CONCEPT

CONCEPT భావన - వస్తు భావ పరంపర భావన ఈ భావన, ప్రగతికి మూలం. అజ్ఞానమే శత్రువు. జ్ఞానమనే చిరుజ్యోతిని వెలిగించి అజ్ఞాన తిమిరాన్ని పారద్రోలుదాం. ఈ చిరుప్రయత్నాన్ని మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేయడం ద్వారా ప్రోత్సహిస్తారని ఆశిస్తూ... – మీ రామమోహన్ చింతా
Showing posts with label C07.పాణిని సంస్కృత వ్యాకరణ గ్రంథం ‘’అష్టాధ్యాయి’’.. Show all posts
Showing posts with label C07.పాణిని సంస్కృత వ్యాకరణ గ్రంథం ‘’అష్టాధ్యాయి’’.. Show all posts

C07.పాణిని సంస్కృత వ్యాకరణ ‘’అష్టాధ్యాయి’’.

సంస్కృత భాష వ్యాకరణాన్ని మొట్టమొదటి సారిగా గ్రంథస్థం చేసిన వ్యక్తి పాణిని. పాణిని రచించిన సంస్కృత వ్యాకరణ గ్రంథం ‘’అష్టాధ్యాయి’’. ఇది ప్రపంచం లోనే ఆద్వితీయ వ్యాకరణంగా గుర్తింపు పొందింది. ఈయనకు పాణిన, దాక్షీ పుత్రా, శానంకి, శాలా తురీయ, ఆహిక, పాణి నేయ పణి పుత్ర అనే పేర్లు కూడా ఉన్నాయి. అష్టాధ్యాయి రాసిన వాడు అష్టనామాలతో విలసిల్లాడు. ఈయన ముఖ్యశిష్యులలో కౌత్సుడు ఉన్నాడు. శిష్యులలో పూర్వ పాణీయులని, అపరపాణీయులని రెండు రకాలున్నారు. శిష్యుల శక్తి సామర్ధ్యాలను బట్టి వ్యాకరణాన్ని పాఠ భేదాలను ప్రవేశ పెట్టి బోధించాడు. వెయ్యి శ్లోకాలతో అష్టాధ్యాయి శోభిస్తుంది. ఆయన ప్రతిభను పాశ్చాత్య యాత్రికులు చాలామంది ప్రశంసించారు. పాణినీయంలో మూడు రకాల పతక భేదాలున్నాయి. ధాతు పాఠం, గుణ పాఠం ఉపాది పాఠంలో ఇవి బాగా కనిపిస్తాయి. పాణిని వ్యాకరణానికి కూడా అష్టాధ్యాయి, అష్టకం, శబ్దాను శాసనం, వృత్తి సూత్రం, అష్టికా అని అయిదు పేర్లున్నాయి. వీటిలో అష్టాధ్యాయి పేరే ప్రసిద్ధమైంది.

పాణిని

జననం
సా.శ.పూ 4వ శతాబ్ధం
పాణిని ప్రస్తుత పాకిస్తాను లోని పంజాబు ప్రాంతం
మరణం
త్రయోదశి తిథి
వృత్తి
కవి, సంస్కృత వ్యాకరణం
జాతీయత
భారతీయుడు
సాహిత్య ప్రక్రియ
సంస్కృత వ్యాకరణ సూత్రీకరణ
ప్రసిద్ధ రచనలుs
అష్టాధ్యాయిలో శివ సూత్రాలలో ధ్వనుల పుట్టుక ఉచ్చారణ విధానం సూత్రబద్ధం చేశాడు. ధాతు పాఠంలో క్రియల మూలాల గురించి వివరించాడు .