బుద్ధుని బోధనలుబౌద్ధం ఎందుకు?బౌద్ధ ధర్మం ఉత్తమ మానవ జీవనానికి మార్గదర్శకమైంది. ఇది మన జీవిత లక్ష్య సాధనకూ, జీవిత పరమార్థాన్ని తెలుసుకునేందుకు కూడా ఉపకరిస్తుంది. శాంతిమయమైన, సత్యవంతమైన, దయా-కరుణలతో కూడిన జీవనాన్ని గడపడానికి బౌద్ధ తత్వశాస్త్రం బలమైన ఆధారంగా నిలుస్తుంది.బౌద్ధ తాత్విక మూలాలు1. త్రిరత్నాలు (Three Jewels)బుద్ధం శరణం గచ్చామి – బుద్ధుని ఆశ్రయించటంధమ్మం శరణం గచ్చామి – ధర్మాన్ని ఆశ్రయించటంసంగం శరణం గచ్చామి – సంఘాన్ని ఆశ్రయించటం2. ఆర్య సత్యాలు (Four Noble Truths)దుఃఖం ఉంది – జీవితం లో బాధలు సహజందుఃఖానికి కారణం తృష్ణ – కోరికల వల్లే దుఃఖంతృష్ణకు మూలం అవిద్య – అజ్ఞానం వల్ల తృష్ణ కలుగుతుందిఅవిద్యను తొలగించేది అష్టాంగ మార్గం3. పంచశీల సూత్రాలు (Five Precepts)హింస చేయకూడదు – ప్రాణులను హానిచేయరాదుదొంగతనం చేయకూడదులైంగిక అశుద్ధత లేకుండా ఉండాలిఅబద్ధం చెప్పకూడదుమత్తు పదార్థాలు తీసుకోరాదు4. అష్టాంగ మార్గం (Eightfold Path)సమ్యక్ దృష్టి – సత్యాన్ని గ్రహించడంసమ్యక్ సంకల్పం – మంచి సంకల్పాలు కలిగి ఉండటంసమ్యక్ వాక్కు – సత్యవాదనంసమ్యక్ కర్మ – ధర్మబద్ధ ప్రవర్తనసమ్యక్ ఆజీవిక – ధర్మబద్ధ జీవనోపాధిసమ్యక్ వ్యాయామం – కోరికల నియంత్రణసమ్యక్ స్మృతి – జాగ్రత్తగా జీవించటంసమ్యక్ సమాధి – ధ్యాన ఏకాగ్రత5. దశ పారమితలు (Ten Perfections)దానం – దాతృత్వంశీలం – నైతికతఖాంతి – సహనంవీర్యం – శ్రమధ్యానం – ఏకాగ్రతప్రజ్ఞా – జ్ఞానంఉపేక్ష – సమభావంసత్యం – నిజాయితీఆదిత్థానం – సంకల్ప బలముమైత్రీ, కరుణ – ప్రేమ, దయఈ తత్వాలు మానవ జీవిత పరమార్థాన్ని గ్రహించేందుకు, శాంతియుత జీవితం గడపేందుకు మార్గంగా నిలుస్తాయి.6. మధ్యమ మార్గం(Middle Way):అనుభవాల మధ్య సమతుల్యతను పాటించడం — ఇది భోగవిలాసం మరియు కఠినత మధ్య సమమార్గం.7. త్రి లక్షణాలు(Three Marks of Existence):అనిత్యత (Anicca): అన్ని వస్తువులు మార్పునకు లోబడి ఉంటాయి.దుఃఖం (Dukkha): జీవితం అసంతృప్తితో నిండి ఉంది.అనాత్మ (Anatta): శాశ్వతమైన వ్యక్తిగత ఆత్మ లేదు.