02.బౌద్ధం ప్రాచీన నాగరికతలు

బౌద్ధం ప్రాచీన నాగరికతలు

ప్రాచీన నాగరికతలు | Ancient Civilizations

1. మెసొపొటేమియా (Mesopotamia) – 3500 BCE

2. ఈజిప్ట్ (Egypt) – 3100 BCE

3. ఇండస్ లోయ (Indus Valley) – 2600 BCE

సింధు లోయ నాగరికత
దక్షిణాసియాలో కాంస్య యుగం నాగరికత

సింధు లోయ నాగరికత (సా.పూ 2500-1750) ప్రస్తుత భారత దేశం, పాకిస్తాన్ లోగల గగ్గర్ హక్రా, సింధు నదుల పరీవాహక ప్రాంతంలో విలసిల్లిన అతి ప్రాచీన నాగరికత. ఇది ప్రాథమికంగా పాకిస్థాన్‌లో గల సింధ్, పంజాబ్ ప్రావిన్సులలో, పశ్చిమం వైపు బెలూచిస్తాన్ ప్రావిన్సు వైపుకు కేంద్రీకృతమైనట్లు తెలుస్తుంది. ఇంకా ఆఫ్ఘనిస్తాన్, తుర్కమేనిస్తాన్, ఇరాన్ దేశాలలో కూడా ఈ నాగరికతకు సంబంధించిన శిథిలాలను వెలికి తీయడం జరిగింది. ఈ నాగరికతకు చెందిన హరప్పా నగరం మొదటగా వెలికి తీయుటచే ఇది సింధు లోయ హరప్పా నాగరికత అని పిలువబడుతున్నది. సింధు నాగరికత మెసొపొటేమియా, ప్రాచీన ఈజిప్టు కంచు యుగాలకు సమకాలికమైన అతి ప్రాచీన నాగరికతల్లో ఒకటి. అత్యంత అభివృద్ధి చెందిన దశగా గుర్తించబడిన నాగరికతను హరప్పా నాగరికతగా పేర్కొంటారు. ఈ నాగరికతకు సంబంధించిన తవ్వకాలు 1920వ సంవత్సరం నుండి జరుగుతున్నా అత్యంత ప్రాముఖ్యత కలిగిన వివరాలు మాత్రం 1999లోనే వెలువడ్డాయి.

మానవుడు కంచును వాడిన చారిత్రిక కాలాన్ని కంచుయుగం అంటారు. కొన్ని ప్రాంతాల లోని ఆదిమ కాలపు రాతలను, పట్టణ నాగరికతల తొలినాళ్ళను కూడా కంచుయుగం గానే భావిస్తారు. పురాతన సమాజాలను వర్గీకరించడానికి, అధ్యయనం చేయడానికీ క్రిస్టియన్ జుర్గెన్సెన్ థామ్సన్ ప్రతిపాదించిన రాతి-కంచు-ఇనుప అనే మూడు యుగాల వర్గీకరణలో రెండవది కంచుయుగం.

రాగిని కరిగించి, దానికి తగరం, ఆర్సెనిక్ లేదా ఇతర లోహాలను కలిపి కంచును తయారు చేయడం గాని. ఇతర ప్రాంతాలలో తయారైన ఉత్పత్తిని కొనుగోలు చేయడం గానీ చేసిన కాలాన్ని కంచుయుగంగా భావిస్తారు. ఆ కాలం నాటి ఇతర లోహాల కంటే కంచు దృఢమైనది, మన్నికైనదీ. దీంతో ఆనాటి నాగరికతలు సాంకేతికంగా పైచేయి పొందగలిగాయి.

భూమిలో ఇనుము సమృద్ధిగా లభిస్తున్నప్పటికీ దాని అధిక ద్రవీభవన స్థానం - 1,538 ° సెం (2,800 ° ఫా) - కారణంగా క్రీ.పూ రెండవ సహస్రాబ్ది చివరి వరకు ఇనుము వాడకం జరగలేదు. తగరం ద్రవీభవన స్థానం బాగా తక్కువ - 231.9 ° సెం (449.4 ° ఫా). రాగి కూడా ఇనుము కంటే బాగా తక్కువ ఉష్ణోగ్రత వద్దనే కరుగుతుంది - 1,085 ° సెం (1,985 ° ఫా). క్రీ.పూ 6000 నాటి కొత్త రాతియుగపు బట్టీల ఉష్ణోగ్రత సామర్థ్యం 900 ° సెం (1,650 ° ఫా) కంటే ఎక్కువగానే ఉండేది. రాగి, తగరాలను కరిగించడానికి ఈ బట్టీల సామర్థ్యం సరిపోయేది.

కంచుయుగ నాగరికతల్లో రాయడం మొదలవడం విభిన్న కాలాల్లో జరిగింది. పురావస్తు ఆధారాల ప్రకారం, మెసొపొటేమియా (క్యూనిఫాం స్క్రిప్టు), ఈజిప్టు (హైరోగ్లిఫ్సు) నాగరికతలు మొట్టమొదటి రాత వ్యవస్థలను అభివృద్ధి చేశాయి.

పశ్చిమ ఆసియా, సమీప ప్రాచ్య ప్రాంతం కంచుయుగంలోకి ప్రవేశించిన మొదటి ప్రాంతం. క్రీ.పూ. 4 వ సహస్రాబ్ది మధ్యలో సుమేరులో మెసొపొటేమియను నాగరికత అభివృద్ధి చెందడంతో ఇది మొదలైంది. సమీప ప్రాచ్యంలోని ప్రాచీన నాగరికతల ప్రజలు ఏడాది పొడుగూతా వ్యవసాయం చేసారు, వ్రాతవిధాన వ్యవస్థను అభివృద్ధి చేశారు, కుమ్మరి చక్రాన్ని కనుగొన్నారు. కేంద్రీకృత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసారు, వ్రాతపూర్వక చట్టాన్ని నిర్మించారు. నగర రాజ్యాలు, సామ్రాజ్యాలు ఏర్పాటు చేసారు, ఆధునిక నిర్మాణాలను ప్రారంభించారు. సామాజిక వర్గీకరణ, ఆర్థిక - పౌర పరిపాలన, బానిసత్వాలను సృష్టించారు. వ్యవస్థీకృత యుద్ధం, వైద్యం, మతాలను ఆచరించారు. ఈ ప్రాంతంలోని సమాజాలే ఖగోళ శాస్త్రం, గణితం, జ్యోతిషశాస్త్రాలకు పునాదులు వేశాయి.

4. చైనా (China) – 2100 BCE