Showing posts with label వేమన 2. Show all posts
Showing posts with label వేమన 2. Show all posts

14.7.26

వేమన 2 (1-4)

📖వేమన భావజాలం


 వేమన పద్యాలు  


1.ప్రేరణ          U               ఆత్మశుద్ధి లేని యాచారమది యేల?
భాండశుద్ధి లేని పాకమేల?
చిత్తశుద్ధి లేని శివపూజలేలరా?
విశ్వదాభిరామ వినుర వేమ।

1. తాత్పర్యము

మనసు పవిత్రంగా లేకుండా చేసే ఆచారాలకు విలువ లేదు. శుభ్రం కాని పాత్రలో వండిన ఆహారం ఎలా పనికిరాదో, అలాగే చిత్తశుద్ధి లేకుండా చేసే దేవుని పూజ కూడా నిష్ఫలమని వేమన చెబుతున్నాడు.


ప్రేరణ U

2.నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు;
1*తళుకు బెళుకు రాళ్లు తట్టెడేల?
చదువ పద్యమరయ జాలదా యొక్కటి?
విశ్వదాభిరామ వినుర వేమ।

2. తాత్పర్యము

నిజమైన విలువ కలిగిన ఒక మంచి రత్నం చాలును; వెలుపల మెరుస్తున్న అనేక రాళ్లు అవసరం లేదు. అలాగే అర్థవంతమైన ఒక మంచి పద్యం, అనేక నిరర్థక పద్యాలకంటే గొప్పదని వేమన భావం.


3.Relegious 

నిన్ను జూచెనేని తన్ను తా మరచును;
తన్ను జూచెనేని నిన్ను మరచు;
నేవిధమున జనుడు నెరుగు నిన్నును దన్ను?
విశ్వదాభిరామ వినుర వేమ।

3. తాత్పర్యము

దేవుని ధ్యానంలో మనిషి తనను తాను మరచిపోతాడు; తన స్వార్థంలో మునిగితే దేవుని మరచిపోతాడు. ఆత్మజ్ఞానం మరియు దైవజ్ఞానం మధ్య ఉన్న సంబంధాన్ని ఈ పద్యం తెలియజేస్తుంది.


4.తాత్విక 

మురియు వాడెవండు? మురియని దెవ్వండు?
పాటు జేసి చూడ బట్టబయలు;
1*సౌరది  జలఘటమున సూర్యుని చందంబు।
విశ్వదాభిరామ వినుర వేమ।

4. తాత్పర్యము

ఎవరు  నశించేవారు? ఎవరు  నశించనివారు? అనే విషయాన్ని లోతుగా ఆలోచించి తెలుసుకోవాలని వేమన సూచిస్తున్నాడు. నీటి పాత్రలో సూర్యుని ప్రతిబింబంలా జీవితం తాత్కాలికమని తెలియజేస్తున్నాడు.

CONCEPT ( development of human relations and human resources )