Labels

01.తెలుగు - సౌందర్యం లలిత గీతాలు (1) 02.వ్యక్తిత్వ వికాసం (1) 03.కులం విశ్లేషణాత్మక వ్యాసం (1) 04.లెనిన్ : చారిత్రిక గతిని నిర్దేశించిన తాత్వికులు VIII (1) 05.కవితలు (1) 06.చారిత్రికగతిని నిర్దేశించిన తాత్వికులు (1) 07.ది బైబిల్(THE BIBIL) (1) 08.సాహిత్యం - చర్చ (1) 09.స్త్రీ - భావన (1) 10.INDIA ను సందర్శించిన విదేశీ యాత్రికులు సందర్శకులు (1) 11.సారస్వత వారసత్వ సంపద (1) 12.వ్యాసావళి (1) 13.తెలుగు - సౌందర్యం - సాహిత్య కళారూపాలు ( పద్యాలు ) (1) 14.ఫ్రాయిడ్ : చారిత్రక గతిని నిర్దేశించిన తాత్వికులు VII (1) 15.తెలుగు - సౌందర్యం - సాహిత్య కళారూపాలు ( కీర్తనలు ) (1) 16. short film కథానికలు (1) 18.వేమన చారిత్రక గతిని నిర్దేశించిన తాత్వికులు V (1) 19.GK (1) 20.శతకం (1) 21.తెలుసుకుదాం (1) 22.జీసస్:చారిత్రక గతిని నిర్దేశించిన తాత్వివికుల part 5ు (1) 23. ప్రపంచ చరిత్ర 2 (1) 24.తాత్వికులు - భావనలు (1) 26.సోక్రటిస్ :చారిత్రికగతిని నిర్దేశించిన తాత్వికులPart II (1) 27.స్టాలిన్ :చారిత్రికగతిని నిర్దేశించిన తాత్వికులు IX (1) 28.చరిత్ర -స్త్రీల పాత్ర (1) 29.భారత రాజ్యాంగం (1) 30.కార్లమార్క్స్ చారిత్రక గతిని నిర్దేశించిన తాత్వికులు కార్లమార్క్స్ VI (1) 31.MATHAMATICS (1) 32.ఋగ్వేదం చర్చ (1) 33.కాలమానం (1) 34.అంబేద్కర్ (1) 35.స్పోర్టకస్ : చారిత్రికగతిని నిర్దేశించిన P IIIతాత్వికులు (1) 36.ప్రపంచ చరిత 3 (History) (1) 37.చారిత్రక గతిని నిర్దేశించిన తాత్వికులు మావో part X (1) 38.Spoken english (1) 39.చారిత్రక గతిని నిర్దేశించిన తాత్వికులు -బుద్ధుడpart1cు (1) 40.pasta వంటకాలు (1) 41.దేశియ వైద్యం ఆయుర్వేదం (1) 42.AI TECH :ENGLISH GRAMMAR MADE EASY (1) 43.గుంటూరు చరిత్ర (1) 44.ప్రపంచ చరిత్ర 1 (1) 45.Coins and history (1) 46.LEARN HINDI हिंदी सीखेना ( హింది నేర్చుకుందాం ) (1) 47.తెలుగు కవులు తెలుగు భాష (1) 48.ప్రేమ Voyage of my life - part 3 (1) 50.CONCEPT (1) 51.ENGLISH LITERATURE (1) 52.సంస్కృత పాఠం (1) 53.AI prepared daily dairy emgaments (1) 54.చింతా సూక్తులు (1) 55.ఘంటసాల మధుర గాయకుడు (1) 56.satavahana (1) 57.A To Service centre social (1) 58.అరబ్బీ (Arabic) భాష నేర్చుకోవడం (1) 59.SUMMAR HOLIDAYS (1) 60.లత సాహిత్యం – ఒక పరిశీలన (1) 61.kondaveedu (1) 62.కవులు తులనాత్మక పరిశీలన William Shakespeare (1) 63.Buddha desalu (1) 64.కథానిక (1) 65.Alexander Graham ell (1) 66.కవులు తులనాత్మక పరిశీలన కాళిదాసు (1) 67.కవులు తులనాత్మక పరిశీలన (1) 68.గుణాఢ్యుడు (1) 69.Bible analysis (1) 70.Zoroastrianism (1) 71.మత్తయి సువార్త (1) 72.A list of important inventions in historyPART I (1) Chvl birthday 60th (1) Love story (1)
Showing posts with label 48.ప్రేమ Voyage of my life - part 3. Show all posts
Showing posts with label 48.ప్రేమ Voyage of my life - part 3. Show all posts

48.( Classic love )ప్రేమ "Voyage of My Life"part 3

                 P1 ప్రేమ ప్రయాణం
"Classic love" అనేది సాంప్రదాయ ప్రేమ భావనలను సూచిస్తుంది. ఇది సాధారణంగా కట్టుబాటు, త్యాగం, శాశ్వతత, మరియు హృదయపూర్వకతను ప్రతిబింబిస్తుంది. కొన్ని ముఖ్యమైన ఉదాహరణలు:
(ఇదిగో మీ వాక్యాన్ని తెలుగు లిపిలో, పదాలను మార్చకుండా, సూటిగా అనువదించాను:)

ప్రేమకథలు ఎన్నో పెళ్లి దగ్గరే ఆగిపోతాయి.
కులం, మతం, అంతస్తులు అడ్డు గోడలుగా నిలుస్తాయి.
కానీ ఆ అనుభూతి, అనుభవం మాత్రం
జీవిత శకటానికి అణు ఇంధనంలా పని చేసి
జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే మోహోన్నత శక్తి. ప్రేమ కుంది అంటే నమ్మలేం.

1. రామ-సీత ప్రేమ (Ram-Sita Love) – నిస్వార్థత, విధేయత, మరియు ధర్మబద్ధమైన ప్రేమకు ప్రతీక.

2. శ్రీకృష్ణ-రాధ ప్రేమ (Krishna-Radha Love) – భక్తి మరియు ఆధ్యాత్మిక ప్రేమకు ప్రతీక.

3. లైలా-మజ్ను (Laila-Majnu) – విపరీతమైన ప్రేమకోసం జీవితాన్ని అర్పించిన ప్రేమికుల కథ.

4. షేక్‌స్పియర్ యొక్క రోమియో-జూలియట్ (Romeo & Juliet) – ప్రేమ కోసం త్యాగానికి సంకేతం.

5. దేవదాస్-పార్వతి (Devdas-Parvati) – బాధతో నిండిన ఒక విషాద ప్రేమకథ.

నగుమోము కాంచినంతనే 
నీలాకాశ  నక్షత్రములు మెరిసెను , 
పలకరింపుకే కోయిల తన 
గొంతు  సవరించెనే 
ప్రకృతి పరవశంతో పులకించెనే
మేఘ ఘర్జనతో విద్యుత్ఘాతం నను 
తాక చేరేనే అనంత శక్తి నాలోన

 అది 1975 జులై నెల . నా వయస్సు 14 సంవత్సరాలు. నేను 9వ తరగతి చదువుతున్నా. ఆ రోజు స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్లేందుకు నడక దారిని పట్టాను. 6వ తరగతి చదివే ఒక చిన్న అబ్బాయి నా ముందే ప్రత్యక్షమయ్యాడు. తాను తన క్లాస్‌మేట్ గురించిన విషయాలు చెప్పడం ప్రారంభించాడు.

“రోజూ మా గర్ల్‌ఫ్రెండ్‌తో కలసి ఇంటికి వెళ్తాం. కానీ ఈ రోజు రాలేదు,” అని అతడు చెప్పాడు.
“అవునా?” అని నేను అడిగాను.

మేమిద్దరం మాట్లాడుకుంటూ మూడు కిలోమీటర్లు నడిచి, అక్కడినుండి మా తాలుకు గమ్యాలకు చేరుకున్నాం. ఆ రోజు గడచింది. 
p2 దారిలో ఝాన్సీ తో పరిచయం 
మరుసటి రోజు, స్కూల్ ముగిసింది. నేను మళ్లీ నడక దారిన ఇంటికి బయలుదేరాను. అప్పుడే నిన్న కలిసిన ఆ అబ్బాయి మళ్లీ ప్రత్యక్షమయ్యాడు. అతడి పక్కన ఒక అమ్మాయి కూడా ఉంది.
“ఈమె ఝాన్సీ. నా క్లాస్‌మేట్. 6వ తరగతి ,” అని అతడు పరిచయం చేశాడు.ఝాన్సీ కొంచెం మొహమాటంతో ఉన్నట్టుగా కనిపించింది. ఆమె తలదించుకుని నన్ను గమనించింది. 
నేను మామూలుగానే నవ్వి, “హాయ్” అన్నాను.ఆరోజు ముగిసింది.ముగ్గురం కబుర్లు చెప్పుకుంటూ (వేర్వేరు గమ్యాలు) ఇంటికి చేరాము.

        తరువాత రోజులు మేమిద్దరమే. ఝాన్సీ నేను,ఇంటికి వెళ్లేప్పుడు కలిసి వెళ్ళేవాళ్ళం.

P3 in the bus
(బస్సు కూడా ఎక్కుతాము 15 పైసలు టికట్టు)
రోజులు ఆనందభరితంగా గడుస్తున్నాయి కలిసి స్కూల్‌కు రావడం, కలిసి ఇంటికి వెళ్ళడం మాకు దినచర్యగా మారింది. మా అనుబంధం క్రమంగా బలపడింది. 

   ఒకరోజు స్కూల్‌ అయినాక , బస్సులో ఝాన్సీ నేను కలిసి ఇంటికి వెళ్తున్నాము. తను ముందే సీటులో కూర్చొంది. తన పక్కన ఉన్న సీటును చూపిస్తూ, "ఇక్కడ కూర్చో," అని నన్ను పిలిచింది. తన మాటలు వీనుల విందుగా అనిపించాయి. నేను పక్కన కూర్చున్నప్పుడు మా చేతులు  స్వల్పంగా తాకాయి.ఆ క్షణం నాకు సంతోషం, ఆనందం  అనుభూతి ఒకేసారి కలిగాయి. నా మనస్సు ప్రేమతో నిండిపోయింది , మనసు లో  ప్రశాంతత . ఆ బస్సు ప్రయాణం నా జీవితంలో మరచిపోలేని జ్ఞాపకంగా నిలిచిపోయింది 
మా బంధం ఓ అమాయకత్వపు తీయని గాథగా కొనసాగింది...
P4 waiting for bus
ఋతువులు మారుతున్నాయి. వసంతం పూల సుగంధాన్ని చుట్టుముట్టగా, వర్షాకాలం చిరు జలదారలతో మనసుల్ని తడిమింది. చలికాలం చల్లని గాలులతో కొత్త అనుభూతులను జతచేసింది. ఎండాకాలం, వెచ్చని రాత్రుల నీడన, ఇద్దరి అనుబంధం మరింత బలపడింది.

రాత్రి నిద్రలోకి జారుకున్న నాకు తనతో గడిపిన తరుణాలు ఊసుల అలజడి 
కానీ, ఉదయం సూర్యుడు ఆకాశపు పల్లకిలోంచి పరుగెత్తుకుంటూ వచ్చి నన్ను మెలకువలోకి లాగాడు.

తన జ్ఞాపకాలు మెదడు పొరల్లో మెదిలి,
నా మనసును తట్టాయి .ఝాన్సీ ని స్కూల్‌లో కలవాలన్న  కోరిక ,చిలిపి వెలుతురు కళ్ళలోకి పడుతుంటే.
ప్రతి క్షణం తనతోనే నడుస్తున్న అనుభూతితో నేను నా జీవిత ప్రయాణం మొదలెట్టాను.

సంవత్సరం కాలం ఉరుకుల పరుగులతో గడిచిపోయింది. రోజు కలిసి స్కూల్‌కి రావడం, వెళ్లడం, తీపి మాటలతో సమయాన్ని గడపడం, ఆత్మీయతను మరింత గాఢం చేసింది. జీవన ప్రవాహంలో తను లేకుండా రోజులు ఊహించలేనివిగా మారాయి.

ఒక రోజు స్కూల్ సెలవులు ఇచ్చారని తెలియజేసినప్పుడు, నాలో విచారం  మేఘమాలలా కమ్ముకుంది. కానీ ఆ బాధ నా హృదయాన్ని తనకు మరింత దగ్గరగా చేర్చింది. మరోసారి కలిసే దినం కోసం తియ్యని ఎదురు చూపులు ఆరంభమయ్యాయి.

ఈ జ్ఞాపకం, నా జీవితం లో ఒక ముఖ్యమైన మలుపు అనిపిస్తుంది. 
1976 జూన్ నెలలో నేను మా తల్లి గారు స్కూల్ కు వచ్చాము . ఆ సమయంలో 10వ తరగతి చదవడానికి నేను ఏలూరు వెళ్లాలని నిర్ణయించుకున్నాను. నాన్న యొక్క జాబ్ కారణంగా. ఝాన్సీని, నేను చదివిన  స్కూల్ని (8th,9th) విడిచి పోవడం చాలా కష్టంగా అనిపించింది.ఝాన్సీ తన స్నేతురాళ్ళతో వచ్చి నాకు వీడ్కోలు చెప్పింది.

అయితే, నా ప్రయాణం ఏటో! ముందుకు సాగిపోయింది. 1976 goodby 
***
1976-1977 10th class eluru 1977 వేసవి సెలవులలో ఒక్క సారి మాత్రమే ఝాన్సీని చూసే అవకాశం కలిగింది 
1977 to 1978 Ist inter బందర్ noble college మళ్ళీ వేసవి సెలవులలో ఒక్క సారి మాత్రమే ఝాన్సీని చూసే అవకాశం కలిగింది.
1978-1979 IInd inter 

P5 meet at cousin house 

1979 నేను ఇంటర్మీడియట్ (ద్వితీయ సంవత్సరం) బందరు లో చదువుతున్నాను. ఝాన్సీ తొమ్మిదో తరగతి నేతాజీ ట్యూటరియల్స్ లో చదువుతుంది దువుతోంది. మా చదువు ప్రదేశాలు వేర్వేరు అయినా, మా మనసులు ఒక్కటే.3 సంత్సరాల మౌన ప్రయాణం 
అది 1979: జాన్సీతో తిరిగి అనుభవాలు పంచుకున్న తరుణం 

1979లో నేను( 18 సంవత్సరాలు), జాన్సీ 14. ఇద్దరం school దగ్గర అనుకోకుండా కలిసాను.మా పెదనాన్న గారి మరణం కారణంగా ఝాన్సీ తో కలిసి మా కజిన్ సిస్టర్ లక్ష్మి ఇంటికి పరామర్శించడానికి తన కోరిక మేరకు వెళ్లాము . లక్ష్మి, జాన్సీకి జూనియర్,  స్నేహితులు కూడా 

ముగ్గురం (1. జాన్సీ, 2. నేను, 3. జాన్సీ ఫ్రెండ్) కలిసి 2 కిలోమీటర్లు నడుచుకుంటూ మా cousin లక్ష్మి ఇంటికి చేరాము., జాన్సీతో అనుకోకుండా జరిగిన సంభాషణలు నాకు ఆ సమయంలో ఒక కొత్త అనుభూతిని మిగిల్చాయి.

మళ్ళీ మేము నడుస్తూ స్కూలు వరకు తిరిగి వచ్చాము. ఈ క్రమంలో జాన్సీతో గడిపిన 3 గంటల సమయం నాకు ఎంతో ప్రత్యేకమైంది. తన్ను చూస్తూ ఆ క్షణాల్లో జాన్సీతో పంచుకున్న మాటలు, భావనలు నా జీవితంలో ఒక ముఖ్యమైన స్మృతిగా నిలిచిపోయింది.

Love Proposal Episode 

1979 సెప్టెంబర్ నెల IInd Inter supploment exams prepare అవుతున్నాను.మా friend ఇంటి దగ్గరనుండి రాత్రి 9 నుండి 12 గంటల సమయం  నేను ప్రేమ లేఖ వ్రాసాను next day post చేశాను .తరువాత రెండు రోజులకు నాకు ఝాన్సీ విముఖంగా ఉన్నట్టు జవాబు పంపింది. మాది 4 ఏళ్ల  పరిచయం. హృదయం భారంగా తోచింది. రాత్రి అంతా నిద్రలేదు నా మనసులోని భావాల్ని తెల్లవారు జాము 4గంటల సమయం,పేపర్ మీద పెట్టాను. ఘాటుగా ఆఖరి ఉత్తరం వ్రాసాను. ఝాన్సీ నేను నీవాడ్ని మన ప్రేమ పెళ్ళికి బాటలు వేయకపోయినా నీ మీద ప్రేమ నిజం. వచ్చే జన్మలో నువ్వు నేనుఇద్దరం అమ్మాయిలు గానో అబ్బాయిలు గానో జన్మించి ఏ శక్తి విడదీయలేని friends జీవిత కాలం ఉందాం సెలవు అంటూ.
     రెండు రోజుల తర్వాత  ఝాన్సీ దగ్గర నుండి  ప్రత్యుత్తరం వచ్చింది ప్రేమను అంగీకరిస్తూన్నట్టు.నా జన్మ ధన్యమైంది. నా ఆనందానికి అవధులు లేవు. అంబరాన్ని తాకింది. ప్రేమ ఫలించింది.

Over view 
మా విద్యాభ్యాస ప్రయాణం:
1.1975-76:
నేను 9వ తరగతి గుంటూరు
ఝాన్సీ 6వ తరగతి గుంటూరు
2.1976-77:
నేను 10వ తరగతి ఏలూరు
ఝాన్సీ 7వ తరగతి గుంటూరు
3.1977-78:
నేను ఇంటర్మీడియట్ (1వ సంవత్సరం) మచిలీపట్టణం
ఝాన్సీ 8వ తరగతి గుంటూరు
4.1978-79:
నేను ఇంటర్మీడియట్ (2వ సంవత్సరం) మచిలీపట్టణం
ఝాన్సీ 9వ తరగతి గుంటూరు
5.1979-80:job training 
6.1980 10th march గుడివాడ
నేను ఉద్యోగంలో చేరాను 
ఝాన్సీ 10వ తరగతి గుంటూరు
7.1981-82:
నేను ఉద్యోగం చేస్తూ బీకామ్  (1వ సంవత్సరం) గుంటూరు
ఝాన్సీ ఇంటర్మీడియట్ (1వ సంవత్సరం) గుంటూరు నేను college కి వెళ్లేప్పుడు కలిసేవాడ్ని తను నాతో తక్కువ మాట్లాడేది reserved ఉండేది .
P6 At Collage 
8.1982-83:నేను ఉద్యోగం చేస్తూ గుంటూరు 
ఝాన్సీ ఇంటర్మీడియట్ (2వ సంవత్సరం) గుంటూరు
మా విద్యాభ్యాస ప్రదేశాలు వేర్వేరు అయినా, మా ప్రేమ మా మధ్య దూరాన్ని ఎదుర్కొని, దృఢమైన అనుబంధంగా మారింది. ఝాన్సీ ప్రతి సందేశం, ఆలోచన, నాకు నూతన శక్తిని ఇచ్చింది. నేను ఆమె కోసం రాసిన భావోద్వేగ కవితలు, పాటలు నా మనసులో అమరమైన జ్ఞాపకాలు. మా అనుబంధం, మా ప్రేమ నాకు నా జీవనయాత్రలో ప్రతి కష్టాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని ఇచ్చింది. ప్రేయసి ఝాన్సీ నా జీవితంలోని ఒక చిరస్మరణీయ అధ్యాయం.

P7 To met at college 
Jhansi మరియు jhansi sister ఇద్దరు same college నాకు చాలాసార్లు తారసపడ్డారు మౌనంగా చూస్తూ వారిముందు నడిచేవాడ్ని.

P8  Giving letter to marry 

P9 hero
P10 childhood friends at school

P11 every day meet at tree
ప్రేమ కథ (ఇంకా వుంది)