CONCEPT

భావన

మనిషి - తత్త్వం

మనిషి - తత్త్వం

ఎక్కడి మానుష జన్మం

ప|| ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమే మున్నది | నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను ||

చ|| మరవను ఆహారంబును మరవను సంసార సుఖము | 
మరవను యింద్రియ భోగము మాధవ నీ మాయ ||
మరచెద సుఙ్ణానంబును మరచెద తత్త్వ రహశ్యము | మరచెద గురువును దైవము మాధవ నీ మాయ ||

చ|| విడువను పాపము పుణ్యము విడువను నా దుర్గుణములు | 
విడువను మిక్కిలి యాసలు విష్ణుడ నీమాయ |
విడిచెద షట్కర్మంబులు విడిచెద వైరాగ్యంబును | విడిచెద నాచారంబును విష్ణుడ నీమాయ ||

చ|| తగిలెద బహు లంపటముల తగిలెద బహు బంధముల | 
తగులను మోక్షపు మార్గము తలపున యెంతైనా |
అగపడి శ్రీ వేంకటేశ్వర అంతర్యామివై | నగి నగి నను నీవేలితి నాకా యీమాయ ||

భారత దేశంలో చార్వకుల నుండి బౌద్ధుడు, సామ్రాట్ అశోక చక్రవర్తి , సంత్ కబీర్, సావు మహారాజ్ నుండి పూలే --అంబేడ్కర్ --పెరియార్   మహనీయుల చరిత్ర,సందేశాలు భారత దేశం గతితార్కిక చారిత్రక భౌతికవాదం.


Happy living is best living
Rich or poor
Alone or together

**నా కవిత**

బుద్దుడు
 సకలం
 పరిత్యజించిన

సోక్రటిస్
సత్య శోధన కై
హలం గ్రహించిన

స్పోర్టకస్ తిరుగుబాటుతో 
చరిత్రకు
పాఠాలు నేర్పిన

జీసస్
వీరు ఎమి చేయుచున్నారో
వీరు ఎరుగరని
సిలువను
రక్తసిక్తం చేసిన

వేమన
భావ విప్లవానికే 
భాష్యం చెప్పిన

ఫ్రాయిడ్ 
మానసిక ఋగ్మతలను
 పటాపంచలు చేసిన

మార్క్స్ చరిత్ర గతిని
నిర్దేశించిన

లెనిన్
పెట్టుబడిదారుల
గుట్టు విప్పిన (సామ్రాజ్యవాదం)

స్టాలిన్
Stateless country
అని ఉటంకించిన

మావో
సాంస్కృతిక
విప్లవావసరాన్ని తెలిపిన

అంబేద్కర్ భరత దేశ
జాతిని నీతిని నిలిపిన

వారు తాత్వికులు
చరిత్రగతిని నిర్దేశించారు
సమాజం వసుదైక
కుటుంబం యొక్క నమూనా
వారు సమాజంతో మమేకమై
కాలాచక్ర పరిధిని దాటి
ఆలోచించారు
సమాజానికి
నూతనమార్గాన్ని నిర్దేశించారు 
-చింతా రామమోహన్ 9492979239

వేమనకు గుర్తింపు

తెలుగు సాహిత్య చరిత్రకారులలో ప్రథములైన కందుకూరి వీరేశలింగం, గురజాడ శ్రీరామమూర్తి, కావలి రామస్వామి తన ఆంగ్ల గ్రంథంలోను వేమన చరిత్రను చేర్చలేదు. దీనిగూర్చి నార్ల వేంకటేశ్వరరావు "ఇట్టి మూగకుట్ర, ఒక మహావ్యక్తి పేరైనను ఉచ్ఛరించక మరుగుపరచిన మౌనకుతంత్రము ప్రపంచ భాషా చరిత్రలందెచ్చటనుకానము, ఇది ఒక పెద్ద విస్మయము "అని అన్నాడు.అయితే వేమన పద్యాలను కందుకూరి వీరేశలింగం తన సాహిత్యంలో కొన్ని పద్యాలనుదహరించాడు. గురజాడ అప్పారావు కన్యాశుల్కంలో వేమనను విరివిగా ప్రశంసించాడు. బ్రౌన్ తరువాత కట్టమంచి రామలింగారెడ్డి తన కవిత్వతత్వవిచారం గ్రంథంలో మహాకవిగా గుర్తించాడు. తరువాత 1928 లో రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ విశేష పరిశోధన చేసి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఉపన్యాసాలిచ్చాడు. ఆ తరువాత ఏభై ఎళ్లకు శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆరుద్రచే వేమన్న గురించిన ఉపన్యాసాలు నిర్వహించింది. పైన పేర్కొన్న సాహితీ వేత్తల కృషి తరువాత వేమన రచనలకు పండితులనుండి అనన్యమైన గౌరవం లభించసాగింది. కొమర్రాజు వేంకటలక్ష్మణరావు, సురవరం ప్రతాపరెడ్డి, మల్లంపల్లి సోమశేఖరశర్మ, వేటూరి ప్రభాకరశాస్త్రి వంటివారు వేమనను సంస్కర్తగా ప్రస్తుతించారు తరువాత ఎందరో యువ కవులు, రచయితలు వేమన గురించి, వేమన రచనల గురించి పరిశోధనలు చేశారు. ఎన్. గోపి, బంగోరె వంటివారు వీరిలో ప్రముఖులు.
కేంద్ర సాహిత్య అకాడమీ ప్రముఖ పాత్రికేయుడు నార్ల వెంకటేశ్వరరావు చేత వేమన జీవిత చరిత్రను వ్రాయించి 14 భాషల్లోకి అనువదింపజేశారు. ఆంగ్ల, ఐరోపా భాషలన్నింటిలోకి, అన్ని ద్రావిడ భాషలలోకి వేమన పద్యాలు అనువదింపబడ్డాయి. వేమనకు లభించిన ఈ గౌరవం మరే తెలుగు కవికి లభించలేదు. ఐక్య రాజ్య సమితి - యునెస్కో విభాగం వారు ప్రపంచ భాషా కవుల్లో గొప్పవారిని ఎంపిక చేసే సందర్భంలో వేమనను ఎన్నుకొని ఆ రచనలను పలు భాషలలోకి అనువదింపజేశారు.
యోగివేమన జయంతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వేడుకగా ప్రతి సంవత్సరం జనవరి 19న అధికారికంగా నిర్వహిస్తుంది. దీనికి సంబంధించిన జీఓ (నెంబర్‌ 164)ను రాష్ట్ర ప్రభుత్వం డిసెంబరు 2023లో విడుదల చేసింది.

శ్రీ వైష్ణవం!
*********
ఔనౌను...అందరూ
శ్రీ వైష్ణవులే!
నిష్ఠాగరిష్టులని
నియమబద్ధులని
నమ్మి -చేపలకూర దాస్తే
దాక  అలాగే ఉంది!
చేపల కూర మాయం!
అంతా శ్రీ వైష్ణవం!

ఔనౌను... అందరూ
మహానాయకులే!
మంచోళ్ళు కదా అని
ఓట్లేస్తే -
ఐదేళ్లు 'వీడు'
ఐదేళ్లు 'వాడు'
ఇద్దరూ తోడు దొంగలే!
దేశ సంపదలు ఖాళీ!

పెజలారా!జనులరా!
సోదరీసోదరులారా!
శ్రీ వైష్ణవమైనా(మతం)
నాయకులైనా(రాజ్యం)
ఇద్దరూ భక్షకులే!
ఎన్నాళ్ళు నమ్ముతారు?
వంటమీది!శ్రమమీది!
చేపలకూర మీది!

ఔనౌను... మిమ్మల్ని
బానిసల్ని చేసారు!
మీరంతా గొర్రెలు!
గొర్రె-కసాయి న్యాయం!
ఇంక సాగకూడదు!
తెలివి తెచ్చుకోండి
కలిసి దాచు కోండి!
చేపల కూర మీదే!

మళ్ళీ వీళ్ళకు ఓట్లేస్తే
'కూర-దాక' రెండు మాయం!
ఇల్లువాకిలి ఉండదు!
నిత్య దరిద్రమే శరణ్యం!
అవి నక్కలు, తోడేళ్లు!
మిమ్మల్ని పీక్క తినేస్తాయి!
మిగిలేదిప్రజాస్వామ్యంకాదు!
అంతా శ్రీవైష్ణవమే!
        *********
-తమ్మినేని అక్కిరాజు
       హైదరాబాద్
        21-2=2024



వ్యత్యాసం !
***********
కనీసావసరాలు
'కూడుగూడు' లేకపోతే
సమాజం దేనికి?

సమాజంలేని జీవుల్లో
కూడుగూడు లేని స్థితి
ఎక్కడా కనబడదే!

సమాజం నిర్మించు కున్న
మనిషికే ఈ దుస్థితి!
ఎందుకొచ్చింది?

మనిషి తప్ప-ఇతర
జీవ జాతులన్నీ
ప్రకృతి ఆధారితాలే !

మనిషి ఒక్కడే
నిరాధారుడైన
సామాజిక జీవి!

సమాజ నిర్మాణంలో
కంటే -ప్రకృతిలోనే
న్యాయబద్ధత ఉంది!

ఈ సమాజం దేనికి?
మనిషిని మనిషి
దోచుకు తినటానికా?

దగా దోపిడి వంచన
బ్లాక్మెయిల్ కిడ్నా ప్
హైజాక్ మాఫియా

అబద్ధాలు మోసం
భక్తి ముక్తి స్వర్గం
నరకం పుణ్యం పాపం

ఇవి మనుషులకే!
సర్వజీవుల సామ్యం
చావు పుట్టకలే!

ఇంకెందుకు సమాజం?
ప్రకృతిలోఉన్న ఏర్పాటు
సమాజానికి ఉండదా?

ఇదంతా చూస్తుంటే
'మనిషే 'కావాలని
చేస్తున్నట్టు లేదూ?

మన కష్టసుఖాలకు -దేవుడు
కారణమైతే -ఇతర జీవ 
జాతుల్లోదేవుడు లేడు కదా ?

దేవుడితో పనిలేకుండా
అవి సుఖంగా జీవిస్తుంటే
దేవుడుండి మనకు కష్టాలా?

'ప్రకృతి'ని దేవుడిస్తే
'సమాజం' మనిషిది!
మనిషే మోసగాడు!

వీడి ఆర్ధిక సూత్రాల్లో
ఏదో లోపం ఉంది!
వాటిని మార్చాలి!

గుళ్ళు,దేవుళ్ళు సమస్యల్ని 
పరిష్కరించవని మనకు 
అర్థమైంది కదా?

నా ప్రశ్నల్లో -తర్కం
న్యాయం వేదాంతం
మానవత్వం ఉంది!

జవాబులు కావలి!
ఎవరు చెపుతారు?
మీరు? మీరు? మీరు?

గాంధీ నెహ్రూ పటేల్
మార్క్స్ అంబేడ్కర్
నాయకులు ఎవరైనా?

మోడీ జీ ని అడిగితే
రాముణ్ణి చూపిస్తాడు!
ఆయనవల్ల కాదు!

కనీసావసరాలు తీరే
సమాజం కావాలి!
జవాబు చెప్పేదెవరు?

అదాని అంబానీల భాగ్యం!
పూట గడవని దరిద్రం!
ఎందుకింత వ్యత్యాసం?
        ********
-తమ్మినేని అక్కిరాజు
     హైదరాబాద్
     18-2-2024

లౌకికవాదం ఒక ఆధునిక భావన అయినప్పటికీ, అనేక నాగరికతలకు చెందిన ప్రాచీన తత్వవేత్తల రచనలలో దీనికి సంబందించిన ఆలోచనలు కనిపిస్తాయి. లౌకిక ఆలోచన మొట్టమొదటి డాక్యుమెంటేషన్లలో భారతదేశంలోని చార్వాకా తత్వశాస్త్రంలో చూడవచ్చు, ఇది ప్రత్యక్ష అవగాహన, అనుభవవాదం ఇంకా షరతులతో కూడిన అనుమితిని సరైన జ్ఞాన వనరులుగా కలిగి ఉంది అలాగే ఆ సమయంలో ఉన్న మతపరమైన పద్ధతులను తిరస్కరించడానికి ప్రయత్నించింది. ప్రాచీన గ్రీస్ శాస్త్రీయ తత్వశాస్త్రం , రాజకీయాలలో లౌకికవాదం పాశ్చాత్య వాదనలలో మొట్టమొదటగా కనిపించింది, శాస్త్రీయ ప్రపంచం క్షీణించిన తరువాత కొంతకాలం అదృశ్యమైంది, కాని పునరుజ్జీవనం సంస్కరణలో ఒక సహస్రాబ్దిన్నర తరువాత తిరిగి కనిపించింది. జాన్ లాక్ , డెనిస్ డిడెరోట్, డేవిడ్ హ్యూమ్, ఎడ్వర్డ్ గిబ్బన్, వోల్టేర్, జీన్-జాక్వెస్ రూసో, బరూచ్ స్పినోజా, జేమ్స్ మాడిసన్, థామస్ జెఫెర్సన్, థామస్ పైన్ ఇంకా ఇతర జ్ఞానోదయ ఆలోచనాపరులు లౌకికవాద భావనల ఏర్పాటుకు ఎంతో దోహదపడ్డారు. ఇటీవలి కాలంలో, రాబర్ట్ ఇంగర్‌సోల్, బెర్ట్రాండ్ రస్సెల్ క్రిస్టోఫర్ హిచెన్స్ వంటి మేధావులు లౌకికవాదానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు
చారిత్రిక గతిని నిర్దేశించిన తాత్వికులు :
1.బుద్డుడు - (563 - 483 BC) భౌతికవాదం * (meterilisiom)

2.సోక్రటీస్ - నిన్నునీవు తెలుసుకో (469 - 399) BC* (method of arriving at truth )

3.స్పొర్టకస్ - (71 BC) తిరుగుబాటు * ( the first revolutionist in the history )

4.జీసస్ - మానవసంబంధాలు * (human relations )

5.వేమన - (1650 రాయలసీమ ) భావవిప్లవం * ( socialist )

6.కారల్ మార్క్స్ - (1818 - 1883) కమ్యూనిజం (చారిత్రిక గతి తార్కిక భౌతిక వాదం)
* (historicl dilectical meterialisom}

7.ఫ్రౌయిడ్ - (1856 - 1939) మనోవిశ్లేషణ (సెక్స్ లీడ్స్ life)(psychoanalysis)

8.లెనిన్ - కమ్యూనిజం (1872 - 1924) * పెట్టుబడిదారి విధానం యొక్క అంత్యదశ సామ్రాజ్యవాదం
* (the last refuge of capitalisum is imperialisom )

9.స్టాలిన్ - కమ్యూనిజం (1879 - 1953) *రాజ్యరహిత సమాజం( stateless country concept )

10.మావొ - (1893 - 1976) *కమ్యూనిజం( సాంస్కృతిక విప్లవం ) (cultural revolution)


(సశేషం)

స్వానుభూతి లేక శాస్త్ర వాసనలచే
 సంశయంబు చెడదు సాధనకు
చిత్ర దీపమున చీకటి చెడనట్లు
విశ్వాదాభిరామ వినురవేమా
అనుభవైక్యం కాని శాస్త్రాల వల్ల ఉపయోగం లేదు చిత్రదీపం చీకటిని చ్చేధించలేనట్లు ఉదా:(సనాతనధర్మం జ్యోతిష్యం )
***
తుది విజయం 
*************
దరిద్రాన్ని అన్నదానాల
పరిపుష్టితో కొనసాగిస్తూ
కొత్త కొత్త గుళ్ళు కడుతూ
అంధకారంలోకి తోసారు!

ముక్కోటిదేవుళ్ళతోనింపి
సహస్రనామాలతో పొగిడి
దేవుడికల్యాణాలు చేసినా
జనానికి నిత్య దరిద్రమే!

ప్రజల ప్రతిఘటనా శక్తిని
నాశనం చేసేందుకే -ఈ
భక్తి రక్తి ముక్తి -పాలకుల
దైవచిద్విలాస మాయలు!

'భారతరత్న'ను కూడా
భ్రష్టు పట్టించే ఎన్నికల
ఎత్తుగడలతో -భారత
పాలకుల దమనకాండ!

సమస్యల పరిష్కారం
గుళ్ళు,దేవుళ్ళు కాదు!
మనదేవుళ్ళు అన్నదాతలు!
అంతరాత్మను అడగండి!

మాయల వైరస్ నుండి
ప్రజల్ని కాపాడదాంరండి!
పాలక కార్పొరేట్ల నుండి
అన్నదాతనురక్షిద్దాంరండి!

నిజమైనదేవుళ్ళుకష్టజీవులు 
మనకు అన్నం పెట్టే రైతులు!
అంతరాత్మను మేల్కొల్పండి
సత్యాన్ని ఆవిష్కరించండి!

అన్నదాతల ఉద్యమం తో
కార్పొరేట్లకు అంతిమఘట్టం!
నిజమైనదేవుళ్ళ విశ్వరూపం
ఢిల్లీసరిహద్దుల్లోఆవిష్కరణం

ముళ్లకంచెలు టియర్ గ్యాస్ 
కందకాలను బారికేడ్లను
ప్రతఘటిస్తూ నడుద్దాం!
కదంతొక్కుతూ ఛేదిద్దాం!

అన్నదాతలను అణగదొక్కి 
కన్నాలేసేవాళ్లకు సహకరించే
'మోళీ' గాళ్ళకు అపజయం!
రైతుమిత్రులదే తుదివిజయం!
             *********
-తమ్మినేని అక్కిరాజు
       హైదరాబాద్
        16-2-2024

జవాబులేదు!
************
త్రేతా యుగంలోనే 
పితృవాక్య పాలన
ఇది ఒక ఆదర్శం!

నేర్చుకున్నదెవరు ?
జవాబు లేదు!


అన్నదమ్ముల అనురాగం!
రామలక్ష్మణులనుండి
ఇదీ ఆ కాలమే!

నేర్చుకున్నారా?
జవాబులేదు!


ఏకపత్ని వ్రతం!
రామాయణకాలం
ఎంతచక్కని వ్రతం!

నేడు దాంపత్యమే
ఉనికి కోల్పోయింది!


వివరించలేను!
లెక్కలేని వ్రతాలు!
వాటి'పని' వాటిదే!

నేర్చుకున్నదెవరు?
జవాబులేదు!


అరిషడ్వర్గాలను 
జయించమన్నారు!
ఏనాడు చెప్పారు!

జయించినవాళ్లేరీ?
జవాబులేదు!


స్థితప్రజ్ఞత!
ఇది గీతాబోధ!
భగవాన్ ఉవాచ!

సాధించిన వాళ్ళేరీ!
జవాబులేదు!


మాతృదేవోభవ
పితృదేవోభవ
ఆచార్యదేవోభవ
అతిధిదేవోభవ

నేర్చుకున్నారా?


అబద్ధమాడకు
నీతి నిజాయితీ
సాటివాడిని ప్రేమించు
అందరూ సమానమే!

పాటించేవాళ్ళేరీ?


ఎన్నో ప్రవచనాలు!
సుమతి సూక్తులు!
వేమన్న నిజాలు!
మహానుభావులు!

బాగుపడ్డారా?


'నీతులు'అసంఖ్యాకం!
నాకూ చెప్పాలనే!
నీటి మూటలు!
నీటిపై రాతలు!

వినేదెవరు?


తెల్లారి లేస్తే
కక్కుతున్న కుళ్ళు!
అమ్మకానికి ఒళ్ళు!
దరిద్రం లో ఇళ్ళు!

మారేదెప్పుడు?
జవాబులేదు!


అన్నీ ప్రశ్నలే!
జవాబుల్లేవు!
లోపం ఎక్కడ?
రాచరికాల నుండి
ప్రజాస్వామ్యం దాకా?

జవాబులేదు!


యుగాలు గడచినా
నువ్వుచెప్పావని
వాళ్ళు నేర్చుకోరు!

ఎవరిగోల వారిది 
దేవుడు చెప్పిన వినరు!
       *********
-తమ్మినేని అక్కిరాజు
     హైదరాబాద్
     15-2-2024
 


                              

తేల్చుకో!
********
కాల ప్రవాహం లో
ఎవ్వరూనిలవరు!
అందరూపోతారు!

నీకంటే ముందు
ఎందరో మహాత్ములు
అందరూ పోయారు!

నువ్వుకూడా పోతావ్
నీ తర్వాతా పోతారు!
ఎవ్వరూ మిగలరు!

కాలప్రవాహం మాత్రం
కొనసాగుతూనే ఉంది!
అధ్యంతాలు లేని కాలం!

నువ్వేదైనా సాధిస్తే
అది చరిత్ర ఔతుంది!
చరితాత్మకమౌతుంది!

మిగిలేది మంచి-చెడు!
చరితాత్మకం!చరిత్ర హీనం!
నీ పనులే చెపుతాయి!

వివక్షలు అంతరాలు
మతంతో రాజకీయాలు!
సమాజమంతా అశాంతి!

కాలప్రవాహంలో- మతం
కొట్టుకు పోయింది!
మతంతో మనకు పనిలేదు!

మతం ఉహాజనితం
దాని కాలం ముగిసింది!
నేటికాలం వైజ్ఞానికం!

విజ్ఞానస్పృహ లేకుండా
మత మౌడ్యంతో నడిస్తే
అది చరిత్ర హీనం!

దారిద్ర్యాన్ని తగ్గించు
జీవన స్థాయిని పెంచు
అది చరితాత్మకం!

"భూమి బల్లపరపు
ఆదిశేషుడు మోస్తున్నాడు"
ఇది మతంచెప్పిన అజ్ఞానం!

"భూమి గుండ్రంగా ఉంది
తిరిగేది సూర్యునిచుట్టూ "
ఇది సైన్స్ చెప్పిన జ్ఞానం!

కాలమే వచ్చి కోర్టులో
సాక్ష్యం చెప్పగలిగితే!
మతానికి మరణ శిక్ష!

గుళ్ళు మసీదులు చర్చీలు
పనికిరాని సరకు!
సైన్స్ మేలు మనకు!

మోసం దగా కుట్ర
మతాలన్నీ బూటకం!
కాలం చెల్లిన నాటకం!

నువ్వు దేశానికే ప్రధానం!
మతం తో నడుస్తావా?
నువ్వు చరిత్ర హీనుడివి!

'అబద్ధాలు' కట్టిపెట్టు 
'నిజం'వైపు అడుగుపెట్టు!
నువ్వు చరితార్థుడివి!

అజ్ఞానపు'మతం'లో
అబద్ధాలు చెప్పి చెప్పి
మూర్ఖుడివై మిగిలిపో!

విజ్ఞానపు వెలుగులో
నిజాలనే విప్పి చెప్పి 
అర్కుడవై వెలిగిపో!

ఏమౌతావో నువ్వే
అంతరాత్మ నడుక్కో!
నీకు నువ్వే తేల్చుకో!
     *********
-తమ్మినేని అక్కిరాజు
     హైదరాబాద్
      6-2-2024

CONCEPT ( development of human relations and human resources )