*బుద్ధుడు and sujatha*
*Purandaradas keertnaTelugu sancrit kannada*
*బుద్ధుడు sanscrit
చరిత్ర : నమ్మకాల సమాహారం కాదు
చరిత్ర అనేది నమ్మకాలు కాదవు . భౌతికంగా లభ్యమైన గ్రంథాలు, లిపులు, రచయితలు, కాలక్రమం — ఇవే చరిత్రకు ఆధారాలు.
ఈ ఆధారాల ప్రకారం పరిశీలిస్తే, ఒకే పేరుతో పిలువబడినప్పటికీ, వేర్వేరు కాలాల్లో, వేర్వేరు తాత్విక ప్రపంచాలకు చెందిన రెండు సంస్కృత భాషా రూపాలు స్పష్టంగా కనిపిస్తాయి.
1. మొదటి సంస్కృత భాషా రూపం (సా.శ.పూ. 1 – సా.శ. 9వ శతాబ్దం)
ఈ దశలో ఉపయోగంలో ఉన్న సంస్కృతం బౌద్ధ–శ్రమణ తత్త్వానికి చెందినది. అకాడమిక్ భాషలో దీనిని బౌద్ధ హైబ్రిడ్ సంస్కృతం (Buddhist Hybrid Sanskrit) అని పిలుస్తారు.
ఈ సంస్కృతంలో —
- బయట ఉన్న దేవుడు అనే భావన లేదు
- మనిషిలోని అంతర్లీన గుణాలు, చైతన్యం, కర్మలే కేంద్రం
- మంచి–చెడు, బంధన–విముక్తి మనిషి చేతనే నిర్ణయించబడతాయి
2. ఈ కాలంలో ఉపయోగించిన లిపులు
భౌతిక ఆధారాల ప్రకారం ఈ లిపులు కనిపిస్తాయి:
- బ్రాహ్మీ
- ఖరోష్టి
- గుప్త లిపి
- సిద్ధమ్
- శారదా
- గ్రంథ
- ప్రారంభ నాగరీ
ఈ దశలో దేవనాగరి లిపి కేంద్ర లిపిగా లేదు.
3. బౌద్ధ సంస్కృత గ్రంథాలు (సా.శ. 1 – 9వ శతాబ్దం)
- అశ్వఘోషుడు (1–2 శతాబ్దాలు) – బుద్ధచరిత, సౌందరానంద
- నాగార్జునుడు (2–3 శతాబ్దాలు) – మూలమధ్యమకకారిక
- ఆర్యదేవుడు (3వ శతాబ్దం) – చతుశ్శతక
- అసంగుడు (4వ శతాబ్దం) – యోగాచారభూమి
- వసుబంధుడు (4–5 శతాబ్దాలు) – అభిధర్మకోశ
- దిగ్నాగుడు (5వ శతాబ్దం) – ప్రమాణసముచ్చయ
- ధర్మకీర్తి (6–7 శతాబ్దాలు) – ప్రమాణవార్తిక
- శాంతిదేవుడు (7–8 శతాబ్దాలు) – బోధిచర్యావతార
ఈ మొత్తం సాహిత్యంలో బయట దేవుడు అనే భావన లేదు. మనిషి అంతర్లీన చైతన్యమే తత్త్వానికి కేంద్రం.
4. సా.శ. 8–9వ శతాబ్దాలు : తాత్విక మలుపు
ఈ దశలో ఆదిశంకరాచార్యుడు ప్రాచుర్యంలోకి వస్తాడు.
ఆయన కూడా బయట ఎక్కడో ఉన్న దేవుడిని ప్రతిపాదించలేదు. అద్వైతం అంటే —
- జీవుడు దేవుడికి వేరు అనే భావన కాదు
- జీవుడే పరమసత్యాన్ని గ్రహించగల స్థితి
5. బౌద్ధ తత్త్వంలో అంతర్గత విభజనలు
- బోధిసత్వ శివ
- బోధిసత్వ విష్ణు
- బోధిసత్వ సూర్య
- బోధిసత్వ స్కంద
- బోధిసత్వ శక్తి
ఇవి వేర్వేరు బౌద్ధ తాత్విక ధారలకు ప్రతీకలు.
6–9. సా.శ. 11వ శతాబ్దం తరువాత మార్పు
ఈ దశలో —
- జీవుడు వేరు, దేవుడు వేరు అనే భావన బలపడింది
- భక్తి కేంద్రంగా వేద–పురాణ సాహిత్యం స్థిరీకరించబడింది
- దేవనాగరి ప్రధాన లిపిగా మారింది
10–11. బ్రాహ్మణ సాహిత్యం & తెలుగు అనువాదాలు
సా.శ. 11వ శతాబ్దం తరువాత వేద–పురాణ సాహిత్యం తెలుగులోకి అనువదించబడింది.
12. సారాంశం
సా.శ.పూ. 1వ శతాబ్దం నుండి సా.శ. 9వ శతాబ్దం వరకు లభ్యమైన సంస్కృత సాహిత్యం బౌద్ధ–శ్రమణ తత్త్వానికి చెందినది.
సా.శ. 11వ శతాబ్దం తరువాత జీవుడు–దేవుడు వేరు అనే భావనతో వేద–పురాణ సంస్కృతం బలపడింది.
ఈ రెండు సంస్కృతాలు ఒకటే కావు. కాలం వేరు. తత్త్వం వేరు. సామాజిక దృష్టి వేరు.
13. References (Academic)
- A. K. Warder – Indian Buddhism
- Etienne Lamotte – History of Indian Buddhism
- Johannes Bronkhorst – Buddhism in the Shadow of Brahmanism
- David Seyfort Ruegg – Literature of the Madhyamaka School
- Richard Gombrich – Theravada Buddhism
- D. D. Kosambi – Myth and Reality
- Sheldon Pollock – The Language of the Gods in the World of Men
- R. S. Sharma – Early Medieval Indian Society
- Romila Thapar – Cultural Pasts
- Epigraphia Indica – ASI
ప్రేమ సుధా మంజరి
ప్రేమ సుధా మంజరి
Classic Love అనేది సాంప్రదాయ ప్రేమ భావనలకు ప్రతీక. కట్టుబాటు, త్యాగం, శాశ్వతత్వం, హృదయపూర్వకత—ఇవన్నీ కలిసి ప్రేమను ఒక జీవనశక్తిగా మలుస్తాయి. ప్రేమ అనేది జీవిత శకటానికి అణు ఇంధనంలా పని చేసి, మనిషిని ముందుకు నడిపించే మహోన్నత శక్తి.
P1 : ప్రేమ ప్రయాణం – ఆరంభం
నీలాకాశ నక్షత్రములు మెరిసె
పలకరింపుకే కోయిల తన గొంతు సవరించె
ప్రకృతి పరవశంతో పులకించె
1975 జూలై. నా వయస్సు 14 సంవత్సరాలు. తొమ్మిదో తరగతి చదువుతున్న రోజులు. స్కూల్ అయిపోయిన తరువాత ఇంటికి నడక దారిని పట్టాను. ఆ దారిలో ఒక ఆరో తరగతి చదువుతున్న చిన్న అబ్బాయి పరిచయమయ్యాడు.
“రోజూ మా గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి ఇంటికి వెళ్తాను. కానీ ఈ రోజు రాలేదు,” అన్నాడు.
మేమిద్దరం మాట్లాడుకుంటూ మూడు కిలోమీటర్లు నడిచి, వేర్వేరు గమ్యాలకు చేరుకున్నాం. ఆ రోజు అలా గడిచిపోయింది.
P2 : దారిలో ఝాన్సీతో పరిచయం
మరుసటి రోజు, అతడే మళ్లీ ఎదురయ్యాడు. ఈసారి అతడి పక్కన ఒక అమ్మాయి.
“ఈమె ఝాన్సీ. నా క్లాస్‌మేట్,” అని పరిచయం చేశాడు.
ఝాన్సీ కొంచెం మొహమాటంగా తలదించుకుంది. నేను నవ్వుతూ “హాయ్” అన్నాను. ఆ రోజు ముగ్గురం కబుర్లు చెప్పుకుంటూ ఇంటివైపు నడిచాం.
ఆ తరువాత రోజులు మేమిద్దరమే. ఝాన్సీ – నేను. ఇంటికి వెళ్లే దారి మా నిత్య ప్రయాణంగా మారింది.
P3 : బస్సులో (15 పైసల టికెట్)
రోజులు ఆనందభరితంగా గడుస్తున్నాయి. కలిసి స్కూల్‌కు రావడం, కలిసి ఇంటికి వెళ్లడం మాకు దినచర్యగా మారింది. మా అనుబంధం క్రమంగా బలపడింది.
ఒక రోజు స్కూల్ అయిన తరువాత, బస్సులో ఝాన్సీ – నేను కలిసి ఇంటికి వెళ్తున్నాము. ఆమె ముందే సీటులో కూర్చొని, తన పక్క సీటును చూపిస్తూ “ఇక్కడ కూర్చో” అని అంది.
నేను కూర్చునే క్షణంలో మా చేతులు స్వల్పంగా తాకాయి. ఆ క్షణం నాకు ఆనందం, సంతోషం, మనసులో ప్రశాంతత ఒకేసారి కలిగాయి.
ఆ బస్సు ప్రయాణం నా జీవితంలో మరచిపోలేని జ్ఞాపకంగా నిలిచిపోయింది. మా బంధం అమాయకత్వపు తీయని గాథగా కొనసాగింది.
P4 : బస్సు కోసం ఎదురుచూపులు
ఋతువులు మారుతున్నాయి. వసంతం పూల సుగంధాన్ని చుట్టుముట్టగా, వర్షాకాలం చిరుజలదారలతో మనసులను తడిమింది.
చలికాలం చల్లని గాలులతో కొత్త అనుభూతులను జతచేసింది. ఎండాకాలం వెచ్చని రాత్రుల నీడన ఇద్దరి అనుబంధం మరింత బలపడింది.
రాత్రి నిద్రలోకి జారుకున్న నాకు తనతో గడిపిన క్షణాలు మనసులో ఊసుల అలజడిగా మారేవి.
ఉదయం సూర్యుడు ఆకాశపు పల్లకిలోంచి పరుగెత్తుకుంటూ వచ్చి నన్ను మేల్కొలిపేవాడు. ఝాన్సీని స్కూల్‌లో కలవాలన్న కోరిక ప్రతి ఉదయం నాలో పుట్టేది.
1976 జూన్. నాన్న ఉద్యోగం కారణంగా నేను ఏలూరు వెళ్లాలని నిర్ణయం అయ్యింది. ఝాన్సీని, నేను చదివిన స్కూల్‌ని విడిచిపోవడం చాలా కష్టంగా అనిపించింది.
ఆమె తన స్నేహితులతో వచ్చి నాకు వీడ్కోలు చెప్పింది. నా ప్రయాణం ముందుకు సాగిపోయింది. 1976 – Good Bye.
1977 ఇంటర్మీడియట్ మచిలీపట్టణం
1978 ఇంటర్మీడియట్ మచిలీపట్టణం
P5 : కజిన్ ఇంట్లో కలయిక (1979)
మూడు సంవత్సరాల మౌన ప్రయాణం తరువాత 1979లో ఝాన్సీతో అనుకోకుండా మళ్లీ కలిసాను.
పెదనాన్న గారి మరణం కారణంగా మా కజిన్ లక్ష్మి ఇంటికి ఝాన్సీ కోరిక మేరకు కలిసి వెళ్లాము.
మూడు గంటల పాటు ఝాన్సీతో గడిపిన సమయం నాకు ఎంతో ప్రత్యేకంగా అనిపించింది. ఆ సంభాషణలు నా జీవితంలో చిరస్మరణీయ జ్ఞాపకాలయ్యాయి.
Love Proposal Episode
1979 సెప్టెంబర్ నెల. రాత్రి 9 నుంచి 12 గంటల వరకు ప్రేమ లేఖ వ్రాసి మరుసటి రోజు పోస్టు చేశాను.
రెండు రోజుల తరువాత ఝాన్సీ విముఖతతో జవాబు పంపింది. హృదయం భారమైంది.
తెల్లవారు జాము 4 గంటలకు ఆఖరి ఉత్తరం వ్రాసాను —
నీ మీద నా ప్రేమ నిజం.
వచ్చే జన్మలో ఏ శక్తి విడదీయలేని
స్నేహితులుగా జన్మిద్దాం."
రెండు రోజుల తరువాత ఝాన్సీ ప్రేమను అంగీకరిస్తూ ప్రత్యుత్తరం పంపింది. నా ఆనందానికి అవధులే లేవు. ప్రేమ ఫలించింది.
P6 : కాలేజ్ రోజులు
మా విద్యాభ్యాస ప్రదేశాలు వేర్వేరు అయినా, మా ప్రేమ దూరాన్ని ఎదుర్కొని దృఢమైన అనుబంధంగా మారింది.
ఝాన్సీ ప్రతి సందేశం నాకు నూతన శక్తిని ఇచ్చింది. ఆమె కోసం రాసిన కవితలు, పాటలు నా మనసులో అమరమైన జ్ఞాపకాలయ్యాయి.
P7 : కాలేజీలో ఎదురుపడటం
ఝాన్సీ, ఆమె సోదరి అదే కాలేజీలో చదువుతుండేవారు. చాలాసార్లు ఎదురుపడ్డాం.
మౌనంగా చూస్తూ వారి ముందుగా నడిచేవాడిని. మౌనమే మా సంభాషణగా మారింది.
P8 : పెళ్లి కోసం లేఖ
ప్రేమ నుంచి బాధ్యత వైపు అడుగులు వేయాలన్న ఆలోచన ఈ దశలో మొదలైంది.
P9 : హీరో
ప్రేమలో హీరో అంటే త్యాగం, సహనం, విశ్వాసం కలిగిన మనిషి.
P10 : బాల్య స్నేహితులు – స్కూల్ జ్ఞాపకాలు
స్నేహమే ప్రేమకు మొదటి మెట్టు. ఆ అమాయక రోజులు ఈ కథకు మూలం.
P11 : చెట్టు దగ్గర ప్రతిరోజూ కలయిక
మా మౌన సంభాషణలకు సాక్షిగా నిలిచిన చెట్టు, మా ప్రేమకు నిశ్శబ్ద స్మారకంగా నిలిచింది.
ప్రేమ సుధా మంజరి – ప్రేమ కథ (ఇంకా కొనసాగుతుంది…)
CONCEPT ( development of human relations and human resources )*Cuneiform
Cuneiform | క్యూనిఫామ్
What is Cuneiform? | క్యూనిఫామ్ అంటే ఏమిటి?
English:
Cuneiform is one of the earliest known writing systems in human history.
It was developed by the Sumerians in ancient Mesopotamia (modern-day Iraq)
around c. 3400–3000 BCE.
తెలుగు:
క్యూనిఫామ్ అనేది మానవ చరిత్రలో తెలిసిన అతి ప్రాచీన లిపులలో ఒకటి.
ఇది సుమేరియన్లు ప్రాచీన మెసపొటేమియాలో (నేటి ఇరాక్)
క్రీ.పూ. 3400–3000 కాలంలో అభివృద్ధి చేశారు.
Name Meaning | పేరుకు అర్థం
English:
The word cuneiform comes from Latin:
- cuneus = wedge
- forma = shape
It literally means wedge-shaped writing.
తెలుగు:
క్యూనిఫామ్ అనే పదం లాటిన్ భాష నుండి వచ్చింది:
- క్యూనియస్ = ముల్లు / వెజ్ ఆకారం
- ఫోర్మా = ఆకృతి
అంటే వెజ్ ఆకారపు లిపి అని అర్థం.
How Cuneiform Worked | క్యూనిఫామ్ ఎలా పనిచేసింది?
- Material: Clay tablets | మట్టి పలకలు
- Tool: Reed stylus | రీడ్ కలం
- Technique: Pressing wedge marks | వెజ్ ఆకార ముద్రలు
- Preservation: Sun-dried or baked | ఎండలో ఎండబెట్టడం లేదా కాల్చడం
Languages Written | వాడిన భాషలు
English: Cuneiform was a writing system used for many languages.
తెలుగు: క్యూనిఫామ్ ఒకే భాష కాదు – అనేక భాషలకు ఉపయోగించిన లిపి.
- Sumerian – సుమేరియన్
- Akkadian – అక్కాడియన్
- Hittite – హిట్టైట్
- Elamite – ఎలమైట్
- Urartian – ఉరార్టియన్
What Was Written? | ఏమి రాశారు?
- Economic records | ఆర్థిక లెక్కలు
- Legal codes (Code of Hammurabi) | న్యాయ నియమాలు
- Royal inscriptions | రాజశాసనాలు
- Letters | లేఖలు
- Literature (Epic of Gilgamesh) | సాహిత్యం
Why Cuneiform Matters | ప్రాముఖ్యత
English:
Cuneiform marks the transition from prehistory to recorded history.
తెలుగు:
క్యూనిఫామ్ మానవుడు చరిత్రను లిఖితంగా నమోదు చేయడం ప్రారంభించిన మలుపు.
Timeline | కాలక్రమం
| Period | కాలం | Event | సంఘటన |
|---|---|
| c. 3400–3000 BCE | Invention in Sumer | సుమేరియాలో ఆవిర్భావం |
| c. 2100 BCE | Akkadian & Babylonian peak | అక్కాడియన్, బబిలోనియన్ ఉత్కర్ష |
| 2nd millennium BCE | Used by Hittites | హిట్టైట్లు వాడకం |
| 1st century CE | Gradual decline | క్రమంగా అంతరించటం |
Fun Fact | ఆసక్తికర విషయం
English: Deciphered in the 19th century by Henry Rawlinson.
తెలుగు: 19వ శతాబ్దంలో హెన్రీ రాలిన్సన్ దీన్ని చదవగలిగాడు.
CONCEPT: Development of human relations and human resources
ఆలోచన: మానవ సంబంధాలు మరియు మానవ వనరుల అభివృద్ధి
*బుద్ధుడు – శ్రమణులు
ఇద్దరి ఘర్షణలు: బ్రాహ్మణులు – శ్రమణులు
ప్రాచీన భారతీయ తాత్విక చరిత్రలో బ్రాహ్మణ సంప్రదాయం మరియు శ్రమణ సంప్రదాయం మధ్య తీవ్రమైన ఆలోచనా – సామాజిక ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణ భౌతిక యుద్ధం కాదు – ఇది భావజాలాల పోరాటం.
ఘర్షణకు ప్రధాన కారణాలు
1) వేదాల అధికారం
- బ్రాహ్మణులు: వేదాలు అపౌరుషేయాలు, శాశ్వత సత్యం
- శ్రమణులు: వేదాలకు పరమాధికారం లేదు; అనుభవమే ప్రమాణం
ఇది మౌలిక తాత్విక ఘర్షణ
2) యజ్ఞాలు – కర్మకాండ
- బ్రాహ్మణులు: యజ్ఞాల ద్వారానే మోక్షం
- శ్రమణులు: యజ్ఞాలు వ్యర్థం, హింసాత్మకం
బుద్ధుడు జంతుబలి యజ్ఞాలను తీవ్రంగా ఖండించాడు.
3) వర్ణవ్యవస్థ
- బ్రాహ్మణులు: జన్మ ఆధారిత వర్ణ ధర్మం
- శ్రమణులు: జన్మ కాదు – కర్మ, ఆచరణే గొప్పదనం
“న జన్మనా బ్రాహ్మణో” – బౌద్ధ భావన
4) దేవుడు – ఆత్మ భావన
- బ్రాహ్మణులు: ఆత్మ, బ్రహ్మ, ఈశ్వర విశ్వాసం
- బౌద్ధం: అనాత్మవాదం
- జైనం: జీవాత్మ భావన (కానీ సృష్టికర్త దేవుడు కాదు)
5) భాష & ప్రజల చేరువ
- బ్రాహ్మణులు: సంస్కృతం – పండితుల భాష
- శ్రమణులు: ప్రాకృత, పాళీ – ప్రజల భాష
ఇది సామాజిక ఆధిపత్యంపై జరిగిన ఘర్షణ.
ఘర్షణల ఫలితాలు
- బౌద్ధం, జైనం విస్తరణ
- కర్మకాండలకు వ్యతిరేక ఉద్యమాలు
- బ్రాహ్మణ సంప్రదాయంలో సంస్కరణలు (ఉపనిషత్తులు, భక్తి మార్గం)
- భారతీయ తత్వంలో వాద–ప్రతివాద సంస్కృతి వికాసం
చారిత్రక సత్యం
ఈ ఘర్షణ యుద్ధం కాదు – ఆలోచనల పోరాటం.
అదే భారతీయ తత్వానికి ప్రాణం.
CONCEPT: Development of Human Relations and Human Resources
*బౌద్ధ తత్వంలో “18 Factors
*The Chaniky
చాణక్యుడు (కౌటిల్యుడు / విష్ణుగుప్తుడు) – చారిత్రక టైమ్‌లైన్
- క్రీ.పూ. 370 – 350 : చాణక్యుని జననం (సుమారు) – ఉత్తర భారతదేశం / తక్షశిలా ప్రాంతం
- క్రీ.పూ. 350 – 330 : తక్షశిలా విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం – వేదాలు, రాజకీయం, ఆర్థికం
- క్రీ.పూ. 330 : తక్షశిలాలో ఆచార్యుడిగా స్థానం – కౌటిల్యుడు / విష్ణుగుప్తుడు అనే పేర్లు వినియోగం
- క్రీ.పూ. 326 : అలెగ్జాండర్ భారతదేశంపై దాడి – రాజకీయ అస్థిరతను గమనించిన చాణక్యుడు
- క్రీ.పూ. 325 – 322 : నంద వంశానికి వ్యతిరేకంగా వ్యూహ రచన – చంద్రగుప్త మౌర్యుని శిక్షణ
- క్రీ.పూ. 322 : నంద వంశ పతనం – మౌర్య సామ్రాజ్య స్థాపన చంద్రగుప్త మౌర్యుడు రాజు, చాణక్యుడు ప్రధాన మంత్రి
- క్రీ.పూ. 322 – 300 : రాజ్య పరిపాలన స్థిరీకరణ – గూఢచర్య, పన్ను వ్యవస్థలు అర్థశాస్త్రం రచన / సంకలనం
- క్రీ.పూ. 305 : సెల్యూకస్ నికేటర్‌తో దౌత్య ఒప్పందం
- క్రీ.పూ. 300 – 290 : చంద్రగుప్తుని రాజ్యత్యాగం – బిందుసారుని కాలం ప్రారంభం చాణక్యుడు రాజకీయాల నుండి విరమణ (సంప్రదాయం)
- క్రీ.పూ. 290 – 280 : చాణక్యుని మరణం (సుమారు)
తరువాతి కాల ప్రస్తావనలు
- పురాణాలు – విష్ణు, వాయు, మత్స్య పురాణాలు
- బౌద్ధ గ్రంథాలు – మహావంస, దీపవంస
- జైన గ్రంథం – పరిషిష్టపర్వం (హేమచంద్రుడు)
- నాటకం – ముద్రారాక్షసం (విషాఖదత్తుడు)
చాణక్యుడు భారత రాజకీయ తత్వానికి పునాది వేసిన మహా మేధావి.
చంద్రగుప్త మౌర్యుడు – అకాడమిక్ చరిత్ర (Original History)
చంద్రగుప్త మౌర్యుడు (c. 322–298 BCE) భారత ఉపఖండ చరిత్రలో మొదటి సారిగా రాజకీయ ఏకీకరణ సాధించిన రాజు. అతని చరిత్రను మనం సాహిత్య ఆధారాలు + విదేశీ వృత్తాంతాలు + పరిపాలనా సాక్ష్యాలు ఆధారంగా పునర్నిర్మించగలం.
1. కాల నిర్ధారణ (Chronology)
చంద్రగుప్తుని పాలన కాలం క్రీ.పూ. 322 నుండి 298 వరకు అని ఆధునిక చరిత్రకారుల మధ్య విస్తృతంగా అంగీకారం ఉంది. ఈ కాల నిర్ధారణకు ప్రధాన ఆధారం — గ్రీకు రచయిత మెగస్థనీస్ మరియు సెల్యూకస్ నికేటర్తో జరిగిన ఒప్పందం (c.305 BCE).
2. నంద వంశ పతనం – చారిత్రక విశ్లేషణ
పాటలిపుత్రంలో పాలించిన ధననందుడుపై ప్రజా అసంతృప్తి ఉన్నదని బౌద్ధ, జైన వృత్తాంతాలు సూచిస్తున్నాయి. చాణక్యుడు (కౌటిల్యుడు) రాజకీయ వ్యూహకర్తగా చంద్రగుప్తుని ఎదుగుదలకు సహకరించాడని అర్థశాస్త్రం + ముద్రారాక్షసం ద్వారా నిర్ధారించబడుతుంది.
3. మౌర్య సామ్రాజ్య స్థాపన (322 BCE)
నంద వంశ పతనానంతరం పాటలిపుత్రం రాజధానిగా మౌర్య సామ్రాజ్యం స్థాపించబడింది. ఇది భారత చరిత్రలో తొలి కేంద్రకృత పరిపాలనా వ్యవస్థ.
4. పరిపాలన – అకాడమిక్ దృష్టి
మౌర్య పరిపాలనపై అత్యంత విశ్వసనీయ ఆధారం — కౌటిల్యుని అర్థశాస్త్రం. దీనిలో:
- రాజు–మంత్రి సంబంధాలు
- పన్ను వ్యవస్థ
- గూఢచర్య విభాగం
- న్యాయ–శిక్ష విధానం
ఈ వ్యవస్థలను మెగస్థనీస్ తన Indica గ్రంథంలో ప్రత్యక్షంగా ధృవీకరించాడు.
5. గ్రీకు ప్రపంచంతో సంబంధాలు
క్రీ.పూ. 305లో సెల్యూకస్ నికేటర్తో జరిగిన యుద్ధం అనంతరం ఒప్పందం జరిగింది. దాని ప్రకారం:
- పశ్చిమ భారత ప్రాంతాలు మౌర్యుల ఆధీనంలోకి వచ్చాయి
- రాజకీయ వివాహ సంబంధం ఏర్పడింది
- మెగస్థనీస్ పాటలిపుత్రానికి రాయబారిగా వచ్చాడు
6. చివరి దశ – జైన సంప్రదాయం
బౌద్ధ–గ్రీకు ఆధారాలు ఇక్కడ మౌనంగా ఉంటాయి. కానీ జైన గ్రంథాలు చంద్రగుప్తుడు రాజ్యత్యాగం చేసి శ్రవణబెళగొళలో సల్లేఖన ద్వారా మరణించాడని చెబుతాయి. ఈ అంశం సాంప్రదాయ ఆధారంగా పరిగణించబడుతుంది.
7. చరిత్రలో స్థానం (Historical Significance)
- భారతదేశ తొలి సామ్రాజ్య నిర్మాత
- కేంద్ర పరిపాలనకు పునాది
- రాజకీయ వాస్తవవాదానికి ఉదాహరణ
*మౌఖిక సాహిత్యం
మౌఖిక సాహిత్యం (మౌఖిక సంప్రదాయం)
మౌఖికం అంటే 👉 నోటిమాట ద్వారా పరంపరగా ప్రసారం అయిన సాహిత్యం. రాయడం కంటే ముందే, వినడం–చెప్పడం ద్వారానే తరతరాలకు చేరింది.
మౌఖిక సాహిత్య ప్రధాన మూలాలు
1️⃣ వేద శ్రుతి సంప్రదాయం (అత్యంత ప్రాచీనము)
- వేదాలు పూర్తిగా మౌఖికంగా సంరక్షించబడ్డాయి
- గురు → శిష్య పరంపర
- అక్షరము, స్వరం, మంత్రం – అన్నీ ఖచ్చితంగా నిలుపబడ్డాయి
పఠన విధానాలు (Oral Techniques):
- పదపాఠం
- క్రమపాఠం
- జటాపాఠం
- ఘనపాఠం
👉 ప్రపంచంలోనే అత్యంత ఖచ్చితమైన మౌఖిక సంప్రదాయం
2️⃣ ఇతిహాసాలు (మౌఖిక రూపంలో ప్రసారం)
- రామాయణం
- మహాభారతం
మొదట కథకులు, సూక్తులు, హరికథల ద్వారా ప్రచారం తరువాతే లిఖిత రూపం
3️⃣ పురాణాలు
- విష్ణు పురాణాలు
- శివ పురాణాలు
- దేవి పురాణాలు
ఆలయాలు, సభలు, కథావాచకుల ద్వారా ప్రసారం సామాన్య ప్రజలకు తాత్విక భావనలు చేరవేయడం
4️⃣ జానపద సాహిత్యం (Folk Oral Literature)
- పాటలు
- కథలు
- పొడుపు కథలు
- సామెతలు
- లాలిపాటలు
👉 గ్రామీణ సమాజపు జీవన దర్పణం
5️⃣ బౌద్ధ – జైన మౌఖిక సంప్రదాయం
- బుద్ధుడి ఉపదేశాలు మొదట మౌఖికమే
- త్రిపిటకాలు శతాబ్దాల తరువాత లిఖితం
- జాతక కథలు ప్రజల్లో నోటిమాటగా వ్యాప్తి
మౌఖిక సాహిత్య లక్షణాలు
- స్మృతి శక్తి ఆధారం
- పునరుక్తి (Repetition)
- ఛందస్సు, తాళం
- సామూహిక భాగస్వామ్యం
- మార్పులకు లోనవడం
మౌఖికం → లిఖితం (పరిణామం)
సమాజం సంక్లిష్టమైన కొద్దీ లిఖిత సాహిత్యం అవసరమైంది. కానీ మూల భావాలు మౌఖిక సంప్రదాయానివే.
తాత్విక దృష్టి
శ్రుతి = మౌఖికం
స్మృతి = లిఖితం
👉 భారతీయ సాహిత్యానికి పునాది వినడం
CONCEPT : Development of Human Relations and Human Resources
ENGLISH GRAMMR MADE EASY
Helping Verbs in English
1. DO / DOES
Used in Present Simple Tense (for questions and negatives)
| Subject | Verb | Example |
|---|---|---|
| I / You / We / They | do | Do you play cricket? |
| He / She / It / Name | does | Does he like tea? |
2. HAS / HAVE
Used to show possession or in Present Perfect Tense
| Subject | Verb | Example |
|---|---|---|
| I / You / We / They | have | We have a new car. |
| He / She / It / Name | has | She has two cats. |
3. IS / AM
Forms of "be" verb used in Present Tense (for state or continuous actions)
| Subject | Verb | Example |
|---|---|---|
| I | am | I am happy. |
| He / She / It / Name | is | He is reading a book. |
📘 Subject and Predicate
🔹 What is a Subject?
The Subject tells who or what the sentence is about.
👉 Subject: The cat
🔸 What is a Predicate?
The Predicate tells what the subject does or is. It includes the verb and the rest of the sentence.
👉 Predicate: sleeps under the table
📝 More Examples:
👉 Subject: Ravi
👉 Predicate: plays cricket
👉 Subject: The birds
👉 Predicate: are flying in the sky
👉 Subject: I
👉 Predicate: am learning English