CONCEPT ( development of human relations and human resources )
వస్తు భావ పరంపర భావన . ఈ భావన, ప్రగతికి మూలం . అజ్ఞానమే శత్రువు. జ్ఞానమనే చిరు జ్యోతిని వెలిగించి అజ్ఞాన తిమిరాన్ని పారద్రోలుదాం . ఈచిరుప్రయత్నాన్ని మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేయడం ద్వారా ప్రోత్సహిస్తారని ఆశిస్తూ మీ రామమోహన్ చింతా (development of human relations and human resources)
Sunday, September 9
Subscribe to:
Posts (Atom)
ఆయన వెనకటి రచనల ప్రస్తావన చెసినప్పుడు చలం మళ్ళీ ఆ రచనలనే చేయవలసి వస్తే అంతకన్నా మరింత ఘాటుగా ఎలా రాయాలా అని ఆలోచిస్తానని అన్నాడు! అలాంటి వారితో కలిసి జీవించడం ఆయన భార్యకి అంత సులువైన విషయమేమీ కాదు, నిజమే. అయినా, ఆవిడ మీరు ఆశించినట్టు గా ఎందుకని “విముక్తి” అనుకుంటూ ఇల్లు వదిలి బయటికి వెళ్ళిపోలేదో! మీరు చూడని అంశమేదో ఆమె తన భర్తలో బహుశా చూడగలిగిందేమో మరి! లేకపోతే రంగనాయకమ్మ గారు అన్నేళ్ళు చలంతో సహజీవనం చేయగలిగేది కాదు కదా?
rama bharadwaj వారి సౌజన్యంతో
కురిసిన వెన్నెలలా, అరవిరిసిన మల్లియలా
మెరపుల గుంపేమో అది కరగని వెలుగేమో
కన్నుల తళుకేమో అది పున్నెపు ప్రోవేమో
పరమ ప్రేమకు చిహ్నమైన తెలి వెన్నెల కాంతుల సన్నపు తళుకేమో
- విశ్వసుందరమ్మ, స్నేహరుచి
కనలేదు ఆ జంట, వినలేదు ఆ జాడ
గుండె గుబగుబ లాడెను
నా గొంతు
ఎండి గుటకడదాయెను
అలసిపోయిన గుండె అట్టె ముడిపోవ
ఆకాశమున కెగిరితి
అక్కడా
అంధకారమె చూసితి
అంధకారములోన అట్టె రెక్కలు ముడిచి
అవనిపై బడితిని
అక్కడా
అంధకారమె గంటిని
- బంగారమ్మ, తమస్సు
సుఖము, శాంతి దొరకునొ యని
మునిగితి మెన్నో నదులను
మోక్షము చేపట్టుద మని
ఎక్కితి మెన్నో కొండల
నీశ్వరు దర్శింతా మని
మ్రొక్కితి మెన్నో వేల్పుల
కొక్క పండు వర మిమ్మని
నోచితి మెన్నో నోములు
కాచి బ్రోచు నని పార్వతి
కడకు దేవి దయచేతను
కంటిమి రత్నములు రెండు
బతుకు కలంకారముగా
వాని దాచ చేతగాక
ఎచటనొ పోగొట్టుకొంటి
మెంతటి దురదృష్టముననొ
- సౌదామిని, దురదృష్టము
ఇద్దరి రక్తమూ ఎర్రగానే వుంది
ఇద్దరి రక్తమూ వేడిగానే వుంది
ఇద్దరి రక్తమూ ఉప్పగానే వుంది
అంతే
ఆ తర్వాతెప్పుడూ అనుకరించలేదు నా పూజ్య పూర్వీకుల్ని
ఆలోచించేవాణ్ణి శాస్త్రీయంగా నా మేధస్సుతో నేను
ఆచరించేవాణ్ణి ఏది సమంజసమనిపిస్తే దాన్ని
అనుసరించేవాణ్ణి ఏది యోగ్యమనిపిస్తే దాన్ని
- పెళ్ళకూరు జయప్రద, నేస్తం ఆలోచించు
కొబ్బరాకుల నిలువు పాపిట మీద
మంచు బొట్టొకటి మిసమిసా నాకేసి చూస్తోంది
ఎదలోపల ఎక్కడో ఖరీదైన జ్ఞాపకం కాలుతోంది
గుండెలోపల పండిన మొగలిరేకు గుచ్చుకొన్నట్లు
చివ్వుమన్న బాధ రివ్వుమన్న సువాసన
…
- కొండేపూడి నిర్మల, నిద్రపట్టని రాత్రి
అందచందాలున్నాయి
గుణగణాలున్నాయి
తెలివితేటలున్నాయి
అవన్నీ పురుషుడికి
తల్లిగా
ప్రేయసిగా
స్త్రీ ఇస్తుంది
అన్ని ఇచ్చి
చివరికి
మగాడి చేతిలో
ఆటబొమ్మవుతుంది
- రేవతీదేవి, స్త్రీ
పెళ్లి చేస్తానని
పంతులుగారన్నప్పుడే భయం వేసింది
ఆఫీసులో నా మొగుడున్నాడు
అవసరమున్నా సెలవివ్వడని
అన్నయ్య అన్నప్పుడే
అనుమానం వేసింది
వాడికేం మహారాజని
ఆడా మగా వాగినప్పుడే
అర్థమయిపోయింది
పెళ్లంటే పెద్ద శిక్షని
మొగుడంటే స్వేచ్ఛభక్షకుడని
మేం పాలిచ్చి పెంచిన జనంలో సగమే
మమ్మల్ని విభజించి పాలిస్తోందని
- సావిత్రి, ఒక ఆడపిల్ల స్వగతం
ఆడదిగా పుట్టనని అడవిలో మానైనా కాలేదని
విలపించే రోజులు
పోతున్నాయిలే తల్లీ
ఎందుకంటే
నీవు అమ్మ పొట్టలోంచి
బైటికే రావుగా
- ఈశ్వరి
ఆ రంగుటద్దాలు తీసేసి
నా కళ్లు పెట్టుకొని
నీలోకి చూసుకో
తెలుస్తుంది -
నీలో సగం నేనేనని
- ఇందిర కొల్లి, నీవు నేను