02.బుద్ధుడు

🪷 గౌతమ బుద్ధుడు – తత్వం, బోధనలు, చారిత్రక ప్రభావం

Buddha – Philosophy, Four Noble Truths, Eightfold Path & Human Values


📜 బుద్ధుని జీవితం | Life of Buddha

  • గౌతమ బుద్ధుడు క్రీ.పూ. 563లో లుంబినిలో జన్మించాడు.
  • తండ్రి – శుద్ధోదనుడు, తల్లి – మాయాదేవి.
  • తొలి పేరు సిద్ధార్థుడు.
  • యశోధరను వివాహం చేసుకొని రాహుల్ అనే కుమారునికి తండ్రయ్యాడు.
  • 29వ ఏట సత్యాన్వేషణ కోసం రాజభవనం విడిచాడు.
  • 35వ ఏట బోధి వృక్షం క్రింద జ్ఞానోదయం పొందాడు.
  • సారనాథ్‌లో మొదటి ధర్మచక్రప్రవర్తన బోధ చేశాడు.
  • 80వ ఏట కుశీనగరంలో మహాపరినిర్వాణం పొందాడు.

🌍 బుద్ధుని తత్వం | Philosophy

“All things appear and disappear because of the concurrence of causes and conditions.”

— Buddha

కారణాలు మరియు పరిస్థితుల సంయోగం వలన అన్ని వస్తువులు ఉద్భవించి అదృశ్యమవుతాయి. ఏదీ ఒంటరిగా ఉండదు; ప్రతిదీ పరస్పర సంబంధాలతోనే ఉంటుంది.

☸ నాలుగు ఆర్య సత్యాలు | Four Noble Truths

  • దుఃఖం – జీవితం దుఃఖమయమై ఉంటుంది.
  • దుఃఖ కారణం – తృష్ణ, కోరికలు.
  • దుఃఖ నివృత్తి – తృష్ణ నిర్మూలన.
  • దుఃఖ నివృత్తి మార్గం – అష్టాంగ మార్గం.

🛤 అష్టాంగ మార్గం | Noble Eightfold Path

  • సమ్యక్ దృష్టి
  • సమ్యక్ సంకల్పం
  • సమ్యక్ వాక్కు
  • సమ్యక్ కర్మ
  • సమ్యక్ జీవనం
  • సమ్యక్ ప్రయత్నం
  • సమ్యక్ స్మృతి
  • సమ్యక్ సమాధి

🪷 త్రిరత్నాలు | Tri Ratna

బుద్ధం శరణం గచ్ఛామి
ధర్మం శరణం గచ్ఛామి
సంఘం శరణం గచ్ఛామి

ఇక్కడ బుద్ధం అంటే జ్ఞానం, ధర్మం అంటే ప్రకృతి ధర్మం, సంఘం అంటే సమాజ జీవనం.

🕊 పంచశీల | Five Precepts

  • జీవహింస చేయరాదు
  • దొంగిలించరాదు
  • వ్యభిచరించరాదు
  • అబద్ధం చెప్పరాదు
  • మత్తు పదార్థాలు సేవించరాదు

🌸 దశపారమితలు | Ten Perfections

  • దానం
  • శీలం
  • నిష్కామం
  • ప్రజ్ఞ
  • వీర్యం
  • క్షాంతి
  • సత్యం
  • అధిష్టానం
  • మైత్రి
  • ఉపేక్ష

🌏 బుద్ధుని ప్రభావం | Influence of Buddha

బుద్ధుడు అహింస, కరుణ, మానవ సమానత్వం, మధ్యేమార్గం వంటి విలువలను ప్రపంచానికి అందించాడు. ఆయన బోధనలు భారతదేశం నుండి ఆసియా దేశాలవరకు వ్యాపించాయి.

“తృష్ణ దుఃఖానికి మూలం; తృష్ణ రాహిత్యం నిర్వాణం.”

CONCEPT : మానవ సంబంధాలు మరియు మానవ వనరుల అభివృద్ధి
✍️ Ch. Ramamohan BA.,

CONCEPT ( development of human relations and human resources )