CONCEPT

భావన

WORLD HERITAGE( Amaravati Stupa GUNTUR)

sumerian
egypt
sindhu

  • Mesopotamian civilizations formed on the banks of the Tigris and Euphrates rivers in what is today Iraq and Kuwait.
  • Some of the major Mesopotamian civilizations include the Sumerian, Assyrian, Akkadian, and Babylonian civilizations.
Sumerian-

Iraq was home to ancient Mesopotamian peoples who developed the world's first writing, agriculture and cities, between 10,000 and 3,000 BCE.

Egypt-
Sindhu-

వ్యాసావళి

కుల గణన! మత గణన! వర్గ గణన!

ABN , Publish Date - Feb 14 , 2024 | 02:19 AM

‘కుల గణన విదేశీ శక్తుల ఎజండా?’ పేరుతో (ఫిబ్రవరి 3న) వచ్చిన కె. అరవిందరావు వ్యాసానికి ప్రతిస్పందన ఇది. ఆ వ్యాసంలో, ‘సంప్రదాయ మార్క్సిజం’, ‘సాంస్కృతిక మార్క్సిజం’, ‘రథయాత్ర’,...

‘కుల గణన విదేశీ శక్తుల ఎజండా?’ పేరుతో (ఫిబ్రవరి 3న) వచ్చిన కె. అరవిందరావు వ్యాసానికి ప్రతిస్పందన ఇది. ఆ వ్యాసంలో, ‘సంప్రదాయ మార్క్సిజం’, ‘సాంస్కృతిక మార్క్సిజం’, ‘రథయాత్ర’, ‘మండల్ కమిషన్ నివేదిక’, ‘హెయిర్ కటింగ్ రంగం’, ‘హిందూ సంస్కృతి’, ‘భారతీయ సంస్కృతి’ అంటూ అనేక విషయాల గురించి అవాస్తవాలు రాశారు, వ్యాసకర్త!

(1) మార్క్సిజంలో ‘సంప్రదాయ మార్క్సిజం’ అనీ, ‘సాంస్కృతిక మార్క్సిజం’ అనీ, తేడాలేమీ ఉండవు. మార్క్సూ, ఎంగెల్సులు, తమకు పూర్వం వున్న సిద్ధాంతాలను, విమర్శనాత్మకంగా పరిశీలించి రూపొందించిన ‘శ్రామికవర్గ పోరాట సిద్ధాంతం’ ఒక్కటే వుంటుంది. దానిని, వేరు వేరు దేశాలలో ఉన్న పరిస్థితులను బట్టి అన్వయించుకోవడం మాత్రమే జరిగింది. అది తప్ప, మార్క్సిజం చెప్పిన ‘శ్రమ దోపిడీ’ అనే సత్యాన్ని మించిన సత్యాన్ని, ఇప్పటివరకూ ఎవరూ కనిపెట్టలేదు.
(2) ‘గ్రామ్షీ’ వంటి కమ్యూనిస్టు మేధావులు కనిపెట్టారని వ్యాసకర్త చెపుతున్న ‘సాంస్కృతిక పెత్తందారీతనం’ (‘కల్చరల్ హెగిమొనీ’) అనే భావన, కొత్త సత్యమేమీ కాదు. ఆ పద ప్రయోగమే కొత్త! మార్క్సూ–ఎంగెల్సులు 1845లో రాసిన ‘జర్మన్ ఐడియాలజీ’లోనూ; 1848లో రాసిన ‘కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక’లోనూ, ఆ భావన చాలా స్పష్టంగా ఉన్నదే. వాళ్ళ మాటలు చూడండి: ‘‘ప్రతీయుగంలోనూ, పాలించే భావాలు, ఆ నాటి పాలకవర్గ భావాలే’’– (కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక, పేజీ–66). ‘‘భౌతిక ఉత్పత్తి సాధనాలను తన అదుపులో కలిగివున్న వర్గమే, దాని ఫలితంగా బౌద్ధిక ఉత్పత్తి సాధనాలను కూడా కంట్రోల్ చేస్తుంది. బౌద్ధిక ఉత్పత్తి సాధనాలను కలిగివుండని వారి భావాలు, మొత్తం మీద, కంట్రోలు చేసే వర్గానికి లోబడివుంటాయి... పాలకవర్గ భావాలు అనేవి, ప్రబలంగా వున్న భౌతిక సంబంధాలకు ఖచ్చితమైన వ్యక్తీకరణ తప్ప ఇంకేమీ కాదు.’’ (జర్మన్ ఐడియాలజీ, పేజీ–67) మార్క్సూ, ఎంగెల్సులు చెప్పిన భావాన్నే, గ్రామ్షీ గానీ, ఇంకో కమ్యూనిస్టు గానీ చెప్పగలిగారు గానీ, వర్గాతీతమైన భావాన్నయితే చెప్పలేదు! కాబట్టి, ‘సంప్రదాయ మార్క్సిజం’ అనీ, ‘సాంస్కృతిక మార్క్సిజం’ అని వేరే వేరే పేర్లు పెట్టినంత మాత్రాన, మార్క్సిజపు సారాంశం మారదు.
(3) ‘‘అనేక దేశాల్లో ఆర్థిక అసమానతలున్నా, వర్గ పోరాటాలు జరగలేదు.’’– అని వ్యాసకర్త వ్యాఖ్య! అవి జరగలేదంటే, అది మార్క్సిజంలో లోపం కాదు. వర్గ పోరాటాలు అనేవి, పగలూ–రాత్రీ లా, అమావాస్యా– పౌర్ణమీలా, ప్రకృతి సహజంగా జరగవు! వర్గ పోరాటాల కోసం, శ్రామికవర్గ పార్టీలైన కమ్యూనిస్టు పార్టీలకు, మార్క్సిస్టు సిద్ధాంత గ్య్నానంతో, నడిచే సామర్ధ్యాలు బలహీనపడి ఉండవచ్చు! అలా జరగలేదు కాబట్టి, ‘సాంస్కృతిక మార్క్సిజం’ అనే భావన వచ్చిందనడం తప్పు! వర్గ పోరాటాలలోకి శ్రామిక జనాల్ని సమీకరించడానికి, కావలిసిన వర్గ చైతన్యం ప్రాధాన్యతను నొక్కి చెప్పే సందర్భంలో, గ్రామ్షీ ‘సాంస్కృతిక పెత్తనం’ అనే మాటని వాడాడు. సంస్కృతి అంటే భావజాలం. శ్రామిక జనాల మీద పాలక వర్గ సంస్కృతి పెత్తనాన్ని ఎదుర్కోవడానికి శ్రామిక వర్గ మేధావులు కృషి చెయ్యాలని చెప్పిన సందర్భం అది! ఈ భావన, మార్క్సూ ఎంగెల్సులు చెప్పని భావన కాదు. ఉదాహరణకి, సమాజానికి ఒక పునాదీ (ఆర్థిక సంబంధాలు), ఆ పునాదికి అనుగుణమైన, ఉపరితలం (సంస్కృతీ, రాజకీయాలూ, మతం మొదలైనవి) ఉంటాయని మార్క్సూ, ఎంగెల్సులు గతంలోనే చెప్పివున్నారు.
(4) ‘‘హిందూ మతం, కులాన్ని నిర్మించిందన్నది అసత్య ప్రచారం’’ అని వ్యాసకర్త వాదన. హిందూ మత గ్రంథాలలో నాలుగు వర్ణాల గురించే రాశారట గానీ, కులాల గురించి చెప్పలేదట! ఏ మతాల్లోనూ లేని ఆ వర్ణ వ్యవస్త హిందూ సమాజంలో మాత్రమే ఉందంటే, అది హిందూ మతానికి వున్న ప్రత్యేక లక్షణమే! వర్ణ వ్యవస్త మానవుల్ని ఎలా విభజించిందో చూడండి! బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేవే ఆ నాలుగు వర్ణాలూ. ఇవన్నీ అసమాన వర్ణాలే! వాటిల్లోని అసమానత్వమే, అనేక వేల కులాలు ఏర్పడడానికి దారి తీసింది. అసలు గ్రహించవలిసింది: వర్ణ వ్యవస్తలో గానీ, కుల వ్యవస్తలో గానీ వున్నదంతా, అసమాన శ్రమ విభజనే! అసమాన శ్రమ విభజన అంటే, మానవుల్లో కొందరు ఎక్కువ విలువ గలిగిన మేధా శ్రమలూ; కొందరు తక్కువ విలువ గలిగిన శారీరక శ్రమలూ; కొందరు ఎప్పుడూ మురికిని శుభ్రం చేసే శ్రమలు చేయవలిసి రావడం, కొందరు ఆ రకం పనులు ఎప్పుడూ చెయ్యకపోవడం... ఇలాంటి పరిస్తితే అసమాన శ్రమ విభజన! అయితే, ఈ అసమాన శ్రమ విభజన అనేది, ప్రపంచ వ్యాప్తంగా, అన్ని మతాలలోనూ వున్నప్పటికీ, హిందూ మతం మాత్రమే వర్ణ వ్యవస్తని ఎందుకు కౌగలించుకుందో ఊహించుకోవలిసిందే! ఇప్పుడు మనం చెయ్యవలిసిందల్లా, కుల సంస్కృతిని చీదరించుకోవడమే! దాన్ని నిర్మూలించడమే!
(5) ‘ఈనాడు చాలా మంది కుల వృత్తులలో లేరనడానికి ఉదాహరణగా, క్షవరం చేసే వృత్తిలో ముస్లిములే చాలామంది వున్నారని వ్యాసకర్త వాదన. అంటే, హిందువుల్లో, కులవృత్తుల్లో వున్నవారు తగ్గిపోయారని, తేల్చే ప్రయత్నం! జనాభా లెక్కల్ని ఆధారం చేసుకుని, ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ పత్రిక, 2018 డిసెంబరు 22న ఇచ్చిన వివరాల ప్రకారం, కులం అనేది ఇప్పటికీ, వృత్తుల్ని ఎంచుకోవడంలో, ప్రధానమైన అడ్డంకిగా వుంది–అని! ఉత్తరప్రదేశ్‌లో జనాభా లెక్కల ప్రకారం: తోలు పరిశ్రమల్లో (లెదర్ ఇండస్ట్రీస్) పనిచేసే 46 వేల మందిలో, 41 వేల మంది, ఎస్సీ కులస్తులే! అదే సమయంలో, రాజస్తాన్‌లో 76 వేల మంది స్వీపర్లుగా వుంటే, వారిలో 52 వేల మంది ఎస్సీలే!
(6) ‘అద్వానీ రథయాత్ర సమయంలో, వి.పి.సింగు ప్రభుత్వం మండల్ కమిటీ నివేదికను అమలు చేసిందని’ వ్యాసకర్త చేసిన వ్యాఖ్య వాస్తవ విరుద్ధం. ఆ నివేదికను వి.పి.సింగు పార్లమెంటులో ప్రవేశపెట్టినది, రథయాత్రకు పూర్వమే. 1990 ఆగస్టు 7న. రథయాత్ర ప్రకటన వచ్చింది ఒక నెల తర్వాత, సెప్టెంబరు 12న. ఎయిర్ కండిషనర్లు బిగించిన టొయాటో వ్యానుతో ‘రథయాత్ర’ మొదలైనది, సెప్టెంబరు 25న.
(7) కుల గణన వల్ల భారతీయ సంస్కృతీ మూలాలు నశించే అవకాశం వుంది–అని వ్యాసకర్త వాపోయారు. కుల వ్యవస్తను సృష్టించినదే హిందూ సంస్కృతి కాబట్టి, కుల గణన వలన భారతీయ సమాజానికి ఏమీ నష్టం జరగదు. ఎందుకంటే, కుల గణన కోరే వారి ఉద్దేశం, కులాల జనాభాని బట్టి ఆర్ధిక, రాజకీయ అవకాశాలు పొందాలి–అన్నదే! అందుచేత, కులాల నాయకులు ఇప్పుడున్న దోపిడీ రాజ్యాంగ యంత్రంలోనే, అధికారులుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా, పదవులకోసం ప్రయత్నిస్తారు. ఆ ప్రయోజనం కోసం, ఎల్లకాలమూ కులాలు నిలిచివుండేలా చూసుకుంటారు. నష్టం అంటూ జరిగితే, కులాల వారీగా కాకుండా, మతాల వారీగా, అది కూడా, మెజారిటీ మతస్తుల ఓట్లకోసం ప్రయత్నించే మతతత్వ రాజకీయ పార్టీలకి తలనొప్పే. మతతత్వవాద పార్టీలకు కావలిసింది ‘మత గణన’.
(8) ఈ కులగణనను మార్క్సిస్టులే వెనక వుండి రాజకీయ పార్టీల చేత చేయిస్తున్నారు – అని, వ్యాసం చివరిలో, వ్యాసకర్త అనుమానం! అది పూర్తిగా తప్పు. ఎందుకంటే, ‘శ్రమ దోపిడీ’ని శ్రామిక వర్గ పోరాటాల ద్వారా నిర్మూలిస్తూ, అసమాన శ్రమ విభజనను మార్చడం ద్వారా కుల వ్యవస్తను కూల్చే లక్ష్యం గల కమ్యూనిస్టులు, కుల గణన మీద భ్రమలు పెట్టుకోరు! ‘వర్గ గణన’ మీద ఆధారపడి, వారు తమ కార్యక్రమాలు నిర్వహించుకుంటారు. అలాగే, ‘‘మనమంతా హిందువులం! మనమంతా బంధువులం!’’ అనే నినాదంతో, కుల గణనను వ్యతిరేకించే పార్టీలను నమ్మవద్దని కూడా శ్రామిక జనాలకు కమ్యూనిస్టులు వివరిస్తారు.
(9) ఆరెస్సెస్ వాళ్ళూ, బీజేపీ వాళ్ళూ తరుచుగా జపించే ‘భారతీయ సంస్కృతి’, ‘జాతీయ భావన’ అనే మాటలు, ఈ వ్యాసంలో కూడా కనిపించాయి. వాస్తవంలో, హిందూ మతస్తులందరూ, భారతీయ సమాజం అంతా, ఒకే రాయితో చేసిన శిల్పం కాదు. ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ, అన్ని సమాజాల్లోనూ, అన్ని మతాల్లోనూ వున్నట్టే, ఇక్కడా ధనిక–పేద తేడాలూ, స్త్రీ–పురుష అసమానత్వమూ, మూఢ నమ్మకాలూ, ఇలా అన్ని చెడుగులూ వున్నాయి. కుల వ్యవస్త అనేది, ఇక్కడ అదనంగా వున్న చెడ్డ లక్షణం! అన్ని దేశాలలోనూ వున్నట్టే, ఈ దేశంలోనూ, లాభాలూ, వడ్డీలూ, కౌళ్ళూ అనే ‘శ్రమ దోపిడీ’ ఆదాయాల మీద బ్రతికే సంస్కృతే, దోపిడీ వర్గానికి మూలం! ఏదో ఒక రకమైన శ్రమ చేస్తూ, జీతాల మీద బ్రతికే పేదల సంస్కృతీ వుంది. అలాంటప్పుడు భారతీయ సంస్కృతి, ఇతర దేశాల సంస్కృతి నించీ వేరుగా వుండదు.
(10) ‘‘కులగణన వల్ల ఎవరికి లాభం?’’ అని ప్రశ్నించిన వ్యాసకర్తకి, మత గణన వల్ల ఎవరికి లాభం? అని కూడా ప్రశ్నించాలని తోచలేదు. 2022లో, ఉత్తరప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో, బీజేపీ రాజ‘యోగి’ (ముఖ్యమంత్రి), ‘ఈ ఎన్నికలు 80 శాతానికీ, 20 శాతానికీ మధ్య పోరాటం!’ అనడం, ‘మత గణన’ దృష్టితో కాదా? ఇలాంటి ప్రకటనలు, దేశ ప్రజల్ని కలిపి వుంచుతాయా, విభజిస్తాయా?
రంగనాయకమ్మ

ఇంగ్లీష్ పద్య మరియు గద్య రచన (ENGLISH POEMS AND PROSE)

1.Leo Tolstoy 


Preview
2.Leo Tolstoy, Tolstoy also spelled Tolstoi, Russian in full Lev Nikolayevich, Count (Graf) Tolstoy (born Aug. 28 [Sept. 9, New Style], 1828, Yasnaya Polyana, Tula province, Russian Empire—died Nov. 7 [Nov. 20], 1910, Astapovo, Ryazan province), Russian author, a master of realistic fiction and one of the world’s greatest novelists.

స్త్రీ - భావన

చలం
 
స్త్రీ - చలం  చేసినంత ఆలోచన ఇంకా ఎవరు చేయలేదు.( స్త్రీ - స్వేచ్చా - బాధ్యత, చలం దృష్టి లో  విడదీయరాని అంశాలు )   

*మీరు చలాన్ని విమర్శించిన దానికన్నా ఎక్కువగా చలం తనని తాను విమర్శించుకున్నాడు.

సాహిత్యం - చర్చ


సాహిత్యం - చర్చ
మహాభారతంలో లేనిదేదీ లేదని అంటారు.
ధర్మేచా ర్ధేచ కామేచ మోక్షేచ భరతర్షభ
యదితిహాస్తి తదన్యత్ర యాన్నేహాస్తి నతత్క్వచిత్.
తిక్కన గారుఈ శ్లోకాన్న్ని తెలుగులో చక్కని తేటగీతంగా చెప్పారు.
“అమల ధర్మార్థ కామ మోక్షముల గురిచి,
యొలయు తెరువెద్దియును నిందు గలుగునదియు,
యొండెడల గల్గు దీనలేకుండ చొప్పు,
దక్కొకంటను లేదు వేదజ్ఞులార,”

ది బైబిల్ (THE BIBLE)


బైబిల్ క్రైస్తవ మతం యొక్క పవిత్ర గ్రంథం. క్రైస్తవులు
 ఇందులో దేవుని పలుకులు ఉన్నాయని భావిస్తారు. బైబిలుకు అనేక పేర్లు ఉన్నాయి. కొందరు పవిత్ర గ్రంథమని, పవిత్ర నిబంధనమని లేదా పరిశుద్ధ గ్రంథమని పిలుస్తారు. బైబిలు మొదట హీబ్రూ, ఆరామిక్ మరియు గ్రీకు భాషలలో రాయబడింది. ఆ తరువాత లాటిన్ ఇంకా తదితర భాషలలోకి అనువదించబడింది. ఇప్పుడు బైబిల్ 2000 కు పైగా భాషలలోకి అనువదించబడింది.


బైబిలు అనే పదం గ్రీకు భాషలోని బిబ్లియోన్ అనే పదానికి బహువచన రూపమైన "బిబ్లియ" నుండి వచ్చింది. బబిల్లో రెండు భాగాలున్నాయి. పాత నిబంధన లో 39,కొత్త నిబంధన లో 27 కలిపి మొత్తం బైబిల్లో 66 పుస్తకాలున్నాయి. బై బిలు వ్రాయడానికి 1400 సంవత్సరాలు పట్టినది. సుమారు క్రీస్తు పూర్వం 1800 సంవత్సరం లో, అనగ వేద కాలం ఆరంభంలో బైబిలు రచించుట మొదలైనది. నలబై మంది ప్రవక్తలు, వివిధ కాలాల్లో ఈ మహా గ్రంధాన్ని రచించారు.


1 పాత నిబంధన
2 కొత్త నిబంధన
3 కేథలిక్కు బైబిల్
4 తెలుగులో బైబిలు

పాత నిబంధన
బైబిల్లోని మొదటి భాగాన్ని పాత నిబంధన గ్రంథం అని అంటారు.ఇందులో ఇశ్రాయేలీయుల యూదుల కథలు ఆజ్ఞలు సామెతలు కీర్తనలు మరియు దేవుడు వాళ్లను ఎలా ఎంచుకున్నాడో తెలిపే చరిత్ర ఉంటాయి.ఇవన్నీ హెబ్రూ లో రాశారు. 39 పుస్తకాలు ఇవి:
ఆది కాండము
నిర్గమ కాండము
లేవియ కాండము
సంఖ్యా కాండము
ద్వితీయోపదేశ కాండము
యెహూషువ
న్యాయాధిపతులు
రూతు
దానియేలు
కొత్త నిబంధన
రెండవ భాగాన్ని కొత్త నిబంధన గ్రంథం అంటారు. గ్రీకులో యేసుక్రీస్తు జీవితచరిత్రనే నాలుగు సువార్తలుగా నలుగురు రాశారు. అపోస్తలుడైన పౌలు వివిధ సంఘాలకు రాసిన ఉత్తరాలు కూడా ఉన్నాయి.27 పుస్తకాలు ఇవి:
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపోస్తలుల కార్యములు
రోమీయులకు పత్రిక
I కొరంథీలకు పత్రిక
II కొరంథీయులకు పత్రిక
గలతీయులకు పత్రిక
ఎఫసీయులకు పత్రిక
ఫిలిప్పీయులకు పత్రిక
కొలొస్సైయులకు పత్రిక
I థెస్సలొనీకైయులకు పత్రిక
II థెస్సలొనీకైయులకు పత్రిక
I తెమొతికి పత్రిక
II తెమొతికి పత్రిక
తీతుకు పత్రిక
ఫిలేమోనుకు పత్రిక
హెబ్రీయులకు పత్రిక
యాకోబు పత్రిక
I పేతురు పత్రిక
II పేతురు పత్రిక
I యోహాను పత్రిక
II యోహాను పత్రిక
III యోహాను పత్రిక
యూదా పత్రిక
ప్రకటన గ్రంధము
కేథలిక్కు బైబిల్
ఇందు లో అదనంగా ఉన్నగ్రంధాలు: 14 వీటిని దైవావేశితంకావనే కారణం చెబుతూ ప్రొటెస్టంటులు అంగీకరించరు.
మొదటి ఎస్డ్రాసు
రెండవ ఎస్డ్రాసు
తోబితు
యూదితు
ఎస్తేరు
సొలోమోను జ్ఞానగ్రంథము
సిరాకు పుత్రుడైన యేసు జ్ఞానం
బారూకు
ముగ్గురు పరిశుద్ధ పిల్లల పాటలు
సూసన్న చరిత్ర
బేలు, డ్రాగనుల చరిత్ర
మనస్సేప్రార్ధన
మొదటి మక్కబీయులు
రెండవ మక్కబీయులు
తెలుగులో బైబిలు
సామాన్య ప్రార్ధనల పుస్తకము - 1880లో ముద్రిచబడినది. 

గుర్రం జాషువా (1895-1971) కవి

గుర్రం జాషువా (1895-1971) కవి









కుల మత విద్వేషంబుల్ తలసూపని తావులే కళారాజ్యంబుల్ 
కళ లాయుష్మంతములై యలరారెడు నెలవు స్వర్గమగు చెలికాడా!
చక్కని కవితకు కులమే యెక్కువ తక్కువలు నిర్ణయించినచో నిం
కెక్కడి ధర్మము తల్లీ? దిక్కుం జరవేదికా ప్రతిష్టిత గాత్రీ -
నా కవితావధూటి వదనంబు నెగాదిగ జూచి రూ
రే ఖా కమనీ వైఖరులు గాంచి 'భళిభళి'! యన్నవాడె మీ
దే కులమన్న ప్రశ్న వెలయించి చివాలున లేచిపోవుచో
బాకున గ్రుమ్మినట్లగును పార్థివచంద్ర! వచింప సిగ్గగున్


Dచారిత్రిక గతిని నిర్దేశించిన తాత్వికులు (philosophers who dictates the historical dialectical world ) 10

          సమాజం వసుదైకకుటుంబం నమూన. తాత్వికులు సమాజం తో మమేకమై వారి కాలచక్రపరిధిని దాటి ఆలోచించారు .  సమాజాన

నూతనమార్గాన్ని నిర్దేశించారు .
Chinta Ramamohan
"There are no facts, only interpretations."- Friedrich Nietzsche (1844-1900)

అజ్ఞానపు టంధయుగంలొ ఆకలిలొ,ఆవేశంలో తెలియని ఏ తీవ్రశక్తులో నడిపిస్తే నడిచి మనుష్యులు అంతా తమప్రయోజకత్వం తామేభువికధినాధులమని స్థాపించిన సామ్రాజ్యాలునిర్మించిన క్రుత్రిమ చట్టాలు ఇతరేతర శక్తులు లేస్తే పడిపోయెను పెకమేడలై పరస్పరం సంఘర్షించినశక్తులతో చరిత్ర పుట్టెను.
***
నేను సైతం ప్రపంచానికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను
నేను సైతం విశ్వ వ్రుష్టికి అశృఉవొక్కటి ధారవోసాను
నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక పిచ్చి మొసానూ

***
1.బుద్డుడు - (563 - 483 BC) భౌతికవాదం * (meterilisiom)

2.సోక్రటీస్ - నిన్నునీవు తెలుసుకో (469 - 399) BC* (method of arriving at truth )

3.స్పొర్టకస్ - (71 BC) తిరుగుబాటు  * ( the first revolutionist in the history )

4.జీసస్ - మానవసంబంధాలు * (human relations )

5.వేమన - (1650  రాయలసీమ ) భావవిప్లవం * ( socialist )

6.కారల్ మార్క్స్ - (1818 - 1883) కమ్యూనిజం (చారిత్రిక గతి తార్కిక భౌతిక వాదం)
* (historicl dilectical meterialisom}

7.ఫ్రౌయిడ్ - (1856 - 1939) మనోవిశ్లేషణ (psychoanalysis)

8.లెనిన్ - కమ్యూనిజం (1872 - 1924) * పెట్టుబడిదారి విధానం యొక్క అంత్యదశ సామ్రాజ్యవాదం
* (the last refuge of capitalisum is imperialisom )

9.స్టాలిన్ - కమ్యూనిజం (1879 - 1953) *రాజ్యరహిత సమాజం( stateless country concept )

10.మావొ - (1893 - 1976) *కమ్యూనిజం( సాంస్కృతిక విప్లవం ) (cultural revolution)



నాకవితలు


నాకవితలు by Ch.RamaMohan,BA.,

మొక్కను యెంచి పెంచ మహిని
మానౌను మంచి చేయు బహుగా
ప్రకృతి మెచ్చు ప్రాణవాయువు నిచ్చు
విన్న వించ మంచి  విపుల బాల

[04/04, 12:56] Ch RAMAMOHAN:

చదువుల బడి అమ్మఒడి
గురువు మీద గురి
బ్రతుకు పడవను చేర్చు దరి
విన్న వించ మంచి విపుల బాల
***

సమత పంచలేని వాడు

మమత పంచలేడు

మమత పంచలేనివాడు

మహిని లేడు ఉన్నా లేనివాడే

విన్న వించ మంచి విపుల బాల

***

ఓటు

వేస్తారు ఇస్తే నోటు

చేస్తుంది దేశానికి ఎంతో చేటు

ప్రజాస్వామ్యానికి ఇది కాటు

***
గ్రామాలు
 గిట్టుబాటు ధరల్లేని సేద్యాలు
 ప్రకృతి వైపరీత్యాలు
 పండని పంటలు
 నిండని కడుపులు
 పట్టని ప్రభుత్వాలు
 మేలుకొనేదెప్పుడో గ్రామాలు
***
నిన్నటి జీవితం మరపు,
రేపటి జీవితం తలపు,
నేటి జీవితం మలుపు 
బుద్ధం శరణం గచ్చామి
-చింతా 

**నా కవిత**

బుద్దుడు
ప్రతీత్య సమోత్పదం మని
సకలం
 పరిత్యజించిన

సోక్రటిస్
సత్య శోధన కై
హలం గ్రహించిన

స్పోర్టకస్ తిరుగుబాటుతో 
చరిత్రకు
పాఠాలు నేర్పిన

జీసస్
వీరు ఎమి చేయుచున్నారో
వీరు ఎరుగరని
సిలువను
రక్తసిక్తం చేసిన

వేమన
భావ విప్లవానికే 
భాష్యం చెప్పిన

ఫ్రాయిడ్ 
మానసిక ఋగ్మతలను
 పటాపంచలు చేసిన

మార్క్స్ చరిత్ర గతిని
నిర్దేశించిన

లెనిన్
పెట్టుబడిదారుల
గుట్టు విప్పిన (సామ్రాజ్యవాదం)

స్టాలిన్
Stateless country
అని ఉటంకించిన

మావో
సాంస్కృతిక
విప్లవావసరాన్ని తెలిపిన

అంబేద్కర్ భరత దేశ
జాతిని నీతిని నిలిపిన

వారు తాత్వికులు
చరిత్రగతిని నిర్దేశించారు
సమాజం వసుదైక
కుటుంబం యొక్క నమూనా
వారు సమాజంతో మమేకమై
కాలాచక్ర పరిధిని దాటి
ఆలోచించారు
సమాజానికి
నూతనమార్గాన్ని నిర్దేశించారు

శ్రీ శ్రీ

మహాకవి మరణించలేదు - నాహృదిలో ఉదయించినాడు

కూలివాని గుండెలొ ఆవేదన ఉందని

కార్మికుని కడుపులో ఆకలి రగిలందని

కలంపట్టి వ్రాసిన మాకవి మహాకవి శ్రీ శ్రీ

మహాకవి మరణించలేదు - నాహృదిలో ఉదయించినాడు

దోపిడిదారుల దురంతాలు సాగవని

పీడకుల పాలన మాకిక వద్దని

గళం ఎత్తిపాడిన మాకవి మహాకవి శ్రీ శ్రీ

మహాకవి మరణించలేదు - నాహృదిలో ఉదయించినాడు

దగాపడ్డ తమ్ములార ఏకంకండని

మోసపోక యికనైనా మేలుకొండని

మాకు పిలుపునిచ్చిన మాకవి మహాకవి శ్రీ శ్రీ

మహాకవి మరణించలేదు - నాహృదిలో ఉదయించినాడు
***

తెలుగు వెలుగు 
సౌరభ సుమమాల
కోమల విరిబాల
సోభిల్లు తెలుగు
 సుమధుర రసాల
చల్లని వెన్నెల 
నా భావనమ్మ

సంస్కృతము లేక తెలుగు లేదు
పారసికము పట్టు వదల లేదు
ఆంగ్లము వల్ల తెనుగు మనలేదు
నా భావనమ్మ

తెలుగేది
వెలుగేది
తెలుగుజాతికి దారేది

చేతిలో కప్పు cup
ఇంటిపైకప్పు
తెలుగేదొ చెప్పు

తెలుగు జల్లెడ జర 
చందమామ చర 
రంపము బండి ర 
లేదు నా భావనమ్మ

తాత్విక చింతన

ఇట నస్ప్ర్సశ్యత సంచరించుటకు తావే లేదు;విశ్వంభరా నటనంబున్ గబళించి గర్భమున విన్యస్తంబు గావించి యుత్కటపుం బెబ్బులి తోడ మేకనోకప్రక్కన్ జేర్చి జోకొట్టి యూఱట గల్పించు నభేదభావమును ధర్మంబిందు గారాడెడిన్- జాషువ