Showing posts with label 01.05.M.తెలుగు తత్వ – భక్తి సాహిత్యం. Show all posts
Showing posts with label 01.05.M.తెలుగు తత్వ – భక్తి సాహిత్యం. Show all posts

01.05.M.తెలుగు తత్వ – భక్తి సాహిత్యం

తెలుగు తత్వ – భక్తి సాహిత్యం

వేమన • అన్నమయ్య • రామదాసు


వేమన పద్యాలు

అల్పుడెపుడు బల్కు నాడంబరముగాను
సజ్జనుండు పలుకు చల్లగాను
కంచుమ్రోగినట్లు కనకంబుమ్రోగునా
విశ్వదాభిరామ వినురవేమ.

కొన్ని పద్యాల్లో ముందే సామ్యం చెప్పి, తరువాత నీతిని చెబుతాడు.

అనగననగరాగ మతిశయించునుండు
తినగ తినగ వేము తియ్యనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వదాభిరామ వినుర వేమ.

తాళ్లపాక అన్నమాచార్య

రాగము: పాడి

వేదం బెవ్వని వెదకెడిని
ఆ దేవునిఁ గొనియాడుఁడీ ॥వేదం॥

అలరిన చైతన్యాత్మకుఁ డెవ్వఁడు
కలఁ డెవ్వఁ డెచటఁ గలఁ డనిన
తలఁతు రెవ్వనినిఁ దనువియోగదశ
యిల నాతని భజియించుఁడీ ॥వేదం॥

కడఁగి సకలరక్షకుఁ డిందెవ్వఁడు
వడి నింతయు నెవ్వని మయము
పిడికిట తృప్తులు పితరు లెవ్వనినిఁ
దడవిన ఘనుఁ డాతనిఁ గనుఁడీ ॥వేదం॥

కదిసి సకలలోకంబులవారలు
యిదివో కొలిచెద రెవ్వనిని
త్రిదశవంద్యుఁడగు తిరువేంకటపతి
వెదకి వెదకి సేవించుఁడీ ॥వేదం॥

భద్రాచల రామదాసు

రాగము: నాదనామక్రియ – ఆది

పల్లవి:

ఏతీరుగ నను దయజూచెదవో యినవంశోత్తమరామా
నాతరమా భవసాగరమీదను నళినదళేక్షణరామా ఏ..

చరణములు:

శ్రీరఘునందన సీతారమణా శ్రితజనపోషక రామా
కారుణ్యాలయ భక్తవరద నిను కన్నదికానుపు రామా..

మురిపెముతో నాస్వామివి నీవని ముందుగ దెల్పితి రామా
మరువక యిక నభిమానముంచు నీమరుగు జొచ్చితిని రామా ఏ..

క్రూరకర్మములు నేరకచేసితి నేరములెంచకు రామా
దారిద్ర్యము పరిహారముచేయవె దైవశిఖామణి రామా ఏ..

గురుడవు నామది దైవము నీవని గురుశాస్త్రంబులు రామా
గురుదైవంబని యెరుగక తిరిగెడు క్రూరుడనైతిని రామా ఏ..

నిండితి నీవఖిలాండకోటి బ్రహ్మాండములందున రామా
నిండుగ మది నీనామము దలచిన నిత్యానందము రామా ఏ..

వాసవకమల భవాసురవందిత వారధి బంధన రామా
భాసురవర సద్గుణములు గల్గిన భద్రాద్రీశ్వర రామా ఏ..

వాసవనుత రామదాస పోషక వందన మయోధ్యరామా
దాసార్చిత మాకభయ మొసంగవె దాశరథీ రఘురామా ఏ..

వేమనలో తత్వం, అన్నమయ్యలో భక్తి, రామదాసులో ఆర్తి — తెలుగు సాహిత్య మహోన్నత సంపద.


SEO Details

Meta Title: వేమన అన్నమయ్య రామదాసు | తెలుగు తత్వ భక్తి సాహిత్యం

Meta Description: వేమన పద్యాలు, తాళ్లపాక అన్నమాచార్య సంకీర్తనలు, భద్రాచల రామదాసు కీర్తనలు – తెలుగు తత్వ, భక్తి సాహిత్య సంపద.

Keywords: వేమన, అన్నమయ్య, రామదాసు, Telugu Bhakti Songs, Telugu Literature, Vemana Padyalu, Annamayya Keerthanalu

CONCEPT ( development of human relations and human resources )