బౌద్ధం- బ్రాహ్మణ

కొంతమంది మేధావులు ఇలా అంటున్నారు. నిజమైన బౌద్ధం 2000 సంవత్సరాల క్రితం మాత్రమే ఉంది. సాధారణ శకం ఒకటో శతాబ్దం నుంచి మొదలైన మహాయానం, ఆ తర్వాత వచ్చిన వజ్రయానం బ్రాహ్మణలతో కలిసిపోయి కలుషితమయ్యాయి. కాబట్టి వాటిని మనం పాటించాల్సిన అవసరం లేదని. నేను సూటిగా అడుగుతున్నాను. ఈ మాటలకు చారిత్రక ఆధారాలున్నాయా? ఈ దేశంలో బౌద్ధ శిల్పాలు ఎప్పుడు మొదలయ్యాయి? సాధారణ శకం ఒకటో శతాబ్దం నుంచే. బుద్ధుడి విగ్రహాలు, బోధిసత్త్వ శిల్పాలు అన్నీ మహాయాన కాలంలోనే కనిపిస్తాయి. అంతకుముందు బుద్ధుడికి విగ్రహాలే లేవు. ఇది అభిప్రాయం కాదు. ఇది శిల్ప చరిత్ర. బౌద్ధ విశ్వవిద్యాలయాలు ఎప్పుడు నిర్మించబడ్డాయి? నలంద, విక్రమశిల, ఓదంతపురి వంటి ప్రపంచ ప్రసిద్ధ విద్యా కేంద్రాలన్నీ మహాయాన–వజ్రయాన కాలంలోనే స్థాపించబడ్డాయి. వజ్రయాన కాలంలోనే పదహారు కంటే ఎక్కువ బౌద్ధ విశ్వవిద్యాలయాలు, వందల సంఖ్యలో ఆరామాలు, బోధిసత్త్వ మందిరాలు నిర్మించబడ్డాయి. ఇవి ఊహలు కావు. శాసనాలు, పురావస్తు ఆధారాలు ఉన్న చరిత్ర. ఇప్పుడు అసలు ప్రశ్న ఇది. మీరు చెప్పినట్టుగా మహాయానం, వజ్రయానం బ్రాహ్మణలతో కలిసి కలుషితమైతే, బ్రాహ్మణ వ్యవస్థ ఎందుకు ఈన్ని బౌద్ధ విశ్వవిద్యాలయాలు కట్టిస్తుంది? బ్రాహ్మణ సిద్ధాంతం ప్రకారం విద్య సార్వత్రిక హక్కు కాదు. విద్య కొందరికే పరిమితం. ప్రజలకు స్వేచ్ఛా జ్ఞానం ప్రమాదంగా భావించబడింది. అందుకే విశ్వవిద్యాలయాల వంటి ప్రజా విద్యా సంస్థలు బ్రాహ్మణ సిద్ధాంత తత్వానికి విరుద్ధం. అలాంటి సిద్ధాంతంతో ఉన్న వ్యవస్థ ప్రపంచంలోనే అతిపెద్ద విద్యా కేంద్రాలను ఎలా నిర్మిస్తుంది? బోధిసత్త్వ మందిరాలకు రాజాశ్రయం ఎందుకు ఇస్తుంది? సూటి సమాధానం ఒక్కటే. వాటిని నిర్మించింది బ్రాహ్మణ వ్యవస్థ కాదు. బౌద్ధ రాజులు, బౌద్ధ సమాజమే. ఇప్పుడు ఇంకో కీలకమైన విషయం. బ్రాహ్మణ వ్యవస్థ ఉందని చెప్పడానికి చారిత్రక ఆధారాలు ఏ శతాబ్దం నుంచి కనిపిస్తున్నాయి? సాధారణ శకం 11వ శతాబ్దం నుంచే. 11వ శతాబ్దం నుంచి శాసనాలలో, దానపత్రాలలో, సంస్థాగత మత వ్యవస్థ రూపంలో బ్రాహ్మణ పేర్లు స్పష్టంగా దర్శనమిస్తాయి. రామానుజాచార్యులు, వ్యాసుడు అనే పేరుతో ప్రచారంలోకి వచ్చిన గ్రంథ పరంపర, నన్నయ్య, తిక్కన్న, ఎర్ర ప్రగడ, పోతన వంటి పేర్లు — ఇవన్నీ 11వ శతాబ్దం తరువాతే చరిత్రలో కనిపిస్తాయి. వ్యాసుడు అనే పేరు ఒక వ్యక్తికి కాదు. ఒక గ్రంథ పరంపరకు ఇచ్చిన పేరు మాత్రమే. ఆ పరంపర కూడా గ్రంథ ఆధారాల ప్రకారం 11వ శతాబ్దం తరువాతే స్పష్టంగా దర్శనమిస్తుంది. అంటే బ్రాహ్మణ అనే సామాజిక గుర్తింపు, బ్రాహ్మణ మత సిద్ధాంతాలు, సంస్థాగత రూపంలో చరిత్రలో కనిపిస్తున్నది 11వ శతాబ్దం తరువాత మాత్రమే. ఇప్పుడు కాలాలను స్పష్టంగా చూద్దాం. బుద్ధుడి కాలం – సాధారణ శక పూర్వం 6వ శతాబ్దం. అశోకుడి కాలం – సాధారణ శక పూర్వం 3వ శతాబ్దం. మహాయాన బౌద్ధం శిల్పాల రూపంలో స్పష్టంగా కనిపిస్తున్నది – సాధారణ శకం 1వ శతాబ్దం నుంచి. వజ్రయానం విస్తరిస్తున్నది – సాధారణ శకం 7వ శతాబ్దం నుంచి. ఈ కాలాలన్నింటిలో బ్రాహ్మణ వ్యవస్థ ఉందని చెప్పే ఒక శాసనం లేదు, ఒక శిల్ప ఆధారం లేదు, ఒక విదేశీ ప్రయాణికుడి వర్ణన లేదు. అయినా సరే, సాధారణ శకం 11వ శతాబ్దంలో కనిపిస్తున్న బ్రాహ్మణులను సాధారణ శక పూర్వం 6వ శతాబ్దానికి తీసుకెళ్లి బుద్ధుడి కాలానికి అంటగట్టడం, సాధారణ శక పూర్వం 3వ శతాబ్దానికి తీసుకెళ్లి అశోకుడి కాలానికి అంటగట్టడం, సాధారణ శకం 1వ శతాబ్దం నుంచి 8వ శతాబ్దం వరకూ ఉన్న మహాయాన–వజ్రయాన కాలాలకు అంటగట్టడం ఇది చరిత్ర కాదు. ఇది చరిత్ర వక్రీకరణ. విశిష్ట అద్వైతం అనే సిద్ధాంతం కూడా సాధారణ శకం 11వ శతాబ్దంలోనే వ్యవస్థీకృతంగా కనిపిస్తుంది. దేవుడు వేరు, జీవుడు వేరు అనే భావన బుద్ధుడి కాలానికి చెందినది కాదు, అశోకుడి కాలానికి చెందినది కాదు, మహాయాన లేదా వజ్రయాన ప్రారంభ కాలాలకు చెందినది కాదు. ఇంకో అసౌకర్యమైన నిజం. 2000 సంవత్సరాల క్రితమే నిజమైన బౌద్ధం అంటారంటే, అశోకుడి శిలాశాసనాలు, బౌద్ధ సమాధులు మాత్రమే మీవి అవుతాయి. అశోకుడు మందిరాలు నిర్మించలేదు. సమాధుల దగ్గరే శాసనాలు రాయించాడు. ఇది చరిత్రలో స్పష్టమైన విషయం. అయితే తరువాతి శతాబ్దాల్లో నిర్మించిన విశ్వవిద్యాలయాలు, ఆరామాలు, బోధిసత్త్వ మందిరాలు బౌద్ధానికి సంబంధించినవి కావని మీరు నిజంగా ఒప్పుకుంటారా? చివరిగా స్పష్టంగా చెప్తున్నాను. మహాయానం, వజ్రయానం బౌద్ధానికి చెందవని అంటే, ఈ దేశంలోని బౌద్ధ శిల్ప చరిత్రను, విద్యా చరిత్రను, సంస్థాగత బౌద్ధ వారసత్వాన్ని మీరు మీ చేతులతోనే తిరస్కరించినట్టే. కాలాలను కలపడం చరిత్ర కాదు. వ్యవస్థలను కలపడం నిజం కాదు. ఆధారాలు లేని అటాచ్మెంట్లు జ్ఞానం కాదు. చరిత్ర అంటే నమ్మకం కాదు. చరిత్ర అంటే ఆధారం. collection CONCEPT ( development of human relations and human resources )