Labels

01.01.చారిత్రిక గతిని నిర్దేశించిన తాత్వికులు బుద్ధుడు (1) 01.02.తాత్వికులు సోక్రటిస్ (1) 01.03. తాత్వికులు స్పోర్టకస్ (1) 01.03. తాత్వికులు స్పోర్టకస్🌐 (1) 01.04. తాత్వికులు జీసస్🌐 (1) 01.04. ది బైబిల్(THE BIBIL) చరిత్ర 📕 (1) 01.04.తాత్వికులు - భావనలు జీసస్ (1) 01.04.బైబిల్ విశ్లేషణ జీసస్ జర్నీ (1) 01.05.A.తాత్వికులు వేమన🌐 (1) 01.05.B.వేమన భావజాలం (1) 01.05.C.వేమన భావజాలం పద్యాలు లోకనీతులు (1) 01.05.D.వేమన శతకం (1) 01.05.E.వేమన ప్రసిద్ధ వ్యాఖ్యనాలు (1) 01.05.F.vemna charitea (1) 01.05.G.vemna charitea (1) 01.05.I.తెలుగు కవులు – బిరుదులు – కాలం (1) 01.05.J.పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి (1) 01.05.K.vemana 1400–1650 వాగ్గేయకారులు (1) 01.05.L.వేమన రామదాసు క్షేత్రయ్య | తెలుగు తత్వ భక్తి సాహిత్యం (1) 01.05.M.తెలుగు తత్వ – భక్తి సాహిత్యం (1) 01.05.N.వేమన ప్రశ్నలు జవాబులు (1) 01.05.O.వేమన భావజాలం | బుద్ధుడు (1) 01.05.P .వేమన భావజాలం – ముఖ్యాంశాలు (1) 01.05.Vemana అనువాదం (1) 01.05.చారిత్రక గతిని నిర్దేశించిన తాత్వికులు – వేమన (1) 01.05.చారిత్రిక వేమన జీసస్ (1) 01.05.వేమన ఎన్. గోపి – వేమనపై ఆధునిక పరిశోధన (1) 01.05.వేమన పద్యాలు సీపీ brown (1) 01.05.వేమన రాళ్లపల్లి (1) 01.05.వేమన లోక (1) 01.06.తాత్వికులు కారల్ మార్క్స్ (1) 01.06.తాత్వికులు కార్లమార్క్స్ 🌐 (1) 01.07. తాత్వికులు ఫ్రాయిడ్🌐 (1) 01.07.తాత్వికులు ఫ్రాయిడ్ (1) 01.07.తాత్వికులు ఫ్రౌయిడ్ (1) 01.08. తాత్వికులు లెనిన్ 🌐 (1) 01.08.తాత్వికులు లెనిన్ (1) 01.09.తాత్వికులు స్టాలిన్🌐 (1) 01.10. తాత్వికులు మావో 🌐 (1) 01.11.తాత్విక చింతన ఎరుక🌐 (1) 01.11.తాత్విక చింతన ద్వంద్వాలు🌐 (1) 01.11.తాత్విక చింతన పరిశీలన🌐 (1) 01.11.తాత్విక చింతన🌐 (1) 01.11.తాత్వికులు - భావనలు జాషువా (1) 01.11.తాత్వికులు - భావనలు సొలొమోను (1) 01.11.తాత్వికులు భావనలు సముద్రాల 🌐 (1) 01.Jesus and buddha comparitive study (1) 01.బుద్ధ నాగరికత & ఆర్య నాగరికత (1) 01.బుద్ధుడు తాత్విక చింతన (1) 01.బుద్ధుని జీవిత చరిత్ర (1) 01.బౌద్ధం అష్టాంగ మార్గం (1) 01.బౌద్ధ తత్వ సారాంశం (1) 01.బౌద్ధం భారతదేశం చరిత్ర (1) 01.బౌద్ధ భావజాలం (1) 01.బౌద్ధం శాతవాహన చరిత్ర (1) 01.బౌద్ధం హేరాక్లిటస్తా త్విక ధార (1) 01.మతాలు ఒకదానిపై మరొకటి చూపిన ప్రభావం (1) 01.మిలింద–నాగసేన సంభాషణ (1) 01బౌద్ధం నలంద విద్యాలయం (1) 01బౌద్ధ మగధ పూర్వ చరిత్ర (1) 02.A.బుద్ధుడు కులవ్యవస్థ (1) 02.A.బుద్ధుడు దశ పారమితలు (1) 02.A.బుద్ధుడు – బ్రాహ్మణులు శ్రమణులు (1) 02.A.బుద్ధుని బోధనలు (1) 02.A.బౌద్ధం ఇండియా ను సందర్శించిన విదేశీ యాత్రికులు సందర్శకులు (1) 02.A.బౌద్ధం జైనుల పురాణాలు (1) 02.A.బౌద్ధ తత్వంలో “18 Factors (1) 02.A.బౌద్ధం తాత్విక చింతన (1) 02.A.బౌద్ధం ప్రతీత్య మిధ్య మధ్యేవాదం (1) 02.A.బౌద్ధం ప్రతీత్య సముత్పాదం (1) 02.A.బౌద్ధం మతాలు తత్త్వ విజ్ఞానం (1) 02.A.బౌద్ధం వేదాలు – బ్రాహ్మణాలు (1) 02.A.బౌద్ధులు ఆర్యులు Alps పర్వతాల పశ్చిమ ప్రాంతంలోని యూరేషియన్ స్టెప్పెస్ (1) 02.C.బుద్ధుడు – జీసస్ : తులనాత్మక అధ్యయనం (1) 02.H.చరిత్ర అజంతా గుహల చరిత్ర (1) 02.H.బుద్ధిస్ట్ countries (1) 02.H.బుద్ధుడు LIPI (1) 02.H.బుద్ధుడు క్రీపూ 600 నుండి (1) 02.H.బైబిల్ ఈజిప్ట్ చరిత్ర (1) 02.H.బౌద్ధం ఋగ్వేద కాలం ముఖ్య రాజులు (1) 02.H.బౌద్ధం Cuneiform (1) 02.H.బౌద్ధం Dammalipi (1) 02.H.బౌద్ధ కాల Coins (1) 02.H.బౌద్ధం నాగరికత పట్టణీకరణ (1) 02.H.బౌద్ధం ప్రపంచ చరిత (1) 02.H.బౌద్ధం భారతదేశంలో లిపి పరిణామం (Evolution of Scripts in India) (1) 02.H.బౌద్ధం వేదాలు లిఖిత ఆధారాలు (1) 02.H.బౌద్ధాన్ని ఆదరించిన ప్రముఖ రాజులు (1) 02.L.బుద్ధ and పురాణస్ (1) 02.L.బుద్ధుడు అఖండ 33 హిందూ దేవతలు (1) 02.L.బుద్ధుడు ప్రముఖ గ్రంథాలు (1) 02.L.బుద్ధుడు బౌద్ధ మండలులు కాలక్రమం (1) 02.L.బుద్ధుడు సంస్క్రతం (1) 02.L.బౌద్ధం అభివృద్ధి (1) 02.L.బౌద్ధం జాతక కథలు (1) 02.L.బౌద్ధం పాణిని (1) 02.L.బౌద్ధం పురాణాలు (1) 02.L.బౌద్ధం పైసాచి భాష (1) 02.L.బౌద్ధం భారతదేశ పురాతన భాషలు (1) 02.L.బౌద్ధం మౌఖిక సాహిత్యం (1) 02.L.బౌద్ధం వేద గణితము (1) 02.L.బౌద్ధం సంగీతం సామవేదం (1) 02.P. రాహుల్ సాంకృత్యాయన్ (1) 02.P.బుద్ధుడు ఆచార్య నాగార్జునుడు (1) 02.P.బుద్ధుడు by అంబేద్కర్ (1) 02.P.బుద్ధుడు సుజాత (1) 02.P.బుద్ధుడు అశ్వాఘోషుడు (1) 02.P.బౌద్ధం అశోకుడు IQ (1) 02.P.బౌద్ధం చార్వాకుడు (1) 02.P.బౌద్ధ రచనలు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ (1) 02.PL.బుద్ధుడు తక్షశిల విద్యా కేంద్రం (1) 02.Pl.బౌద్ధ దేశాలు మాయన్మార్ (1) 02A.బుద్ధుడు ధ్యానం (1) 03. బైబిల్ తత్వ విచారణ (1) 03.Bible soecial persons (1) 03.Bible Special Persons (1) 03.The BIBLE.Soloman 📕 (1) 03.మత్తయి సువార్త📕 (1) 04..లత సాహిత్యం – omarkhayum🌐 (1) 04.CONCEPT తెలుగు వాచకము🌐 (1) 04.Puranadarafaskeertana Telugu sancrit kannada (1) 04.కవులు తిక్కన 📕 (1) 04.చలం - స్త్రీ - భావన🌐 (1) 04.చలం 🌐 (1) 04.తెలుగు - సౌందర్యం - సాహిత్య కళారూపాలు ( కీర్తనలు )🌐 (1) 04.తెలుగు - సౌందర్యం - సాహిత్య కళారూపాలు ( పద్యాలు )🌐 (1) 04.తెలుగు - సౌందర్యం లలిత గీతాలు📕 (1) 04.తెలుగు కవులు తెలుగు భాష📕 (1) 04.తెలుగు సాహిత్యం యుగ విభజన (1) 04.సాహిత్యం - చర్చ📕 (1) 05.Concept లైబ్రరీ (1) 05.వ్యక్తిత్వ వికాసం (1) 06. శతకములు (1) 07.inventions📕 (1) 07.క్రోమోజోములు🌐 (1) 07.తోకచుక్కలు Comet 3I/ATLAS@ (1) 08.The Bible Comparetive historical events (1) 08.కవితలు📕అప్పుడు – ఇప్పుడు (1) 08.కులం విశ్లేషణాత్మక వ్యాసం I 🌐 (1) 08.కులం విశ్లేషణాత్మక వ్యాసం II (1) 08.కులం విశ్లేషణాత్మక వ్యాసం III రిజర్వేషన్లు (1) 08.కులం విశ్లేషణాత్మక వ్యాసం IV SC/ST reservations and creamy layer (1) 08.ప్రపంచంలో న్యాయం కోసం జరిగిన ప్రజా పోరాటాలు (1) 08.వ్యాసావళి📕 (1) 08.షెడ్యూల్డ్ కులాలు V ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ — Scheduled Tribes (ST) (1) 09.కథానికలు: యుద్ధం🌐 (1) 09.కవిత జీవిత నిష్ఫలత (1) 09.కవితలు 🌐 (1) 09.నా కవితలు Part II (1) 09.పల్లెటూరు – చిన్నతనం జ్ఞాపకాలు (1) 09.పల్లెటూరు – చిన్నతనం జ్ఞాపకాలు (1965 తర్వాత) (1) 09.ప్రేమ సుధా మంజరి (1) 10.Bhaskarudu (1) 10.sama sangeta vedamu (1) 10.ఆర్యభట్టు (1) 10.గుణాఢ్యుడు🌐 (1) 10.చరిత్ర అంబేద్కర్@ (1) 10.చరిత్ర కాలమానం@ (1) 10.చరిత్ర గుంటూరు జ్ఞాపకాల నిలయం కొండవీడు ఆంధ్రప్రదేశ్ (1) 10.చరిత్ర గుప్త సామ్రాజ్యం🌐 (1) 10.చరిత్ర హంపీ చరిత్ర@ (1) 10.భాస్కరుడు సా.శ. 1114 (1) 10.మహర్షి పతంజలి🌐 (1) 10.వరాహమిహిరుడు (1) 10.హంపి (1) 11.ఆయుర్వేదం Ayurvedam🌐 (1) 11.గుండె ఆరోగ్యం & వాగ్భట జీ సూచనలు@ (1) 12.A.1.AMBEDKAR ERA (1) 12.A.1.Dr B.R Ambedkar EDUCATION (1) 12.A.1.Dr B.R Ambedkar EDUCATION political (1) 12.C.1.PRABHANDHA KAVULU (1) 12.The Chaniky (1) 141 (1) 18.Voyage of my life 2026 మే 11 తిరుపతి టూర్ (1) 18.చింతా వంశవృక్షం (1) Buddhudu-చారిత్రిక గతిని నిర్దేశించిన తాత్వికులు (1) E.Human relations Freedom (1) E.తెలుగు నేర్చుకోవడం చాలా సులభం (1) G.GARDEN GREEN (1) H. ఋగ్వేదం I (1) H. ఋగ్వేదం కాలం (1) H. పాలపుంత (1) H. సింధు నాగరికత (1) H. సింధు లోయ నాగరికత (1) H.Vedas timeline (1) H.ఉపనిషత్తులు (1) H.నన్నెచోడుడు (1) H.నన్నే చోడుడు (1) H.ప్రాచీన గ్రంధాలు (1) H.ప్రాచీన తెలుగు కవి నన్నెచోడుడు (1) H.బౌద్ధం మార్క్స్ (1) H.బౌద్ధం ప్రాచీన నాగరికతలు (2) H.బౌద్ధం శాస్త్రీయ నాగరికతలు (1) H.బ్రాహ్మీ లిపి – మూలం (1) H.భారతదేశం mini enxyclopedia (1) H.భారతదేశ సూక్ష్మ విజ్ఞానసర్వస్వం (2) H.భారతదేశ సూక్ష్మ విజ్ఞానసర్వస్వం తెలంగాణ (1) H.భారతీయ సంస్కృతి (1) H.రుగ్వేదం -కులం (1) H.సింధు లోయ నాగరికత (1) Lతెలుగు పద్యం (1) varahamihirudu (1) Vemana (1) ఆటవెలది తెలుగు కవితా వైభవం (1) జీసస్ (1) వేమన (3) వేమన 1 (1) వేమన 2 (1) వేమన 3 (1) వేమన 4 (1) వేమన 5 (1) వేమన 6 (1) వేమన 7 (1) వేమన 8 (1) వేమన 9 (1) వేమన * 101 (1) వేమన 1 (1) వేమన 10 (1) వేమన 100 (1) వేమన 102 (1) వేమన 103 (1) వేమన 104 (1) వేమన 105 (1) వేమన 106 (1) వేమన 107 (1) వేమన 108 (1) వేమన 109 (1) వేమన 11 (2) వేమన 111 (2) వేమన 112 (1) వేమన 113 (1) వేమన 114 (1) వేమన 115 (1) వేమన 116 (1) వేమన 117 (1) వేమన 118 (1) వేమన 119 (1) వేమన 12 (1) వేమన 120 (1) వేమన 121 (1) వేమన 122 (1) వేమన 123 (1) వేమన 124 (1) వేమన 125 (1) వేమన 126 (1) వేమన 127 (1) వేమన 128 (1) వేమన 129 (1) వేమన 13 (1) వేమన 130 (1) వేమన 131 (1) వేమన 136 (1) వేమన 137 (1) వేమన 138 (1) వేమన 139 (1) వేమన 14 (1) వేమన 140 (1) వేమన 142 (1) వేమన 143 (1) వేమన 144 (1) వేమన 145 (1) వేమన 146 (1) వేమన 147 (1) వేమన 148 (1) వేమన 149 (1) వేమన 15 (1) వేమన 150 (1) వేమన 151 (1) వేమన 152 (1) వేమన 153 (1) వేమన 154 (1) వేమన 155 (1) వేమన 156 (1) వేమన 157 (1) వేమన 158 (1) వేమన 159 (1) వేమన 16 (1) వేమన 17 (1) వేమన 18 (1) వేమన 19 (1) వేమన 1A (1) వేమన 20 (1) వేమన 21 (1) వేమన 22 (1) వేమన 23 (1) వేమన 24 (1) వేమన 25 (1) వేమన 26 (1) వేమన 27 (1) వేమన 28 (1) వేమన 29 (1) వేమన 30 (1) వేమన 31 (1) వేమన 32 (1) వేమన 33 (1) వేమన 34 (1) వేమన 35 (1) వేమన 36 (1) వేమన 37 (1) వేమన 38 (1) వేమన 39 (1) వేమన 40 (1) వేమన 41 (1) వేమన 42 (1) వేమన 43 (1) వేమన 44 (1) వేమన 45 (1) వేమన 46 (1) వేమన 47 (1) వేమన 48 (1) వేమన 49 (1) వేమన 50 (1) వేమన 51 (1) వేమన 52 (1) వేమన 53 (1) వేమన 54 (1) వేమన 55 (1) వేమన 56 (1) వేమన 57 (2) వేమన 59 (1) వేమన 60 (1) వేమన 61 (1) వేమన 62 (1) వేమన 63 (1) వేమన 64 (1) వేమన 65 (1) వేమన 66 (1) వేమన 67 (1) వేమన 68 (1) వేమన 69 (1) వేమన 70 (1) వేమన 71 (1) వేమన 72 (1) వేమన 73 (1) వేమన 74 (1) వేమన 75 (1) వేమన 76 (1) వేమన 77 (1) వేమన 78 (1) వేమన 79 (1) వేమన 80 (1) వేమన 81 (1) వేమన 82 (1) వేమన 83 (1) వేమన 84 (1) వేమన 85 (1) వేమన 86 (1) వేమన 87 (1) వేమన 88 (1) వేమన 89 (1) వేమన 90 (1) వేమన 91 (1) వేమన 92 (1) వేమన 93 (1) వేమన 94 (1) వేమన 95 (1) వేమన 96 (1) వేమన 97 (1) వేమన 98 (1) వేమన 99 (1) వేమన చరిత్ర గతిని నిర్దేశించిన తాత్వికులు (1) వేమన తెలుగు కవిత్వ వైభవం – మహాకవుల సాహిత్య సంపద (1) వేమన పద్యములు – కవితా వైశిష్ట్యం మరియు తాత్విక దర్శనం (1) వేమన భావజాలం (1) వేమన భావజాలం – పరిశోధన రూపరేఖ (1) వేమన శతకం ref books (1) వేమన స్పృశించిన ప్రధాన అంశాలు (1) సోక్రటిస్ తులనాత్మక తత్వ విశ్లేషణ” (1)

13.7.14

08.వ్యాసావళి కులం రంగనాయకమ్మ 📕

  --- రంగనాయకమ్మ🙏
✳️✳️✳️✳️
కుల గణన! మత గణన! వర్గ గణన!

సమస్య వెంటే పరిష్కారం! - రంగనాయకమ్మ
రంగనాయకమ్మ
సమాజంలో ఉన్న ప్రతీ మనిషీ శ్రమ చెయ్యాలని గ్రహించడమూ; ప్రతి మనిషీ శారీరక - మేధా శ్రమలు రెండూ చెయ్యాలని గ్రహించడమూ, మొదటి సంగతి. ఆ మార్పుల కోసం, శ్రామిక వర్గ పోరాటం అత్యవసరమని గ్రహించడం, మరో సంగతి. ఏ గ్రహింపూ లేకుండా, ‘కుల విధానాన్ని  తక్షణం నిర్మూలించాలి’ అంటూ అరిచే నినాదాలు ఆ నిర్మూలనకు ఏ మాత్రమూ పనికి రావు. పైగా ఆ శబ్దాలు, సిద్ధాంత శబ్ద కాలుష్యాన్ని మాత్రమే దట్టంగా సృష్టిస్తాయి.
‘కులాల విధానం’ అనే సమస్యకి పరిష్కారం, కులాంతర వివాహాలే. కుల విధానాన్ని అంగీకరించని వారందరూ గ్రహించవలసింది ఇదే. 

సమస్య ఉంటే, దాని వెంటే పరిష్కారం ఉంటుంది. సమస్య వల్ల బాధపడే వాళ్ళకి పరిష్కారం తెలియలేదంటే సమస్యే తెలియలేదని అర్థం.
కుల విధానం పుట్టుక గురించి మాట్లాడే వారు కొందరు, ‘చాతుర్వర్ణాలు’ అనే పేరుతో ‘బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర’ అంటూ మొదలు పెడతారు. అలా మొదలు పెట్టి, ఆ నాలుగు వర్ణాలూ, ఏ శ్రమల తోటీ, ఏ వృత్తుల తోటీ సంబంధాలు లేకుండా పుట్టుకొచ్చినట్టు చెప్పుకొస్తారు. ప్రతీ వర్ణమూ అనేక విభాగాలుగా వేరు వేరు వృత్తుల్లో నిమగ్నమై ఉండడమూ; ‘శూద్రులు’ అనే వర్ణం, అనేకానేక శారీరక శ్రమలు చేసే వృత్తులు గానూ, ప్రతీ వృత్తీ ఒక కులం గానూ ఏర్పరడమూ; ఇవన్నీ సమాజంలో స్పష్టంగా కనపడుతూ ఉన్నవే.

బట్టలు ఉతికే వృత్తి ఒక కులం. క్షవరాలు చేసే వృత్తి ఇంకో కులం. చేపలు పట్టే వృత్తి మరో కులం. నేతా, కుట్టూ, వేరు వేరు కులాలే. వృత్తులు మారినా, కలిసినా, కులాలు నిలబడే ఉండడం సంప్రదాయంగా సాగుతోంది. ఒక వృత్తినీ, దాని కులం పేరునీ చూస్తే, వృత్తి మొదటిదో, కులం మొదటిదో, తేలికగానే గ్రహించవచ్చు. శ్రమలే లేని కాలంలో వృత్తులు ఉండవు. వృత్తులే లేని కాలంలో, దానికి కులం పేరు ఏర్పడదు. 

ఒక కులం గల కుటుంబంలో ఒక పెళ్ళి జరగాలంటే, అదే కులం గల, అంటే అదే వృత్తి గల వ్యక్తే, ఆ కుటుంబంలోకి రావడం జరుగుతోంది. వివాహ సంబంధాలు ఏ కులానికి ఆ కులంలోనే ఏర్పడాలి - అనే సంప్రదాయానికి మూల కారణం, ‘ఒకే రకం వృత్తి’ అనేదే. అంటే, వృత్తిని బట్టే కులం. కులాన్ని బట్టే వివాహ సంప్రదాయం. అంటే, కులాలు పోవాలంటే, వృత్తుల విధానంలో పెద్ద మార్పు జరగాలని అర్థం.

‘కులాలు’ అన్నప్పుడు, అవి కేవలం వేరు వేరు భిన్న వృత్తులు మాత్రమే కాదు; ఆ వృత్తులకూ, వాటిని బట్టి ఆ కులాలకూ, చిన్నా - పెద్దా గుర్తింపులు కూడా ఏర్పడ్డాయి. అయితే, ‘వృత్తులు అన్ని దేశాల్లోనూ ఉన్నాయి. ఈ కుల విధానం ఈ దేశంలోనే ఎందుకు ఉంది?’ అనే ప్రశ్న తలెత్తుతుంది. ప్రశ్నలు ఎప్పుడూ మంచివి. కారణాల్ని గ్రహించాలనే ప్రయత్నాలు అవి. ఇతర దేశాల్లో ఉన్న వేరు వేరు చెత్త సంప్రదాయాలు ఈ దేశంలో లేవు. ఒక దేశంలో ఉన ్న మంచిగానీ చెడ్డగానీ, అదే రకంగా ప్రతీ చోటా ఉండడం లేదు. ఇక్కడి చెడ్డని మించిన చెడ్డ, అక్కడ ఉండవచ్చు. అక్కడి మంచిని మించిన మంచి, ఇక్కడ ఉండవచ్చు. ‘ఇక్కడ ఉన్నది అక్కడ లే దేం?’ ప్రశ్నకి జవాబు, ‘‘అక్కడ ఉన్నది ఇక్కడ లేదేం?’’ అనేదే.    మన దగ్గిర ఉన్నది చెడ్డే అని తెలిస్తే, దాన్ని మనం మార్చుకోవాలి ‘కుల విధానం’ పోవలిసిందే. కానీ ఎలాగ? పరిష్కారం కావాలంటే, సమస్యని సరిగా అర్థం చేసుకోవాలి.

ఇద్దరు వేరు వేరు కులాల వాళ్ళు స్నేహంగా ఉన్నా, ఆ కులాలు పోయినట్టు కాదు. ఆ ఇద్దరూ రోజూ కలిసి భోజనాలు చేస్తూ ఉన్నా, ఆ కులాలు పోయినట్టు కాదు. కాలేజీల్లో, స్నేహాలూ, హోటళ్ళలో పక్కపక్కనే కూర్చుని భోజనాలూ, ఇవన్నీ సాగుతూనే ఉన్నాయి. అయినా కులాలు కులాల్లాగే ఉంటున్నాయి.
ఇద్దరు చిన్నా పెద్దా కులాల స్ర్తీ పురుషులు, రహస్య సంబంధాలతో ఉంటే, కులాలు పోయినట్లు కాదు. ఆ సీ్త్ర పురుషులు బహిరంగంగా, పెళ్ళి తంతు ఉన్నా లేకపోయినా, భార్యాభర్తలుగా, కుటుంబ సంబంధాలతోనే, పిల్లలకు తల్లిదండ్రులు గానే, కలిసి జీవిస్తూ ఉంటే, అటువంటి సంబంధంలో బైల్దేరే పిల్లలకు ఏ కులాలూ లెక్కలోకి రావు. కానీ, రిజర్వేషన్‌ పద్ధతి సాగుతూనే ఉంటే, తండ్రి కులమో, తల్లి కులమో, ఏది చిన్న కులమైతే అది, ఆ పిల్లలకు కూడా చుట్టుకుంటుంది. తల్లి దండ్రులు కులాంతర వివాహం చేసుకున్నా, రిజర్వేషన్ల ద్వారా, పిల్లల తరానికి కూడా చిన్న కులాలు నిలిచిపోతాయి!

కులాంతర వివాహాలు, నూటికొకటో కోటి కొకటో జరగడం గాక, నిరభ్యంతరంగా జరిగే మార్గం ఏది? ఆ మార్గం ఏమిటో తెలుసుకోవాలంటే, కనీసం 100 కులాంతర వివాహాల్ని పరిశీలించి చూడాలి. ఈ పరిశీలనలో, రెడ్డి యువతికి మాల యువకుడితో పెళ్ళీ; బ్రాహ్మణ యువతికి, మాదిగ యువకుడితో పెళ్ళీ; వైశ్య యువకుడికి, మంగలి యువతితో పెళ్ళీ; ఇలా ఆ 100 పెళ్ళిళ్ళూ చిన్నా పెద్దా కులాల మధ్య జరగడం కనపడతాయి. అందులో కారణాల కోసం వెతికితే, చిన్న కులాల వ్యక్తులకు, వారి కుల వృత్తులు మారిపోవడమే కనపడుతుంది. ఒక బ్రాహ్మణ యువతికీ, ఒక టీచరుగా 
ఉన ్న మంగలి యువకుడికీ పెళ్ళి జరిగిందంటే, ఆ చిన్న కులం యువకుడికి విద్యా స్థాయి పెరిగి, తన కుల వృత్తి వదిలి, పై స్థాయి ఉద్యోగిగా మారడమే, పెద్ద కులం యువతితో పరిచయం, చివరికి పెళ్ళికి అంగీకారం!

చిన్న కులాల వ్యక్తులు, తమ కుల వృత్తుల్ని వదిలి వేస్తే, అప్పుడు సమాజానికి ఆ వృత్తులతో అవసరం ఎలా తీరుతుంది? ఈ నాడైతే, చిన్న కులాల్లో ఇంకా కుల వృత్తుల్ని వదలని వాళ్ళ ద్వారానే, సమాజ అవసరాలు తీరుతున్నాయి. కానీ, ఒక క్షవరాల కులంలో అందరూ కుల వృత్తిని వదిలేస్తే, అప్పుడేమవుతుంది? - సమాజానికి అవసరమైన ప్రతీ శ్రమనీ నిలబెట్టుకునే కొత్త విధానాన్ని మార్క్సిజం చెపుతుంది. చిన్నా - పెద్దా వృత్తులుగా సాగుతూ ఉన్న శ్రమ విభజనని, ‘సమానత్వ శ్రమ విభజన’గా మార్చాలనేదే ఆ కొత్త విధానం. కొత్త విధానమే లేకపోతే, అట్టడుగు శ్రమలు చేసే కులాలకు విముక్తి ఎలాగ?

ఈనాడు, చిన్న కులాల కుటుంబాల్లో మార్పులు, రిజర్వేషన్ల ద్వారా జరగడం నిజమే. కానీ ఆ మార్పు, ఆ కులాల జనాభాలో అత్యల్ప సంఖ్యకి మాత్రమే దొరుకుతుంది. రిజర్వేషన్లలోనే క్రీమీ లేయర్‌ పద్ధతిని ప్రవేశపెడితే, ఆ రకమైన మేలు కూడా ఎక్కువ జనాభాకి అందదు. భారత దేశంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ పేర్లతో ఉన్న మొత్తం జనాభాని చూస్తే, ఆ సంఖ్యలో మెజారిటీకి రిజర్వేషన్ల ద్వారా జరిగే మేలేమీ ఉండదు. పెద్ద కులాల పేదల్లో జరిగినట్టే చిన్న కులాల్లో కూడా, పరిశ్రమల్లో ఉద్యోగాలూ జీతాలూ సంపాదిస్తూ ఎదగడం అంటే, భూస్వాముల కిందా పెట్టుబడిదారుల కిందా వేతన బానిసలుగా బతకడమే. అదే ఆ ఎదుగుదలకి అర్థం! ఈనాడు కూడా, అనేక పరిశ్రమల్లో పని పనిచేసే ఇంజనీర్ల వంటి ఉద్యోగులకు కూడా, రోజుకి 16 గంటల పని, తప్పనిసరి నియమం!
ఒక చిన్న కులస్తుడు, పెట్టుబడిదారుడిగా ఎదిగి, లేదా రిజర్వేషన్ల మార్గం ద్వారా ప్రభుత్వంలో మంత్రిగా మారి, స్వంత భవనాలతో, స్వంత పెట్టుబడులతో ఎదిగిపోయినప్పుడు, తన పిల్లల వివాహాల కోసం, తన కులంలోనే పేదల వేపు చూడడు. పెద్ద కులాల్లో పేదల వేపు కూడా చూడడు. తనతో సమాన ఆర్థిక స్థాయి గల సంబంధాల కోసమే చూస్తాడు. పెద్ద కులాల వాళ్ళయినా చేసేది అక్షరాలా అదే. అంటే, యజమాని వర్గంగా ఎదిగిన ఆ చిన్నా - పెద్దా కులాల వాళ్ళకి, కులాల దృష్టి పోయి, యజమానుల వర్గ దృష్టే ప్రధాన దృష్టి అవుతుంది.
రాబోయే కాలం అంతా ప్రైవేటు పరిశ్రమల కాలమే. శ్రామికులు ఏ కులాల వారైనా, వారి డిగ్రీల గురించీ, జీతాల గురించీ, నిర్ణయాలన్నీ పారిశ్రామికవేత్తల ఇష్టాయిష్టాలే. అప్పుడు చిన్న కులాల్లో అల్పసంఖ్యని కూడా రిజర్వేషన్లు రక్షించలేవు. నిత్యం బానిస బతుకులూ, నిరుద్యోగాలూ, అడుగు స్థాయి వృత్తులూ, కులాల స్తిరత్వాలూ, అన్నీ వెనకడుగులే.
పెద్ద కులాల్లో అయినా, చిన్న కులాల్లో అయినా, అత్యధిక జనం శ్రామికులే. అందరూ తమ కులాల్ని గురించే తలపోస్తూ, కుల సంఘాలు పెట్టుకుంటూ, ‘కుల విధానాన్నే’ మరింత స్థిరంగా నిలబెట్టుకుంటున్నారు. చిన్న కులాల వారు రిజర్వేషన్ల భ్రమలతో, తమ కులాలే తమకు శాశ్విత రక్షణ అనుకుంటున్నారు. తాము ఏ వర్గ సంబంధాల్లో, ఏ స్తితిలో ఉన్నారో, గ్ర హించడం లేదు. రిజర్వేషన్లని ఉపయోగించుకుంటూ కూడా వర్గ స్పృహతో ఉండాలని గ్రహించడం లేదు. .
చిన్న కులాల జనాభాకి తాము ఘోరమైన ‘శ్రమ దోపిడీ’కి గురి అవుతున్నామని తెలీదు. దాని వల్ల దోపిడీ శ్రమ - విభజనలో చిక్కి ఉన్నామనీ తెలీదు. పిల్లి నోటిలో చిక్కిన ఎలక కూడా ఆత్మరక్షణ కోసం పెనుగులాడుతుంది. ఆ మాత్రపు రక్షణ స్పృహ కూడా శ్రామిక జనాభాకి లేదు.
కుల విధానమే కాదు. ఇంకా ఉన్న ఏ చెడ్డ విధానం అయినా గతించేది ఎవరి ద్వారా? సమస్య ఎవరిదో వారి ద్వారా.
మేధావులు బైల్దేరి, ‘కుల విధానం తక్షణం నశించాలి. దాన్ని వెంటనే తీసివెయ్యాలి’ అని ఘోషిస్తారు. దారి మధ్యలో ఉన్న ముళ్ళపొదని తక్షణం తవ్వి పైకి లాగి దాన్ని దారికి దూరంగా విసిరెయ్యడం ఎంత సాధ్యమో, కుల విధానాన్ని తీసివెయ్యడం అంత సాధ్యం అనుకుంటారు.
‘‘ఏ పెద్ద కులం వ్యక్తి అయినా, చిన్న కులం వ్యక్తినే పెళ్ళి చేసుకోవాలి’ అని చట్టం చెయ్యడం సాధ్యం కాదు. అలాంటి చట్టమే ఉంటే, పెద్ద కులాల వాళ్ళు పెళ్ళిళ్ళే మానుకుంటారు. పెళ్ళిళ్ళు లేని విధానాన్ని పెద్ద కులాల మధ్యనే పాటిస్తారు.
కులాంతరాల భార్యాభర్తలు, తమ పిల్లలకి తామే ఏదో ఒక కులాన్ని అంటగట్టడం తప్పకపోతే, కుల నిర్మూలన మాట ఎత్తడం దండగ.
సమాజంలో ఉన్న ప్రతీ మనిషీ శ్రమ చెయ్యాలని గ్రహించడమూ; ప్రతీ మనిషీ శారీరక - మేధా శ్రమలు రెండూ చెయ్యాలని గ్రహించడమూ, మొదటి సంగతి. ఆ మార్పుల కోసం, శ్రామిక వర్గ పోరాటం అత్యవసరమని గ్రహించడం, మరో సంగతి.
ఏ గ్రహింపూ లేకుండా, ‘కుల విధానాన్ని తక్షణం నిర్మూలించాలి’ అంటూ అరిచే నినాదాలు ఆ నిర్మూలనకు ఏ మాత్రమూ పనికి రావు. పైగా ఆ శబ్దాలు, సిద్ధాంత శబ్ద కాలుష్యాన్ని మాత్రమే దట్టంగా సృష్టిస్తాయి.
. రంగనాయకమ్మ
🌹🌹🌹🌹

CONCEPT ( development of human relations and human resources )