చారిత్రిక గతిని నిర్దేశించిన తాత్వికులలో బుద్ధుడు ఒకరు
తాత్వికుల భావాలు, భావజాలాలు కాల పరంపరలో మన మధ్య సజీవంగా ఉంటాయి.
గౌతమ బుద్ధుడు మధ్యేమార్గాన నాలుగు ఆర్యసత్యములను తెలియపరచెను. అవి
- దుఃఖం అంతటా వుంది
- ఈ దుఃఖం ‘తృష్ణ’ (కోరిక )వలన ఏర్పుడుతుంది
- తృష్ణ ‘అవిద్య’ (అజ్ఞానం )వలన వస్తుంది
- అష్టాంగ మార్గమే అవిద్యానాశకారి.
వీటినే నాలుగు ఆర్య సత్యాలు లేదా నాలుగు పరమ సత్యాలు అంటారు . వాటి పరిపూర్ణ స్వరూప స్వభావ పరిజ్ఞానం ఆయన సముపార్జించాడు. అప్పటినుంచి ఆయన గౌతమ బుద్ధుడైనాడు.
అష్టాంగ మార్గాన్ని అవలంబించడమే ఏకైక శరణ్యం దానివల్ల శాశ్వతమైన దుఃఖ – రాహిత్యం కలుగుతుంది
- “తృష్ణ” అంటే శృతికి మించిన రాగం.
- “తృష్ణ” అంటే లయకు మించిన తాళం
- “తృష్ణ” అంటే మితికి మించిన మోతాదు.
- “తృష్ణ” అన్నదే వాస్తవానికి దుఃఖానికి ప్రత్యక్ష కారణం.
- “తృష్ణా-రాహిత్యం” వల్లనే దుఃఖ-రాహిత్యం కలుగుతుంది.
దుఃఖ-రాహిత్యమే నిర్వాణం
“నిర్వాణం” అన్నా, “ముక్తి” అన్నా, “మోక్షం” అన్నా, “నిఃశ్రేయస్సు” అన్నా, “అపవర్గం” అన్నా అన్నీ ఒక్కటే, అవన్నీ పర్యాయపదాలే.
ఇవి గౌతమ బుద్ధుడు తన జ్ఞానోదయం తరువాత తన సహ సాధకులైన ఐదుగురు శ్రమణులకు చెప్పిన విషయాలు కనుక అవి బుద్ధుని మొదటి బోధనలు. "ధర్మ చక్ర పరివర్తన సూత్రం" అనే బుద్ధుని మొదటి బోధలో బుద్ధుడు మధ్యే మార్గం గురించి, అష్టాంగ సాధనామార్గం గురించి, నాలుగు పరమ సత్యాల గురించి చెప్పాడు. ఈ నాలుగు పరమ సత్యాలు అనే విషయాన్ని ఒక మత ప్రబోధంగా కాక అప్పటి కాలంలో ఉన్న ఉపశమన విధానం (కష్టాలు తీర్చే మార్గం) గా చెప్పాడు.
III.పంచ-శీల
ఆదిన్నాదానా వేరమణి శిఖాపదం సమాదియామి.
కామేసు మిచ్ఛాచార వేరమణి శిఖాపదం సమాదియామి.
ముసావదా వేరమణి సిక్ఖపదం సమాదియామి.
సుర మేరయ మజ్జ పమదత్థానా వెరమి సిక్ఖపదం సమాదియామి
ఇమాని పంచ శిఖాపదాని సమాదియామి
ఐదు సూత్రాలు
1.ప్రాణులను నాశనం చేయకుండా ఉండాలనే నియమాన్ని నేను పాటిస్తాను.
2.నేను ఇవ్వని వస్తువులను తీసుకోకుండా ఉండాలనే ఆదేశాన్ని పాటిస్తాను.
3.నేను లైంగిక దుష్ప్రవర్తనకు దూరంగా ఉండాలనే ఆదేశాన్ని పాటిస్తాను.
4.తప్పుడు మాటలకు దూరంగా ఉండాలనే ఆదేశాన్ని నేను పాటించాను.
5.మత్తు మరియు అజాగ్రత్త కలిగించే మద్యపానానికి దూరంగా ఉండాలనే ఆదేశాన్ని నేను పాటిస్తాను.
నేను నా సామర్థ్యం మేరకు ఐదు సూత్రాలను పాటిస్తాను.
జీవులను చంపడం ,(1.జీవహింస చేయరాదు )దొంగిలించడం,(2.దొంగిలించరాదు )లైంగిక దుష్ప్రవర్తన,(3.వ్యభిచరించరాదు )అబద్ధం (4.అబద్దమాడరాదు) మరియు మత్తుకు(5.మత్తు పానీయాలు సేవించరాదు )దూరంగా ఉండాలనే కట్టుబాట్లను సూత్రాలు అంటారు
ఐదు సూత్రాలు
( సంస్కృతం : పంచశిల ; పాళీ : పంచసిల ) లేదా ఐదు శిక్షణానియమాలు
( సంస్కృతం:పంచశిక్షపద ;పాళీ :పంచసిక్ఖపద )
బౌద్ధ సామాన్యులకు అత్యంత ముఖ్యమైన నైతిక వ్యవస్థ .
అవి బౌద్ధమతం యొక్క సాధారణ అనుచరులు గౌరవించవలసిన ప్రాథమిక నీతి నియమావళి.
జీవులను చంపడం , దొంగిలించడం, లైంగిక దుష్ప్రవర్తన, అబద్ధం మరియు మత్తుకు దూరంగా ఉండాలనే కట్టుబాట్లను సూత్రాలు అంటారు .
బౌద్ధ సిద్ధాంతంలో, అవి జ్ఞానోదయం మార్గంలో పురోగతి సాధించడానికి మనస్సు పాత్రను అభివృద్ధి చేయడానికి ఉద్దేశించబడ్డాయి . వాటినికొన్నిసార్లు మహాయాన సంప్రదాయంలో శ్రావకాయనసూత్రాలుగా సూచిస్తారు .
ఐదు సూత్రాలు బౌద్ధ సిద్ధాంతంలోని అనేక భాగాలకు ఆధారం.
బౌద్ధ నీతి శాస్త్రంలో వారి ప్రాథమిక పాత్రకు సంబంధించి,వారు అబ్రహమిక్మతాలలోని పది
ఆజ్ఞలతో లేదా కన్ఫ్యూషియనిజం యొక్క నైతిక నియమాలతో పోల్చబడ్డాయి
IV.అష్టాంగ మార్గం
నాలుగు పరమ సత్యాలలో నాలుగవదైన దుఃఖ విమోచనా మార్గం అష్టాంగ మార్గం.
ఆరంభ కాలపు బౌద్ధ గ్రంథాలలో (నాలుగు నికాయలలో) అష్టాంగ మార్గం సామాన్యులకు బోధించేవారు కారు. అష్టాంగ మార్గం మూడు విభాగాలుగా విభజింపబడింది.
I. శీలము (భౌతికమైన చర్యలు),
II. సమాధి (మనస్సును లగ్నం చేయుట, ధ్యానము),
III.ప్రజ్ఞ(అన్నింటినీ తాత్విక దృష్టితో పరిశీలించడం)
I.శీలము - మాటల ద్వారా, చేతల ద్వారా చెడును కలుగనీయకుండడం. ఇందులో మూడు భాగాలున్నాయి:
- "సమ్యక్ వచనము" సరియైన వాక్కు (సమ్మ-వాచ) నొప్పించకుండా, వక్రీకరించకుండా, సత్యంగా మాట్లాడడం
- "సమ్యక్ కర్మము" సరియైన చర్య (సమ్మ-కమ్మంత) హానికలిగించే పనులు చేయకుండుట
- "సమ్యక్ జీవనము" సరియైన జీవనోపాధి (సమ్మ-అజీవ) తనకు గాని, ఇతరులకు గాని, ప్రత్యక్షంగా కాని, పరోక్షంగా కాని కీడు కలుగకుండా జీవించడం
II.సమాధి - మనసును అదుపులోకి తెచ్చుకోవడం. ఇందులో మూడు భాగాలు ఉన్నాయి.
- "సమ్యక్ సాధన"- సరియైన ప్రయత్నం (సమ్మ- వాయమ) ప్రగతి కోసం మంచి ప్రయత్నం చేయుట
- "సమ్యక్ స్మృతి" సరియైన బుద్ధి (సమ్మా-సతి) స్వచ్ఛమైన దృష్టితో విషయాలను స్పష్టంగా చూడగలగడం (ఎరుక కలిగి వుండాలి )
- "సమ్యక్ సమాధి" - సరి యైన ఏకాగ్రత (సమ్మ-సమాధి) రాగ ద్వేషాలకు అతీతంగా మనసును స్థిరపరచుకొని సత్యాన్ని అన్వేషించడం(ఉపేక్ష స్మృతి పరిశుద్ధత )
III.ప్రజ్ఞ - మనసును శుద్ధపరచే జ్ఞానము. ఇందులో రెండు అంగాలున్నాయి.
- "సమ్యక్ దృష్టి" సరైన దృక్పథం (సమ్మ-దృష్టి ) అనిపించేలాగా కాకుండా (భ్రమ పడకుండా) ఉన్నది ఉన్నట్లుగా చూడగలగడం( సరి యైనా అవగాహన )
- "సమ్యక్ సంకల్పము" సరియైన ఆలోచన (సమ్మ-సంకప్ప) ఆలోచించే విధానంలో మార్పు
దశపారమితలు : దశపారమితలు అంటే పరిపూర్ణతలు. వాటిని ఆచరించడమే ఉత్తమ ధార్మిక మార్గం.
1. శీలం : శీలం అనేది నైతిక ప్రవృత్తి. చెడు చేయకూడదు, మంచి చేయాలనే గుణం. తప్పు చేయడానికి సిగ్గుపడే, భయపడే లక్షణం.
శిక్షపడుతుందన్న భయంతో తప్పు చెయ్యకుండా ఉండడం కాదు, శిక్షలేకపోయినా తప్పు చెయ్యడానికి, చెడు చేయడానికి భయపడడమే శీలం. మేలు చేయాలనే నైతిక స్వభావమే శీలం.
2. నిష్కామం : ప్రాపంచిక సుఖాలను వదులుకోవడం. తృష్ణ లేకపోవడం.
3. దానం : ప్రతిఫలం ఆశించకుండా తన ఆస్తినిగాని, వస్తువులనుగాని, రక్తాన్ని, అవయవాలను, అవసరం అయితే ప్రాణాన్నిసైతం ఇచ్చివేయడం దానం.
4. ఉపేక్ష : మనసును రాగద్వేషాలకు అతీతంగా ఉంచుకోవడాన్నే ఉపేక్ష అంటారు. అలాగే కష్ట సుఖాలకు చలించకుండా ఉండడం. రోజువారి జీవితంలో ఎదురయ్యే ఫలితాలకు దుఃఖపడకుండా, సంతోషపడకుండా నిర్లిప్తంగా ఉండగలగడం. నిజానికి ఉపేక్ష అంటే ఉదాసీనంగా ఉండటం కాదు. సమచిత్తంతో ఉంటూ లక్ష్యసాధనను కొనసాగించడం.
5. వీర్యం : వీర్యమంటే మంచి ప్రయత్నం, గట్టి ప్రయత్నం. శాయశక్తులా కృషి చేసి కర్తవ్యాన్ని నెరవేర్చడం. ధర్మమైన పద్ధతిలో సర్వశక్తులూ ధారపోసి ఒక కార్యాన్ని సాధించడం.
6. క్షాంతి : క్షాంతి అంటే క్షమ, ఓర్పు, సహనం. ద్వేషాన్ని ద్వేషంతో ఎదుర్కోవడం కాకుండా క్షమతో ద్వేషాన్ని ఉపశమింపజేయడం. శాంతం కలిగి ఉండటం.
7. సత్యం : సత్యమంటే నిజం. ఎవరూ ఎప్పుడూ అబద్ధం చెప్పకూడదు. ఎప్పుడూ నిజమే చెప్పాలి.
8. అధిష్టానం : అధిష్టానం అంటే లక్ష్యం చేరుకోవాలంటే స్థిరసంకల్పం.
9. కరుణ : కరుణ అంటే సాటి మానవుల పట్ల చూపించే ప్రేమపూరితమైన దయ.
10. మైత్రి : మైత్రి అంటే స్నేహం. ప్రేమకన్నా మించింది. స్నేహితులకే కాకుండా శత్రువులకు గూడా స్నేహం అందించడం. సాటి మనుషులతోనే కాకుండా సకల జీవ రాశుల పట్ల ప్రేమతో, స్నేహంతో ఉండటం.
ఈ పది ఉత్తమ గుణాలను ప్రతి వ్యక్తి ఆచరించాలి. వీటిని ఆచరించడం బౌద్ధ ధర్మాన్ని పాటించడంలో ముఖ్యమైన భాగం.