CONCEPT

భావన

అవగాహన 1-3-24


అదిధర్మమా? అదిచట్టమా?
మనుస్మృతి రాజ్యాంగమా?
నోరేత్తకుండా చేసారే!
ఎంతటి అమానవీయం!

జరిగిన అన్యాయాన్ని
ఎవరితో చెప్పుకోవాలి?
చెప్పుకునే హక్కు లేదా?
నోరెత్తితే నాలుక కోస్తారా?

సూద్రుడు మనిషే కాడా?
జంతువుకంటే హీనమా?
చంపేసినా అడిగేదిక్కు లేదా?
అసలు మీరు మనుషులేనా?

చెవుల్లో సీసం పోస్తారా!
కర్రుతో పిర్రలు కాలుస్తారా!
అందుకే అంబేద్కర్-కుటిల 
మనుస్మృతిని తగలెట్టాడు!

వేదం భగవద్గీత మనుస్మృతి
అన్నీ మీరు రాసుకున్నవే!
అబద్ధాల అపౌరుషేయం!
అధముల అమానవీయం!

బ్రహ్మ తలలోంచి పుట్టారా!
బాహువులనుండి పుట్టారా!
తొడలనుండి పుట్టుకొచ్చారా!
సూద్రుడు పాదాల నుండా?

మీకు 'సేవల'కే పుట్టారా?
ఎంత కుటిలత్వపు రచన?
మనుషులు అలా పుడతారా?
అంతా మోసం దగా వంచన!

మీపేర్లు శుభ సౌభాగ్యాలా?
శక్తియుక్త క్షత్రియ నామాలా?
సంపద సూచి వైశ్య నామాలా?
సూద్రుడి పేర్లు హీనతిహీనమా!

హీనాతి హీన బుద్ధులతో
కుట్రలు కుయుక్తులతో
మానవ వనరు పతనమైంది!
మీవల్లే దేశం వెనకబడింది!

డెభై ఐదేళ్ల ప్రజాస్వామ్యం
అది భారత రాజ్యాంగం!
మనుషులుగా గుర్తించింది!
దీని స్థానంలో మనుస్మృతా?

అప్పుడు అంబేడ్కర్ ఒక్కడే!
ఇప్పుడు ఒక్కొక్కడు -ఒక్కో
అంబేడ్కర్ -మీకుట్రలకు
మేం చరమ గీతం పడుతాం!

మానవులంతా ఒక్కటని
సమానత్వ సిద్ధాంతాన్ని
లౌకికరాజ్యాంగాన్ని-మానవీయ 
కోణంలో చాటిస్తాం!

జ్ఞానానికి మెరుగులు దిద్ది
సైన్టిఫిక్ టెంపర్ పెంచి
వైజ్ఞానిక సమాజం తెస్తాం!
జై భీమ్!జై రాజ్యాంగం!
        **********
-తమ్మినేని అక్కిరాజు
      హైదరాబాద్
       3-2-2024

ధర్మసంస్థాపనార్ధాయ!
*******************
ఇంతకన్నా... నువ్వేంచేస్తావ్!
దేశం ఆస్తులన్నీ అమ్మేసావ్!
ఎవ్వర్ని నోరేత్తకుండా కొనేసావ్!
ఇంతకన్నా... నువ్వేం చేస్తావ్!

చెయ్యాల్సిందంతా -మీ
పెద్దోళ్ళే చేసేసారు!
నిరక్షరం! భక్తి!మౌడ్యంలో
సూద్రులకు ముక్తి ప్రసాదం!

నువ్వు చేసేది ఏమీ లేదు
మీ పెద్దోళ్ల కోరికమేరకు
ఎక్కడున్న వాళ్ళను అక్కడ
కూర్చోపెట్టటమే నీ పని!

ఉచ్చ పేడల భిషక్కులతో
జప తపాల గురువులతో
సైన్స్ ను దేశంనుండి తరిమేసి 
'అగ్ర' తాంబూల సేవలతో 

చాతుర్వర్ణ వ్యవస్థను
మళ్ళీగాడిలో పెట్టాలి!
సూద్రులు సేవలు చెయ్యాలి!
అపరబ్రహ్మల అఖండం!

గాంధీతోపాటు అంబేద్కర్ ను
'వేసేయ్'లేకపోయినందుకు
మీరంతా బాధలో ఉన్నారు!
జరిగిందేదో జరిగి పోయింది !

నేడు వగచి ఫలమేమి?
చెయ్యాల్సింది చాలా ఉంది!
కర్తవ్యం నిన్ను చూపిస్తోంది!
కుర్మావతారం ఎత్తాల్సిందే!

సశేషాన్ని విశేషం చెయ్యి!
స్త్రీలుసూద్రులు పాతస్థానాల్లో
జోగిని బసివిని దేవాదాసీలు!
సూద్రులంతా మీ పాదసేవలో!

దేశం సుభిక్షంగా ఉంటుంది!
నిరుద్యోగ సమస్యే ఉండదు!
కోతుల్నిపాముల్నిగంగిరెద్దుల్ని
ఆడిస్తూ ఆనందంలో సూద్రలు!

జనమంతా రామరాజ్యంలోకి
దేశమంతా రామాలయాలే!
భజనలతో భక్త జనం!
ఇంతకన్నా.... ఏం కావలి?

సైన్స్ టెక్నాలజీ మీకెందుకు?
రామనామం కృష్ణగీత చాలు!
తెల్లోళ్ళు ఎప్పుడో పోయారు!
ముస్లిమ్స్ ను పంపించేస్తావ్ గా!

ఎంత చక్కని భారతం!
సనాతన ధర్మ సంస్థాపనం!
భవిష్యత్ ఆశాజనకం!
రాముడే దారి చూపాడు!

అంతాబాగానే ఉంది కాని
ఒక్కటి తేడా కొడుతోంది!
సముద్రాలు దాటితే ఆనాడు
హైందవం భ్రస్టుపట్టింది!

ఇప్పుడు ఏం చేస్తావు మరి?
రాముడుకి కృష్ణుడికి కూడా
విదేశాంగవిధానం లేదు!
అశ్వమేధయాగం కుదరదు!

లక్షలకొద్దీ భారతీయులు
ఇప్పుడు విదేశాల్లో 'భ్రష్టులు'!
వాళ్ళను అలా వదిలేస్తావా?
వెనక్కి తీసుకు వస్తావా?

నీకుతెలియనిదేముంది?
రాముడే నిన్ను పుట్టించాడు!
ధర్మసంస్థాపనార్ధాయ
సంభవామి యుగే యుగే!
          *********
-తమ్మినేని అక్కిరాజు
      హైదరాబాద్
      2-2-2024


నేను నాస్తికుడ్ని /ఆస్తికుడ్ని నేను కమ్యూనిస్టు / non కమ్యూనిస్ట్, భావజాలం /భావజాలాలు మనల్ని ప్రభావితం చేస్తాయి*


   వ్యక్తిత్వ వికాసం 
             (Personality  Development)

STUDENT-TEACHER-PARENT:
Student :Who become himself/herself
conscious (స్పృహ)
Teacher :  who inspires student(ప్రభావితం)
Parent : who gives personality to their children  (వ్యక్తిత్వం) 

HOW TO GET KNOWELDGE: 
1. Reading books 
2. Excursions
3. Debate   

లక్ష్యసాధనకు మార్గాలు 
1.ధ్యానం ( Meditaion ) 
2.సమయపాలన ( Time management ) 
3.సహచరత్వం ( Association ) 
TIME MANAGEMENT
To accomplish:
Avoiding the phrase “I don’t have time...”,will soon help you to realize that you do have the time needed for just about anything you choose to accomplish in life.

(CHARACTERISTICS OF TIME)
1.Time is a unique resource.
2.It is available in continuous stream and is never absent
3.We are forced to spend it and once lost is lost for ever
4.Today never comes again.
5.There is no substitute for time.
6.It can not be stored or accumulated.
7.It is available all round the clock.

Master of our emtions

How do I change? 
* If I feel depressed I will sing.
* If I feel sad I will laugh.
* If I feel ill I will double my labour.
* If I feel fear I will plunge ahead.
* If I feel inferior I will wear new garments.
* If I feel uncertain I will raise my voice.
* If I feel poverty I will think of wealth to come.
* If I feel incompetent I will think of past success.
* If I feel insignificant I will remember my goals. 
* "Today I will be the master of my emotions".

**°


Uyyala సురేందర్

**°
భారత ప్రజలు ౼ కళ్ళుతెరిపించే వాస్తవాలు

"భారత ప్రజలు" పేరుతో ఆంత్రోపొలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిశోధించి ప్రచురించిన పత్రం భారతదేశం, భారత సమాజం, సంస్కృతిల మీద బి.జె.పి. చేస్తున్న వాదనలను త్రిప్పికొడుతోంది. ఈ సర్వేను అత్యంత జాగ్రత్తతో, సునిశితంగా నిర్వహించారు. మొత్తం 500 మంది శిక్షణ పొందిన పరిశోధకులు ఈ సర్వేలో పాల్గొన్నారు. వీరిలో 284మంది ఆంత్రోపాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్నవారు కాగా మరో 216మంది దేశవ్యాప్తంగా  విస్తరించిన వివిధ పరిశోధనా సంస్థలు, యూనివర్శిటీలకు చెందినవారు. ప్రముఖ పరిశోధనా వేత్తగా ఆంత్రోపాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు డైరెక్టర్గా ఉన్న శ్రీ కె.ఎన్. సింగ్ సర్వేకు అధిపతిగాను, సమన్వయకర్తగాను వ్యవహరించారు.

ఈ సర్వేను ప్రధానంగా మానవ సంబంధాల అధ్యయన శాస్త్రజ్ఞులు, సాంఘిక పరిశోధకులు నిర్వహించారు. వీరితోపాటు భాషా శాస్త్రాలు, మానసిక శాస్త్రం, పరిసరాల పరిశోధనాశాస్త్రం,   జీవరసాయన శాస్త్రాలకు సంబంధించిన అనేకమంది పరిశోధకులు పాల్గొన్నారు. వీరు సర్వే చేసి అందించిన సమాచారాన్ని ఆంత్రోపొలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్న చరిత్రకారులు సాంఘిక శాస్త్రవేత్తలు, రాజనీతి శాస్త్రవేత్తలు పరిశీలించి, విస్తృతంగా అధ్యయనం చేసి చర్చించారు. వివిధ జాతులకు చెందిన సమాచారాన్ని ఈ శాస్త్రజ్ఞులు ఆమూలాగ్రం పరిశీలించారు.

ఈ ప్రాజెక్టు 1985లో ప్రారంభమై దాదాపు దశాబ్దకాలం పాటు కొనసాగింది. తమ ప్రాథమిక పరిచయ పరిశోధనను 1992లో ప్రచురించారు. లోతైన, సుదీర్ఘ అధ్యయనం ద్వారా మనదేశంలో 91 సాంస్కృతిక జోన్లు ఉన్నాయని గుర్తించారు. ఒక సాంస్కృతిక జోన్ 4258 కమ్యూనిటీలు ఉన్నాయని కనుగొన్నారు. 331 సాంస్కృతిక జోన్లలో 45 సముదాయాల్ని అధ్యయనం చేశారు. ఈ మొత్తం సమాచారాన్ని 421 జిల్లాల నుండి సేకరించారు. ఈ అధ్యయనంలో ఒక జిల్లాలో 3972 సముదాయాలు, రెండు జిల్లాల్లో 512, రెండుకు మించిన జిల్లాల్లో 151 కమ్యూనిటీలు విస్తరించి ఉన్నట్లు గుర్తించారు. కొన్ని సందర్భాలలో 1807 కమ్యూనిటీలు ఒకే గ్రామంలోను, 783 రెండు గ్రామాల్లోను, రెండుకు మించిన గ్రామాల్లో 475 సముదాయాలు ఉన్నట్లు తెలుసుకున్నారు. మొత్తంగా పరిశీలిస్తే ఒక పట్టణం లేదా నగరంలో 1794 కమ్యూనిటీలు, రెండు పట్టణాలు లేదా నగరాల్లో 393, రెండుకు మించిన పట్టణాలు లేదా నగరాల్లో 182 విస్తరించినట్లు తేల్చారు. వివిధ కమ్యూనిటీలు దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్నాయని, మొత్తంగా దేశంలో 4635 సముదాయాలు ఉన్నాయని నిర్ధారించారు. ప్రతి కమ్యూనిటీకి ఉన్న ప్రత్యేకతలు, అది అలా మారడానికి గల కారణాలు, ఇతర సముదాయాలతో సంబంధాలు, అంతర్గతంగా వస్తున్న మార్పులు అన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించి ప్రస్తావించారు.

మనం మాట్లాడుకుంటున్న భిన్నత్వంలో ఏకత్వాన్ని ఈ ప్రాజెక్టు నిరూపించింది. సంఘ్ పరివార్ చాలాకాలంగా చేస్తున్న అసంబద్ధ వాదల్ని, వక్రీకరణలను ఇది ఎండగట్టింది. ఈ సర్వే అసలు సారాంశం క్రింది విధంగా ఉంది.

మొత్తం ప్రజలంతా ఒకే సమూహానికి చెందిన వారని నిర్ధారించలేం. ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి ఉన్న వివిధ రకాల మనుషుల్లో మనమూ భాగమే. దేశవ్యాప్తంగా భిన్నమైన ఆకృతి, వస్త్రధారణ, భాష, వృత్తి, ఆహారపు అలవాట్లు, ఆచారాలు కలిగిన 4635 కమ్యూనిటీలు ఉన్నాయి. వాళ్ళందరి విభిన్నమైన జీవన విధానమే మన జాతీయ జీవన విధానంగా రూపొందింది.

ప్రతి ఒక్కరూ భారతదేశాన్ని తమ మాతృభూమిగానే నమ్ముతున్నారు. ఇక్కడ ఎవరూ స్వచ్ఛమైన ఆర్యులుకాని విదేశీయులు కాని లేరు. అనేక సముదాయాలు ఒక దానితో ఒకటి. కలిసి మిశ్రమ సంస్కృతిని రూపొందించాయి. వాటి మూలాలని తిరిగి విభజించడం అసాధ్యమైన పని, ప్రొటో-ఆస్ట్రలాయిడ్, పాలియో-మెడిటిరేనియన్, కాకసియన్, నీగ్రోయిడ్, మంగోలాయిడ్ లాంటి అనేక జాతులు కలిసి పోయాయి. ఆర్యులు, గ్రీకులు, హూణులు, అరబ్బులు, తురుష్కులు,ఆఫ్రికన్లు, మంగోలియన్లు, యూరోపియన్లు తదితర జాతులన్ని కలిసిపోయాయి. ఈ రోజున ఎవరినీ ఫలానా జాతికి చెందిన స్వచ్ఛమైన వారిగా నిర్ధారించలేం..

ఈ సముదాయాలలో అనేకం జన్యుపరంగాను, రక్తసంబంధాల పరంగాను కలిసిపోయాయి. ప్రాంతీయతను బట్టి ఐక్యత ఏర్పడిందికాని కులాన్ని బట్టి, మతాన్ని బట్టి కాదు. తక్కువ కులాల వాళ్ళు భిన్నమైన జాతులవారనే వాదన కూడా సరికాదని శాస్త్రీయంగా నిర్ధారణ అయింది. ఉదాహరణకు తమిళ బ్రాహ్మణులకు ఉత్తర భారతంలోని ముఖ్యంగా కాశ్మీర్ పండితులకు గల జాతి సంబంధాలు పరిశీలిస్తే పోలికలు చాలా స్వల్పంగా మాత్రమే ఉన్నాయి. అనేక ప్రాంతాలలో నిమ్నకులాలు, బ్రాహ్మణులు ఒకేరకంగా ఉన్నారు. అనేక ప్రాంతాలలోని ముస్లింలు వలసవచ్చినవారు కాదు. స్థానికంగా ఉన్న ప్రజలే ముస్లింలుగా మారారు.

భారతదేశంలో ఉన్న కొన్ని సముదాయాలు తాము వలసవచ్చినదవిగానో లేదా పరాయిదేశాలకు చెందినవిగానో ఒప్పుకోవు. కానీ, ప్రతి సముదాయం జానపద గీతాలు, చరిత్రల్లో మాత్రం తాము వలస వచ్చినవారమని చెప్పుకుంటున్నది. ప్రతి ఒక్కరు తాము నివసిస్తున్న ప్రాంత ఆచారాల్ని సాంప్రదాయాల్ని తమవిగా చేసుకున్నారు. దురాక్రమణదారులు సైతం వలసదారులుగా మారిపోయారు. వలసవచ్చిన వారినుండి భారత సంస్కృతి అనేక అంశాలను గ్రహించింది. తాము నివశిస్తున్న ప్రాంత సంస్కృతిని మరింత సుసంపన్నం చేశారు. గ్రీకులు నుండి, ముస్లింల నుండి, ఆంగ్లేయుల నుండి అనేక సాంస్కృతిక సామాజిక రాజకీయా విషయా లను, భాష ను, శిల్పకళ ను ఇలా రకరకాల అంశాలను భారతదేశం సంస్కృతి లో ఇమిడిపోయాయి.
       భిన్నత్వానికి, ఐక్యతకు భాష ప్రధానంగా దోహదపడుతుంది. దేశంలో 325 మాట్లాడే భాషలు ఉండగా 25 భాషలకు లిపి ఉంది. ఇవన్నీ విభిన్న భాషా కుటుంబాలనుండి ఉద్భవించాయి. ఇండో-ఆర్యన్, టిబెట్ జర్మన్, ద్రవిడియన్ ఆస్ట్రో-ఏషియాటిక్, అండమానీస్, సెమిటిక్, ఇండో-ఇరానియన్, సినో-టిబెటన్, ఇండో యూరోపియన్ భాషా కుటుంబాల నుండి ఇంకా అనేక వేల భాషల నుండి మన భాషలు ఉద్భవించాయి. 655మ్యూనిటీలు రెండు భాషలు మాట్లాడతాయి. అనేక ఆటవిక సముదాయాలు 3 భాషలు మాట్లాడతాయి.భావనల్ని వ్యక్తం చేయడానికి, తమ తమ మాతృభాషలు చాలా దోహదపడ్డాయి.

 85% సముదాయాలు తమ వనరుల ఆధారంగా ఏర్పడ్డాయి. జీవనవిధానం. వారి వృత్తి, వస్త్రధారణ, ఇళ్ళ నిర్మాణం మొదలైనవన్నీ వారు నివసిస్తున్న భూమి స్వభావం, వాతావరణ పరిస్థితి. ఇతర వనరులను బట్టి రూపొందాయి. నిపుణులు చెప్పేదేమంటే🌄 "సముదాయాలు" పరిసరాలు సంస్కృతిని బట్టి రూపొందాయి తప్ప మతాన్ని బట్టి కాదు" అని వివరికి వలస వచ్చి స్థిరపడిన వారు కూడా స్థానిక అలవాట్లకు అనుగుణంగానే జీవిస్తున్నారు. ఇళ్లలో వారు మాట్లాడే భాషను బట్టి తప్ప సముదాయాల మధ్య తేడా గుర్తించలేము. 71.77% మంది ప్రజలు ఒకే ప్రాంతం లేదా భాషా ప్రాంతంలో నివసిస్తుండగా వారిలో కేవలం 3% సముదాయాల పేర్లు మాత్రమే మత సంబంధంగా ఉన్నాయి. కేరళ, లక్షద్వీపాలకు చెందిన ప్రజల ఆచార వ్యవహారాలు ఒకేరకంగా ఉన్నాయి.  కేరళ, పంజాబ్ ప్రజల ఆచార వ్యవహారాలు భిన్నంగా ఉన్నాయి. 55% శాతం సముదాయాలకు సాంప్రదాయంగా కొనసాగిస్తున్న వృత్తిపేర్లే ఉన్నాయి. కంసాలి, వడ్రంగి, కమ్మరి, కుమ్మరి, మేదర, సాలె, వైశ్య, చాకలి, మంగలి మొదలైనవన్నీ వారు చేస్తున్న వృత్తిని బట్టి వచ్చిన పేర్లే, 14 శాతం సముదాయాలకు పరిసరాలు, కొండలు, నదులను బట్టి పేర్లు ఉన్నాయి. మరో 14శాతానికి ప్రాంతాన్ని బట్టి పేర్లు ఉన్నాయి. గోండులు, అల్వాలియా, కాన్పూరియా, ఛమోరి, షిమోగ మొదలైనవన్నీ ఇందుకు ఉదాహరణలు.

మతంతో నిమిత్తం లేకుండా కులాలను బట్టి వృత్తులు ఉన్నాయి. అనేక ఇంటిపేర్లు వారు చేస్తున్న వృత్తి, ఆచారంగా వస్తున్న పదవులు, స్వంత గ్రామం, ప్రాంతం తదితర అంశాలననుసరించి పెట్టబడ్డాయి. సింగ్, ఆచార్య, పటేల్, నాయక్, గుప్తా, శర్మ, ఖాన్ ఇలాంటివి ఉదాహరణలు.

సాంస్కృతిక అలవాట్లు మతాన్ని అధిగమించి ఏర్పడ్డాయి. మొత్తం 775రకాల అలవాట్లను గుర్తించగా అవన్నీ తమ పరిసరాలు, నివాసం, ఆచారాలు వ్యక్తిత్వం ఆహారం, వైవాహిక సంబంధాలు, సాంఘిక కట్టుబాట్లు, ఆర్థికాంశాలు, వృత్తి, ప్రాంత అభివృద్ధి, మతాల ప్రభావాలని బట్టి ఏర్పడ్డాయని తేలింది. హిందువుల ఆచారాలు అలవాట్లను 96.77 శాతం ముస్లింలు, 91,19శాతం బౌద్ధులు, 88.99శాతం సిక్కులు, 77.46శాతం జైనులు అనుసరిస్తున్నారు. ముస్లింల ఆచారాలు, అలవాట్లను 91.18శాతం బౌద్ధులు, 89.95శాతం సిక్కులు అనుసరిస్తున్నారు. 81.34శాతం జైనులు బౌద్ధుల ఆచారాలు, అలవాట్లను అనుసరిస్తున్నారు. షెడ్యూల్డ్ తెగలవారు 96.61శాతం వెనుకబడిన కులాలు 91.29శాతం, షెడ్యూల్డ్ కులాలు 95.82శాతం, ముస్లింలు 91.69శాతం, బౌద్ధులు 88.20శాతం సిక్కుల ఆచారవ్యవహారాలని అనుసరిస్తున్నారు.

వివిధ సముదాయాల గుర్తింపు మతంతో నిమిత్తంలేకుండానే జరిగింది. 3059 సముదాయాల ప్రజలు మృతదేహాలను ఖననం చేస్తుండగా, 2386 కమ్యూనిటీలు దహనం చేస్తున్నాయి. అనేక సముదాయాలు పై రెండు ఆచారాలనీ పాటిస్తున్నాయి. పెళ్ళి వ్యవహారాలు, ఆహారపు అలవాట్లు, వస్త్రధారణ, నృత్యం, సంగీత రూపాలు అనేక సముదాయాలలో ఒకేరకంగా జంతువులు, మొక్కలకు ఇతర వస్తువుల పేర్లు కూడా మతాలు, ప్రాంతాల, భాషలకతీతంగా ఉన్నాయి. భారతదేశంలోని కమ్యూనిటీలు దేనికది విడివిడి ఒంటరిగా లేవు. అవి ఒకదానికొకటి భౌతికంగాను, సాంఘికంగాను కలిసే ఉన్నాయి. అనేక శతాబ్దాల నుంచి ఐక్యంగా జీవనపోరాటం చేస్తున్నాయి. ఇదే మన దేశ సాంస్కృతిక 'భిన్నత్వంలో ఏకత్వం'. ఇదే మన ప్రత్యేకత.

౼౼నళినీ తనేజా(విద్యారంగం పై మతోన్మాదుల దాడి)(జనవరి,2000)నుండి........


సంక్రాతి శుభాకాంక్షలు 

గుంటూరు:  కొండవీడు 

ఇక్కడ ఒక పురాతన కోట ఉంది. కోటకు వెళ్లేందుకు రెండువైపుల నుంచి నేలమెట్లు ఉన్నాయి. కొండ మీద మూడు చెరువులున్నాయి. ఒకటి నిండగానే నీరు వృథా కాకుండా, రెండు చెరువులోకి వెళ్లే సౌకర్యం ఉంది. కొండకింద ఉన్న కత్తుల బావి (వేణునాథస్వామి దేవాలయం), శ్రీకృష్ణదేవరాయలు ప్రతిష్ఠించిన ధ్వజస్తంభంఆలయం లోపల, బయట గోడల మీద అపరూప శిల్ప సంపదలున్నాయి. కొండమీద చారిత్రక ఆనవాళ్లుగా నిలచిన అనేక కట్టడాలు, 44 కోట బురుజులు, 32 మైళ్ల ప్రాకారాలు, రెండు ధాన్యాగారాలు, 5 దేవాలయాలు, గుర్రపు శాలలు, ఆయుధశాల, నేటికొట్టు, మసీదు, ఖజానా, వంటి చారిత్ర సంపద ఉంది. కొండవీడు కోటను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రక్షిత కట్టడంగా గుర్తించింది.[5]

కోటకు వెళ్లేందుకు రెండువైపుల నుంచి నేలమెట్లు ఉన్నాయి. సరాసరి కొండమీదకు వెళ్లేవారి కోసం నిర్మించాల్సిన ఘాట్‌రోడ్డుకు సర్వే పూర్తి కావస్తోంది. కొండమీద మూడు చెరువులున్నాయి. ఒకటి నిండగానే నీరు వృథా కాకుండా, రెండు చెరువులోకి వెళ్లే సౌకర్యం ఉంది. కొండకింద ఉన్న కత్తుల బావి (వేణునాథస్వామి దేవాలయం), శ్రీకృష్ణదేవరాయలు ప్రతిష్ఠించిన ధ్వజస్తంభం, ఆలయం లోపల, బయట గోడల మీద అపరూప శిల్ప సంపదలున్నాయి. కొండమీద ఉపయోగించుకునే అవకాశం ఉన్న భూమి విస్తీర్ణం అయిదు చదరపు కిలోమీటర్లు.కొండమీద చారిత్రక ఆనవాళ్లుగా నిలచిన అనేక కట్టడాలు, 44 కోట బురుజులు, 32 మైళ్ల ప్రాకారాలు, రెండు ధాన్యాగారాలు, 5 దేవాలయాలు, గుర్రపు శాలలు, ఆయుధశాల, నేటికొట్టు, మసీదు, ఖజానా, వంటి చారిత్ర సంపద ఉంది.

కొండవీడు కోటను రాష్ట్ర ప్రభుత్వం రక్షిత కట్టడంగా గుర్తించింది.కొండవీడు కోటను పురావస్తు శాఖ రక్షిత కట్టడంగా జి.ఒ. సంఖ్య 1535 తేదీ 2-11-1966న నిర్ణయించారు. ఇక్కడో కందకం (అగడ్త) ఉండేది. 37 ఎకరాల విస్తీర్ణం గల ఈకందకానికి చారిత్రక కొండవీటికొండ మీద నుంచి వర్షాకాలంలో నీరు జాలువారుతుంది. కందకంలోకి చేరిన నీటిని కొండవీడు పరిసరాల్లోని ఐదు గ్రామాల భూముల రైతులు సాగునీరుకు వినియోగించు కుంటున్నారు. చాలా కాలంగా సరైన మరమ్మతులు లేకపోవటంతో కందకం అడవి మాదిరిగా తయారైంది. ఇది కొంత ఆక్రమణలకు లోనైంది. .

ప్రోలయ వేమారెడ్డి రెడ్డి రాజులలో ప్రథముడు.ఇతను తొలుత సా.శ. 1325లో అద్దంకిని రాజధానిగా చేసుకుని స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుని 1353 వరకు పరిపాలించాడు. ఆ తరువాత అతని కుమారుడు అనపోతారెడ్డి సా.శ. 1353 నుండి 1364 వరకు రాజ్యపాలనను చేపట్టినట్లు తెలుస్తుంది. శత్రుమూకలు తరచూ అతని రాజ్యంపై దాడులు చేస్తుండడంతో రాజధానిని కొండవీడుకు తరలించి  రెండో రాజధానిగా చేసుకుని పాలన సాగించాడని తెలుస్తుంది. అనపోతారెడ్డి కొండవీడును శతృదుర్బేధ్యమైన గిరిదుర్గంగా మలచిన ఘనత అనపోతారెడ్డికి దక్కుతుంది.ఆ తరువాత అనపోతారెడ్డి తమ్ముడు అనవేమారెడ్డి సా.శ.1364 నుండి 1386 వరకు రాజ్యాధికారం చేపట్టి కృష్ణా, ఉభయ గోదావరి, విశాఖపట్నం జిల్లాలను జయించి రాజ్య విస్తరణ గావించాడు. తిరిగి పినతండ్రి అనవేమారెడ్డి మరణానంతరం అనపోతారెడ్డ్డి కుమారుడు కుమారగిరిరెడ్డి సా.శ. 1386 నుండి 1402 వరకు పరిపాలించి కొండవీడు రాజ్యాన్ని ఉదయగిరి నుంచి ఒడిశాలోని కటక్‌ వరకు విస్తరించాడు. ఆ తరువాత అనవేమారెడ్డి కుమారుడు పెదకోమటి వేమారెడ్డి సా.శ. 1402 నుండి 1420 వరకు పరిపాలించినట్లుగా తెలుస్తుంది.ఇతని పరిపాలనా కాలంలో సాహిత్యానికి, కళలకు పెద్దపీటవేసి ఆదరించినట్లుగా తెలుస్తుంది. ఒకరకంగా ఇతని పరిపాలనాకాలాన్ని  స్వర్ణయుగమని చెప్పవచ్చు. శ్రీనాథ కవి ఇతని ఆస్థానంలో విద్యాధికారిగా పనిచేశాడని తెలుస్తుంది.సా.శ. 1420 నుండి  1424 వరకు చివరివాడైన  రాచ వేమారెడ్డి పరిపాలించాడు. ఇతను అసమర్థుడు కావడంతో రెడ్డిరాజుల పాలన అంతమైంది. కొండవీడు రాజ్యాన్ని విజయనగర రాజులు హస్తగతం చేసుకున్నారు.[2]
కొండవీడు కోటఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపల్నాడు జిల్లాయడ్లపాడు మండలం లోని కొండవీడు గ్రామ పరిధిలో ఉన్న పర్యాటక ప్రదేశం.ఇది గుంటూరు నగరానికి 20 కి.మీ.దూరంలో ఉంది. రెడ్డిరాజులు కొండవీడు కోటను రాజధానిగా చేసుకుని సా.శ. 1325 నుండి 1425 వరకు పరిపాలన సాగించారు.14 వ శతాబ్థంలో రెడ్డి రాజులు పరిపాలన సాగించిన కాలంలో ఈ కోటను నిర్మించారు.ఇందులో 21 నిర్మాణాలు ఉన్నట్లుగా తెలుస్తుంది.ఇందులో చాలా వరకు శిధిలమైనట్లుగా తెలుస్తుంది.[1]
కొండవీడు కోట
కట్టిన సంవత్సరం14 శతాబ్థం
కట్టించిందికొండవీడు రెడ్డిరాజులు
వాడిన వస్తువులుగ్రానైట్, రాతి, సున్నం
Battles/warsరెడ్డి రాజులు, విజయనగర రాజులు, గోల్కొండ సుల్తానులు, ప్రెంచి రాజులు, బ్రిటీసు రాజులు

***
Ch Rama mohan
***


మనిషి ఊహల్లో పుట్టిన భావన

 దేవుడే అనడానికి ఇవిగో సాక్ష్యాధారాలు

విశ్వం వయస్సు 13.82 (సుమారు 1400 కోట్ల సంవత్సరాలు)బిలియన్ సంవత్సరాలు

 భూమి వయస్సు 4.54 (450 కోట్ల సంవత్సరాలు)బిలియన్ సంవత్సరాలు

 మానవ ఆవిర్భావం 2,00,000 సంవత్సరాలు.

 దైవ భావన 10,000 సంవత్సరాలు.

 దేవతా భావన 8,000  సంవత్సరాలు

 బ్రాహ్మణ మతం 3,500 సంవత్సరాలు.

జోరాస్త్రినియం 4000 సంవత్సరాలు.

జుడాయిజం 4000 సంవత్సరాలు.

 బౌద్ధం 2,600 సంవత్సరాలు

 కన్ఫ్యూియనిజం 2,500 సంవత్సరాలు

 టావోయిజం 2,400 సంవత్సరాలు 

ఇస్లాం 1200 సంవత్సరాలు.

క్రైస్తవం 2,000 సంవత్సరాలు

 సిక్కుమతం 400 సంవత్సరాలు 

షిరిడి సాయిబాబా 100 సంవత్సరాలు.

ఈ సంఖ్యలను చూసి ఆలోచించండి.

 దైవ భావన పుట్టి కేవలం పదివేల సంవత్సరాలు మాత్రమే అవుతుంది. కానీ  విశ్వం ఆవిర్భావము చెంది సుమారు1400 కోట్ల సంవత్సరాలు అయింది. భూమి ఆవిర్భావం చెంది 450 కోట్లు అవుతుంది.

మానవ ఆవిర్భావము 2,00,000 సంవత్సరాలు అయింది. కానీ దైవ భావన పుట్టి 10,000 సంవత్సరాలు మాత్రమే అయింది. ఈ లెక్కన చూస్తే మనిషి మొదటగా ఆవిర్భవించిన తర్వాత దైవ భావన తరువాత ఉనికి లోకి వచ్చింది.

దేవుళ్ళు అనేవారు కాకమ్మ కథలలోని, పిట్టకథలలోని, చందమామ కథలలోని కల్పిత పాత్రలు.

వాటిని కల్పించి రాసింది స్వార్థపరులైన బుద్దిజీవులు మనుషులే!

వాటికి లేనిపోని మహిమలను అంటగట్టింది మనుషులే!

వాటికి విగ్రహాలు చెక్కింది మనుషులే!

ఆ విగ్రహాలకు ఇళ్ళు కట్టి, అందులో పెట్టి దానిని దేవాలయం అన్నది మనుషులే!

వాటిని విమర్శించేది, ప్రశ్నించేది, దూషించేది, ఆరాధించేది మనుషులే,

వాటి వల్ల ఏదో కీడో మేలో జరుగుతుందని నమ్మేది మనుషులే!

ఇక ఇందులో దేవుడెక్కడి నుండి వచ్చాడు ?
దేవుడనే కల్పిత పాత్ర వల్ల, కల్పిత పదం వల్ల ఒరిగేది జరిగేది ఒనగూరేది శూన్యమే తప్ప మరేమి లేదు!

దేవుడే సంపద సృష్టించుకోవడం చరిత్రలో జరగలేదు.

దేవుళ్ళు ఎవరు తమ నైవేద్యాలు 
స్వయంగా తయారు చేసుకోలేదు.

 సమస్త జీవజాలాన్ని సృష్టించాడని చెబుతున్న దేవుడు నిజానికి మానవుడి ఊహల్లో పుట్టిన భావన మాత్రమే.

 ప్రకృతి పరిసరాల గురించి మానవుడికి ఏమాత్రం అవగాహన లేని ఆటవిక దినాల్లో మనుషులు ఉన్నా,దేవుళ్ళు లేరు.

 ప్రకృతి ఘటనల వల్ల ఏర్పడిన భయం నుండి మొగ్గ తొడిగిన భావనే దైవం.

 మనిషి మరీ ఆటవిక దశలో ఉన్న రోజుల్లో దైవ భావం.దేవుడు కానరాలేదు.

 ప్రకృతి గురించి ఆలోచన కలిగాక దైవ భావన మనిషిలో తలెత్తింది.

 మనిషి చెట్టు కింద నివసించే రోజుల్లో దైవ ఆకృతులు రాళ్లు, చెట్లకిందే ఏర్పాటు చేసుకున్నాడు.

 మనిషి ఆకులు అలములు కట్టుకునే రోజుల్లో దేవుడికి అవే చుట్ట బెట్టాడు.

 మనిషి కొండ గుహల్లో చేరాక దేవుణ్ణి అందులోకి మార్చాడు.

 గుడిసెలు వేసుకోవడం మొదలుపెట్టాక దేవున్ని కూడా గుడిసెలోకి మార్చాడు.

 తాను గుడ్డ కట్టడం నేర్చాక దేవుడికి గుడ్డచుట్ట బెట్టాడు.

 నూనె దీపం వెలిగించడం నేర్చాక దేవుడి  దగ్గర దీపం వెలిగించాడు.

మనిషి దృఢ నివాసం  నిర్మించడం నేర్చాక దేవుడికి అలాంటి కట్టడం కట్టాడు.

 మనిషి శిల్పకళను నేర్చాక కళాకృతులతో దేవాలయాలు చెక్కాడు.

 పట్టు వస్త్రాన్ని కనుగొన్నాక దాన్ని దేవుడికి చుట్ట బెట్టాడు.

 ఆభరణాలు ధరించడం నేర్చాక దేవుళ్ళకి, దేవతలకి ఆభరణాలు కూడా తగిలించాడు.

 విద్యుత్తును కనుగొన్నాక గుళ్లో విద్యుత్ దీపం వెలిగించాడు.

 సిమెంటుతో కాంక్రీట్ నిర్మాణాలు మొదలెట్టాక దేవుడికి నిర్మించడం మొదలెట్టాడు.

దేవుళ్ళు తమకు తాముగా స్నానాలు చేయడం లేదు.

దేవుళ్ళు తమకు తాముగా రంగులు వేసుకోవడం లేదు. పసుపు కుంకుమలు పెట్టుకోవడం లేదు.

మనుషులు లేని, కేవలం పశు, పక్ష్యాదులు, జీవజాలం ఉన్న స్థలంలో దేవుడి విగ్రహాలు లేవు.
ప్రార్థనా స్థలాలు లేవు.

దీన్నిబట్టి దేవుడు కూడా ఆటవిక దశ నుండి పరిణామం చెందుతూ  మానవ నాగరికతకు అనుగుణంగానే మనిషి వెంట నడిచి వచ్చాడని అర్థమవుతుంది.

కాగితాన్ని కనిపెట్టిందెవరు?
"మనిషి" - "HUMAN"

నిప్పును కనిపెట్టిందెవరు?
"మనిషి" - "HUMAN"

చక్రాన్ని కనిపెట్టిందెవరు?
"మనిషి" - "HUMAN"

వ్యవసాయాన్ని కనిపెట్టిందెవరు?
"మనిషి" - "HUMAN"

పెద్ద పెద్ద ఇల్లు, బంగళాలు కట్టిందెవరు?
"మనిషి" - "HUMAN"

ఓడను కనిపెట్టిందెవరు?
"మనిషి" - "HUMAN"

విమానం కనిపెట్టిందెవరు?
"మనిషి" - "HUMAN"

కంప్యూటర్ కనిపెట్టిందెవరు?
"మనిషి" - "HUMAN"

ఫోన్, మొబైల్ కనిపెట్టిందెవరు?
"మనిషి" - "HUMAN"

కార్లు, వాహనాలు కనిపెట్టిందెవరు?
"మనిషి" - "HUMAN"

ఇంట్లో విశ్రాంతి, సుఖము, ప్రశాంతత కొరకు ఏ వస్తువులనయితే ఉపయోగిస్తున్నావో వీటిని ఎవరు తయారు చేశారు?
"మనిషి" - "HUMAN"

ఏ face book, whatsupలలో postings చదువుతున్నావో వీటిని ఎవరు సృష్టించారు?
మళ్ళీ సమాధానం 

"మనిషి" - "HUMAN"

ఈ సమాజాన్ని నిర్మించిందెవరు?
"మనిషి" - "HUMAN"

మతాలను, ధర్మాలను సృష్టించిందెవరు
"మనిషి" - "HUMAN"

మందిరము, మసీదు, చర్చి కట్టిందెవరు?
"మనిషి" - "HUMAN"

వీటిలో దేవున్ని ప్రతిష్టించిందెవరు ?
"మనిషి" - "HUMAN"

విచిత్రమైన విషయమేమిటంటే ప్రతి ఒక్కటీ 
"మనిషి" - "HUMAN"
సృష్టించాడు.

అయినప్పటికీ మనం దేవుడు 
చమత్కారాలు చేస్తాడని, 
ఆపదల నుండి రక్షిస్తాడని, 
మనం చేసే పనులన్నిటిని పైనుండి చూస్తాడని, మన పాప పుణ్యాలు లెక్కిస్తాడని, 
పాపాలు ఎక్కువయితే నరకంలోకి
 పుణ్యాలు ఎక్కువైతే స్వర్గంలోకి
 తీసుకువెళ్తాడని.
 అన్నింటికీ ఆయనే దిక్కనీ
అంటుంటాం.విశ్వసిస్తాం.
కానీ ఇవేవీ దేవుడు చేయడు 
అంతా మనమే చేసుకుంటాం
 దేవుడు చేస్తాడని "భ్రమ"పడతాం అంతే

1)మనిషి తప్ప ఏ ప్రాణీ భగవంతున్ని కోరికలు కోరదు.

2)మనిషి నివాసం లేని చోట మందిరం గాని, మసీదు గాని, చర్చి గానీ లేవు.
ఇతర గ్రహాలలో గానీ, మంచు ఖండంలో గానీ.

3)వేరు వేరు దేశాలలో ప్రాంతాలలో వేరు వేరు దేవతలు, దీని అర్థం మనిషి 
ఊహలతో తన ఇష్టమైన రీతిలో భగవంతున్ని సృష్టించాడు.

4)ప్రపంచంలో అనేక ధర్మాలు అనేక సాంప్రదాయాలు, అనేక పద్ధతులు ఒకర్నొకరు విమర్శించుకోవడాలు
దీని అర్థం దేవుడు ఒకరు కాదనేగా, అందరూ చెబుతారు దేవుడొక్కడే అని, కానీ కొసమెరుపు అది మా దేవుడే.

5)రోజుకో క్రొత్త దేవుడు, రోజుకో కొత్త పద్ధతి. మాదే గొప్ప అనే వితండ వాదనలు.

6)ప్రశ్నించే వాన్ని నాస్తికుడనో, హృదయం లేని వాడనో ముద్ర వేయడం.

7)ఈ ప్రపంచంలో వేరు వేరు దేవతలను ప్రసన్నం చేసుకోవడం కోసం ఎన్ని తిప్పలో ఎన్ని ప్రయాసలో వర్ణించ నలవి కాదు.

8)ఇప్పటి వరకు నాకు దేవుడు కనపడినాడని చెప్పిన మనిషే లేడు.
బుద్దుడు, వివేకానందుల వారు కూడా కనపడే మనిషికే సేవ చెయ్యమన్నారు.
ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా చివరకు కీర్తి కాంక్ష కూడా సుమా!

9)దేవుడున్నాడు లేడు అనే వాడు కూడా ఒకే విధమైన జీవితాన్ని అనుభవిస్తున్నాడు.

10)భగవంతుడు ఎవరికీ మేలు చెయ్యట్లేదు అలా అని కీడు కూడా చెయ్యట్లేదు.

11)దేవుడు లంచగొండితనం, అన్యాయం, దొంగతనం, బలాత్కారము, ఆటంకవాదము, అరాచకత్వాన్ని నిరోధించడం లేదు.

12)అమాయకమైన చిన్న పిల్లలను కాల్చుతున్నా కూడా వారిని ఆపడం లేదు.

13)మందిరాలు, మసీదులు, చర్చిలు, ధ్యానమందిరాలు ఇవి దేవుని నిలయాలనే చెప్పుకునే చోట కూడా
మహిళలు, పిల్లలు సురక్షితంగా లేరు.

14)మందిరాలు, మసీదులు, చర్చిలు కూల్చుతుంటే ఏ దేవుడూ వచ్చి ఆపలేదు.

15)అభ్యాసం చేయకుండా ఏ ఒక్క విద్యార్థి అయినా ఉత్తీర్ణుడయ్యాడా?

16)25 సంవత్సరాలముందు లేని దేవుళ్ళు, రకరకాల పద్ధతులు ఈ నాడు గొప్ప గొప్పవి అయిపోయినాయి.

17)తానే దేవున్నని చెప్పుకునే వాళ్ళు చాలా మంది జైళ్ళలో ఊచలు లెక్క పెడుతున్నారు.

18)ఈ ప్రపంచంలో దేవుడే లేడని చెప్పేవాళ్ళు చాలా మంది ఆనందంగా ఉన్నారు.

19) హిందువులు అల్లాను స్వీకరించరు, ముస్లిములు హిందూ దేవతలను, క్రైస్తవులు హిందూ దేవతలను, అల్లాహ్ ను ఒప్పుకోరు. హిందూ ముస్లిమ్ గాడ్ ను అంగీకరించరు. అయినప్పటికీ ఈ దేవతలంతా ఎందుకిలా అని ఎవర్నీ అడుగలేదే?

కనుక ఆనందమే దైవం ఆనందం ఎప్పుడు కలుగుతుందీ అంటే కనపడని దేవుని పేరుతో కోటాను కోట్ల వ్యాపారం చేయడం కన్నా కనపడే మనిషికి సేవచేయడంలో,
వారి కళ్ళలో కనపడే కృతజ్ఞతాపూర్వకమైన చూపును అనుభవించే వారికే తెలుస్తుంది.
***
గోల్కొండ

గోల్కొండ ప్రాంతాన్ని 1083 నుంచి 1323 వరకూ కాకతీయులు పరిపాలించేవారు. 1336లో ముసునూరి నాయకులు మహ్మద్ బిన్ తుగ్లక్ సైన్యాన్ని ఓడించి గోల్కొండను పొందారు. 1364లో గోల్కొండను పరిపాలించిన ముసునూరి కాపయ భూపతి సంధిలో భాగంగా ఈ ప్రాంతాన్ని బహమనీ సుల్తాను మహ్మద్ షా కు అప్పగించాడు. అప్పటి నుంచి 1512 వరకూ బహమనీ రాజ్యానికి రాజధానిగా, ఆ తరువాత ముస్లిం రాజులు కుతుబ్ షాహీల రాజధానిగా మారింది.

కుతుబ్ షాహీ వంశస్తులు గోల్కొండ కోటను 60 ఏళ్లకు పైగా శ్రమించి 120 మీటర్ల ఎత్తైన నల్లరాయి కొండపై శత్రుదుర్భేధ్యంగా నిర్మించారు. ఈ కోట బురుజులతో కలిసి సుమారు 5 కిలోమీటర్ల చుట్టుకొలత కలిగి ఉంటుంది. నవాబుల కాలంలో గోల్కొండ కోట వజ్రాల వ్యాపారానికి ఎంతో ప్రసిద్ధి చెందింది. ప్రపంచ ప్రసిద్ధమైన కోహినూరు, ఒర్లఫ్, హోప్, పిట్ వజ్రాలు ఈ రాజ్యం పరిధిలోని పరిటాల-కొల్లూరు గనుల నుంచి వచ్చాయి. ఇక్కడి సంపద నిజాములను అత్యంత ధనవంతులగా మార్చింది. 1687లో ఔరంగజేబు విజయంతో నవాబుల పాలన అంతమయ్యింది. ఆ సమయంలోనే ఔరంగజేబు గోల్కొండ కోటను కొంత మేర నాశనం చేశాడు.

***


బ్రాహ్మీ లిపి

భాషDownload PDFవీక్షించుసవరించుబ్రాహ్మీ లిపి

ఆధునిక బ్రాహ్మీ లిపి కుటుంబము యొక్క సభ్యుల మాతృక. ఇది ప్రస్తుతము వాడుకలో లేని లిపి. క్రీ.పూ.3వ శతాబ్దానికి చెందిన ప్రసిద్ధ అశోకుని శిలా శాసనాలు బ్రాహ్మీ లిపిలో చెక్కబడినవే. ఇటీవలి వరకు ఇవే బ్రాహ్మీ రాతకు అత్యంత పురాతనమైన ఉదాహరణలుగా భావించేవారు అయితే ఇటీవల శ్రీలంకతమిళనాడులలో దొరికిన పురావస్తు శాస్త్ర ఆధారాలను బట్టి బ్రాహ్మీ లిపి వాడకము క్రీ.పూ.6వ శతాబ్దమునకు పూర్వమే మొదలైనదని రేడియోకార్బన్, థర్మోల్యూమినిసెన్స్ డేటింగ్ పద్ధతుల ద్వారా నిర్ధారించారు.

***

బొమ్మల లిపి

సింధూ ప్రజల లిపి బొమ్మల లిపి. దీన్ని 1853లో కనుగొన్నారు. ఇది స్వదేశీ లిపి. దీన్ని ఎవరూ అర్థం చేసుకోలేరు. ఒక వరుసను ఎడమ నుంచి కుడికి, తర్వాత వరుసను కుడి నుంచి ఎడమకు రాసేవారు. ఈ విధానాన్ని ‘సర్పలేఖనం’ అంటారు. ఇది మెసపటోమియా, ఈజిప్ట్ దేశాల ప్రాచీన లిపిని పోలి ఉంది.

సింధూ నాగరికత లేదా హరప్పా నాగరికతను క్రీ.శ.1921లో కనుగొన్నారు. ఆనాటి పురావస్తు శాఖ అధిపతి సర్ జాన్ మార్షల్ ఆధ్వర్యంలో ఈ నాగరికత గురించి తెలుసుకోవడానికి తవ్వకాలు జరిగాయి. మనదేశంలో ఈ నాగరికత ఆనవాళ్లు లభించే ప్రాంతాలు ఎక్కువగా గుజరాత్‌లో ఉన్నాయి. క్రీ.పూ. 3000 నుంచి క్రీ.పూ. 1500 వరకు సింధూ నాగరికత విరాజిల్లింది. క్రీ.పూ. 2500 నుంచి క్రీ.పూ.1750 వరకు ఈ నాగరికత ఉన్నత దశలో ఉంది. హరప్పా నాగరికతకు కేంద్రస్థానం సింధూ నది. సింధు ప్రజలు కాంస్య యుగానికి చెందినవారు. వీరిది పట్టణ నాగరికత. ఈ కాలంలోనే తొలి నగరీకరణ జరిగింది. ఈ నాగరికత 12,99,600 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉత్తరాన జమ్మూ నుంచి దక్షిణాన నర్మద వరకూ, పశ్చిమాన బెలూచిస్థాన్ కోస్ట్‌లోని మాక్రాన్ నుంచి ఈశాన్యంలో మీరట్ వరకు వ్యాపించి ఉంది. ఆ కాలంలో ప్రపంచంలో ఏ నాగరికతా ఇంత పెద్ద విస్తీర్ణంలో వ్యాపించి లేదు. తవ్వకాల్లో మొదట బయటపడిన నగరం హరప్పా. పలు ధాన్యాగారాల ఉనికి కూడా హరప్పాలోనే లభ్యమైంది. హరప్పా సంస్కృతికి చెందిన కాళీభంగన్ రాజస్థాన్‌లో ఉంది. మొహంజొదారో, చన్హుదారో, బన్వాలీ, లోథాల్.. నాటి ఇతర ప్రసిద్ధ నగరాలు. మొహంజొదారో అతి పెద్ద పట్టణం. మత, కర్మకాండలకు ఉపయోగించిన అద్భుత స్నానఘట్టం, పెద్ద ధాన్యాగారం, గుర్రాల ఉనికి తెలియజేసే అస్పష్టమైన సాక్ష్యాధారాలు కూడా ఇక్కడే లభ్యమయ్యాయి.

నిర్మాణ శైలి

ప్రజలు కాల్చిన ఇటుకలతో ఇళ్లను నిర్మించుకున్నారు. పాలక వర్గాల భవనాలకు విశేష రక్షణ కల్పిస్తూ గోడలు నిర్మించారు. దిగువన సామాన్యుల గృహాలు ఉండేవి. సామాన్యుల ఇళ్లు రెండు గదులు, సంపన్నుల ఇళ్లు ఐదారు గదులతో విశాలంగా ఉండేవి. ప్రతి ఇంటికీ బావి, పెద్ద ఇళ్లకు మరుగుదొడ్లు ఉండేవి. అద్భుతమైన భూగర్భ డ్రైనేజీ ఉంది. మురుగు కాల్వలపై ఇటుకలను కప్పి ఉంచేవారు. ఈ భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను సింధూ నాగరికత ప్రత్యేకతగా చెప్పవచ్చు. లోథాల్ పట్టణాన్ని ఇటుకలతో కృత్రిమంగా నిర్మించారు. సింధూ ప్రజలు స్నానప్రియులు. అందుకే మొహంజొదారోలో మహాస్నానవాటికను నిర్మించారు. ఇది ఇటుకలతో రూపుదిద్దుకుంది. 180 అడుగుల పొడవు, 108 అడుగుల వెడల్పు కలిగి 8 అడుగుల లోతులో ఇది నిర్మితమైంది. స్నానవాటిక అడుగుభాగం నీరు ఇంకిపోకుండా జిప్సమ్ - బిటూమెస్ పదార్థాలతో నిర్మించారు. హరప్పాలో అతిపెద్ద ధాన్యాగారాన్ని నిర్మించారు. దశాంశ పద్ధతిని కొలతలకు ఉపయోగించారు. ‘ఇంగ్లిఘ బాండ్’ అని పిలిచే తాపీ పనిని ప్రవేశపెట్టిందీ వీరే.

వ్యవసాయం

సింధు ప్రజలకు నాగలి తెలియదు. భూములను దున్నకుండా తవ్వేవారు. దీని కోసం తేలికపాటి గొర్రును ఉపయోగించేవారు. వ్యవసాయం కోసం నీటిని నిల్వ చేయడానికి గబర్ బంద్‌ల (డ్యామ్‌లు) నిర్మించారు. నాడు ప్రధాన పంటలు గోధుమ, బార్లీ. వరి పండించినట్లు లోథాల్, రంగాపూర్‌ల్లో ఆధారాలు లభించాయి. తివాచీల తయారీకి పత్తిని ముఖ్యంగా ఉపయోగించారు. దీన్ని బట్టి వీరి ప్రధాన వృత్తి వ్యవసాయం అని తెలుస్తోంది.

మత విశ్వాసాలు

సింధూ ప్రజలు ఎక్కువగా అమ్మతల్లిని అంటే శక్తిని ఆరాధించేవారు. పశుపతి అనే పురుష దేవుడిని కూడా కొలిచేవారు. పశుపతిని ముద్రిక ద్వారా తెలుసుకోవచ్చు. ఒక వేదికపై కూర్చున్న ముఖాల మూర్తి, ఆ వేదికను ఆవరించి ఏనుగు, పులి, ఖడ్గ మృగం, మహిషం ఉండేవి. రావి చెట్టు, స్వస్తిక్ గుర్తు, జంతువులు, చెట్లు, సర్పాలను కూడా పూజించేవారు. మూపురంతో కూడిన ఎద్దు వీరికి ఇష్టమైన జంతువు. లింగపూజ వీరితోనే ప్రారంభమైంది. జంతువులను బలిచ్చేవారు. వీరికి తెలియని జంతువు గుర్రం. వేదాల ఆధారంగా శివారాధన, శక్తి పూజ, లింగారాధన వంటివి సింధూ నాగరికత వారసత్వాలుగా చెప్పుకోవచ్చు.

News:Lok Sabha Passes Women's Reservation Bill With 454-2 Majority-(20-9-23)

బుద్ధిజం మతం కాదు జీవితం యొక్క తత్త్వం

*రక్షాబంధన్ 

తథాగత బుద్ధుడు తన మొత్తం జీవితంలో 84,000 బోధనలు చేశారు.ఈ బోధనల జ్ఞాపకార్థం, చక్రవర్తి అశోకుడు 84,000 బౌద్ధ స్థూపాలను నిర్మించారు.  తథాగత బుద్ధుని ధర్మ ప్రబోధాన్ని "ధమ్మసుత్త" అని కూడా అంటారు.  ధమ్మసుత్త లేదా ధమ్మ స్థూపాలను రక్షించడం బౌద్ధుల పురాతన సంప్రదాయం.  త్రిపిటకం వంటి బౌద్ధ గ్రంథాల ద్వారా తథాగత బుద్ధుని 84,000 ధర్మ సూత్రాలు సజీవంగా ఉంచబడ్డాయి. అంటే,ధమ్మ సూత్రాలు రక్షించబడ్డాయి, దీనిని "రఖా సుత్త దినం" అంటారు. ధమ్మ సూత్రాలు భద్రపరచబడిన రోజు సావన్ మాస పౌర్ణమి. బౌద్ధ సాహిత్యంలో ఈ రోజును "ధమ్మ సంగీతి" అని పిలుస్తారు.  ప్రస్తుతం, "రక్షా బంధన్" అనే పండుగ ప్రతి సంవత్సరం సావన్ మాసం పౌర్ణమి రోజున వస్తుంది.  అంటే రక్షా బంధన్ అనేది రక్కా సుత్త రోజు యొక్క వక్రీకరించిన రూపం.*

*భగవాన్ బుద్ధుని మహాపరినిర్వాణం తరువాత,బుద్ధుని శిష్యులు బుద్ధుని బోధనలైన  84 వేల సూత్రాలను సంకలనం చేసి, భద్రపరిచారు.బుద్ధుని మహాపరినిర్వాణం తరువాత  భిక్ఖు సంఘంలో చేరిన సుబద్ధ భిక్షువు బుద్ధుని కఠిన నియమాలను ఆచరించకుండా, ఎవరికి నచ్చిన విధంగా వారు నడుచుకోవచ్చంటూ ,బుద్ధుడు విధించిన భిక్షువులు యొక్క కఠిన నియమాలను అంగీకరించలేదు.దీంతో సీనియర్ భిక్షువులు ఆందోళన వ్యక్తం చేశారు.45 సంవత్సరాలు పాటు బుద్ధుడు ఆచరించి,బోధించిన బోధనలు కేవలం స్మృతితోనే ముందుకు సాగుతున్నాయి. ఇలా మనం భిక్ఖు సంఘ నియమాలను ఉల్లంఘించినచో బుద్ధుని ధమ్మానికి నష్టం కలుగుతుంది అని సీనియర్ భిక్షువులు అంటారు.*

*బుద్ధుని మహాపరినిర్వాణం తర్వాత మూడు నెలల తరువాత,బుద్ధుని అనుచరుడు మగధ చక్రవర్తి అజాత శత్రు రాజగృహ పర్వతంలోని భారీ సప్త పర్ణి గుహలో మొదటి బౌద్ధ సంగీతి(సంగయాన,సమావేశం)ఏర్పాటు చేశారు. ఈ సంగీతిలో సుమారు 500 మంది సీనియర్ భిక్షువులు పాల్గొన్నారు. ఈ మొదటి బౌద్ధ సంగీతికి మహాకశ్యప్ అధ్యక్షత వహించారు.*

*ఈ మొదటి బౌద్ధ సంగీతికు బౌద్ధ ఉపాసకులు(గృహస్తులు) ,భిక్షువులు కలిసి వినయ(క్రమశిక్షణ) నియమాలను రూపొందించడానికి అరహంత భిక్ఖు ఉపాలిను అధిపతిగా ఎన్నుకున్నారు.ఉపాలి వినయ ధర్మానికి ఆధారం.*

*అరహంత ఆనంద్ భిక్ఖు బుద్ధుని బోధనలు యొక్క అన్ని సూత్రాలను జ్ఞాపకం చేసుకొన్నారు. ఈ మొదటి బౌద్ధ సంగీతిలో ఉపాలి వినయ.పిటకమును, ఆనందుడు సుత్త పిటకమును వ్రాసి సంకలనం చేసి, భద్రపరిచారు. ఆ తరువాత అభిధమ్మ పిటకమును తయారు చేశారు.*

*సుమారు ఏడు నెలల పాటు ఈ బౌద్ధ మొదటి సంగీతి జరిగింది. ఈ సంగీతి శ్రావణ పౌర్ణమి నాడు ప్రారంభమైంది. బౌద్ధ చరిత్రలో. ఈరోజు చాలా ముఖ్యమైన రోజు.పాళీ భాషలోని మొదటి త్రిపిటకము ఈ శ్రావణ పౌర్ణమి రోజున తయారు చేయబడింది.*

*భగవాన్ బుద్ధుని బోధనలలోని సూత్రాలు మానవ సంక్షేమానికి ఉపకరిస్తాయి. వర్షాకాలంలో భిక్షువులు చుట్టుపక్కల ఉన్న గృహస్తులకు బుద్ధ ధర్మాన్ని బోధిస్తారు.భిక్షువులు సుత్తాలు పఠిస్తారు.ఆ తరువాత నూతనంగా ధమ్మంలోకి వస్తున్న వారికి తెల్లటి దారాన్ని ఇస్తారు.ఈ దారాన్ని మెడలో కూడా వేసుకొనే వారు.ఆ తరువాత చేతికి కూడా కట్టడం మొదలు పెట్టారు.*

**శతాబ్దాల తరువాత మనదేశంలో బౌద్ధ ధమ్మం కనుమరుగు అయ్యేలా కొందరు దోపిడీ శక్తులు చేయడంతో ధమ్మం యొక్క అసలు స్వరూపం కోల్పోయాం.ఆనాటి బౌద్ధుల సాంప్రదాయం మైత్రీ దారం ఈనాడు రూపం మారిపోయింది. రక్షాబంధన్ పేరుతో ఆర్యీకరణ జరిగి,సంస్కృతీ కరణ చెందింది. అది వినిమయ సంస్కృతిలో భాగం అయింది.మార్కెట్ అవసరాల కోసంg ఈ రక్షాబంధన్ పేరుతో అన్నాచెల్లెళ్ళ బంధానికి ప్రతీకగా అంటూ ఒక కథ అల్లారు.*

*శ్రావణ పౌర్ణమి బౌద్ధుల పండుగ.శ్రావణ పౌర్ణమి నుండి శ్రవణం అనే మాట.వచ్చింది. శ్రావణం అనగా బుద్ధుని ధమ్మ సూత్రాలు వినడం అని అర్థం.*

*క్రీ.పూ.400 లో అజాత శత్రువు కాలంలో మొదటి బౌద్ధ సంగీతి మహాకాశ్యపుడు అధ్యక్షతన రాజగృహలో జరిగింది.*

*రెండో బౌద్ధ సంగీతి క్రీ.పూ.383 కాలాశోకుడి కాలంలో వైశాలిలో సబకామి అధ్యక్షతన జరిగింది.*

*మూడో బౌద్ధ సంగీతి క్రీ.పూ.250 లో అశోకుని కాలంలో పాటలీపుత్రంలో మొగ్గలిపుత్త తిస్స అధ్యక్షతన జరిగింది.*

*నాలుగో బౌద్ధ సంగీతి క్రీ.శ.72 లో  కనిష్కుడి కాలంలో జరిగింది. కాశ్మీర్ /కుందన వనంలో వసుమిత్రుడి అధ్యక్షతన జరిగింది.*

*ఐదో బౌద్ధ సంగీతి క్రీ.శ.1871 లో మయన్మార్ లోని మాండలే లో జరిగింది. ఈనాడు దీనిని బర్మా అని పిలుస్తున్నారు.బర్మా రాజు మిండన్ ఆధ్వర్యంలో ఈ సంగీతి జరిగింది.*

*ఆరో బౌద్ధ సంగతి 1954 లో బర్మాలోని  రంగూన్ లో జరిగింది. బాబాసాహెబ్ అంబేడ్కర్ ఈ సంగీతి లో పాల్గొన్నారు.*

*నమో బుద్ధాయ*

*(ఎం.ఎల్.పరిహర్ హిందీలో ఫేస్బుక్ లో వ్రాసిన పోస్టు స్ఫూర్తితో వ్రాసిన పోస్టు ఇది.)*

*✍️అరియ నాగసేన బోధి*


*భవతు సబ్బ మంగలమ్*

ఏ రాతి ప్రతిమవో 

ప్రాణం నింపుకొని

నాదరికి చేరావు

నా హృది వీణ మీటి

నా బ్రతుకు లో

సరాగాలు పలికించావు 

వెనుదిరిగి చూచేలోగా

ప్రతిమగా మారావు

జీవితం క్షణ భంగురం

By Ch రామమోహన్

***

అమ్మ వళ్లో నేను కళ్లు తెరిచేటప్పటికి అడవి నిండా పాలపూల సుగంధం
పూసిన కొండమామిడి కొమ్మలమీద అడవికోయి­లలు పాటలు పాడేవి,
భూమి కోసం ఆకాశం నుంచి నిత్యం శుభవార్తలు వర్షించేవి
ఆదివాసి యు­వతుల ఆటల్తో ఊరు గలగల్లాడేది

అమ్మ నాకొక్కటే అన్నం ముద్ద పెట్టినప్పుడల్లా ఆకలి రుచి తెలిసేది,
పొదుగుల్లో పొంగుతున్న క్షీరధారలు తాము తాగి లేగలు నాకు కొంతమిగిల్చేవి
నేను ఆడుకోవడం కోసం సూర్యుడు దారిపొడుగునా వెలుతురు పరిచేవాడు,
వెన్నెలపందిరి మీద సన్నజాజులు పూచినట్టు తారకలుదయించేవి

నా కోసం ప్రతి అరుగు మీదా ఆ ఊరు ఆహ్వాన పత్రిక రాసి ఉంచేది,
నా కోసం శుభాకాంక్షల్తో ప్రతి ఇంటి కిటికీ తెరిచి ఉండేది
వాకిట్లో రాధామనోహరాలు నా కోసం మరికొన్ని మకరందాల్ని మనసున నింపుకునేవి

ఎడ్లమెడల్లో గంటల సవ్వడి నేను వినాలని రాత్రులు బళ్లు నడక తగ్గించేవి,
అడవి ఎప్పటికప్పుడు నా కోసం కొత్త వస్త్రాల్ని ధరించేది.
నా కళ్ల ముందు రంగులు పోస్తూ పూలు పూసేవి
ఊరంతా నా కోసం పిల్లల బొమ్మల కొలువు,
ఏ దేశాల్నుంచో ప్రతి పండక్కీ గంగిరెద్దులొచ్చేవి
జక్కుల వాళ్లు నాట్యం చేసేవారు,
ఊరి వెలుపల జాగరాలమ్మ సంధ్యా దీపం వెలిగించుకుని నను రమ్మనేది

అడవి, ఏరు, పొలం, పాట, వెన్నెల వూటల సాక్షిగా
మేం పీటని పల్లకి చేసి బొమ్మలకి పెళ్లి చేసాం
ఉత్తుత్తి వంటలతో బాల్యకాల సఖి ఎవరో
నాకు అన్నం వండి చెలిమిని వడ్డించేది.

నన్నెవరు ప్రేమించినా ఆ ఊరికి తీసుకుపోదామనిపిస్తుంది
నా చెలిమినెవరు కోరినా ఆ లోకానికెగరాలనిపిస్తుంది

(పునర్యానం:1-1-1) (vadrevu chinaveerabhadrudu)సౌజన్యంతో 

26-07-23 బుధ వారం (శ్రావణ మాసం --దక్షిణాయనం -- వర్ష ఋతువు )suklapaksham అష్టమి : Jul 25 03:09 PM to Jul 26 03:52 PM నవమి : Jul 26 03:52 PM to Jul 27 03:48 PM 

GUNTUR 
కవిత్వం లోతులు 

వియోగినీ అవస్థ (కవయిత్రి )శీల భట్టారిక 

ప్రియ విరహితస్యాయ హృది చింతాసమాగతా
ఇతి మత్వా గతా నిద్రా కే కృతఘ్నముపాసతే.

(ప్రియుడినుంచి దూరంగా ఉన్నప్పుడు అతడి తలపు మదిలో మెదిలిందో లేదో నిద్ర కూడా వదిలిపెట్టేసింది. కృతఘ్నుల్ని ఎవరు మటుకు ఆరాధిస్తారు గనుక?)

--_-----_
చరిత్రలో చాలా గొప్ప విషయాలు "కృతనిశ్చయం గల స్వతంత్ర మనస్తత్వం" గలవారే సాధించారు.
వ్యష్ఠిగా కన్న సమిష్ఠిగానే ఎక్కువ సాధించవచ్చు.
(The 7 Habits of Highly Effective People-Srephen R Covey)
***
"రేపు చెయ్యాల్సిన ఒక మంచి పని ఇవ్వాళ
ఇవ్వాళ చెయ్యాల్సిన ఒక మంచి పని ఇప్పుడే చేసెయ్యి నిన్ను కబలించడానికి మృత్యువు నోరు తెరచి సిద్ధంగా ఉంది "


***
"భవితవ్యానాం ద్వారాణి భవంతి సర్వత్ర "
అదృష్టం తలుపులు అన్నిచోట్లా తెరిచే ఉంటాయి

"పూర్వవాధీరితం శ్రేయోదుఃఖం హి ప్రతిపద్యతే "
కలసి వచ్చిన అదృష్టాన్ని కాదంటే కలిగేది దుఃఖమే.
 -కాళిదాసు 

"క్షణ క్షణం మారే ఈ ప్రపంచం లో "నేనొక ప్రవాహాన్ని "

"నా దమ్మ సాధన కూడా వ్యవసాయం లాంటిదే. నేనూ ధార్మిక కర్షకుణ్ణే.. " బుద్ధుడు
"The words are lovely, dark and deep. But I have promises to keep and miles to go before I sleep And miles to go before I sleep"

"Curtesy costs nothing buys everything"

No comments: