చారిత్రిక గతిని నిర్దేశించిన తాత్వికులు
1.బుద్దుడు - (563 - 483 BCE)
గతి తార్కిక భౌతికవాదం
@సమాజం వసుదైకకుటుంబం నమూన. తాత్వికులు సమాజంతో మమేకమై వారి కాలచక్రపరిధిని దాటి ఆలోచించారు . సమాజానికి నూతనమార్గాన్ని నిర్దేశించారు
అజ్ఞానపు టంధయుగంలొ ఆకలిలొ,ఆవేశంలో తెలియని ఏ తీవ్రశక్తులో నడిపిస్తే నడిచి మనుష్యులు అంతా తమప్రయోజకత్వం తామేభువికధినాధులమని స్థాపించిన సామ్రాజ్యాలునిర్మించిన క్రుత్రిమ చట్టాలు ఇతరత్రా శక్తులు లేస్తేనే పెకమేడలై పరస్పరం సంఘర్షించిన శక్తులతో చరిత్ర పుట్టింది. శ్రీ శ్రీ
నేను సైతం ప్రపంచానికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను
నేను సైతం విశ్వ వృష్టికి అశృవువొక్కటి ధారవోసాను
నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక పిచ్చి మొసానూ) -శ్రీ శ్రీ
@తాత్వికుల భావాలు, భావజాలాలు కాల పరంపరలో మన మధ్య సజీవంగా ఉంటాయి.
@బుద్ధుడు (563 - 483 BCE)
ప్రతిత్యసముత్పాద,పటిచ్చసముప్పద
(కార్యకారణత్వం )
(ఒక దాని కారణంగా మరొకటి జరగడం)
(గతి తార్కిక భౌతికవాదం )
@తనకాలపు పరిస్తుతుల మానసిక సంఘర్షణ లోనుంచి స్వీయ సాక్షాత్కారం,స్వీయ ప్రభోదాన్ని పొందాడు ప్రపంచానికి ఒక నూతన మార్గాన్ని నిర్దేశించాడు
@తన ముందు తరం యొక్క భావాలు భావజాలాల నుండి నూతన భావజాలాన్ని ప్రపంచానికి అందించి తరువాత తరాల తాత్వికులకు,తత్త్వవేత్తలకు మార్గం సుగమం చేయడమే కాకుండా తన ముందు, తర్వాత తరాల వారికీ వారధి గా నిలిచాడు.