చేస్తుంది దేశానికి ఎంతో చేటు

ప్రజాస్వామ్యానికి వేస్తుంది వేటు

విన్న వించ మంచి వినుము బాల
***
గ్రామాలు
 గిట్టుబాటు ధరల్లేని సేద్యాలు
 ప్రకృతి వైపరీత్యాలతో 
 పండని పంటలు
 నిండని కడుపులు
 పట్టని ప్రభుత్వాలు
 మేలుకొనేదెప్పుడో గ్రామాలు
***
నిన్నటి జీవితం మరపు,
రేపటి జీవితం తలపు,
నేటి జీవితం మలుపు 
బుద్ధం శరణం గచ్చామి

**నా కవిత**

బుద్దుడు
ప్రతీత్య సమోత్పదం మని
సకలం
 పరిత్యజించిన

సోక్రటిస్
సత్య శోధన కై
హలం గ్రహించిన

స్పోర్టకస్ తిరుగుబాటుతో 
చరిత్రకు
పాఠాలు నేర్పిన

జీసస్
వీరు ఎమి చేయుచున్నారో
వీరు ఎరుగరని
సిలువను
రక్తసిక్తం చేసిన

వేమన
భావ విప్లవానికే 
భాష్యం చెప్పిన

ఫ్రాయిడ్ 
మానసిక ఋగ్మతలను
 పటాపంచలు చేసిన

మార్క్స్ చరిత్ర గతిని
నిర్దేశించిన

లెనిన్
పెట్టుబడిదారుల
గుట్టు విప్పిన (సామ్రాజ్యవాదం)

స్టాలిన్
Stateless country
అని ఉటంకించిన

మావో
సాంస్కృతిక
విప్లవావసరాన్ని తెలిపిన

అంబేద్కర్ భరత దేశ
జాతిని నీతిని నిలిపిన

వారు తాత్వికులు
చరిత్రగతిని నిర్దేశించారు
సమాజం వసుదైక
కుటుంబం యొక్క నమూనా
వారు సమాజంతో మమేకమై
కాలాచక్ర పరిధిని దాటి
ఆలోచించారు
సమాజానికి
నూతనమార్గాన్ని నిర్దేశించారు
🌻🌻🌻🌻
శ్రీ శ్రీ

మహాకవి మరణించలేదు - నాహృదిలో ఉదయించినాడు

కూలివాని గుండెలొ ఆవేదన ఉందని
కార్మికుని కడుపులో ఆకలి రగిలందని
కలంపట్టి వ్రాసిన మాకవి మహాకవి శ్రీ శ్రీ
మహాకవి మరణించలేదు - నాహృదిలో ఉదయించినాడు

దోపిడిదారుల దురంతాలు సాగవని
పీడకుల పాలన మాకిక వద్దని
గళం ఎత్తిపాడిన మాకవి మహాకవి శ్రీ శ్రీ
మహాకవి మరణించలేదు - నాహృదిలో ఉదయించినాడు

దగాపడ్డ తమ్ములార ఏకంకండని
మోసపోక యికనైనా మేలుకొండని
మాకు పిలుపునిచ్చిన మాకవి మహాకవి శ్రీ శ్రీ
మహాకవి మరణించలేదు - నాహృదిలో ఉదయించినాడు
***

తెలుగు వెలుగు 
సౌరభ సుమమాల
కోమల విరిబాల
సోభిల్లు తెలుగు వేయి విధముల 

సంస్కృతము లేక తెలుగు లేదు
పారసికము పట్టు వదల లేదు
ఆంగ్లము వల్ల తెనుగు మనలేదు
నా భావనమ్మ తెలుగు వెలుగు 

తెలుగేది
వెలుగేది
తెలుగుజాతికి దారేది

చేతిలో కప్పు cup
ఇంటిపైకప్పు
తెలుగేదొ చెప్పు

తెలుగు జల్లెడ జర 
చందమామ చర 
రంపము బండి ర 
లేదు నా భావనమ్మ

కాలుండు కాలుదువ్వుచునుండే
కాలమెరుగక కావరమున బ్రతుకు వసంతములెల్ల భారముగ గడిపితి
ముక్తి గానక ముదిమి పై బడగ 
నీ చరణములు జొచ్చితి కరుణ తో
బ్రోవుము నన్ను బుద్ధ దేవ

CONCEPT ( development of human relations and human resources )

57G.బైబిల్ విశ్లేషణ 📕


యేసు క్రీస్తు తన సేవకాలంలో ప్రధానంగా ఇజ్రాయేల్ భూభాగంలో అనేక ప్రదేశాలను సందర్శించాడు. ఆయన ప్రయాణాలను మూడు ప్రధాన విభాగాలుగా వర్గీకరించవచ్చు:

1. గలిలయా (Galilee) – నేటి ఇజ్రాయేల్
2. యూదేయా (Judea) – నేటి ఇజ్రాయేల్ & పాలస్తీనా
3. సమార్య (Samaria) – నేటి పాలస్తీనా (West Bank)
4. దెకపొలిస్ (Decapolis) – నేటి జోర్డాన్, ఇజ్రాయేల్, సిరియా
5. ఫీనీషియా (Phoenicia) – నేటి లెబనాన్ & సిరియా

1. గలిలయాలో సేవ (Galilee Ministry)
గలిలయా యేసు ప్రధాన సేవా ప్రాంతంగా ఉంది.
నజరేతు – యేసు బాల్యంలో పెరిగిన ఊరు (లూకా 2:39-40)
కానా – ఇక్కడే ఆయన తొలి అద్భుతం (నీటిని ద్రాక్షారసంగా మార్చడం) జరిగింది (యోహాను 2:1-11)
కపెర్నూము – ఆయన కార్యాలయంగా వాడిన ఊరు (మత్తయి 4:13)
బేత్సయిదా – ఆయన కొందరు శిష్యులను పిలిచిన ఊరు (యోహాను 1:44)
గెరాసేను ప్రాంతం – భూతబాధితులను విమోచించిన ప్రదేశం (మత్తయి 8:28-34)
2. యూదేయాలో సేవ (Judean Ministry)
ఇక్కడ ఆయన యెరూషలేము ఆలయంలో బోధించాడు, అద్భుతాలు చేశాడు.
యెరూషలేము – ప్రధాన ప్రదేశం, ఇక్కడే ఆయన క్రూసి వేయబడ్డాడు మరియు పునరుత్థానం పొందాడు.
బేతానీయా – లాజరును మృతిలోనుండి లేపిన ఊరు (యోహాను 11:1-44)
యెరిహో – కన్నీడు భిక్షగాడిని స్వస్థపరిచిన ప్రదేశం (లూకా 18:35-43)
3. సమార్య మరియు చుట్టుపక్కల ప్రాంతాలు
సికారు (Sichem) – సమార్య స్త్రీతో నీటి బావి వద్ద సంభాషణ (యోహాను 4:4-42)
దెకపొలిస్ – గేరాసీ భూతబాధితునికి విమోచనం ఇచ్చిన ప్రదేశం (మార్కు 5:1-20)
తూరు మరియు సీదోను – కనానీయ స్త్రీ కుమార్తెను స్వస్థపరిచిన ప్రదేశం (మత్తయి 15:21-28)

చివరి ప్రయాణం

యేసు తన చివరి ప్రయాణంగా యెరూషలేముకు వెళ్లి అక్కడే క్రూసి వేయబడ్డాడు, మూడవ రోజు పునరుత్థానం పొందాడు.

సారాంశంగా

యేసు క్రీస్తు ప్రధానంగా గలిలయా, యూదేయా, సమార్య, దెకపొలిస్, ఫీనీషియా ప్రాంతాల్లో తిరుగుతూ ప్రజలకు బోధించాడు, అద్భుతాలు చేశాడు.

యేసు తిరిగిన ప్రదేశాలు & నేటి దేశాలు

1. గలిలయా (Galilee) – నేటి ఇజ్రాయేల్
నజరేతు (Nazareth)
కపెర్నూము (Capernaum)
బేత్సయిదా (Bethsaida)
కానా (Cana)
గలిలయా సరస్సు (Sea of Galilee)

2. యూదేయా (Judea) – నేటి ఇజ్రాయేల్ & పాలస్తీనా
యెరూషలేము (Jerusalem)
బేత్లేహేము (Bethlehem)
యెరిహో (Jericho)
బేతానీయా (Bethany)

3. సమార్య (Samaria) – నేటి పాలస్తీనా (West Bank)
సిచార్ (Sychar, నేటి Nablus, Palestine)
షెకెమ్ (Shechem, నేటి Balata, Palestine)

4. దెకపొలిస్ (Decapolis) – నేటి జోర్డాన్, ఇజ్రాయేల్, సిరియా
గదరా (Gadara, నేటి Umm Qais, Jordan)
స్కిథోపొలిస్ (Scythopolis, నేటి Beit She'an, Israel)
జెరాష్ (Gerasa, నేటి Jerash, Jordan)

5. ఫీనీషియా (Phoenicia) – నేటి లెబనాన్ & సిరియా
తూరు (Tyre, Lebanon)
సీదోను (Sidon, Lebanon)

ఈ ప్రదేశాల్లో యేసు బోధనలు, అద్భుతాలు, ప్రయాణాలు చేసినట్లు బైబిల్లో పేర్కొనబడింది.

మత్తయి సువార్త నూతన ఒడంబడికలోని నాలుగు సువార్తలలో మొదటిది. దీని వివరాలు ఈ విధంగా ఉన్నాయి:

అధ్యాయాలు: 28
వాక్యాలు: 1,071
మాటలు: సుమారు 23,684 (ప్రాంతాన్ని బట్టి తేడా ఉండవచ్చు)
ఇది యేసు క్రీస్తు జీవిత చరిత్రను, ఆయన బోధలను వివరించేదిగా మత్తయి రచించినదిగా భావించబడుతుంది.
🌹
బైబిలులో సొలొమోను రాజు వ్రాసినట్లు భావించబడే పుస్తకాలు మూడు:

1. సామెతలు (Proverbs) – జీవన బోధనలతో నిండిన నైతిక, తాత్విక ఉపదేశాల సంపుటి.

2. ప్రసంగి (Ecclesiastes) – జీవిత భావన, వ్యర్థత, మరియు నిజమైన జ్ఞానం గురించి తాత్విక పరిశీలన.

3. పరమగీతం (Song of Solomon / Song of Songs) – ప్రేమ, వివాహ సంబంధాలపై రాసిన కవితాత్మక గ్రంథం.

ఈ మూడు గ్రంథాలను సొలొమోను వ్రాసినట్లు సాంప్రదాయం చెబుతుంది, కానీ కొందరు పరిశోధకులు కొన్నింటికి భిన్నమైన రచనా సమయాన్ని సూచిస్తారు.
యేసు క్రీస్తు తన భౌతిక జీవితకాలంలో నూతన ఒడంబడిక ప్రకారం అనేక అద్భుతాలను చేసారు. సాంప్రదాయంగా, యోహాను సువార్త 21:25 ప్రకారం ఆయన చేసిన అద్భుతాలు అంతుబట్టనంత గొప్పవని చెబుతారు. అయితే, నూతన ఒడంబడికలో ముఖ్యంగా 37 అద్భుతాలు నిక్షిప్తమై ఉన్నాయి.

కొన్ని ముఖ్యమైన అద్భుతాలు:

1. నీటిని ద్రాక్షారసంగా మార్చడం (యోహాను 2:1-11)

2. బాధపడుతున్న ప్రజలను స్వస్థపరచడం (మత్తయి 4:23-25)

3. కుష్ఠు రోగిని స్వస్థపరచడం (మత్తయి 8:1-4)

4. సెంచూరియన్ దాసుడిని స్వస్థపరచడం (మత్తయి 8:5-13)

5. పేతురు మామిని జ్వరంతోనుండి నయం చేయడం (మత్తయి 8:14-15)

6. కోలినీని నాశనం చేయడం (మత్తయి 8:23-27)

7. భూతగ్రస్తులను విమోచించడం (మత్తయి 8:28-34)

8. జలదద్ధరుడిని నయం చేయడం (మత్తయి 9:1-8)

9. రక్తస్రావం ఉన్న స్త్రీకి స్వస్థత కలిగించడం (మత్తయి 9:20-22)

10. యాయిరు కుమార్తెను మృతిలోనుండి లేపడం (మత్తయి 9:23-26)

11. రెండు అంధులకు చూపునిచ్చిన యేసు (మత్తయి 9:27-31)

12. అరంధుడు-మూగవాణ్ని నయం చేయడం (మత్తయి 9:32-34)

13. 5,000 మందికి అన్నపానియాలు పెట్టడం (మత్తయి 14:13-21)

14. నీటి మీద నడవడం (మత్తయి 14:22-33)

15. కనానీయ స్త్రీ కుమార్తెను నయం చేయడం (మత్తయి 15:21-28)

16. 4,000 మందికి అన్నం పెట్టడం (మత్తయి 15:32-39)

17. కుబుడివాణ్ని నయం చేయడం (లూకా 13:10-17)

18. పేతురుకు చేపతో పన్ను చెల్లించడం (మత్తయి 17:24-27)

19. పుట్టుకతోనే అంధుడికి చూపునిచ్చడం (యోహాను 9:1-7)

20. లాజరు మృతిలోనుండి లేపడం (యోహాను 11:1-44)

21. తాను మృతిలోనుండి లేచి జీవించడం (మత్తయి 28:1-10)

ఇవి యేసు చేసిన అద్భుతాలలో కొన్ని ముఖ్యమైనవి. మరిన్ని అద్భుతాలు ఆయన సేవకార్యంలో చోటుచేసుకున్నాయి.

మోషే - బుద్ధుడు
పది ఆజ్ఞలు (Ten Commandments) – సులభంగా

1. దేవుడు ఒక్కడే.
2. విగ్రహారాధన చేయకూడదు.
3. దేవుని పేరును నిరర్థకంగా ఉపయోగించకూడదు.
4. విశ్రాంతి దినాన్ని పవిత్రంగా ఉంచాలి.
5. తల్లిదండ్రులను గౌరవించాలి.
6. హత్య చేయకూడదు.1
7. వ్యభిచారం చేయకూడదు.3
8. దొంగతనం చేయకూడదు.2
9. అబద్ధం చెప్పకూడదు.4
10. ఇతరుల ఆస్తిపై ఆశ పెట్టుకోకూడదు.

ఇవి దేవుడు మోషేకు ఇచ్చిన నైతిక నియమాలు, బైబిల్లో నిర్గమకాండం 20:1-17 లో ఉన్నాయి.