వేంకటాచల నిలయం వైకుంట పుర వాసం
పంకజ నేత్రం పరమ పవిత్రం
శంక చక్ర ధర చిన్మయ రూపం
వేంకటాచల నిలయం వైకుంట పుర వాసం ||
అంబుజోద్భవ వినుతం అగణిత గుణ నామం
తుంబురు నారద గాన విలోలం అంబుదిశయనం ఆత్మాభిరామం
వేంకటాచల నిలయం వైకుంట పుర వాసం || 1 ||
పాహి పాండవ పక్షం కౌరవ మదహరణం
బహు పరాక్రమ పూర్ణం
అహల్యా శాప భయ నివారణం
వేంకటాచల నిలయం వైకుంఠ పుర వాసం || 2 ||
సకల వేద విచారం సర్వజీవన కరమ్ మకర
కుండల ధర మదన గోపాలం
భక్త పోషక శ్రీ పురందర విఠలం
వేంకటాచల నిలయం వైకుంట పుర వాసం || 3 ||
Purandaradas
నగు మోము గనలేని (రాగం: ఆభేరి) (తాళం : ఆది)
పల్లవి
నగు మోము గన లేని నా జాలిఁ దెలిసి
నన్ను బ్రోవగ రాద ? శ్రీ రఘువర ! నీ | | నగు మోము | |
అనుపల్లవి
నగరాజధర ! నీదు పరివారు లెల్ల =
ఒగి బోధన జేసెడువారలు గారె ? యిటు లుండుదురే ? నీ
చరణము
ఖగరాజు నీ యానతి విని వేగ చనలేడో ?
గగనాని కిలకు బహుదూరం బనినాడో ?
జగమేలెడు పరమాత్మ ! యెవరితో మొఱలిడుదు ?
వగ చూపకు తాళను న న్నేలుకోరా; త్యాగరాజనుత !
Tyagaraju Keerthana
నానాటి బతుకు (రాగం:ముఖారి ) (తాళం : )
నానాటి బతుకు నాటకము
కానక కన్నది కైవల్యము
పుట్టుటయు నిజము పోవుటయు నిజము
నట్టనడిమి పని నాటకము
యెట్ట నెదుట గల దీ ప్రపంచము
కట్ట గడపటిది కైవల్యము
కుడిచే దన్నము కోక చుట్టెడిది
నడ మంత్రపు పని నాటకము
వొడి గట్టుకొనిన వుభయ కర్మములు
గడి దాటినపుడె కైవల్యము
తెగదు పాపము తీరదు పుణ్యము
నగి నగి కాలము నాటకము
యెగువనె శ్రీ వేంకటేశ్వరుడేలిక
గగనము మీదిది కైవల్యము
Annamayya keertana