నాగరిక జాతి మాతృభాషలోనే మాట్లాడుతుంది
ఆంగ్ల కవి-W.B.YEATS
తెలుగు సాహిత్యం కాలరేఖ
------------------------
నన్నయకు ముందు-క్రీ.శ. 1000 వరకు
నన్నయ యుగము-1000 - 1100
శివకవి యుగము-1100 - 1225
తిక్కన యుగము-1225 - 1320
ఎఱ్ఱన యుగము-1320 – 1400
శ్రీనాధ యుగము-1400 - 1500
రాయల యుగము-1500 - 1600
దక్షిణాంధ్ర యుగము-1600 - 1775
క్షీణ యుగము-1775 - 1875
ఆధునిక యుగము-1875 – 2000
21వ శతాబ్దితెలుగు సాహిత్యం కాలరేఖ
🌹🌻🌹
తెలుగు లిపి ఇతర భారతీయ భాష లిపుల లాగే ప్రాచీన దక్షిణ బ్రాహ్మీ లిపినుండి ఉద్భవించింది.[1] అశోకుని కాలంలో మౌర్య సామ్రాజ్యానికి సామంతులుగా ఉన్న శాతవాహనులు బ్రాహ్మీ లిపిని దక్షిణ భారతదేశానికి తీసుకొని వచ్చారు. అందుచేత అన్ని దక్షిణ భారత భాషలు మూల ద్రావిడ భాష నుండి ఉద్భవించినా వాటి లిపులు మాత్రము బ్రాహ్మీ నుండి పుట్టాయి. దక్షిణ భారతదేశములో బ్రాహ్మీ లిపిలో వ్రాసిన శాసనాలు మొదట భట్టిప్రోలులో దొరికాయి. అక్కడి బౌద్ధ స్తూపములో దొరికిన ధాతుకరండముపై మౌర్య కాలపు బ్రాహ్మీ లిపిని పోలిన లిపిలో అక్షరాలున్నాయి.[2] ఈ లిపిని భాషాకారులు భట్టిప్రోలు లిపి అంటారు. దక్షిణ భారతదేశ లిపులన్నియూ ఈ లిపినుండే పరిణామము చెందాయి.
తెలుగు ఔన్నత్యం
🍮
తెలుగు తల్లి తేజోవిన్యాసం,
తెలుగునాడి గొప్పతనం పయనం,
గోదావరి కిన్నెర కలిసిన స్వరం,
కృష్ణ తీరాన నిత్య సంగీతం.
పాణిని గళంలో పాఠం పలికిన,
నన్నయ మొదలుకొని నవ్వులు పూసిన,
తిక్కన గొలుసుకు మూడవ ముత్యం,
పోతన పద్యాల పరిమళ సంపద.
జ్ఞానపీఠం కీర్తి తెలుగుకు గౌరవం,
శ్రీశ్రీ మాటలు ఉద్యమ హృదయం,
వేమన వాక్యాలు సత్యానికి ప్రతీక,
తెలుగు భాష యుగ యుగాలకు ప్రీతిక.
సాహిత్యం శిఖరమై ప్రకాశించే భాష,
సంగీత స్రవంతిగా ఉరుమించే ఆశ,
తెలుగు నేల చరిత్రను పాడే పాట,
ప్రతి తెలుగువాడి గుండెల్లో వెలిగే జ్యోత.
రామమోహన్
🌹
తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను
తెలుగు వల్లభుండ తెలుగొకండ
ఎల్ల నృపులు గొలువ ఎరుగవే బాసాడి
దేశ భాషలందు తెలుగు లెస్స ”
—శ్రీ కృష్ణదేవ రాయలు
🥕
జనని సంస్కృతంబు సకల భాషలకును
దేశ భాషలందు తెలుగు లెస్స
జగతి దల్లికంటె సౌభాగ్య సంపద
మెచ్చు టాడుబిడ్డ మేలు గాదె? ”
—వినుకొండ వల్లభరాయుడు
శ్రీనాథ యుగానికి చెందిన వినుకొండ వల్లభరాయుడు రచించిన వ్యంగ్య, శృంగారభరిత నాటకమైన క్రీడాభిరామం భాష, పదప్రయోగాల ప్రభావం శ్రీకృష్ణదేవరాయలపై ఉందని సింగరాచార్యులు వంటి సాహిత్య విమర్శకుల అభిప్రాయం