ప్రేమ సుధా మంజరి

ప్రేమ సుధా మంజరి

Classic Love అనేది సాంప్రదాయ ప్రేమ భావనలకు ప్రతీక. కట్టుబాటు, త్యాగం, శాశ్వతత్వం, హృదయపూర్వకత—ఇవన్నీ కలిసి ప్రేమను ఒక జీవనశక్తిగా మలుస్తాయి. ప్రేమ అనేది జీవిత శకటానికి అణు ఇంధనంలా పని చేసి, మనిషిని ముందుకు నడిపించే మహోన్నత శక్తి.


P1 : ప్రేమ ప్రయాణం – ఆరంభం

నగుమోము కాంచినంతనే
నీలాకాశ నక్షత్రములు మెరిసెను,
పలకరింపుకే కోయిల తన గొంతు సవరించెనే,
ప్రకృతి పరవశంతో పులకించెనే.

1975 జూలై. నా వయస్సు 14 సంవత్సరాలు. తొమ్మిదో తరగతి చదువుతున్న రోజులు. స్కూల్ అయిపోయిన తరువాత ఇంటికి నడక దారిని పట్టాను. ఆ దారిలో ఒక ఆరో తరగతి చదువుతున్న చిన్న అబ్బాయి పరిచయమయ్యాడు.

“రోజూ మా గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి ఇంటికి వెళ్తాను. కానీ ఈ రోజు రాలేదు,” అన్నాడు.

మేమిద్దరం మాట్లాడుకుంటూ మూడు కిలోమీటర్లు నడిచి, వేర్వేరు గమ్యాలకు చేరుకున్నాం. ఆ రోజు అలా గడిచిపోయింది.


P2 : దారిలో ఝాన్సీతో పరిచయం

మరుసటి రోజు, అతడే మళ్లీ ఎదురయ్యాడు. ఈసారి అతడి పక్కన ఒక అమ్మాయి.

“ఈమె ఝాన్సీ. నా క్లాస్‌మేట్,” అని పరిచయం చేశాడు.

ఝాన్సీ కొంచెం మొహమాటంగా తలదించుకుంది. నేను నవ్వుతూ “హాయ్” అన్నాను. ఆ రోజు ముగ్గురం కబుర్లు చెప్పుకుంటూ ఇంటివైపు నడిచాం.

ఆ తరువాత రోజులు మేమిద్దరమే. ఝాన్సీ – నేను. ఇంటికి వెళ్లే దారి మా నిత్య ప్రయాణంగా మారింది.


ప్రేమ కథ (ఇంకా ఉంది…)


P3 : బస్సులో (15 పైసల టికెట్)

రోజులు ఆనందభరితంగా గడుస్తున్నాయి. కలిసి స్కూల్‌కు రావడం, కలిసి ఇంటికి వెళ్లడం మాకు దినచర్యగా మారింది. మా అనుబంధం క్రమంగా బలపడింది.

ఒక రోజు స్కూల్ అయిన తరువాత, బస్సులో ఝాన్సీ – నేను కలిసి ఇంటికి వెళ్తున్నాము. ఆమె ముందే సీటులో కూర్చొని, తన పక్క సీటును చూపిస్తూ “ఇక్కడ కూర్చో” అని అంది.

నేను కూర్చునే క్షణంలో మా చేతులు స్వల్పంగా తాకాయి. ఆ క్షణం నాకు ఆనందం, సంతోషం, మనసులో ప్రశాంతత ఒకేసారి కలిగాయి.

ఆ బస్సు ప్రయాణం నా జీవితంలో మరచిపోలేని జ్ఞాపకంగా నిలిచిపోయింది. మా బంధం అమాయకత్వపు తీయని గాథగా కొనసాగింది.


P4 : బస్సు కోసం ఎదురుచూపులు

ఋతువులు మారుతున్నాయి. వసంతం పూల సుగంధాన్ని చుట్టుముట్టగా, వర్షాకాలం చిరుజలదారలతో మనసులను తడిమింది.

చలికాలం చల్లని గాలులతో కొత్త అనుభూతులను జతచేసింది. ఎండాకాలం వెచ్చని రాత్రుల నీడన ఇద్దరి అనుబంధం మరింత బలపడింది.

రాత్రి నిద్రలోకి జారుకున్న నాకు తనతో గడిపిన క్షణాలు మనసులో ఊసుల అలజడిగా మారేవి.

ఉదయం సూర్యుడు ఆకాశపు పల్లకిలోంచి పరుగెత్తుకుంటూ వచ్చి నన్ను మేల్కొలిపేవాడు. ఝాన్సీని స్కూల్‌లో కలవాలన్న కోరిక ప్రతి ఉదయం నాలో పుట్టేది.

1976 జూన్. నాన్న ఉద్యోగం కారణంగా నేను ఏలూరు వెళ్లాలని నిర్ణయం అయ్యింది. ఝాన్సీని, నేను చదివిన స్కూల్‌ని విడిచిపోవడం చాలా కష్టంగా అనిపించింది.

ఆమె తన స్నేహితులతో వచ్చి నాకు వీడ్కోలు చెప్పింది. నా ప్రయాణం ముందుకు సాగిపోయింది. 1976 – Good Bye.


P5 : కజిన్ ఇంట్లో కలయిక (1979)

మూడు సంవత్సరాల మౌన ప్రయాణం తరువాత 1979లో ఝాన్సీతో అనుకోకుండా మళ్లీ కలిసాను.

పెదనాన్న గారి మరణం కారణంగా మా కజిన్ లక్ష్మి ఇంటికి ఝాన్సీ కోరిక మేరకు కలిసి వెళ్లాము.

మూడు గంటల పాటు ఝాన్సీతో గడిపిన సమయం నాకు ఎంతో ప్రత్యేకంగా అనిపించింది. ఆ సంభాషణలు నా జీవితంలో చిరస్మరణీయ జ్ఞాపకాలయ్యాయి.

Love Proposal Episode

1979 సెప్టెంబర్ నెల. రాత్రి 9 నుంచి 12 గంటల వరకు ప్రేమ లేఖ వ్రాసి మరుసటి రోజు పోస్టు చేశాను.

రెండు రోజుల తరువాత ఝాన్సీ విముఖతతో జవాబు పంపింది. హృదయం భారమైంది.

తెల్లవారు జాము 4 గంటలకు ఆఖరి ఉత్తరం వ్రాసాను —

"మన ప్రేమ పెళ్లికి దారి తీసకపోయినా
నీ మీద నా ప్రేమ నిజం.
వచ్చే జన్మలో ఏ శక్తి విడదీయలేని
స్నేహితులుగా జన్మిద్దాం."

రెండు రోజుల తరువాత ఝాన్సీ ప్రేమను అంగీకరిస్తూ ప్రత్యుత్తరం పంపింది. నా ఆనందానికి అవధులే లేవు. ప్రేమ ఫలించింది.


P6 : కాలేజ్ రోజులు

మా విద్యాభ్యాస ప్రదేశాలు వేర్వేరు అయినా, మా ప్రేమ దూరాన్ని ఎదుర్కొని దృఢమైన అనుబంధంగా మారింది.

ఝాన్సీ ప్రతి సందేశం నాకు నూతన శక్తిని ఇచ్చింది. ఆమె కోసం రాసిన కవితలు, పాటలు నా మనసులో అమరమైన జ్ఞాపకాలయ్యాయి.


P7 : కాలేజీలో ఎదురుపడటం

ఝాన్సీ, ఆమె సోదరి అదే కాలేజీలో చదువుతుండేవారు. చాలాసార్లు ఎదురుపడ్డాం.

మౌనంగా చూస్తూ వారి ముందుగా నడిచేవాడిని. మౌనమే మా సంభాషణగా మారింది.


P8 : పెళ్లి కోసం లేఖ

ప్రేమ నుంచి బాధ్యత వైపు అడుగులు వేయాలన్న ఆలోచన ఈ దశలో మొదలైంది.


P9 : హీరో

ప్రేమలో హీరో అంటే త్యాగం, సహనం, విశ్వాసం కలిగిన మనిషి.


P10 : బాల్య స్నేహితులు – స్కూల్ జ్ఞాపకాలు

స్నేహమే ప్రేమకు మొదటి మెట్టు. ఆ అమాయక రోజులు ఈ కథకు మూలం.


P11 : చెట్టు దగ్గర ప్రతిరోజూ కలయిక

మా మౌన సంభాషణలకు సాక్షిగా నిలిచిన చెట్టు, మా ప్రేమకు నిశ్శబ్ద స్మారకంగా నిలిచింది.


ప్రేమ సుధా మంజరి – ప్రేమ కథ (ఇంకా కొనసాగుతుంది…)

CONCEPT ( development of human relations and human resources )